పార్లమెంట్ సమావేశాలు మార్చి 24కు వాయిదా
టొరంటో: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(53) ప్రధాని పదవికి, అధికార లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా పదవిలో కొనసాగుతానన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా, తొమ్మిదేళ్ల పాలన అనంతరం నాయకత్వ మారి్పడి కోరుతూ అధికార పారీ్టలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.
‘పార్టీ నేత, ప్రధాని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్త ఎంపిక ప్రక్రియలో తదుపరి నేత ఎన్నికయ్యే వరకు ప్రధానిగా కొనసాగుతాను’ అని ట్రూడో మీడియా సమావేశంలో ప్రకటించారు. పారీ్టలో అంతర్గత కుమ్ములాటలున్నాయని బహిరంగంగానే అంగీకరించారు. ‘‘రానున్న ఎన్నికల్లో ప్రజలు నిజమైన నేతను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతర్గతంగా పోరాడాల్సిన పరిస్థితులుండగా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నేను ఉత్తమ ఎంపిక కాలేననే విషయం స్పష్టమైంది. అందుకే బరి నుంచి తప్పు కోవాలనుకుంటున్నా’’ అని చెప్పారు.
‘‘నేను పోరాటయోధుడిని. కెనడా కోసం పోరాడేందుకు నా శరీరంలో అణువణువూ సిద్ధమే. కానీ ఎంతగా కృషి చేస్తున్నా కొంతకాలంగా పార్లమెంట్ సజావుగా సాగడం లేదు. అందుకే పార్లమెంట్ సమావేశాలను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గవర్నర్ జనరల్‌కు తెలిపా. అందుకామె అంగీకరిస్తూ సమావేశాలను జనవరి 27 నుంచి మార్చి 24కు వాయిదా వేశారు’’ అని వివరించారు. ఆలోగా కొత్త నేతను ఎంపిక చేసుకునేందుకు అధికార పారీ్టకి వీలు చిక్కుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రజాదరణలో అధికార లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ ఎంతో మెరుగ్గా ఉంది.
ఈ దశలో ట్రూడో రాజీనామా ప్రకటనతో అధికార పారీ్టకి సరైన దిశానిర్దేశం చేసే నేత కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. జనవరి 27వ తేదీన పార్లమెంట్ సమావేశాలు మొదలైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మూడు ప్రతిపక్ష పారీ్టలు ప్రకటించడం గమనార్హం. దీనిని తప్పించుకునేందుకే ట్రూడో పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయించినట్లు చెబుతున్నారు. పదేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు ముగింపు పలుకుతూ లిబరల్ పార్టీ నేతగా ఉన్న ట్రూడో 2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ఆయన తండ్రి పియెర్రె గతంలో రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసి, మంచి పేరు సంపాదించుకున్నారు. ట్రూడో పాలన మొదట్లో బాగుందనిపించినా రాన్రానూ ఆయన ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ వచి్చంది. ఆహారం, ధరలు ఆకాశాన్నంటడం, వలసలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. అంతకుముందు హౌసింగ్ మంత్రి వైదొలిగారు. ట్రూడో రాజీనామా చేయాలంటూ బాహాటంగానే కొందరు నేతలు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఇవి కూడా ట్రూడో తాజా నిర్ణయానికి బలమైన కారణాలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment