Solar system
-
బృహస్పతి చంద్రుడిపై శిలాద్రవ గదులు
సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి ఐదో గ్రహం జూపిటర్(బృహస్పతి). అన్ని గ్రహాల్లోకెల్లా ఇదే పెద్దది. మన భూమికి ఉపగ్రహం చందమామ ఉన్నట్లే బృహస్పతికి కూడా ‘ఐవా’ అనే ఉపగ్రహం ఉంది. మొత్తం సౌర వ్యవస్థలో నిరంతరం జ్వలించే భారీ అగ్నిపర్వతాలు (వాల్కనో) ఉన్న పెద్ద ఉపగ్రహం ఐవా. ఇక్కడ 400 అగ్నిపర్వతాలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం శిలాద్రవాన్ని(మాగ్మా) విరజిమ్ముతూనే ఉంటాయి. అదొక అగ్ని గుండమని చెప్పొచ్చు. సరిగ్గా మన చందమామ పరిమాణంలో ఉండే ఐవాలో ఈ వాల్కనోలకు కారణం ఏమిటన్నది చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉండేది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ’నాసా’ ఈ రహస్యాన్ని ఛేదించే విషయంలో పురోగతి సాధించింది. నాసా సైంటిస్టులు జూనో మిషన్‌లో భాగంగా బృహస్పతిపై పరిశోధనలకు జూనో స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించారు. 2023 డిసెంబర్, 2024 ఫిబ్రవరిలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఐవా సమీపంలోకి వెళ్లింది. ఐవా ఉపరితలం నుంచి 1,500 కిలోమీటర్ల ఎత్తువరకూ చేరుకొని ఫొటోలు చిత్రీకరించింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన డాప్లర్ డేటాను సేకరించింది. ఈ గణాంకాలను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఐవాపై నిప్పుల కొండలకు కారణం ఏమిటన్నది గుర్తించారు. ఐవా ఉపరితలం కింద మాగ్మా ఒక సముద్రం తరహాలో విస్తరించి లేదని, వేర్వేరు చాంబర్ల(గదులు)లో ఉందని కనిపెట్టారు. శిలాద్రవం ఒకదానితో ఒకటి సంబంధం లేదని వేర్వేరు చాంబర్లలో ఉండడం వల్ల అధిక ఒత్తిడితో ఉపరితలంపైకి వేగంగా చొచ్చుకొని వస్తున్నట్లు చెప్పారు. దాంతో విరామం లేకుండా అగ్నిపర్వతాలు జ్వలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సముద్రం తరహాలో మాగ్మా విస్తరించే ఉంటే దానిపై ఒత్తిడి తక్కువగా ఉండేది. అలాంటప్పుడు అది పైకి ఉబికి వచ్చే అవకాశం అంతగా ఉండదు. ఈ అధ్యయనం వివరాలను నేచురల్ జర్నల్‌లో ప్రచురించారు. ఐవా ఉపగ్రహాన్ని తొలిసారిగా 1610లో గలీలియో గలిలీ కనిపెట్టారు. కానీ, అక్కడ భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న సంగతి 1979తో తెలిసింది. నాసా ప్రయోగించిన వోయేజర్–1 స్పేస్‌క్రాఫ్ట్ ఈ విషయం గుర్తించింది. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐవాపైనున్న వాల్కనోల గుట్టు తెలిసింది కాబట్టి గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా, ఎప్పుడు ఏర్పడ్డాయన్నది గుర్తించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది. .. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. Photo Credits: thesuntoday అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్). ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! ‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. :::జమ్ముల శ్రీకాంత్ -
కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు గాను ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నామని ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం తన నివాసానికి వెళ్తున్న సమయంలో పీఎం మోదీ ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశీ శ్రీరాముడి కాంతితో ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. అయోధ్యలో రాల్ లల్లా పవిత్ర ఉత్సవం తర్వాత దేశ ప్రజలంతా.. తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను కలిగి ఉండాలి. దాని కోసం ఈ పథకాన్ని ప్రారంభించనున్నాం’ అని నరేంద్ర మోదీ తన ‘ఎక్స్’ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశంలో సుమారు కోటి ఇళ్లలో ఈ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకం పేద, మధ్యతరగతి చెందినవారికి కరెంట్ బిల్లు తగ్గించడమే కాకుండా విద్యుత్ రంగంలో భారత దేశ స్వావలంబనను పెంచుతుందని పేర్కొన్నారు. ఇక.. ఈ పథకానికి సంబంధించి అధికారులు చూపించిన సోలార్ రూఫ్ టాప్ సిస్టం ప్యాలెన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं। आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो। अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि… pic.twitter.com/GAzFYP1bjV — Narendra Modi (@narendramodi) January 22, 2024 చదవండి: శ్రీరాముడి ర్యాలీలో ఘర్షణ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్ -
సౌర వ్యవస్థలో గ్రహాలెన్ని? తొమ్మిదా? ఎనిమిదా?
మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని? తొమ్మిది అని.. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఫ్లూటో.. అని వెంటనే చెప్పేముందు ఒకసారి ఆగండి.. గతంలో గ్రహానికున్న లక్షణాలు లేవంటూ ఫ్లూటోను ఆ లిస్టులోంచి తీసేశారు. కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు..గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. ఈ లక్షణాలలో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌరకుటుంబంలోని నెప్ట్యూన్‌కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు. వీటిని ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ (టీఎన్‌ఓఎస్) అని పిలుస్తారు. ఇవి సౌర వ్యవస్థ అంచున ఉన్న కైపర్ బెల్ట్‌ను కలిగి ఉంటాయి. కైపర్ బెల్ట్ అనేది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది సూర్యుని నుండి దాదాపు 30 నుండి 50 ఖగోళ యూనిట్ల దూరంలో విస్తరించి ఉంది. 2005లో ‘ఎరిస్’(మరగుజ్జు గ్రహం)ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపుగా ప్లూటోతో సమానమైన పరిమాణంలో ఉంది. కానీ దీనిని గ్రహంగా పరిగణించరాదనే వాదనను బలపడింది. సమయం గడిచేకొద్దీ శాస్త్రవేత్తలు విశ్వం అంతటా గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు. దీంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమాఖ్య 2006లో గ్రహం అనే పదానికి సరికొత్త నిర్వచనం అవసరమని నిర్ణయించింది. సౌర వ్యవస్థలోని గ్రహం నిర్వచనం కోసం వారు మూడు ప్రమాణాలను సూత్రీకరించారు. ఒక గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తి కలిగి గుండ్రంగా ఉండాలి. అలాగే ఆ గ్రహం తన కక్ష్యలోని శిధిలాల మార్గాన్ని క్లియర్ చేయడానికి సొంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండాలి. దీని ప్రకారం ప్లూటో మొదటి రెండు ప్రమాణాలను కలిగి ఉంది. మూడవ లక్షణం దానిలో లేదు. అందుకే ప్లూటో, ఎరిస్లతో పాటు ఇతర ట్రాన్స్-నెప్ట్యూనియన్ పదార్థాలను ‘మరగుజ్జు గ్రహాలు’గా వర్గీకరించారు. ఇప్పుడు సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనేదానికి సమాధానం చెప్పాల్సివస్తే అవి ఎనిమిది అని చెప్పాలి. ఇంతకుమించి ఏమున్నాయనే విషయానికొస్తే ప్రస్తుతం ధృవీకరించిన ఎక్సోప్లానెట్ల సంఖ్య ఐదు వేలకుపైగానే ఉంది. -
Aditya-L1 Mission: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయిని చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత గమ్యానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్లోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఐదేళ్లపాటు భారత్‌కు తన సేవలును అందించనుంది. కాగా గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశించింది. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this… — Narendra Modi (@narendramodi) January 6, 2024 ఆదిత్య ఎల్-1 మిషన సక్సెస్‌పై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మరో మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్ 1 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ట్వీట్ చేశారు. ఆదిల్య ఎల్-1 మిషన్ సంపూర్ణ విజయం సాధించినట్లు చెప్పారు. చదవండి: Aditya-1 mission: ఏ పరికరాలు ఏం చేస్తాయి? -
ఆవిష్కర్తలకు ఆత్మీయ దిక్సూచి!
'వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కావాలంటే పనిసౌలభ్యంతో పాటు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే యాంత్రీకరణ అత్యవసరం. ఆవిష్కరణలను సాంకేతికంగా, ఆర్థికంగా ప్రోత్సహించినప్పుడే వినూత్న యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. అందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలు దోహదం చేస్తాయి. అటువంటి కేంద్రాల్లో విలక్షణమైనది హైదరాబాద్ పిజెటిఎస్ఎయు ఆవరణలో కొలువుదీరిన అగ్రిహబ్ ఫౌండేషన్. టెక్నీషియన్ల నుంచి గ్రామీణుల వరకు ఎవరైనా అగ్రిహబ్ సేవలను అందుకోవచ్చు.' అగ్రిహబ్.. వ్యవసాయం, ఆహార సంబంధమైన అనుబంధ రంగాల్లో ఇటు సాంకేతిక నిపుణుల ఆవిష్కరణలకు, అటు గ్రామీణ ఆవిష్కర్తలకు మార్గదర్శిగా నిలుస్తున్న సంస్థ. రెండు అంచెల వ్యవస్థగా పనిచేస్తున్న తొలి అగ్రి ఇంక్యుబేటర్ కావటం దీని ప్రత్యేకత. అంతేకాదు, అగ్రిటెక్ స్టార్టప్‌ల ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలో పరీక్షించి, వాటి యోగ్యతను నిర్థారించే విలక్షణ వేదిక అగ్రిహబ్. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవటంలోనూ ఆవిష్కర్తలకు చేదోడుగా నిలుస్తోంది. అర్హులైన ఆవిష్కర్తలకు నాబార్డు గ్రాంట్‌కు సిఫారసు చేస్తోంది. కొన్ని స్టార్టప్‌ల ఆవిష్కరణల్లో ఈక్విటీ ఫండింగ్ సమకూర్చుతోంది. ఆలోచనతో వస్తే చాలు.. సాంకేతిక నిపుణులు, పరిశో«దకులు, విద్యార్థులు వ్యవసాయం, ఆహారోత్పత్తులకు సంబంధించి వినూత్న ఆలోచనతో వస్తే.. ఆ ఆలోచనను ఆచరణాత్మక ఆవిష్కరణగా తీర్చిదిద్దటానికి ఇంక్యుబేషన్ సేవలందిస్తున్నామని అగ్రిహబ్ ఫౌండేషన్ సీఈవో, డైరెక్టర్ విజయ్ నడిమింటి ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆవిష్కరణలపై మేధోహక్కులకు పేటెంట్ హక్కులు పొందటానికి కూడా అగ్రిహబ్ తోడ్పడుతుంది. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ సేవలు అందుకోవచ్చు. ఇప్పటి వరకు 350కి పైగా స్టార్టప్‌లకు అగ్రిహబ్ సేవలందించింది. 825 డిజైన్ థింకర్స్‌కు తోడ్పాటునందించింది. 25 స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం నెరపింది. 8 స్టార్టప్‌లు రూపొందించిన డ్రోన్లు, రోబోలు వంటి సాంకేతికతలను క్షేత్రస్థాయిలో వాలిడేట్ చేసింది. గ్రాంట్లు పొందటానికి నలుగురు ఆవిష్కర్తలకు తోడ్పడింది. 8 స్టార్టప్‌లకు ఈక్విటీ ఫండింగ్ అందించింది అగ్రిహబ్. cco@ag-hub.co 040 23014515 -అగ్రిహబ్ సీఈవో విజయ్ ప్రయోగాత్మకంగా సోలార్ సేద్యం! రైతుల వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపకరించే అగ్రిటెక్ స్టార్టప్‌ల సాంకేతికతలను పొలాల్లో వినియోగించి, వాటి ప్రయోజకత్వాన్ని ధృవీకరించటం అగ్రిహబ్ ప్రత్యేకత. ఇప్పటికి 8 సాంకేతికతలను వాలిడేట్ చేశారు. ఈ క్రమంలో.. అగ్రి ఫొటో ఓల్టాయిక్ (ఎపివి) సిస్టం వాలిడేషన్ ప్రక్రియ అగ్రిహబ్‌లో గత రబీ కాలం నుంచి కొనసాగుతోంది. పొలాల్లో పంటల సాగుతో పాటే ఏకకాలంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ పద్ధతిని అగ్రివోల్టాయిక్స్ లేదా సోలార్ సేద్యంగా చెప్పుకోవచ్చు. సౌర కాంతిని పంటల సాగుతో పాటు విద్యుత్తు ఉత్పత్తికి కూడా వాడుకోవటం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. అయితే, సాధారణ సోలార్ ఫలకాల నీడ కింద పంటలు పెరగవు. అందుకే వాటిని బంజరు భూముల్లోనో, కాలువల మీదనో పెడుతున్నారు. పంట పొలాల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలంటే సౌర ఫలకాలు ఎండను కిందికి ప్రసరింపజేసేలా పారదర్శకమైనవై ఉండాలి. ఇటువంటి వినూత్న ఫలకాలనే రూపొందించింది బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ రెన్బ్యూక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫలకాలను వినియోగించి అగ్రిహబ్ ద్వారా పిజెటిఎస్ఎయులోని వాటర్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ డా. అవిల్ కుమార్ పర్యవేక్షణలో గత ఏడాది (2022–23) రబీ కాలం నుంచి పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. క్యాబేజి, బ్రోకలి, కాళిఫ్లవర్, క్యారట్, చెట్టుచిక్కుడు, వేరుశనగ, మిరప వంటి సుమారు 15 రకాల పంటలను 65 వాట్ల సామర్థ్యం గల 40 సోలార్ ప్యానళ్ల కింద 300 చ.మీ. విస్తీర్ణంలో గత నవంబర్ నుంచి పలు పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికి రబీ, ఖరీఫ్ పంటలు సాగు చేశారు. మళ్లీ రబీ పంటలు ఇటీవలే వేశారు. ‘రెన్బ్యూక్ సోలార్‌ప్యానల్స్ నుంచి ప్రసరించే సూర్యరశ్మిలో 70% వరకు నేల మీద పంటలపై పడుతోంది. సాధారణ సోలార్ ప్యానళ్ల కన్నా ఈ ప్యానళ్ల ద్వారా 10–12% అదనంగా విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ ప్యానళ్ల కింత సాగైన క్యారట్ పంట దిగుబడి ఏమీ తగ్గలేదు. వేరుశనగ వంటి పంటల్లో కొంచెం తగ్గింది. నీటి వినియోగంలో మార్పు లేదు. అయితే, మరికొన్ని పంటకాలాలు పండించిన తర్వాత ఏయే పంటలకు ఈ సోలార్ సేద్యం అనుకూలమో తెలుస్తుంది’ అన్నారు డా. అవిల్ కుమార్(99513 35111). గ్రామీణులకు ప్రత్యేకం.. గ్రామీణ ఆవిష్కర్తలకు ఇంక్యుబేషన్ సేవలందించటం కోసం జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో అగ్రిహబ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామీణ యువత, రైతులు, ఎఫ్పిఓలు, కోఆపరేటివ్‌ల నిర్వాహకులు తమ కలలను అగ్రిహబ్ తోడ్పాటుతో సాకారం చేసుకోవటానికి ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని అగ్రిహబ్ ఎండీ డా. కల్పనా శాస్త్రి తెలిపారు. పేటెంట్లకూ తోడ్పడుతున్నాం! ఎంటర్ప్రెన్యూర్లు, శాస్త్రవేత్తల అగ్రిటెక్ స్టార్టప్‌లతో పాటు రైతులు, గ్రామీణుల ఆవిష్కరణలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్న ఏకైక ఇంక్యుబేషన్ సంస్థ అగ్రిహబ్ ఒక్కటే. సాంకేతిక ఆవిష్కరణలతో పాటు రైతుల వంగడాలకు కూడా పేటెంట్లు పొందేందుకు మేం తోడ్పడుతున్నాం. ఇన్నోవేటర్ల తరఫున ఇప్పటికి మొత్తం 13 పేటెంట్లకు దరఖాస్తు చేశాం. – డా. కల్పనా శాస్త్రి, మేనేజింగ్ డైరెక్టర్, అగ్రిహబ్ ఫౌండేషన్, పిజెటిఎస్ఎయు, హైదరాబాద్ ఇవి చదవండి: మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి! -
Aditya-L1 mission: పని మొదలెట్టిన ఆదిత్య–ఎల్ 1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్‌చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్’లో భాగమైన సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. -
Aditya L1 Mission: సౌర గాలులపై అధ్యయనం.. ఫోటో షేర్ చేసిన ఇస్రో
బెంగళూరు: సూర్యుడిపై లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక మరో మైలురాయిని సాధించింది. ఆదిత్య ఉపగ్రహంలోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ (ASPEX) పేలోడ్ తన కార్యకలాపాలను ప్రారంభించిందని ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఆదిత్య ఎల్1 ఉపగ్రహం లోని రెండు పరికరాలు పరిశోధనలన విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఆదిత్య పేలోడ్ పరికరం తీసిన ఫోటోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో ఉన్న ఎనర్జీ తేడాలను ఈ ఫోటోలో గమనించవచ్చు. రెండు రోజుల్లో ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ కౌంట్‌లో తేడా ఉన్నట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించినట్లు తెలుస్తోంది. Aditya-L1 Mission: The Solar Wind Ion Spectrometer (SWIS), the second instrument in the Aditya Solar wind Particle Experiment (ASPEX) payload is operational. The histogram illustrates the energy variations in proton and alpha particle counts captured by SWIS over 2-days.… pic.twitter.com/I5BRBgeYY5 — ISRO (@isro) December 2, 2023 కాగా ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. ఇందులోని సోలర్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (Swis) నవంబర్2న, సుప్రా థర్మల్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (Steps) సెప్టెంబర్ 10న యాక్టివేట్ చేశారు. ఇవి రెండు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీ ల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదిల్లో సోలార్ విండ్ అయాన్లు, ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని తేడా ఉనట్లు శాటిలైట్గు ఇస్రో పేర్కొంది ఇక సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. భూమి నుంచి 15 లక్షల కి,మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్1 చేరిన తర్వాత దాని కక్షలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్ 1 సూర్యుడిని ఆధ్యయనం చేస్తుంది. -
నేడు వలయాకార సూర్య గ్రహణం
నేడు అరుదైన సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణం కాబట్టి భారత్‌లో ఇది కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అయితే.. రింగ్ ఆఫ్ ఫైర్‌ను నేరుగా వీక్షించడం మంచిదికాదని ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు. అలాగే.. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏప్రిల్ 20వ తేదీన సూర్య గ్రహణం సంభవించింది. ఇవాళ సంభవించేంది రెండో గ్రహణం. మూడో గ్రహణం.. అక్టోబర్ 28-29 తేదీల మధ్య చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక గ్రహణమే అయినా.. భారత్‌లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడం సూర్యగ్రహణం.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతుంది. ఇది అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే జరుగుతుంది. అయితే, ప్రతీ అమావాస్య, పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు. -
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
ఇస్రో ఆదిత్య-ఎల్ 1 మిషన్.. భగభగల గుట్టు విప్పేనా?
బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయోత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO).. సూర్యుడిపై తొలిసారిగా ప్రయోగానికి సిద్ధమైంది. భగభగలాడే సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహాన్ని శ్రీహరి కోట(ఏపీ) అంతరిక్ష కేంద్రం షార్ వేదిక నుంచి ప్రయోగించబోతోంది. కాసేపట్లో ఇస్రో రాకెట్ ‘పీఎస్ఎల్వీ సీ-57 ఆదిత్య ఎల్-1ను నింగిలోకి మోసకెళ్లనుంది. ఈ క్రమంలో ఈ మిషన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం.. సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యుడి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇస్రో ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనలకు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆ ప్రవేశపెట్టే ఎల్-1(లాగ్రేంజ్) పాయింట్.. భూమి నుంచి 9లక్షల మైళ్ల దూరం(15 లక్షల కి.మీల)లో ఉంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అదే భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే.. నాలుగు రెట్లు ఎక్కువ. మిషన్ ఇలా.. ‘ఆదిత్య-ఎల్ 1’ వ్యోమనౌకను తొలుత దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ పయనించిన అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించి ఎల్1 పాయింట్ వైపు మళ్లిస్తుంది ఇస్రో. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం (ఎస్ఓఐ) నుంచి బయటపడి, చివరికి ఎల్1 చుట్టూ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది. లాగ్రేంజ్ 1 ప్రాంతానికి చేరుకునేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ).. ఆదిత్య-ఎల్1లో కీలకం. ఇది సూర్యుడికి సంబంధించి ఇది ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలు ఇస్రోకు చేరవేస్తుంది. మొత్తంగా ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ)’తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్ ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. శక్తివంతమైన రాకెట్ ‘ఆదిత్య-ఎల్ 1’ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) రకం రాకెట్‌ను వినియోగిస్తున్నారు. పీఎస్ఎల్వీలో ఇది అత్యంత శక్తిమంతమైనది. 2008లో చంద్రయాన్-1 మిషన్‌లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)లో ఈ రకం రాకెట్లనే వినియోగించారు. సూర్యుడే టార్గెట్ ఎందుకంటే.. అంత దూరంలో ఉన్నప్పటికీ.. సూర్యుడే మనకు సమీప నక్షత్రం. భూమిపై సమస్త జీవరాశి మనుగడకు ఆధారం కూడా. అందువల్ల మిగతా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయడం మనకు అవసరం. పైగా ‘పాలపుంత’తో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడొచ్చు. మరోవైపు.. సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదలవుతుంటుంది. ఇది భూమి వైపు మళ్లినట్లయితే.. మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. ఇటువంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తద్వారా దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుంది అని ఇస్రో భావిస్తోంది. -
అయ్యో పాపం నెప్ట్యూన్...మేఘాలన్నీ మటుమాయం
అవున్నిజమే! నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఎవరో మంత్రం వేసినట్టు ఉన్నట్టుండి మటుమాయం అయిపోయాయి. ఈ వింతేమిటి? అందుకు కారణమేమిటి...? నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఉన్నట్టుండి అమాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి. సూర్యుని 11 ఏళ్ల ఆవర్తన చక్రం ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా సూర్యుని చురుకుదనం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాల పరిమాణమూ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువగా ఉన్నప్పుడు అవి దాదాపుగా లుప్తమైపోతాయి. ఇది సాధారణ దృగి్వషయమే. అయితే గత కొన్నేళ్లుగా ఆ గ్రహం మీద మేఘాలన్నవే లేకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని వారు చెబుతున్నారు. ఏమిటి కారణం? ► సూర్యరశ్మి నెప్ట్యూన్ వాతావరణపు పై పొరను తాకినప్పుడు అక్కడ మేఘాల సంఖ్యలో హెచ్చుతగ్గుల క్రమం వేగం పుంజుకుంటూ ఉంటుంది. ► సౌర శక్తి వల్ల అక్కడ మీథేన్ మేఘాలు ఏర్పడటంతో పాటు పలు రసాయనాలు కూడా పుడతాయి. ► 11 ఏళ్ల సౌర ఆవర్తన క్రమమే ఇందుకు కారణం కావచ్చన్నది సైంటిస్టుల అంచనా. ► కానీ సౌర కుటుంబంలో సూర్యునికి సుదూరంగా ఉండే గ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దానికంటే దూరంగా ఉండేది ప్లూటో మాత్రమే! ► దాంతో నెప్ట్యూన్‌కు అందే సూర్యరశ్మి భూమికి అందే దానిలో ఒక్కటంటే ఒక్క వంతు మాత్రమే! ► నెప్ట్యూన్ నుంచి చూస్తే సూర్యుడు మిలమిల మెరిసే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు తప్ప మనకు కనిపించేంత భారీ పరిమాణంలో కాదు. ► అలాంటప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాలు సమూలంగా మాయం కావడానికి సౌర ఆవర్తన చక్రమే ఏకైక కారణమా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వేడెక్కాల్సింది పోయి... చల్లబడుతోంది నెప్ట్యూన్ దక్షిణార్ధ భాగం గత 15 ఏళ్లుగా క్రమంగా చల్లబడుతోందట. అందులో ఆశ్చర్యం ఏముందంటారా? ఉంది... ► ఎందుకంటే... ఈ సమయంలో ఆ ప్రాంతం నిజానికి క్రమంగా వేడెక్కాలి. ► 2003 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆ బుల్లి గ్రహం మీద వేసవి నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ► గత 15 ఏళ్లలో అక్కడి ఉష్ణోగ్రత కనీసం 8 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గిందట. ► హబుల్‌తో పాటు ప్రపంచంలోని పలు అతిపెద్ద టెలిస్కోప్‌లు అందించిన డేటాను విశ్లేíÙంచిన మీదట ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచి్చంది. ► అదే సమయంలో నెప్ట్యూన్ దక్షిణ ధ్రువం మాత్రం ఉష్ణోగ్రతలు 2018–2020 మధ్య కాలంలో ఏకంగా 11 డిగ్రీలు పెరిగిపోవడం విశేషం ► ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి మన లెక్కలో 165 ఏళ్లు పడుతుంది. ► అక్కడ ఒక్కో సీజన్ ఏకంగా 40 ఏళ్లుంటుంది. ► ఈ నేపథ్యంలో నెప్ట్యూన్ మీద ఇంతటి పరస్పరం విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకోవడం విచిత్రమేనని సైంటిస్టులు అంటున్నారు. -
2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
బెంగళూరు: చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమయ్యేలా ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ‘‘ఆదిత్య–ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2న జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చాం’’ అని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయోగం విశేషాలివే.. ► భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు ► భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది ► లాంగ్రేజియన్1 పాయింట్లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు. ► ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు ► సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్1 అధ్యయనం చేస్తుంది. ► సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది. ► మొత్తం ఏడు పే లోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది రికార్డే ► ఇస్రో చరిత్రలో 2023 ఒక రికార్డుగా మిగిలిపోనుంది. సూర్య చంద్రుల లోతుల్ని తెలుసుకోవడానికి రెండు నెలల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేయడం చరిత్రే మరి. చంద్రయాన్–3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో ఇప్పుడు అన్ని దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆదిత్య–ఎల్1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందనే విశ్వాసం ఏర్పడింది. 2024 చివరికి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి భారతీయుల మరో స్వప్నాన్ని తీర్చాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఊహాచిత్రం -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!
జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. ► యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది. ► యురేనస్‌పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్ మోడల్‌ను ఉపయోగించారు. ► యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. ► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. ► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. ► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది. ► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. ► యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు. ► యురేనస్ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో యురేనస్‌ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాగరంలో సౌరవిహారం.. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
మామూలు మరపడవలు నడవాలంటే పెట్రోలు లేదా డీజిల్ కావాల్సిందే! వీటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల సముద్రాలకు, నదులకు కాలుష్యం తప్పదు. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో మారిషస్‌కు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ‘సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్’ (ఎస్పీఈఎస్) పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవను రూపొందించింది. ‘ఫోక్లోరిక్ ఎక్స్‌ప్లోరర్’ పేరుతో తయారు చేసిన ఈ పడవ పైకప్పు మీద 48 సౌరఫలకాలు ఉంటాయి. ఒక్కో ఫలకం నుంచి 110 వాట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. సౌరఫలకాల నుంచి వెలువడే విద్యుత్తును ఈ పడవలోని ఆరు లిథియం అయాన్ బ్యాటరీలు నిల్వచేసుకుంటాయి. బ్యాటరీలు పూర్తిగా చార్జ్ అయితే, ఈ పడవ ఏకధాటిగా 25 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ పడవ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నదులు, సరస్సుల్లో ప్రయాణాలకు ఈ పడవ బాగా అనువుగా ఉంటుంది. -
భూమికి బై బై.. నిష్క్రమించిన ఆకుపచ్చ తోకచుక్క
న్యూయార్క్: జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి తొలి వారం దాకా దాదాపు నెల రోజుల పాటు ఆకాశంలో కనువిందు చేసిన ఆకుపచ్చని తోకచుక్క ఇక సెలవంటూ వెళ్లిపోతోంది. సి2022ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్క మన నుంచి అత్యంత దూరంగా సౌరమండలపు వెలుపలి తీరాల కేసి పయనమవుతోంది. ఇది మళ్లీ భూమికి సమీపంగా వచ్చి మనకు కనిపించేది మరో 50 వేల సంవత్సరాల తర్వాతే! సరిగ్గా చెప్పాలంటే, 52023వ సంవత్సరంలో అన్నమాట!! అయితే సూర్యుడు, ఇతర గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల దాని కక్ష్యలో బాగా మార్పుచేర్పులు జరిగే క్రమంలో అది అంతకంటే చాలా ముందే మరోసారి భూమికి సమీపానికి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటున్నారు సైంటిస్టులు. అదే సమయంలో కక్ష్యలో వ్యతిరేక మార్పులు జరిగితే 50 వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టవచ్చని కూడా వారు చెబుతున్నారు. భూమికి అతి సమీపానికి వచ్చినప్పుడు భూ ఉపరితలం నుంచి ఈ తోకచుక్క 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనువిందు చేసింది. అది చివరిసారి మనకు కన్పించినప్పటికి భూమిపై ఆధునిక మానవుని ఆవిర్భావమే జరగలేదు! అప్పటికింకా నియాండర్తల్ మానవుల హవాయే నడుస్తోంది. -
బృహస్పతి... ఉపగ్రహాల రాజు.. డజను చంద్రుల గుర్తింపు
కేప్ కెనవెరాల్ (యూఎస్): సౌరకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం (బృహస్పతి) చుట్టూ మరో 12 ఉపగ్రహాలను సైంటిస్టులు కనిపెట్టారు. దీంతో దాని ఉపగ్రహాల సంఖ్య ఏకంగా 92కు పెరిగింది. తద్వారా 83 ఉపగ్రహాలున్న శని గ్రహాన్ని వెనక్కు నెట్టి సౌరమండలంలో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహంగా నిలిచింది. హవాయి, చిలిల్లోని టెలిస్కోప్‌ల సాయంతో 2021, 2022ల్లోనే గురు గ్రహపు కొత్త ఉపగ్రహాలను గుర్తించినా ఇంతకాలం పాటు నిశితంగా గమనించిన వాటి ఉనికిని తాజాగా నిర్ధారించారు. ఏకంగా 92 ఉపగ్రహాలతో గురు గ్రహం ఓ మినీ సౌరకుటుంబంగా భాసిల్లుతోందని వీటిని కనిపెట్టిన సైంటిస్టు స్కాట్ షెపర్డ్ చమత్కరించారు. ‘‘అయితే ఇవన్నీ బుల్లి ఉపగ్రహాలే. ఒక్కోటీ కేవలం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు. పూర్తి వాయుమయమైన గురు గ్రహాన్ని, మంచుతో కూడిన దాని అతి పెద్ద ఉపగ్రహాలను అధ్యయనం చేసేందుకు ఏప్రిల్‌లో ఒక అంతరిక్ష నౌకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపనుంది. వీటిలో యూరోపా క్లిపర్ అనే ఉపగ్రహం ఉపరితలంపై పేరుకున్న అపారమైన మంచు కింద భారీ సముద్రం దాగుందని నాసా భావిస్తోంది. దాని అధ్యయనం కోసం 2024లో యూరోపా క్లిపర్ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది. అది వాసయోగ్యమేనా అన్న అంశాన్ని పరిశోధించనుంది. బృహస్పతి, శని చుట్టూ ఉన్న భారీ ఉపగ్రహాలు బహుశా పరస్పరం ఢీకొని ఉంటాయని, ఇన్నేసి బుల్లి ఉపగ్రహాలుగా విడిపోయాయని షెపర్డ్ పేర్కొన్నారు. ‘‘యురేనస్, నెప్ట్యూన్లదీ ఇదే పరిస్థితి. కానీ అవి మరీ సుదూరాల్లో ఉన్న కారణంగా వాటి ఉపగ్రహాలను గుర్తించడం చాలా కష్టం’’ అని వివరించారు. యురేనస్‌కు 27, నెప్ట్యూన్‌కు 14, అంగారకునికి రెండు ఉపగ్రహాలున్నాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఒక్కటి కూడా లేదు. -
హంతక శకలం
శాంటియాగో: గ్రహాల పాలిట ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న గ్రహశకలం ఒకటి మన సౌరవ్యవస్థలో చక్కర్లు కొడుతోంది. దాదాపు మైలు వెడల్పున్న దీన్ని 2022 ఏపీ7గా పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం ఏదో ఒక రోజు భూమిని ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని కక్ష్య ఏదో దాన్ని ఒకనాడు భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయట. ఇది దీర్ఘవృత్తాకారంగా భ్రమిస్తున్నందువల్ల భూమికి ఏకంగా 30 లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాగలదట! అంతరిక్షంలో పెద్దగా లెక్కలోకే రాని దూరమిది. గత మార్చిలో 2022 ఏపీ7 భూమికి 1.3 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. మరో ఐదేళ్లపాటు ఇంతకంటే సమీపానికి వచ్చే అవకాశమైతే లేదంటున్నారు. గత ఎనిమిదేళ్లలో మన కంటబడ్డ ప్రమాదకర శకలాల్లో ఇదే అతి పెద్దది. అంతేకాదు, చిలీలోని అబ్జర్వేటరీ నుంచి సౌరవ్యవస్థలో తాజాగా కనిపెట్టిన మూడు గ్రహశకలాల్లో ఇదే పెద్దది. మిగతా రెండు అర మైలు, పావు మైలు వెడల్పున్నాయి. వీటి గురించి ఆస్ట్రనామికల్ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది. భూమికి 1.3 ఆస్ట్రనామికల్ యూనిట్స్, అంటే 12.1 కోట్ల మైళ్ల కంటే సమీపానికి వస్తే వాటిని నియర్ ఎర్త్ ఆస్టిరాయిడ్స్ అంటాం. -
Planet killer: భూమి వైపుగా ప్రమాదకరమైన గ్రహశకలం!
భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను.. అంతరిక్షంలో ఉండగానే స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీ కొట్టించడం.. తద్వారా కుదిరితే కక్ష్య వేగం తగ్గించి దారిమళ్లించడం.. లేదంటే పూర్తిగా నాశనం చేయడం.. అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసాకు ఇప్పుడు లక్ష్యాలుగా మారాయి. ఈ క్రమంలో.. డార్ట్(డబుల్ ఆస్టారాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్) మిషన్ తెర మీదకు వచ్చింది కూడా. అయితే డార్ట్ మిషన్‌కు కూడా అంతుచిక్కకుండా ఓ గ్రహ శకలం.. భూమి వైపుగా దూసుకొస్తే ఎలా ఉంటుంది?.. ఈమధ్య.. ఓ నెల కిందట నాసా అంతరిక్ష లోతుల్లో ఓ ఆస్టరాయిడ్‌ను స్పేస్ క్రాఫ్ట్తో ఢీ కొట్టించడం ద్వారా విజయవంతంగా దారి మళ్లించింది. ఈలోపే మరో పిడుగు లాంటి వార్తను వెల్లడించింది నాసా. భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉన్న మరో మూడు గ్రహశకలాలను గుర్తించిందట. అంతేకాదు.. సౌరవ్యవస్థ లోపలే అవి దాక్కుని ఉన్నాయని, వాటి గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని నాసా ప్రకటించింది. ఈ మేరకు చిలీలోని సెర్రో టోలోలో ఇంటర్ అమెరికన్ అబ్జర్వేటరీ వద్ద టెలిస్కోప్‌కు అమర్చిన డార్క్ ఎనర్జీ కెమెరా ద్వారా ఈ మూడు గ్రహశకలాలను గుర్తించగలిగింది నాసా బృందం. మూడు గ్రహశకలాల్లో రెండు.. కిలోమీటర్ వెడల్పుతో ఉన్నాయి. మూడవది మాత్రం ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో ఉండి.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా స్పష్టం చేసింది. అయితే.. సౌర వ్యవస్థ లోపలి భాగంలో అదీ భూమి, శుక్ర గ్రహం అర్బిట్ల మధ్య ఈ మూడు గ్రహ శకలాలు గుర్తించామని, సూర్య కాంతి కారణంగా వీటి గమనాన్ని గుర్తించడం కష్టతరంగా మారిందని నాసా బృందం తెలిపింది. వీటిని 2022 AP7, 2021 LJ4, 2021 PH27గా వ్యవహరిస్తున్నారు. ఇందులో 2022 ఏపీ7 ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పుతో కిల్లర్ ప్లానెట్‌గా గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా కిలోమీటర్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కిల్లర్ ప్లానెట్గానే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఇవి చేసే డ్యామేజ్ ఎక్కువ. అందుకే ఆ పేరు వచ్చింది. అయితే.. గత ఎనిమిదేళ్లలో ఇంత ప్రమాదరకమైన గ్రహశకలాన్ని గుర్తించడం మళ్లీ ఇదే. ఇది ఏదో ఒకరోజు ఇది కచ్చితంగా భూ కక్ష్యలోకి అడుగుపెడుతుందని.. భూమిని కచ్చితంగా ఢీకొట్టి తీరుతుందని అంచనా వేస్తున్నారు నాసా సైంటిస్టులు. మిగతా 2021 ఎల్జే4, 2021 పీహెచ్27 మాత్రం భూమార్గానికి దూరంగానే వెళ్లనున్నాయి. అయితే ప్రమాదకరమైన ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించడం, నాశనం చేయడం గురించి ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయడం కుదరదని నాసా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు, కానీ.. -
కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్ వెబ్ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి. ఇంతకూ హెచ్ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్ వెబ్ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది. -
నిప్పులకొలిమిలా భగభగలు.. అయినా జీవరాశి ఉనికి!
మిగతా గ్రహాల్లాగే అక్కడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది ఒకప్పుడు. కానీ, సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ అధిక వేడిమికి సముద్రాలు ఆవిరైపోవడం, జీవరాశి కనుమరుగైపోవడం.. భూమికి సిస్టర్ గ్రహాంగా అభివర్ణించే శుక్ర గ్రహం విషయంలో జరిగి ఉంటుందనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీనస్‌పై జీవరాశికి ఆస్కారమే లేదని వాదిస్తున్న సైంటిస్టులు.. ఇప్పుడక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదనను తెరపైకి తెచ్చారు. పలు అధ్యయనాల తర్వాత ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్(కిరణజన్య సంయోగ సూక్ష్మజీవులు) ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉండడం, పైగా గ్రీన్ హౌజ్ ప్రభావం వల్ల హాట్ గ్యాస్ బెలూన్లా కార్బన్ డై యాక్సైడ్‌తో నిండిపోయింది శుక్ర గ్రహం. దరిమిలా 462 డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్(863 డిగ్రీల ఫారన్‌హీట్) గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. అలాంటిది ఈ గ్రహంపైనా జీవరాశి ఉనికిని పసిగట్టారు సైంటిస్టులు. శుక్ర గ్రహం వాతావరణంలో జీవరాశి ఉనికి ఉన్నట్లు గుర్తించారు. శుక్ర గ్రహం మేఘాల నుంచి సూర్యకాంతి చొచ్చుకెళ్లినప్పుడు.. ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. 1. A new study has revealed that the sunlight passing through Venus' clouds could support the growth of photosynthetic microorganisms. Moreover, photosynthesis could even occur during the night time thanks to the planet's thermal energy! pic.twitter.com/j5NfFYmPF5 — The Weather Channel India (@weatherindia) October 11, 2021 సోలార్ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్ ఎనర్జీ పుట్టడం, కాంతి తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్ పిగ్మెంట్స్‌ను గుర్తించారు. ఇది అచ్చం భూమి మీద సూర్యకిరణాల వల్ల ఏర్పడే ప్రక్రియలాగే ఉంటుందని చెబుతున్నారు. అధ్యయనానికి సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాకేష్ మొఘల్ వెల్లడించారు. ఆమ్ల, ద్రావణ(వాటర్) చర్యల వల్ల మైక్రోబయాల్ పెరిగే అవకావం ఉందని చెప్తున్నారు వాళ్లు. Astrobiology జర్నల్‌లో శుక్ర గ్రహంపై జీవరాశి ఉనికికి సంబంధించిన కథనం తాజాగా పబ్లిష్ అయ్యింది. చదవండి: శుక్రుడు మా వాడు.. రష్యా సంచలన ప్రకటన -
దూసుకువస్తోన్న భారీ తోక చుక్క..! భూమిని ఢీకొట్టనుందా?
తోకచుక్క అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది హేలీ తోకచుక్కనే. ఈ తోక చుక్క 1682లో కన్పించిన తోకచుక్కగా ఖగోళ శాస్త్రవేత్త హేలీ పేర్కొన్నారు. ఇది ప్రతి 75-76 ఏళ్లకొక సారి కన్పిస్తుంది. ఈ తోకచుక్క 1986లో కన్పించగా..మరలా 2061లో కన్పించనుంది. హేలీ తోక చుక్క కంటే భారీ తోక చుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.మన సౌరవ్యవస్థకు దగ్గరగా వస్తోన్న భారీ తోకచుక్కగా (కామెట్) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెగాకామెట్ను మొదట పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు పెడ్రో బెర్నార్డినెల్లి , గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు ఈ భారీ తోకచుక్కకు C/2014 UN271 అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ తోకచుక్క పరిమాణంలో అత్యంత భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిమాణంలో మార్స్ మూన్ పోబోస్, డిమోస్ కంటే పెద్గగా ఈ కామెట్ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తలు గుర్తించిన తోకచుక్కల్లో అతిపెద్ద తోకచుక్కగా నిలిచింది. సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీలో కొనసాగుతున్న డార్క్ ఎనర్జీ సర్వే (DES) ద్వారా ఈ మెగా కామెట్ డేటాను పరీశిలిస్తున్నారు. తొలుత ఈ తోక చుక్కను ఒక ఆస్ట్రరాయిడ్గా గుర్తించగా..అబ్జర్వేటరీ అందించిన డేటా ప్రకారం అది తోకచుక్కఅని శాస్త్రవేత్తలు నిర్థారించారు.కామెట్ బెర్నార్డినెల్లి-బెర్న్‌స్టెయిన్ మెగా కామెట్ పరిమాణం తొలుత 200 కిలోమీటర్ల వెడల్పుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తోకచుక్క మనకు ఎప్పుడు దగ్గరగా వస్తుందంటే..? ఈ తోకచుక్క మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది.2031 సంవత్సరంలో మన సూర్యుడికి, భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమిని ఢీకొట్టనుందా? ఈ తోకచుక్క అత్యంత పెద్దదిగా పరిగణించినప్పటికీ.. శాస్త్రవేత్తలు ఈ తోకచుక్క గమనాన్ని ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, భూమికి ఈ తోకచుక్క నుంచి ఎటువంటి ముప్పు లేదని వెల్లడించారు. చదవండి: న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మరో నలుగురు! -
అదే జరిగితే ఇంటర్నెట్ బంద్
Solar Super Strom: ‘‘సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం’’ అంటూ గత కొంతకాలంగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం, సైంటిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జులై మధ్యలో ‘సౌర తుపాను’ దాటేసిందన్న కొన్ని మీడియా హౌజ్‌ల కథనాలు.. ఉత్తవేనని తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సౌర తుపాను ముప్పు మాత్రం భూమికి పొంచి ఉందని.. అది జరిగితే మాత్రం ఇంటర్నెట్ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తోందని చెప్తున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి. ‘సౌర తుపానుల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆగిపోతుంది. ఇది కరోనా మహమ్మారిలాగే విరుచుకుపడొచ్చు’ అని ఆమె చెప్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని అబూ జ్యోతి చెబుతున్నారు. My SIGCOMM talk on the impact of solar superstorms on the Internet infrastructure is now online: https://t.co/L6Nl2Yygcs There were many interesting questions in the Q&A session. Paper: https://t.co/Wsv4RC2pbZ https://t.co/Y9ElvF7fTa — Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) August 29, 2021 సిగ్‌కామ్ 2021(SIGCOMM 2021) పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సౌర తుపానుల మీద ఆమె సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం విశేషం. చదవండి: సౌర తుపాన్‌తో అప్పుడు ఆఫీసులు కాలిపోయాయి కరోనా తరహాలోనే.. సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు చూపెడుతుంది? ఎన్నిరోజుల్లో తిరిగి యధాస్థితికి తీసుకురావొచ్చు అనే విషయాలపై మాత్రం ఇప్పుడే అంచనాకి రాలేం. ఒక రకంగా ఇది కరోనా మహమ్మారి లాంటిది. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా లేదు. నష్టం కూడా ఊహించినదానికంటే భారీగానే ఉంటుంది అని ఆమె అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా సౌరతుపాను గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చని ఆమె అంటున్నారు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే చెప్తున్నారు. అయితే అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని చెప్తున్నారామె. సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. చదవండి: సౌర తుపాను వేగం ఎంతంటే.. -
నేడు ఖగోళ అద్భుతం.. దూసుకెళ్లనున్న భారీ గ్రహశకలం
Asteroid 2016 AJ193 Speed To Earth: ‘భూమి వైపుగా దూసుకొస్తున్న గ్రహశకలాలు..’ చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ, అంతరిక్ష పరిశోధకులకు మాత్రం ఇదో ఆసక్తికరమైన అంశం. కారణం.. విశ్వం ఆవిర్భావానికి, డైనోసార్ల శకం ముగియడానికి, గ్రహాల ఏర్పాటుకు, విశ్వంలోని ఎన్నో పరిణామాలకు ఆస్టరాయిడ్లతోనే ముడిపడి ఉందన్న థియరీకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఏ గ్రహశకలం ఎలాంటి ముప్పు తెస్తుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల.. దూసుకొచ్చే ప్రతీదాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడింది శాస్త్రవేత్తలకు. ఈ తరుణంలో.. భూమ్మీదకు వేగంగా దూసుకొస్తున్న ఓ ఆస్టరాయిడ్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. 2016 ఏజే193గా పేరు పెట్టిన ఓ ఆస్టరాయిడ్.. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. నాసా అంచనాల ప్రకారం.. ఆగష్టు 21న(అంటే ఇవాళే) అది భూమికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. సుమారు కిలోమీటర్న్నర వెడల్పు ఉన్న శకలం.. అత్యంత ప్రమాదకరమైన శకలంగా నాసా గుర్తించింది. ఇది భూమిని ఢీకొడితే మాత్రం కచ్చితంగా భారీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కానీ, ఈసారికి ఆ అవకాశాలు లేవని సైంటిస్టులు స్పష్టం చేశారు. చదవండి: వందేళ్ల తర్వాత బెన్నూ ముప్పు! భూమికి దూరంగా (భూమి-చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి తొమ్మిది రెట్లు దూరంగా) ఈ శకలం వెళ్లనుంది. ఈ లెక్కన భూమికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని టెలిస్కోప్‌ల ద్వారా వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2063లో మరోసారి ఇది భూమికి దగ్గరగా రానుందని అంచనా వేస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా గుర్తించింది.