రామ్‌నాథ్ కోవింద్ రాజీనామా
న్యూఢిల్లీ: బిహార్ గవర్నర్ పదవికి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. కోవింద్ లేఖను ప్రణబ్ ఆమోదించారు. కాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిౖకైన రామ్‌నాథ్ కోవింద్ సౌమ్యుడిగా, పేదల హక్కుల పోరాట యోధుడిగా పేరొందారు. ఆయన ఈ నెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.