లింగాల, న్యూస్‌లైన్: సమాజంలో వివక్షత తొల గినప్పుడే భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆ మహనీయుడు పుట్టిన తర్వాతే దళితుల తలరాతలు మారాయన్నారు. తెలంగాణపై రాజీలేని పోరాటం చేస్తామని, బిల్లు ఆమోదం పొందేవరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు. మండలంలోని అంబట్‌పల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన అంబేద్కర్ విగ్రహాష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. ఎమ్మార్పీస్ దళితపక్షాన ఉంటూ పోరాటం చేస్తున్నది మాత్రమే కాదని, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వారి పక్షాన ఉండి పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. గ్రామాల్లో నేటికీ కులవివక్షత చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. దళితులకు స్వేచ్ఛ, రాజ్యాధికారం రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీస్ పోరాటాల వల్లే పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు నిరుపేదలకు అందుతున్నాయని అన్నారు. సభలో అచ్చంపేట ఎమ్మెల్యే రాములు మాట్లాడుతూ.. నిరక్షరాస్యత వల్ల దళితులు అన్ని రంగాల్లో వెనకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదరికంలోనే మహాత్ములు పుడతారని, అలాంటి వారే అంబేద్కర్ అని గుర్తుచేశారు. మందకృష్ణ పోరాటానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు.
అనంతరం ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. నేటికీ దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గువ్వల బాలరాజు, ఎమ్మార్పీస్ నాయకులు మస్తాన్, కోళ్ల వెంకటేశ్, చారకొండ వెంకటేష్, అంబట్‌పల్లి సర్పంచి వాణిరవిశంకర్, సింగిల్ మాజీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొజ్జిరెడ్డి, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు కాశన్న యాదవ్, బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
9న మహాసభను విజయవంతం చేయండి
వంగూరు: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘అమరుల తల్లుల కడుపుకోత మహాసభ’ విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు లు మందకృష్ణ మాదిగ కోరారు. శుక్రవారం వంగూరు స్టేజీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అమరుల కుటుంబానికి ఐదెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, పది లక్షల ఎక్స్‌గ్రేషియా, నెలకు ఐదువేల పింఛన్ ఇవ్వాలని ఆ యన డిమాండ్‌చేశారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వాలని హైదరాబాద్‌పై ఎలాంటి పేచీలు పెట్టకుండా రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ఆయన కోరా రు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను వేగవం తం చేసి వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాములు, ఓయూ జేఏసీ నాయకులు వెంకటేష్, టీడీపీ నాయకులు గణేష్‌రావు పాల్గొన్నారు.
తెలంగాణపై రాజీలేని పోరు
Published Sat, Oct 19 2013 4:57 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement