Dr Ambedkar
-
ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఫ్లెక్సీని చించి అవమానించిన ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. కాకినాడలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీపైన, రఘురామకృష్ణరాజుపైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. బుధవారం హైకోర్టు ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఫోరం ఆధ్వర్యంలో న్యాయవాదులు భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. రఘురామకృష్ణరాజు, నానాజీలను అరెస్ట్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి రఘురామకృష్ణరాజు కుల అహంకారాన్ని ప్రదర్శించారని, ఇది క్షమించరాని నేరమని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తుడిగా పరిగణించబడుతున్న రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి భర్తరఫ్ చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన వైద్యుడిపై ఎమ్మెల్యే దాడి హేయమని, ఫ్రొఫెసర్కే రక్షణ లేకపోతే సామాన్యుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి అంబేడ్కర్ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. -
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
81 అడుగుల పీఠంపై 125 అడుగుల కాంస్య విగ్రహం
-
Vijayawada Ambedkar Statue Photos: వెలుగుల నడుమ బడుగు బాంధవుడు (ఫొటోలు)
-
అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నాం
-
నిర్మాణ వ్యయం రూ.146.50 కోట్లు
-
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
సాక్షి, న్యూఢిల్లీ: కరెన్సీ పై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటో ముద్రిం చాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత డిమాండ్ చేశారు. ‘కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రç ßæం ఎదుట ధర్నా జరిగింది. ఇందులో ఇందులో వైఎస్సార్ సీపీ ఎంపీ చింతా అనురాధ, ఎంపీ వెంకటేశ్ నేత, మాజీ ఎంపీ వీహెచ్, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్ నేత మాట్లాడుతూ ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఫొటో లేకుండా కరెన్సీ నోటు ఉండడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని సాధన సమితికి ఆయన హామీనిచ్చారు. -
అంబేద్కర్ సేవలు నిరుపమానం: బిశ్వభూషణ్
సాక్షి, విజయవాడ: భారత రాజ్యాంగ పితామహుడుగా అంబేద్కర్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. రేపు(మంగళవారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా గవర్నర్ సందేశమిచ్చారు. మహిళలు, బలహీన వర్గాలకు సమాన హక్కులను కల్పించే దిశగా ఆధునిక భారతదేశం కోసం జీవితకాల పోరాటం చేశారని ప్రస్తుతించారు. కులం లేని నవ సమాజ నిర్మాణానికి అంబేద్కర్ పునాదులు వేశారని కొనియాడారు. తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ కులాలకు చెందిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేసిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని కీర్తించారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దళితులపై సామాజిక వివక్షను అరికట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు. -
కుల నిర్మూలనతోనే భవిష్యత్తు
మనం పరిశుభ్రమైన దుస్తులు ధరించినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరానివారుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది అని బీఆర్ అంబేడ్కర్ తన తుది ఉపన్యాసంలో అన్నారు. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, గోమాంస భక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని పాటిస్తున్న తెగలను హిందూ మతం వెలివేసి, నీచమైన వృత్తులను అంటగట్టిందని వివరించారు. చివరకు 1956 అక్టోబర్14న 5లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి సామాజిక విప్లవానికి పునాది వేశారు. కుల నిర్మూలన కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం రేపటి భవిష్యత్ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది. ‘‘మనం పదిహేను వందల సంవత్సరాల నుంచి గ్రామ పొలిమేరల కావల నివసిస్తూ, హిందువులు మనసు మారి మనకు సమానత్వం కల్పిస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఏ ఒక్కరూ కూడా అంటరానితనం సమసిపోయే విధంగా మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు. కొందరూ అరకొరగా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అంతేకాక మతం పేరుతో మనం అణగతొక్కబడి శతాబ్దాల తరబడి అంతులేని హింసకూ, అత్యాచారాలకూ గురయ్యాం’’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ క్షేత్రమైన సారనాథ్‌లోని మహాబోధి సంస్థ ఏర్పాటు చేసిన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 25, 1956న అంబేడ్కర్ చేసిన ఉపన్యాసం ఆయన జీవితంలో చివరి ఉప న్యాసం. అంబేడ్కర్ తన చిట్టచివరి ఉపన్యాసంలో తన జీవితాను భవపు సారాన్ని తన ఆవేదనాశ్రువులుగా దేశప్రజల ముందుంచారు. ముఖ్యంగా అంటరాని కులాలకూ సమానత్వ కాంక్షాపరులకూ ఆయన చివరి వ్యాఖ్యోపానంగా ఈ ఉపన్యాసం ఉంటుంది. ‘‘మనం మురికిగా ఉన్నామని, నీచమైన పనులు చేసి జీవిస్తు న్నామని అందుకే దూరముంచామని వందల ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ వాస్తవంలో, ఈ రోజు మనం మురికిగా లేం. అందరిలానే పరిశుభ్రంగా ఉన్నాం. ఒక మనిషి ఇతను అంటరాని వాడు అని ఇప్పుడు మనల్ని మన వస్త్రధారణను బట్టి నిర్ధారించలేని విధంగా ఉన్నాం. అయినప్పటికీ మన కులం తెలిస్తే, మనం పరిశు భ్రమైన దుస్తులు ధరించినా, మర్యాదగల వ్యాపారం చేసినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరాని వారుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం హిందూమతాన్ని విడిచి పెట్టి సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధించిన, ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది.’’ అంటూ అంబేడ్కర్ తన చివరి ఉపన్యాసంలో ప్రబో ధించారు. అంతే కాదు, అంబేడ్కర్ ఇటువంటి నిర్ణయానికి రావడా నికి ఆయన సాగించిన సత్యశోధన, ఉద్యమకార్యాచరణ, శాసన నిర్మాణాలు కారణమయ్యాయి. అమెరికాలోని కొలంబియా వర్సిటీలో ఉన్నత చదువులకు వెళ్ళిన అంబేడ్కర్ 1916, మే, 9వ తేదీన ఆంత్రోపాలజీ సెమినార్లో ‘‘భారతదేశంలో కులాలు’’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అందులో కులాల పుట్టుకుకు సంబంధించిన చారిత్రక పరిస్థితులను వివరించారు. వివాహ వ్యవ స్థను ఒక సమూహానికే పరిమితం చేసి, ఒక సమూహాన్ని మరో సమూహంతో కలవకుండా చేసి, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడా నికి చేసిన ప్రయత్నం కుల వ్యవస్థ ఏర్పాటుకు కారణమయ్యిందన్న విషయాన్ని అంబేడ్కర్ తన పత్రంలో వివరించారు. ఆ తర్వాత అంబేడ్కర్ రాజకీయ అంశాలపైన దృష్టి కేంద్రీకరిం చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కావాలని, అందులో అంటరా నికులాలతో సహా అందరికీ భాగస్వామ్యం ఉండాలని 1919లో మొదటిసారిగా సౌత్‌బరో కమిటీ ఎదుట ప్రతిపాదించారు. అట్లా సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలో తన వాదనను విని పించారు. 1946లో తన ప్రతిపాదనగా నూతన రాజ్యాంగంలో చేర్చ డానికి వీలుగా ‘స్టేట్స్, మైనారిటీస్’ అనే డాక్యుమెంటును రూపొం దించారు. అయితే కులం పోకుండా ఈ దేశంలో సమానత్వం రాదనే విషయాన్ని అంబేడ్కర్ బలంగా విశ్వసించారు. రాజకీయ హక్కుల కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, కుల నిర్మూలనకు, అంట రానితనం రూపుమాపడానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. అప్పటికీ గాంధీలాంటి సంస్కర్తల మాటలు ఆచరణలో ఎట్లా విఫలమవుతున్నాయో చూపడానికి మహద్ చెరువు సత్యాగ్రహం, కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని కొనసాగించారు. మహద్ చెరువులోని నీటిని కులమతాలకు అతీతంగా అందరూ వినియోగిం చుకోవాలని, ఆనాటి ప్రభుత్వం అనుమతితో చెరువులోకి అడుగుపె డితే, అస్పృశ్యులపై దాడి చేశారు. మహద్ చెరువు పోరాటం మార్చి 20, 1927లో జరిగింది. తర్వాత మూడేళ్ళకు 1930 మార్చి2న నాసిక్ లోని కాలారామ్ దేవాలయంలోకి అంటరాని కులాల ప్రవేశానికి అంబేడ్కర్ ఉద్యమించారు. అది కూడా విఫలమైంది. అక్కడ కూడా హిందువులు అంబేడ్కర్‌తో సహా అంటరాని కులాలను దేవాలయం లోకి రానివ్వలేదు. అప్పుడు అంబేడ్కర్ హిందూమతం, దాని స్వభావం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు. సరిగ్గా 1930–32 సంవత్సరాల్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం అంటరాని కులాలకు రాజకీయ హక్కుగా ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని అంగీకరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు అంటరాని కులాలను ఉద్ధరించేది తానేనని ప్రకటించుకున్న గాంధీ బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ, ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని రద్దు చేసుకొని, గాంధీ ప్రతిపాదించిన పూనా ఒడంబడికను అయిష్టంగానే అంబేడ్కర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం కూడా అంబేడ్కర్‌ను బాగా కలచివేసింది. ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో యెవోల అనే పట్టణంలో అక్టోబర్ 12, 1935న జరిగిన అంటరాని కులాల సభలో అంబేడ్కర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ‘దురదృష్ట వశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ నేను హిందువుగా మరణించను’ అని. ఈ ప్రకటన యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. సమా జంలో సమాన గౌరవం, సమానహక్కుల కోసం జరిపిన పోరాటం ఏ విధంగా నిరర్ధకంగా మారిందో చెపుతూ అంబేడ్కర్ ఆందోళన వెలి బుచ్చారు. ఈ ప్రకటనను ఆ సభకు హాజరైన వేలాదిమంది స్వాగతిం చారు. కానీ, అదే స్థాయిలో అగ్రవర్ణాల నుంచి వ్యతిరేకతను కూడా తీసుకొచ్చింది. గాంధీ ఒక వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘అంబే డ్కర్ ప్రకటన ఆందోళన కలిగిస్తున్నది. ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయం ఫలితం ఇవ్వదు’ అని తెలిపారు. దానికి అంబేడ్కర్ ఘాటైన సమాధానమే చెప్పారు. ‘నేను హిందూ మతాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అంటరానికులాల వారు తామెలా వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళనివ్వండి. ఇది గాంధీకి నా సలహా’ అంటూ గాంధీ అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. అదే సమయంలో అంబేడ్కర్ కుల నిర్మూలనకు సంబంధించిన తన సత్యశోధనను ఆపలేదు. అందులో భాగంగానే 1936లో లాహో ర్లోని జాట్పాల్తోడక్ మండల్ సంస్థ ఆహ్వానం మేరకు కుల నిర్మూ లనపై ప్రసంగించడానికి అంబేడ్కర్ అంగీకరించారు. కానీ ఆ సభ జరగలేదు. అయితే ఆ సభ కోసం అంబేడ్కర్ రూపొందించిన డాక్యు మెంట్ ఇప్పటికీ ఒక చర్చకు ప్రాతిపదికగా నిలుస్తున్నది. కుల నిర్మూ లన పుస్తకంలో కులంపై ఎంతో వివరమైన విషయాలను ప్రస్తావి స్తూనే, కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. తన మొట్టమొదటి పరిశో ధనాపత్రం ‘‘కులాల పుట్టుక’’లో పేర్కొన్న వివాహ వ్యవస్థ కులం బలపడడానికి కారణమైందని వివరిస్తూ కులాంతర వివాహాలు, వర్ణాంతర భోజనాలు జరగాలని ప్రతిపాదించారు. పైగా, కులాన్ని సమర్థిస్తున్న ధర్మశాస్త్రాలను రద్దుచేయాలని కోరారు. వీటితో పాటు, హిందూ మతంలో అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా అర్చక వ్యవస్థను ఒక కులానికి పరిమితం చేయరాదని కూడా అంబేడ్కర్ కరాకండీగా చెప్పారు. తన పరిశోధనలను కొనసాగిస్తూనే అంటరాని తనం ఆచరించడానికి గల కారణాలను కనుగొన్నారు. ‘అంటరాని వారెవరు’ అంటూ చేసిన తన శోధనలో ఆయనకు తను ఎటు వెళ్లాలో తెలిసింది. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, ఆవు మాంసభక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని అవలంబిస్తూ్త హిందూమతంలోనికి తిరిగిరాని తెగలను హిందూ మతం వెలివేసిందని, నీచమైన వృత్తులను అంట గట్టిందని వివరించారు. ఆ విధంగా మళ్ళీ అంటరానివారి సొంత మతమైన బౌద్ధంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకే 1944 నుంచి బౌద్ధంపై అంబేడ్కర్ అధ్యయనం సాగించారు. చివరకు 1956 అక్టోబర్, 14న ఐదు లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి గొప్ప సామాజిక విప్లవానికి పునాదివేశారు. అంబేడ్కర్ బౌద్ధంలోకి వెళ్ళాలనే నిర్ణయానికి కారణం ఛాందస హిందూ వాదమే కానీ అంబే డ్కర్ స్వతహాగా కారణం కాదని అంబేడ్కర్ సామాజిక ప్రయాణం మనకు స్పష్టంగా వివరిస్తుంది. అందుకే కుల నిర్మూలన కోసం అంబే డ్కర్ చేసిన పోరాటం రేపటి భవిష్యత్ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
అప్పుడే ప్రజాస్వామ్య మనుగడకు ప్రామాణికం
సాక్షి, సిటీబ్యూరో: కులాన్ని బద్దలు కొట్టకుండా సమాజంలో సమానత్వ భావనకు చోటులేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ భావించారు కనుకే కులాన్ని సమూలంగా నిర్మూలించేందుకు, సమానత్వాన్ని పెంపొందించేందుకు రాజ్యాంగ రచనని ఆయుధంగా మలుచుకున్నారని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కె.అంబుజాక్షన్ అభిప్రాయపడ్డారు. కుల నిర్మూలనే ప్రజాస్వామ్య మనుగడకు ప్రామాణికమని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, సీఐఎస్ఆర్ఎస్ బెంగుళూరు ఆధ్వర్యంలో పీడీ దేవానందన్, ఎంఎం థామస్‌ల మెమోరియల్ లెక్చర్ సందర్భంగా అంబేడ్కర్ – ప్రజాస్వామ్యం అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. రాజ్యాంగం మంచి చెడులు దాని అమలుపైనే ఆధారపడి ఉంటాయని అంబేడ్కర్ ఆనాడే ప్రకటించారని, ఈ దేశ పాలకులకు రాజ్యాంగంపై విశ్వాçÜం లేదన్న విషయం రాను రాను స్పష్టంగా రుజువు అవుతూ వస్తోందన్నారు. కార్యక్రమానికి మల్లెపల్లి లక్ష్మయ్య అధ్యక్షత వహించగా డాక్టర్ జి.దైవాశీర్వాదం, డాక్టర్ ప్రవీణ్ కుమార్, విన్సన్ట్ విజయరాజు, డాక్టర్ సుజాత, గురజాల రవి తదితరులు హాజరై మాట్లాడారు. -
'ఆ రోజు అంబేద్కర్‌తో నెహ్రూ ఏం చెప్పారంటే..'
అహ్మదాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అధికారాన్ని అస్సలు కోరుకోలేదని బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. హిందూ కోడ్ బిల్లులో మార్పులు చేసేందుకు నెహ్రూ కేబినెట్ అంగీకరించపోవడంతో ఆయన తన న్యాయశాఖమంత్రిత్వ బాధ్యతలకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. 'కుటుంబ ఆస్తిలో హిందూ అమ్మాయిల హక్కులు ఇవ్వాలని మీరు చెప్పిన ఆలోచనను అమలు చేసేందుకు దేశం సిద్దంగా లేదని అంబేద్కర్‌తో జవహార్ లాల్ అన్నారు. ఆ సమయంలో అంబేద్కర్ స్పందిస్తూ మనం న్యాయశాఖ ద్వారా ఆ పని చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు భారత్ స్వతంత్ర దేశం. అలా చేసి ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడం మన బాధ్యత అని చెప్పారు. అయినా, నెహ్రూ వెనక్కి వెళ్లారు. అంబేద్కర్ రాజీనామా చేశారు. వ్యక్తుల చేతిలో నుంచి అధికారాన్ని తీసుకొని సమాజానికి అందించాలనేదే అంబేద్కర్ అసలైన లక్ష్యం' అని ఆయన చెప్పారు. -
దళిత జాతి ముద్దు బిడ్డ అంబేద్కర్
మంద కృష్ణమాదిగ, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ నాగులుప్పలపాడు : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దళిత జాతి ముద్దు బిడ్డలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈదుమూడి గ్రామంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ దళిత జాతి ఉద్యమం పుట్టిన ఈ జిల్లాలోనే ఎమ్మార్పీఎస్ వంటి ఆత్మగౌరవ పోరాట ఉద్యమం కూడా పుట్టిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి పుట్టినిల్లయిన ఈదుమూడిలో వేలాది మంది సమక్షంలో మహానేతల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. దళితుల్లో అసమానతలను తొలగించేందుకు దళిత మేధావులు, దళిత ప్రజాప్రతినిధులు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పుట్టినిల్లు అయిన ఈదుమూడి చరిత్ర పుటల్లో నిలుస్తుందన్నారు. ముందుగా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు కృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్మ మాదిగ, ఒంగోలు రూరల్ సీఐ సంజీవకుమార్, నాగులుప్పలపాడు ఎస్సై హరిబాబు పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు బి.ఎన్.రమేష్ మాదిగ, శేషన్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ, జాతీయ అధికార ప్రతినిధులు కూచిపూడి సత్యం మాదిగ, రవికుమార్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధులు నరేంద్ర మాదిగ, మల్లవరపు నాగయ్య మాదిగ, మాదిగ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చిలుమూరి శ్రీనివాస్ మాదిగ, ప్రకాశం జిలా ఇన్చార్జి ఏటుకూరి విజయ్‌కుమార్ మాదిగ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల అధ్యక్షులు వర్ల దేవదాసు మాదిగ, పెంచలయ్య మాదిగ, సుభాష్ మాదిగ, ఎగ్గిడి మల్లయ్య మాదిగ, కోట డానియేల్ మాదిగ, బీజేపీ జిల్లా నాయకులు నాగార్జున, తెలగతోటి చంద్రమోహన్ మాల, పాలడుగు రమేష్ మాల తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ మనవడిపై దాడి
రాయ్ గడ్(మహారాష్ట్ర): డా.బీఆర్ అంబేద్కర్ మనవడు, రిపబ్లికన్ సేనా అధ్యక్షుడు ఆనంద్ రాజ్ అంబేద్కర్ పై మంగళవారం దాడి జరిగింది. కొంతమంది రాజకీయ ఉద్యమ కారులు రాయ్ గడ్ జిల్లాలోని మహాద్ లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీ ఆవరణలో ఆనంద రాజ్ అంబేద్కర్ పై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో పార్టీ కార్యకర్తలు ఆనంద్ రాజ్ కు రక్షణ వలయంగా నిలవడంతో ఎటువంటి హాని జరుగలేదని పార్టీ జనరల్ సెక్రటరీ వాసంత్ కాంబ్లీ తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఓ కార్యకర్తకు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆనందరాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ తో సమావేశం కావడానికి వెళ్లిన సమయంలో కొంతమంది కర్రలు, రాడ్ లు, ఆయుధాలతో దాడికి పాల్పడినట్లు వాసంత్ తెలిపారు. స్థానిక శివసేన ఉద్యమకారులే తమపై దాడికి దిగినట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. -
తెలంగాణపై రాజీలేని పోరు
లింగాల, న్యూస్‌లైన్: సమాజంలో వివక్షత తొల గినప్పుడే భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆ మహనీయుడు పుట్టిన తర్వాతే దళితుల తలరాతలు మారాయన్నారు. తెలంగాణపై రాజీలేని పోరాటం చేస్తామని, బిల్లు ఆమోదం పొందేవరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు. మండలంలోని అంబట్పల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన అంబేద్కర్ విగ్రహాష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. ఎమ్మార్పీస్ దళితపక్షాన ఉంటూ పోరాటం చేస్తున్నది మాత్రమే కాదని, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వారి పక్షాన ఉండి పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. గ్రామాల్లో నేటికీ కులవివక్షత చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. దళితులకు స్వేచ్ఛ, రాజ్యాధికారం రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీస్ పోరాటాల వల్లే పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు నిరుపేదలకు అందుతున్నాయని అన్నారు. సభలో అచ్చంపేట ఎమ్మెల్యే రాములు మాట్లాడుతూ.. నిరక్షరాస్యత వల్ల దళితులు అన్ని రంగాల్లో వెనకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదరికంలోనే మహాత్ములు పుడతారని, అలాంటి వారే అంబేద్కర్ అని గుర్తుచేశారు. మందకృష్ణ పోరాటానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. అనంతరం ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. నేటికీ దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి గువ్వల బాలరాజు, ఎమ్మార్పీస్ నాయకులు మస్తాన్, కోళ్ల వెంకటేశ్, చారకొండ వెంకటేష్, అంబట్పల్లి సర్పంచి వాణిరవిశంకర్, సింగిల్ మాజీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొజ్జిరెడ్డి, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు కాశన్న యాదవ్, బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. 9న మహాసభను విజయవంతం చేయండి వంగూరు: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘అమరుల తల్లుల కడుపుకోత మహాసభ’ విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు లు మందకృష్ణ మాదిగ కోరారు. శుక్రవారం వంగూరు స్టేజీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అమరుల కుటుంబానికి ఐదెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, పది లక్షల ఎక్స్‌గ్రేషియా, నెలకు ఐదువేల పింఛన్ ఇవ్వాలని ఆ యన డిమాండ్‌చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వాలని హైదరాబాద్‌పై ఎలాంటి పేచీలు పెట్టకుండా రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ఆయన కోరా రు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను వేగవం తం చేసి వెంటనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాములు, ఓయూ జేఏసీ నాయకులు వెంకటేష్, టీడీపీ నాయకులు గణేష్‌రావు పాల్గొన్నారు.