వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఎంపికయ్యాడు. మంగళవారం సెయింట్ విన్సెంట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెస్టిండీస్ (CWI) క్రికెట్ మైల్స్ డైరెక్టర్ బాస్‌కోంబ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం విండీస్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా సామీ.. ఏప్రిల్ 1, 2025 నుంచి టెస్టు జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుత హెడ్ కోచ్ ఆండ్రీ కోలీ స్ధానాన్ని సామీ భర్తీ చేయనున్నాడు. ఆండ్రీ కోలీ కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చితో ముగయనుంది.
కాగా సామీ సారథ్యంలోనే రెండు టీ20 వరల్డ్‌కప్(2012, 2016)లను వెస్టిండీస్ క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023కు ఆర్హత సాధించికపోవడంతో వెస్టిండీస్ క్రికెట్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీంతో విండీస్ క్రికెట్ బోర్డు సామీని తమ జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా నియమించింది. విండీస్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తమ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడి నేతృత్వంలో విండీస్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.
చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం
Comments
Please login to add a commentAdd a comment