gas
-
చమురుపై ఇక విండ్‌ఫాల్ ట్యాక్స్‌లు ఉండవు
న్యూఢిల్లీ: ఆయిల్‌ఫీల్డ్స్ (నియంత్రణ, అభివృద్ధి) బిల్లు అమల్లోకి వచ్చాక చమురు, గ్యాస్ కంపెనీల అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ల్లాంటి కొత్త పన్ను ల విధింపు బాదరబందీ ఉండదని కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఇన్వెస్టర్లకు ఆర్థిక విధానాల స్థిరత్వంపై కొత్త చట్టం భరోసా కల్పిస్తుందని పురి వివరించారు.అంతర్జాతీయంగా పలు ఆయిల్ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియాతో బ్రెజిల్‌కి చెందిన పెట్రోబ్రస్, ఓఎన్జీసీతో ఎక్సాన్‌మొబిల్, ఈక్వినార్ వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. ఇతర దేశాల తరహాలోనే, ఇంధన కంపెనీలకు వచ్చే అసాధా రణ లాభాలపై 2022 జూలై 1 నుంచి భారత్ విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యా క్స్లు విధించడం మొదలుపెట్టింది.పెట్రోల్.. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున ఎగుమతి సుంకాలు విధించింది. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విధించింది. పలుమార్లు సవరించిన ఈ ట్యాక్స్‌లను 30 నెలల తర్వాత గతేడాది డిసెంబర్లో నిలిపివేసింది. -
వంట చేస్తుండగా పేలిన సిలిండర్
-
జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి
టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది. పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
36.6 శాతం గృహాలు... స్వచ్ఛ ఇంధనానికి దూరం
సాక్షి, అమరావతి: దేశంలో ఇంకా 36.6 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనానికి (గ్యాస్) దూరంగా ఉన్నాయి. పట్టణాల్లో 92.9 శాతం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగానికిపైగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనానికి నోచుకోలేదని సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే 2022–23 వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 49.3 శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి.మిగతా 50.7 శాతం కుటుంబాలు కట్టెలు, బొగ్గులనే వాడుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 63.4శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. మిగతా 36.6 శాతం కట్టెలు, బొగ్గు వంటి వాటిపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏపీలో జాతీయ స్థాయికి మించి గ్రామీణ, పట్టణాల్లో కలిపి 88.0 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయని సర్వే వెల్లడించింది.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 84.1 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, పట్టణాల్లో 96.7 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు కూడా వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే తెలిపింది. స్వచ్ఛ ఇంధనం అంటే.. వంట కోసం ఎల్పీజీ, ఇతర సహజ వాయువులు, గోబర్ గ్యాస్, ఇతర బయోగ్యాస్ విద్యుత్, సోలార్ కుక్కర్ వంటివి వినియోగించడం -
స్కూల్లో గ్యాస్ లీక్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా! -
Gastric Problem: పొట్టలో గ్యాస్ బండ
పొట్టంతా టైట్‌గా ఉండి... కడుపంతా ఉబ్బరం’’ ఒకరి ఆవేదన. ‘‘అబ్బా... గొంతులోంచి పైకి వస్తున్న మంటలా ఏదో బర్నింగ్ సెన్సేషన్’’ ఇంకొకరి ఆక్రందన. ‘‘తిన్నవెంటనే రొమ్ముమీదే అతుక్కున్నట్టుగా ఉంటోంది. యాంటాసిడ్ ఏదైనా ఉందా’’ మరొకరి అభ్యర్థన. ఇలాంటి మాటలన్నీ ఏ కుటుంబంలోనైనా ఎవరో ఒకరి నుంచి తరచూ వినిపిస్తుండేవే. గతంలో కాస్తంత పెద్దవాళ్లు మాత్రమే అనే ఈ మాటల్ని ఇటీవలి లైఫ్‌స్టైల్‌తో మరీ కొందరు చిన్నపిల్లల్ని మినహాయిస్తే... యువతా, మధ్యవయస్కులూ, పెద్దలూ ఇలా వయసు తేడాల్లేకుండా అందరూ మాట్లాడేస్తున్నారు. కారణం గ్యాస్ చేరి కడపంతా ఉబ్బరంగా ఉంటూ, పొట్ట టైట్‌గా అనిపిస్తూ ఏమాత్రం స్థిమితం లేకుండా చేయడం. కడుపులో ‘గ్యాస్’ చేరుతుందనే ఈ గ్యాస్ట్రిక్ సమస్య గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఆహారంతోపాటు గాలినీ మింగేస్తుంటాం. దాంతో అది పెరిస్టాలిటిక్ చలనంతో జీర్ణవ్యవస్థలోకి వెళ్తుంది. చాలా సందర్భాల్లో తేన్పు రూపంలో బయటికొస్తుంది. మరీ కాస్త కిందికి వెళ్లి ఉంటే పెద్ద పేగుల ద్వారా మలద్వారం గుండా కింది నుంచి వెళ్లే గ్యాస్ రూపంలో బయటకు పోతుంటుంది. అయితే కొంతమందిలో ఆ గ్యాస్ కడుపులో చిక్కుకుపోయినట్టుగా మారి పోట్టఉబ్బరంగా, ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్ధకం, పొట్టనొప్పి, హైపర్ అసిడిటీలకు దారితీయవచ్చు.ఈ సమస్య ఎవరెవరిలో... ఆహారాన్ని బాగా వేగంగా తినేసేవారు వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... (వీళ్లు గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు) ∙పోగతాగే అలవాటున్నవారు చ్యూయింగ్‌గమ్ నమిలేవారు ఏవైనా పదార్థాలను చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ కలిగి ఉండేవి) ఎక్కువగా తాగేవారిలో.ఛాతీలో/కడుపులో మంట ఎందుకంటే...?ఆహారం తిన్న తర్వాత సరిగా అరగకపోవడం; కొన్ని తిన్న తర్వాత అవి ఛాతీలోపల అంటుకున్నట్టుగా ఉండటం; ఛాతీలో / గుండెలో మంటగా అనిపించడం అనే సమస్య నిత్యం చాలామంది ఎదుర్కొనేదే. ఎందుకిలా జరుగుతుంటుందంటే... ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని జీర్ణం చేసేందుకు కడుపులో కొన్ని ఆమ్లాలు (యాసిడ్స్) స్రవిస్తాయి. ఈ యాసిడ్స్ కొందరిలో కడుపునకు పై భాగంలో ఉండే బిరడా వంటి స్ఫింక్టర్ కండరం కాస్తంత వదులైనందువల్ల పైకి వచ్చేస్తుంటాయి. ఇలా గొంతులోకి పుల్లటి పదార్థాలు రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. సదరు యాసిడ్ గ్యాస్ కారణంగా అన్నవాహిక నుంచి పైకి పయనించడాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఈ యాసిడ్ వల్లనే ఛాతీలో / కడుపులో మంట వస్తుంటుంది. గ్యాస్‌కు కారణమయ్యే ఆహారాలు ఏమిటంటే... కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అవి... పోట్టు ఉండే ఆహారధాన్యాల్లో గోధుమలు, ∙కూరగాయల్లో బ్రాకొలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు, బీన్స్ ∙పండ్లలో పియర్స్, ఆపిల్స్, పానీయాల్లో గ్యాస్ ఎక్కువగా ఉండే సోడాలు, కూల్‌డ్రింక్స్, ∙పాలు, పాల ఉత్సాదనల్లో పెరుగు, ఐస్‌క్రీమ్స్, చీజ్, ∙ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో బ్రెడ్స్ వంటివి తినే వారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ పోవడం ఎక్కువ. అయితే వీటిలో సోడా, కూల్‌డ్రింక్స్ మినహాయిస్తే మిగతావి ఆరోగ్యకరం. కాబట్టి సమస్య రానంత మేరకు వాటిని తగు మోతాదులో తీసుకోవాలి. గ్యాస్ సమస్య తగ్గాలంటే... ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. దీనికోసం తీసుకోవాల్సి జాగ్రత్తలు.. తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి ∙పెదవులు మూసి తినడం మేలు ∙పోగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి ∙సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. మరో సూచన : పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో గ్యాస్, పోట్ట ఉబ్బరం సమస్యను దూరం చేసుకోవచ్చు. కడుపు ఉబ్బరం సమస్యకు సాధారణ పరిష్కారాలు... ∙తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. రోజుకు రెండు మూడు సార్లు ఎక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో 4 నుంచి 6 సార్లు తినడం మేలు ∙ఆహారం పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఇందుకు... పోట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినాలి ∙చేపలు తినేవారు తమ ఆహారంలో చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్లకంటే ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ∙ఎక్కువ కొవ్వుతో ఉండేవి, బాగా వేయించిన ఆహారపదార్థాలను వీలైనంత పరిమితంగా తీసుకోవాలి తినకముందే పాక్షికంగా పులిసే పదార్థాలైన ఇడ్లీ, దోసెల వంటివాటిని (పూరీ, చపాతీల కంటే) మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇలా పులిసేందుకు అవకాశం ఉన్న మజ్జిగ వంటి ఆహారాల్లో జీర్ణవ్యవస్థకు మేలు చేసే ‘్రపో–బయాటిక్’ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అయితే అది పూర్తిగా పులియకముందే తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదని గుర్తుంచుకోవాలి ∙మాంసాహారం తినాలనుకునేవారు వేటమాంసం, రెడ్‌మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉంటే చికెన్‌ను ఎంచుకోవడం అన్నివిధాలా మంచిది. రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. ఇక కాఫీలు, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. కాఫీలు పరిమితంగా తీసుకున్నప్పటికీ, పోగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్ పూర్తిగా మానేయాలి ∙రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి .బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ పేర్కొన్న ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నంత కాలం మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ సమస్యను పెంచేవి ఇవే...ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం ∙సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం తీసుకున్న ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉండటం ∙కొందరిలో పుల్లటి ఆహారాలైన టొమాటో, పులుపు ఎక్కువగా ఉండే నిమ్మ జాతి పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీతో పాటు కొన్నిసార్లు టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంటకు కారణమవుతాయి. ఈ పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
షాడోల్: మధ్యప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణం..
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 10%, డీజిల్ అమ్మకాలు 4.3% పెరిగాయని చమురు మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. జులైలో వంటగ్యాస్ అమ్మకాలు 11%, జెట్ ఇంధన వినియోగం 9% పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పెట్రోల్ డిమాండ్ 7.1%, డీజిల్ డిమాండ్ 1.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో జెట్ ఇంధన విక్రయాలు 11.4%, వంట గ్యాస్ విక్రయాలు 5% పెరిగాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం ఇంధన వినియోగం పెరిగడానికి కారణమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణదేశీయంగా దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ 40% వాటా కలిగి ఉంది. సుదూర రవాణా, మైనింగ్, వ్యవసాయం..వంటి అవసరాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. విమాన ట్రాఫిక్ అధికమవడంతో జులైలో జెట్ ఇంధన డిమాండ్ పెరిగింది. కస్టమర్ల సంఖ్య విస్తరించడం వల్ల వంట గ్యాస్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు రాన్నున్న త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాలు పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. -
బోర్లతో బ్లో అవుట్లు
సాక్షి అమలాపురం : గ్యాస్ పైప్లైన్ల లీకేజీలు.. తద్వారా వెదజల్లే చమురు.. అప్పుడప్పుడూ బ్లో అవుట్లు.. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా–గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లో గ్యాస్, చమురు వెలికితీత కార్యకలాపాలు మొదలైన తరువాత ఈ ప్రాంత వాసులకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి ఇప్పుడు ఆక్వాసాగు తోడైంది.చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉప్పునీటి కోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తుండడం.. వాటి నుంచి గ్యాస్, చమురు వచ్చి మినీ బ్లో అవుట్లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్నిన విషయం తెలిసిందే. అసలు కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకోవడం.. కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని ఆనుకుని దేవర్లంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లో అవుట్ చోటుచేసుకున్నాయి. నగరం గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంవల్ల 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇవికాకుండా.. ఏదోక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. మినీ బ్లో అవుట్లుగా మారిన ఆక్వా బోర్లు..ఆక్వా చెరువుల కోసం తవ్వుతున్న బోర్లు ఇప్పుడు మినీ బ్లో అవుట్లుగా మారిపోయాయి. అధిక ఉప్పు సాంద్రత (సెలైనిటీ) ఉన్న నీటికోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. వీటి ద్వారా గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తున్నాయి. ఇక్కడ భూమిలోని మట్టి పొరల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంది. రైతులు చప్పనీటి సాగు పేరుతో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి అనుమతి పొందుతున్నారు. 30–40 అడుగులు లోతున బోరు బావి తవ్వకాలు చేస్తే సరిపోతుంది. కానీ, ఆక్వా రైతులు అధిక ఉప్పు శాతం ఉన్న నీటి కోసం ఏకంగా 250 నుంచి 300 అడుగుల లోతున తవ్వేస్తున్నారు. దీంతో చాలాచోట్ల దిగువనున్న గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తోంది. బోరు అనుమతిచ్చే సమయంలోనే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు బోరు తవ్వకాలపై పక్కాగా నిఘా పెట్టాల్సి ఉంది. ఇటీవల రాజోలు మండలం శివకోడు వద్ద ఓ ఆక్వా రైతు ఏకంగా 270 అడుగుల లోతున ఉప్పునీటి తవ్వకాలు చేయడంతో గ్యాస్ ఎగదన్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడున్న గ్యాస్ లభ్యతను బట్టి ఒకట్రెండు రోజులు గ్యాస్ ఎగిసిపడుతుంది. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాలు.. గ్రామ శివారుల్లో ఉండే ఆక్వా చెరువులు ఇప్పుడు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇటువంటి చోట గనుక బోరుబావుల నుంచి గ్యాస్ ఎగదన్ని మంటలు వ్యాపిస్తే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. ఆక్వాసాగుతో పైపులైన్లకు దెబ్బ..నిజానికి.. ఆక్వాసాగు పెరగడంవల్ల ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలకు చెందిన పైప్లైన్లు తుప్పుపడుతున్నాయి. ఈ సాగువల్ల భూమిలో ఉప్పుశాతం పెరిగి 25 ఏళ్లు బలంగా ఉండాల్సిన ఈ గ్యాస్ పైప్లైన్లు 15 ఏళ్లకే దెబ్బతింటున్నాయి. అలాగే, సిస్మిక్ సర్వేల పేరుతో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వేలాదిచోట్ల భూమి పొరల్లో బాంబింగ్ చేస్తోంది. వీటిని నిబంధనల మేరకు పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి చోట నిల్వ ఉన్న గ్యాస్ అప్పుడప్పుడు ఎగదన్నుకు వచ్చి మంటలు చెలరేగుతున్నాయి. -
ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్ పైకి ఎగజిమ్మింది. అయితే, మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... రాజోలు మండలంలోని చింతలపల్లి–అరవపాలెం రోడ్డులో కె.విజయేంద్రవర్మ అనే వ్యక్తికి చెందిన ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా నీరు ఎగసిపడింది. విద్యుత్ మోటారు, ఆయిల్ ఇంజన్ వంటివి ఏమీ లేకుండానే బోరు బావి నుంచి నీరు 15 అడుగుల మేర ఎగసిపడుతుండటంతో సమీపంలోని కూలీలు వెళ్లి చూశారు. అయితే, గ్యాస్ వాసన రావడంతో భయాందోళనలకు గురైన కూలీలు వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి సీహెచ్ అనిల్‌కుమార్, సిబ్బంది గ్యాస్ లీక్ అవుతున్న బోరు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బోరు బావి లోపల తీవ్రమైన ఒత్తిడి పెరిగి, నీటితో కలసి గ్యాస్ ఉధృతంగా పైకి వస్తోందని గుర్తించారు. నీటిలో సుమారు ఆరు శాతం గ్యాస్ ఉందని నిర్ధారించారు. బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్ పైకి రాకుండా చేశారు. కొత్తగా బోర్లు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు నీటి కోసం 200 మీటర్ల మేర భూమి లోపలకు బోర్లు వేయడం వల్ల గ్యాస్ పైకి వస్తుందని అనిల్‌కుమార్ చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ శాతం ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. -
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.69 మేర తగ్గిస్తూ కీలక ప్రకటన చేశాయి. నేటి నుంచే (జూన్ 1వ తేదీ) ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. -
ఆ మహిళ గ్యాస్ సేవింగ్ టెక్నిక్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఒకేసారి..
ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. అందుకోసం అని మధ్యతరగతి మహిళలు ఎన్నో పాట్లు పడుతుంటారు. గ్యాస్ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చెయ్యరు. అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే..అంతా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఇక్కడొక మహిళ గ్యాస్‌ని ఆదా చేస్తూ ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. అబ్బా..! ఇలా కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చా అనుకుంటారు. ఏం జరిగిందంటే..ఓ మహిళ గ్యాస్ ఆదా చేసేలా వండిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో ఆ మహిళ పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్ చేసేంది. ఈ ఐడియాని చూసి నెటిజన్లు ఆమెది ఏం తెలివి అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..?. ఏం లేదండి ఓ స్టీల్ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. View this post on Instagram A post shared by Rekha Sharma (@rekha_sharma.001) (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
భారీ పెట్టుబడులకు వేదాంతా సై
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ ప్రయివేట్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ వివిధ బిజినెస్‌లలో 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు. పైప్‌లైన్‌లో 50 యాక్టివ్ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనిల్ సోదరుడు, కంపెనీ వైస్‌చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్ డాలర్ల అదనపు టర్నోవర్‌కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు. -
చైనాలో భారీ పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. 🚨🇨🇳 BREAKING: HUGE EXPLOSION IS REPORTED IN YANJIAO, CHINA The explosion happened in a building. There's no immediate report on casualties.pic.twitter.com/XylJsBuLUW — Mario Nawfal (@MarioNawfal) March 13, 2024 భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు మొదలు పెట్టింది. #BREAKING- Large explosion damages multiple buildings in Yanjiao, China. No word on injuries at this time.#explosion #China #Yanjiaopic.twitter.com/lQ6UMCTv30 — Chaudhary Parvez (@ChaudharyParvez) March 13, 2024 ఇదీ చదవండి.. అట్లాంటా గ్యాస్ స్టేషన్లో దోపిడీ -
సిలిండర్ నుంచి మంటలు.. ఆపద్బాంధవుడు వచ్చి..
‘జ్ఞానం ఉంటే సరిపోదు.. అనుభవం ఉండాలి’ అని చాలామంది అంటుంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌ను తీసుకువెళుతుండటాన్ని చూడవచ్చు. మరి ఆ తరువాత ఏం జరిగిందంటే.. అకస్మాత్తుగా ఆ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి మంటలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా ఆ మంటలు చల్లారవు. దారినపోయేవారు కూడా ఆ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే ఎట్టకేలకు ఒక వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి, మంటలను అదుపులోకి తీసుకువస్తాడు. వీడియోలో ఉన్న కంటెంట్ గమనిస్తే.. ఒక వ్యక్తి సిలిండర్ నుంచి మంటలు రాగానే సైకిల్‌ను పక్కన పడేసి, ఆపై మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. మరో నలుగురు కూడా అక్కడికి వచ్చి, సిలిండర్‌పై నీళ్లు చల్లడం మొదలుపెడతారు. అయితే మంటలు అంతకంతకూ పెరుగుతుంటాయి తప్ప చల్లారవు. దీంతో ఆ సిలిండర్‌ను పక్కనే ఉన్న చెరువులో ముంచుతారు. అయినా ఆ మంటలు చల్లారవు. దీంతో ఆకుల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు వారంతా ప్రయత్నిస్తారు. అయినా మంటలు ఆరిపోకపోవడంతో వారంతా కూలబడతారు. అప్పుడు అక్కడికి ఆపద్బాంధవునిలా వచ్చిన ఒక వ్యక్తి తన తెలివితేటలను ప్రదర్శిస్తాడు. చేతిలో తడి సంచితో వచ్చిన అతను దానిని సిలిండర్‌పైన కప్పుతాడు. దీంతో నిప్పుకు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోతుంది. అంతే ఆ సిలిండర్లోని మంటలు ఆరిపోతాయి. @ScienceGuys_ అనే పేరు గల ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. Experience is stronger than knowledge. 👍pic.twitter.com/OtXvLhjvYQ — Science (@ScienceGuys_) March 1, 2024 -
Alabama: తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అలబామా: మరణ శిక్షల్లో అమెరికా కొత్త రికార్డు సృష్టించింది. అమెరికా చరిత్రలోనే అలబామా రాష్ట్రంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వాడి ఊపిరాడకుండా చేసి ఒక వ్యక్తికి మరణ శిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషి అయిన కెన్నెత్ యూజెన్ స్మిత్(58) ఊపిరితిత్తుల్లోకి ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్‌ను పంపి శిక్ష అమలు చేశారు. గురువారం రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో స్మిత్ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు చేసే విధానంపై అమెరికాలో వివాదం నడుస్తోంది. ఇది పూర్తి మానవీయతతో కూడిన శిక్ష అని ప్రభుత్వం చెబుతుండగా విమర్శకులు మాత్రం నైట్రోజన్ గ్యాస్‌తో మనిషిని చంపడం క్రూరమైన ప్రయోగం అని మండిపడుతున్నారు. అమెరికాలో సాధారణ మరణశిక్ష అమలు విధానం అయిన విషపు ఇంజెక్షన్‌తో స్మిత్‌కు ఇంతకుముందే శిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అతడి ఐవీ లైన్ కనెక్ట్ కాకపోవడంతో శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేశారు. నైట్రోజన్ గ్యాస్‌తో తనను చంపడంపై స్మిత్ వేసిన అప్పీల్‌పై యూఎస్ అప్పీల్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోవడంతో శిక్ష అమలు ఖాయమైంది. ఇదీచదవండి.. విక్టోరియా బీచ్‌లో ప్రమాదం... నలుగురు భారతీయులు మృతి -
ఓఎన్జీసీ చేతికి 7 బ్లాకులు.. చమురు నిక్షేపాల తవ్వకాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్‌పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్‌యూ ఆయిల్ ఇండియా, సన్పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి. చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్‌పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్‌పీ–9వ రౌండ్ బిడ్డింగ్‌కు తెరతీసినట్లు తెలియజేశారు. తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్‌ఏపీ–8వ రౌండ్‌కు బిడ్డింగ్‌ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్‌ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్‌ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ తీరిలా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్‌లోని లోతైన సముద్రగర్భ బ్లాక్‌కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్‌పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి. చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. -
గోబర్.. గాభరా !
ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్లొచ్చాయిగానీ కొన్నాళ్లు ‘గోబర్ గ్యాస్’ (పశువుల పేడతో తయారైంది) కూడా ఓ వెలుగు వెలిగింది! గ్రామాల్లో పశు సంపద అధికంగా ఉండే ఇళ్లలో వీటిని బాగానే ఆదరించారు. చిన్నపాటి బావి లాంటి గుండ్రటి ఇనుప డ్రమ్ముల్లో నిల్వ చేసిన పేడ కరగడం ద్వారా నెమ్మదిగా మీథేన్ విడుదలవుతుంది. దీన్ని పైపు ద్వారా తరలించి వంటకు వినియోగించడం తెలిసిందే. అంత చాకిరీ చేసే ఓపిక లేకపోవడంతో కాల క్రమంలో గోబర్ గ్యాస్ కనుమరుగైంది. అలా వంటకు ఉపయోగపడ్డ మీథేన్ ఇప్పుడు వాతావరణంలో మంటకు కూడా కారణమవుతోంది!! – పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ వాహనాల పొగ, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లకు మించి పశువుల నుంచి వెలువడే గ్యాస్ భూతాపానికి దారి తీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో, వాటి వ్యర్థాల నుంచి వెలువడే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి. ఎంత ఆలస్యంగా జీర్ణం అయితే అంత ఎక్కువగా గ్యాస్ విడుదల అవుతుంది. కాబట్టి వాటికి తేలిగ్గా జీర్ణమయ్యే, సహజ సిద్ధమైన ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నైట్రస్ఆక్సైడ్.. నిప్పుల కొలిమి కార్బన్డయాక్సైడ్ కంటే మీథేన్ గ్యాస్ 28 రెట్లు అధికంగా భూ తాపానికి కారణమవుతోంది. నిల్వ చేసిన పశువుల పేడ నుంచి అధిక మోతాదులో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కంటే దాదాపు 265 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కటానికి దారి తీస్తోంది. పశువులు తీసుకునే ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి కొంతవరకూ కారణం. ప్రస్తుతానికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టలేకున్నా మెరుగైన యాజమాన్య పద్ధతులు, పాల దిగుబడిని పెంచుకోవడం, దాణాలో కొన్ని రకాల మందులను చేర్చడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యంగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా ఊపందుకుంటోంది. సౌర విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది. సమతుల్య ఆహారంతో.. అమెరికాలోని హోల్స్టీన్ ఆవులతో పోలిస్తే మన దేశంలో సంకర జాతికి చెందిన పశువులు 4.8 శాతం అధికంగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇక దేశవాళీ ఆవులు 11.8 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టేందుకు 2030 నాటికి మీథేన్ఉద్గారాలను 11–30 శాతం వరకు నియంత్రించాలని, 2050 నాటికి 24–47 శాతం వరకు కట్టడి చేయాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సూచించింది. 3 ఎన్వోపీ (నైట్రాక్సీ ప్రొఫెనాల్)ను పశువులకు అందించే దాణాలో కలపడం ద్వారా మీథేన్ ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతున్నట్లు కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్(సీజీఐఏఆర్) తాజా నివేదిక వెల్లడించింది. పశువుల ఆరోగ్యానికి ఇది సురక్షితమేనని సూచించింది. సంతులిత (సమతుల్య) ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కూడా 15 శాతం దాకా ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని మరో సర్వే తెలిపింది. 98 శాతం మీథేన్ వీటి నుంచే 1. వ్యవసాయం 2. ఆయిల్ అండ్ గ్యాస్ 3. బొగ్గు తవ్వకాలు 4. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) 5. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ (వ్యర్థ జలాల నిర్వహణ) స్వల్పంగా పెరిగినా మంటలే! ♦ మీథేన్ ఎంత ఎక్కువగా విడుదలైతే పుడమి అంత అధికంగా వేడెక్కుతుంది. ♦ ఉష్ణాన్ని బంధించి ఉంచే శక్తి కారణంగా మీథేన్ శాతం స్వల్పంగా పెరిగినావాతావరణంలో భారీ మార్పులకుదారి తీస్తుంది. ♦ పశువులు తీసుకునే ఆహారం మీథేన్ విడుదలను ప్రభావితం చేస్తుంది.ఎక్కువ మొత్తంలో తీసుకోవడం, నాసిరకం మేతను ఇవ్వడం మీథేన్ విడుదలను పెంచుతుంది. ♦ పశువుల ఆరోగ్యానికి చేటు చేయకుండా మీథేన్ విడుదలను నియంత్రించే టీకాపై న్యూజిలాండ్ పరిశోధన చేస్తోంది. ♦ బ్రోమోఫార్మ్ లాంటివి పశువుల శరీరంలోని బ్యాక్టీరియా మీథేన్ ఉత్పత్తి చేయటాన్ని 65 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా దీని వాడకానికి సంబంధించి పలు సందేహాలున్నాయి. పశువుల శరీరంలోకి చేరిన శైవలాలు (ఆల్గే) వాటి పాలు, మాంసం ద్వారా మనుషుల దేహంలోకి ప్రవేశించి థైరాయిడ్ గ్రంథి పనితీరును అస్తవ్యస్థం చేసే ప్రమాదం ఉందనే వాదనలున్నాయి. అందువల్లే అన్ని రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేయడం లేదు. సంక్లిష్ట జీర్ణ ప్రక్రియ.. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వాటిలో జీర్ణ ప్రక్రియ కొంత సంక్లిష్టంగా పొట్ట నాలుగు అరలుగా (రూమినెంట్స్) ఉంటుంది. పీచు పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్లీ నోటిలోకి తీసుకొచ్చి నెమరు వేస్తాయి. తిన్న ఆహా రం కిణ్వ ప్రక్రియకు (పులవడం) గురైనప్పుడు మీథేన్ విడుదలవుతుంది. ఇది నోటి ద్వారా త్రేన్పులు రూపంలో, అపాన వాయువు రూపంలో వెలువడుతుంది. ఎంత తక్కువ సమయంలో ఆహారం జీర్ణం అయితే మీథేన్ ఉత్పత్తి అంత తగ్గిపోతుంది. బోవర్, రెడ్సీ వీడ్, అగోలిన్, ఒరిగానో లాంటి వాటిని పశువుల మేత, దాణాలో కలిపి ఇవ్వడం ద్వారా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఎఫ్‌డీఏ ఆమోదించిన నైట్రాక్సీ ప్రొఫనాల్ను దాణాలో కలపడం వల్ల మీథేన్ శాతం బాగా తగ్గుతుంది. జొన్నలు, సజ్జలు తగినంత మోతాదులో అందిస్తే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వాలి. ఇక పశువుల ఎరువును సరైన విధంగా నిల్వ చేయనప్పుడు నైట్రస్ ఆక్సైడ్ పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. యాసిడ్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు పేడను ఆర్గానిక్ ఆమ్లాలుగా మారుస్తాయి. మీథేన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు దీన్ని మీథేన్, కార్బన్‌డయాక్సైడ్‌గా మారుస్తాయి. గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాతావరణం వేడెక్కడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పశువులకు సహజ సిద్ధమైన మేత, దాణా అందిస్తూ పాల దిగుబడి పెరిగేలా నాణ్యమైన జాతులను సాకాలి. -
Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
ఢిల్లీ: లోక్‌సభ లోపలికి ఆగంతకులు ప్రవేశించి బుధవారం గందరగోళం సృష్టించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు. అసలు ఏంటి ఈ గ్యాస్ క్యానిస్టర్లు? ఎక్కడ ఉపయోగిస్తారు? Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 గ్యాస్ క్యానిస్టర్ల అంటే..? గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని బహిరంగంగా ఉపయోగించేందుకు చట్టబద్ధత ఉంది. సినిమాలు, ఫొటోషూట్లలో పొగ తెరలను సృష్టించడానికి, మిలిటరీ విభాగాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి వాడుతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను సైనిక ఆపరేషన్లలో వాడతారు. దట్టమైన పొగ తెరలను సృష్టించడం ద్వారా దళాల కదలికలు అస్పష్టంగా మారుతాయి. తద్వారా శత్రువుల కంటపడకుండా కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో దోహదం చేస్తాయి. గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. నిందితుల వివరాలు.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. ఈ కుట్ర వెనుక మరో కీలక సూత్రదారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టారు. "Main conspirator someone else" in Parliament security breach: Police sources Read @ANI Story | https://t.co/A1Tn7NerpO#ParliamentSecurityBreach #India #Delhi pic.twitter.com/qSRwgdGVPB — ANI Digital (@ani_digital) December 14, 2023 ఇదీ చదవండి: Parliament Issue: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి -
భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. 1984, డిసెంబర్ 2,3 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ గ్యాస్ లీక్ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రజలు నాటి ఘటన మిగిల్చిన విషాదాన్ని దిగమింగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ ఉదంతపు గాయాలు 39 ఏళ్లు గడిచినా మానలేదు. ఈ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతిచెందారు. వారి పిల్లలు, మనుమలు ఇప్పటికీ ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం ఎందుకూ సరిపోలేదు. నాడు గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో విషపూరిత వ్యర్థాలు నేటికీ కనిపిస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ దుర్ఘటనకు బలై, న్యాయ పోరాటానికి దిగిన చాలామంది ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ ఉదంతంలో బాధ్యులను శిక్షించాలనే అంశం ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 15 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దరిమిలా నగరం మృతదేహాలతో నిండిపోయింది. 1979లో మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి కోసం ఇక్కడ ఒక కర్మాగారం ఏర్పాటయ్యింది. అయితే ఈ పరిశ్రమ యాజమాన్యం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి ఫ్యాక్టరీలోని ఏ 610 నంబర్ ట్యాంక్‌లో నీరు లీకైంది. మిథైల్ ఐసోసైనేట్లో నీరు కలవడంతో ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగింది. ఆ తర్వాత విషవాయువు వాతావరణంలోకి వ్యాపించించింది. 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ వాయువు నగరమంతటా వ్యాపించింది. ఈ విషవాయువుల బారినపడి 15 వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు కూడా విష వాయువు ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వైకల్యం రూపంలో వారిని, వారి తరాలను వెంటాడుతోంది. ఈ విష వాయువు ప్రభావంతో మరణించిన వారి అధికారిక సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. అధికారిక మరణాల సంఖ్య మొదట్లో 2259గా నివేదించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 3,787 మంది గ్యాస్ బారిన పడినట్లు నిర్ధారించింది. ఇతర అంచనాల ప్రకారం ఎనిమిది వేల మంది మరణించారు. మరో ఎనిమిది వేల మంది గ్యాస్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు? -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర!
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. నేటి నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.21 పెంచాయి. నేటి నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50గా ఉంది. నవంబర్ 16న దీని ధర తగ్గించడంతో రూ.1775.50గా ఉండేది. నేటి నుంచి ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1749, కోల్‌కతాలో రూ.1885.50, చెన్నైలో రూ.1968.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్ల ఆహార విక్రయాలపై ప్రభావం చూపనుంది. అయితే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సిలిండర్ ఢిల్లీలో రూ.903కి అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 ధరలకు లభిస్తోంది. ఇది కూడా చదవండి: అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే! -
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం తీపికబురు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధి దారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 గతంలో రూ.200 ఇప్పుడు.. గతంలో కేంద్రం పీఎంయూవై పథంలోని లబ్ధి దారులు గ్యాస్ సిలిండర్‌పై రూ.200 రాయితీ అందించేది. ఇప్పుడు మరో రూ.100 పెంచింది. దీంతో ఇంతకు ముందు ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.703 ఉండగా, తాజాగా, కేంద్రం నిర్ణయంతో పీఎంయూవై పథకం కింద సిలిండర్ ధర రూ.603కే లభ్యమవుతుంది. రూ.1650 కోట్లు విడుదల గత నెలలో కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను అందించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1,650 కోట్లను విడుదల చేసింది. ఉజ్వల కనెక్షన్ పెంపుతో పీఎంయూవై పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 10.35 కోట్లకు పెరిగింది. -
మనుషులు ఇలా కూడా ఉంటారా? గ్యాస్ లైటర్ సాయంతో రింగురింగుల జుట్టు..
పార్లర్‌కు వెళ్లడం ఖర్చుతో కూడిన పని. అందుకే అమ్మాయిలు/మహిళలు కొన్నిసార్లు ఇంట్లోనే హెయిర్ స్టైలింగ్, ఫేషియల్, ఫేస్ మసాజ్ లాంటి అందాలను ఇనుమడింపజేసే ప్రక్రియలను చేసుకుంటుంటారు. అయితే తాజాగా ఒక భర్త తన భార్యకు రింగురింగుల జుట్టును తీర్చిదిద్దేందుకు ఒక విచిత్రమైన విధానాన్ని అనుసరించాడు. దీనిని చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో @Madan_Chikna హ్యాండిల్లో పోస్ట్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 6 వేలకు పైగా వ్యూస్, లెక్కకుమించిన లైక్స్ వచ్చాయి. పలువురు యూజర్స్ ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రమాదకరమని కొందరు అంటున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై ‘గ్యాస్ లైటర్’లోని మెటల్ భాగాన్ని వేడి చేయడం చూడవచ్చు. తరువాత ఆ వేడిచేసిన లైటర్ సాయంతో భార్య కురులను రోల్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్ని సెకెన్ల అనంతరం అతను ఆమె జుట్టును లైటర్ నుంచి వేరు చేసినప్పుడు, ఆ జుట్టు రింగురింగులుగా మారాడాన్ని గమనించవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఈ విధానం చాలా ప్రమాదకరమని, డబ్బు ఆదా చేయడమనే పేరుతో జుట్టుతో ఆడుకోవడం సరైదని కాదని సూచిస్తున్నారు. సరదాకి కూడా ఇలాంటివి చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని Showed this reel to my wife and she said yeh toh kuch bhi nahi hai and gave five similar examples how more precisely we used to do this 😲 pic.twitter.com/2h0PaZW4UA — Godman Chikna (@Madan_Chikna) September 15, 2023 -
విష వాయువు పీల్చి.. అయిదుగురు కార్మికులు మృతి
మొరెనా: ఫ్యాక్టరీలోని ట్యాంక్ నుంచి వెలువడిన విష వాయువు పీల్చిన ముగ్గురు సోదరులు సహా మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ధనేలలో ఉన్న సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలోని ట్యాంకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో విష వాయువు లీకేజీ మొదలయింది. ట్యాంకు లీకేజీని పరిశీలిస్తుండగా మొదట ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరో ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ అయిదుగురూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. మృతులంతా అక్కడికి సమీపంలోని టిక్టోలి గ్రామస్తులని చెప్పారు. ఘటన అనంతరం ఫ్యాక్టరీ నుంచి కార్మికులందరినీ ఇళ్లకు పంపించివేశారు. -
రాఖీ పౌర్ణమికి కేంద్రం అతిపెద్ద కానుక!
రాఖీ పౌర్ణమికి కేంద్రం అతిపెద్ద కానుక! గ్యాస్‌పై రూ.200 తగ్గించిన కేంద్రం -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
వంటగ్యాస్ సిలిండర్ లీక్...ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం దోమలగూడలోని రోజ్ కాలనీలో విషాదాన్ని నింపింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన పద్మ వచ్చే ఆదివారం బోనాల పండగ కోసం పద్మారావు నగర్లో నివసించే కూతురు ధనలక్ష్మి, అల్లుడు శ్యామ్, మనవరాలు శరణ్య, మనవళ్లు అభినవ్, విహాన్లను ఇంటికి తీసుకువచ్చింది. ఎల్బీనగర్కు చెందిన సొంత చెల్లెలు నాగమణి, మరిది ఆనంద్‌ను కూడా పండగకు ఆహ్వానించింది. వీరిలో అల్లుడు శ్యామ్ మినహా మిగతా వారంతా ఒకే ఒక చిన్న గదిలో ఉన్నారు. మంగళవారం పిండి వంటలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్టవ్‌ను వెలిగించడంతో గ్యాస్ లీకై ంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి గది అంతటా వ్యాపించాయి. పొగ వ్యాపించింది. గదిలోని ఏడుగురు మంటల్లో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు. సాహసం చేసిన స్థానికులు.. గదిలోంచి అరుపులు రావడంతో సమీపంలో నివసించే గోవిందరావు అనే వ్యక్తి మరో ఇద్దరు యువకులతో కలిసి లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంతో బయటకు తీసుకువచ్చారు. లేనిపక్షంలో ఏడుగురూ మంటల్లో మసైపోయేవారని స్థానికులు చెప్పారు. అప్పటికే గదిలోని దుస్తులు, పరుపులు చాలా వరకు కాలిపోయాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఏడుగురిని స్థానికులు గదిలోంచి బయటకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు. దోమలగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని బాధితులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ ఇన్చార్జి అనిల్‌కుమార్ యాదవ్, నగేష్ ముదిరాజ్, కార్పొరేటర్ రచనశ్రీ, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు సందర్శించారు. గాయాలతో గాంధీ ఆస్పత్రిలో.. వంట గ్యాస్ లీకేజీ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన వేడి గాలులను పీల్చడంతో శ్వాసకోశ నాళాలు, గుండె, ఇతర అంతర్గత అవయవాలు దెబ్బ తిన్నాయని చెప్పారు. పద్మ 40 శాతం, ధనలక్ష్మి 60, అభినవ్ 50, శరణ్య 30, విహాన్ 40, ఆనంద్ 36, నాగమణి 60 శాతం కాలిన గాయాలతో పీఐసీయూ, టీఎంటీ, బర్న్స్ వార్డుల్లో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గాయపడిన చిన్నారులకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించామన్నారు. టీఎంటీలో నలుగురు క్షతగాత్రులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వివరించారు. -
రిలయన్స్ ఎంజే క్షేత్రం నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: కేజీ–డీ6 బ్లాక్‌లోని ఎంజే చమురు, గ్యాస్ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెల్లడించాయి. ఈ బ్లాక్‌లోని మరో రెండు క్షేత్రాలైన ఆర్–క్లస్టర్ నుంచి 2020 డిసెంబర్లో, శాటిలైట్ క్లస్టర్ నుంచి 2021 ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఎంజే క్షేత్రం గరిష్ట స్థాయికి చేరినప్పుడు కేజీ–డీ6 బ్లాక్‌లోని మొత్తం మూడు క్షేత్రాల నుంచి రోజుకు 30 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కాగలదని రిలయన్స్–బీపీ తెలిపాయి. ఇది దేశీయంగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో సుమారు మూడో వంతు ఉంటుందని, డిమాండ్‌లో 15 శాతానికి సరిపోవచ్చని పేర్కొన్నాయి. ఎంజే క్షేత్రంలో కనీసం 0.988 టీసీఎఫ్ గ్యాస్ ఉంటుంది. -
అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు ఎప్పుడిస్తారో..?
కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లపై ఆర్థికభారం పడుతోంది. బిల్లుల మంజూరు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సివస్తోంది. ప్రతి నెలా వచ్చిన వేతనంలో సగానికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. కేంద్రాల నిర్వహణకు అద్దె చెల్లింపులు, గ్యాస్, ఈవెంట్, కూరగాయలు, పోషణ్ అభియాన్, స్టేషనరీ తదితర ఖర్చులు నెలకు సుమారు రూ. 6 వేలకు పైగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 1,434, మినీ కేంద్రాలు 626.. మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి గ్యాస్ బిల్లు రూ.1200, ప్రతి నెలా 15 రోజులకు ఒక ఈవెంట్ చొప్పున రెండు ఈవెంట్లకు రూ.500, నెలకు సరిపడా కూరగాయలు రూ.600, మీటింగ్‌కు రూ.300, స్టేషనరీ ఖర్చులు ఏడాదికి రూ.1000తో పాటు పోషణ్ అభియాన్‌కు రూ.100ల చొప్పున నెలకు మొత్తం రూ.6,200 ఖర్చవుతోందని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అద్దె భవనాల్లో 785 కేంద్రాలు కొనసాగుతుండగా అద్దె బకాయి విడుదల చేయడం లేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు అద్దె నెలకు ప్రాంతాన్ని బట్టి రూ. 600, రూ.1500, రూ.2 వేలు. రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణపై ప్రభావం అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్‌కు సంబంధించి రూ.1,200 చొప్పున మూడు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈవెంట్ బిల్లులు 5 నెలకు రూ.2,500 చెల్లించాల్స ఉంది. ఆరోగ్యలక్ష్మి బిల్లు 3 నెలలుగా చెల్లించడంలేదు. కూరగాయల బిల్లు నెలకు రూ.600 చొప్పున ఏడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో 785 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఏరియాను బట్టి రూ.600 నుంచి రూ.3 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం 8 నెలలుగా అద్దె బకాయి చెల్లించడంలేదు. మీటింగ్ ఖర్చులు కూడా ఏడాది నుంచి ఇవ్వడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏడాదికాలంగా బకాయిలు చెల్లించకుండా ఉంటే తాము కేంద్రాలను ఎలా నడపాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పైప్‌లైన్ గ్యాస్ లీక్
-
కాబోయే జంటపై గ్యాస్ గీజర్ పంజా.. బాత్రూమ్లో స్నానం చేస్తూ..
కర్ణాటక: కొద్దిరోజుల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతీ యువకుని పాలిట బాత్రూంలోని గ్యాస్ గీజర్ మృత్యువులా విరుచుకు పడింది. గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరులోని చిక్కజాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఉద్యోగం, సహజీవనం చేస్తూ.. వివరాలు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే కు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లా గోకాక్ నివాసి సుధా రాణి (22) మృతులు. వీరిద్దరూ నగరంలోని గోల్ఫ్ హోటల్లో పనిచేసేవారు. చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటూ సహ జీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 10 తేదీ శనివారం ఉదయం ఇద్దరూ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి గ్యాస్ గీజర్ ఆన్‌చేసి ఇద్దరూ బాత్రూమ్లో స్నానం చేయడానికి వెళ్లి బాత్రూమ్ కిటికీ మూశారు. స్నానం చేస్తున్న సమయంలో గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ కావడంతో ఇద్దరూ స్పహతప్పి పడిపోయారు. కొంతసేపటికి మృతి చెందారు. డ్యూటీకి రాకపోవడంతో ఆదివారం ఇద్దరూ డ్యూటీకి రాకపోవడంతో స్నేహితులు వీరి మొబైల్‌కు ఫోన్ చేయగా స్పందన లేదు. అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి చిక్కజాలపోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ బాత్రూంలో శవాలై ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి తరువాత వారి కుటుంబాలకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 507 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 121 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు రెట్టింపై రూ. 2988 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,587 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 973 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 100 శాతం వృద్ధికాగా.. 2021–22లో రూ. 489 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు మొత్తం ఆదాయం రూ. 5,548 కోట్ల నుంచి రూ. 8,633 కోట్లకు జంప్ చేసింది. ఇంధన విక్రయాలు 58 శాతం పుంజుకుని 14,880 మిలియ న్ యూనిట్లకు చేరాయి. సామర్థ్య విస్తరణ ఇందుకు సహకరించింది. గతేడాది 2,676 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. వినీత్ ఎస్.జైన్ 2023 మే 11 నుంచి ఎండీగా కొనసాగనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం బలపడి రూ. 977 వద్ద ముగిసింది. అదానీ గ్యాస్ లాభంలో వృద్ధి పట్టణాల్లో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ సేవలు అందించే అదానీ టోటల్ గ్యాస్, మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.98 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన రూ.81 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి చెందింది. విక్రయాల పరిమాణం 2 శాతం పెరిగి 193 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్లుగా ఉంది. కొత్తగా 126 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో మొత్తం సీఎన్జీ స్టేషన్ల సంఖ్య 460కు చేరుకుంది. పైపుల ద్వారా గ్యాస్ అందించే కనెక్షన్ల సంఖ్య 1.24 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు 7.04 లక్షలకు చేరాయి. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లు 7,435కు పెరిగాయి. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.4,683 కోట్ల ఆదాయంపై రూ.546 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
గ్యాస్ వినియోగదారులకు ఊరట..
సీఎన్జీ, వంట గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం కేంద్రమంత్రి వర్గం తీసుకోబోతోంది. దేశంలో ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలపై పరిమితిని విధించడాన్ని కేంద్ర మంత్రివర్గం త్వరలో పరిశీలించే అవకాశం ఉందని తెలిసింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలను ప్రభుత్వం ద్వైవార్షికంగా అంటే ఏటా రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఈ సహజవాయువును వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీగా, వంట గ్యాస్‌గా, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు, ఎరువుల తయారీకి వినియోగిస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. దేశంలో ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇదివరకే అందుబాటులో ఉన్న క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్ ధర అయితే ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)కు 8.57 డాలర్లు (రూ.705), సముద్ర గర్భంలో కొత్తగా కనుగొన్న కష్టతరమైన క్షేత్రాల నుంచి తీసే గ్యాస్ అయితే 12.46 డాలర్లు (రూ.1,026)కు చేరింది. ఈ ధరలను వచ్చే నెల ఏప్రిల్ 1న సవరించాల్సి ఉంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం లెగసీ ఫీల్డ్‌ల నుంచి వెలికితీసే గ్యాస్ ధరలు ప్రతి ఎంఎంబీటీయూకు 10.7 డాలర్లు (రూ.881)కు పెరుగుతాయని, కష్టతరమైన ఫీల్డ్‌ల నుంచి వచ్చే గ్యాస్ ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. సీఎన్జీ, వంట కోసం వినియోగించే పైప్డ్ గ్యాస్ రేట్లు ఇప్పటికే 70 శాతం పెరిగాయి. ఏప్రిల్ 1న సవరణ జరిగితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు వినియోగదారులు, అటు ఉత్పత్తిదారులు ఇద్దరి ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ గ్యాస్ ధరల సవరణను పరిశీలించడానికి కిరిట్ పారిఖ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గత సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మిగులు దేశాలలో గ్యాస్ ధరలను వాటి సహజవాయువు ధరను నిర్ణయించే ప్రస్తుత పద్ధతికి బదులుగా లెగసీ ఫీల్డ్‌ల నుంచి గ్యాస్ ఇండెక్సేషన్‌ను బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలలో 10 శాతానికి మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది. ఒక ఎంఎంబీటీయూకు కనిష్ట ధర 4 డాలర్లు (రూ.329), గరిష్ట ధర 6.50 డాలర్లు (రూ.535) ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75 డాలర్లు ఉంది. దాని ప్రకారం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకు 7.5 డాలర్లు (రూ.617) ఉండాలి. కానీ పరిమితి అమలైతే గ్యాస్ ధర 6.5 డాలర్లు (రూ.535) మాత్రమే ఉంటుంది. కమిటీ సిఫార్సులపై మంత్రిత్వ శాఖల అంతర్గత సంప్రదింపులు ముగిశాయి. ఈ సిఫార్సులను కేబినెట్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గం దీనిని పరిశీలించే అవకాశం ఉంది. -
ఇరాన్లో ‘బాలికలకు విషం’...
దుబాయ్: ఇరాన్లో ను విద్యకు దూరం చేసేందుకు వారి స్కూళ్లపైకి విష వాయువులు వదులుతున్న ఉదంతాలపై యునెస్కో ఆందోళన వెలిబుచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది. స్కూళ్లలో బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని సూచించింది. ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను తన మనసును తీవ్రంగా కలచివేస్తున్నాయని యునెస్కో సారథి ఆద్రే అజౌలే అన్నారు. -
వందల ఏళ్లుగా భూగర్భంలో ‘సేఫ్టీ ల్యాంప్’.. అసలు దీని కథేంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భంలో పనిచేసే గని కార్మికులకు ప్రాణదీపంగా వందల ఏళ్ల నుంచి సేప్టీల్యాంప్ రక్షణ వెలుగులను పంచుతోంది. బొగ్గు గనుల్లో కాలక్రమేణా అనేక ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఈ బత్తిదీపం ప్రాధాన్యత నేటికీ తగ్గడం లేదు. ఈ దీపం ఆవిష్కరణకు ముందు పలువురు భూగర్భంలోనే విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ దీపం రాకతో గనుల్లో రక్షణ ప్రమాణాలు మెరుగయ్యాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు గాలితో నిత్యం ఆక్సిడేషన్ జరిపి స్వయంగా నిప్పు రాజేస్తుంది. అలా బొగ్గు మండినప్పుడు మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు వెలువడుతాయి. ఆ సమయంలో కార్మి కులు పనిచేస్తే శ్వాస సమస్య ఏర్పడి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రమాద పరిస్థితులను ముందే గుర్తించేందుకు పూర్వం కెనరీ పక్షులను పంజరాల్లో భూగర్భంలోకి తీసుకెళ్లేవారు. పక్షిరెక్కలు కొట్టుకోవడం, కదలికల ఆధారంగా వాయువులను గుర్తించేవారు. ప్రతిసారీ పక్షులను బంధించి గనిలోకి తీసుకెళ్లడం, రావడంతో అవి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోయేవి. బ్రిటన్ కు చెందిన హంప్రి డేవీ 1815లో బొగ్గు గనుల్లో రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్‌ను కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల్లో విషవాయువులను గుర్తించడంలో సమర్థంగా పనిచేయడంతో ఈ ల్యాంప్ ప్రామాణికంగా మారింది. ఎలా పని చేస్తుందంటే.. ‘వైర్ గాజేస్’సూత్రంతో పనిచేసే ఈ సేప్టీ ల్యాంప్ 2.5 కిలోల బరువు, 10 సెం.మీ. పొడవు ఉంటుంది. మంట వెలిగేందుకు కిరోసిన్/పెట్రోల్‌ను వాడతారు. ఇది బానేట్, ఇనుప జాలీలు, వాషర్, గ్లాసు, చెక్నట్, నూనె బుడ్డితో నిర్మితమై ఉంటుంది. ఈ ల్యాంప్‌ను గనిలోకి ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు తీసుకెళ్లి బొగ్గు తీసే ముందు అక్కడి వాయువుల శాతాన్ని పరీక్షిస్తారు. మీ«థేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల శాతాన్ని తెలుసుకుంటారు. పనిచేసేందుకు అనువుగా ఉంటే ఉత్పత్తి మొదలుపెడతారు. మొదట గనుల్లోకి సాధారణ స్థాయిలో మంట వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్న దీపాన్ని వాయువులు తాకగానే మంటలో మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు మీథేన్ ఒక శాతం ఉంటే 0.10 అంగుళాల ఎత్తుతో మంట పక్కవైపులకు వెలుగుతూ కనిపిస్తుంది. 1.5 శాతం ఉంటే 0.15 ఇంచు ఎత్తులో మంట టోపీ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా ఎరుపు, నీలిరంగు మంటల కదలికలు, కనిపించే ఆకారాలను బట్టి అక్కడ మీథేన్ గ్యాస్ ఏ మోతాదులో ఉందో గుర్తిస్తారు. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే మంట ఆరిపోతుంది. ఇలా ఆ వాతావరణంలో పైన, కింద, వివిధ ఎత్తుల్లో దీపంతో పరిశీలిస్తారు. ప్రస్తుతం గనుల్లో 1.25 శాతం మీథేన్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మి కులను అలర్ట్ చేసి బయటకు పంపుతున్నారు. సింగరేణివ్యాప్తంగా జీఎల్–50, జీఎల్–60 రకం ల్యాంప్‌లను వాడుతున్నారు. జీఎల్–60లో ఒకవేళ మంట ఆరిపోతే తనంతట తానే వెలుగించుకొనే సాంకేతికత ఉంది. వాయువులను గుర్తించేందుకు డిజిటల్ పరికరాలైన మీౖథెనోమీటర్, ఆక్సీమీటర్, మల్టీడిటెక్టర్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కోసారి ఈ పరికరాలు భూగర్భంలో సాంకేతిక సమస్యలతో పని చేయకపోవచ్చు. కానీ సేఫ్టీ ల్యాంప్ మాత్రం 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. దీంతో నేటికీ ఈ దీపం వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అధికారులు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ల్యాంప్ నిర్వహణ, మరమ్మతులకు ఓ ఇన్చార్జి ఉంటారు. రక్షణలో ఇప్పటికీ ఇదే కీలకం.. బొగ్గుగనుల్లో రక్షణ విషయంలో సేఫ్టీల్యాంప్ కీలకంగా పనిచేస్తోంది. ప్రాణనష్టం జరగకుండా విషవాయువులను గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పలు డిజిటల్ పరికాలు వచ్చినా, సేఫ్టీల్యాంప్ వాడకం మాత్రం కొనసాగుతోంది. –సీహెచ్.సమ్మయ్య, హెడ్ ఓవర్‌మెన్, వీటీసీ, శిక్షకుడు ఇలా మంటలో మార్పుని బట్టి గ్యాస్ మోతాదును గుర్తిస్తారు. సింగరేణిలో ఒక్కో భూగర్భ గనిలో సగటున 12 నుంచి 14 వరకు దీపాలు అవసరమవుతాయి. -
ఛాతీలో మంట... కడుపులో యాసిడ్ పైకి తంతుంటే!
ఎంత ఆరోగ్యవంతులకైనా జీవితంలో ఎప్పుడో ఒకసారైనా కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. కడుపులో యాసిడ్ ఆహారంపైన పనిచేసే సమయంలో దాని వాయువులు (ఫ్యూమ్స్) పైకి ఎగజిమ్మడంతో గొంతు, ఛాతీలో మంట అనిపిస్తుంది. జీఈఆర్‌డీని నివారించాలంటే... ► ఈ సమస్య నివారణకు మంచి జీవనశైలిని అలవరచుకోవడం మేలు. ► రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరమైనా నడవాలి. ► పక్కమీదకు చేరగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. ఒకవేళ కుడివైపు తిరిగి పడుకుంటే గొంతు చివర అన్నకోశం దగ్గర ఉండే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి తెరుచుకుని, ఆహారం వెనక్కు రావచ్చు. అప్పుడు యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశముంటుంది. ► తల వైపు భాగం ఒంటి కంటే కాస్త ఎత్తుగా ఉండేలా పక్కను సర్దుకోవాలి. రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు వీలైతే తల కింద మరో దిండును ఎక్కువగా పెట్టుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ► మందుల విషయానికి వస్తే... హెచ్2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు. -
దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్ గ్యాస్ (ఏవీ గ్యాస్) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్మెంట్ను (ఒక్కో బ్యారెల్ 16 కిలోలీటర్లు) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్ .. ఇలా ఏవీ గ్యాస్‌ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది. మానవరహిత ఏరియల్ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్ స్కూల్స్ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్ స్కూల్స్‌లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్‌లోని వడోదరలో గత సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
కొత్త ఏడాది తొలిరోజే షాక్..పెరిగిన గ్యాస్ ధర.. ఎంతంటే?
న్యూ ఇయర్ తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని మాత్రం పెంచలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 25 రూపాయలు ఉండగా ముంబై, హైదరాబాద్,బెంగుళూరు సహా అన్ని నగరాల్లో ఇలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి. దేశంలో స్థిరంగా డొమెస్టిక్ గ్యాస్ ధరలు దేశంలో డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా గతేడాది ఏడాది జులై 6న రూ.50 పెరగ్గా.. మొత్తంగా గతేడాది కాలంలో గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరలు.. ఢిల్లో రూ.1053, ముంబైలో రూ.1052, కోల్‌కతాలో రూ.1079, చెన్నై రూ.1068, హైదరాబాద్‌లో రూ.1105 కొనసాగుతున్నాయి. -
వాహనాలకు స్పీడ్ బ్రేకర్లుగా సీఎన్జీ ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది. మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్జీ, డీజిల్ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్ ఇంధనంపైనా ఫోకస్ చేస్తున్నాయి. సీఎన్జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు.. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది. -
గ్యాస్ ధరపై సామాన్యులకు గుడ్ న్యూస్
-
సిలిండర్ లో నీళ్లు.. ఆందోళనకు దిగిన బాధితులు
-
క్యూ2లో అదానీ గ్యాస్‌కు షాక్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 139 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 159 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 73 శాతం జంప్‌చేసి రూ. 1,190 కోట్లను తాకింది. సీఎన్జీకి డిమాండ్ పుంజుకోవడంతో గ్యాస్ విక్రయాలు 9 శాతం వృద్ధితో 19.1 కోట్ల ఘనపు మీటర్లను తాకాయి. ఈ కాలంలో నేచురల్ గ్యాస్ వ్యయాలు రెట్టింపై రూ. 860 కోట్లకు చేరినట్లు కంపెనీ సీఈవో సురేష్ పి.మంగ్లానీ పేర్కొన్నారు. సహజవాయువు సీఎన్జీగా మార్పిడి ద్వారా ఆటో మొబైల్స్‌కు, పైప్డ్ నేచురల్ గ్యాస్‌గా మార్చి వంటలు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికల్లా 33 కొత్త సీఎన్జీ స్టేషన్లను జత చేసుకుంది. వీటి సంఖ్య 367కు చేరింది. ఇదే విధంగా 61,000 గృహాలకు కొత్త కనెక్షన్ల ద్వారా పీఎన్జీ నెట్‌వర్క్‌ను 6.25 లక్షలకు పెంచుకుంది. కొత్తగా 412 బిజినెస్ కస్టమర్లను కలుపుకుని వాణిజ్య కనెక్షన్ల సంఖ్యను 6,088కు చేర్చుకుంది. ఫలితాల నేపథ్యంలో అదానీ టోటల్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 3,647 వద్ద ముగిసింది. -
రూ. 10 ప్యాకెట్లో 5 చిప్స్! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్ ఇస్తారా?!
సాక్షి, ముంబై: చిరుతిండి, కాలక్షేపం అనగానే దాదాపు అందరి దృష్టి చిప్స్ వైపే మళ్లుతుంది. ఎంత పెద్ద చిప్స్ ప్యాకెట్ కొన్నా.. అందులో గ్యాస్ ఎక్కువ.. చిప్స్ తక్కువ ఇది అందరికి తెలిసిన సంగతే. తాజాగా మరో వింత సంగతి ఒకటి వెలుగులోకి వచ్చింది. 10రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్న వినియోగదారుడు అందులో కేవలం చిప్స్ ఉండటంతో తెల్లబోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సెటైర్లతో సందడి చేస్తున్నారు. ఒక విద్యార్థి కాలేజీకి వెడుతూ పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. కట్ చేస్తే.. అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్ చేయగానే.. చిప్‌కు రెండు రూపాయలు భయ్యా.. ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్ చేతిలో పెడతారేమో అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. గత 27 ఏళ్లుగా టాప్ క్వాలీటీ మసాలా ఎయిర్ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్లీ గ్యాస్... మనం తినే చిప్స్ జస్ట్ కాంప్లిమెంట్.. ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
బాబోయ్ షాక్: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు రేట్లను ఏకంగా 40 శాతం పెంచుతూ చమురు శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) సమీక్షిస్తుంది. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
Be Alert: నిర్లక్ష్యం చేస్తే గ్యాస్..‘బాంబే’.. 12 వేల రెట్లు ఎక్కువ వ్యాపిస్తుంది
సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే విహార్ కాలనీలో గురువారం జరిగిన దుర్ఘటనలో ఒకరు చనిపోగా ఇద్దరు క్షతగాత్రులయ్యారు.రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని నల్లగుట్ట జే లైన్లో చోటు చేసుకున్న ఉదంతంలో భార్యభర్తలకు గాయపడ్డారు. .ప్రతి వంటింట్లోనూ ఉండే ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ వల్ల జరిగిన పేలుడు ప్రభావాలివి. గత వారం జరిగిన రెండే కాదు.. నగరంలో తరచుగా ఇలాంటి ‘గ్యాస్’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా పదుల సంఖ్యలో ఉంటున్న వీటి వల్ల ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా..ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంటోంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్‌లో దాదాపు 14.5 కేజీల బ్యూటేన్, ప్రొఫైన్ వాయువులను అత్యధిక ఒత్తిడితో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. సాధారణంగా స్టౌవ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ..గ్యాస్ లీకేజ్ అనేది సున్నిత ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది. ►సిలిండర్, స్టవ్‌లను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టవ్‌కు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ►సాధారణంగా స్టవ్‌కు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంత రంధ్రం ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. చదవండి: సికింద్రాబాద్‌లోని అపార్ట్మెంట్లో పేలుడు.. ►స్టవ్‌కు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచీ లీక్ అయ్యే అవకాశం ఉంది. నానక్‌రామ్‌గూడ ఉదంతంలో మాత్రం కమర్షియల్ సిలిండర్ నుంచి అనేక కనెక్షన్లు ఇచ్చిన వాల్వ్ లీకేజ్‌కి కారణమైంది. ►వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు. ►ఇంట్లో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. ►సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 60 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. అనేక ప్రమాదాల్లో గ్యాస్ సిలిండర్ ఏమాత్రం చెక్కు చెదరదు. దీన్ని చూసి అనేక మంది గ్యాస్ వల్ల జరిగిన పేలుడు కాదని భావిస్తారు. ఇలాంటి బ్లాస్ట్ల్ని కెమికల్ ఎక్స్ప్లోజన్ అని, సిలిండర్ కూడా ఛిద్రం అయిపోతే దాన్ని మెకానికల్ ఎక్స్ప్లోజన్ అని అంటారు. ►గత వారం జరిగిన వాటిలో చందానగర్ పరిధిలోని మొదటి ప్రమాదానికి గ్యాస్ లీకైన గదిలో లైట్ వేయడం కారణమైతే, రామ్‌గోపాల్‌పేట పరిధిలో జరిగిన రెండో దానికి స్టవ్ వెలిగించే ప్రయత్నం చేయడం కారణమైంది. చదవండి: ఆ ఆశతో గణేష్ లడ్డూను దొంగిలించిన పిల్లలు ఇద్దరి పరిస్థితి విషమం రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ డివిజన్లోని నల్లగుట్ట జే లైన్లో శనివారం గ్యాస్ లీకై జరిగిన పేలుడులో గాయపడిన దంపతులు సందీప్, అనుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వీరిని పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు. 55 శాతం కాలిన గాయాలతో ఇద్దరు చికిత్స పొందుతుండగా పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని గాం«ధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్ వెబ్ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి. ఇంతకూ హెచ్ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్ వెబ్ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది. -
అదానీ టోటల్: ఆసక్తికర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 138 కోట్లకు చేరింది. ఆటోమొబైల్స్‌కు సీఎన్జీ విక్రయాలు 61 శాతం జంప్‌చేసి 109 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లను తాకాయి. పైప్డ్ వంట గ్యాస్ అమ్మకాలు 3 శాతం పుంజుకుని 74 ఎంఎంఎస్సీఎంకు చేరాయి. అయితే సీఎన్జీ, వంటగ్యాస్ తయారీకి కొనుగోలు చేసిన సహజవాయు ధరలు మూడు రెట్లు ఎగసి రూ. 785 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. ఈ కాలంలో మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 1,110 కోట్లను తాకింది. నిర్వహణా లాభం 6 శాతం బలపడి రూ. 228 కోట్లుగా నమోదైంది. చదవండి : OnePlus10T 5G: వన్‌ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది! -
మూణ్నెళ్లలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా: ఏజీ అండ్ పీ ప్రథాన్
వచ్చే సెప్టెంబరు నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తరూ జిల్లా సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ రీజనల్ హెడ్ చిరాగ్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే కేంద్ర పెట్రోలియం బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొంది ఇంధన సరఫరా ప్రారంభించనుంది. భవిష్యత్తులో పోర్టబుల్ జనరేటర్స్, ఎయిర్ కంటిషనర్స్ కూడా గ్యాస్‌తో వినియోగించుకునే పరిస్థితి రానుందంటున్న ఆయన సాక్షితో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... ‘ఆదా’కు ఆదా... భధ్రతకు భరోసా ఈ పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలోనే వస్తుంది. అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. పైప్‌లైన్ ద్వారా ఒక కిచెన్ పాయింట్ అందిస్తాం. అవసరాన్ని బట్టి ఓ అడిషనల్ పాయింట్ కూడా అదే కిచెన్‌లో తీసుకోవచ్చు. బాత్ రూమ్ కోసం కావాలంటే మరో అదనపు పాయింట్ ఇస్తాం. మునిసిపల్ వాటర్ నీటి పంపు తిప్పితే నీళ్లొచ్చినట్టే ఈ గ్యాస్ కూడా వస్తుంది. వినియోగించిన ఇంధనాన్ని లెక్కించేందుకు మీటర్ ఏర్పాటు ఉంటుంది. మీటర్‌ను బట్టి వాడుకున్న ఇంధనానికి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లుల్లానే కాకపోతే అందులోలా ఇందులో స్లాబ్స్ ఉండవు. ఇక గ్యాస్ వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీస్ అందిస్తున్నాం. దీని కోసం ఒక పూర్తిస్థాయి టీమ్ పనిచేస్తుంది. రెస్టారెంట్స్‌కు మరింత మేలు... నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఇది వారి లాభాలను బాగా పెంచుతుంది. వారాంతాల్లో హోటల్స్ దాబాలు వంటి చోట్ల డిమాండ్ కారణంగా అధిక ఇంధనం కోసం అదనపు సిలిండర్లు మీద ఆధారపడతారు. అయితే ఇక్కడ ఆ కొరత ఉండదు. ఎంత కావాలంటే అంత గ్యాస్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ప్రయోజనం కారణంగా భవిష్యత్తులో తిరుపతిలో అన్ని రెస్టారెంట్స్ పైప్డ్ గ్యాస్‌కి కనెక్ట్ అవుతాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు కూడా అందించడానికి తితిదేతో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. స్పందన బాగుంది... ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కోరుతూ ప్రజల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుకున్నాం. కేవలం 4 నెలల్లోనే 2వేల 500 కంటే పైగా అప్లికేషన్స్ వచ్చాయి. స్థానిక సంస్థలు మాకు అవసరమైన విధంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారి చేసింది గూడూరు మునిసిపల్ కార్పొరేషన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, నాయుడు పేట మునిసిపల్ కార్పొరేషన్.. ల నుంచి పైప్‌లైన్ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. ఇన్స్టలేషన్ ప్రారంభించాం... తిరుపతి టౌన్లో కూడా శ్రీనివాసపురం, రోడ్‌నెం 15, 16లలో డొమెస్టిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం. 300 నివాస గృహాల్లో ఇన్స్టలేషన్ పూర్తయింది. నెల్లూరులో కూడా 450 ఇళ్లకి డొమెస్టిక్ ఇన్స్టలేషన్ పూర్తయింది. పైప్‌లైన్ ప్రోగ్రెస్‌లో ఉంది. వచ్చే 2నెలల్లో పూర్తి అవుతుంది. స్థానిక సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ని నాయుడపేట టౌన్, ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్రారంభించాం. ప్రభుత్వం చెప్పినట్టుగా రిఫండబుల్ డిపాజిట్ రూ.6వేలు తీసుకోవచ్చు కానీ మేం అది తీసుకోకుండానే ప్రస్తుతం కనెక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాం. వాహనాల కోసం సీఎన్జీ పెట్రోల్, డీజిల్ వాహనాలను పిఎన్జి వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్మెంట్ సెంటర్స్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నాం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కడప లాంటి చోట్ల డీజిల్ ఆటోలు బాగా ఎక్కువ వాటిని సీఎన్జీ ఆటోలుగా మార్చవచ్చు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయక్తం. అంతేకాక ఈ మార్పిడి కోసం అయ్యే ఖర్చు వాహన యజమానులకు కేవలం 6 నెలల్లో రికవరీ చేసుకోవచ్చు. డీజిల్‌తో పోలిస్తే సిఎన్జి వల్ల 30 నుంచి 50శాతం ఇంధన ఖర్చు అంటే కనీసం నెలకు రూ.5వేలు ఆదా అవుతుంది. ఇక భారీ వాహనాలు, ఎక్కువ దూరాలు నడిపేవారికి ఒక్క రోజులోనే భారీ మొత్తంలో ప్రయోజనం కలుగుతుంది. ఇంధనాన్ని నింపుకోవడంలో ఇబ్బందులు రాకుండా ప్రతీ 60 నుంచి 100 కి.మీ లోపు సిఎన్జి స్టేషన్స్ ఉండేలా చూస్తున్నాం. -
భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్!
న్యూఢిల్లీ: భారత్‌కు 5 కార్గోల ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను సరఫరా చేయడంలో రష్యా డిఫాల్ట్ అయ్యింది.రష్యన్ గ్యాస్ సరఫరా చేసే కంపెనీల్లో ఒకదానిపై ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెడితే దేశీ దిగ్గజం గెయిల్‌కి ఏటా 2.85 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి కోసం రష్యన్ సంస్థ గాజ్ప్రోమ్కి చెందిన సింగపూర్ విభాగంతో దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. ఈ సింగపూర్ విభాగం ప్రస్తుతం జర్మనీకి చెందిన అనుబంధ సంస్థ కింద పనిచేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలపై రష్యా ప్రతీకార ఆంక్షలు విధించిన దేశాల్లో జర్మనీ కూడా ఉంది. ఫలితంగా సింగపూర్ విభాగానికి రష్యా గ్యాస్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఎల్ఎన్జీ సరఫరాకు ఆటంకం కలిగింది. గెయిల్ ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. -
సీఎన్జీ ధరలు తగ్గించాలి, కేంద్రానికి సియామ్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: సీఎన్జీ ధరలను తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పర్యావరణ సుస్థిర లక్ష్యాల సాధనకు ఇది అవసరమని పేర్కొంది. గడిచిన కొన్ని నెలల్లో సీఎన్జీ ధరలు అసాధారణంగా పెరిగినట్టు గుర్తు చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అనుకూల లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతును, సరైన సమయంలో కోరుకుంటున్నట్టు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. జాతి లక్ష్యాలైన చమురు దిగుమతులను తగ్గించుకోవడం, స్వచ్ఛమైన పర్యావరణం సాకారానికి.. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకార ధోరణి ఉండడం అభినందనీయమన్నారు. ‘‘సీఎన్జీని ప్రోత్సహించడం, నెట్వర్క్ విస్తరణ విషయంలో ప్రభుత్వ కృషికి మద్దతుగా.. సీఎన్జీ వాహన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ కట్టుబడి ఉంది’’అని రాజేష్ మీనన్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల మంత్రి హర్దీప్సింగ్ పూరి 166 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,332 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
నెల్లూరులో గ్యాస్ పరిశ్రమ ఏర్పాటు పనులు షురూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ అందించేందుకు అనుమతులు పొందిన ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులు షురూ చేసింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పనుల పరిశీలన... వెంకటరెడ్డి పాళెం పంచాయితీ పరిధిలోని ఓజ్లీలో ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులను సూళ్లూరు పేట ఆర్డీఓ పరిశీలించారు. పరిశ్రమ నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఆయన సర్వే సిబ్బందితో కలిసి నిశితంగా సమీక్షించారు. చెరువులో గానీ, గురుకుల పాఠశాల, వాకాటి వారి కండ్రిగ, రాజు పాలెం ఎస్టీకాలనీలకు సమీపంలో నిర్మాణాలు ఏమైనా చేపట్టారా అనే అనుమానాల నేపధ్యంలో ఈ పరిశీలన జరిపినట్టు ఆయన వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం పరిశ్రమ ప్రతినిధులు, గ్రామస్తులతో అధికారుల బృందం మాట్లాడింది. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు తమ పరిశ్రమ ఏర్పాటు సంబంధిత వివరాలు అందించారు. ఓజ్లిలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్సన్నాహాలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీగా ఏజీ అండ్ పీ ప్రథమ్‌కు 12 సీజీడీ లైసెన్లనుపెట్రోలియం– సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్ జీఆర్బీ) మంజూరు చేసింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 34 జిల్లాల్లో ప్రతి రోజూ వినియోగం కోసం గ్యాస్‌ను ఏజీ అండ్ పీ అందిస్తుంది. అలా సంస్థ సరఫరా చేస్తోన్న ఓ గ్రామమే నెల్లూరు జిల్లాలోని ఓజ్లి గ్రామం.జ్లీ వద్ద ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటుచేయడం కోసం పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ; డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్ (డిష్); ద ఫైర్– స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (ఫైర్ ఎన్ ఓసీ), నెల్లూరు నగరాభివృద్ధి సంస్ధ (నుడా), అపెక్స్ సేఫ్టీ స్టాట్యూటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కంపెనీ అవసరమైన అన్ని అనుమతులను తీసుకుంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంగీకారం (సీటీఈ) సైతం పొందింది. పరిశ్రమ ఏర్పాటులో వర్తించేటటువంటి అన్ని చట్టాలకూ, అదే విధంగా స్టెయినబల్ గ్యాస్ ఆర్ధిక వ్యవస్ధ సృష్టికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రతినిధులు వివరించారు. -
సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, 5కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను చమురు కంపెనీలు రూ.188కి పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం రూ.8.50కి తగ్గించాయి. సామాన్యులకు ధరాఘాతం ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉండగా..మరోవైపు పెరిగిపోతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ.50కి పెంచాయి. దీంతో జులై 2021 నుంచి ఇవాళ్టితో మొత్తం 8సార్లు గ్యాస్ ధరల్ని పెంచినట్లైంది. ఇదిలా ఉండగా, జూలైలో కమర్షియల్ సిలిండర్ల ధరల్ని రెండోసారి తగ్గించింది. అంతకుముందు జూలై 1న 19 కిలోల ఎల్పిజి సిలిండర్‌ను రూ.198 తగ్గించారు. సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది ఈ జూన్ నెలలో కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ గ్యాస్ వినియోగం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 16 నుంచి గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అంటే గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450 ఉండగా.. దాని పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించాలి. కాగా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. -
ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు
Sri Lanka Crisis: గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంకోభాలతో కొట్టుమిట్టాడుతూ.. తీవ్ర ఉద్రిక్తలతో మగ్గిపోయింది. ఇప్పడిప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ దేశా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రధాని రణిల్ విక్రమసింఘే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తమ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంధనానికి సంబంధించి రాబోయే మూడు వారాలు మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచే ఇంధనం, గ్యాస్‌లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం ఇంధనం కోసం నెలకు సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది" అని చెప్పారు. అదీగాక అంతర్జాతీయ పరంగా మనం అనుసరిస్తున్న నాసిరకం విధానాల వల్లే దేశం మరింతగా అణగారిపోతుందని విక్రమసింఘే అన్నారు. అందువల్ల ప్రస్తుతం దేశం తన విదేశీ సంబంధాలపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!) -
ఓఎన్జీసీకి చమురు లాభాలు
న్యూఢిల్లీ: ఆయిల్, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మార్చి త్రైమాసికానికి రూ.8,859 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు కంపెనీ లాభాల వృద్ధికి అనుకూలించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో లాభం రూ.6,734 కోట్లతో పోల్చి చూస్తే 30 శాతానికి పైగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. షేరు వారీ ఆర్జన మార్చి క్వార్టర్‌కు రూ.7.04గా ఉంది. ఆదాయం రూ.34,497 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.21,189 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ లాభం రికార్డు స్థాయిలో రూ.40,306 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,246 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందింది. 2021 చివర్లో చమురు ధరలు పెరగడం మొదలు కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు మరింత ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్జీసీకి ఇది అనుకూలించింది. అనుబంధ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఫలితాలను కూడా కలిపి చూస్తే.. కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061 కోట్లు, 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.49,294 కోట్లుగా ఉన్నాయి. -
మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించి, ఊపిరాడకుండా చేసి...
Asphyxiation death of Black man: బ్రెజిల్లో జ్యాత్యాహంకారం కోరలు చాచింది. అక్కడి పోలీసులు.. ఒక నల్లజాతీయుడిని దారుణంగా హింసించడంతో పాటు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సెర్గిప్‌లోని యుంబౌబలో హైవేపై మోటర్ సైకిల్ మీద వెళ్తున్న డి జీసస్ శాంటోస్ అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతని నేలపై కూర్చొబెట్టి మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించారు. అంతటితో ఆపకుండా కారు డిక్కిలో పడేసి బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో శాంటోస్ కన్నుమూశాడు. అయితే పోలీసులు మాత్రం శాంటోస్ దురుసుగాగా ప్రవర్తించాడని, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించాడని చెబుతున్నారు. అతనిని నియంత్రించే క్రమంలోనే బాష్పవాయువును ఉపయోగించామని చెప్పారు. కానీ బాధిత కుటుంబం మాత్రం శాంటోస్‌ని హైవేపై బలవంతంగా ఆపి చొక్కా పైకెత్తమనడంతో.. భయపడ్డాడని అంటున్నారు. పైగా మానసికంగా అతను స్థిమితంగా లేడని, అతని దగ్గర మందుల చీటి చూసి కూడా కనికరించకుండా హింసించారని అంటున్నారు. శాంటోస్ ఎంతగా వదిలేయమని ప్రాధేయపడ్డా వదలకుండా ఊపిరాడకుండా చేసి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శాంటోస్‌ని పోలీస్‌స్టేషన్‌కి తరలించే క్రమంలోనే తీవ్ర ఆవస్థతకు గురై చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఊపిరాడకపోవం వల్లే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. దీంతో.. శాంటోస్ హత్యకు పోలీసులే కారణమంటూ.. జనాలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటన కార్చిచ్చు రాజేయడంతో.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నత దర్యాప్తునకు ఆదేశించారు. (చదవండి: మిస్టర్ బైడెన్.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్ ఫైర్) -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, సోషల్ మీడియాలో మీమ్స్ మంట!
ఉప్పు నుంచి పప్పు దాకా..పెట్రోల్ నుంచి నిత్యవసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని బూచీగా చూపిస్తూ ఉత్పత్తి దారులు అన్నీ రకాల వస్తుల ధరల్ని పెంచడంతో..ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఇవేం సరిపోవన్నట్లు గ్యాస్ కంపెనీలు సైతం గ్యాస్ ధరల్ని పెంచి సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపించాయి. దీంతో పెరిగిన ధరలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదైన స్టైల్లో మీమ్స్ వేస్తున్నారు. ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గురువారం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3.50పైసలు పెరగ్గా..కమర్షియల్ గ్యాస్ ధర రూ.8 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన సిలిండర్ ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవ్వాళ పెరిగిన ధరలతో ఢిల్లీలో 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,003, కోల్ కతాలో 1,029.50, ముంబైలో రూ.1,003, చెన్నైలో రూ.1,019 ఉంది 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,254, కోల్‌కతాలో రూ.2,453, ముంబైలో రూ.2,305, చెన్నైలో రూ.2,507గా ఉంది. విమర్శల వెల్లువ పెరిగిన గ్యాస్ ధరలపై నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.రోజురోజుకీ పెరిగిపోతున్న గ్యాస్ ధరలు మధ్య తరగతి ప్రజల ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. The price of domestic LPG cylinders is hiked by Rs. 3.50 & commercial cylinders by Rs 8. In Delhi, LPG used to cost Rs 414/cylinder in May 2014 under UPA & it now costs Rs 1003. Even when inflation is at its highest in decades, the BJP govt has no mercy on the people of India! — Dr. Shama Mohamed (@drshamamohd) May 19, 2022 అప్పుడు రూ.414..ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3.50, కమర్షియల్ సిలిండర్ రూ.8 పెరగడంపై కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి శర్మ డాక్టర్ షామా మొహమ్మద్ కేంద్రంపై మండిపడ్డారు. మే 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇదే గ్యాస్ ధర రూ.414 ఉంటే.. ఇప్పుడు రూ.1,003 ఉందని ట్వీట్ చేశారు. Domestic LPG cylinder is 1003rs today. Petrol Price is 113rs / ltr ACHE DIN Dear Indians, Open your eyes before it's too late.#LPGPriceHike#PetrolDieselPrice #GasCylinder pic.twitter.com/UeF4xYkVEd — Taj (@Taj_Taju1) May 19, 2022 LPG gas cylinder is the Mahesh Babu of commodities, hence proved🤭#LPG #lpgpricehike #MaheshBabu pic.twitter.com/JKFK7Sc1Lw — TejalTweets (@TweetsTejal) May 11, 2022 -
రష్యా మెలిక.. ‘ఇది దారుణం.. అస్సలు బాలేదు’
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులని పశ్చిమ దేశాలు తప్పుబట్టింది. ఈ దాడులను ఆపాలని ఎంత చెప్పినా ఫలితం లేకపోడంతో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తానేమి తక్కువ కాదని రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే పశ్చిమ దేశాల ఆంక్షల నుంచి తమ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలనుకునే దేశాలు.. ముఖ్యంగా అవి తమ మిత్రదేశాలు కాకపోతే రష్యా కరెన్సీ (రూబెల్స్)లోనే చెల్లింపులు ఉండాలని లేదంటే సరఫరా చేయబోమని రష్యా మెలికపెట్టింది. తాజాగా ఈ నిబంధనల ప్రకారం.. రూబెల్స్లో చెల్లింపులు చేయడంలో విఫలమైన పోలాండ్, బల్గేరియాకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కాగా యూరోపియన్ దేశాలకు అత్యధికంగా గ్యాస్, చమురు సరఫరా చేసేది రష్యానే. ప్రస్తుతం ఈ నిర్ణయంతో ఆ దేశాల మార్కెట్లో హోల్‌సేల్ గ్యాస్ ధర 20% పెరిగింది. ఇది గత సంవత్సరం క్రితం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చర్యను ఖండించారు. ఆమె దీనిపై స్పందిస్తూ.. యూరోప్‌లోని వినియోగదారులకు గ్యాస్ డెలివరీని నిలిపివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రష్యా చేస్తోంది బ్లాక్‌మెయిలింగ్ అని దుయ్యబట్టారు. తాము అన్ని సభ్య దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని, గ్యాస్ సమస్యను తీర్చేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేశామని అది యూరప్ వెలుపల ఉన్న దేశాలతో చర్చలు జరుపుతోందని ఆమె తెలిపారు. చదవండి: Karachi University Blast: ఇద్దరు పిల్లల తల్లి, సైన్స్ టీచర్.. మహిళా సుసైడ్ బాంబర్ గురించి షాకింగ్ విషయాలు -
ఏడాది కాలంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు..ఎందుకంటే!
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ గ్యాస్ వినియోగ ధోరణులపై సిటీ గ్యాస్ పంపిణీదారుల (సీజీడీ) నుంచి డేటా కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాక కేటాయింపులు జరుపుతామని కేంద్ర చమురు శాఖ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా డిమాండ్‌ను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి (ఏటా ఏప్రిల్, అక్టోబర్‌లో) కేంద్రం గ్యాస్ కేటాయింపులు చేస్తుంది. కానీ 2021 మార్చి నుంచి ఇప్పటివరకూ కేటాయించలేదు. దీనితో కొరతను అధిగమించేందుకు సిటీ గ్యాస్ ఆఫరేటర్లు ..దిగుమతి చేసుకున్న ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను అధిక రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా సీఎన్జీ రేటు కేజీకి రూ. 28 పైగా, పీఎన్జీ ధర మూడో వంతు మేర పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీజీడీ సంస్థలు తమకు త్రైమాసికాలవారీగా కేటాయించాలంటూ అభ్యర్ధించాయని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చమురు శాఖ ప్రతినిధి తెలిపారు. సీజీడీ అదనపు కేటాయింపులు జరపాలంటే .. ఎరువులు, విద్యుత్, ఎల్పీజీ ప్లాంట్లు మొదలైన వాటికి సరఫరాలో కోత పెట్టాల్సి వస్తుందని వివరించారు. -
కేజీ బేసిన్‌కు నాలుగు కొత్త రిగ్గులు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని చమురు నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వ ఆయిల్ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా గుర్తించిన బావుల నుంచి గ్యాస్, చమురు వెలికితీయడానికి ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగిస్తోంది. దేశం వ్యాప్తంగా ఉపయోగించడానికి 47 రిగ్గులను ఇటలీ నుంచి కొనుగోలు చేసిన ఓఎన్జీసీ అందులో నాలుగింటిని నరసాపురం, రాజమహేంద్రవరం కేంద్రాలుగా కార్యకలాపాలు సాగుతున్న కేజీ బేసిన్‌కు కేటాయించింది. తొలివిడతగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్ప వద్ద ఇటలీ టెక్నాలజీ రిగ్గును ఇటీవల ప్రవేశపెట్టారు. మరో రిగ్గును కొద్ది రోజుల్లో భీమవరం సమీపంలోని వేండ్రలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు నిక్షేపాల కోసం తవ్వకాలను పాత యంత్రాలతోనే కొనసాగిస్తోంది. డ్రిల్లింగ్ సమయంలో బాంబింగ్ కూడా చేస్తారు. దీంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. పైప్లైన్లలో లీకేజీలతో బ్లోఅవుట్లు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి ఓఎన్జీసీ ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగంలోకి తెచ్చింది. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు.. నాలుగు దశాబ్దాలుగా నరసాపురం టెంపుల్ ల్యాండ్ కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. తరువాత కాలంలో రాజమహేంద్రవరంలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. చమురు నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన యంత్రసామగ్రి మొత్తం నరసాపురం టెంపుల్ ల్యాండ్‌లోనే ఉంటుంది. నరసాపురం ప్రాంతంలో 40 ఏళ్లుగా అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఇస్తున్న బావులు ఖాళీ అవ్వడంతో ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వే చేసింది. మార్టేరు, పెనుగొండ, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని దెయ్యాలతిప్ప, మహదేవపట్నం, వేండ్ర ప్రాంతాల్లో కొత్త బావులను గుర్తించింది. కొత్తగా గుర్తించిన బావుల్లో వినియోగించేందుకు ఇటలీ టెక్నాలజీ రిగ్గులు కొనుగోలు చేసింది. చమురు, గ్యాస్ ఉత్పత్తిలో పశ్చిమదే అగ్రస్థానం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 600 టన్నుల ఆయిల్ వస్తోంది. సంస్థ ఉత్పత్తిలో ఇప్పటివరకు జిల్లాదే అగ్రస్థానం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 విశిష్ట బ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లోను, తూర్పుగోదావరి జిల్లా కేసనపల్లి, కృష్ణాజిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లోను కొత్తగా చేపట్టిన అన్వేషణ పూర్తయింది. ఈ కొత్త బావుల నుంచి త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది. కొత్త బావుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఉత్పత్తి రాబోతోంది. వచ్చే ఏడాది నుంచి కేజీ బేసిన్లో రోజుకు 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 25 శాతం ఉత్పత్తి పెంచాలన్నది లక్ష్యం. సముద్రగర్భం నుంచి గ్యాస్.. 1974లో మొదటిసారిగా నరసాపురంలో ఓఎన్జీసీ చమురు నిక్షేపాలను గుర్తించింది. అప్పటి నుంచి కేవలం ఆన్ షోర్పైనే సంస్థ దృష్టి పెట్టింది. 10 ఏళ్ల కిందట నుంచి రిలయన్స్, గెయిల్ వంటి సంస్థలు రంగప్రవేశం చేసి ఆఫ్ షోర్ (సముద్రగర్భం)లో డ్రిల్లింగ్ ముమ్మరం చేయడంతో ఆ దిశగా కూడా ఓఎన్జీసీ దూకుడు పెంచింది. 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో అన్వేషిస్తోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంలో ఆఫ్ షోర్లో గ్యాస్ వెలికితీత ఇప్పటికే ప్రారంభమైంది. గ్యాస్ వెలికితీతలో మూడేళ్ల నుంచి ఓఎన్జీసీ దేశంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆందోళనలు
-
ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదరవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్ధికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్‌ను అర్జిస్తుంది. ఇందులో భాగంగా భారత్.. తమ దేశ దేశంలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత రెండు వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజు, ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నాంటూ జర్మన్ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా 'ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్జెమీన్ జైటుంగ్' కు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి బొగ్గు కొనుగోళ్లను, సంవత్సరం చివరి నాటికి చమురు కొనుగోళ్ల నిలిపివేస్తామని మీడియా కు వెల్లడించారు. అదే సమయంలో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7లక్షల బ్యారల్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా, ప్రపంచ చమురు అవసరాల్లో 12శాతం, సహజవాయివుల్లో 16శాతం అవసరాల్ని రష్యా తీరుస్తుంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమరును భారత్‌కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా..,భారత్‌కు ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా నుంచి భారత్‌కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేదంతో రష్యాలో..భారత్ ఆయిల్, గ్యాస్ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంతనాలు జరుపుతుంది. భారత్ అందుకు అంగీకరిస్తే తాము భారత్‌లో కంపెనీల ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ఉప ప్రధాని నోవాక్ భారత్‌ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
5ఏళ్లు, రూ.40వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్/ఎల్ఎన్జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్ వెల్లడించారు. ’’పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్ డీహైడ్రోజెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్‌ను ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్ తెలిపారు. తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్‌లోని దహేజ్ ఎల్ఎన్జీ దిగుమతి టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్ తెలిపారు. దేశీయంగా ఎల్ఎన్జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. -
జీఎస్టీలోకి గ్యాస్..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ లక్ష్యమైన గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సాకారానికి.. సహజ వాయువును జీఎస్టీ కిందకు తీసుకురావాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. దేశ ఇంధన బాస్కెట్లో సహజవాయవు వాటాను పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్‌ఐపీఐ) కోరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఈ సమాఖ్యలో భాగంగా ఉన్నాయి. పైపులైన్ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు, దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ ఆధారిత రీగ్యాసిఫికేషన్పై జీఎస్టీని తగ్గించాలని కోరింది. అప్పుడు పర్యావరణ అనుకూల ఇంధన ధరలు తగ్గుతాయని బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన వినతిపత్రంలో కోరింది. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 15 శాతానికి చేర్చాలన్నది ప్రధాని లక్ష్యంగా ఉంది. -
40 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. సన్యాసిలా బతుకుతున్నాడు
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం మూడు నెలల పాటు లాక్డౌన్ విధిస్తేనే జనాలకు పిచ్చిపట్టింది. మనుషుల్లో తిరగక.. బయటకు వెళ్లక ఇంటికే పరిమితం కావడం అంటే పెద్ద పనిష్మెంట్గా భావించారు. చుట్టూ నలుగురు మనుషులు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా.. భారంగా గడిపారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మాత్రం మనకు చాలా భిన్నం. ఆయన గత 40 ఏళ్లుగా మనుషులకు చాలా దూరంగా.. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు. గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నారు. భౌతిక సుఖాలు పరిత్యజించి ఇలా సన్యాసిగా జీవించడం చాలా బాగుంది అంటున్న ఈ వ్యక్తి వివరాలు.. (photo cridit BBC) 40 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు కెన్ స్మిత్(74). ప్రస్తుతం అతడు స్కాట్లాండ్ రాన్నోచ్ మూర్ అంచున ఉన్న సమీప రహదారి నుంచి రెండు గంటలు లోపలకి ప్రయాణిస్తే కనిపించే లోచ్ ట్రీగ్‌లో ఓ చెక్క గదిలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతాన్ని లోన్లీ లోచ్ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా ఉంటున్న కెన్ గురించి తొలుత 9 సంవత్సరాల క్రితం ఫిల్మ్ మేకర్ లిజ్జీ మెక్కెంజీకి తెలిసింది. ఆమె గత రెండెళ్ల క్రితం ఇతని గురించి బీబీసీ స్కాంట్లాండ్లో ‘ట్రైగ్ సన్యాసి’ పేరుతో డాక్యూమెంటరీ ప్రచురించింది. ఆ ప్రమాదంతో జీవితంలో మార్పు.. డెర్బీషైర్‌కు చెందిన కెన్ 15వ ఏట నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 26వ ఏట ఉండగా దారి దోపిడి దొంగలు కెన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో 23 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. అతడి స్థితి చూసిన వారు.. కెన్ కోలుకోవచ్చు.. కానీ మాట్లాడలేడు.. నడవలేడు అన్నారు. అయితే వారి మాటలు అబద్ధం చేస్తూ కెన్ చాలా త్వరగా పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. (photo cridit BBC) 22 వేల మైళ్లు ప్రయాణం... ప్రమాదం కెన్ జీవితాన్ని మార్చింది. ఎవరి మాటలు వినకూడదని నిర్ణయంచుకున్నాడు. ఆ సమయంలో అతడికి అడవిపై ఆసక్తి కలిగింది. ఇక నడక ప్రారంభించాడు. దాదాపు 22 వైల మైళ్లు నడిచి అలాస్కా సరిహద్దలో ఉన్న కెనడియన్ భూభాగమైన యుకాన్ చేరుకున్నాడు. కెన్ ఈ ప్రయాణంలో ఉండగానే అతడి తల్లిదండ్రులు మరణించారు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న కెన్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతడి చాలా సమయం పట్టింది. తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తి ఒంటరిగా.. తల్లిదండ్రులు చనిపోయారు.. నా అన్న వాళ్లు ఎవరు లేరు. దాంతో ఇక జనవాసాలకు దూరంగా.. అడవిలోనే జీవించాలనుకున్నాడు కెన్. ఏకాంత ప్రదేశం కోసం వేల కొద్ది మైళ్లు ప్రయాణం చేసి చివరకు లోచ్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అదే తనకు అనువైన స్థావరంగా భావించాడు. అక్కడే దుంగలతో ఓ చిన్నపాటి గదిని నిర్మించుకున్నాడు. (photo cridit BBC) నో గ్యాస్, నో కరెంట్... గత 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు కెన్. గ్యాస్, కరెంట్ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్ పండిచి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. అతడి దగ్గర ఓ జీపీఎస్ పర్సనల్ లోకేటర్ బీకాన్ ఉంది. ఇక ఒంటిరిగా బతకాలంటే.. కచ్చితంగా చేపలు పట్టడం రావాలంటాడు కెన్. కాపాడిన జీపీఎస్ పర్సనల్ లోకేటర్.. అయితే 2019లో తొలిసారి కెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిల్మ్‌మేకర్ లిజ్జీ కెన్ వద్ద నుంచి వెళ్లిన పది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2019లో, కెన్ బయట మంచులో ఉన్నప్పుడు స్ట్రోక్‌కు గురయ్యాడు. అయితే అతడి ఉన్న జీపీఎస్ లోకేటర్ టెక్సాస్, హస్టన్‌లో ఉన్న రెస్పాన్స్ కేంద్రానికి ఎస్ఓఎస్ పంపడంతో కెన్ పరిస్థితి గురించి వారికి తెలిసింది. (photo cridit BBC) వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్‌గార్డ్‌కు తెలియజేశారు. వారు వెంటనే కెన్ను ఫోర్ట్ విలియమ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతనికి జనవాసంలో ఉండాలని కోరారు. కానీ కెన్ తన క్యాబిన్‌కు తిరిగి వచ్చాడు. నాకు ఏం కాదు 102 ఏళ్లు బతుకుతాను అంటున్నాడు కెన్. చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది... -
సామాన్యుడిని భయపెడుతున్న చమురు, గ్యాస్ ధరలు
-
చెత్త తో గ్యాస్
-
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
-
రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి, రష్యా ఇంధన మంత్రి నికోలయ్ షుల్గినోవ్‌తో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం గమనార్హం. అలాగే రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్ భారత్‌కు చెందిన ఎస్సార్ ఆయిల్‌ను 2017లో 12.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంధన సహకార విస్తృతిపై నికోలయ్‌తో చర్చలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి పురి ట్వీట్ చేశారు. రష్యాలోని ప్రాజెక్టులపై భారత చమురు సంస్థల పెట్టుబడులను, ఎల్ఎన్జీ, ముడి చమురు సరఫరాను సమీక్షించినట్టు ప్రకటించారు. భారత ఇంధన రంగంలో రష్యా అతిపెద్ద పెట్టుబడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు -
బతికేదెట్టా...?
-
తెలంగాణ: చౌకగా ఇంటి, వాహన గ్యాస్..
హైదరాబాద్: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్‌ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో పాటు వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ అందిస్తోంది. ఒక వైపు ఆకాశాన్నంటిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. మరో వైపు పరుగులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి వారికి ఊరటనివ్వడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృషి చేస్తోంది. పక్కా ప్రణాళికతో శరవేగంగా సీజీడీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా గ్యాస్‌ను ఎంఈఐఎల్ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లో ఇప్పటికే గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ ఇప్పుడు తెలంగాణాలో తన సేవలను విస్తరిస్తోంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సేవలను ఇటీవలనే ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్య పరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి మేఘా గ్యాస్ కింద గ్యాస్ సరఫరా సేవలను చౌకదరలకు అందిస్తోంది. 5000 కోట్లతో ఈ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 11 లక్షల గ్రహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిజిడి వ్యవస్థ ద్వారా దాదాపు 4 వేల మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. నల్గొండ జిల్లాలో తొలిసారిగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు 'మేఘా గ్యాస్' కింద చౌక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. సీజీడీ - నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ. వ్యయ ప్రయాసలు తగ్గించి సులభంగా ఇంటింటికి గ్యాస్ అందే విధంగా ‘మేఘా గ్యాస్’ పటిష్టమైన ప్రణాళికతో మౌళిక వసతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లోని వివిధ జిల్లాలో అమలు చేస్తున్నట్లు మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా PNG ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. దీనితో నల్గొండ జిల్లాలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 km స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 కి.మీ పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40,000 కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో ఇంకా 500 కి.మీ పొడవు గల ఎండీపీఈ పైప్ లైన్ నిర్మాణము చేపడుతోంది. అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట మరియు కోదాడ లలో 10 సీఎన్జీ స్టేషన్లు నిర్మిస్తున్నారు. సిజిడి ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి ఉమ్మడి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జి స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఈఐఎల్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు - బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ - వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ - గెయిల్ నుంచి పొందనుంది. మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ - ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తున్న మేఘా గ్యాస్ గృహాలు - వాణిజ్య సంస్థలు - పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్‌ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ - ఎండిపీ ఈ పైప్‌లను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసారు కర్ణాటకలోని తూంకూరు జిల్లాలో కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తోంది. వక్కోడి - హెగ్గేరి - గోళ్లహళ్లి - గొల్లరహతి - కుప్పూరు - దసముద్దేప్యా - సిరగతే - దిబ్బుర్ - గుళురు - సంతపేట - మరురూర్ దీన్నే - శేట్టిహళ్లి - జయనగర్ - గోకుల్ ఎక్స్ టెన్షన్ - ఖ్యాతిసాండ్రా - హీరేహళ్లి ఏరియా - మంచికల్ కుప్పె - బట్వాడీ - హనుమంతపురలో 595 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే బెల్గామ్ జిల్లాలో బసవన్న కోళ్ల - ఆటోనగర్ - రాంతీర్థనగర్ - అశోక సర్కిల్ - ఆజాద్ నగర్ - చెన్నమ్మ సర్కిల్ - మారుతీ నగర్ - సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర స్టీల్ - ఎండిపీ ఈ పైప్ లైన్ వేశారు. చదవండి: వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు! ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ కన్నుమూత -
గ్యాస్ షేర్లు గెలాప్!
దేశీయంగా పెరగనున్న గ్యాస్ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్ తదితర అంశాలు ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్ రవాణాకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్ ఓస్వాల్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్లో బావుల నుంచి గ్యాస్ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది. ఆర్ఐఎల్ రెడీ రెండేళ్లలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్ కనిపించనున్నట్లు అంచనా వేసింది. తాజాగా పెరిగిన జోరు... రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ లభ్యత చేరింది. ఆర్ఐఎల్–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్ఎన్జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్ మెట్రిక్ టన్నులకు డిమాండ్ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (జీఎస్పీఎల్), గెయిల్ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. సామర్థ్యం ఇలా... ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్పీఎల్ కొన్ని కీలక పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్–భాధుట్, అంజార్–చోటిల్లా, అంజార్–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్ వల్ల గుజరాత్ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. -
గ్యాస్‌తో పంటకు నీరంట..!
రాజాం: రైతులు కొత్త కొత్త పద్ధతులు అన్వేషిస్తున్నారు. రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన ఎందువ మోహనరావు తన పంటపొలంలో మొక్కజొన్న పంటకు సాగునీరు అందించేందుకు వినూత్న విధానాన్ని అవలంబించారు. తన వద్ద ఉన్న ఆయిల్ ఇంజిన్‌కు వంట గ్యాస్ సిలిండర్ జతచేసి ఎంచక్కా ఇంజిన్ సాయంతో మడ్డువలస కాలువలో నీటిని పంటపొలానికి తరలించారు. ఎకరా మొక్కజొన్న పంటకు 4 కిలోల గ్యాస్ సాయంతో నీరు పెట్టుకోవచ్చని రైతు ‘సాక్షి’కి తెలిపారు. తన స్నేహితుల వద్ద ఈ విధానాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్) వినూత్నం: బాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లు -
గ్యాస్ ఇన్ఫ్రాపై 60 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ‘పైప్లైన్లు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్, సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) నెట్‌వర్క్‌లు మొదలైన గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని నిర్దేశించుకున్నాం. గ్యాస్ ఆధారిత ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా లక్ష్యాలు పెట్టుకున్నాం‘ అని అసోచాం ఫౌండేషన్ డే వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. సీజీడీ ప్రాజెక్టులను 400 జిల్లాల్లోని 232 ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో భౌగోళికంగా 53 శాతం ప్రాంతాల్లో, దేశ జనాభాలో 70 శాతం మందికి సీజీడీ అందుబాటులోకి రాగలదని ప్రధాన్ పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 1,000 ఎల్ఎన్జీ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలలోనే తొలిసారిగా 50 ఎల్ఎన్జీ ఇంధన స్టేషన్లకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చండికోల్, పాదూర్‌లలో మరో 6.5 మిలియన్ టన్నుల వాణిజ్య–వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైనవి..
న్యూఢిల్లీ: చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 జనవరి 21 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతుంది. అలాగే ఎల్పీజీ సిలిండర్ ధరలు, జీఎస్టీ, యుపీఐ లావాదేవీల చెల్లింపు, వాట్సాప్ వంటి ఇలా సామాన్యుల జీవితాల్లో బాగా ప్రభావం చూపే చాలా నిబంధనలు జనవరి 1 నుంచి మారబోతున్నాయి. 2021 జనవరి 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలు సామాన్యుని జీవితాన్ని బాగా ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఈ మార్పుల గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైన కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి. చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 21 నుండి 'పాజిటివ్ పే సిస్టం' పేరిట కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ నూతన నిబంధన ద్వారా రూ.50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఇది వినియోగదారుడి అభీష్టానుసారం ఉంటుంది. అలాగే రూ.5 లక్షలకు మించి అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో చెక్కులను తప్పనిసరి చేయాలని బ్యాంకులకు సూచించింది. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్బిఐ వాటి చెల్లింపుల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న లావాదేవీల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్‌ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9 కన్న పాత ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ పేర్కొంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల నేపథ్యంలో ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి కారు కంపెనీలైన మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా కంపెనీలు తమ వాహనాల ధరలను జనవరి 1 నుండి పెంచనున్నట్లు తెలిపాయి. దేశంలో ల్యాండ్లైన్ల నుండి మొబైల్ ఫోన్లకు కాల్ చేయడానికి త్వరలో '0' నెంబర్ ను జోడించాల్సి ఉంటుంది అని ట్రాయ్ తెలిపింది. కొత్త వ్యవస్థను అమలు చేయడానికి జనవరి 1లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టెల్కోస్‌ను టెలికాం విభాగం కోరింది. జనవరి 1, 2021 నుండి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 1, 2017లోపు అమ్మిన ఎం, ఎన్ క్లాస్ నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. దీని కోసం 1989 సెంట్రల్ మోటారు వాహనాల నియమాలు సవరించారు. దీనికి సంబంధించి నవంబర్ 6న మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుండి లావాదేవీలపై వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యుపీఐ చెల్లింపు సేవ (యుపీఐ చెల్లింపు) పై అదనపు ఛార్జీ విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై ఎన్పీసీఐ 30 శాతం పరిమితిని విధించింది. ఈ ఛార్జీని చెల్లించడానికి పేటీమ్ అవసరం. గూగుల్ తన పేమెంట్ అప్లికేషన్ గూగుల్ పే వెబ్ యాప్‌ని 2021 జనవరి1 నుంచి నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే గూగుల్ పే ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల చెల్లింపులు చేసినప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కోసం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఈ విషయంపై గూగుల్ స్పందించలేదు. చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి రేట్లను బట్టి ప్రతి నెల మొదటి రోజు ఎల్పీజీ ధరలను సవరించనున్నారు. ఈ కొత్త నిబంధన 2021 జనవరి 1 నుంచి అమలులకి రానుంది. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేసే బదులుగా జనవరి1 నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. కొత్త రూల్స్ అమలులోకి వచ్చినప్పటి నుండి పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయొచ్చు. ఇందులో 4 జీఎస్టీఆర్ 3జీ, 4 జీఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. దీంతో 94 లక్షల జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది చిన్న వ్యాపారులకి ఊరట కలగడం విశేషం. -
గ్యాస్ ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు..
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడంపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 66 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రస్తుతమున్న 16,800 కి.మీ. నెట్‌వర్క్‌కు అదనంగా మరో 14,700 కి.మీ. మేర గ్యాస్ పైప్లైన్లను నిర్మించే ప్రక్రియ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 కల్లా 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ఎన్రిచ్ 2020లో వార్షిక ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇది 6.3 శాతంగా ఉంది. పశ్చిమ, తూర్పు తీరాల్లో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతికి టెర్మినల్స్‌ను పెంచుకోవడంపైనా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ట్రక్కులు, బస్సులకు కూడా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో పాటు ఎల్ఎన్జీని కూడా ఇంధనంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇక పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇరాన్ చమురుకు అవకాశం లభించాలి ఇరాన్, వెనెజులా నుంచి చమురు దిగుమతులను పునరుద్ధరించే దిశగా అమెరికా కొత్త ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. దీనివల్ల మరిన్ని ప్రాంతాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు భారత్‌కు అవకాశం లభించగలదని తెలిపారు. చమురు క్షేత్రాలపై ఎక్సాన్ ఆసక్తి భారత్‌లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు ఎక్సాన్ మొబిల్ చర్చలు జరుపుతోందని ప్రధాన్ చెప్పారు. ఆఫ్‌షోర్ బ్లాక్‌ల అభివృద్ధిలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ఎక్సాన్ మొబిల్ గతేడాదే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
టారిఫ్‌ల సవరణ: గ్యాస్ షేర్లు రయ్రయ్
ముంబై, సాక్షి: గ్యాస్ రవాణా టారిఫ్‌లకు సంబంధించి పెట్రోలియం, సహజవాయు నియంత్రణ సంస్థ(పీఎన్జీఆర్బీ) తాజాగా సవరణలు ప్రకటించింది. యూనిఫైడ్ గ్యాస్ ప్రసార టారిఫ్‌లను సరళీకరిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. రెండు జోన్ల స్ట్రక్చర్ ఆధారంగా గ్యాస్ లభ్యత, దూరాలకు అనుగుణంగా సవరణలు చేపట్టింది. తద్వారా దూరప్రాంత వినియోగదారులకు ఇంధన ధరలు తగ్గే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గ్యాస్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెరుగుతాయని తెలియజేశాయి. జాతీయ గ్రిడ్‌కు అనుసంధానమైన సుమారు 12 పైప్లైన్లకు సంబంధించి యూనిఫైడ్ టారిఫ్‌ల సరళీకరణకు పీఎన్జీఆర్బీ తెరతీసినట్లు వివరించాయి. దీంతో గ్యాస్ పంపిణీ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కంపెనీల షేర్లన్నీ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (మార్కెట్లు వీక్- షుగర్ షేర్లు స్వీట్) యమస్పీడ్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్(జీఎస్పీఎల్), అదానీ గ్యాస్, మహానగర్ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ సందడి చేస్తున్నాయి. తొలుత రూ. 228ను అధిగమించిన జీఎస్పీఎల్ షేరు ప్రస్తుతం 9.25 శాతం ఎగసి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఇంద్రప్రస్థ గ్యాస్ 13 శాతం దూసుకెళ్లి రూ. 505 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515కు చేరింది. ఇక తొలుత రూ. 1,058కు చేరిన మహానగర్ గ్యాస్ 12.4 శాతం జంప్‌చేసి రూ. 1,044 వద్ద కదులుతోంది. అదానీ గ్యాస్ తొలుత 9 శాతం వృద్ధితో రూ. 345కు చేరింది. ప్రస్తుతం 4.3 శాతం లాభంతో రూ. 330 వద్ద ట్రేడవుతోంది. ఇదేవిధంగా గుజరాత్ గ్యాస్ 5 శాతం బలపడి రూ. 360 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో దాదాపు 20 శాతం పురోగమించి రూ. 412ను దాటేసింది. కాగా.. గెయిల్ షేరు 1 శాతం లాభంతో రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107కు చేరింది. -
‘ఏఎల్పీ’లో విష వాయువు!
సింగరేణికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూడోప్యానెల్ ఏర్పాటుకు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. గనిలో బొగ్గు నిల్వలు పూర్తయిన రెండో ప్యానెల్లో విషవాయువుల తీవ్రత అదుపులోకి రాలేదు. ప్యానెల్లో బొగ్గుకు మంటలంటుకోవడంతో కార్బన్‌మోనాక్సైడ్(సీఓ) విషవాయువులు పెరిగిపోయాయి. మే 4న రెస్క్యూ సిబ్బంది సహాయంతో ప్యానెల్‌కు గోడలు కట్టి మూసివేశారు. అదే ప్యానెల్లో ఉన్న బొగ్గుకు ఆక్సిజన్ తగలకుండా ప్యానెల్‌కు సమాంతరంగా బోర్వెల్స్వేసి సీఓటూ, నైట్రోజన్ పంపించారు. ఈ క్రమంలో ఈనెల 2న ప్యానెల్‌ను తిరిగి ఓపెన్ చేశారు. గోదావరిఖని(రామగుండం): రెండు నెలల అనంతరం గనిలోని రెండో ప్యానెల్‌ను రెస్క్యూ సిబ్బంది సాయంతో ఈనెల 2న తెరిచారు. మొదటి రెండు రోజుల్లో ప్యానెల్లో విషయవావుల ప్రభావం కన్పించలేదు. మూడో రోజు ఆదివారం నుంచి విషయవావులు పెరగడంతో బొగ్గు చల్లారనట్లుగా భావిస్తున్నారు. ఈక్రమంలో మండుతున్న బొగ్గు పొరలపై నీటిని చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రూ. 145కోట్ల విలువైన చాక్స్ సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టులో రెండు ప్యానెళ్లలో బొగ్గును విజయవంతంగా వెలికితీశారు. మూడో ప్యానెల్ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్న క్రమంలో రెండో ప్యానెల్లో ఉన్న యంత్రాలను మూడో ప్యానెల్లోకి తరలించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో లాంగ్వాల్ యంత్రానికి సంబంధించి మిగితా భాగాలు తరలించారు. హైడ్రాలిక్ చాక్స్ మాత్రం అందులోనే ఉండిపోయాయి. అందులో ఉన్న విషవాయులను అరికట్టేందుకు మే 4న ప్యానెల్‌కు గోడ పెట్టి మూసివేశారు. దీంతో రూ.145కోట్ల విలువచేసే 145హైడ్రాలిక్ చాక్స్ అందులోనే ఉండిపోయింది. విషవాయుల తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి ప్రాపర్టీని వెలికితీయాలనే ఆలోచనతో యాజమాన్యం వేచి చూసింది. ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో మూసివేసిన గోడలను తిరిగి ఓపెన్ చేశారు. ప్యానెల్లో మళ్లీ మొదలైన మంటలు.. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూసివేసిన రెండో ప్యానెల్‌ను ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో తెరిచారు. మొదటి రెండు రోజులు బాగానే ఉన్నప్పటికి మూడో రోజునుంచి అందులోంచి మళ్లీ వేడి రావడంతో పాటు విషయవాయువుల తీవ్రతను గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అందులో ఉన్న చాక్స్‌ను తొలగిస్తూ మంటలను అరికట్టే పనిలో నిమగ్నమైయ్యారు. అయితే తొందరపడి ప్యానెల్ గోడలు తొలగించారని దీంతో పాత పరిస్థితి పునరావృతం అయ్యిందని నిపుణులు అంటున్నారు. మరికొన్ని రోజులు ప్యానెల్ మూసివేసి ఉంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ కంట్రోల్ చేస్తూ చాక్స్ వెలికితీస్తాం: అధికారులు మూసివేసిన ప్యానెల్ తెరిచిన మాట వాస్తవమేనని, అందులో 145 హైడ్రాలిక్ చాక్స్ ఉన్నాయని, ప్యానెల్లో ఉన్న వేడిని తగ్గిస్తూ చాక్స్‌ను బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు తెలిపారు. గనిలోని ప్యానెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఒకవైపు మంటల తీవ్రతను తగ్గిసూ్తనే రోజుకు నాలుగుచొప్పున హైడ్రాలిక్ చాక్స్కు బయటకు తీస్తామని తెలిపారు. మరీ అదుపులోకి రాకుంటే తిరిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన అధికారులు రెస్క్యూ, వైద్య సిబ్బంది గనిపై నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. -
గడువు దాటిన సిలిండర్లతో పొంచి ఉన్న ముప్పు
నిడమర్రు: వంట గ్యాస్ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం ఎంత సులువో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీ డీలర్ çసరఫరా చేసిన వంటగ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుంది. ఎక్స్‌పయిరీ తేదీ అంటే ఆ సిలిండర్ వినియోగించడానికి గడువు పూర్తయిందని సూచన. గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు, ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంట గ్యాస్ సిలిండర్‌ను ఫిల్లింగ్ చేసే మయంలో నిబంధనలు ఏమిటి..?, సిలిండర్ గడువు తీరిందని ఎలా గుర్తించాలి.. తదితర సమాచారం తెలుసుకుందాం.. సిలిండర్‌కు 10 ఏళ్ల గడువు చట్టప్రకారం వంట గ్యాస్ (ఎల్పీజీ )సిలిండర్ అన్ని భద్రతా ప్రమాణాల పరీక్షలు పూర్తి చేసుకున్న కొత్త సిలిండర్ గడువు 10 ఏళ్ల వరకూ ఉంటుంది. సిలిండర్ తయారీలో ప్రత్యేకమైన ఉక్కుతోనూ, సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాన్డర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజిన్స్, బీఐఎస్ అనుమతులు తప్పని సరిగా తీసుకున్నాకే సిలిండర్ అందుబాటులోకి వస్తుంది. ఒకసారి లోపాలు కనిపించిన వాటిని సరిచేసి బీఐఎస్ ధ్రువీకరణ తీసుకున్న సిలిండర్‌లో మరోసారి పరీక్షల సమయంలో లోపాలు కనిపిస్తే తక్షణం దాన్ని తుక్కు కింద పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ దానిలో గ్యాస్ నింపకూడదు. గడువు తేదీఎలా తెలుసుకోవాలి..? ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో సిలిండర్ పరీక్షలకు వెళ్లాల్సి ఉందన్న సంకేతాన్ని సిలిండర్‌పై గుర్తించడం చాలా సులభం. సిలిండర్‌పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్‌పై ఏ17 అని ఉందనుకోండి అదే ఎక్స్‌పయిరీ తేదీ అని గుర్తించాలి. 19 అంకె 2019 సంవత్సరాన్ని, అంగ్ల అక్షరం –ఎ మొదటి త్రైమాసికం అని అర్థం. అంటే 2019 మార్చిలోపు ఈ సిలిండర్ గడువు తేదీ ముగుస్తుంది. నెలను ఇలా గుర్తించాలి. ఎ– ( జనవరి నుంచి మార్చి) బి– (ఏప్రిల్ నుంచి జూన్) సి– (జులై నుంచి డిసెంబర్) మూడు నెలల గ్రేస్ పిరియడ్ ప్రతీ సిలిండర్‌పై ఉన్న గడువు తర్వాత మరో మూడు నెలలు గ్రేస్ పిరియడ్ ఉంటుంది. అంటే వినియోగదారుని దగ్గరకు వెళ్లిన సిలిండర్ తిరిగి డీలర్ వద్దకు చేరి అక్కడి నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా ఈ గ్రేస్ పీరియడ్. అంతేగానీ కస్టమర్ వాడుకునేందుకుకాదు. అంటే ఏ–2019 గడువుతో ఉన్న సిలిండర్‌ను మార్చి నెల తర్వాత గ్యాస్ డీలర్ మీకు పంపిస్తే ఎట్టి పరిస్థితిల్లోనూ దీన్ని తీసుకోవద్దు. మరో సిలిండర్ కోరే హక్కు వినియోగదారుడికి ఉంది. కొంత మంది డీలర్లు గడువు తేదీని పెయింట్‌తో మార్చుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని గమనించాలి. వినియోగదారుడి హక్కులు ♦ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆకనెక్షన్‌ను మార్చుకోవచ్చు. ♦ బుక్ చేసిన ఏడు పనిదినాల్లోపు సిలిండర్‌ను కస్టమర్‌కు అందివ్వాలి ♦ కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ జారీ చేయాలి. ♦ కొత్తగా కనెక్షన్ తీసుకునే సమయంలో డీలర్ స్టవ్‌ను కూడా తీసుకోవమని అడుగుతుంటాడు. కానీ నిబంధనల ప్రకారం డీలర్ దగ్గరే స్టవ్ తీసుకోవాల్సిన అవసరంలేదు. ♦ వంటగ్యాస్‌ను వాహనాల కోసం వినియోగించడం చట్టరీత్యానేరం. దీనికి బదులు ఆటోగ్యాస్ కోనుగోలు చేసి వాడుకోవాలి. -
బ్రహ్మం..బ్రహ్మాండం
యాప్రాల్ : కృషి, పట్టుదల ఉంటే సామాన్యుడు సైతం అద్భుతాలు సృష్టిస్తాడు. అందుకు ఉదహరణే బాలాజి నగర్ నివాసి కొదురుపాక లింగబ్రహ్మం. ఇతను ఓ ఇంజనీరు అనుకుంటే పొరపాటే. చదివింది మూడో తరగతే. వరంగల్ జిల్లాలో ఓ మారుమూల గ్రామం ఎల్లాయిగూడెంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించి కంసాలి పని చేసుకుంటూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బాలాజినగర్లో నివాసముంటున్నాడు. ఏదో ఒకటి చేయాలనే తపన ఎప్పటి నుంచో బ్రహ్మం మనసులో పడింది. బొగ్గు, విద్యుత్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెల వల్ల ఖర్చు ఎక్కువగా అవుతుందని భావించి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేయాలనుకున్నాడు. స్నేహితులు, బంధువులు నిరుత్సాహపరిచినా పట్టు వీడలేదు. కుల వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అయినా అదే పనిగా 2004 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు సంవత్సరం పాటు కష్టపడి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేసి తన లక్ష్యాన్ని సాధించాడు. ఇతను రూపొందించిన ఇస్త్రీ పెట్టె ఎల్పీజీ గ్యాస్‌తో పని చేస్తూ రెండు నిమిషాలలోనే వేడెక్కుతుంది. గ్యాస్ ఖర్చు రోజంతా ఇస్త్రీ చేస్తే 8 నుండి 10 రూపాయల వరకు అవుతుందని బ్రహ్మం తెలిపారు. ఇతని ప్రతిభను గుర్తించి అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్నోవేషంట్ ఫౌండేషన్ వారు గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ప్రొత్సహిస్తే బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పిస్తే గ్యాస్‌తో కూడిన ఇస్త్రీ పెట్టెల తయారి కర్మాగారాన్ని నిర్మిస్తానని బ్రహ్మం తెలిపారు. -
గ్యాస్ ట్రబుల్ మందులతో కిడ్నీకి చేటు..
కడుపు ఉబ్బరంగా ఉందనిపిస్తే చాలు.. చాలామంది ఒమీప్రొజోల్, మెటాప్రొలోల్ వంటి మందులు ఎడాపెడా వాడేస్తూంటారు. ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్లు అని పిలిచే ఈ మందుల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సైంటిఫిక్ రిపోర్ట్స్ మ్యాగజైన్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. పీపీఐ మందులతో పోలిస్తే హిస్టమైన్ –2 రకం మందులు తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు తక్కువ. అమెరికాలో అందుబాటులో ఉన్న కోటి మంది రోగుల వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు రూబెన్ అబగ్యాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. పీపీఐ మందులు మాత్రమే తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే ఇతరులతో పోలిస్తే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని చెప్పారు. కొంచెం స్పష్టంగా చెప్పాలంటే ఈ మందులు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పీపీఐ మందులు అత్యవసరమైనప్పటికీ వాటితో ఈ సమస్యలున్నాయని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని.. పైగా పీపీఐ పద్ధతిపై ఆధారపడని యాంటాసిడ్లు, హిస్టమైన్ –2 రకం మందులతో దుష్ఫలితాలు తక్కువన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు. -
40వేల కోట్ల పెట్టుబడులు!!
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్‌లు వేలం వేయగా రూ. 60,000 కోట్ల మేర పెట్టుబడులకు కమిట్మెంట్ లభించినట్లు ఆయన తెలియజేశారు. రెండో విడతలో 14 బ్లాక్‌లు ఉన్నట్లు సోమవారం వేలం ప్రక్రియ ప్రారంభించిన > మంత్రి చెప్పారు. మూడో విడత కింద 12 చమురు, గ్యాస్ బ్లాక్‌లు, అయిదు కోల్ బెడ్ మీథేన్ బ్లాక్‌ల వేలం వేయనున్నామని, ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాగలదని ఆయన చెప్పారు. ఓఏఎల్‌పీ–2 కింద వేలం వేసే 14 బ్లాక్‌ల విస్తీర్ణం 29,333 చ.కి.మీ. ఉంటుందని, బిడ్ల దాఖలుకు మార్చి 12 తుది గడువుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 12,600 మిలియన్ టన్నుల నిక్షేపాలు.. కేజీ బేసిన్లో ఒక డీప్ వాటర్ బ్లాక్‌తో పాటు అండమాన్, కచ్ బేసిన్లో చెరి రెండు, మహానది బేసిన్లో ఒక బ్లాక్ వేలం వేస్తున్న వాటిలో ఉన్నాయి. ఈ 14 బ్లాక్‌లలో దాదాపు 12,609 మిలియన్ టన్నుల చమురు, తత్సమాన గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ఓఏఎల్‌పీ –1 లో మొత్తం 55 బ్లాకులు వేలం వేయగా వేదాంత సంస్థ 41 బ్లాకులు దక్కించుకుంది. మిగతావాటిలో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా తొమ్మిది, ఓఎన్జీసీ కేవలం రెండు మాత్రమే దక్కించుకున్నాయి. ఈ 55 బ్లాక్‌ల విస్తీర్ణం 59,282 చ.కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ లైసెన్సు పరిధిలో లేని చిన్న స్థాయి చమురు, గ్యాస్ బ్లాక్‌లను తీసుకునేందుకు కంపెనీలు ఓఏఎల్‌పీ కింద తమ ఆసక్తిని (ఈవోఐ) వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఈ ఈవోఐల ఆధారంగా కేంద్రం ఏటా రెండు విడతలుగా వేలం నిర్వహిస్తుంది. ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌లో ప్రభుత్వానికి అత్యధిక వాటా ఇచ్చే సంస్థకు బ్లాక్‌లు దక్కుతాయి. విదేశీ భాగస్వాములకు ఓకే.. సంక్లిష్ట క్షేత్రాల్లో ఇంధన ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు ప్రైవేట్, విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకునేందుకు అనుమతించనున్నట్లు ప్రధాన్ వివరించారు. -
కాస్త తగ్గిన గ్యాస్‌భారం
విజయనగరం గంటస్తంభం: వంట గ్యాస్ విని యోగదారులకు కాస్తంత ఊరట కలిగింది. రాయితీ, రాయితీయేతర సిలిండర్ల ధర తగ్గిస్తూ చమురుసంస్థలు తీసుకున్న నిర్ణయం జిల్లావాసులను కాస్తంత ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆరు నెలలుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో ఈ నెలలో తగ్గడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందనడంలో సం దేహం లేదు. జిల్లాలో ఏకంగా ప్రజలపై రూ. 22.40లక్షలు భారం తగ్గుతుండడం విశేషం. చమురుధరలు ప్రతి నెలా సమీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా చమురు సంస్థలు నెలాఖరున పెంచడంగానీ, తగ్గించడంగానీ చేస్తుంటాయి. ఇందులో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి శుక్రవారం సమీక్షించిన చమురుసంస్థలు రూపా యి విలువ బలపడ్డంతో ధరలు తగ్గించాయి. తగ్గించిన ధరలుశుక్రవారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తగ్గింపు ఇలా... వంట గ్యాస్ సిలిండరు ధర విజయనగరంలో రూ.948లు ఉంది. 12 సిలిండర్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్న విషయం విదితమే. ఈ మేరకు రాయితీ ధర సుమారు రూ.507లు పడుతోంది. రూ.441లు వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో గ్యాస్ విడుదల చేసిన తర్వాత వినియోగదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమవుతుంది. తాజాగా రాయితీ సిలిండర్‌పై రూ.6.52 తగ్గించడంతో జీఎస్టీతో కలిపి రూ.7 వరకు తగ్గనుంది. అంటే ఇకపై రూ.500లకే వస్తుందన్నమాట. అంటే గ్యాస్ విడుదల చేసిన తర్వాత రూ.448 వరకు ఖాతాల్లో పడనుంది. ఈ విధంగా జిల్లా వాసులపై రూ. 22.40వేల వరకూ భారం తగ్గనుంది. ఇదిలాఉండగా సబ్సడీ లేని సిలిండర్ ధర కూడా భారీగా తగ్గనుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.133 తగ్గించారు. జీఎస్టీ 5శాతంతో కలిపితే రూ.138ల వరకు తగ్గుతుంది. సబ్సిడీ లేని సిలిండర్ల వినియోగం నామమాత్రంగా ఉండటంవల్ల వినియోగదారులకు పెద్దగా ఉపయోగం లేదు. ఎవరైనా విడుదల చేస్తే మాత్రం సుమారు రూ.148ల తగ్గుతుంది. రాయితీయేతర సిలిండర్ ధర తగ్గడంతో ప్రభుత్వానికి మాత్రం వినియోగదారులకు వేసే రాయితీ భారం తగ్గనుంది. ప్రస్తుతం ఇస్తున్న రాయితీ రూ.441లో రూ.148 తగ్గించి వినియోగదారులకు వేస్తారు. రాయితీ, రాయితీయేతర ధరల తగ్గింపు విషయం జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ, కంపెనీలను బట్టి కూడా «తేడా ఉంటుంది. జిల్లావాసులకుఉపశమనమే జిల్లాలో 6.15లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరంతా నెలకు దాదాపు 3.20లక్షల గ్యాస్ బండలు వినియోగిస్తున్నారు. రాయితీ ధర రూ.7 వరకు తగ్గడంతో సుమారు రూ.22.40లక్షల వరకూ వినియోగదారులకు మిగులుతుంది. రాయితీయేతర సిలిండర్లు నెలకు 10వేల వరకు వినియోగించినా రూ.14.80లక్షలు ఆదా అవుతుంది. -
ముఖేష్ అంబానీని అరెస్టు చేయాలి
తాడితోట (రాజమహేంద్రవరం): జిల్లా నుంచి రూ. 19వేల కోట్ల విలువైన గ్యాస్‌ను చోరీ చేసిన ముఖేష్ అంబానీపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. అమలాపురం అయిల్ స్కాంలో నిందితులపై చర్యలు తీసుకునే హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో ముఖేష్ అంబానీ దోపిడీపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, సుప్రీం కోర్టులో కేసు వేశానని తెలిపారు. ఈ ఆయిల్ స్కాం వాస్తమేనని కెనడాకు చెందిన సంస్థ నివేదిక ఇచ్చినా, కేంద్రం నియమించిన షా కమిటీ నిర్థారించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించలేదని ఆరోపించారు. అమలాపురంలో ఆడుకుంటున్న పిల్లలపైకి హోం మంత్రి సోదరుడు సిద్ధప్ప నాయుడు కుక్కను ఉసిగొల్పడంతో 9వ తరగతి చదువుతున్న అరుణ్ కుమార్ మరణించాడన్నారు. అరుణ్ కుమార్ శరీరంపై 78 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టు మార్టం రిపోర్టులో వచ్చిందని తెలిపారు. అరుణ్ కుమార్ మృతికి కారకులైన వారికి పదేళ్ల జైలు శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కాట్రావుల పల్లిలో దళిత యువకుడిపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ఈ నెల 16న కాట్రావులపల్లి నుంచి పాదయాత్ర నిర్వహించి జిల్లా జడ్జికి వినతి పత్రం అందిస్తామని తెలిపారు. కాకినాడలో వంశీధర్ అనే విలేకరికి జర్నలిస్ట్ హెల్త్ స్కీం కార్డు ఏమాత్రం పనికిరాకుండా పోయిందన్నారు. ఆ విలేకరి సొంత డబ్బుతో అత్యవసర వైద్యం చేయించుకున్నప్పటికీ ప్రాణాలు కోల్పోయాడన్నారు. దండోరా నాయకులు తుత్తరపూడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ డెలివరీ చేయకుండానే చేసినట్లు ఎస్ఎంఎస్లు
అత్తాపూర్‌కు చెందిన సుభాషిణీ రెడ్డి ఈ నెల 4న తన మొబైల్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసింది. నాలుగు రోజులు తరువాత క్యాష్ మెమో కూడా జనరేట్ అయింది. అయితే సిలిండర్ ఇంటికి డెలివరి కాలేదు. విచిత్రమేమంటే 10వ తేదీన సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో అవాక్కైన ఆమె డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా మరో సారి బుక్ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. సిలిండర్ రాకపోవడానికి కారణం మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో చేసేదిలేక ఆమె మరోసారి బుక్ చేయక తప్పలేదు. మూడు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది.. కానీ. వారం గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇంటికి చేరలేదు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గోపాల్ ఈనెల 15న గ్యాస్ బుక్ చేశారు. రెండు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది. మూడు రోజుల తర్వాత బాయ్ సిలిండర్ ఇంటికి తీసుకొచ్చారు. మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి బుక్ చేస్తే తెచ్చిన సిలిండర్ డెలివరి చేసి వెళ్తానన్నాడు. చేసేది లేక బాయ్ ముందే మరోసారి మొబైల్ ద్వారా బుక్ చేయక తప్పలేదు. బుకింగ్ ఎస్ఎంఎస్ చూసి సిలిండర్ డెలవరీ చేసి వెళ్లాడు బాయ్. ఆ తరువాత సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. రెండో సారి బుకింగ్‌కు మరుసటిరోజు క్యాష్ మెమో జారీ అయింది. అ తర్వాత సిలిండర్ డెలవరీ ఎస్ఎంఎస్ వచ్చింది. అయితే సిలిండర్ మాత్రం రెండో సారి రాలేదు. సాక్షి, సిటి బ్యూరో : మహా నగరంలో ఇదీ గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. ఏజెన్సీలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. వంట గ్యాస్ ధర పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్లు తెలివిమీరుతున్నారు. సబ్సిడీ పై వంట గ్యాస్ ఏడాదికి 12 సిలిండర్ల పరిమితి కారణంగా గ్యాస్ బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య ఒక గడువు అంటూ లేకుండా పోయింది. ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని తెప్పించుకునే వెసులు బాటు ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శించి వినియోగదారుల సబ్సిడీ సిలిండర్ ఎత్తుకెళుతున్నారు. ఫలితంగా వాణిజ్య అవసరాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) వంట గ్యాస్ రాజ్యమేలుతోంది. వాణిజ్య అవసరాలకూడొమెస్టిక్ సిలిండర్లు... ఇంటీవసరాలకు ఉపయోగపడాల్సిన వంట గ్యాస్ హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. మహానగరంలో పెద్ద హోటల్స్ ఐదువేలకు పైగా ఉండగా, చిన్న చితక హోటల్స్, టీ, టిఫిన్, గరం మర్చి సెంటర్లు, బండీలు సుమారు లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, మిగిలినా చిన్నాచితకా హోటల్స్, బండీల్లో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి...దీంతో ప్రతిరోజు లక్షకుపైగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య కనెక్షన్లు అంతంతే.. మహా నగరంలోని హైదరాబాద్–రంగారెడ్డి –మేడ్చల్ జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. డొమెస్టిక్ మాత్రం 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షవరకు డొమెస్టిక్ సిలిండర్ల డిమండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరి కావడం లేదు. వాణిజ్యఅవసరాలకు కొరత లేకుండా పోయింది. -
ఇంటింటికీ ‘మేఘా గ్యాస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ఫ్రా దిగ్గజం ‘మేఘా ఇంజనీరింగ్’ (ఎంఈఐఎల్)... గ్యాస్ సరఫరాలోకి ప్రవేశిస్తోంది. గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్రాజెక్ట్‌ను ఆంధప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని తుముకూరు, బెల్గాం జిల్లాల్లో ఆరంభిస్తోంది. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా ఆరంభిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో సంస్థ తెలియజేసింది. గ్రామీణ ప్రాంతంలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలోకి అడుగుపెడుతున్న తొలి కంపెనీ ఇదే. ‘‘కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో ఆగిరిపల్లి, కానూరుల్లో ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనికి అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ కూడా సిద్ధమయింది. కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 571 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఇప్పటికే పూర్తయింది. తుముకూరు జిల్లాలో 300 కి.మీ., బెల్గాం జిల్లాలో 350 కిలోమీటర్ల భూగర్భ పైప్‌లైన్ కూడా గ్యాస్ సరఫరాకు సిద్ధమయింది. దీనికి అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ–గెయిల్ నుంచి పొందేలా ఒప్పందం చేసుకుంటున్నాం’’ అని ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అందుబాటు ధరల్లో ఉండే ‘మేఘా గ్యాస్’ వాణిజ్య కార్యకలాపాలు... త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారాయన. రోజుకు 1.4 లక్షల ఘనపుటడుగుల గ్యాస్! గ్యాస్‌కోసం ఓఎన్జీసీ–గెయిల్‌తో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పిన రాజేశ్‌రెడ్డి... కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో ఓఎన్జీసీ ఇటీవలే వాణిజ్యపరమైన ఉత్పత్తి ఆరంభించినట్లు తెలియజేశారు. దీన్నుంచి స్థానిక సరఫరా కోసం రోజుకు 90వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఇక కర్ణాటకలోని రెండు జిల్లాలకూ రోజుకు 50వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పటికే కొందరికి గ్యాస్ కనెక్షన్లు కూడా ఇచ్చామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా మొదలవుతుందని కంపెనీ తెలియజేసింది. వినియోగదారుల ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా కంపెనీ రూపొందించింది. -
భారత్‌కు పెట్రోల్, గ్యాస్ అమ్మేందుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి పెట్రోల్, గ్యాస్ విక్రయించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రకటించారు. తమ దేశంలో చబహార్ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రౌహనీ శుక్రవారం చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా నంటూ రౌహనీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐక్యత లేకపోవడం వల్లే.. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించే సాహసం చేసిందని రౌహనీ విమర్శించారు. ముస్లింల మొదటి కిబ్లా(నమాజ్ చేసే వైపు) ఇప్పుడు ఇజ్రాయెల్ అధీనంలో ఉండటానికి ఇస్లామిక్ దేశాల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమన్నారు. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేనందున అమాయక పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంద న్నారు. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికాలో మానవత్వం మంటగలుస్తోందని, అమెరికాలోని విద్యాలయాలు, వ్యాపార సంస్థల్లో అమాయకులపై దాడులు సర్వసాధారణం అయ్యాయన్నారు. ఇస్లామిక్ దేశాలు తమ వ్యక్తిగత విశ్వాసాలు, నమ్మకాలను పక్కన పెట్టి ఇస్లాం ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూస్తున్నాయని ఇది సరికాదన్నారు. ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని పాటించే వారని, ఇస్లాం వైషమ్యాలను, భయాందోళలను సృష్టించే మతం కాదని చెప్పారు. ఇరు దేశాల మధ్య కొత్త శకం.. భారత్–ఇరాన్ మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమవుతోందని రౌహనీ చెప్పారు. భారత్–ఇరాన్ మధ్య దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు ఉన్నాయని, భారత్‌తో వ్యాపార, దౌత్య సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు వెస్ట్రన్ ఆసియా దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల ఎదుగు దలకు దోహదం చేస్తాయన్నారు. భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటి దని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నా యని పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని రౌహనీ సూచించారు. భారత్‌లో అన్ని వర్గాల మధ్య శాంతి, సామరస్యం ఎప్పటికీ కొన సాగాలని ఆకాంక్షించారు. పలు దేశాలు ఇరాన్ ప్రజలకు వీసాల జారీలో జాప్యం చేస్తున్నాయని, ఇరాన్ మాత్రం అన్ని దేశాలు ప్రత్యే కించి భారత ప్రజలకు వీసాల జారీని సులభతరం చేసిందన్నారు. -
నడిరోడ్డుపై బోల్తాపడ్డ గ్యాస్ ట్రక్కు.. భగ్గుమన్న మంటలు!
చైనాలో నడిరోడ్డు మీద పెనుప్రమాదం సంభవించింది. సహజ వాయువు (గ్యాస్)ను తరలిస్తున్న ట్రక్కు ఎక్స్‌ప్రెస్ హైవే మీద బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ట్రక్కు సమీపంలో ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
నడిరోడ్డు బోల్తాపడ్డ గ్యాస్ ట్రక్కు.. భగ్గుమన్న మంటలు!
-
గ్యాస్ బుకింగ్ వయా ఫేస్బుక్, ట్విటర్
న్యూఢిల్లీ : ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా?. అయితే, మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ విధానంలో సిలిండర్‌ను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు!. డిజిటలైజేషన్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కల్పించింది. ఫేస్‘బుక్’లో ఇలా.. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన అనంతరం ఐఓసీఎల్ అధికారిక పేజీ (@indianoilcorplimited)కి వెళ్లి, అక్కడ కనిపిస్తున్న బుక్ నౌ (Book Now) అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. తర్వాత మీ వివరాలను నింపితే సరి. ట్విటర్లో ఇలా.. ట్విటర్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయానికొస్తే, లాగిన్ అయిన అనంతరం refill @indanerefill అని ట్వీట్ చేయాల్సి వుంటుంది. అయితే, ట్విటర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవడం తొలిసారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం register LPGID అని ట్వీట్ చేయాలి. సామాజిక మాధ్యమాల వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ప్రజలకు సేవలను సునాయాసంగా అందజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. -
అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్
బనశంకరి: అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.వారి నుంచి 116 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్ రాడ్లు, గ్యాస్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరహళ్లి ప్రధాన రహదారిలోని కోడిపాళ్య గోదాములో వంట గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు సీసీబీ పోలీసులకు పక్కాసమాచారం అందింది. దీని ఆధారంగా బుధవారం దాడిచేసి నిర్వాహకులైన బాగేపల్లి తాలూకా చేలూరుకు చెందిన సునీల్‌కుమార్, కనకపుర పైప్‌లైన్ రోడ్డు నివాసి శివరాజు, గవిపురం గుట్టహళ్లికి చెందిన లక్ష్మణ్గౌడను అరెస్ట్ చేశారు. సిలిండర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకొని నిందితులపై కెంగేరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్
35.49 లక్షలతో ఏర్పాటుకు చర్యలు కొండదిగువన గోశాలలో రెండు షెడ్ల నిర్మాణం దేవస్థానం కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ పాలకమండలి సమావేశంలో తీర్మానాలు అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలోని నిత్యాన్న దాన పథకంలోని ఆహార వ్యర్థాలు, వ్రతాల విభాగంలో వచ్చే వ్యర్థాలను వినియోగిస్తూ రత్నగిరి కొండమీద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. పాలక మండలి సమావేశం ఆదివారం దేవస్థానంలోని ప్రకాష్‌సదన్‌లో గల సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. సమావేశపు అజెండాలో పొందుపరచిన 41 అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో సభ్యులు చిర్ల శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి వీరదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి శింగారెడ్డి, రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, పర్వత రాజబాబు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను అధికారులు తెలియజేశారు. ముఖ్యమైన తీర్మానాలు దేవస్థానంలోని శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ ఆలయాలు, తొలిపాంచా, ప్రసాదం కౌంటర్ కు రంగులు వేయడానికి తీర్మానించారు. దేవస్థానంలో గత నెలలో ఈ–ప్రోక్యూర్మెంట్ కం బహిరంగవేలం ద్వారా 14 టీ, కాఫీ మిషన్ల నిర్వహణకు గాను హెచ్చు పాటను ఖరారు చేశారు. కొండదిగువన గోశాలలో రూ.19.95 లక్షలతో ఏసీ షీటుతో రెండు షెడ్లు నిర్మించేందుకు తీర్మానించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెందుర్తిలో నిర్మించిన గోశాలలో గోవుల పరరక్షణ, మేత, దాణా సరఫరా అన్నవరంలోని గోశాల ద్వారా చేసేందుకు పాలకమండలి తీర్మానించింది. రూ.30 లక్షలతో దేవస్థానంలోని ప్రకాష్ సదన్ సత్రం వెనుక గల పవర్ హౌస్‌లో, కొండదిగువన గల పంపా తీరంలో గల పవర్‌హౌస్‌లో అధునాతన పేనల్ బోర్డులు ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం శివారు బలిఘట్టంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దత్తత తీసుకోవడానికి కమిషనర్ అనుమతి కోసం రాయాలని తీర్మానించారు. సత్యదేవుని ఆలయం వద్ద గల శయన మందిరం వద్ద రూ.2.75 లక్షలతో వ్యయంతో జియో షీట్‌తో షెడ్డు నిర్మాణం ప్రతిపాదనకు అంగీకరిస్తూ తీర్మానించారు. ప్రకాష్‌సదన్ వద్ద రూ.7.75 లక్షలతో టాయ్‌లెట్స్ మరమ్మతులకు తీర్మానించారు. శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల మైదానంలో ఉపాధి హామీ నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు. -
గ్యాస్ మంట
కొవ్వూరు : ఇకపై జనం నెత్తినే వంట గ్యాస్ సబ్సిడీ పడనుంది. దీనికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు లోక్‌సభలో కేంద్రమంత్రి దర్మేంద్రప్రధాన్ లిఖితపూర్వకంగా వెల్లడించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూలై నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ.4 పెంచనున్నట్టు ఆయన ప్రకటించడంపైనా ఆందోళన రేగుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15,72,415 గృహావసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ప్రతి వినియోగదారునికీ మొత్తం 12 సిలిండర్లు సబ్సిడీపై లభిస్తున్నాయి. అంత కంటే ఎక్కువ వినియోగిస్తే సబ్సిడీ లేకుండా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సబ్సిడీని పూర్తిగా తొలగించే వరకు లేదా మార్చి 2018 వరకు, లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతినెలా రూ.4 చొప్పున సిలిండర్ ధరను పెంచుతున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. 2014 నుంచి సబ్సిడీ 2014 నవంబర్ నుంచి వంటగ్యాస్‌పై కేంద్రం రాయితీ ఇస్తోంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తోంది. ముందుగా లబ్ధిదారుడు ప్రభుత్వం అందించే సబ్సిడీ సోమ్ముతో కలిపి సిలిండర్ ధర చెల్లించి కొనుగోలు చేస్తే తర్వాత సబ్సిడీ సొమ్ము జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సబ్సిడీ సోమ్ము రూ.200లకు పైబడి ఉండేది. ఈనెల రూ.41కి తగ్గిపోయింది. గ్యాస్ ధర ఆధారంగా సబ్సిడీ నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు కేంద్రం యత్నిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.ఐదు కోట్ల భారం: తాజాగా సిలిండర్ ధర రూ.4 చొప్పున పెంచడం వల్ల జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.63 లక్షలకుపైగా భారం పడుతున్నట్టు అంచనా. ఈ లెక్కన ఏడాదికి రూ.7కోట్లకుపైగా భారం పడుతుందని తెలుస్తోంది. సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తే..! అదే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తే భారం పదిరెట్లు పెరగనుంది. ఉదాహరణకు ఆగస్టులో ఒక్కో సిలిండర్‌పై రూ.41 చొప్పున సబ్సిడీ అందించాలని చరుము కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన లెక్కిస్తే జిల్లాలో మొత్తం లబ్ధిదారులపై నెలకు రూ.6,44,69,015 చొప్పున సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ లెక్కన ఈ భారం ఏడాదికి సుమారు రూ.77.33కోట్లు ఉంటుందని అంచనా. క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్ ధరలల్లో స్వల్ప మార్పులున్నా.. సబ్సిడీ ఎత్తివేస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడుతుందనడంలో సందేహం లేదు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మళ్లీ పేదలు వంటగ్యాస్ భారం తగ్గించుకోవడం కోసం కట్టెల పొయ్యిల వైపు అడుగులు వేయక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. సమజసం కాదు మార్చి నుంచి అన్ని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ తొలగిస్తామని ప్రకటించడం సమజసం కాదు. ఇప్పటికే సిలిండర్ పొందాలంటే సబ్సిడీ సోమ్ము కలిపి చెల్లించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సిలిండర్‌పై నెలకు రూ.4ల చొప్పున ధర పెంచడం పేదలపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటనపై స్పదించకపోవడం బాధాకరం. తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు ఇబ్బందే గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి పూర్తిగా ఎత్తి వేస్తామని చెప్పడం సరికాదు. మహిళలు చాలా బ్బంది పడాల్సి వస్తోంది. సిలిండర్‌కు రూ.4 చొప్పున పెంచుతామని చెప్పడం కూడా తగదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కావూరి కుమారి, మహిళా సర్పంచ్ వేగేశ్వరపురం -
కడుపులో గ్యాస్... మిరియాల పొడితో చెక్!
హెల్త్ టిప్స్ గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను మిరియాలను వేయించి పొడి చేసి, చిటికెలు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి, తేనెతో కలిపి రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యతోబాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు లేదా పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. పళ్లనొప్పులకు... అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి. గొంతునొప్పి, మంట, దగ్గులకు... టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. -
పైపులు వీక్.. గ్యాస్ లీక్
ఒకే చోట ఏడు బావులు ధర్నాకు దిగిన గ్రామస్తులు అంతర్వేదికర (సఖినేటిపల్లి) : గ్రామంలోని రక్షణలేని ఓఎన్జీసీ బావులతోను, తుప్పుపట్టిన పైపులైన్లు, పైపుల జాయింట్‌లతోను ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బావులు వద్ద శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోవడం, తుప్పు పట్టిన జాయింట్లను తొలగించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాల్లో సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, అటుపై వీటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా గ్యాస్ లీకేజీ .. గ్రామంలోని దిండమెరక, బెల్లంకొండ గ్రూపులకు సమీపంలో మంగళవారం ఉదయం కేవీ 10 బావి నుంచి లీకయిన గ్యాస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక్కడ ఈ బావితో పాటు మరో ఆరు బావుల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తోంది. బావి ముఖ ద్వారం పైపు జాయింట్ నట్లు తుప్పు పట్టి ఊడిపోయి, గ్యాస్ బావి వద్ద నుంచి లీకవ్వడం గ్రామస్తులు బెంబేలెత్తి పోయారు. సుమారు 45 నిమిషాల పాటు లీకయిన ఈ గ్యాస్ బావులన్నింటినీ కమ్మేసింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ సిబ్బంది బావి వద్దకు వచ్చి గ్యాస్ లీకేజీని అరికట్టారు. బావి వద్ద, మోరి జీసీఎస్ వద్ద గొట్టాలను మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్నాకు దిగిన గ్రామస్తులు.. తరుచూ గ్రామంలోని బావులు వద్ద, పొలాల్లోని వెళ్లిన పైపుల నుంచి లీకవుతున్న గ్యాస్ వల్ల తమకు భద్రత లేకుండా పోయిందని గ్రామస్తులు ఏడు బావులున్న ఓఎన్జీసీ సైటులో ధర్నాకు దిగారు. గ్యాస్ లీకేజీలను ముందుగా పసిగట్టే ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, గ్యాస్ లీకేజీల వల్ల దెబ్బతింటున్న పంటలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంకొండ నాని, రావి ఆంజనేయులు, చొప్పల బాబూరావు, చెన్నంశెట్టి సుబ్బారావు, బీ వెంకటేశ్వరరావు, బి.రాజు, తోట వెంకటేశ్వర్లు, రావి వాసు, శ్రీను, విష్ణు, బి. పద్మాజీరావు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో దీపం కనెక్షన్లు
- ప్రతి పంచాయతీలో రెండు ఫాంపాండ్స్ - జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ కర్నూలు(అర్బన్): దీపం కనెక్షన్ల గ్రౌడింగ్‌లో అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లా అత్యంత దిగువ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు, ఉపాధిలో లేబర్ బడ్జెట్, ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓ, డీఆర్డీఏ ఏపీఎంలకు దిశా నిర్దేశం చేశారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న కుటుంబాల సర్వేతో పాటు ఒకేసారి గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో జిల్లా లక్ష్యం 1.50 లక్షలు కాగా, ఇప్పటి వరకు 2132 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. జిల్లాలో ఉపాధి పథకం పనుల కింద లేబర్ బడ్జెట్ తక్కువగా నమోదవుతున్నట్లు చెప్పిన ఆయన ప్రగతి తక్కువగా ఉన్న మండలాల ఏపీఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో వారానికి రెండు ప్రకారం ఫాంపాండ్స్ పనులు పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, హౌసింగ్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు హుసేన్‌సాహెబ్, డా.సీహెచ్ పుల్లారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేశవదాసుపాలెంలో గ్యాస్ లీకేజీ
రెండు వారాల్లో మూడుసార్లు ఇలా.. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న సిబ్బంది సఖినేటిపల్లి(రాజోలు) : కేశవదాసుపాలెంలో మంగళవారం ఉదయం వరి చేలో గ్యాస్ లీకేజీ అయింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ ఎగజిమ్మిన గ్యాస్ క్రమేపీ తగ్గుముఖం పట్టింది. భూగర్భంలో పుష్కర కాలం క్రితం వేసిన పైపులైన్లు తుప్పుపట్టి, పైపునకు ఏర్పడిన పిన్‌హోల్ నుంచి ఈ గ్యాస్ పైకి వచ్చింది. మండలంలోని అంతర్వేదికరలో కేవీ 13, 14, 15 బావులకు సంబంధించిన పైపులైన్లతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఏడు బావుల పైపులైన్లు కేశవదాసుపాలెం వరిపొలాలు మీదుగా మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్‌కు వేశారు. స్థానిక రైతు బెల్లంకొండ నారాయణ రావు వరిచేల మీదుగా వెళ్లిన ఈ లైన్లుల్లో ఏ పైపులైను నుంచి గ్యాస్ లీకేజీ అవుతోందో గుర్తించడానికి ఓఎన్జీసీ సిబ్బందికి కొంత సమయం పట్టింది. ఎట్టకేలకు కేవీ 15 బావి నుంచి మోరి జీసీఎస్‌కు వెళ్లిన గ్యాస్‌పైపులైనులో లీకేజీ అవుతున్నట్టుగా గుర్తించి, తదనుగుణంగా పైపులైనులో గ్యాస్‌ను అదుపు చేయడంతో పరిస్థితి చక్కబడింది. గ్యాస్ అదుపులోకి తెచ్చిన సిబ్బంది పైపునకు మరమ్మతులు చేశారు. తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు పరిస్థితిని ఎప్పటికప్పుడు అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీఓ ఆదేశాలతో రాజోలు ఫైర్‌స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలంలో మోహరించారు. -
వరి పొలంలో గ్యాస్ లీకేజీ
రాజోలు : గ్రామంలోని వరిపొలంలో శుక్రవారం మధ్యాహ్నం ఓఎన్జీసీ పైపు లైను నుంచి గ్యాస్‌తో కూడిన చమురు లీకయింది. భూగర్భంలో ఏనాడో వేసిన పైపులు తుప్పుపట్టి, పైపుకు ఏర్పడిన పి¯ŒSహోల్ లీకేజీకి దారితీసింది. దాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మోరి గ్యాస్ కలెక్ష¯ŒS స్టేష¯ŒS సిబ్బంది వచ్చి లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని అంతర్వేదికరలోని సెయింట్ మేరీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కేవీ 13, 14 బావులకు సంబంధించిన పైపులైన్లతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఏడు బావుల పైపులైన్లు కేశవదాసుపాలెంలోని వరిపొలాల మీదుగా మోరి జీసీఎస్ వరకూ వేశారు. తొలుత తొమ్మిది పైపులైన్లలో ఏ లైనులోని పైపునుంచి లీకేజీ అవుతోందో గుర్తించడం సిబ్బందికి కష్టతరమైంది. జీసీఎస్ వద్ద ఆయా బావుల పైపులను బంద్ చేస్తూ చివరికి 13, 14 బావులకు చెందిన పైపులను మూసివేయడంతో, ఈ రెండింటికి కలిపి ఉన్న ప్రధాన పైపు నుంచి లీకయినట్టు గుర్తించారు. గ్యాస్, చమురు అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టింది. స్టేష¯ŒS సిబ్బంది పీఎం పాటిల్ తదితరులు లీకేజీని అదుపు చేశారు. తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు పరిస్థితిని సమీక్షిస్తూ, ఆర్డీఓ గణేష్‌కుమార్‌కు సమాచారం అందజేశారు. ఆర్డీఓ ఆదేశాలతో అదనపు రెవెన్యూ సిబ్బందిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. -
గ్యాస్ సిలిండర్ పేలుడు
l14 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ఆత్రేయపురం (కొత్తపేట) : మండలంలోని ర్యాలి గ్రామంలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన గ్రామంలో కలవరం సృష్టిం చింది. ఈ ఘటనలో 14 మంది గాయాలు పాలయ్యారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్లకు తీవ్ర గాయాలైన ఇద్దరితోపాటు మరొకరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన మరొకరికి కొత్తపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అసలేలా జరిగింది... గ్రామంలో పారిపిరెడ్డి సూర్యనారాయణకు చెందిన గ్యాస్ వెల్డింగ్ షాపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల సమయంలో షాపులో యజమాని వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాడికి వెల్డింగ్ షాపు ధ్వంసమైంది. యజమాని సూర్య నారాయణతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కొడమంచలి అనంద్‌కుమార్, పల్లేటి సరేష్, చదులవాడ సోనియా, బుడ్డిగ వెంకట్రావు, పెందుర్తి దేవప్రసాద్, పల్లేటి మరియమ్మ, పెందుర్తి రాఘవమ్మ, చదులవాడ వెంకటేశులు, గంపల రాజు, పల్లేటి కృపావతి, కళ్యాణ రవణమ్మ, ఎస్కే మీరాబి ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడిన మరో ఇద్దరి పేర్లు తెలియాల్సిఉంది. ఈ షాపు సమీపంలో నివాసం ఉంటున్న వారితో పాటు అటుగా వెళుతోన్న వారికి పేలిన సిలిండర్ శకలాలు తగలడంతో గాయపడినట్టు స్థానికులు తెలిపారు.రాజమండ్రికి చెందిన సూర్యనారాయణ 25 ఏళ్ల క్రితం గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చారు. స్థానిక అరుంధతి పేటలో వెల్డింగ్ షాపుతో పాటు లేతు మిషన్ నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు అస్తి నష్టం ఏర్పడిందని అంచనా. క్షతగాత్రులకు ప్రముఖుల పరామర్శ.. తీవ్రగాయాల పాలైన వారికి స్థానిక పీహెచ్సీలో వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం కొత్తపేట, రాజమండ్రి ప్రభుత్వ అస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జెడ్పీటీసీ సభ్యులు మద్దూరి సుబ్బలక్ష్మి బంగారం, సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, ర్యాలి సర్పంచి పల్లేటి ధనలక్ష్మి, ఆత్రేయపురం, రావులపాలెం మండల పరిషత్ ఉపా«ధ్యక్షులు మద్దూరి సుబ్బారావు, దండు సుబ్రహ్మణ్య వర్మ, రూరల్ బ్యాంకు అధ్యక్షుడు మద్దూరి సుబ్బారావు, ఎంపీటీసీ బోణం రత్నకుమారి, వైఎస్సార్ సీపీ మండల ఎస్సీ సెల్ కన్వీనర్ కప్పల శ్రీధర్, మాజీ రూరల్ బ్యాంకు అధ్యక్షులు మెర్ల వెంకటేశ్వరరావు, ఈలి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు. వీఆర్వో ఫిర్యాదుపై ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు హోంమంత్రి పరామర్శ రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గ్యాస్ సిలిండర్ పేలుడులో గాయాల పాలైన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పరామర్శించారు. ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురికి కంటికి తీవ్ర గాయాలు అయ్యాయని, వారిని కాకినాడలోని కిరణ్ కంటి హాస్పిటల్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖ జిల్లా కేడీ పేటలో లారీ దూసుకుపోయి గాయాలు పాలైన బాధితులకు ప్రభుత్వ పరంగా వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కౌన్సిల్ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధర్, హాస్పిటల్ సూపరిటెండెంట్ డాక్టర్ రమేష్ కిషోర్, టీడీపీ నాయకులు గన్ని కృష్ణ, డీఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ పాల్గొన్నారు. -
‘అమ్మాయిపుడితే లక్ష్మీదేవి అనుకోవాలి’
హైదరాబాద్‌సిటీ: ప్రతి ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి పుట్టిందనుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. వంట గ్యాస్ మీద సబ్సిడీ వదులుకునే పధకం మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ పెట్టినదేనని తెలిపారు. పేదలను, మహిళలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ పాలన కొనసాగుతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణా మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేదంటే ప్రభుత్వ వైఖరి మహిళలపట్ల ఏమిటో మీరు అర్ధం చేసుకోవాలని తెలిపారు. వారసత్వ రాజకీయాలకి బీజేపీలో అవకాశం లేదని స్పష్టం చేశారు. జాజుల గౌరీ లాంటి మహిళా కార్యకర్తను రాష్ట్ర నాయకురాలుని చేసిన ఘనత బీజేపీదేనన్నారు. 33 శాతం వాటా కోసం అందరం కృషి చేయాలన్నారు. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలం పంచపాండవులు లెక్క ధర్మం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. -
మధ్యాహ్న వంటకు గుదిబండ
ఏలూరు సిటీ : సర్కారీ బడుల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించే పథక నిర్వాహకులకు గ్యాస్ కష్టాలు వచ్చి పడ్డాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఇప్పటికే నానా తంటాలు పడుతుంటే తాజాగా గ్యాస్ సిలిండర్ ధరల పెంపు మరింత ఇబ్బందులు పెడుతోంది. మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులు సరిపోక, బిల్లులు సకాలంలో మంజూరు కాక ఆర్థికంగా దెబ్బతింటున్న నిర్వాహకులకు సిలిండర్ ధర గుదిబండగా మారింది. గ్యాస్ ట్రబుల్ మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. సిలిండర్ ధర భారంగా మారడంతో వంటకు కట్టెల పొయ్యిలే నయమని నిర్వాహకులు భావిస్తున్నారు. పాఠశాలలకు రాయితీపై సిలిండర్లను సరఫరా చేస్తారా లేదా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి వాణిజ్య గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇది నిర్వాహకులపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,501కు చేరడం వీరికి మింగుడు పడటం లేదు. జిల్లాలో 936 పాఠశాలల్లో.. జిల్లాలో 3,236 పాఠశాలలు ఉంటే 936 బడుల్లోనే గ్యాస్‌తో వంట చేస్తున్నారు. మిగిలిన 2,300 పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. పాఠశాలల్లో గ్యాస్‌పైనే వంట చేయాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించినా ఫలితం శూన్యం. ఒక్కో పాఠశాలలో సగటున నెలకు 8 సిలిండర్లు వినియోగిస్తుండగా, వీటి కోసం రూ.12 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోందని నిర్వాహకులు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసమే భారీగా ఖర్చు చేయాల్సి వస్తే పిల్లలకు నాణ్యమైన భోజనం ఎలా అందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్యాస్ మంజూరుపై.. జిల్లాలోని ప్రభుత్వ బడులన్నింటికీ గ్యాస్ సిలిండర్ల మంజూరుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నెలాఖరు నాటికి గానీ గ్యాస్ సిలిండర్ల మంజూ రుపై ఉత్తర్వులు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసినా సబ్సిడీ గ్యాస్ బండ ఇస్తారా, లేక సబ్సిడీయేతర సిలిండర్లా, కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. దీంతో సబ్సిడీ సిలిండర్లు సరఫరా చేయకుంటే మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులే ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని సిలిండర్ ధర కూడా తాజాగా రూ. 838 వరకూ పెరగడంతో భారం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయితీ గ్యాస్ ఇవ్వాలి పాఠశాలలకు మంజూరు చేసే గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై ఇవ్వాలి. గ్యాస్ ధరలు పెరిగిపోవటంతో ఇబ్బంది పడుతున్నాం. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,502 ఉంటే, గృహోపయోగ సిలిండర్ ధర రూ.838 వరకూ ఉంది. రెండింటిలో ఏది ఇచ్చినా పిల్లలకు మంచి భోజనం పెట్టే పరిస్థితి లేదు. – ఎస్.హైమావతి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు భారం భరించలేం పాఠశాలలకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్‌కు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. పిల్లలకు ఇస్తున్న సొమ్ములు నాణ్యమైన భోజనం పెట్టేందుకే చాలవు. ఇంకా గ్యాస్ కూడా మేమే భరించాలంటే ఇబ్బం దులు పడాల్సిందే. బిల్లులు సైతం సకాలంలో మంజూరు చేయక అప్పులు చేయాల్సి వస్తోంది. – పి.రంగమణి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు ప్రభుత్వం ఇవ్వనుంది ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మంజూరు చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది. – ఆర్ఎస్ గంగాభవాని, డీఈఓ, పశ్చిమగోదావరి -
వామ్మో గ్యాస్ ధర
– కొండెక్కి కూర్చున్న గ్యాస్ ధరలు – ఫిబ్రవరిలో రూ.700, ఈ నెల రూ.790.50 – వచ్చే నెలలో ఎంతో...? – అంతర్జాతీయ మార్కెట్ అధారంగా మార్పులు – ప్రతి నెలా వడ్డింపులు చేస్తున్న కంపెనీలు – వ్యాపార గ్యాస్ ధర కూడా పెంపు – బెంబేలెత్తుతున్న వినియోగదారులు ఇలా బండ పెరుగుదల... - జనవరిలో ఇంటి గ్యాస్ సిలిండర్ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. - మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. - వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్ సిలిండర్ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు. సబ్సిడీలా... గత ఏడాది గ్యాస్ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది. - ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. అదే జాడలో ధరలూ... - ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్‌ను అందిస్తోంది. - ఈ సిలిండర్ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది. - కేవలం రెండు నెలల్లో గ్యాస్ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. - పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. సాక్షి, రాజమహేంద్రవరం: వంట గ్యాస్ ధర కొండెక్కి కూర్చుంది. వినియోగదారులు గ్యాస్ పోయ్యి వెలిగించకుండానే సెగ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించి గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ధరలను నిర్ణయించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అంతర్జాతీయ మర్కెట్ ఆధారంగా ధరల్లో ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతం ఏడాది నుంచి అమలు చేస్తున్నాయి. జనవరిలో ఇంటి గ్యాస్ సిలిండర్ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. ఇక మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్ సిలిండర్ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు. సబ్సిడీలో కోత... నగదు బదిలీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, వస్తువులపై ఇస్తున్న సబ్సిడీని ఖాతాదారులకు నేరుగా ఇచ్చేలా యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్యాస్ ధర సబ్సిడీ కూడా వారి ఖాతాల్లో జమయ్యేలా గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతాలతో ఆధార్, మొబైల్ నంబర్లను అనుసంధానం చేసింది. ఖాతాదారుడు తన మొబైల్ నంబర్ నుంచి సంబంధింత గ్యాస్ ఏజెన్సీ ఇచ్చిన సెల్ నంబర్‌కు ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఇస్తున్నారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీలు అవకతవకలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావించింది. వినియోగదారుడు గ్యాస్ ధరను ముందు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఇదే విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ఏడాది గ్యాస్ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది. ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. సబ్సిడీ వదులుకున్న వారు నామమాత్రమే... జిల్లాలో 13,10,669 గ్యాస్ కనెక్షన్లున్నాయి. పేద, ధనిక, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, యజమాని, కార్మికుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గ్యాస్ సబ్సిడీ వర్తిస్తోంది. ధనవంతులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంతో మన జిల్లాలో ఉన్న 13,10,669 మంది వినియోగదారుల్లో కేవలం 6000 మంది మాత్రమే సబ్సిడీ వదులుకున్నారు. సాధారణ గ్యాస్ కనెక్షన్లతోపాటు జిల్లాలో 6,056 వ్యాపార కనెక్షన్లున్నాయి. హెచ్‌పీ, భారత్, ఇండేన్ కంపెనీలు జిల్లాలో 71 ఏజెన్సీలను ఏర్పాటు చేసి వినియోగదారులకు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి. బెంబేలెత్తుతున్న వ్యాపారులు... గ్యాస్ ధర ప్రతి నెలా పెరుగుతుండడంతో సాధారణ వినియోగదారులతోపాటు, వ్యాపారస్తులు బెంబేలెత్తుతున్నారు. ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్‌ను అందిస్తోంది. ఈ సిలిండర్ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది. కేవలం రెండు నెలల్లో గ్యాస్ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు: 13,10,669 సబ్సిడీ వదులుకున్నవారు: 6000 వ్యాపార కనెక్షన్లు: 6,056 జిల్లాలో ఏజెన్సీలు: 71 అంతర్జాతీయ మర్కెట్‌కు అనుగుణంగా మార్పులు.. పెట్రోల్, డీజిల్ ధరల లాగానే అంతర్జాతీయ మర్కెట్ ధరల ఆధారంగా ప్రతి నెలా గ్యాస్ ధరలు మారుతుంటాయి. ప్రతి నెలా ఇది తప్పనిసరి. ఒక నెల ధర పెరిగితే మరో నెల తగ్గొచ్చు. పెరిగిన ధరకు అనుగుణంగా వినియోగదారులకు సబ్సిడీ నగదు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ధర పెరిగితే సబ్సిడీ మొత్తం తగ్గుతుంది. గ్యాస్ ధర తగ్గితే సబ్సిడీ మొత్తం పెరుగుతుంది. – వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి. -
గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా
నరసరావుపేటటౌన్ : పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు అట్లూరి విజయకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సామాన్య ప్రజలను సైతం పీక్కుతింటున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇప్పటికే అనేకమార్లు గ్యాస్ ధరలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచారని ఆగ్రమం వ్యక్తంచేశారు. నాయకులు బోయిన సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, మణికంఠ, హరిబాబు తదితరులున్నారు. -
నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా?
తూర్పుపాలెంలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా కానరాని జాగ్రత్త మలికిపురం (రాజోలు) : సమయం : బుధవారం ఉదయం 11 గంటలు స్థలం : తూర్పుపాలెం గ్రామం, కే డబ్ల్యూ 17 జడ్ ఓఎన్జీసీ సైట్ .. ఉన్నట్టుండి డ్రిల్లింగ్ జరిగిన బావి నుంచి అకస్మాత్తుగా భారీ గ్యాస్, ఆయిల్ పెల్లుబికింది. గ్యాస్ కిలో మీటరు మేర ఆవరించింది. సిబ్బంది, ఇంజినీర్లు కూడా తొలుత పరుగులు పెట్టారు.సమీపంలోని జీసీఎస్ ( గ్యాస్ గేదరింగ్ స్టేషన్)ల నుంచి సుమారు 200 మంది సిబ్బంది, నాలుగు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. అరగంట గడిచాక గ్యాస్ తొలగింది. కాసేపు తేరుకున్న సిబ్బంది, కంటికి సంఘటన స్థలం కనిపిస్తుండడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో సంఘటన బావి వద్దకు చేరుకున్నారు. ఒక ఓఎన్జీసీ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఇక్కడ అత్యంత భయంకర వాతావరణం నెలకొంది. ఆయిల్, గ్యాస్ ఆవరించి ఉంది. ఇక్కడే మరో మూడు గ్యాస్ ఆయిల్, బావులు ఉన్నాయి. ఫొటోలు తీస్తే ఆ ఫ్లాష్ తీవ్రతకు ఫైర్ అయితే పెను ప్రమాదం సంభవిస్తుందని స్థానిక విలేకరులను, గ్రామస్తులను హెచ్చరించారు. ప్రమాద తీవ్రత ఏంటో చెప్పకనే అర్థమవుతోంది. దీనికి కారణం ఎవరు. ఇక్కడ జీవిస్తున్న ప్రజలదా? భద్రత లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయిల్ సంస్థలదా? ఇలాంటి అనేక సంఘటనలు ప్రాణాలను హరించి వేస్తున్నాయి. 1990 ప్రాంతంలో కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లోఅవుట్, 1995లో కొత్త పేట మండలం దేవర పల్లి బ్లోఅవుట్, 2014లో నగరం పైప్ లైన్ పేలుడు, సహా అనేక సంఘటనలు ఆయిల్ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. మూడే ళ్ల క్రితం రాజోలు మండంలో కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రెండేళ్ల క్రితం రాజోలు మండలంలో కాట్రేని పాడు బావి బ్లోఅవుట్ కొద్దిపాటిలో తప్పింది. కేజీ బేసిన్లోఉమారు 11 వందల బావులు, మొత్తం 900 కిలో మీటర్లు గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. బావులు కోనసీమలోనే అధికం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకూ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం బావులను, గెయిల్ పైప్లైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కానీ కేజీ బేసిన్లో ఈ బావుల, పైప్లైన్ల నిర్వహణ సక్రమంగాలేదు. అంతా నిర్లక్ష్యం .. బావులు, గ్యాస్ పైప్‌లను తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడయి పోతున్నా వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు పెట్టుబడి పెట్టడం లేదు. నాణ్యత లోపం .. ఆయిల్ బావుల పర్యవేక్షణ, పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వీటి నిర్వహణ, నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దోపిడీయే తప్ప అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రేవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల వల్ల దెబ్బతింటున్న రోడ్లను కూడా ప్రభుత్వమే నిర్మించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సమద్రం నుంచి ఉప్పు నీరు భూబాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది. -
పాడుబడ్డ బావి నుంచి బయటికొస్తున్న గ్యాస్
-
షేల్ గ్యాస్ తవ్వకాలతో అనర్థాలు
భీమవరం : షేల్ గ్యాస్ తవ్వకాల వల్ల ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రొఫెసర్ కె.బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన షేల్ గ్యాస్ వెలికితీత వ్యతిరేక సభలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. షేల్ గ్యాస్‌ను వెలికితీసేందుకు నాలుగు కిలోమీటర్ల పొడవు ఆ తర్వాత అడ్డంగా పైపులు వేస్తారని దీనికిగాను వివిధ రకాల రసాయనాలతో కూడిన నీటిని పదివేల పౌండ్ల ఒత్తిడితో భూమిలోనికి పంపి షేల్ (నాపరాయి)ని పగులగొడతారన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు సైతం కలుషితమై తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. షేల్‌గ్యాస్ తవ్వకాలకు అవసరమైన అధునాతన పరిజ్ఞానం ఓఎన్జీసీ వద్ద లేదన్నారు. 3 లక్షల ఎకరాలకు ముప్పు మూడు జిల్లాల్లో సుమారు 70 వేల బావులను తవ్వడానికి రంగం సిద్ధం చేశారని, ఒక్కో బావి వద్ద సుమారు నాలుగు ఎకరాల పంటకు నష్టం తప్పదని, దీంతో సుమారు 3 లక్షల ఎకరాలకుపైగా పంట కోల్పోవాల్సి వస్తుందని బాబూరావు చెప్పారు. షేల్ గ్యాస్ తవ్వకాలకు నీరు ఎక్కువగా ఉపయోగించాల్సి రావడంతో నీటి కొరత ఏర్పడుతుందన్నారు. షేల్‌గ్యాస్ తవ్వకాలకు ఓఎ¯ŒSజీసీ ఇచ్చిన నివేదికలు సక్రమంగా లేవని దీనివల్ల విపరీతమైన భూతాపం పెరిగిపోయే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు ఇచ్చే కమిటీలు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారాయని, కమిటీలపై ప్రజాప్రతినిధులు పెత్తనంతో ప్రమాదకరమైన వాటికి కూ డా అనుమతులు వస్తున్నాయని బాబూరావు విమర్శిం చారు. మూడు జిల్లాల్లో షేల్‌గ్యాస్ ఆరు లక్షల చదరపు ఘనపుటడుగులు మాత్ర మే ఉందని గుర్తించారని ఇది చాలా తక్కువన్నారు. పంటల దిగుబడిపై ప్రభావం షేల్ గ్యాస్ వెలికితీసే క్రమంలో వెలువడే విషవాయువుల కారణంగా డ్రిల్లింగ్ ప్రాంతంలోని 20 కిలోమీటర్ల వరకు పం టల దిగుబడి ఘోరంగా పడిపోతుందని ప్రొఫెసర్ జి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ చర్యల ను ప్రతి ఒక్కరూ అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాలు కూడా షేల్గ్యాస్ను వ్యతిరేకించాయని స్పష్టం చేశారు. ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి మర్ల విజయకుమార్, సీపీఐ రాష్ట్ర సహాయ కా ర్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నార్ల వెం కటేశ్వరరావు, నెక్కంటి సుబ్బారావు, ఎ ం.సీతారామ్‌ప్రసాద్, చెల్లబోయిన రం గారావు, లంక కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై మంటలు
- ఒకరికి తీవ్ర గాయాలు బేతంచెర్ల(డోన్): స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ గృహంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం.. మారం వేంకటేశ్వర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. అప్పటికే గ్యాస్‌లీకై ఉంది. అతడు గమనించకుండా గ్యాస్ స్టౌ వెలిగించడంతో మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితున్ని 108 ద్వారా బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. -
ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్
-ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు – కోవెలకుంట్ల ప్రాంతంలో ఆరు సిమెంట్ పరిశ్రమలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడి కర్నూలు(అర్బన్): జూన్ నెలాఖరు నాటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్‌లో జెడ్పీ చైర్మన్ చాంబర్లో ఆయన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలో త్వరలో విమానాశ్రయం రాబోతోందని, అలాగే పలు పరిశ్రమలు పురుడుపోసుకోనున్నాయని చెప్పారు. ఉర్దూ విశ్వ విద్యాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతుందని చెపా్పరు. కోవెలకుంట్ల ప్రాంతంలో త్వరలో ఆరు చిన్న, పెద్ద సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. నగర పాలక సంస్థ పరిధిలోని నిరుద్యోగులు, మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. బడుగుబలహీన వర్గాలకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పత్తికొండ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌సబ్సిడీ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోయినట్లు చెప్పారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
భూమి గుల్ల.. భద్రత డొల్ల
చమురు సంస్థల తీరుతో కేజీ బేసి¯ŒS తీరానికి శాపం నిత్య ప్రమాదాలతో భద్రతలేని జీవనం అభివృద్ధికి అక్కరకు రాని సీఎస్సార్ నిధులు మొండిచేయి చూపిస్తున్న చమురు సంస్థలు పార్లమెంట్ కమిటీ సభ్యులూ...మీరైనా చేస్తారా న్యాయం కృష్ణా – గోదావరి బేసి¯ŒS (కేజీ బేసి¯ŒS).. దేశ ఆదాయానికి అక్షయపాత్ర. అపార చమురు, సహజవాయువులు నిక్షిప్తమైన గని. తూర్పుతీరంలో ప్రపంచస్థాయిలో చమురు, సహజవాయుల పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేసింది. వెలికితీసే కొద్దీ లక్షల కోట్ల రూపాయిల ఆదాయాన్ని అందించే కేజీ బేసి¯ŒS దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచింది. ఇదంతా నాణానికి ఓ వైపు ఉన్న వెలుగులు.. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని రైతుల అపోహలు.. బ్లో అవుట్లు, గ్యాస్ పైపులైన్ల లీకేజ్‌లతో జీవనానికే భద్రతలేకుండా పోయిందనే భయాలు.. పచ్చని కోనసీమలో కాలుష్య కాసారంగా మార్చేశారనే ఆరోపణలు.. కోట్లు కొల్లగొడుతూ స్థానికాభివృద్ధిని గాలికి వదిలేసిందనే ఆవేదనలు... రహదారులను ఛిద్రం చేసేశారనే విమర్శలు.. ఇవన్నీ నాణానికి మరోవైపు అలముకున్న చీకట్లు... పార్లమెంటరీ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ మంగళవారం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – అమలాపురం కోనసీమ ఓ ‘మండు’పాతర.. పచ్చని కోనసీమ ఇప్పుడొక మందుపాతరగా మారింది. రూ.కోట్ల విలువైన చమురు, సహజవాయువులను తరలించేందుకు కోనసీమలో వందల కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేసుకుపోయారు. వీటి నాణ్యత విషయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)తోపాటు చమురు సంస్థలు రాజీపడడం అవి ఎప్పుడు? ఎక్కడ? లీవువుతాయో అనే భయం స్థానికులను వెన్నాడుతోంది. కోనసీమలో, మరీ ముఖ్యంగా రాజోలు దీవిలో గ్యాస్ లీకేజ్‌లు నిత్యకృత్యంగా మారిపోయాయి. నగరం దుర్ఘటనకు గ్యాస్పైల్లై¯ŒS పేలడం కారణం. ఇవి కాకుండా సిస్మిక్ సర్వేలపేరుతో నిరంతరం జరిగే బాంబింగ్‌లు కూడా కోనసీమవాసులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. కాలుష్యం ముప్పులో... చమురు, సహజవాయువుల వెలికితీత వల్ల పచ్చని కోనసీమ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. సముద్రగర్భం (ఆఫ్‌షోర్)లోనే కాకుండా భూమి మీద (ఆ¯ŒSషోర్)లో ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పైప్లైన్ల ఏర్పాటుతో కొబ్బరితోట, పచ్చని చేలను తొలగిస్తోంది. దీనికితోడు చమురు శుద్ధి తరువాత వచ్చే చమురు మడ్డిని సముద్రంలోకి, కాలువల్లో వదలడం వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. అలాగే సంస్థల వద్ద వృథాగా ఉండే గ్యాస్ మండించడం వల్ల కూడా గాలిలో తేమ తగ్గి వేడిగా మారుతోంది. ఈ కారణంగా గడిచిన పదేళ్లకన్నా కోనసీమలో సగటు ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు శాతం పెరిగాయి. అక్కరకు రాని సీఎస్ఆర్ నిధులు ఓఎన్జీసీ ఏటా దాదాపు రూ.600 కోట్ల్ల లాభాన్ని ఆర్జిస్తోంది. లాభంలో రెండు శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పా¯Œ్సబులిటీ (సీఎస్ఆర్)కి విధిగా కేటాయించాలి. అంటే కేజీ బేసి¯ŒSలో ఆ సంçస్థ రూ.12 కోట్ల వరకూ సీఎస్ఆర్ నిధులు కేటాయించాల్సి ఉంది. గెయిల్ పైపులైన్లు అధికంగా కోనసీమలోనే ఉన్నాయి. 1998లో వేసిన ఈ పైపులైన్లను గెయిల్ ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగిస్తోంది. నగరంలో గ్యాస్ పైపులైను విస్ఫోటం తర్వాత కూడా ఆ సంస్థ పైపులైన్ల పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. గైయిల్ పైపులైన్లు కోనసీమలో అధికంగా ఉంటే ఆ సంస్థ విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి రూ.50 లక్షలు సీఎస్ఆర్ కింద ఇచ్చింది. అదే కోనసీమలో పైపులైను పేలిపోయి నగరంలో 29 మంది చనిపోయిన పరిస్థితుల్లో ఆ సంస్థ స్థానికంగా ఆస్పత్రి నిర్మాణానికి నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తోంది. మామిడికుదురు మండలం నగరంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ కార్యరూపం లేదు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేష¯ŒS తన ప్రాజెక్టు కాస్ట్లో ఒక శాతం నిధులు సీఎస్సార్గా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు కాస్ట్లో ఒక శాతం అంటే రూ.40 కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో 60 శాతం కోనసీమకు, 40 శాతం పాండిచ్ఛేరి పుదుచ్ఛేరి యానానికి ఇవ్వాల్సి ఉంది. అవి కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. రిలయి¯Œ్స చమురు సంస్థ 2008లో అమలాపురం పార్లమెంట నియోజకవర్గ పరిధిలోని భైరవపాలెం, గాడిమొగ ప్రాంతాలను దత్తత తీసుకుంది. చిత్రమేమిటంటే గాడిమొగ ప్లాంట్‌కు రిలయ¯Œ్స వారి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రూ.22 కోట్లతో రోడ్డు నిర్మించుకుని ఆ నిధులను సీఎస్ఆర్ నిధులుగా చూపించి నయవంచన చేసిందనే ఆరోపణలున్నాయి. రూ.45 వేల కోట్ల ప్రాజెక్టైన రిలయ¯Œ్స భైరవపాలెంలో రూ.75 లక్షలతో కల్యాణ మండపం, గాడిమొగలో రూ.మూడు కోట్లతో పీహెచ్‌సీని సీఎస్ఆర్తో నిర్మిస్తామన్నారు. పూర్తి చేయలేదు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో కెయిర్న్ ఎనర్జీ సంస్థ గ్రామంలో 200 ఎకరాల్లో గ్రీ¯ŒS బెల్ట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా... 23 ఏళ్లుగా దానిని పట్టించుకోవటంలేదు. గ్రామంలో డ్రైన్ల నిర్మించకుండా రోడ్లు వేయడం వల్ల వర్షాకాలం ముంపులో ఉండిపోతున్నాయి. 1995 నుంచి ఏడాదికి రూ.కోటి సీఎస్ఆర్ ఎస్.యానాం గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వాల్సి ఉండగా ఏ ఏడాదికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. విషాదాలకు ముగింపు ఎప్పుడు? l చమరు సంస్థల కార్యకలాపాలు ఆరంభమైన తరువాత జరిగిన అది పెద్ద ఘటన పాశర్లపూడి బ్లోఅవుట్. ఈ ప్రమాదం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1995లో జరిగిన ఈ ఘటన కోనసీమవాసులకు ఇక్కడ జీవనం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసింది. సుమారు రూ.వంద కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. దేవర్లంకతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఇళ్లు బీటలు వారి నష్టపోయారు. ∙ అమలాపురం మండలం తాండవపల్లిలో 2006లో బ్లో అవుట్ జరిగింది. ఒక రోజులోనే మంటలు అదుపులోకి వచ్చినా పాశర్లపూడి బ్లో అవుట్ స్థాయిలో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఓఎన్జీసీకి సుమారు రూ.50 కోట్ల మేర ఆస్తినష్టం జరిగింది. మామిడికుదురు మండలం నగరంలో 2014 జూ¯ŒS 27న గ్యాస్పైప్లై¯ŒS పేలుడు ఘటన 29 మందిని పొట్టనబెట్టుకుంది. కోనసీమలో ఇదే అత్యంత విషాదకరమైన ఘటన. ఇందుకు చమురు సంస్థల నిర్లక్ష్యమే కారణం. ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ముందుగా నష్టపోయిదే మత్స్యకారులే. సముద్రగర్భంలో రిగ్గింగ్, భారీ ఓడలు, పడవులు రాకపోకలకు వీలుగా సముద్రతీరం, గోదావరి నదీపాయల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల అపార మత్స్యసంపద లేకుండా పోతోంది. వారం వేటాడినా గతంలో వచ్చే మత్ససంపదలో సగం కూడా రావడం లేదని, జీవనం గగనంగా మారిందని మత్స్యకారులు వాపోతున్నారు. ఆయా చమురు సంస్థలు తమ కార్యకలాపాలు ఆరంభించిన రోజుల్లో కొద్ది నెలల పాటు మత్స్యకారులకు పరిహారం చెల్లించినా తరువాత పట్టించుకున్న పాపానపోలేదు. భూమి కుంగిపోతుందా? ఓఎన్జీసీ, ఇతర చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని, భవిష్యత్తులో తీరంలో భూములు లేకుండా పోతాయని కోనసీమ వాసుల ప్రధాన ఆరోపణ. భూమి కుంగిన కారణంగా కొద్దిపాటి వర్షానికే తమ చేలు ముంపుబారిన పడడం, తుపాన్ల సమయంలో సముద్రం పోటెత్తి ఉప్పునీరు చేలను ముంచెత్తుతోందంటున్నారు. ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో వరిచేలు ఉప్పుబారిన పడుతున్నాయి. వీటిలో రెండు వేల ఎకరాల్లో రైతులు రెండుపంటల సాగును వదిలేశారు. చమురు, సహజవాయువుల వెలికితీసే సమయంలో భూమి అగాధంగా మారుతోంది. దీనిని వాటర్ ఇంజెక్ష¯ŒS విధానంలో ఇసుకను నింపాల్సి ఉన్నా చమురు సంస్థలు సొమ్ములు మిగుల్చుకునే ఉద్దేశంతో చేయడం లేదని రైతుల ఆరోపణ. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోందని ఇటీవల కోనసీమలో పర్యటించిన పర్యావరణ, భూగర్భ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించడం, ఇందుకు పలు ఉదాహరణలు చూపడం విశేషం. ఈ చిత్రం చూశారా? ఎస్.యానాంలో చమురు, సహజ వాయువుల ఉత్పత్తి సంస్థ కెయిర్న్ ఎనర్జీ çకమ్యూనిటీ సోషల్ రెస్పా¯Œ్సబులిటీ (సీఎస్ఆర్) నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన ఆస్పత్రి ఇది. నిర్మించి ఆరేళ్లు పూర్తవుతున్నా ఈ ఆస్పత్రి ప్రారంభం కాలేదు. వైద్యులు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి నిర్మాణం వరకే తమ బాధ్యతని వైద్యం తమకు సంబంధంలేదని చమురు సంస్థ చేతులు దులుపుకొంది. చమురు సంస్థల వల్ల స్థానికులకు కలుగుతున్న ప్రయోజనాన్ని ఈ భవనం తేటతెల్లం చేస్తోంది. ధ్వంసమవుతున్న రోడ్లు ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల గ్రామీణ, ఆర్అండ్బీ రహదారులు ధ్వంసమవుతున్నాయ. అమలాపురం–ఎస్.యానాం, అమలాపురం– ఓడలరేవులతోపాటు కాట్రేనికోన, మలికిపురం, మామిడికుదురు మండలాల్లో పలు రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. కనీసం తమ సంస్థ వాహనాలు తిరిగే రహదారులను సైతం చమురు సంస్థలు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
పేలిన నిర్లక్ష్యం
పైపులైన్ పేలుడుతో మరోసారి బయటపడిన వైనం చమురుతో నిండిపోయిన రోడ్లు, బోదెలు గొల్లపాలెం గ్రామంలో ఘటన శిథిల లైన్లు.. నాసిరకం పనుల వల్లే..! ముడి చమురు సరఫరాకు కీలకమైన పైపులైన్లు అవి. వాటిని ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నాయి. నాసిరకమైన పైపులు కావడంతో తరచూ పగిలిపోతున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. కేవలం మరమ్మతులతో సరిపుచ్చుతున్న ఓఎన్జీసీ.. వాటిని పటిష్టపరచడంలో నిర్లక్ష్యం చూపుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. – మలికిపురం మలికిపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం సంభ వించిన పైపులై¯ŒS పేలుడుతో ఓఎన్జీసీ నిర్లక్ష్యం, నాసిరకం లైన్ల ఉదంతం మరోసారి బయటపడింది. గ్రామంలోని కరవాక సరిహద్దులో కేడబ్ల్యూఏఏ బావి నుంచి తూర్పుపాలెం జీసీఎస్‌కు క్రూడాయిల్ సరఫరా చేస్తున్న ఈ పైపులై¯ŒS ఉదయం 7.30కు భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు తీవ్రతకు రోడ్డుపై గోతులు పడ్డాయి. క్రూడాయిల్ ఎగసి సరుగుడు చెట్లపై పడడంతో అవి విరిగిపోయాయి. రోడ్లు, సరుగుడు తోటల్లోని బోదెలు చమురుతో నిండిపోయాయి. నాసిరకం వల్లే.. సుమారు పదేళ్ల క్రితమే ఈ పైపులైన్లు వేసినట్టు చెబుతున్నారు. అప్పట్లో నాసిరకంగా వేయడం వల్ల అవి తరచూ పేలిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారు గంటకు పైగా చమురు ఎగసిపడిందని చెప్పారు. ఎట్టకేలకు జీసీఎస్ సిబ్బంది బావి వద్దకు చేరుకుని.. చమురు సరఫరా నిలిపివేయడంతో ఎగసిపడడం తగ్గుముఖం పట్టింది. తోటలకు తీవ్ర నష్టం సుమారు 25 ఎకరాలకు పైగా సరుగుడు తోటలు చనిపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తీరంలోని ప్రధాన రహదారి పైనే ఈ ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ వెళ్లకపోవడం, రైతులు కూడా ఇంకా పొలాల్లోకి రాకపోవడంతో పెను ముప్పు తప్పింది. సముద్ర తీరంలో సుమారు 50కి పైగా చమురు బావులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పైపులను మార్చకపోవడం, మరమ్మతుల్లో ఓఎన్జీసీ పూర్తి నిర్లక్ష్యధోరణి అవలంబించడం వల్లే ఈ ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
దెయ్యాలతిప్పలో అపార గ్యాస్ నిక్షేపాల
ఓఎన్జీసీ జీఎం కామరాజు భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్ప గ్రామంలో చమురు, సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నట్టు గుర్తించామని ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ (కేజీ బేసిన్) ఏవీవీఎస్ కామరాజు వెల్లడించారు. శుక్రవారం భీమవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దెయ్యాలతిప్ప వద్ద రోజుకు 7 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వెలికితీసే అవకాశం ఉందని చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 22 ఉత్పాదక విభాగాలు, 8 డ్రిల్లింగ్ రిగ్గులు, ఒక మినీ రిఫైనరీ ద్వారా 700 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి భూగర్భం, భూమి మీదుగా రోజుకు 32 లక్షల క్యూబిక్ మీటర్ల సహజవాయువు, 850 టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. దేశం మొత్తం మీద ఆరు రాష్ట్రాల్లో సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించమన్నారు. 2020 నాటికి రూ.34 వేల కోట్ల ఖర్చుతో ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ కార్యకలాపాల ద్వారా 70 వేల బ్యారల్స్ ముడి చమురు ఉత్పత్తి కాగదని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. గ్యాస్, ఆయిల్ ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి రాయల్టీ, సెస్ రూపంలో రూ.3,800 కోట్లు, సీఎస్ఆర్ ద్వారా రూ.9 కోట్లు చెల్లిస్తున్నామని కామరాజు చెప్పారు. -
బాబోయ్! భాగ్యనగర్
గ్యాస్ పైపులైను నుంచి లీకైన గ్యాస్ భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు కాకినాడ రూరల్ : సూర్యారావుపేట లైట్‌హౌస్ ప్రాంతంలోని ఎ¯ŒSసీఎస్ ఆయిల్ ఫ్యాక్టరీ సమీపాన భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ నుంచి లీకవడంతో అక్కడి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సుమారు రెండు గంటలపాటు అటుగా వెళ్లేందుకు ప్రజలు, కార్మికులు హడలెత్తారు. లీకేజీ సమాచారం అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ సంస్థ సిబ్బంది, ఎన్ఎఫ్సీఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్స్‌కు చెందిన అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలి వచ్చాయి. అప్పటికే ఉధృతంగా ఎగజిమ్ముతున్న గ్యాస్‌ను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అరగంట అనంతరం లీకేజీని అరికట్టారు. ప్రమాదకరం కాదు ప్రొక్లెయిన్‌తో మొక్కలను తొలగిస్తూ్తండగా దాని బకెట్ పైపులైనకు తగిలి రంధ్రం పడి ఉంటుందని ‘భాగ్యనగర్’ డిప్యూటీ మేనేజర్ డీవీ అనిల్‌కుమార్ చెప్పారు. ఈ గ్యాస్ అంత ప్రమాదకరం కాదని, ప్రతి 50 మీటర్లకు హెచ్చరిక బోర్డు ఉంటుందని, పైపులైనును నిత్యం నలుగురు పెట్రోలింగ్ చేస్తూంటారని వివరించారు. ఎక్కడైనా గ్యాస్ లీకవుతున్నట్లు తెలిస్తే తక్షణం సరఫరాను ఆపేందుకు వీలుగా ప్రతి కిలోమీటరుకు కంట్రోల్ వాల్వ్ ఉంటుందన్నారు. కాగా, ఆ ప్రాంతంలో ఎటువంటి పొక్లెయిన్ కనిపించలేదని, నాసిరకమైన పైపులు వాడడంతో తరచూ ఏదో ఒకచోట గ్యాస్ లీకవుతూనే ఉందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి : కురసాల కన్నబాబు పగటివేళ జరిగింది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ జరగలేదని, అదే అర్ధరాత్రి లీకైతే పరిస్థితేమిటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు భాగ్యనగర్ గ్యాస్ సంస్థ అధికారులను నిలదీశారు. తాగునీటి పైపులనే దాదాపు పదడుగుల లోతులో వేస్తారని, అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ పైపులైనును అడుగు లోతు కూడా లేకుండా వేసుకుపోయారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అరమవుతోందని విమర్శించారు. గ్యాస్ పైపులైనుకు రెండడుగుల దూరంలో ఆయిల్ కంపెనీకి క్రూడాయిల్ సరఫరా చేసే పైపులైన్లు ఉన్నాయని, 50 మీటర్ల దూరంలో పెద్ద ఆయిల్ ఫ్యాక్టరీలు, నాఫ్తలి¯ŒS ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్యాస్ లీకేజీని ఎవ్వరూ గమనించకుండా ఉంటే వాటి పరిస్థితి, సమీపంలో ఉన్న మత్స్యకారులు పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పైపులైన్లు విషయంలో భాగ్యనగర్ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రస్తుతం వేసిన పైపులు నాసిరకంగా ఉండడం, భూమికి పైపైనే పైపులైను ఉండడంతో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను ప్రజలు నిత్యం ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. దీనిపై భాగ్యనగర్ గ్యాస్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడనున్నట్లు కన్నబాబు వివరించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ, బొమ్మిడి శ్రీనివాస్, పార్టీ నాయకులు శెట్టి బాబూరావు, గొల్లపల్లి ప్రసాద్, కర్రి చక్రధర్, జంగా గగారి¯ŒS తదితరులు ఉన్నారు. -
వంట గ్యాస్‌కు నగదు రహిత బదిలీలు
ఎల్పీజీ డీలర్లకు జేసీ సత్యనారాయణ ఆదేశం కాకినాడ సిటీ : గ్యాస్ వినియోగదారుల సౌకర్యార్థం ఎల్పీజీ డీలర్లు విధిగా నగదు రహిత బదిలీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఎల్పీజీ డీలర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు సర్క్యులేషన్ లేక మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలు తక్కువగా ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత బదిలీలు, స్వైపింగ్, యాప్‌ల డౌన్లోడ్ల ద్వారా నగదు బదిలీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. జిల్లాలో 13 లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, వీరందరికీ ఆధార్, బ్యాంక్ ఖాతా సీడింగ్ జరిగిందన్నారు. వీరందరికీ నగదు రహిత బదిలీ చేయాల్సిన అవసరం ఉందని, దీని వల్ల లబ్ధి ఉంటుందన్నారు. ఈ పోస్ మెషీన్ ద్వారా స్వైపింగ్ ఆంధ్రా బ్యాంక్ బిజిలీ యాప్, స్టేట్‌బ్యాంక్ బడ్డీ, ఎం–పే యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని నెట్ కనెక్టివిటీ ఉంటే వీటిని నిర్వహించుకోవచ్చున్నారు. డెలివరీ బాయస్కు యాప్‌లు, స్వైప్‌లపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్ ఉంటే దానికి స్వైపింగ్ కనెక్టివిటీ ఇస్తారని, దాన్ని మొబైల్గా ఉపయోగించి నగదు బదిలీ చేయవచ్చన్నారు. యాప్స్ అయితే వినియోగదారులు, డీలర్లు ఇద్దరూ డౌన్లోడ్ చేసుకుంటేనే నగదు రహిత బదిలీకి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ ప్రతినిధులు యాప్‌ల డౌన్లోడ్, స్వైపింగ్లపై డీలర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, నాబార్డ్ ఏజీఎం ప్రసాద్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతికి కృషి
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు – పథకం ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కర్నూలు(అగ్రికల్చర్): పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని చెప్పారు. మన జిల్లాకు 10వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు అయ్యాయని ఆయన ప్రకటించారు. గురువారం కర్నూలు వెంకటరమణ కాలనీలోని పర్యాటక సంస్థకు చెందిన హరిత గెస్ట్‌హౌస్‌లో ఉజ్వల యోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. మొదటి రోజు 200 గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలు ఆధార్ నంబరు, బ్యాంకు పాసు పుస్తకం చూసిస్తే ఎలాంటి డబ్బు లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇస్తారనా్నరు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ... మహిళల సంక్షేమం లక్ష్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వంటకు కట్టెలను వాడటంతో మహిళల ఆరోగ్యంతో పాటు అడవులు దెబ్బతింటున్నాయని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు లేనివారు తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఐఓసీ ఏరియా మేనేజర్ మీరనాయర్ మాట్లాడుతూ... 18 ఏళ్లు పైబడిన నిరుపేద మహిళలకు సిలిండరు, గ్యాస్, రెగ్యులేటరు, లైటర్, పాస్ పుస్తకం ఉచితంగా ఇస్తామని తెలిపారు. గ్యాస్ స్టవ్‌కు రూ.990, గ్యాస్‌కు రూ.600 కేంద్రం లోన్ ఇస్తుందని తెలిపారు. లోన్ తీరే వరకు వీరికి గ్యాస్ సబ్సిడీ రాదని అది కేంద్రానికి వెలుతుందన్నారు. గ్రామాల్లోనే క్యాంపులు పెట్టి గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించిన తర్వాతనే కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఎస్ఓ తిప్పేనాయక్, ఐఓసీ సేల్స్ ఆఫీసర్ హరికృష్ణ, హెచ్ఓపీ సేల్స్ ఆఫీసర్ మురళీమోహన్, బీఓపీ టెరిటరీ మేనేజర్ దిలీఫ్, సేల్స్ ఆఫీసర్ సురేష్, గ్యాస్ డిస్ట్రిబ్యూటరీలు రమేష్‌గౌడు, శ్వేత, వెంకటేశ్వరరెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండ బాదుడు
-గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంపు -జిల్లా వినియోగదారులపై రూ. 2.10 కోట్లు భారం తణుకు: నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటితోపాటు తాజాగా గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు గుదిబండగా మారింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ.39 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులకు పెనుభారమయ్యింది. పెరిగిన ధరతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.2.10 కోట్లు మేర భారం పడనుంది. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్న చమురు కంపెనీలు తాజాగా రాయితీ గ్యాస్ సిలెండర్లపై భారం మోపడం సమంజసం కాదని మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాపై భారం... జిల్లాలో మొత్తం 7.50 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు 2 లక్షల మంది దీపం గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు. హెచ్‌పీ, భారత్, ఇండేన్ గ్యాస్ డిస్టిబ్యూటర్ కేంద్రాలు 42 ఉండగా వీటి ద్వారా ప్రతి నెలా 5.40 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. రోజుకు దాదాపు 50 వేల మంది సిలిండర్ బుకింగ్ చేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్ సిలెండర్ ధర రూ.537 కాగా నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో రూ. 72 చొప్పున రాయితీ మొత్తం జమ అవుతోంది. ఈనెల 1 నుంచి రాయితీపై పంపిణీ చేసే గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నులన్నీ కలిపితే పెంచిన ధరతో కలిపి గ్యాస్ సిలెండర్ ధర రూ.576కు చేరింది. ఈ లెక్కన జిల్లా వినియోగదారులపై దాదాపు రూ.2.10 కోట్ల భారం పడనుంది. ధరలు పెంచడం దారుణం పప్పుల ధరలు ఆకాశాన్నంటడంతో వంటింటి బడ్జెట్ పెరిగింది. ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ ధర పెంచడం దారుణం. ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండటం లేదు. ధరలు ఇలా పెంచుకుంటూ వెళితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా బతికేది. ఎం.సరస్వతి, గృహిణి, తణుకు ఎలా బతికేది.. కార్తీకమాసం కావడంతో ఇప్పటికే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతోపాటు ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేశారు. దీనికి తోడు ఇప్పుడు గ్యాస్ సిలెండర్ ధరను ప్రభుత్వం పెంచేసింది. ఇలా ధరలు పెంచుకుంటూపోతే ఎలా బతికేది.? కె.నాగమణి, గృహిణి, దువ్వ -
ఎన్నికలయ్యేదాకా.. అందరికీ అన్నీ
టీడీపీ ఎన్నికల స్టంట్ అడిగిన వారందరికీ రేషన్ కార్డు, గ్యాస్ ఇస్తామనే ప్రయత్నం సీఎం, మంత్రి దిశానిర్దేశంతో అధికారులు, టీడీపీ పక్కా ప్లాన్ ఒకటో తారీఖు నుంచి హామీలతో ప్రజల్లోకి.. నగరపాలికకు త్వరలో మోగనున్న ఎన్నికల నగారా.. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ ఎత్తులు. అయినా జనం నమ్మరేమోనన్న అనుమానం. ఏది ఏమైనా కోడ్ కూసే దాకా పదో పాతికో పింఛన్లు, రేషన్‌కార్డులు.. దీపం కనెక్షన్లు ఇచ్చి తమ ఇంటి దీపం వెలిగించుకోవాలన్న ఆరాటం. అందుకే నేటి నుంచి జనచైతన్యం పేరుతో జనంలోకి. మరి ప్రజలు వారిని ఆదరిస్తారో.. తిరస్కరిస్తారో వేచి చూడాల్సిందే. తిరుపతి తుడా: జిల్లాలో ఎక్కడా లేని వింత ప్రచారం తిరుపతిలో కనిపిస్తోంది. నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో అందరికీ అన్నీ ఇస్తామనే ప్రచారానికి టీడీపీ నేతలు మరోసారి స్కెచ్ వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు 160 హామీలు ఇచ్చిన టీడీపీ ఇందులో ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. తిరుపతిలో ఎన్నికలు వస్తాయనే సంకేతాలు ఉండటంతో ముందస్తు ఆలోచనలతో హామీల మాయ కుట్రకు తెర లేపారు. ప్రజలను నమ్మే పరిస్థితి లేనందున కొన్నైనా ఇచ్చి ప్రజల్లో చెప్పినవి ఇస్తారనే నమ్మకాన్ని కలిగించేలా పన్నాగం పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 25 శాతం మందికి పెన్షన్లు, 40 శాతం మందికి రేషన్ కార్డులను తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అన్నీ ఇస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికీ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి, నాలుగైదు సార్లు మంత్రి నారాయణ తిరుపతికి సంబంధించిన అధికారులు, పార్టీ నాయకులతో మంతనాలు జరిపి అందరికీ అన్నీ ఇస్తామనే హామీని నమ్మించే ప్రయత్నం చేయాలనే దిశా నిర్ధేశాన్ని చేశారు. అప్పటి నుంచి ఓ పక్క అధికారులు మరో పక్క తమ్ముళ్లు అవ్విస్తాం... ఇవ్విస్తాం అంటూ హామీలతో పాటు పనిలో పనిగా బేరసారాలకు దిగుతున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి జనచైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. గతంలో ఇచ్చిన హామీలు, జన్మభూమి సభల్లో వచ్చిన దరఖాస్తుల విషయం తేలకుండానే పేరు మార్పు చేసి జనచైతన్యయాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఎన్నికల వరకేనని, ఇచ్చిన వాటిపై ఎన్నికల తరువాత వాత తప్పదని కొంత మంది అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. తప్పని పరిస్థితి కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టం లేకపోయినా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో వెళ్లక తప్పని పరిస్థితి. ఈనేపథ్యంలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్నందున వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు అస్త్ర శస్త్రాలతో అధికార పార్టీ సిద్ధమయ్యేలా కినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు వృద్ధులు, వితంతవులు, వికలాంగుల పెన్షన్లపై కొరడా జులిపించారు. కార్పొరేషన్ పరిధిలోనే 7,200 వేల పెన్షన్లు, 28వేల రేషన్ కార్డులను అడ్డంగా తొలగించారు. అరుుతే ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్నందున పెన్షన్, రేషన్ కార్డుల హామీకి సిద్ధమవుతున్నారు. అర్హత ఉన్నా లేకున్నా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అన్నీ ఇస్తామనే నమ్మకాన్ని కలిగించనున్నారు. ఎన్నికల తరువాత వాటి కథ తేల్చవచ్చు ఇప్పటికి అడిగినవన్నీ ఇచ్చేయండనే ఆదేశాలు అందుకున్నారు. ఈ మేరకు అధికారులకూ అలాంటి ఆదేశాలు అందాయి. ఎన్నికల కోడ్ వరకు ఇస్తామని చెప్పి కొన్నింటిని పంపిణీ చేసి ఎన్నికల కోడ్ వచ్చిందని తప్పించుకునే ప్రయత్నానికి దిగుతున్నారు. -
పైపులైన్ల ద్వారా వంటగ్యాస్
ఏలూరు (మెట్రో) జిల్లాలో పైపుల ద్వారా ఇంటింటా వంటగ్యాస్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని 2017లో ప్రతి ఇంటికీ పైపు ద్వారా వంటగ్యాస్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని బాస్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, గోదావరి గ్యాస్ ప్రయివేటు లిమిటెడ్ కార్పొరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటా పైపు ద్వారా వంటగ్యాస్, వాహనాలకు సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటుపై శనివారం రాష్ట్ర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.రమేష్, ఇంజనీర్ ఆదిత్యతో కలెక్టర్ చర్చించారు. జిల్లాలో 30 కోట్ల రూపాయల వ్యయంతో సిఎన్జి మదర్ స్టేషన్‌ను ఏర్పాటుతోపాటు పెద్ద ఎత్తున జిల్లా అంతటా ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసి 2018 సంవత్సరం నాటికల్లా పూర్తిస్థాయిలో అందరికీ ఇంటి వద్దే తాగునీరులా వంటగ్యాస్ పైపులైన్ ద్వారా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. ఏలూరు సమీపంలోని కొప్పాకలో ఉన్న గెయిల్ గ్యాస్ స్టేషన్ నుండి ఏలూరులో సిటీ గేట్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఏలూరు నగర వాసులకు ప్రథమంగా ప్రత్యేక పైపులైను ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తామన్నారు. రానున్న సంవత్సరంలో ఏలూరు అంతటా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. బీమడోలు సమీపంలోని ఎం గాగులపలి, తణుకు సమీపంలోని పెరవలి, భీమవరంలలో ప్రస్తుతం గెయిల్ గ్యాస్ స్టేషన్లు ఉన్నాయనీ అక్కడి నుండి సమీప ప్రధాన కేంద్రాలను కలిపేందుకు గేట్ స్టేషన్లు రహదార్ల పక్కనే ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రబుత్వ స్థలాన్ని కేటాయిస్తామని ఈ మేరకు ఏలూరు, కొవ్వూరు ఆర్‌డిఒలతో త్వరలో ప్రభుత్వ స్థలాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ కంపెనీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏలూరులో ఏర్పాటు చేసేందుకు కలెక్టరేట్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయ భవనాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, ఆర్‌డిఒలు నంబూరి తేజ్‌భరత్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అందరికీ గ్యాస్ అందించేందుకు చర్యలు
ఏలూరు (మెట్రో) జిల్లాలో కట్టెలతో వంట చేసే సంస్కృతిని మాన్పించి ఇంటింటా వంటగ్యాస్ కనెక్షన్ అందిస్తామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఛీఫ్ మేనేజర్ మైనాక్ పాత్ర, ఛీప్ ఏరియా మేనేజర్ చింతగడ విజయకుమార్‌లతో గ్యాస్ పంపిణీ తీరుపై కలెక్టర్ చర్చించారు. జిల్లాలో ఏ ఒక్క మహిళా కట్టె పొయ్యలతో వంట చేసే సంస్కతిని తొలగించి పటిష్టమైన వ్యవస్థ ద్వారా ఇంటింటా వంటగ్యాస్ కనెక్షన్లు అందించే ప్రక్రియ వేగవంతం చేస్తున్నామనీ, జిల్లాలో ఇంకా 85వేల మందికి ఇంటింటా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని అవన్నీ 2016 డిసెంబరు నాటికే పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. వంటగ్యాస్ కనెక్షన్లకు వచ్చిన ధరఖాస్తుల్లో 17వేల మంది ఇంటిలో ఇల్లాలు లేక ఒక్కరే ఉంటున్నారని అటువంటి మంగవారికి దీపం కనెక్షన్లు అందించేందుకు గ్యాస్ కంపెనీలు సాకుకూలంగా స్పందించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించడంలో ఐఒపి గ్యాస్ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని భాస్కర్ చెప్పారు. ప్రజలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించడంలో చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమనీ, ప్రజలకు అధిక సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు అందించడంలో ఉభయ రాష్ట్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉందని కంపెనీ ఛీప్ మేనేజర్ మైనాక్ పాత్ర చెప్పారు. సమావేశంలో జెసి పులిపాటి కోటేశ్వరరావు, డిఎస్‌ఒ శివశంకరరెడ్డి పాల్గొన్నారు. -
గ్యాస్ ‘ట్రిక్’
–దారిమళ్లుతున్న వంటగ్యాస్ –కార్లకూ వినియోగం –పెరిగిన 3కేజీల సిలిండర్ల వినియోగం –యథేచ్ఛగా ఫిల్లింగ్ సెంటర్ల నిర్వహణ ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : వంటగ్యాస్ దారిమళ్లుతోంది. నిబంధనల ప్రకారం సబ్సిడీపై అందించే ఈ గ్యాస్‌ను గహావసరాలకే వినియోగించాలి. కొందరు అక్రమార్కులు వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కొందరు చిన్నచిన్న సిలిండర్లలో గ్యాస్‌ను ఫిల్లింగ్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా.. పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా 3కేజీల సిలిండర్ల ఫిల్లింగ్ జిల్లావ్యాప్తంగా 3కేజీల సిలిండర్లలో వంటగ్యాస్ ఫిల్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. దీనికోసం వ్యాపారులు రహస్య స్థావరాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. కొందరు దుకాణాల్లోనే బహిరంగంగా ఫిల్లింగ్ చేసేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు, పెళ్లికాని ఉద్యోగులు, పెళై ్లనా కుటుంబాలకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ చిన్న సిలిండర్ల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో వ్యాపారులు ఎక్కడకక్కడ ఫిల్లింగ్సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫిల్లింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. గ్యాస్ ఫిల్లింగ్ నేరం. పైగా ప్రమాదకరం కూడా. అయినా వ్యాపారులు ధనార్జన మాయలో ప్రమాదాలను పట్టించుకోవడం లేదు. కార్లకూ వంటగ్యాసే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌తో నడిచే కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం.. ఈ కార్లలో సీఎన్జీ గ్యాస్‌ను మాత్రమే వినియోగించాలి. కొన్ని ఆటోలూ సీఎన్జీ గ్యాస్ ద్వారానే నడుస్తాయి. ఇలాంటి వాహనాలు జిల్లాలో సుమారు 8వేలు ఉన్నట్టు అంచనా. వీటికోసం జిల్లాలో కేవలం ఆరు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ స్టేషన్లు దగ్గరలో లేని వినియోగదారులు వంటగ్యాస్‌ను వాహనాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ వేలాది గహావసర సిలిండర్లు దుర్వినియోగమవుతున్నట్టు సమాచారం. తక్కువ ధరకే గ్యాస్ వంట గ్యాస్ సిలిండర్లను ఆయా గ్యాస్ కంపెనీలు సబ్సీడీ లేకుండా ప్రజలకు 14.2 కేజీల సిలిండర్‌ను రూ.549కి అందిస్తున్నాయి. ఆ లెక్కన కేజీ గ్యాస్‌కు సుమారు రూ.40 అవుతోంది. కానీ మార్కెట్లో లభ్యమవుతున్న 3 కేజీల సిలిండర్‌ను కేవలం రూ.80 నుంచి రూ.90కే ప్రై వేటు వ్యాపారులు అందించడం విచిత్రంగా అనిపిస్తోంది. అంటే ప్రభుత్వం అందించే ధర పక్రకారం 3 కేజీల గ్యాస్‌కు సుమారు రూ.120 అవుతుండగా.. ప్రై వేటు వ్యాపారులు మాత్రం కేవలం రూ. 80 – 90 మధ్యనే అందిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వీరికి ఇంత తక్కువ ధరకు గ్యాస్ రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రమాదకరం గహావసర సిలిండర్లలోని గ్యాస్‌ను చిన్న సిలిండర్లు, కార్లు, ఆటోల్లో నింపడం ప్రమాదకరం. నింపే సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కొన్ని సందర్భాల్లో సిలిండర్లు పేలిపోవడం, భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలోæ గ్యాస్ అక్రమ ఫిల్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఆయా ప్రాంతాల్లో స్థానికులు ఫిర్యాదులూ చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఫిలింగ్కు పాల్పడితే చర్యలు గ్యాస్ అక్రమ ఫిల్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గ్యాస్ ఫిల్లింగ్‌కు లైసెన్స్ ఉన్న వారు మాత్రమే చేయాలి. జిల్లాలో 3 కేజీలు, 5 కేజీల సిలిండర్లు విక్రయించడానికి ఎక్కడా లైసెన్సులివ్వలేదు. అలాగే చిన్న కార్లు ఆటోల్లో గృహావసర గ్యాస్‌ను వినియోగించిన వారిపైనా చర్యలు తీసుకుంటాం. డి.శివశంకర రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి. -
గ్యాస్ అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోరే?
- సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అది ప్రజల సొమ్మని ఆ సంస్థ నుంచి నష్టపరిహారం వసూలు చేయాలని సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం లేఖ రాశారు. కేజీ బేసిన్లో గ్యాస్‌ను రిలయన్స్ అక్రమంగా తరలించినట్లు జస్టిస్ షా కమిషన్ గత ఆగస్టు 31న కేంద్ర పెట్రోలియం శాఖకు నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2015 వరకు రిలయన్స్ కంపెనీ రూ.10 వేల కోట్ల విలువ చేసే 1,100 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను అక్రమంగా విక్రయించినట్లు జస్టిస్ షా కమిషన్ విచారణలో తేలిందని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రులో మెగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఆ ప్రాతంలో పర్యటిస్తున్న ఏపీ ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవితోపాటు మరో ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మరో ప్రకటనలో ఖండించారు. -
గ్యాస్ ఉంటేనే రేషన్
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత(రేషన్) కార్డు దారులకు గ్యాస్ కనెక్షన్ తప్పని సరిగా మారింది. పౌరసరఫరాల శాఖ కొత్త కార్డుల మంజూరుకు వంట గ్యాస్ కనెక్షన్ మెలిక పెట్టింది. వంట గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులకు సైతం గ్యాస్ కనెక్షన్ తప్పని చేయాలని అధికారులను సూచించారు. విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హెదరాబాద్ మహా నగరాన్ని కాలుష్య రహిత మార్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే నగరంలో కిరోసిన్ వినియోగం నివారణ కోసం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు తక్షణమే వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల వారిగా గ్యాస్ వినియోగం లేని కుటుంబాలను గుర్తించి వారికి కనెక్షన్లు ఇప్పించే బాధ్యతలను డీలర్లకు అప్పగించింది. వంటగ్యాస్ లేని కుటుంబాలపై దృష్టి గ్రేటర్ హైదరాబాద్‌లో వంట గ్యాస్ కనెక్షన్లు లేని ఆహార భద్రత కార్డుదారులపై పౌరసరఫరా శాఖ దృష్టి సారించింది. మొత్తం 11.71 లక్షల ఆహార భద్రత (రేషన్) కార్డుదారులుండగా అందులో వంట గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలు 2.37 లక్షలపైన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు నాలుగు లీటర్లు, సింగిల్ ఎల్పీజీ సిలిండర్ గల కార్డుదారులకుSఒక లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా సుమారు 18.77లక్షల లీటర్ల వరకు కిరోసిన్ కోటాను కేటాయిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో తెల్ల కిరోసిన్ లీటరు ధర రూ.49లు ఉండగా, చౌక ధరల దుకాణాల ద్వారా కేవలం లీటరు కిరోసిన్ రూ.15ల చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. మిగతా రూ.34లను సబ్సిడీగా కేంద్రం భరించి చమురు సంస్థలకు చెల్లిస్తోంది. అయితే ఇందులో 60 శాతం పైగా కిరోసిన్ పక్కదారి పడి వంటింట్లోకి బదులు వాహనాల్లో ఇంధనం గా మారుతోంది. ఫలితంగా వాహనాలు కాలుష్యం చిమ్ముతూ నగర వాసుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. -
గ్యాస్ నిక్షేపాల కోసం ఉద్యమించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నేతలు బోట్‌క్లబ్ (కాకినాడ) : కేజీ బేసిన్ పరిధిలోని జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉద్యమించాలని వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోంలో సీపీఎం ఆధ్వర్యాన మంగళవారం జరిగిన అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ అక్రమంగా రూ.11 వేల కోట్ల విలువైన గ్యాస్‌ను తరలించుకుపోయిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీనివల్ల జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఓఎన్జీసీకి చెందిన నిక్షేపాలను రిలయన్స్ అక్రమంగా తరలించుకుపోయినట్టు జస్టిస్ షా కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కేజీ బేసిన్లో గ్యాస్‌ను ఇక్కడి సంస్థలకు, జిల్లా ప్రజలకు ఇవ్వకుండా అక్రమంగా తరలించుకుపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైపోయిందని విమర్శించారు. గ్యాస్ నిక్షేపాల కోసం జరిగే న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ రియలన్స్ అక్రమాలపై ఓఎన్జీసీ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, కేజీ బేసిన్ డి6 బ్లాక్‌లో అధిక గ్యాస్ నిక్షేపాలున్నాయన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో బీజేపీ పాలకులు ఈ బ్లాక్‌లో గ్యాస్ వెలికితీసే అవకాశాన్ని రిలయన్స్‌కు ఇచ్చేలా చట్ట సవరణ చేశారన్నారు. బిడ్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా గుజరాత్‌కు చెందిన జీఎస్పీసీకి బీజేపీ ధారాదత్తం చేసిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీకి వంత పాడి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ నగర కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ, షా కమిటీ రిపోర్టు బయటకు వచ్చినా పార్లమెంట్లో ఏవిధమైన ప్రస్తావనా రాకపోవడం శోచనీయమన్నారు. సీనరేజ్ కూడా ప్రభుత్వం వసూలు చేయలేకపోయిందన్నారు. జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఉద్యమాలకు అండగా నిలుస్తామన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు బుగతా బంగార్రాజు, సీహెచ్.నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు నక్కా కిషోర్, బీఎస్పీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్, ఆర్పీఐ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, జేఏసీ మాజీ నేత ఆచంట రామారాయుడు, బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు తూతిక విశ్వనాథం, జనవిజ్ఞాన వేదిక నగర అధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాస్, కోనసీమ దళిత వేదిక కన్వీనర్ జంగా బాబూరావు తదితరులు కూడా మాట్లాడారు. జేఏసీ కార్యదర్శి పితాని త్రినాథరావు, వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.సుభాషిణి, ఎస్.భవాని, ఉద్యోగ సంఘ నాయకులు పసుపులేటి శ్రీనివాస్, కె.నాగేశ్వరరావు, సరెళ్ళ చంద్రరావు, సూర్యనారాయణ, మాధవరావు, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
వేలంలో ల్యాంకో, దబోల్ ప్రాజెక్టులకు గ్యాస్
న్యూఢిల్లీ: ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు తాజా వేలంలో గణనీయ స్థాయిలో గ్యాస్‌ను దక్కించుకుంది. కేంద్ర విద్యుత్ శాఖ గ్యాస్‌ను ఈ వేలానికి పెట్టగా 3.11 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ల్యాంకో సంస్థకు దక్కింది. దబోల్ ప్రాజెక్ట్ 2.43 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ శాఖ 9.93 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను ఆరు నెలల పాటు మార్చి వరకు సరఫరా చేసేందుకు వీలుగా శనివారం వేలం నిర్వహించింది. 9 ప్లాంట్లు తక్కువ బిడ్డర్లుగా జాబితాలో నిలిచి గ్యాస్ కేటాయింపులను దక్కించుకున్నాయి. పయోనీర్ గ్యాస్ పవర్‌కు 1.08, జీఎంఆర్ వేమగిరి పవర్ జనరేషన్‌కు 1.03 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ లభించింది. జీవీకే ఇండస్ట్రీస్‌కు కూడా 0.63 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్, పాండురంగ ఎనర్జీ సిస్టమ్స్‌కు 0.32 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ కోటా లభించింది. ఆరు నెలల కాలంలో ఈ తొమ్మిది విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 881 కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేయడంతోపాటు యూనిట్‌ను రూ.4.70 అంతకంటే తక్కువ ధరకు సరఫరా చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
గ్యాస్ లీకై రెండు ఇళ్లు దగ్ధం
రూ.30 లక్షల ఆస్తి నష్టం దాచేపల్లి (గుంటూరు): గ్యాస్ సిలిండర్ లీకై రెండు ఇళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని కేసానుపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించటంతో ఇళ్లలో సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ. 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన తాడేపల్లి సుబ్బారావు, అన్నపూర్ణ దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటూ కిరాణ దుకాణం, హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలకు అన్నం వండేందుకు అన్నపూర్ణ స్టౌ వెలిగించగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. మంటలు చెలరేగటంతో ఆమె శరీరం కాలింది. చుట్టు పక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా అగ్ని కీలలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో సిలిండర్ పేలటంతో మంటలు ఉద్ధతి మరింతగా పెరిగాయి. సుబ్బారావు ఇంట్లో ఉన్న కిరాణదుకాణానికి సంబంధించిన సరుకులు, ఫ్రిజ్‌లు,, బీరువాలు, దుస్తులతో పాటు ఇతర సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయాయి. ఇంటిపై కప్పు రేకులు కాలి నేలపై పడ్డాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో పక్కనే ఉన్న దేవరపల్లి సత్యం ఇంటికి కూడా అంటుకున్నాయి. సత్యం ఇంట్లోని సామాన్లు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు పిడుగురాళ్ల అగ్నిమాపక అధికారులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ అధికారి చిరంజీవి, సాంబయ్య, వెంకటేశ్వర్లు మంటలను అదుపులోకి తెచ్చారు. -
ఏపీలో భారీగా గ్యాస్ నిక్షేపాలు..
-
ఏపీలో భారీగా గ్యాస్ నిక్షేపాలు...
-
5బీ భవిష్యత్ ప్రశ్నార్థకం
కొత్తగూడెం : ఒకసారి రూఫ్ ఫాల్.. మరోసారి భారీ యంత్రాలతో ఇబ్బందులు.. ఇంకోసారి వెంటిలేషన్ సమస్య.. వీటికితోడు విషవాయువులు.. భూగర్భగనుల్లో బొగ్గు వెలికితీసే కార్మికులు అనునిత్యం ప్రమాదాలతో సహవాసం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెంలోని 5బీ షాఫ్ట్ గనిలో వెలువడిన గ్యాస్(కార్బన్‌మోనాక్సైడ్) కార్మికులను కలవరానికి గురిచేస్తోంది. నివారణ చర్యలు చేపడుతున్నా అదుపులోకి రాకపోవడంతో గని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 360 మీటర్ల లోతులో బొగ్గు ఉత్పత్తి 5బీ షాఫ్ట్ గనిని 1952లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 8.71 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయగా ఇంకా 24 లక్షల టన్నులు ఉంది. మరో పదేళ్లపాటు తీయవచ్చు. ప్రస్తుతం 360 మీటర్ల లోతులో 10-17 డీప్, 86 నుంచి 91 లెవెల్ వద్ద బాటమ్ సీమ్‌లో ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 1,050 మంది కార్మికులు పనిచేస్తుండగా అధునాతన యంత్రాలు, నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మిథేన్ గ్యాస్ అంటే..? గనిలో ముఖ్యంగా కింగ్ సీమ్, టాప్ సీమ్, బాటమ్ సీమ్‌లు ఉంటాయి. వీటిలోని బొగ్గు నాణ్యతను బట్టి వెలికితీస్తారు. ఒక్కో సీమ్‌ను కొన్ని బ్లాక్‌లుగా విభజించి యంత్రాల సహాయంతో బొగ్గు తీస్తారు. ఆయా బ్లాక్‌లలో బొగ్గు వెలికితీత పూర్తయిన తర్వాత అటువైపు ఎవరూ వెళ్లకుండా బ్లాక్‌లకు అడ్డుగా గోడలు కట్టి మూసివేస్తారు. అలా మూసివేసిన బ్లాక్‌లలో గాలి ఉండిపోయి కొన్ని రోజులకు మిథేన్ గ్యాస్‌గా మారుతుంది. దీనికి మండే స్వభావం ఉంటుంది. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సమయాల్లోనూ మిథేన్ గ్యాస్ వెలువడుతుంది. అక్కడ అడ్డు గోడ కట్టి బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తారు. ప్రస్తుతం కొత్తగూడెం 5బీ షాఫ్ట్ గనిలో మూసివేసిన బ్లాక్ నుంచి మిథేన్ గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఫైర్ సీల్స్ మిథేన్ గ్యాస్‌కు ముఖ్యంగా మండే స్వభావం ఉండటం వల్ల ఫైర్ సీల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశానికి నీరు, సీఓటూ(కార్బన్ డై ఆక్సైడ్)ను పంపించడం ద్వారా గ్యాస్ లీకేజీని నివారించవచ్చు. గ్యాస్ సాంద్రత తగ్గిన తరువాత తిరిగి అడ్డుగోడ కట్టి సీల్ చేయాల్సి ఉంటుంది. మూసివేసిన ఫైర్ సీల్స్‌ను ఎప్పటికప్పుడు రక్షణ విభాగం అధికారులు పరిశీలించాలి. విషవాయువు సాంద్రత పెరిగితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అయితే 5బీ గనిలో సేఫ్టీ, వెంటిలేషన్ విభాగాల వైఫల్యం కారణంగా మిథేన్ గ్యాస్ గనిలో విస్తరించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 420 వరకు ఫైర్ సీల్స్ ఉండటం గమనార్హం. ఇవి చాలా ఎక్కువే. కార్మికుల్లో ఆందోళన గనిలో మొత్తం 1,050 మందికి పైగా కార్మికులు పలు షిఫ్టులలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మిథేన్ గ్యాస్ వెలువగడటంతో 12 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు మినహా సుమారు 700 మందిని డిప్యుటేషన్‌పై ఏరియా పరిధిలోని ఇతర గనులకు పంపించారు. మరో పదేళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేసే వీలున్న ఈ గనిలో మిథేన్ గ్యాస్ వెలువడటం, దాని నియంత్రణ ఇబ్బందిగా మారడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం మరో 10 రోజుల్లో పూర్తి అదుపులోకి తీసుకువస్తామని చెబుతున్నారు. ఇలా మొదలైంది.. ఈ నెల 8న.. శుక్రవారం సుమారు 200 మంది కార్మికులు సెకెండ్ షిఫ్టు డ్యూటీకి వెళ్లారు. రాత్రి విధులు ముగిం చుకుని గని ఉపరితలానికి రావడానికి బయలు దేరారు. ఇంతలో మిథేన్ గ్యాస్ వాసన రావడంతో సమాచారం అందించగా రక్షణ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని దాని సాంద్రతను పరిశీలించారు. కేవలం 20శాతం మాత్ర మే ఉండడంతో పెద్ద ప్రమాదమేమీ లేదని నిర్లక్ష్యం చేసినట్లు కార్మికులు చెబుతున్నారు. వారం రోజుల వ్యవధిలో మిథేన్ గ్యాస్ సాంద్రత 120 శాతానికి చేరుకోగా హడావుడిగా గని అధికారులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. మిథేన్ గ్యాస్ సాంద్రతను తగ్గించేందుకు గనిలోకి సీఓ-2 పంపిణీ చర్యలు కొనసాగుతున్నాయి. -
విషవాయువే మింగింది
పాత గుళాయిలోకి వెళ్లడం వల్లే బదిలీ కార్మికుడు అనిల్‌కుమార్ మృతి జీడీకే-7లో విషవాయువున్నట్లు నిర్ధారించిన అధికారులు..? యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : విషవాయువు వల్లే కార్మికుడు మింగనబోయిన అనిల్‌కుమార్ మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అతను బహిర్భూమికి వెళ్లిన పాత గుళాయి ప్రాంతానికి బుధవారం వారు చిమ్నీలను పట్టుకెళ్లగా అవి ఆరిపోయినట్లు సమాచారం. ఆర్జీ-2 ఏరియూ పరిధి జీడీకే-7ఎల్ఈపీ గనిలో 19వ లెవల్ 14వ డీప్ టాప్సీమ్-3లో గాలి వృథాను అరికట్టేందుకు గోడ నిర్మించడానికి నలుగురు కార్మికులతో కలిసి వెళ్లిన అనిల్‌కుమార్ మంగళవారం మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారు లు లోతుగా విచారిస్తున్నారు. గోడ నిర్మాణానికి ఇటుకలు మోస్తున్న క్రమంలో మలవిసర్జన కోసం సమీపంలోని పాత గుళాయిలోకి వెళ్లి వచ్చిన అనిల్‌కుమార్ ఆ వెంటనే వాంతు లు చేసుకున్నాడని, ఏం జరిగిందో తెలసుకునేలోపే అతను తుదిశ్వాస విడిచినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. విషవాయువుతో నిండి ఉన్న ప్రాంతంలోకి వెళ్లడం వల్లే ఇలా జరిగిందంటున్నారు. అక్కడ సూవర్వైజింగ్ అధికారులుంటే ఆవైపు వెళ్లనిచ్చేవారు కాదని పేర్కొంటున్నారు. విచారణ ప్రారంభించిన డీడీఎంఎస్ హైదరాబాద్ నుంచి వచ్చిన డీడీఎంఎస్ అధికారి ముఖర్జీ బుధవారం విచారణ ప్రారంభిం చారు. ఆయన గనిలోకి దిగి సంఘటనా స్థలా న్ని పరిశీలించిన అనంతరం కార్మికుని మృతికి దారి తీసిన పరిస్థితుల వివరాలు సేకరించా రు. గురువారం ఇక్కడే ఉండి ప్రత్యక్ష సాక్షుల తో వాంగ్మూలాలు సేకరించనున్నారు. నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన కార్మికుడి మృతిపై కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గని ప్రమాదంగా గుర్తించి మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాతోపాటు అన్ని విధాల న్యాయం చేయూలని డిమాండ్ చేశారు. అనంతరం బదిలీ వర్కర్లం దరూ విధులు బహిష్కరించి అనిల్‌కుమార్ అంతిమయాత్రలో పాల్గొనడానికి వెళ్లారు. పర్యవేక్షణ లేకపోవడంవల్లే : టీబీజీకేఎస్ పని స్థలాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రాంమూర్తి, సారంగపాణి, నూనె కొమురయ్య, ఐలి శ్రీనివాస్ డీడీఎంఎస్ కు వినతి పత్రం అందజేశారు. గాలికొరత, మైనింగ్ సర్ధార్‌ల కొరత ఎక్కువగా ఉందని, మైన్స్, సేఫ్టీ కమిటీ సమావేశాల్లో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. బాధ్యులపై చర్య తీసుకుని భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇది లా ఉండగా అనిల్‌కుమార్ మృతి సంఘటన ను యాజమాన్యం గని ప్రమాదంగా గుర్తించి నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. -
గ్యాస్ ట్యాంకు పేలి వ్యాను దగ్ధం
గ్యాస్ ట్యాంక్ పేలి మారుతి ఓమ్ని వ్యాను దగ్ధమైన సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన సురేష్ అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కనే ఉన్న న్యూ రాయలసీమ హోటల్ వద్ద తన ఓమ్ని వ్యానును పార్కుచేసి అదే హోటల్లో విశ్రాంతి తీసుకున్నాడు. బుధవారం ఉదయం వ్యాను స్టార్ట్ కాలేదు. ఇంజిన్‌కు అమర్చిన గ్యాస్ ట్యాంక్ వద్ద రిపేరు చేస్తుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపు ఓమ్ని వ్యాను కాలిపోయింది. సురేష్‌కు సైతం మంటలు వ్యాపించడంతో స్వల్పంగా గాయపడ్డాడు. గ్యాస్ ట్యాంక్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. -
ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్
కోవూరు : గ్యాస్ లేని ప్రతి కుటుంబానికి ఉచితంగా కనెక్షన్ మంజూరు చేస్తామని ఎన్ఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహుకులు నజీర్ అహ్మద్ తెలిపారు. స్థానిక ఏజెన్సీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ పరిధిలో పొగరహిత వంట కోసం అందరికి సిలిండర్లు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో మీ–సేవ కేంద్రంలో నమోదు చేసుకుని తహసీల్దారు కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. కనెక్షన్ లేనివారు ఇప్పుడే నేరుగా ఆన్లైన్లో ఈపీడీఎస్ సైట్లో వివరాలు నమోదుచేసి ఏజెన్సీ వద్దకు వస్తే మంజూరవుతుందన్నారు. -
ఆ రుచి మళ్లీ వచ్చేసింది
ఇంట్లో అమ్మమ్మో, నాన్నమ్మో రోజూ తినేటప్పుడు ఒక మాట అంటుంటారు. కట్టెల పొయ్యి మీద వండిన రుచి ఈ గ్యాస్‌పైన ఎప్పటికీ రాదని. అవును మరి, ఆ రుచి అద్భుతం. ఎన్నిరకాల మసాలాలు వేసినా గ్యాస్‌పై వండితే వచ్చే రుచి, వాసన అంతంత మాత్రమే. మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లాలని, కట్టెల మీద వండిన ఆహారాన్ని తినాలని చాలామందికి అనిపిస్తుంది కదూ.. అలా తీసుకెళ్లలేం కానీ, అలాంటి రుచి, వాసనను మాత్రం అందించగలమంటున్నారు ఓ కంపెనీ వారు. అందుకే ఈ ‘స్మోకింగ్ గన్ హ్యాండ్‌హెల్డ్ ఫుడ్ స్మోకర్’ను తయారు చేశారు. ఇదెలా పని చేస్తుందంటే... ముందుగా గన్ చాంబర్లో చిన్నచిన్న కట్టె పుల్లలు, చెక్క పొట్టు, ఎండిన ఆకులు, మసాలా దినుసులు... ఇలా వేటినైనా అందులో వేసి అంటించాలి. తర్వాత దానికున్న పైప్‌ను మీకు కావాలనుకున్న ఫుడ్ బౌల్లో పెట్టి మూతపెట్టండి. అంతే ఆరోగ్యకరమైన స్మోక్ మీ వంటకు చేరి... ట్రెడిషనల్ ఫుడ్ తిన్న భావన మీకు తప్పకుండా కలుగుతుంది. -
ఉప్పునీటి దీపం... ఊరంతా వెలుగు!
ప్రయత్నం కరెంట్... ఇది లేకుండా ఇవాళ మనం జీవితాన్నే ఊహించలేం. కరెంట్ బిల్లులు ఎంత తడిసి మోపెడవుతున్నా, విద్యుచ్ఛక్తి లేకుండా రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే, విద్యుచ్ఛక్తితో సంబంధం లేకుండా కారు చౌకగా వెలుతురునిచ్చే దీపం ఒకటి ఈ మధ్య తయారైంది. కిరోసిన్, గ్యాస్ లాంటివి ఏవీ అవసరం లేని ఈ దీపం ఫిలిప్పైన్స్‌లో చాలామంది ఇళ్ళలో వెలుగు పంచుతోంది. ఫిలిప్పైన్స్కు చెందిన టీనేజ్ అక్కా తమ్ముళ్ళు ఐసా మిజెనో, రాఫెల్ మిజెనోలు ఈ కారుచౌక దీపాన్ని తయారుచేశారు. ఇంధనంతో పని లేని ఈ దీపాన్ని కేవలం కొన్ని లోహపు పలకలు, కాస్తంత ఉప్పు నీటితో వారు రూపొందించారు. చేతితో ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళే వీలుండడం ఈ ల్యాంప్కు ఉన్న మరో వెసులుబాటు. ఈ ప్రయోగానికి ప్రేరణ ఏంటి? అసలు ఈ దీపం తయారు చేయాలనే ఆలోచన రావడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఫిలిప్పైన్స్‌లో ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యం లేదు. ఆ కొరతే ఈ అక్కాతముళ్ళను ఈ నూతన ఆవిష్కరణకు పురిగొల్పింది. కంప్యూటర్ ఇంజనీర్ అయిన ఐసా మిజెనో కొంతకాలం క్రితం ‘గ్రీన్‌పీస్’ అనే సంస్థ తరఫున ఒక గ్రామీణ ప్రాంతంలో బుట్బుట్ అనే తెగ వారితో కలసి పనిచేశారు. ఆ సమయంలో అక్కడి మారుమూల కలింగా పర్వతశ్రేణుల్లో జనం విద్యుచ్ఛక్తి లేక పడుతున్న అవస్థలు ఆ అమ్మాయిని కదిలించాయి. విద్యుచ్ఛక్తి లేకపోవడంతో అక్కడి జనం వెలుగు కోసం ఎక్కువగా కిరోసిన్ దీపాలను ఆశ్రయించేవారు. అయితే, రవాణా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. ఒక్క సీసా కిరోసిన్ కొనుక్కోవడానికి వాళ్ళు కనీసం 12 గంటలు నడిచి వెళ్ళాల్సిన దుఃస్థితి. అలా కిరోసిన్ తెచ్చుకోవడం కూడా అక్కడ పెను సవాలే. అంతే! ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనీ, అది వ్యాపా రాత్మకంగా కూడా ఉండాలనీ ఆమె భావించారు. విద్యుత్ సమస్యకు ప్రత్యామ్నాయంగా సోదరుడు రాఫెల్‌తో కలసి చౌకరకం దీపం రూపకల్పనకు ఐసా నడుం బిగించారు. బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టభద్రుడైన ఆ కుర్రాడు కూడా అక్కతో కలసి అడుగేశారు. అక్కాతమ్ముళ్ళ అనుబంధం ఈ అక్కాతమ్ముళ్ళ బంధం ఈ స్టార్టప్ ప్రయోగానికి విజయం తెచ్చిపెట్టింది. ‘‘‘సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్’ (ఎస్.ఎ.ఎల్టి - ‘సాల్ట్’) అనే ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం వెనుక మా తమ్ముడి సహకారం చాలా ఉంది. ‘ఐడియాస్పేస్ ఫౌండేషన్’లో ఈ కొత్త ఆవిష్కరణ తాలూకు ప్రయోగం చేస్తున్నప్పుడు ఒకానొక దశలో నేను చేతులు ఎత్తేశాను. మానసిక ఒత్తిడి, డెడ్‌లైన్స్, అంచనాలను అందుకోవాలనేవి నేను మోయలేని బరువయ్యాయి. ఆ సమయంలో తమ్ముడు నాకు అండగా నిలిచి, మానసికంగా నాకు ధైర్యం చెప్పాడు’’ అని ఐసా వివరించారు. నిజానికి, ఈ అక్కాతమ్ముళ్ళది చిన్నప్పటి నుంచి విడదీయరాని బంధం. తమ్ముడు రాఫెల్ మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్. పుస్తకాలు బాగా చదువుతాడు. పుస్తకాలు చదవడంతో వచ్చిన విజ్ఞానం, వినయం, పెరిగిన ఆలోచన కూడా ఈ ఉప్పునీటి దీపం రూపకల్పనకు దోహదపడ్డాయి. మరోపక్క ఐసా ప్రశ్నల పుట్ట. ఏదైనా సరే క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకొనే రకం. ప్రతి విషయంలోనూ అమితమైన ఆసక్తి. ఇలా ఒకరికొకరి భిన్నమైన నైపుణ్యాలు తోడవడంతో ఈ సాల్ట్‌వాటర్ ల్యాంప్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అద్భుతమన్న అమెరికా విశేషం ఏమిటంటే, ఈ దీపాల తయారీ, వీటి వినియోగం గురించి ఇప్పుడు మన భారతదేశంలోనూ, ఆగ్నేయాసియాలోనూ ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆసియా ప్రాంతంలో ‘సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్’ (ఎస్.ఎ.ఎల్టి - ‘సాల్ట్’) పేరిట ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళుతున్నారు. రాగల రోజుల్లో ఇంటి మొత్తానికీ విద్యుత్‌ను సమకూర్చేలా ఉప్పునీటితోనే పనిచేసే జనరేటర్‌ను రూపొందించాలని ఈ టీనేజ్ సోదర సోదరీమణులు భావిస్తున్నారు. అటుపైన ఏకంగా ఉప్పునీటి విద్యుత్కేంద్రాన్నే నెలకొల్పినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికైతే, ఈ ఉప్పునీటి దీపాల్ని పెద్ద సంఖ్యలో తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తూర్పు ఆసియా ప్రాంతంలోని వివిధ సంస్థల సహాయ సహకారాల్ని తీసుకుంటున్నారు. మరో విశేషం ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ ప్రయత్నాన్ని ‘‘మహత్తరమైన ఆలోచన’’ అని పేర్కొన్నారు. ఇటీవల అనేక దేశాల్లో సరికొత్త సాంకేతిక విజ్ఞానంతో ముందుకొస్తున్న యువ వ్యాపారవేత్తలకు ఐసా లాంటి అమ్మాయిలు సరైన ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి, ఈ సాల్ట్‌వాటర్ ల్యాంప్‌లు పెద్దయెత్తున మన దేశానికి కూడా విస్తరిస్తే, ప్రతి మారుమూల పల్లె కాంతులీనుతుంది కదూ! ఈ ‘ఉప్పునీటి దీపం’ కథేంటి? ఫిలిప్పైన్స్‌లో దిగువ ఆదాయ వర్గానికి చెందిన ఇళ్ళలో కూడా నీళ్ళు, బియ్యం, ఉప్పు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉప్పు నీళ్ళు పుష్కలం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఈ సోదర సోదరీమణుల జంట అడుగు ముందుకేసింది. వారు రెండు వేర్వేరు రకాలైన లోహపు పలకల్ని తీసుకొని, ఉప్పునీటిలో మునిగేలా చేశారు. ఈ క్రమంలో అదనపు ఎలక్ట్రాన్లు ఒక లోహపు పలక నుంచి మరొకదానికి తీగ గుండా ప్రయాణిస్తాయి. ఆ రకంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయి, ‘ఎల్.ఇ.డి’ దీపాన్ని వెలిగేలా చేస్తుంది. విశేషం ఏమిటంటే, ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని, దానిలో రెండు టీ స్పూన్ల ఉప్పు కలిపి, ఆ ద్రావణాన్ని లోహపు పలకలతో వినియోగిస్తే చాలు. ఆ దీపం ఏకంగా 8 గంటల పాటు నిర్విరామంగా వెలుగుతుంది. కాంతిని ప్రసాదిస్తుంది. మరో విశేషం ఏమిటంటే, కిరోసిన్ దీపాల లాగా ఈ ఉప్పునీటి దీపాలు ప్రమాదభరితమైనవి కావు. హాయిగా ఇంట్లో వీటిని తగిలించి, ఉంచుకోవచ్చు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్ళలో తయారు చేసిన ఉప్పునీటి ద్రావణంతో కూడా ఈ దీపాల్ని మళ్ళీ నింపుకోవచ్చు. సముద్రతీరంలో నివసించేవారైతే, సింపుల్‌గా సముద్రపు నీటిని వాడుకోవచ్చు. అయితే, ఈ ల్యాంప్లలోని ఎలక్ట్రోడ్ పలకల్ని మాత్రం దాదాపు ఏటా రెండుసార్లు మార్చాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూసినప్పటికీ, ఫిలిప్పైన్స్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ దీపాలు తక్కువ ఖర్చుతో, వెసులుబాటుగా మారాయి. -
లో ఫోడ్మ్యాప్ ఆహారంతో ఇవీ ప్రయోజనాలు...
పరిపరి శోధన కొందరిని ఐబీఎస్, కింది నుంచి గ్యాస్ పోవడం సమస్యలు విపరీతంగా బాధిస్తుంటాయి. ఈ రెండు సమస్యలను చాలావరకు ఆహారంతోనే నివారించవచ్చు అంటున్నారు అధ్యయన వేత్తలు. తిన్న వెంటనే విరేచనానికి వెళ్లాల్సి రావడం, కడుపునొప్పిగా అనిపించడం వంటి సమస్య అయిన ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ , నలుగురిలో చాలా ఇబ్బందిగా అనిపించే కింది నుంచి మాటిమాటికీ గ్యాస్ పోతుండటం వంటి సమస్యలకు ‘లో ఫోడ్మ్యాప్’ డైట్ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు. ‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్ , డైశాకరైడ్స్ , మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్ ’ అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్మ్యాప్’ అనే మాటను రూపొందించారు. ఆయా పోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెర పదార్థాలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. లో ఫోడ్ మ్యాప్ ఆహారం అంటే ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనోశాకరైడ్స్, పాలీయాల్స్ తక్కువగా ఉండే ఆహారాలు అన్నమాట. ఐబీఎస్, కింగడినుంచి గ్యాస్ పోయేవారికోసం ఫోడ్మ్యాప్ తక్కువగా ఉండేలా డైట్ చార్ట్ రూపొందించారు ఆస్ట్రేలియా మెల్బోర్న్కు చెందిన మోనాష్ యూనివర్సిటీ ఆహార నిపుణులు. ఫోడ్మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం... మనం అసలు తీసుకోకూడని ఆహారాలు... పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పీయర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రకోలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు... వరి అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ (ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ అంటే లో ఫోడ్మ్యాప్ అని పొరబడకూడదు); పండ్లలో అరటి, నేరేడు, ద్రాక్ష, కీవీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీలు; ఆకుకూరలలో క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ప్రోటీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్నట్స్ తీసుకోవచ్చు. ఐబీఎస్, కింది నుంచి గ్యాస్పోవడం ద్వారా బాధపడేవారిని ఎంపికచేసిన ఆస్ట్రేలియా పరిశోధకులు పైన పేర్కొన్న ‘లో-ఫోడ్మ్యాప్ డైట్’ ఇవ్వడం వల్ల 74 శాతం మందిలో మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు లండన్ కింగ్స్ కాలేజీ నిపుణులనూ ప్రభావితం చేయడంతో బ్రిటన్‌లోని చాలా మందికి సైతం లో ఫ్యాడ్మ్యాప్ ఆహారం సిఫార్సు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ నిర్వహించిన మరో అధ్యయనంలో సైతం కూడా పై సమస్యలకు లో ఫాడ్‌మ్యాప్ మంచి రిలీఫ్‌ను ఇచ్చిందని తేలింది. ఈ డైట్‌ప్లాన్‌ను అనుసరించడంతో పాటు ఎక్కువ మొత్తాలలో అదేపనిగా తినడం, కెఫిన్, ఆల్కహాల్‌ను తగ్గించడం అవసరమని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జర్నల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురిత మయ్యాయి. -
ఎంతవరకు పాత్ర ఉంటే.. అంతవరకే వేడి!
హౌ ఇట్ వర్క్స్? / ఇండక్షన్ స్టవ్ ఇండక్షన్ స్టవ్‌ల గురించి మీరు విన్నారా? వినే ఉంటారులెండి. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయాయి ఇవి. గ్యాస్కంటే తక్కువ ఖర్చుతో వంట చేసుకోవచ్చునని, పిల్లలు ముట్టుకున్నా అపాయం లేదని రకరకాల ప్రచారం జరుగుతోంది వీటిపై. ఈ విషయాలను కాసేపు పక్కనపెడితే ఇవి ఎలా పనిచేస్తాయన్నది మాత్రం చాలా ఆసక్తికరం. ఏదైనా మెటల్ తీగచుట్టలోకి కరెంటు ప్రవహిస్తే ఏమవుతుంది? ఆ తీగచుట్ట కాస్తా అయస్కాంతంగా మారుతుంది. ఫలితంగా దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇండక్షన్ కుక్కర్లో జరిగే తంతూ ఇదే. నిజానికి ఇండక్షన్ అంటేనే అయస్కాంతం సాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేయడమని అర్థం. ఇంకోలా చెప్పాలంటే విద్యుదయస్కాంత తత్వం తాలూకూ రెండు రూపాలు విద్యుత్తు, అయస్కాంత శక్తి అన్నమాట. ఇండక్షన్ స్టవ్లోనూ ఓ తీగచుట్ట ఉంటుంది. స్విచ్ ఆచ్ చేయగానే దాంట్లోకి కరెంటు ప్రవహిస్తుంది. విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. స్టవ్‌పై ఏదైనా పాత్రను ఉంచినప్పుడు అయస్కాంత క్షేత్రం పాత్రపై కూడా ప్రభావం చూపుతుంది. పాత్రలోని ఎలక్ట్రాన్లు క్షేత్రానికి తగ్గట్టుగా ప్రవహిస్తాయి. ఈ కదలికలు అడ్డదిడ్డంగా ఉండటం వల్ల విపరీతమైన శక్తి పుడుతుంది. ఉష్ణం రూపంలో వెలువడుతూంటుంది. దీని ద్వారా పాత్ర లోపల ఉన్న పదార్థాలూ వేడెక్కుతాయన్నమాట. అంతే! స్టవ్‌పై పాత్ర ఉన్న ప్రాంతంలో మాత్రమే అయస్కాంత క్షేత్రాల్లో తేడాలు రావడం, ఉష్ణం పుడుతుంది కాబట్టి మిగిలిన చోట్ల అంతా మామూలుగానే ఉంటుంది. ఇంకో విషయం. ఇండక్షన్ స్టవ్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలంటే వీలైనంత వరకూ ఇరన్ పాత్రలు లేదా అడుగున ఐరన్ పూత ఉన్న పాత్రలు వాడటం మేలు. -
తెలంగాణలో సీఎన్జీ స్టేషన్లు నెలకొల్పండి
పెట్రోలియం మంత్రికి దత్తాత్రేయ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు గ్యాస్ కనెక్షన్లు పెంచాలని, సీఎన్జీ స్టేషన్లు ఏర్పా టు చేయాలని పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం తన కార్యాలయానికి వచ్చి భేటీ అయిన సందర్భంలో దత్తాత్రేయ ఈ విషయాలను చర్చించారు. హైదరాబాద్ నగరంలో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని, నేదునూరు, శంకరపల్లిల్లో ప్రతిపాదిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్ కేటాయించాలని కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ, ‘భాగ్యనగర్ గ్యాస్’ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న సీఎన్జీ స్టేషన్లకు గ్యాస్ పెంపు, స్టేషన్ల పెంపుపై అధికారులతో చర్చిస్తామన్నారు. -
జీఎంఆర్, జీవీకే, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్
పీఎస్డీఎఫ్ స్కీమ్ కింద ఈ-వేలంలో కేటాయింపు న్యూఢిల్లీ: గ్యాస్ సరఫరా లేక నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రభుత్వం తాజాగా దిగుమతయ్యే గ్యాస్‌ను కేటాయించింది. ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ లిమిటెడ్ వెబ్సైట్ ద్వారా నిర్వహించిన ఈ-వేలంలో రోజుకు 7.72 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) రీ-గ్యాసిఫైడ్ సహజ వాయువు(ఆర్-ఎల్ఎన్జీ)ను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ గ్యాస్ సరఫరా జరుగుతుంది. దీనిద్వారా 6.79 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం కానుంది. బిడ్డింగ్‌లో రత్నగిరి గ్యాస్ అండ్ పవర్(దబోల్ ప్రాజెక్టు)కు అత్యధికంగా 2.35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ దక్కింది. కేటాయింపులు జరిగిన ఇతర సంస్థల్లో ల్యాంకో కొండపల్లి పవర్(1.58 ఎంఎంఎస్‌సీఎండీ), జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ(1.09), కోనసీమ గ్యాస్ పవర్(0.71), పయనీర్ గ్యాస్ పవర్(0.55), జీఎంఆర్ వేమగిరి పవర్(0.52), గామా ఇన్ఫ్రాప్రాప్(0.35), జీవీకే ఇండస్ట్రీస్(0.32), స్రవంతి ఎనర్జీ(0.25), ఉన్నాయి. బిడ్డర్లు నెగటివ్ సబ్సిడీ లేదా ఒక్కో యూనిట్‌కు 3 పైసల వరకూ ప్రీమియం రేటును బిడ్ చేయడంతో ప్రభుత్వానికి ఈ-వేలం ద్వారా రూ.18 కోట్ల మేరకు సబ్సిడీ భారం తగ్గనుంది. పవర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫండ్(పీఎస్డీఎఫ్) కింద నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు దిగుమతయ్యే గ్యాస్ కొనుగోళ్ల కోసం ఆర్థిక సహకారం అందుతుంది. 2015-16లో రూ. 3,500 కోట్లు, 2016-17లో రూ.4,000 కోట్ల చొప్పున ఈ ఫండ్ నుంచి నిధులను కేటాయించారు. -
నేటి నుంచి విద్యుత్ ప్లాంట్లకు సబ్సిడీ గ్యాస్ వేలం
న్యూఢిల్లీ: విద్యుత్ ప్లాంట్లకు ఉపయోగించే గ్యాస్‌పై సబ్సిడీకి సంబంధించి వేలం మంగళవారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే వేలంలో దాదాపు రూ. 1,600 కోట్ల విలువ చేసే సబ్సిడీ కోసం జీఎంఆర్, ఎన్టీపీసీ, ఎస్సార్ పవర్, టాటా పవర్ తదితర సంస్థలు పోటీపడనున్నాయి. ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ దీన్ని నిర్వహించనుంది. దిగుమతి చేసుకున్న ఖరీదైన గ్యాస్‌ను దేశీ కంపెనీలు తమ విద్యుత్ ప్లాంట్లకోసం కొనుగోలు చేసుకునేందుకు ఈ వేలం ఉపయోగపడనుంది. గ్యాస్ కొరతతో నిల్చిపోయిన ప్లాంట్లకు ఊపిరినిచ్చేందుకు ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. ఖరీదైన గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం పవర్ సిస్టం డెవలప్మెంట్ ఫండ్ (పీఎస్డీఎఫ్) కింద కొంత సబ్సిడీ కల్పిస్తోంది. అత్యధికంగా సబ్సిడీ వదులుకునేందుకు సిద్ధపడిన సంస్థలకు దిగుమతి చేసుకున్న గ్యాస్ కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యం లభిస్తుంది. దీనికోసమే తాజాగా రివర్స్ ఈ-ఆక్షన్ నిర్వహిస్తోంది. 24 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లకు ఈ గ్యాస్‌తో ప్రయోజనం చేకూరనుంది. -
గ్యాస్ ధరకు కొత్త ఫార్ములా
♦ చమురు, గ్యాస్ రంగంలో సంస్కరణలు ♦ మైనింగ్ చట్టాల్లో సవరణలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశీ చమురు, గ్యాస్ రంగ వృద్ధికి తోడ్పడేలా కేంద్రం మరిన్ని సంస్కరణలు ప్రకటించింది. కఠిన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన క్షేత్రాల్లో గ్యాస్ వెలికితీతను ప్రోత్సహించేలా కొన్ని పరిమితులతో కొత్త ధరల విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గిట్టుబాటు ధర లేనందువల్ల వదిలేసిన దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల విలువ చేసే గ్యాస్‌ను వెలికితీసేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు మైనింగ్ సంస్థలు మరిన్ని అసెట్స్‌ను సులువుగా విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ సంబంధిత చట్టాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, భవిష్యత్‌లో నిర్వహించే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి సంబంధించి వివాదాస్పదమైన ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్సీ)స్థానంలో ఆదాయ పంపక ఒప్పందాన్ని కూడా ఓకే చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గురువారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఫార్ములాతో కఠిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లు 85 శాతం మేర ఎగియనున్నాయి. ప్రస్తుత ధరల ప్రాతిపదికన చూస్తే యూనిట్ (ఎంబీటీయూ) ధర 7.08 డాలర్లకు పెరగనుంది. వివాదాల్లో ఉన్న క్షేత్రాలకు ఇది వర్తించదు. సుమారు 28 క్షేత్రాల్లోని 6.75 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ను వెలికితీయడానికి కొత్త ధర ఉపయోగపడగలదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం భారత్ రోజుకు 90 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. ఇది దేశీయవసరాల్లో సుమారు నలభై శాతానికి కూడా సరిపోవడం లేదు. కొత్తగా మిగతా క్షేత్రాలు అందుబాటులోకి వస్తే మరో 15 ఏళ్ల పాటు రోజుకు అదనంగా 35 ఎంసీఎండీ మేర గ్యాస్ ఉత్పత్తి జతవుతుందని ప్రధాన్ పేర్కొన్నారు. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, జీఎస్పీసీకి ప్రయోజనం.. తాజా ఫార్ములాతో అత్యధిక ఒత్తిడి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల నుంచి, అత్యంత లోతైన సముద్రగర్భాల నుంచి వెలికి తీసే గ్యాస్‌కు ధరను నిర్ణయించుకునేందుకు ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, జీఎస్పీసీలకు స్వేచ్ఛ లభిస్తుంది. అయితే, ఈ రేటుకూ ఒక పరిమితిని నిర్దేశించింది ప్రభుత్వం. దీని ప్రకారం దిగుమతి చేసుకున్న ఫ్యుయల్ ఆయిల్, బొగ్గు, నాఫ్తా మొదలైన వాటి ఏడాది సగటు ధర కన్నా.. ఈ రేటు తక్కువగానే ఉండాలి. 2015లో సగటు ఇంధన రేట్లను బట్టి చూస్తే యూనిట్ ధర సగటున 7.08 డాలర్లవుతుంది. కొత్త ధరల మార్గదర్శకాలు ఈ ఏడాది జనవరి 1 నాటికి ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాని నిక్షేపాలకు వర్తిస్తాయి. వివాదాల్లోని గ్యాస్ క్షేత్రాలకు .. సదరు వివాదం పరిష్కారమయ్యే దాకా కొత్త ఫార్ములా వర్తించదు. కేజీ-డీ6 బ్లాక్‌లోని ధీరూభాయ్-1, 3 గ్యాస్ క్షేత్రాల గ్యాస్‌కు అధిక రేటు కోరుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో తాజా ఫార్ములా నిబంధనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిలయన్స్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాకులో దాదాపు డజను పైగా నిక్షేపాలు, పొరుగునే ఉన్న కేజీ-డీ5లో ఓఎన్జీసీవి దాదాపు 6-7 నిక్షేపాలు, జీఎస్పీసీకి చెందిన కేజీ-ఓఎస్ఎన్-2001/3కి చెందిన మరికొన్ని నిక్షేపాల్లో ఇంకా గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరేలా బిడ్లు వేసే సంస్థలకు.. అన్ని రకాల హైడ్రోకార్బన్ల వెలికితీత, ఉత్పత్తికి ఏకీకృత లెసైన్స్ లభిస్తుంది. ♦ బ్రిటన్ సంస్థ బీజీ గ్రూప్‌నకు చెందిన పన్నా/ముక్తా తపతి వంటి చిన్న, మధ్య తరహా క్షేత్రాల లెసైన్సు గడువును పదేళ్ల పాటు పొడిగించారు. ఇందుకోసం కొన్ని నిబంధనలు మార్చారు. అయితే, కెయిర్న్ ఇండియాకు చెందిన రాజస్తాన్ బ్లాక్ లెసైన్సు గడువు పెంపు ప్రస్తావించలేదు. ♦ వేలం ద్వారా కాకుండా కంపెనీలు కేటాయింపుల మార్గంలో దక్కించుకున్న ఖనిజ గనులను విక్రయించుకునేందుకు, విలీనాలు.. కొనుగోళ్లకు వీలు కల్పిస్తూ మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) 1957 చట్టానికి సవరణలను క్యాబినెట్ ఆమోదించింది. -
మాటల గారడీతో బురిడీ
విశ్లేషణ వంట గ్యాస్ సబ్సిడీ రూ. 48 కోట్లతో ఏడాదిపాటూ దేశంలోని పేదరికాన్ని నిర్మూలించ వచ్చని ఒక ఆర్థికవేత్త అన్నారు. అలాగైతే కార్పొరేట్ రంగానికి పన్నుల రాయితీలుగా ఇస్తున్న రూ. 42 లక్షల కోట్లతో 84 ఏళ్ల పాటూ దేశ పేదరికాన్ని నిర్మూలించి, గత చరిత్రగా మార్చేయొచ్చుగా? అంటే, ఆ రాయితీలు ‘వృద్ధికి ప్రోత్సాహకం’ అన్నారు. కానీ ఈ రాయితీలు వృద్ధిపై ప్రభావం చూపిన దాఖలాలే లేకుండా విఫలమయ్యాయి. ఆ డబ్బంతా ఎక్కడికి పోయినట్టు? పదే పదే అడుగుతున్నా... భీకర నిశ్శబ్దమే తప్ప సమాధానం రాదు. అవునండీ, ప్రధాన మంత్రి గారూ! మీరన్నది అక్షరాలా నిజం. ఇదంతా మాటల గారడీయే. పేదలకిచ్చే ఆర్థిక సహాయాన్ని సబ్సిడీలంటారు. సంపన్నులకు... భూమి, సహజ వనరులను కారు చౌకకు సునాయాసంగా కట్టబెట్టేయడం, పన్నుల రాయితీలు, పన్నుల సెలవులు వంటి కొండవీటి చాంతాడంతటి భారీ రాయితీల జాబితాను వృద్ధికి ప్రోత్సాహకం అంటారు. పేదలకిచ్చే సబ్సిడీ అనే పదమే ఇప్పుడు గొప్ప తప్పుగా మారిపోయింది. వృద్ధి పేరిట పన్ను రాయితీల దగా ఆర్థిక చింతనను అతి తెలివిగా వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగా పదాలను ఎంచుకుని వల్లె వేయడం బహిరంగ చర్చలో భాగమై పోయే స్థాయికి నేడు చేరింది. ఈ పదాల గారడీ ఆర్థిక అంతరాలు మరింత అధ్వానంగా విస్తరిం చడానికి దారి తీస్తోంది. సంపన్నులకు, పలుకుబడిగలవారికి తరచుగా ఇస్తుండే విపరీతమని అనిపించేటంతటి భారీ సబ్సిడీలే బహుశా నేటి ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభానికి అసలు పునాదులు కావచ్చు. ఆ సబ్సిడీలను కప్పిపుచ్చడానికి తగ్గ పదజాలాన్నే ఎంచుకుంటున్నారు. ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలెవరూ ఈ విషయాన్ని ఎన్నడూ ప్రశ్నించకపోవడమే విషాదం. వారికీ విషయం తెలుసు. అయినా మౌనం దాల్చారు. ‘‘ఎరువుల సబ్సిడీలను ‘వ్యవసాయ ఉత్పత్తికి ప్రోత్సాహకం’గా పునర్నామకరణం చేస్తే కొందరు నిపుణులు వాటిని విభిన్నంగా చూడవచ్చా? అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది’’ అని ప్రధాని అన్నారు. ఆయన సరిగ్గా సరైన విషయమే చెప్పారు. సరిగ్గా నేనీ విషయాన్నే చాలా కాలంగా చెబుతున్నాను. ఇది పదాల గారడీ కాకపోతే... 2004-05 నుంచి మన కార్పొరేట్ రంగానికి రూ. 42 లక్షల కోట్ల పన్ను రాయితీలను ఇవ్వడాన్ని వృద్ధికి ప్రోత్సాహకమని ఎలా అంటారు? (సంపన్నుల కిచ్చే ఈ భారీ సబ్సిడీలను బడ్జెట్ డాక్యుమెంట్లలో ‘ముందస్తుగా వదులుకున్న రాబడులు’ అని చూపుతారు.) దేశ జనాభాలో 67 శాతం ఆకలిని తీరుస్తుందని భావిస్తున్న ఆహార భద్రతా కార్యక్రమానికి ఖర్చయ్యే రూ. 1.25 లక్షల కోట్లు వృథా సబ్సిడీ అని ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందుకు గగ్గోలు పెడతారు? ఈ విషయాన్ని మీరూ గమనించే ఉంటారు. పలు టీవీ చర్చల్లో నేనీ ప్రశ్నను లేవనెత్తినప్పుడల్లా నన్ను విస్మరించడమే జరగుతోంది. విఫలమైన కార్పొరేట్ రాయితీలు నాకింకా గుర్తుంది. ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీతో జరిగిన ఒక బడ్జెట్ పూర్వ సమావేశాల్లో పన్ను రాయితీలను ఉపసంహరించుకోవాలని సూచించాను (అప్పట్లో అవి ఒక్క ఏడాదికే రూ. 5.24 లక్షల కోట్లుగా ఉన్నాయి). అవి దేశ అర్థిక వనరులను ఖాళీ చేసే భారీ కంత అని వివరించాను. కాగా, ఈ భారీ రాయితీలను ప్రజల కంటపడకుండా చేస్తున్న ‘ముందస్తుగానే వదులుకున్న రాబడులు’ పద్దును బడ్టెట్ పత్రాల నుంచి తొలగించాలని ప్రధాన స్రవంతికి చెందిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక మంత్రిని కోరేంత వరకూ వెళ్లారు. గ్యాస్ సబ్సిడీతో పేదరిక నిర్మూలన? ఈ విషయాన్ని పరిశీలించండి. వంట గ్యాసు (ఎల్పీజీ) సబ్సిడీని వృథా సబ్సిడీ అంటూ గగ్గోలు పెట్టారు. దానిలో చాలా వరకు సంపన్న వర్గాలకు చేరేదే. వారి సబ్సిడీని ఉపసంహరించుకోవాల్సిందే. ఏటా దేశం వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీల కోసం రూ. 48 కోట్లు ఖర్చు చేస్తోందని, ఒక ఏడాది పాటూ దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి అది సరిపోతుందని ఒక ఆర్థిక శాస్త్రవేత్త రాయడం నాకు గుర్తుంది. ఆయన మొత్తంగా ఆ సబ్సిడీ రద్దును కోరారు. రూ. 48 కోట్ల వంట గ్యాస్ సబ్సిడీతో ఏడాది పాటూ పేదరి కాన్ని నిర్మూలించగలిగితే, పన్నుల రాయితీల రూపేణా ఇస్తున్న రూ. 42 లక్షల కోట్లతో 84 ఏళ్ల పాటూ దేశ పేదరికాన్ని నిర్మూలించవచ్చని, పేదరికం కచ్చితంగా గత చరిత్రగా మారిపోతుందని నేను బదులు రాశాను. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న పన్ను రాయితీలు ‘వృద్ధికి ప్రోత్సాహకం’ అన్నారు. ఈ భారీ పన్ను రాయితీలు, మూడేళ్ల బడ్జెట్ పూర్తి వ్యయానికి సరిపోతాయి. పైగా ఈ రాయితీలు ఆశించిన ఫలితాలను సాధించడంలో విఫలమయ్యాయి. దేశంలో ఇప్పుడు కనిపిస్తున్నది ఉద్యోగాలు లేని వృద్ధి. ఉపాధి కల్పన నిరాశాజనకంగా, పారిశ్రామిక వృద్ధి మందకొడిగా ఉండగా, వస్తుతయారీ వృద్ధి రుణాత్మకంగా మారింది. ఎగుమతులు పుంజుకోవడంలో విఫలమయ్యాయి. వృద్ధికి ఇస్తున్న ప్రోత్సాహకాలు ఎలాంటి ప్రభావాన్ని కలిగించిన దాఖలాలే కనబడకుండా విఫలమైతే, ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయినట్టు? అనే ప్రశ్నను నేను పదే పదే అడుగుతూనే ఉన్నాను. సమా దానం మాత్రం నేటికీ రాలేదు. నీతి ఆయోగ్ ఎన్నడూ దీన్ని ప్రశ్నించినదీ లేదు. ముఖ్య ఆర్థిక సలహాదారు ఈ విషయాన్ని వేలెత్తి చూపినదీ లేదు. భీకర నిశ్శబ్దమే తప్ప సమాధానం రాదు. దేశానికి దెబ్బ మీద దెబ్బ ‘‘ద్వంద్వ పన్నుల ఒప్పందాలు కొన్ని సందర్భాల్లో రెట్టింపు పన్నుల ఎగవేతకు దారి తీస్తుంది’’ అని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య నాకు నచ్చింది. ఏటా ఇచ్చే పన్నుల రాయితీలలో ఇవి కూడా లెక్కకు రావు. మరో విధంగా చెప్పాలంటే, దేశానికి రెట్టింపు నష్టం వాటిల్లుతుంది. ఒక వంక ఈ పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ రాబడికి నష్టం. మరోవంక ప్రధాని అన్నట్టు ‘‘స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపారం జరిగే షేర్ల నుంచి లభించే డివిడెంట్లను (లాభాలు), దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్‌ను ఆర్జించేది పేదలు కాకున్నా వాటిపై ఆదాయపు పన్నుకు పూర్తి మినహాయింపు ఉంది. అది మినహాయింపే అయినా దాన్ని పన్ను రాయితీగా లెక్కించడంలేదు.’’ ప్రధాని అన్నది అక్షర సత్యం. దేశానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ మాటల గారడీ ఇక్కడితో ముగిసేది కాదు. మీరో, నేనో బ్యాంకు అప్పు చెల్లించలేకపోతే మనల్ని అపరాధులుగా లెక్కిస్తారు. మనం అప్పుచేసి కొన్న కారును లేదా మనం కుదువ పెట్టిన ఆస్తిని బ్యాంకు లాక్కుంటుంది. లేదంటే ఆ డబ్బు రాబట్టుకోడానికి తప్పుడు పద్ధతులకైనా పాల్పడుతుంది. అదే సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు బ్యాంకు రుణం చెల్లించకపోతే. ఆ రుణాన్ని నాన్-పెర్ఫార్మింగ్ ఎస్సెట్స్ (ఎన్పీఏలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తులు) అంటారు. ఈ పద ప్రయోగంతో రెండు ప్రయోజనాలు. ఒకటి, తెలివిగా విభిన్న పదాలను ప్రయోగించడం ద్వారా పెద్ద పెద్ద నేరాలను ఎలా దాచిపెట్టేస్తారో సామాన్యునికి అర్థం కాదు. రెండు. ఈ కంపెనీల భౌతిక అస్తులను ఎన్నడూ స్వాధీనం చేసుకోరు. అందుకు బదులుగా వారి బాకీలను పునర్వ్యవస్థీకరిస్తారు. సామాన్యుని సబ్సిడీకి మోదీ వత్తాసు బ్యాంకుల క్రియాశీలంగా లేని ఆస్తులు కీలక స్థాయికి చేరాయి. కానీ ఏ టీవీ చర్చనైనా చూడండి... వాటి గురించి ఎప్పుడో గానీ ప్రస్తావనకు రాదు. 2008-09లో రైతుల రుణాలను రూ. 74 వేల కోట్ల మేరకు మాఫీ చేశారనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. భారీ రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరించడం మాత్రం ప్రధాన మీడియాలో (బిజినెస్ చానల్స్ సహా) చర్చకు రావడం ఎన్నడూ చూసి ఎరుగను. కారణం సుస్పష్టమే. సంపన్నులు తమకిచ్చే సబ్సిడీలను కాపాడుకోవాలని కోరుకుంటారు. ప్రజలకు అర్థంకాని పదజాల ప్రయోగంతో వాటిని కప్పిపుచ్చడమే అందుకు అత్యుత్తమ మార్గం. ప్రధాన మంత్రి గారూ, ధన్యవాదాలు. ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు, మీడియా అడుగిడటానికి భయపడే బాటన మీరు అడుగు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల సబ్సిడీలను సమర్థిస్తూ మాట్లాడారు. అది పూర్తిగా సరైనది. వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు hunger55@gmail.com దేవిందర్‌శర్మ -
గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ భారీగా మంటలు
-
పేలిన సిలిండర్.. తప్పిన ప్రమాదం
-
‘గ్యాస్’ కొట్టేస్తున్నారు!
రాయితీ గ్యాస్‌తో వ్యాపారం వాణిజ్య సిలెండర్లలో నింపి అమ్మకాలు అక్రమ దందాకు ఏజెన్సీల సహకారం నిద్దరోతున్న నిఘా ‘‘శ్రీమంతులంతా గ్యాస్ రాయితీని వదులుకోండి.. పేదలకు మరింత తక్కువ ధరకు గ్యాస్‌ను సరఫరా చేసేందుకు సహకరించండి’’ అంటూ సాక్షాత్తు భారత ప్రధానమంత్రే పిలుపునిస్తున్నారు.. కొందరు స్పందిస్తున్నారు కూడా.. మరి మన అధికారులు ఏం చేస్తున్నారు.. రాయితీ గ్యాస్ పక్కదారి పడితే సహించేది లేదు.. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని మీటింగులు పెట్టి హెచ్చరికలు జారీచేస్తున్నారు. తర్వాత ఆమ్యామ్యాలు పుచ్చుకుని అక్రమార్కులకు వంత పాడుతున్నారు. సబ్సిడీ గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చుంటున్నారు. తిరుపతి మంగళం: నగదు బదిలీ పథకం, ఆధార్ అనుసంధానం, ఇతర చర్యలు ఏవీ అక్రమార్కులను అడ్డుకోలేకపోతున్నాయి. రాయితీ గ్యాస్‌ను వాణిజ్య సిలెండర్లలో నింపి నిత్యం వందల సంఖ్యలో బహిరంగ మార్కెట్‌కు తరలించి అమ్మేస్తుంటే అధికారులు మాత్రం పైకి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్పితే ఆ పని మాత్రం చేయడంలేదు. జిల్లాలో 79 గ్యాస్ ఏజెన్సీలుండగా 7.26లక్షల కనెక్షన్లకు సిలెండర్లు సరఫరా చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం ప్రతిరోజూ 65 నుంచి 70వేల సిలెండర్లు డీలర్లు సరఫరా చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ కనె క్షన్ల సంఖ్య 16,200వరకు ఉంది. అయితే హోటళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నవారు సబ్సిడీ సిలెండర్లను వినియోగిస్తున్నారు. కొన్ని హోటళ్లలో వాణిజ్య సిలెండర్లు వినియోగిస్తున్నా అందులో గృహ వినియోగ సిలిండర్ల నుంచి నింపిన గ్యాస్ ఉండడం గమనార్హం. ఈ గ్యాస్ దందా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇదీ సంగతి.. నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడూ ఏడాదికి 12 సిలెండర్లను రాయితీపై పొందవచ్చు. అయితే చాలా పేద కుటుంబాలు ఏడాదికి 5 నుంచి 6 సిలెండర్లకు మించి వాడడం లేదు. ఇదే అక్రమార్కుల పాలిట వరంగా మారింది. కొందరు అక్రమార్కులు అలాంటి వారి నెంబర్లు సేకరించి ఏజెన్సీల నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నారు. గ్యాస్‌తో వ్యాపారం చేసేవాళ్లే సిలెండర్లను నమోదుచేసి రాయితీ మొత్తాన్ని కనెక్షన్ తీసుకున్న వారికి నేరుగా బ్యాంకులో పడేలా చేస్తున్నారు. మిగిలిన సొమ్ము మింగేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో రాయితీ సిలిండర్ ధర రూ.584. ఇందులో రాయితీ సుమారు రూ.122 లబ్ధిదారునికి బ్యాంకు ద్వారా అందుతుంది. ఇదే గ్యాస్‌ను వాణిజ్య సిలెండర్లలో నింపి డిమాండ్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.1,800వరకు విక్రయిస్తున్నారు. కొన్ని రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకుని గ్యాస్‌ను నింపే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అనుమతి లేని కార్లలో గ్యాస్ కిట్లు ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఇదే తీరులో గ్యాస్ నింపి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలు అందిస్తే చర్యలు తీసుకుంటాం అక్రమంగా గ్యాస్ నింపే కేంద్రాలపై దృష్టి సారిస్తాం. అలాంటి వివరాలు తెలిస్తే ఫిర్యాదు చేయండి. అధికారులను అప్రమత్తం చేసి నిఘా పెడతాం. ప్రణాళిక ప్రకారం దాడులు చేసి వారి ఆటకట్టిస్తాం. -జి. నాగేశ్వరరావు, డీఎస్ఓ -
ఐట్యూన్స్, గ్యాస్, డౌన్లోడ్..!
స్విస్ బ్యాంకుల్లో లావాదేవీలకు రహస్య సంకేతాలు ఇవి... జ్యూరిక్: కాదేదీ ‘కోడ్’కు అనర్హం అంటే ఇదేనేమో! ఇంతకీ దేనికంటారా.. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకునేవాళ్లకు రహస్య సంకేతాల్లో ట్రెండ్ ఇది. అంతర్జాతీయంగా వివిధ దేశాలు నల్లధనంపై కొరడా ఝుళిపిస్తుండటంతో స్విస్ బ్యాంకులు తమ గుట్టును విప్పాల్సి వస్తోంది. కేవలం ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచుకోవడానికి మాత్రమే కోడ్లను వినియోగిస్తుంటారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే, అక్కడి బ్యాంకర్లకు క్లయింట్లకు మధ్య జరిగే ప్రతి ఒక్క లావాదేవీకి కూడా ఒక రహస్య సంకేతం ఉంటుందన్న విషయం ఇటీవలే బయటికొచ్చింది. అమెరికా పన్ను శాఖలతో పలు స్విస్ బ్యాంకులు చేసుకున్న సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం ఖాతాలకు చెందిన అనేక వివరాలను ఆయా బ్యాంకులు తెలియజేశాయి. ఇందులో కోడ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా స్విస్ బ్యాంక్ క్లయింట్లు తమ ఖాతాల నుంచి సొమ్మును ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడానికి ‘డౌన్లోడ్’ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందట! అదేవిధంగా నిధులను డ్రా చేసుకోవాలంటే చెప్పాల్సిన రహస్య సంకేతాల్లో ‘ఐట్యూన్స్’, ‘గ్యాస్’ వంటివి ఉన్నాయి. బ్లాక్ మనీపై భారత్ సహా అనేక దేశాలు ఇటీవల పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో స్విస్ బ్యాంకులు రహస్య ఖాతాల గుట్టును విప్పాల్సి వస్తోంది. అయితే, తాజా కోడ్లను పరిశీలిస్తే.. ఇప్పటికే స్విస్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నిధులు సింగపూర్, ఇజ్రాయెల్, సైప్రస్, లెబనాన్, హాంకాంగ్, దుబాయ్ వంటి దేశాలకు తరలిపోయిందన్న విషయం తేటతెల్లమవుతోంది. యూఎస్ న్యాయ శాఖకు వివిధ స్విస్ బ్యాంకులు ఇచ్చిన ‘స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ నివేదిక దీన్ని బయటపెట్టింది. తమ క్లయింట్లు నల్లధనాన్ని దాచుకోవడానికి వివిధ దేశాల్లో దొంగ సంస్థలను రిజిస్టర్ చేసుకోవడానికి, బోగస్ బీమా పథకాలను సృష్టించడంలో ఎలా తోడ్పాటునందించిందీ కూడా బ్యాంకులు ఆ నివేదికలో వెల్లడించాయి. భారీస్థాయి(హై ప్రొఫైల్) ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ ఈవెంట్లకు హాజరయ్యే సంపన్నులను తమ నల్లధనాన్ని సురక్షితంగా ఎలా దాచుకోవచ్చో వివరించేందుకు స్విస్ బ్యాంకులు ప్రత్యేకంగా రిలేషన్షిప్ మేనేజర్లను రంగంలోకి దించేవన్న సంగతి కూడా తాజాగా బట్టబయలైంది. -
ఆందోళనకు గురిచేసిన గ్యాస్ లీకేజీ
మామిడికుదురు : పాశర్లపూడిలంక గ్రామంలో పాశర్లపూడి-18 బావి వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పడిన గ్యాస్ లీకేజీ సంఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. 15 నిమిషాల పాటు భారీశబ్ధంతో గ్యాస్ లీకవడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళన చెందారు. గ్యాస్ లీకైన ప్రాంతంలో ఆడుకుంటున్న యువకులు పరుగులు తీశారు. వెంటనే సమాచారాన్ని గ్రామస్తులు ఓఎన్జీసీ అధికారులకు, నగరం పోలీసులకు, రాజోలు అగ్నిమాపక కేంద్రం అధికారులకు అందించారు. అక్కడికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు లీకేజీని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మూడు పైపుల నుంచి భారీశబ్ధంతో గ్యాస్‌తో పాటు కొద్దిపాటి ముడి చమురు లీకైంది. నగరం పోలీసులు, ఓఎన్జీసీకి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పోలీసులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. అక్కడికి చేరుకున్న ఓఎన్జీసీ సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ బావి వద్ద కాపలాగా గార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానిక సర్పంచ్ బొరుసు నర్సింహమూర్తి, గ్రామస్తులు ముత్యాల సత్యనారాయణ, కోలా సత్యనారాయణ, పొలమూరి సత్యనారాయణ, పితాని వెంకటేశ్వరరావు, పెదమల్లు వెంకటేశ్వరరావు, రామకృష్ణ, తెలగారెడ్డి బులినాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ సిబ్బందిని నిర్బంధించారు. ఇది గ్యాస్ లీకేజీ కాదని, పాశర్లపూడి-18 బావి ఉత్పత్తిలో లేదని, ఐపీఎస్-8 బావిలో హైడ్రో టెస్టింగ్ పరీక్షలు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఓఎన్జీసీ సిబ్బంది వివరించారు. ఆ బావికి చెందిన పైప్‌నుంచి నీటితో పాటు గాలి పంపించి పరీక్షలు చేస్తుండగా అదే బావికి అనుసంధానమై ఉన్న ఈ బావి వద్ద గాలి, నీరు బయటకు ఎగజిమ్మాయని వివరించారు. ఈ విషయం ముందుగా తమకు తెలియచేయకపోవడం వల్ల ఆందోళన చెందామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ అధికారులు గతంలో తమకు పలు హామీలు ఇచ్చారని, వాటిని ఇంత వరకు అమలు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు ముందుగా సమాచారం అందించక పోవడం తమ పొరపాటని, ఆందోళనను ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్తామనడంతో గ్రామస్తులు శాంతించారు. -
గ్యాస్‌కు అధిక రేటు ఇవ్వాలి: బీపీ
న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌తో పాటు తూర్పున ఇతరత్రా ఆఫ్‌షోర్ బ్లాక్‌లలో ఇంకా అభివృద్ధి చేయని క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీయాలంటే రేటు మరింత ఎక్కువగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చమురు దిగ్గజం బీపీ.. కేంద్రానికి తెలిపింది. అలాగే, కేజీ-డీ6 వ్యయాలపై పెనాల్టీలపై ఆర్బిట్రేషన్ అంశం కూడా సత్వరం ఒక కొలిక్కి వచ్చేలా చూడాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో బుధవారం భేటీ అయిన బీపీ సీఈవో బాబ్ డడ్లీ ఈ అంశాలను వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన వెంట రాకపోవడం గమనార్హం. సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ఇచ్చే ప్రీమియం రేటును కేజీ-డీ6తో పాటు ఎన్ఈసీ-25 క్షేత్రాలకు కూడా వర్తింపచేయాలని బీపీ కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఛాతీ నొప్పికి... గుండెపోటుకు తేడా తెలుసుకోండి
లైఫ్ అండ్ డెత్ గుండెపోటు లక్షణాలూ, గ్యాస్ పైకి తన్నినప్పుడు కలిగే ఛాతీనొప్పి ఇంచుమించూ ఒకేలా ఉంటాయి. పైగా గ్యాస్‌తో కలిగే ఛాతీనొప్పికి ఇంగ్లిష్ పేరు ‘హార్ట్ బర్న్’ అని. దాంతో ఏది ప్రమాదకరమైన గుండెపోటో, ఏది అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్ సమస్యో తెలియక కొందరు తికమకపడుతుంటారు. కొందరు ప్రమాదకరమైన గుండెపోటును సైతం ‘ఆ... అంతా గ్యాసేలే’ అంటూ లైట్‌గా తీసుకుంటుంటారు. అందుకే అది ప్రమాదం కాని గ్యాస్ సమస్యే అయినా, ప్రమాదకరమైన గుండెపోటుగా కాసేపు అనుకున్నా తప్పులేదు. ఇలా ఎందుకు అనుమానించాలంటే... గుండెపోటు ప్రమాదం భారతీయుల్లో చాలా ఎక్కువ. కారణం మన జన్యువులే. ఇతర దేశాల్లో వయోవృద్ధులకు వచ్చే గుండెపోటు ముప్పు మన దేశంలో పాతికేళ్లకే ఎదురవుతోంది. మూడు పదులు దాటకముందే గుండెకు రక్తాన్ని అందించే మూడు ప్రధాన రక్తనాళాలు పూడుకుపోతున్నాయి. ముందున్న ఈ ముప్పును గుర్తుంచుకొని గుండెపోటును గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం... గుండెపోటు ఇస్తుంది వార్నింగ్...: గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు ఉన్నా... కొన్ని లక్షణాలను ముందస్తు హెచ్చరికలా పంపుతుంది. దాంతో మనం ముందుగానే గుండెపోటును అనుమానించవచ్చు. కొన్నిసార్లు గుండెపోటు రావడానికి చాలా గంటల ముందునుంచే మనకు ఈ హెచ్చరికలు అందుతుంటాయి. ఇవీ గుండెపోటు లక్షణాలు... : ఛాతీకి ఎడమవైపున నొప్పితో పాటు బరువుగా ఉన్నట్లు అనిపించడం ఊపిరాడని పరిస్థితి మగత చెమటలు పట్టడం వాంతులు కొందరిలో దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం కూడా రావచ్చు. గుండెనొప్పికీ, గుండెపోటుకీ మధ్య కూడా తేడా ఉంటుంది. ఛాతీ నొప్పి ఉండే కాల వ్యవధిని బట్టి ఆ తేడాను గుర్తించవచ్చు. ఛాతీనొప్పి మొదలైన మూడు నిమిషాల్లో దానికదే తగ్గిపోతుంది. అలా మూడు నిమిషాల్లో ఆగిపోకుండా, నొప్పి పది నిమిషాలకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని గుండెపోటుగా అనుమానించాలి. గుండెపోటు ఎందుకు వస్తుందంటే : గుండెకు రక్తప్రసరణ అకస్మాత్తుగా నిలిచిపోతే ఆకస్మికంగా గుండెపోటు వస్తుంది. గుండె రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు తలెత్తితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. భారతీయుల్లో సాధారణంగా 25 ఏళ్ల వయసులోనే మంచి రక్తం అందించే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే లక్షణాలు మొదలవుతున్నాయి. రక్తనాళాల్లో కొవ్వు గడ్డలుగా పేరుకుపోతూ రక్తప్రసరణకు ఆటంకం కలిగినప్పుడు ఆకస్మికంగా గుండెపోటు వస్తుంది. ఇది ఎప్పుడైనా జరగవచ్చు. గుండెపోటో - గ్యాస్ సమస్యో తెలియని తికమక : సాధారణంగా చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాలి. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా మొదలుకావచ్చు. మొదటి గంట... బంగారు క్షణాలు: గుండెపోటు లక్షణాలు బయటపడ్డ మొదటి గంట వ్యవధిని బంగారు క్షణాలుగా అభివర్ణించవచ్చు. ఇంగ్లిష్‌లో దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలో రోగిని ఆసుపత్రికి చేర్చగలిగితే అతడిని తప్పక రక్షించవచ్చు. అందుకే ఆ క్షణాలకు అంత విలువ. ఈ ఒక్క గంటే చావుబతుకుల మధ్య తేడాను నిర్ణయిస్తుంది. సాధారణంగా కొందరు రోగులు గుండెపోటు లక్షణాలు చాలా తేలిగ్గా తీసుకుంటారు. తమకు అప్పుడప్పుడూ కనిపించే గ్యాస్ తాలూకు లక్షణాలుగా అపోహ పడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ... ఛాతీనొప్పిని గుండెపోటుగా అనుమానించి ఆసుపత్రికి వెళ్లినా... రోగి క్షేమంగా తనకు అవసరమైన గ్యాస్ సమస్యకే చికిత్స తీసుకొని బయటకు వస్తాడు. కానీ ఒకవేళ... అది నిజంగానే గుండెపోటు అయి ఉండి, గ్యాస్ సమస్యగా అపోహ పడితే దానికి చెల్లించే మూల్యం చాలా భారీగా ఉండవచ్చు. మన మధ్య నుంచి ఒక వ్యక్తి అన్ని వసతులూ ఉండి జారిపోవచ్చు. అందుకే గ్యాస్ సమస్యనూ గుండెపోటుగానే అనుమానించి, నిర్ధారణ కోసం ఒక ఈసీజీ పరీక్ష తీయించడంలో తప్పేమీ లేదు. తప్పేది ముప్పు మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు ముందుజాగ్రత్తలివే...: గుండెపోటు వచ్చినట్లు అనుమానించిన వెంటనే రోగి చేత కొద్దిగా నీళ్లు తాగించాలి. ఆసుపత్రికి చేరుకునేలోగా అతడు విపరీతంగా దగ్గేలా ప్రోత్సహించాలి. 325 మి.గ్రా. డిస్ప్రిన్, 300 మి.గ్రా. క్లోపిడోగ్రెల్, 80 మి.గ్రా. స్టాటిన్ టాబ్లెట్లను మింగించాలి. దీనివల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక రోగి శరీరంపై బిగుతుగా ఉన్న దుస్తులను వదులు చేయాలి. అవసరమైతే కృత్రిమశ్వాస అందించాలి. రోగి శరీరానికి ఏమాత్రం శ్రమ కలగకుండా ఏదైనా వాహనంలో తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంతేగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోగి గుండెపై భారం పడేలా నడిపించడమో, మెట్లు ఎక్కించడమో చేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం ఎందరివో అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు. తీవ్రతలో రకాలు...: గుండెపోటు వచ్చిన సమయంలో నొప్పి తీవ్రత రకరకాలుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో నొప్పి తీవ్రంగానూ, భరించలేనంతగా ఉంటుంది. ఛాతీలో అసౌకర్యం 15 నుంచి 30 నిమిషాలపైనే ఉంటుంది. దీనికి సంబంధించిన మూడు ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి. 1. నొప్పి వస్తున్న ప్రాంతం 2. నొప్పి స్వభావం 3. నొప్పి తీవ్రమవుతూ, తగ్గుతూ ఉండటం. డాక్టర్ గణేష్ మాథన్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
నో మెడిసిన్ గ్యాస్ గాన్..!
కొందరికి పొడుపు కథలు ఎంతగా చెప్పినా అర్థం కావు. కానీ... సాధారణంగా మనలో 40 ఏళ్లు దాటిన ప్రతివారికీ ఓ పొడుపు కథ వెంటనే అర్థమవుతుంది. అదేమిటో ఓసారి చెప్పుకుందాం. కాళ్లు లేకపోయినా పొట్టలోంచి పైకి తన్నేదేమిటి? గాలి లాంటి తేలిక పేరున్నా గుండెల మీద బరువు పెట్టినట్లుగా ఉండేదేమిటి? కేవలం ఈ రెండు ప్రశ్నలతోనే సమాధానం వచ్చేస్తుంది. ఆ జవాబే ‘గ్యాస్ ట్రబుల్’ అని. పేరులోనే ట్రబుల్ ఉన్నా... మందులేవీ వాడకుండానే గ్యాస్ వల్ల ట్రబుల్ లేకుండా చూసుకోవడం ఎలా అన్నది తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మనం ఆహారం తీసుకోగానే అది జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం ఆసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. కొందరిలో ఆ ఆసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసేంత పరిమాణంలో లేకపోతే మరింత ఆసిడ్ ఉత్పన్నం అవుతుంది. ఆసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది కదా. అప్పుడది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంటే కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దాంతోపాటూ గ్యాస్ తాలూకు పొగలు (ఫ్యూమ్స్) పెకైగసినప్పుడు దాని ప్రభావం గొంతులోనూ తెలుస్తుంది. కొన్నిసార్లు ఆసిడ్ గొంతులోకి కూడా ప్రవేశించి, చేదుగా అనిపిస్తుంది. దీన్నే ‘వెట్ బర్ప్’ అని కూడా అంటారు. అప్పుడు గొంతు మంటగా అనిపించడం సహజం. హార్ట్‌బర్న్ అనుకోవడమూ సహజమే! మనం తిన్న ఆహారం ఈ ఈసోఫేగస్‌లోకి వెళ్లగానే అక్కడ దానిపై ఆసిడ్ ప్రభావం మొదలవుతుంది. ఈసోఫేగస్ దాదాపు గుండె ఉన్న ప్రాంతంలోనే ఉండటంతో ఈ ఛాతీలో మంటను ఒక్కోసారి గుండెమంటగా కూడా పొరబడి ‘గుండెపోటు’గా అపోహపడుతుంటారు. అందుకే దీన్ని ‘హార్ట్‌బర్న్’ అనుకోవడం కూడా సాధారణమే. అయితే మరికొన్ని పరిస్థితుల్లో గుండెకు సంబంధించిన నొప్పి వచ్చినా, దాన్ని ‘ఛాతీలో నొప్పి’ లేదా గ్యాస్ట్రబుల్ అనుకొని పొరబడ్డ సంఘటనలూ ఉన్నాయి. అందుకే గ్యాస్ట్రబుల్ను తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. కారణాలు : గ్యాస్ట్రబుల్ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని... కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం తిన్నవెంటనే పడుకోవడం ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం పీచు తక్కువగా ఉన్న ఆహాపపదార్థాలు తీసుకోవడంతో ఆసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆహారనాళం, జీర్ణకోశంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్లో ఒక మూత (స్ఫింక్టర్) లాంటి నార్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘జీఈ జంక్షన్’ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా ‘జీఈ జంక్షన్’ అనే మూతలాంటి నిర్మాణం అడ్డుపడుతుంది. అయితే కొన్నిసందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావడం, దాంతోపాటు గ్యాస్, ఆసిడ్ రావడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. ‘జీఈ జంక్షన్’ సరిగా పనిచేయడానికి ఎన్నో అంశాలు దోహదం చేయాలి. ఉదాహరణకు... కడుపు కండరాలు మృదువుగా ఉండటం, అక్కడ స్రవించాల్సిన రకరకాల హార్మోన్లు సక్రమంగా స్రవించడం వంటివి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత జీఈ జంక్షన్ అనే ఆ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోవాలి. మనం తీసుకునే ఆహారం, కొన్ని రకాల మందులు, నరాల నుంచి ఆదేశాలు కూడా ఈ ‘జీఈ జంక్షన్’ అనే నిర్మాణం బలహీన పడటానికి దోహదం చేస్తుంటాయి. అప్పుడూ ఆహారంతో పాటు ఆసిడ్ పైకి ఎగజిమ్ముతుంటుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్ట్రబుల్కు దోహదపడుతుంటాయి. చికిత్స : దీనికి నివరణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం. గ్యాస్ సమస్య నివారణ ఇలా... చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవడం పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయడం. రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి రాత్రి నిద్రకు ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ అయిన లెస్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. ఆసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ. మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండును తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు. ఇంట్లోనే వైద్యం అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా అసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ-బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. -
వట్టి గ్యాసేనా..
మంజూరైన ఉచిత కనెక్షన్లు 1.20లక్షలు పంపిణీ చేసింది కేవలం 1,866 {పారంభమే కాని దీపం కనెక్షెన్ల పంపిణీ రెగ్యులేటర్లు లేవంటూ చేతులెత్తేసిన ఆయిల్ కంపెనీలు గాల్లో మేడలు కట్టడం..అరచేతిలో వైకుంఠం చూపడం మన నేతలకు వెన్నతో పెట్టిన విద్య. వాస్తవికతను పట్టించుకోకుండా వారు చెప్చే ప్రతీ దానికి తానా తందానా అంటూ తలలూపడం మన అధికారులకు అలవాటు. నేతల హామీలు..అధికారుల ప్రకటనలను నమ్మి మోసపోవడం సామాన్యుల వంతవుతోంది. తాజాగా ఆ కోవకే చేరింది ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకం. నిజంగా ఇదంతా వట్టిగ్యాసే అన్న విషయం మరోసారి సుస్పష్టమవు తోంది. విశాఖపట్నం: సామూహిక సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద డిపాజిట్ లేకుండా గ్యాస్కనెక్షన్లు ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. గతేడాది డిసెంబర్లో జిల్లాకు లక్షా 20వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇంకేముంది ఆ క్రెడిట్ మాదంటే మాదంటూ గొప్పలు చెప్పు కునేందుకు కేంద్ర,రాష్ర్టప్రభుత్వాల పెద్దలు పోటీపడ్డారు. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేదలకు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకోసం పారదర్శకత పేరుతో సామాన్యులకు కనీస అవగాహన లేని ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. మరొక పక్క మా కార్యకర్తల పరిస్థితి ఏమిటంటూ అధికార టీడీపీ, బీజేపీ నేతలు పోటీపడి మరీ తమ అనుచరులచే దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టించారు. మార్చి31లోగా వీటి పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. వీటిలో సుమారు లక్షా 20వేల మందికి అర్హత ఉన్నట్టుగా నిర్ధారించారు. వీరిలో ఏఎస్‌వోలు, సీఎస్డీటీలు అప్రూవ్ చేసిన 75,111(ఏజెన్సీలో 15,735, జీవీఎంసీ, ఇతర మున్సి పాల్టీలతో సహా మిగిలిన గ్రామీణ జిల్లాలో 59,376)లో తొలి విడతగా కనీసం 36,503 మందికి మార్చి31 కల్లా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని అధికారులు తలపోశారు. ఆ మేరకు ఆయా గ్యాస్ కంపెనీల వారీగా మంజూరైన జాబితాలను సైతం పంపించారు. కానీ కంపెనీలు మాత్రం కేవలం 1866 కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఒకేసారి లక్షన్నరకు పైగా గ్యాస్కనెక్షన్లు మంజూరు చేసినా ఆ స్థాయిలో ఒకేసారి రెగ్యులేటర్లు, సిలెండర్లు సరఫరా చేయడం సాధ్యం కాదని ఆయిల్ కంపెనీలు చేతులెత్తేశాయి. ఈవిషయంలో ఇటీవలే విశాఖ, అనకాపల్లి ఎంపీలు జి.హరిబాబు, ఎం.శ్రీనివాసరావులు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు,గ్యాస్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంపిణీ చేయలేనప్పుడు అన్ని కనెక్షన్లు ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఢిల్లీలోనే తెల్చుకుంటామని తీవ్ర స్థాయిలోనే హెచ్చరించారు. ఏది ఏమైనా దశల వారీగా మంజూరు చేస్తామే తప్ప ఒకేసారి సరఫరా చేయడం మా వల్ల కాదని కంపెనీలు తేల్చి చెప్పడంతో లబ్ధిదారులు నిజంగా ఇదంతా వట్టి ‘గ్యాసే’ అంటూ నిట్టూరుస్తున్నారు. ఉచిత కనెక్షన్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక దీపం కనెక్షన్లు పంపిణీ కూడా వీటికి ఏ మాత్రం తీసిపోని రీతిలోనే ప్రహసనంగా సాగుతోంది. జిల్లాకు తొలుత 25వేల దీపం కనెక్షన్లను మంజూరయ్యాయి. ఆ తర్వాత మరో 9,500 కనెక్షన్లు ఇచ్చారు. ఎంపిక బాధ్యత పేరుకు ఎంపీడీవోలకు అప్పగించినప్పటికీ పెత్తనమంతా జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. మార్చి రెండోవారానికే అధికారులు అర్హులై జాబితాలను సిద్ధం చేసినా అవి మళ్లీ జన్మభూమి కమిటీల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. తమ అనుచరులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యేల సమక్షంలో తుదిజాబితాలు తయారు చేస్తున్నారని చెబుతున్నారు. రెగ్యులేటర్లు, సిలెండర్ల కొరత ‘దీపం’కు కూడా శాపంగా తయారైంది. ఈ కారణంగానే వీటి ఎంపికలో జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారు. -
చీపురుపల్లిలో గ్యాస్ లొల్లి
విజయనగరం జిల్లా: సీఎస్ఆర్ పథకం ద్వారా తక్కువ ధరకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి దొరికినంత దోచుకున్నారు భారత్ గ్యాస్ డీలర్లు. ఇందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదికైంది. సీఎస్ఆర్ పథకం ద్వారా అర్హులైన వారందరు 'మీ సేవ'లో రూ. 10 చెల్లించి గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కలెక్టర్ మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు గానూ లబ్ధిదారులు రూ.1500 చెల్లించి గ్యాస్ సిలిండర్, పైపు, రెగ్యులేటర్‌ను అందిస్తారు. అయితే, భారత్ గ్యాస్ డీలర్లు మాత్రం కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా సుమారు 2,800 మంది లబ్ధిదారుల నుంచి రూ.3,100, రూ. 3,500 చొప్పున వసూలు చేశారు. మోసపోయిన లబ్ధిదారులు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఫిర్యాదు చేసేందుకు గురువారం మధ్యాహ్నం వచ్చారు. కాగా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన లబ్ధిదారులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం విశేషం. దీన్ని బట్టి చూస్తే అధికార టీడీపీ వర్గాలకు కూడా ఈ గ్యాస్ కనెక్షన్‌తో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. (చీపురుపల్లి)