సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది.
సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్‌చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్‌పరిమెంట్’లో భాగమైన సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి.
నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్‌లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్‌ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్‌లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు.
సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్‌పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment