Aditya L1 Mission: సౌర గాలులపై అధ్యయనం.. ఫోటో షేర్​ చేసిన ఇస్రో | Aditya-L1 mission starts observing solar winds, ISRO shares 1st pic | Sakshi
Sakshi News home page

Aditya L1 Mission: సౌర గాలులపై అధ్యయనం.. ఫోటో షేర్​ చేసిన ఇస్రో

Published Sat, Dec 2 2023 1:25 PM | Last Updated on Sat, Dec 2 2023 2:01 PM

Aditya L1 starts observing solar winds ISRO Shares Photo - Sakshi

బెంగళూరు: సూర్యుడిపై లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌–1 వ్యోమనౌక మరో మైలురాయిని సాధించింది. ఆదిత్య ఉపగ్రహంలోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ (ASPEX) పేలోడ్ తన కార్యకలాపాలను​ ప్రారంభించిందని ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఆదిత్య ఎల్​1 ఉపగ్రహం లోని రెండు పరికరాలు పరిశోధనలన విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్నాయని తెలిపింది.

ఆదిత్య పేలోడ్ ప‌రిక‌రం తీసిన ఫోటోను ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్స్‌లో ఉన్న ఎన‌ర్జీ తేడాల‌ను ఈ ఫోటోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. రెండు రోజుల్లో ప్రోటాన్‌, ఆల్ఫా పార్టిక‌ల్ కౌంట్‌లో తేడా ఉన్న‌ట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

కాగా ఆదిత్య సోలార్​ విండ్​ పార్టికల్​ ఎక్స్​పరిమెంట్​ పేలోడ్​లో రెండు పరికరాలు ఉన్నాయి. ఇందులోని సోలర్​ విండ్​ అయాన్ స్పెక్ట్రోమీటర్ (Swis) నవంబర్​2న,  సుప్రా థర్మల్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (Steps) సెప్టెంబర్​ 10న యాక్టివేట్​ చేశారు. ఇవి రెండు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. 

స్విస్​లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీ ల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదిల్లో సోలార్​ విండ్​ అయాన్లు, ప్రోటాన్స్​, ఆల్ఫా పార్టికల్స్​ను విశ్లేషించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ సెన్సర్​ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్​ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్​, ఆల్ఫా పార్టికల్స్​లో కొన్ని తేడా ఉనట్లు శాటిలైట్గు​  ఇస్రో పేర్కొంది

ఇక సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్​ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించిన విషయం తెలిసిందే.  వచ్చే ఏడాది జనవరి 7 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. భూమి నుంచి 15 లక్షల కి,మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్​ పాయింట్​‌‌1 చేరిన తర్వాత దాని కక్షలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్​ 1 సూర్యుడిని ఆధ్యయనం చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement