Bihar Governor
-
బిహార్ మంత్రివర్గం రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్‌లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్‌లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్‌నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. -
రామ్‌నాథ్ కోవింద్ రాజీనామా
న్యూఢిల్లీ: బిహార్ గవర్నర్ పదవికి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. కోవింద్ లేఖను ప్రణబ్ ఆమోదించారు. కాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిౖకైన రామ్‌నాథ్ కోవింద్ సౌమ్యుడిగా, పేదల హక్కుల పోరాట యోధుడిగా పేరొందారు. ఆయన ఈ నెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. -
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నాయకుడి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ గవర్నర్ రామనాథ్ కోవింద్ పేరు ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో కోవింద్ పేరును ప్రకటించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయనను అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదని తెలిపారు. 23న రామనాథ్ కోవింద్ నామినేషన్ వేసే అవకాశముంది. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రామనాథ్ పేరును తెరపైకి తెచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్డీఏ పక్షాలు సైతం ఆయన పేరును ఊహించలేకపోయాయి. దళిత నాయకుడైన రామనాథ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న డేరాపూర్. 1945, అక్టోబర్ 1న ఆయన జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. రాజ్‌నాథ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. -
'ఆ రోజు అంబేద్కర్‌తో నెహ్రూ ఏం చెప్పారంటే..'
అహ్మదాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అధికారాన్ని అస్సలు కోరుకోలేదని బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. హిందూ కోడ్ బిల్లులో మార్పులు చేసేందుకు నెహ్రూ కేబినెట్ అంగీకరించపోవడంతో ఆయన తన న్యాయశాఖమంత్రిత్వ బాధ్యతలకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. 'కుటుంబ ఆస్తిలో హిందూ అమ్మాయిల హక్కులు ఇవ్వాలని మీరు చెప్పిన ఆలోచనను అమలు చేసేందుకు దేశం సిద్దంగా లేదని అంబేద్కర్‌తో జవహార్ లాల్ అన్నారు. ఆ సమయంలో అంబేద్కర్ స్పందిస్తూ మనం న్యాయశాఖ ద్వారా ఆ పని చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు భారత్ స్వతంత్ర దేశం. అలా చేసి ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడం మన బాధ్యత అని చెప్పారు. అయినా, నెహ్రూ వెనక్కి వెళ్లారు. అంబేద్కర్ రాజీనామా చేశారు. వ్యక్తుల చేతిలో నుంచి అధికారాన్ని తీసుకొని సమాజానికి అందించాలనేదే అంబేద్కర్ అసలైన లక్ష్యం' అని ఆయన చెప్పారు.