'ఆ రోజు అంబేద్కర్తో నెహ్రూ ఏం చెప్పారంటే..'
అహ్మదాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అధికారాన్ని అస్సలు కోరుకోలేదని బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. హిందూ కోడ్ బిల్లులో మార్పులు చేసేందుకు నెహ్రూ కేబినెట్ అంగీకరించపోవడంతో ఆయన తన న్యాయశాఖమంత్రిత్వ బాధ్యతలకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
'కుటుంబ ఆస్తిలో హిందూ అమ్మాయిల హక్కులు ఇవ్వాలని మీరు చెప్పిన ఆలోచనను అమలు చేసేందుకు దేశం సిద్దంగా లేదని అంబేద్కర్తో జవహార్ లాల్ అన్నారు. ఆ సమయంలో అంబేద్కర్ స్పందిస్తూ మనం న్యాయశాఖ ద్వారా ఆ పని చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు భారత్ స్వతంత్ర దేశం. అలా చేసి ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడం మన బాధ్యత అని చెప్పారు. అయినా, నెహ్రూ వెనక్కి వెళ్లారు. అంబేద్కర్ రాజీనామా చేశారు. వ్యక్తుల చేతిలో నుంచి అధికారాన్ని తీసుకొని సమాజానికి అందించాలనేదే అంబేద్కర్ అసలైన లక్ష్యం' అని ఆయన చెప్పారు.