కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ | James Webb Telescope captures its first image of planet beyond our solar system | Sakshi
Sakshi News home page

James Webb Telescope: కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌

Published Mon, Sep 5 2022 5:01 AM | Last Updated on Mon, Sep 5 2022 7:48 AM

James Webb Telescope captures its first image of planet beyond our solar system - Sakshi

భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్‌ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్‌ వెబ్‌ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి.

ఇంతకూ హెచ్‌ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్‌ వెబ్‌ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement