
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.
బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.