quit
-
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్ గుడ్‌బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు. -
సాఫ్ట్వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే..
ఆధునిక కాలంలో చాలామంది గూగుల్, మెటా వంటి బడా కంపెనీలలో ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఒక ఉద్యోగి మాత్రం కొన్ని కారణాల వల్ల కోట్లు వేతనం వచ్చే మెటా సంస్థలో ఉద్యోగాన్ని వదిలేసినట్లు సమాచారం. దీనికి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో ఏడాదికి రూ. 3 కోట్లు వేతనాన్ని పొందే 28 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి 'ఎరిక్ యు' (Eric You) వర్క్ తరువాత కూడా అదే ఆలోచనలతో ఉండటం వల్ల పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీంతో జాబ్ వదిలేయాల్సి వచ్చినట్లు తెలిపాడు. నిజానికి వర్క్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కానీ ఆ పని ఒత్తిడి అలాగే ఉండేది. వీకెండ్ సమయంలో పని చేసినా కూడా బాస్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వల్ల ఆఫీసులోనే మొదటి సారి పానిక్ అటాక్ వచ్చినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? 2019 నవంబర్ సమయంలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు కూడా పానిక్ అటాక్ వచ్చిందని, ఆ తరువాత పలుమార్లు ఈ అటాక్ వెంటాడుతూనే ఉండటం వల్ల జాబ్ వదిలి, రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. -
నాగార్జునసాగర్ బరి నుంచి జానారెడ్డి అవుట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?. ఎప్పటి నుంచో తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి.. ఆ వ్యూహంలో భాగంగా తన చిన్న కుమారుడిని రంగంలోకి దించారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. ఈసారి ఎన్నికలకు జానారెడ్డి దూరమైనట్లే భావించొచ్చు. చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్‌రెడ్డి.. తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ సాగారు. అయితే.. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థుల దరఖాస్తుకు రేపే ఆఖరి రోజు. పీసీసీకి ఇప్పటిదాకా 600 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య దరఖాస్తు చేసుకోగా.. పొంగులేటి, కొమటిరెడ్డి, కొండాసురేఖలు ఇప్పటికే అప్లికేషన్లు సమర్పించారు. ఉత్తమ్, భట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు -
రియల్‌మీకి మరో షాక్: రాజీనామా చేసిన 12 మంది ఉన్నతోద్యోగులు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీకి మరో షాక్ తగలింది. కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా డజను మందికిపైగా ఉద్యోగులు రియల్మీ ఇండియా (Realme India) సంస్థకు రాజీనామా చేసినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ సీఈఓ మాధవ్ సేత్ (Madhav Sheth) పెట్టిన కొత్త సంస్థ హానర్ టెక్‌లో చేరేందుకే ఆ ఉద్యోగులు రియల్‌మీని వీడినట్లు సమాచారం. రియల్మీ ఇండియా సంస్థకు చెందిన అత్యున్నత డైరెక్టర్లతో సహా పలువురు ఉద్యోగులు మాధవ్ సేత్ కొత్త కంపెనీ హానర్ టెక్‌లో చేరిన నేపథ్యంలో రియల్మీ ఇండియా సంస్థలో మరిన్ని సామూహిక రాజీనామా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో మాజీ సేల్స్ డైరెక్టర్ దీపేష్ పునమియా కూడా ఉన్నారు. ఇటీవల ఆయన హానర్ టెక్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. కాగా ఉద్యోగుల రాజీనామాల విషయంపై రియల్మీ సంస్థ నుంచి ఎంటువంటి స్పందనా లేదు. ఇదీ చదవండి ➤ Best Light Weight Smart phones: బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి.. ఎగుమతులకు సంబంధించిన కొత్త వెంచర్‌ను ప్రారంభించడం కోసమని మాధవ్ సేత్ జూన్ నెలలో రాజీనామా చేశారు. అప్పటి వరకు కంపెనీలో ఆయన ఐదేళ్లు పనిచేశారు. రియల్మీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, రియల్మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్‌నకు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. రియల్మీ ఫౌండర్ స్కైలీతో కలిసి మాధవ్ సేత్ 2018 మేలో అధికారికంగా బ్రాండ్‌ను స్థాపించారు. -
16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ..
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసేందుకు తన కారును అమ్ముకోవాల్సివచ్చింది. అయినా అతను బాధపడలేదు. ఎందుకంటే తన కల నెరవేర్చుకునేందుకు కారు అమ్మడం అతనికి తప్పనిసరి అయ్యింది. ఇప్పుడతను తన బిజినెస్ కారణంగా ఏటా 10 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.103 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించి.. బ్రిటన్‌కు చెందిన 40 ఏళ్ల రాబ్డెన్స్ జీసీఎస్సీ పూర్తి చేసిన తరువాత స్కూలుకు వెళ్లడం మానివేశాడు. బిజినెస్ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. డైలీ స్టార్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రుల గ్యారేజీలో ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించాడు. ఇందుకోసం రాబ్డెన్స్ 2008లో తన కారును వెయ్యి పౌండ్లకు అమ్మేశాడు. ఇప్పుడతను పెద్ద ఐటీ కన్సల్టెన్సీ కంపెనీకి సీఈఓ. ‘ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని’ ఈ కంపెనీలో వందమందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఈ కంపెనీని నెలకొల్పి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాబ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాబ్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను స్కూలు చదువులో ప్రతిభ చూపలేకపోయేవాడిని. అయితే ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని. ఏ పరికరం ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడిని. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు నాతో పాటు ఒకరు ఉండేవారు. అతను అడ్మిన్‌తోపాటు అకౌంట్స్ చూసుకునేవాడు. 18 నెలలకే మా సంస్థలో 10 మంది సిబ్బంది ఉండేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మా వ్యాపారం అభివృద్ధిదాయకంగా ముందుకుసాగింది. ప్రస్తుతం మేము 10 మిలియన్ పౌండ్లకు పైగా బిజినెస్ చేస్తున్నాం. వ్యాపారరంగంలో మేము ఇంతలా రాణించిన నేపధ్యంలో పలు పురస్కారాలు అందుకున్నాం’ అని అన్నారు. -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్.. కారణం ఇదేనా?
టాలీవుడ్ చందమామ కాజల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహమాడి.. ఆ తర్వాత ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక యంగ్ మదర్‌గా తను ఆస్వాదిస్తుంది. తన బిడ్డపై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడకుండా.. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూనే గతంలో తను ఒప్పుకున్న సినిమాలు చేస్తూ వస్తుంది. (ఇదీ చదవండి: నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్.. ఇదీ మామూలు అరాచకం కాదు) తాజాగా కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం తన బాబు (నీల్) అని తెలుస్తోంది. సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తుంది. బాబు ఎదుగుతున్న వేళ.. తల్లి ప్రేమను అందించాలని, అది తన బాధ్యతని కాజల్ తెలుపుతుందట. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట. ఈ విషయంపై త్వరలో అఫిషయల్‌గా కాజల్ ప్రకటించనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. కానీ నిజం తెలియాలంటే కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం కమల్ హాసన్ 'భారతీయుడు-2' , బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాలలో నటిస్తుంది. ఇదే నిజం అయితే..! కాజల్ బ్యూటీకి చివరి సినిమా బాలయ్యదే. (ఇదీ చదవండి: మొగలి రేకులు నటి లహరి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) -
‘ఉద్యోగం విసుగొచ్చింది’.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతున్న యువతి!
ఉద్యోగం విసుగొచ్చిందంటూ.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతోంది ఢిల్లీకి చెందిన ఓ యువతి. లింక్డ్ఇన్ సంస్థలో పనిచేసిన ఆకాంక్ష మోంగా ట్రావెలింగ్‌ను ఫుల్ టైమ్ వృత్తిగా ఎంచుకుంది. ఇందు కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టి మే 17వ తేదీకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాంక్ష ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! అప్పటి నుంచి ఆమె తన ట్రిప్‌లను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. అలాగే ట్రావెల్ హ్యాక్‌లను షేర్ చేయడం, ఆఫ్‌బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం ద్వారా సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోవర్లు 2.5 లక్షల మంది. ఇప్పుడామె ఫాలోవర్ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. I quit my job at LinkedIn. Last year, on this very date. When I left, I promised to give myself 1 year to focus on my passion and travel the world full time. When I left I was burnt out,had 250k followers on IG, worked alone. Want to know how it’s going now? 🌻 pic.twitter.com/NJzNgKrOjQ — Aakanksha Monga (@Aakanksha_99) May 17, 2023 2020లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి కామర్స్‌లో పట్టా పొందిన ఆకాంక్ష ఆ తరువాత ఒక సంవత్సరం పాటు బైన్ అండ్ కంపెనీలో అనలిస్ట్‌గా పనిచేసింది. అనంతరం లింక్డ్ఇన్లో క్రియేటర్ మేనేజర్ అసోసియేట్‌గా చేరింది. అక్కడ చేరిన ఆరు నెలలకే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదని భావించి దానికి రాజీనామా చేసి ట్రావెలింగ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కీలక ఎన్నికకు ముందు బీజేపీలో చేరిన కౌన్సిలర్..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీ బవానా వార్డు కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ శుక్రవారం బీజేపీలో చేరారు. కమలం పార్టీ కార్యాలయంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్వేదా, ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా పవన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముందే ఆప్ కౌన్సిలర్ పార్టీని వీడటం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని పవన్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక సందర్భంగా సభలో రచ్చ చేయాలని తనకు పార్టీ సూచించిందని పేర్కొన్నారు. ఇవన్నీ నచ్చకే తాను ఆప్‌ను వీడుతున్నట్లు చెప్పారు. Delhi | Aam Aadmi Party's Bawana councillor, Pawan Sehrawat, joins BJP pic.twitter.com/IYUFhxkEzV — ANI (@ANI) February 24, 2023 స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. ఆరుగురు సభ్యులుండే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను మేయర్ షెల్లీ ఒబెరాయ్ గురువారం నిర్వహించారు. అయితే ఓటింగ్‌కు మొబెైల్ ఫోన్లను అనుమతించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కమలం, ఆప్ పార్టీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. దీంతో 47 మంది ఓటు వేసిన అనంతరం ఓటింగ్‌ను అర్థాంతరంగా నిలివేశారు మేయర్. శుక్రవారం మళ్లీ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పలుమార్ల వాయిదా అనంతరం బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రోజు కూడా సభలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
రాజీనామా యోచనలో మహారాష్ట్ర గవర్నర్?
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి(80) రాజీనామాకు సిద్ధం అవుతున్నారా?.. ఈ విషయాన్ని పరోక్షంగా ఆయనే వెల్లడించడం గమనార్హం. తాను గవర్నర్ హోదా నుంచి హుందాగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారట. సోమవారం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది మహారాష్ట్ర రాజ్‌భవన్. ప్రధాని మోదీ తాజాగా(జనవరి 19వ తేదీన) ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానితో తాను గవర్నర్ హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్న విషయాన్ని చెప్పినట్లు గవర్నర్ కోష్యారి తెలిపారు. అంతేకాదు.. మరేయితర రాజకీయ బాధ్యతలు కూడా తనకు కేటాయించొద్దని ఆయన ప్రధానిని కోరారట. బీజేపీ సీనియర్ నేత అయిన భగత్ సింగ్ కొష్యారి.. వయో భారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన శేష జీవితాన్ని పుస్తక పఠనం, సాహిత్య రచనతో గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని మోదీకి తానంటే ఎంతో అభిమానమని, కాబట్టి తాను తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగానే స్పందిస్తారని భావిస్తున్నట్లు కోష్యారి ఆ ప్రకటనలో వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేయడాన్ని తానెంతో గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారాయన. ఆరెస్సెస్ మూలాలు ఉన్న కోష్యారి.. గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీతో పాటు అదనంగా మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఉత్తరాఖండ్‌కు రెండో ముఖ్యమంత్రిగా, ఆపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, నైనిటాల్-ఉధమ్‌సింగ్ నియోజకవర్గం తరపున ఒకసారి లోక్‌సభకూ ఆయన ఎన్నికయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న టైంలో ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగతంగానూ ఆయన్ని ఇబ్బంది పెట్టిన కామెంట్ ఒకటి ఉంది. మహారాష్ట్ర నుంచి గుజరాతీలను, రాజస్థానీ మార్వాడీలను గనుక వెళ్లగొడితే.. ముంబైకి దేశ ఆర్థిక రాజధాని హోదా ఉండబోదని, డబ్బే మిగలదని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారాయన. ఈ వ్యవహారంలో బీజేపీ సైతం ఆయనకు దూరంగా ఉంటూ వచ్చింది. చివరకు వ్యవహారం పెద్దది అవుతుండడంతో.. ఆయన మరాఠ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆపై కిందటేడాది నవంబర్‌లో.. ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత తరం ఐకాన్ అని, ఈ తరం వాళ్లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లే ఐకాన్ అంటూ వ్యాఖ్యానించి.. మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. -
బీజేపీకి షాక్.. టీఆర్ఎస్లోకి దాసోజు శ్రవణ్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక వేడిలోనే.. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బీజేపీలో చేరి మూడు నెలలు తిరగకముందే పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు దాసోజు శ్రవణ్. బీజేపీకి షాక్ ఇస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అంతేకాదు.. గులాబీ గూటికి ఆయన చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలుస్తోంది. మునుగోడులో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందంటూ లేఖలో దాసోజు పేర్కొన్నారు. దశ దిశ లేని రాజకీయ పరిణామాలకు బీజేపీ వేదిక అవుతోందని తన లేఖలో దాసోజు ఘాటుగా విమర్శించినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్లో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు నెలలో కాంగ్రెస్‌ను వీడి.. తరుణ్ చుగ్, కిషన్‌రెడ్డి, పలువురు కీలక నేతల సమక్షంలో బీజేపీలో చేరారు దాసోజు శ్రవణ్. ఆ సమయంలో తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దాసోజు శ్రవణ్ పేరుతో వైరల్ అవుతున్న లేఖ -
టీఆర్ఎస్కు బూర రాజీనామా.. కేసీఆర్‌కు ఘాటుగా లేఖ
సాక్షి, హైదరాబాద్: భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ.. శనివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2009 నుంచీ తెలంగాణ ఉద్యమంలో కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో భువనగిరి ఎంపీగా గెలిచినా.. 2019లో తన ఓటమికి పార్టీలో అంతర్గత కుట్రలు కూడా కారణమని ఆరోపించారు. తనను ఎంతగానో అవమానించినా ఇన్నాళ్లూ భరించానని, రాజకీయంగా వెట్టిచాకిరీ చేయలేకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తాను పైరవీలు చేసే వ్యక్తిని కాదని.. ప్రజల సమస్యలను వివరించే అవకాశం కూడా తనకు కల్పించలేదని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యలను ప్రస్తావించిన తనపై అసహనం వ్యక్తం చేయడం ఓ ఉద్యమకారుడిగా ఎంతో బాధించిందన్నారు. లేఖలోని అంశాలు బూర నర్సయ్యగౌడ్ మాటల్లోనే.. బీసీలు వివక్షకు గురికావడం బాధాకరం ‘‘మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ అయిన నన్ను ఒక్కసారి కూడా సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలకు సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగాను. మునుగోడు టికెట్ బీసీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని అడగటం కూడా నేరమేనా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం. మీరంటే అభిమానంతో, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతతో ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగాను. కానీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు వ్యక్తిగతంగా అవకాశాలు రాకున్నా ఫర్వాలేదు. కానీ అట్టడుగు వర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చే అవకాశమే లేనప్పుడు పార్టీలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టిచాకిరీని ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. ఒక్క నిమిషం కలిసే అవకాశం ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమంలో రోజులు, నెలలు, ఏళ్లు గడిపిన సహచర ఉద్యమకారులు ఇప్పుడు కనీసం ఒక నిమిషం కేసీఆర్‌ను కలవాలన్నా.. తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రభుత్వం తరఫున పెట్టకపోవడం అందరినీ బాధిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడ రొయ్యలు అమ్ముకోవచ్చు. కర్రీ పాయింట్స్ పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో, సచివాలయంలో మాత్రం తెలంగాణ ప్రజలే ఉంటారని అప్పట్లో ప్రజల చప్పట్ల మధ్య చెప్పాం. కానీ ఇప్పుడు తెలంగాణ కాంట్రాక్టర్ల ఏడాది టర్నోవర్ కలిపినా.. ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల టీడీఎస్ అంత కూడా ఉండడం లేదు.’’అని నర్సయ్యగౌడ్ లేఖలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: బీజేపీలోకి టీఆర్ఎస్ కీలక నేత -
ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వైదొలిగిన అనిల్ ఖన్నా
స్పోర్ట్స్ సీనియర్ అథారిటీ అనిల్ ఖన్నా బుధవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. తాత్కాల్కిక అధ్యక్షునిగా అనిల్ ఖన్నాను గుర్తించలేమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) గతంలో స్పష్టం చేసింది. ఈ మేరకే ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఇక డిసెంబర్ కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకపోతే భారత్ నిషేధిస్తామని ఐఓసీ ఈ నెల 8న హెచ్చరించింది. అనిల్ ఖన్నా మాట్లాడుతూ.. ''ఐవోసీ ఒప్పుకోకపోవడంతో తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నా. ప్రస్తుతం ఐఓఏ క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఐఓఏ కార్యకలాపాలను సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృష్టి చేస్తోంది. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారని ఆశిస్తున్నా'' అంటూ తెలిపాడు. -
మునుగోడు కోసమే నా రాజీనామా: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. మునుగోడు ఎమ్మెల్యే హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరిసారిగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం గురించి.. గత పది పన్నెండు రోజులుగా మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాపై చర్చ జరుగుతోంది. దీంతో నా రాజీనామాపై చర్చ పక్కదారి పట్టింది. నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా రాజీనామాపై నాన్చే ఉద్దేశం నాకు లేదు. మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. పోడు భూములకు పాస్ బుక్‌లు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తోంది.. చేస్తోందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థినే తాను గెలిపిస్తానని టీఆర్ఎస్కు చెప్పానని, అయినా ఎటువంటి పురోగతి లేదని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు ఓ కారణమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, కానీ, నియోజకవర్గానికి ఏం చేయలేకపోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని చెప్పారాయన. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి, కనీస వసతులైనా కలగవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అని.. పదవులు, కాంట్రాక్టులు కావాలనుకుంటే టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్‌ను తీసుకుని బాగుపడేవాళ్లమని ఆయన అన్నారు. -
లంక ప్రధానితో చర్చలకు నో!
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడి భవనం ముందు నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులను ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సే చర్చలకు ఆహ్వానించారు. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలని, ఇతర రాజపక్సే కుటుంబ సభ్యులు అధికారం నుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అంతవరకు చర్చలకు రామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆందోళనకారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలిపారు. ‘‘మేం ఇక్కడకు చర్చలకు రాలేదు. నువ్వు, నీ ప్రభుత్వం రాజీనామా డిమాండ్ చేయడానికి వచ్చాం’’ అని నిరసనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. వీరు నిరసన తెలియజేసే స్థలానికి గాట్గోగామా అని పేరు పెట్టుకున్నారు. బుధవారానికి ఈ ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. ఎక్కువగా యువత ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. దేశంలోని అవినీతి రాజకీయ సంస్కృతిని మార్చేవరకు వెనుదిరగమంటున్నారు. బుధవారం ఆందోళనల్లో పలువురు సంగీతకారులు, సెలబ్రిటీలు, ఆర్టిస్టులు పాలుపంచుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్ రోషన్ మహానామా కూడా ఉన్నారు. ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదని, ఇంతవరకు సంక్షోభానికి పరిష్కారమార్గాలు రాజకీయనాయకుల నుంచి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు నిరసనకారులతో చర్చలకు రావాలంటూ ప్రధాని కార్యాలయం యువతను కోరుతూ ప్రకటన చేసింది. ఒకవేళ వారు చర్చలు అంగీకరిస్తే వారి బృందంలో మరింత మంది పాల్గొనే అవకాశం ఇస్తానని మహింద చెప్పారు. దేశమంతా అదే డిమాండ్ రాజపక్సే కుటుంబం పదవులను వీడాలంటూ లంకలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల వద్ద, దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకునే వీలు లేకపోవడంతో వరుసల్లో నిలబడ్డ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. విదేశీ నిల్వలు భారీగా దిగజారడంతో బహిర్గత రుణ చెల్లింపులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రభుత్వంలో పలు మంత్రులు రాజీనామాలు చేసిన అనంతరం కొత్త కేబినెట్ ఏర్పాటు చేయడంలో గొటబయ ఇప్పటకీ సఫలం కాలేదు. పార్లమెంట్లో ప్రభుత్వంపై అవిశ్వాసం, అధ్యక్షుడి అభిశంసన, అధ్యక్షుడికి అధిక అధికారాలు కల్పించే 20 సవరణల తొలగింపును కోరుతూ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామైన ఎస్ఎల్పీపీ నేత సిరిసేన ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలకు హాజరుకానని తేల్చిచెప్పారు. అయితే సంక్షోభానికి కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. -
అనూహ్య పరిణామం.. భారత్‌పే ఎండీ రాజీనామా!
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ కంపెనీకి, బోర్డుకు రాజీనామా చేసినట్లు సమాచారం. అన్నీ తనకు వ్యతిరేకంగా జరుగుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ పే ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లపై గత కొంతకాలంగా వృత్తిపరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అంతర్గత దర్యాప్తునకు కాకుండా.. ప్రైవేట్ ఏజెన్సీలతో దర్యాప్తు చేయిస్తోంది భారత్‌పే. ఈ క్రమంలో.. ఈమధ్యే అష్నీర్ భార్య, కంపెనీ మాధురీ జైన్‌ను కంపెనీ తప్పించిన విషయం తెలిసిందే. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీంతో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆమె వాటాను సైతం రద్దు చేసేసింది BharatPe. ఇది జరిగిన వారంకే అష్నీర్ తన పదవికి రాజీనామా చేస్తూ కంపెనీని వీడడం విశేషం. తనపై వస్తున్న ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్న అష్నీర్ గ్రోవర్.. భార్యను తొలగించిన తర్వాత కూడా ఆ ఆరోపణలను తీవ్రస్థాయిలోనే ఖండించాడు. మరోవైపు అష్నీర్ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి బయటి ఏజెన్సీలను నియమించడంపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఒకదాని వెంట ఒకటి ఆయనకు వ్యతిరేక నిర్ణయాలు వస్తుండడంతో.. చివరిగా మధ్యవర్తిత్వం కోసం ఆయన ప్రయత్నించారు. కానీ, కంపెనీ అందుకు సైతం అంగీకరించలేదు. ఈ పరిణామాలతో కలత చెంది కంపెనీ వీడుతున్నట్లు సమాచారం. ‘‘భారత్‌పే కంపెనీని మొదలుపెట్టిన వాళ్లలో ఒకరైన నేను.. ఈరోజు బలవంతంగా కంపెనీని వీడాల్సి వస్తోంది. అందుకే బరువెక్కిన గుండెతో ఈ సందేశం రాస్తున్నా. ఫిన్‌టెక్ కంపెనీ ప్రపంచంలో భారత్‌పే అగ్రగామిగా నిలిచిందని తల ఎత్తుకుని గర్వంగా చెప్పగలను. దురదృష్టం కొద్దీ 2022 ప్రారంభం నుంచి.. నా ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలు వస్తున్నాయి. కంపెనీని విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్న కొందరే నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ల ఆరోపణల్లోనే నేను చిక్కుకున్నాను. చివరకు కుట్రే గెలిచింది. ఒకప్పుడు కంపెనీ ముఖచిత్రంగా నిలిచిన వ్యక్తి.. ఇప్పుడు కుట్రలో పావుగా బలవుతున్నాడు. దురదృష్టవశాత్తూ కంపెనీ తన ఉనికిని కోల్పోయింది’’ అంటూ సుదీర్ఘమైన లేఖ రాశాడు అష్నీర్ గ్రోవర్. వరుస పరిణామాలు.. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించాడు. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. ఆపై కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను, ఆయన భార్య మాధురీని హడావిడిగా సెలవుల మీద బయటికి పంపించి.. సీఈవో సుహాయిల్ సమీర్‌కు తాత్కాలిక ఎండీ బాధ్యతలు అప్పజెప్పింది. అదే టైంలో వీళ్లు అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రైవేట్ ఏజెన్సీలకు దర్యాప్తు అప్పజెప్పింది. తనను కావాలనే టార్గెట్ చేశారంటూ ఆరోపించిన అష్నీర్.. ఒకానొక టైంలో తన వాటా తనకు ఇస్తే వెళ్లిపోతానంటూ స్పష్టం చేశాడు కూడా. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. -
రాజీనామాపై జగ్గారెడ్డి దిమ్మతిరిగే ట్విస్ట్
-
వెళ్తారా.. ఉంటారా?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఉదంతంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఇలాంటి సీనియర్ నేత వెళ్లిపోతే పార్టీకి నష్టమని, రాజకీయంగా పలుచన అవుతామని ముఖ్య నాయకుల్లో అభిప్రాయం వ్యక్తమైంది. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వీహెచ్, సంపత్, దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ తదితర నేతలు జగ్గారెడ్డికి ఫోన్‌చేసి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వీహెచ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ జగ్గారెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. బొల్లు కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని పార్టీని వీడొద్దని కోరారు. ముఖ్య నేతల విజ్ఞప్తితో జగ్గారెడ్డి కొంత మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నా.. తాను త్వరలో రాజీనామా చేస్తానంటూ సోనియా, రాహుల్‌లకు లేఖ రాయ డం గమనార్హం. మరోవైపు శనివారం రాత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా పార్టీలోనే కొనసాగాలని ఉత్తమ్ కోరారు. అధిష్టానం ఆరా.. జగ్గారెడ్డి ఉదంతంపై ఏఐసీసీ కూడా ఆరా తీస్తోంది. రేవంత్‌రెడ్డితో విభేదాలున్నంత మాత్రాన రాజీనామా చేసేంతవరకు విషయం ఎందుకు వెళ్లిందన్న దానిపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌లు ముఖ్య నాయకులతో మాట్లాడినట్టు సమాచారం. హైకమాండ్ జోక్యం చేసుకుని పరిష్కరిస్తే జగ్గారెడ్డి పార్టీలో కొనసాగతారని వారు పెద్దలకు వివరించినట్టు తెలిసింది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం ఈ వివాదం టీకప్పులో తుపాను వంటిదేనని వ్యాఖ్యానించడం గమనార్హం. మీడియాలో వద్దు: మాణిక్యం ఠాగూర్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ మీడియా ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంగానీ, అభిప్రాయాలను చెప్పడంగానీ చేయవద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ అంతర్గత సమావేశాల్లో స్వేచ్ఛగా తమ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చని.. సమష్టి నిర్ణయాలనే మీడియాకు వెల్లడించాలని ట్విట్టర్లో సూచించారు. బయటికెళ్తే పార్టీ పెడతా: జగ్గారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళితే కొత్త రాజకీయ పార్టీ పెడతానని జగ్గారెడ్డి ప్రకటించారు. శనివారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తనవల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. సొంత పార్టీలోవారే తనపై బురద జల్లుతున్నా కనీసం ఖండించేవారు లేకపోవడం మనస్తాపం కలిగించిందన్నారు. తాను పార్టీని వీడితే కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని, తనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే విషయాన్ని వివరిస్తున్నానని చెప్పారు. అయి తే తన రాజీనామా నిర్ణయంపై ఢిల్లీ వెళ్లి వచ్చాక నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి శనివారం రాత్రి తెలిపారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతోనేనా? జగ్గారెడ్డి ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తనకు అప్పులు పుట్టడం లేదంటూ స్వయంగా జగ్గారెడ్డి పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినా.. టీఆర్ఎస్లో చేరకుండా, తటస్థంగా ఉంటూ ప్రభుత్వంలో తన పనులు చేసుకునే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి రాజీనామా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగ్గారెడ్డి రాజీనా మా చేస్తే.. టీఆర్ఎస్లో చేరుతారా? తటస్థం గా కొనసాగుతారా? అన్న చర్చ జరుగుతోంది. -
Zomato: జొమాటోలో అనూహ్య పరిణామాలు
Gaurav Gupta Quit Zomato: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, జొమాటో కీలక వ్యవహారాలన్నీ చూసుకునే గౌరవ్ గుప్తా(38).. కంపెనీని వీడినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా హౌజ్‌లలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ పరిణామంతో జొమాటో షేర్లు స్వల్ఫంగా పతనం అయ్యాయి. ఫుడ్ టెక్ ప్లాట్‌ఫామ్ అయిన జొమాటోలో కీలక నిర్ణయాల నుంచి, ఐపీవోకి వెళ్లడం, ఇన్వెస్టర్లతో చర్చలు, మీడియాతో ఇంటెరాక్షన్ లాంటి వ్యవహారాలన్నీ గౌరవ్ గుప్తానే ఇంతకాలం చూసుకున్నారు. ఇదిలా ఉంటే జొమాటో ఐపీవో వెళ్లిన రెండు నెలల తర్వాత.. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలోనే గౌరవ్ బయటకు వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Zomato IPO.. సినిమా చూపిస్తారంట! కాగా, గౌరవ్ జొమాటో నుంచి బయటకు వచ్చేయడం వెనుక కారణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం జొమాటోలో ఆయన ఆఖరి వర్కింగ్ డేగా తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా ఆయన ఉద్యోగుల్ని ఉద్దేశించి మెయిల్ పెట్టినట్లు సమాచారం. ఆరేళ్ల జొమాటోతో తన ప్రయాణం ముగిసిందని, ఇంక కొత్త జర్నీ ఆరంభించబోతున్నట్లు ఆయన పేరు మీద ఒక ప్రకటన వైరల్ అవుతోంది. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారం రెండూ గౌరవ్ ఐడియాలే. పైగా ఓవర్సీస్లో జొమాటో విస్తరణ కూడా ఆయన అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే గుప్తా.. 2015లో జొమాటోలో చేరగా.. 2018 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా వ్యవహరిస్తుండగా.. 2019లో ఆయనకు జొమాటో ఫౌండర్ హోదా దక్కింది. జొమాటో నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో సొంతంగా మరేదైనా స్టార్టప్ ప్రారంభిస్తారా? అనే చర్చ అప్పుడే మొదలైంది. చదవండి: జొమాటో ప్రస్థానం.. ఇలా మొదలైంది! -
అప్పటి నుంచి ఆల్కహాల్ మానేశా : హీరో శింబు
మధ్యపానం ఆరోగ్యానికి హానికారం అని తెలిసినా చాలామంది ఆ వ్యసనానికి అలవాటుపడతారు. దీనికి హీరో, హీరోయిన్లు కూడా అతీతం కాదు. డిప్రెషన్‌తో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి కెరీర్‌ని నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాగే... మత్తుతో తమ జీవితం చిత్తవుతుందని గ్రహించి త్వరగా ఆ వ్యసనం నుంచి బయటపడి కెరీర్‌ను గాడిన పెట్టుకున్న నటీనటులూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కోలీవుడ్ హీరో శింబు కూడా చేరిపోయారు. ప్రస్తుతం శింబు ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీలోని ఓ పాటను ట్విట్టర్ వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా శింబు, డైరెక్టర్ వెంకట్ ప్రభు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శి సహా పలువురు నటీనటులు ఈ లైవ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నటుడు ఎస్జే సూర్య అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తాను ఆల్కహాల్ మానేసినట్లు శింబు వెల్లడించాడు. ఆల్కహాల్ మానేసి దాదాపు ఏడాది కావొస్తుందని,మందు మానేయడం వల్ల తాను చాలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు తన ఫోకస్ అంతా హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పైనే ఉందని వివరించాడు. చదవండి : అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు తమిళనాడు రియల్ పాలిటిక్స్ ఆధారంగా ధనుష్ మూవీ! -
వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహరచనల్లో సాయపడిన ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించబోనని ఆదివారం ప్రకటించారు. గతంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), వైఎస్ఆర్సీపీ, డీఎంకే పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తాను ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వేళ ప్రశాంత్ ఇలా అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆదివారం ఇండియా టుడే టీవీ చానెల్లో మాట్లాడిన సందర్భంగా ప్రశాంత్ తన నిర్ణయాన్ని బయట పెట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కేంద్ర ఎన్నికల సంఘం... బీజేపీకి మరో రూపం అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. ‘ ఇంతగా ఒకటే రాజకీయ పార్టీ కోసం పనిచేసే కేంద్ర ఎన్నికల సంఘంను నేనెప్పుడూ చూడలేదు. బీజేపీకి సాయపడేందుకు ఈసీ చేయాల్సినదంతా చేసింది. మతం కార్డును వాడు కోవడం, ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీకి అనుకూ లంగా తీర్చిదిద్దడం, నియమాలను తుంగలో తొక్కడం.. ఇలా ప్రతీ అంశంలో బీజేపీకి అనువు గా ఈసీ వ్యవహరించింది’ అని ప్రశాంత్ ఆరోపించారు. ‘బెంగాల్లో ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీ మాత్రం బెంగాల్లో బలమైన పార్టీ గా ఎదిగింది’ అని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 100లోపు స్థానాలనే గెలుస్తుందని గత ఏడాది డిసెంబర్లో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. 2014లో మోదీతో మొదలై.. రాజకీయ శ్రేణుల్లో పీకేగా ముద్దుగా పిలుచుకునే ప్రశాంత్‌కిశోర్ మొదటిసారిగా నేరుగా రాజకీయపార్టీల కోసం పనిచేసింది మాత్రం 2014లోనే. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగినపుడు ‘ఛాయ్ పే చర్చ’ అంటూ మొదలైన వినూత్న ప్రచార కార్యక్రమ వ్యూహాల్లో ప్రశాంత కీలక భూమిక పోషించారని కలకత్తా రీసెర్చ్ గ్రూప్ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు అయిన రజత్ రాయ్ చెప్పారు. 2015లో బిహార్‌లో నితీశ్‌కుమార్ కోసం ఎన్నికల వ్యూహాల్లో ప్రశాంత్ కిశోర్ చాలా నెలలు పనిచేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్‌తో కలిసి పీకే ఎత్తుగడలు వేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంలోనూ ప్రశాంత్ పాత్ర కీలకమైంది. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు. బాల్య వివాహాల ను ఆపేలా, అమ్మాయిల చదువులు కొనసాగేలా చేసిన ఐక్యరాజ్యసమితి అవార్డు పొందిన ‘కన్యాశ్రీ’ వంటి పథకాలతో మహిళా పక్షపాత ప్రభుత్వమని టీఎంసీకి పేరు తెచ్చిన ఘనత పీకేదే. ఈసారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేశారు. ఎన్నికల వ్యూహాలు ఇక రచించను Trends show BJP crossed double digits now waiting for @PrashantKishor to quit Twitter pic.twitter.com/KeqxsxWpJv — Exsecular (@ExSecular) May 2, 2021 -
స్మోకింగ్ మానేయడానికి ఇదే సమయం..
సాక్షి, న్యూఢిల్లీ: ధూమపానానికి దూరం కావాలనుకునే వారు ఎప్పుడూ ఉంటారు. అయితే వారిలో కొద్ది మందే అందులో విజయం సాధిస్తారు. ప్రపంచ ప్రజలకు వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారి బారిన పడిన వారిలో తీవ్ర అస్వస్థతకు గురవుతోన్నది, బాధ పడుతోన్నది ధూమపాన ప్రియులని తేలడంతో ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ధూమపానానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. అలాంటి వారు విజయం సాధించాలంటే ఇంతకంటే మంచి తరుణం మరోటి ఉండదని వైద్య నిపుణులే చెబుతున్నారు. కోవిడ్ దండయాత్రకు ముందు ధూమపానానికి దూరం కావాలనుకున్న వారి సంఖ్య అమెరికా, ఆస్ట్రేలియా స్మోకర్లలో పది శాతం మందికాగా, ఇప్పుడు వారి సంఖ్య 19 నుంచి 29 శాతానికి చేరుకున్నట్లు ‘అడిక్షన్ మెడిసిన్’ జర్నల్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ధూమపానానికి స్వస్తి చెప్పడం ద్వారా కోవిడ్ ముప్పుకు దూరం కావాలనుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉందని, ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి ఎప్పటికప్పుడు తెలసుకోవాలనుకుంటున్నవారు కూడా తాము అభిప్రాయలు కోరిన స్మోకర్లలో 45 శాతం మంది ఉన్నారని ఆ సర్వే తెలిపింది. ఇలాంటి సమాచారం తెలసుకోవాలనుకుంటోన్న వారిలో ఎక్కువ మంది, అంటే 61 శాతం మంది టీవీ మీడియంనే కోరుకుంటున్నారు. ఇక ఆన్లైన్ మీడియా ద్వారా 36 శాతం మంది, సోషల్ మీడియా ద్వారా 31 శాతం, ఈ మెయిల్ ద్వారా 31 శాతం మంది కోరుకుంటున్నారు. ధూమపానానికి స్వస్తి చెప్పేందుకు తమకు సహకరించాలని, ఈ విషయంలో నికోటిన్ ప్రత్యామ్నాయ థెరపిని సూచించాలని 61 శాతం స్మోకర్లు కోరుతున్నారని సర్వేలో తేలింది. ధూమపాన వ్యతిరేక ప్రచారం, పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల విధింపు, పరిమిత ప్రాంతాలకే ధూమపానాన్ని కట్టడి చేసే చట్టాల వల్ల ఆస్ట్రేలియాలో ధూమపాన ప్రియుల సంఖ్య 11 శాతానికి పడిపోంది. ఈ దురలవాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మత్యువాత పడుతున్నారు. -
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంనుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. తాము దేశంలో పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపించింది. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని ఆరోపించారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. అయితే దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది కాగా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛపై, అసమ్మతి గళాలపై ఒత్తిడి, దాడులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆమ్నెస్టీ తాజా నిర్ణయం కలకలం రేపింది. దీంతో దేశ ప్రతిష్టకు తీవ్ర భంగం ఏర్పడిందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు. #NEWS: Amnesty International India Halts Its Work On Upholding Human Rights In India Due To Reprisal From Government Of Indiahttps://t.co/W7IbP4CKDq — Amnesty India (@AIIndia) September 29, 2020 -
టిక్‌టాక్ సీఈవో కెవిన్ రాజీనామా
బీజింగ్ : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కెవిన్ మేయర్ తన పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుత జనరల్ మేనేజర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలిక సీఈవోగా కొనసాగనున్నట్లు కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాపత్రిక గురువారం ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల ఆదరణను సొంతం చేసుకున్న టిక్‌టాక్‌కు ఇటీవలి కాలంలో అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను భారీ ఎదురు దెబ్బ తగిలింది. (వాటికి చెక్ : టిక్‌టాక్ కొత్త ఎత్తుగడ) కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంలో చైనా వైఫల్యం, భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం షేధించింది. ట్రంప్ సర్కార్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యాన్ని తేల్చేందుకు ట్రంప్ 90 రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ప్రపంచానికి అంటగట్టారంటూ చైనాపై పలు దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పటికే చైనాతో వ్యాపార ఒప్పందాలను తెగదెంపులు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో టిక్‌టాక్ సీఈవో కెవిన్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. (టిక్‌టాక్ : ట్రంప్ మరో ట్విస్టు) -
మెడికల్ ఫీజు కేసు మరో ధర్మాసనానికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యంలో విచారణ నుంచి న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాసనానికి నివేదించేందుకు వీలుగా ఈ కేసుకు సంబంధించిన అన్నీ ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం విచారించడంపై ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి ఓ మెమో ద్వారా చేసిన ఆరోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ స్వరూప్‌రెడ్డి చేసిన ఆరోపణలు నేరపూరిత కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, అయినప్పటికీ తాము కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించడం లేదని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ స్వరూప్‌రెడ్డి తన ఆరోపణల ద్వారా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లయిందని పేర్కొంది. కేసులో ఓడిపోయిన వ్యక్తులు ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ వెళుతుంటే, న్యాయమూర్తులు తమ విధులను నిర్వర్తించడం కష్టమవుతుందని తెలిపింది. హైకోర్టులో ఉన్న మూడు వేల మందికి పైగా న్యాయవాదులకు తమ నిష్పాక్షిత, స్వతంత్రత గురించి తెలుసునని వివరించింది. జస్టిస్ స్వరూప్‌రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని పేర్కొంది. తమ ప్రవర్తన, విశ్వసనీయత గురించి తెలంగాణ ప్రజలు, న్యాయవాదులకు బాగా తెలుసునని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ స్వరూప్‌రెడ్డి దాఖలు చేసిన మెమోపై ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఫీజుల పెంపు ఉత్తర్వులపై పిటిషన్ దాఖలు చేసిన 121 మంది వైద్య విద్యార్థుల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి తమ వ్యాజ్యం గురించి సీజే జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. -
ప్రధాని మోదీ సోషల్ మీడియా సన్యాసం!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సోమవారం వెల్లడించారు. ‘ఈ ఆదివారం నుంచి ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నా’ అని సోమవారం ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. సంబంధిత వర్గాలను సంప్రదించగా, భవిష్యత్ ప్రణాళిక త్వరలో వెల్లడించే అవకాశముందని తెలిపాయి. మోదీ తాజా నిర్ణయం సంచలనాత్మకంగా మారింది. గంటలో 26వేల సార్లు రీట్వీట్ అయింది. క్షణక్షణానికో కామెంట్ వచ్చింది. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివిధ ఎమోజీలతో స్పందించడం ప్రారంభించారు. నిర్ణయం మార్చుకోవాలని కోరుతూ అదే సోషల్ మీడియా కేంద్రంగా ’నో సర్’ అని వేలాదిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ‘నో సర్’ ట్రెండవుతున్న హ్యాష్ట్యాగ్గా మారింది. ‘ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులున్నారు. కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండి. కానీ పూర్తిగా వదిలేయవద్దు’ అని ఓ నెటిజన్ అభ్యర్థించారు. ‘నేను మోదీజీ అభిమానిని. ఆయన వదిలేస్తే.. సోషల్ మీడియాను నేనూ వదలేస్తా’ అని మరో యూజర్ హెచ్చరించారు. మరోవైపు, మోదీ ట్వీట్‌పై మీమ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బ్లాక్‌బస్టర్ సినిమా ‘3 ఇడియట్స్’ సినిమా సీన్ నేపథ్యంలో ‘జానే నహీ దేంగే తుఝే’ అనే పాటను ప్లే చేస్తూ ఒక మీమ్‌ను రూపొందించారు. విద్వేషం వదలండి: మరోవైపు, విపక్షాల నుంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ‘ద్వేషాన్ని విడనాడు.. సోషల్ మీడియాను కాదు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. ‘మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కాదు.. వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసే, బెదిరించే, హెచ్చరించే మీ ఆర్మీకి ఈ సలహా ఇవ్వండి– ఇట్లు భారత పౌరులు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జెవాలా వ్యంగ్య ట్వీట్ చేశారు. టాప్ ’సోషల్’ స్టార్: ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో మోదీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్బుక్లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు.