సాక్షి, సిటీబ్యూరో: కులాన్ని బద్దలు కొట్టకుండా సమాజంలో సమానత్వ భావనకు చోటులేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ భావించారు కనుకే కులాన్ని సమూలంగా నిర్మూలించేందుకు, సమానత్వాన్ని పెంపొందించేందుకు రాజ్యాంగ రచనని ఆయుధంగా మలుచుకున్నారని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కె.అంబుజాక్షన్ అభిప్రాయపడ్డారు. కుల నిర్మూలనే ప్రజాస్వామ్య మనుగడకు ప్రామాణికమని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారన్నారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, సీఐఎస్‌ఆర్‌ఎస్ బెంగుళూరు ఆధ్వర్యంలో పీడీ దేవానందన్, ఎంఎం థామస్‌ల మెమోరియల్ లెక్చర్ సందర్భంగా అంబేడ్కర్ – ప్రజాస్వామ్యం అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. రాజ్యాంగం మంచి చెడులు దాని అమలుపైనే ఆధారపడి ఉంటాయని అంబేడ్కర్ ఆనాడే ప్రకటించారని, ఈ దేశ పాలకులకు రాజ్యాంగంపై విశ్వాçÜం లేదన్న విషయం రాను రాను స్పష్టంగా రుజువు అవుతూ వస్తోందన్నారు.
కార్యక్రమానికి మల్లెపల్లి లక్ష్మయ్య అధ్యక్షత వహించగా డాక్టర్ జి.దైవాశీర్వాదం, డాక్టర్ ప్రవీణ్ కుమార్, విన్సన్ట్ విజయరాజు, డాక్టర్ సుజాత, గురజాల రవి తదితరులు హాజరై మాట్లాడారు.