దళిత జాతి ముద్దు బిడ్డ అంబేద్కర్
మంద కృష్ణమాదిగ, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
నాగులుప్పలపాడు : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దళిత జాతి ముద్దు బిడ్డలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈదుమూడి గ్రామంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ దళిత జాతి ఉద్యమం పుట్టిన ఈ జిల్లాలోనే ఎమ్మార్పీఎస్ వంటి ఆత్మగౌరవ పోరాట ఉద్యమం కూడా పుట్టిందని పేర్కొన్నారు.
ఈ ఉద్యమానికి పుట్టినిల్లయిన ఈదుమూడిలో వేలాది మంది సమక్షంలో మహానేతల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. దళితుల్లో అసమానతలను తొలగించేందుకు దళిత మేధావులు, దళిత ప్రజాప్రతినిధులు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పుట్టినిల్లు అయిన ఈదుమూడి చరిత్ర పుటల్లో నిలుస్తుందన్నారు.
ముందుగా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు కృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్మ మాదిగ, ఒంగోలు రూరల్ సీఐ సంజీవకుమార్, నాగులుప్పలపాడు ఎస్సై హరిబాబు పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు బి.ఎన్.రమేష్ మాదిగ, శేషన్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ, జాతీయ అధికార ప్రతినిధులు కూచిపూడి సత్యం మాదిగ, రవికుమార్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధులు నరేంద్ర మాదిగ, మల్లవరపు నాగయ్య మాదిగ, మాదిగ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చిలుమూరి శ్రీనివాస్ మాదిగ, ప్రకాశం జిలా ఇన్‌చార్జి ఏటుకూరి విజయ్‌కుమార్ మాదిగ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల అధ్యక్షులు వర్ల దేవదాసు మాదిగ, పెంచలయ్య మాదిగ, సుభాష్ మాదిగ, ఎగ్గిడి మల్లయ్య మాదిగ, కోట డానియేల్ మాదిగ, బీజేపీ జిల్లా నాయకులు నాగార్జున, తెలగతోటి చంద్రమోహన్ మాల, పాలడుగు రమేష్ మాల తదితరులు పాల్గొన్నారు.