ఎంత ఆరోగ్యవంతులకైనా జీవితంలో ఎప్పుడో ఒకసారైనా కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (జీఈఆర్‌డీ) అంటారు. కడుపులో యాసిడ్ ఆహారంపైన పనిచేసే సమయంలో దాని వాయువులు (ఫ్యూమ్స్) పైకి ఎగజిమ్మడంతో గొంతు, ఛాతీలో మంట అనిపిస్తుంది.
జీఈఆర్‌డీని నివారించాలంటే... ► ఈ సమస్య నివారణకు మంచి జీవనశైలిని అలవరచుకోవడం మేలు.
► రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరమైనా నడవాలి.
► పక్కమీదకు చేరగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. ఒకవేళ కుడివైపు తిరిగి పడుకుంటే గొంతు చివర అన్నకోశం దగ్గర ఉండే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి తెరుచుకుని, ఆహారం వెనక్కు రావచ్చు. అప్పుడు యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశముంటుంది.
► తల వైపు భాగం ఒంటి కంటే కాస్త ఎత్తుగా ఉండేలా పక్కను సర్దుకోవాలి. రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు వీలైతే తల కింద మరో దిండును ఎక్కువగా పెట్టుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది.
► మందుల విషయానికి వస్తే... హెచ్2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు.
ఛాతీలో మంట... కడుపులో యాసిడ్ పైకి తంతుంటే!
Published Sun, Feb 12 2023 1:17 AM | Last Updated on Sun, Feb 12 2023 1:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment