వాషింగ్టన్ : ‘ఇంటి నుంచి పనిచేయడం కాదు. ఆఫీస్‌కు వస్తారా? ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా?. ఆఫీసుకు వచ్చి పని చేయండి. లేదంటే ఫిబ్రవరి 6 తారీఖులోపు రాజీనామా చేయండి. రాజీనామా చేసిన ఉద్యోగులకు బైఅవుట్ చెల్లిస్తాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) 20లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు (US federal workers) అల్టిమేట్టం జారీ చేశారు. దీంతో ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ గడువు ముగియనున్న తరుణంలో వేలాది మంది ఉద్యోగులు రాజీనామా చేసేందుకు క్యూ కట్టినట్లు తెలుస్తోంది.
అమెరికాలో 2.3 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 40వేల మంది తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా (resign) చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వారందరూ ట్రంప్ ఇచ్చే బైఅవుట్ ప్యాకేజీకి సిద్ధపడి రాజీనామా చేసినట్లు వాషింస్టన్ పోస్ట్ తెలిపింది. వైట్ హౌస్ వర్గాలు సైతం ధృవీకరించినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డొజ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డోజ్ బాధ్యతల్ని బిలియనీర్ ఎలాన్‌మస్క్‌కు బాధ్యతల్ని అప్పగించారు. అయితే, అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ డోజ్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలు జారీచేస్తూ వస్తున్నారు.
ఇందులో భాగంగా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ సర్కారు బైఅవుట్‌ను ప్రకటించింది.కొవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పని చేస్తున్నారు. తాజాగా వారు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కారు తేల్చిచెప్పింది.ఆఫీస్‌కు రావాలనుకుంటే రావొచ్చు. వద్దనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ నుంచి ఒక ఈ-మెయిల్ 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పంపింది. అందులో ఫిబ్రవరి 6లోపు స్వచ్ఛందంగా ఉద్యోగాలు రాజీనామా చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు.
దీంతో ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగాలు రాజీనామా చేశారు. మరికొందరు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment