Aditya L1 Mission: సౌర గాలులపై అధ్యయనం.. ఫోటో షేర్ చేసిన ఇస్రో
బెంగళూరు: సూర్యుడిపై లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక మరో మైలురాయిని సాధించింది. ఆదిత్య ఉపగ్రహంలోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ (ASPEX) పేలోడ్ తన కార్యకలాపాలను ప్రారంభించిందని ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఆదిత్య ఎల్1 ఉపగ్రహం లోని రెండు పరికరాలు పరిశోధనలన విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్నాయని తెలిపింది.
ఆదిత్య పేలోడ్ పరికరం తీసిన ఫోటోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో ఉన్న ఎనర్జీ తేడాలను ఈ ఫోటోలో గమనించవచ్చు. రెండు రోజుల్లో ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ కౌంట్‌లో తేడా ఉన్నట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించినట్లు తెలుస్తోంది.
Aditya-L1 Mission:
The Solar Wind Ion Spectrometer (SWIS), the second instrument in the Aditya Solar wind Particle Experiment (ASPEX) payload is operational.
The histogram illustrates the energy variations in proton and alpha particle counts captured by SWIS over 2-days.… pic.twitter.com/I5BRBgeYY5
— ISRO (@isro) December 2, 2023
కాగా ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. ఇందులోని సోలర్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (Swis) నవంబర్2న, సుప్రా థర్మల్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (Steps) సెప్టెంబర్ 10న యాక్టివేట్ చేశారు. ఇవి రెండు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని ఇస్రో పేర్కొంది.
స్విస్‌లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీ ల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదిల్లో సోలార్ విండ్ అయాన్లు, ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని తేడా ఉనట్లు శాటిలైట్గు ఇస్రో పేర్కొంది
ఇక సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. భూమి నుంచి 15 లక్షల కి,మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్1 చేరిన తర్వాత దాని కక్షలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్ 1 సూర్యుడిని ఆధ్యయనం చేస్తుంది.