Indian Space Research Organisation (ISRO)
-
ఎన్జీఎల్వీ తయారీకి సిద్ధమవుతున్న ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో అతిపెద్ద ప్రయోగాలను దృష్టిలో వుంచుకుని ఒక భారీ రాకెట్ తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) అని నామకరణం కూడా చేశారు. ఇస్రో మొదటినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోలు నుంచి 5,000 కిలోలు ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లును అభివృద్ది చేసింది. భవిష్యత్తులో అంటే 2040 నాటికి మానవుడ్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే ప్రయోగంతో పాటు చంద్రుడిపై మానవుడ్ని తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువు కలిగిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి (జీటీఓ) పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 నుంచి 30 టన్నుల బరువు కలిగిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూమికి దగ్గరగా వున్న లియో అర్బిట్‌లోకి, 10 వేలు కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్ట గలిగిన సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. అయితే దీనికి సంబంధించి 2008 డిసెంబర్ 22న రూ.1,798 కోట్లు అంచనాలతో ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిధులతో సెమీ క్రయోజనిక్ దశను అభివృద్ది చేయడంతో పాటు రాకెట్‌కు సంబంధించిన పరికరాలను సాంకేతికంగా రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇప్పుడున్న ప్రయోగవేదికల సామర్థ్యం సరిపోదని మూడో ప్రయోగవేదిక నిర్మాణానికి కేంద్ర సైంటిఫిక్ విభాగం వారు మంత్రివర్గ సమావేశంలో రూ. 3,986 కోట్లు మంజూరు చేశారు. షార్ కేంద్రంలో మూడో ప్రయోగవేదిక నిర్మాణానికి స్థలం ఎంపిక కూడా జరిగింది. ప్రయోగవేదికతో పాటు ఎన్జీఎల్వీ రాకెట్‌ను కూడా రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు. త్వరలోనే ప్రయోగవేదిక నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) వివరాలు... → ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు. → రాకెట్ వెడల్పు 5 మీటర్లు. → ప్రయోగ సమయంలో శాటిలైట్ లేకుండా రాకెట్ బరువు మాత్రమే 1,000 టన్నులు వుంటుంది. → మూడు దశలతోనే రాకెట్‌ను రూపొందిస్తున్నారు. → పీఎస్ఎల్వీ ఎక్స్‌ల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు కలిగి వుంటుంది. → కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ–క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు. → క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయో ఇంధనాన్ని వినియోగిస్తారు. → ఈ రాకెట్ రూపాంతరం చెందితే నాసాకి చెందిన పాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్ –58 రాకెట్ల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వుంటుంది. → ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ 2023 డిసెంబర్లోనే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030 , 2035 నాటికి మాన వ అంతరిక్ష యానం, లోతైన అంతరిక్ష యాత్రలు, అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగాలు చేసేందుకు వీలుగా ఈ రాకెట్‌ను రూపొందిస్తున్నట్టుగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. ఎన్జీఎల్వీ రాకెట్ గురించి దశల వారీగా కూడా ఆయన వివరించి మరీ చెప్పారు. -
భారీ ప్రయోగాలే లక్ష్యం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతోమంది అంతరిక్ష పితామహుల కృషి ఫలితంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని సొంతంగా నిర్మించుకొని, నేటికి వంద ప్రయోగాలు పూర్తిచేసి చరిత్రపుటల్లోకి ఎక్కిందని చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. ఇకపై ఆకాశమే హద్దుగా భారీ ప్రయోగాలే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన బుధవారం షార్‌లోని మీడియా సెంటర్లో మాట్లాడారు. ఇస్రో చేపట్టిన వంద ప్రయోగాల్లో పాలుపంచుకున్న అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలియజేశారు. రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాని తెలిపారు. ఇకపై నెలకు రెండు ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. షార్ నుంచి సెంచరీ ప్రయోగాలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. వందో ప్రయోగానికి తాను ఛైర్మన్‌గా ఉండడం తన అదృష్టమన్నారు. ఈ ఏడాది ప్రైవేట్‌గా పీఎస్ఎల్వీ–ఎన్1 పేరుతో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ద్వారా ఇస్రో, నాసా సంయుక్తంగా నిస్సార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయని తెలిఆపరు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా వాణిజ్యపరమైన ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి గగన్‌యాన్–1 క్రూమాడ్యూల్ ప్రయోగాన్ని హ్యూమన్ రిలేటెడ్ లాంచింగ్ వెహికల్ (హెచ్ఆర్ఎల్వీ) ద్వారా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టంచేశారు. షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను ప్రపంచస్థాయి ప్రయోగవేదికగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్నామని వి.నారాయణన్ ప్రకటించారు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ద్వారా 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి తమిళనాడులోని కులశేఖరపట్నం స్పేస్‌పోర్టు కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. డాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కూడా చేయనున్నామని తెలిపారు. -
గగన్‌యాన్ మిషన్‌లో పురోగతి
సూళ్లూరుపేట: భవిష్యత్తులో మానవ సహి త అంతరిక్ష ప్రయోగాలకు సన్నాహక ప్రా జెక్టుగా పేరొందిన గగన్‌యాన్–1 మిషన్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసింది. సంక్షిష్టమైన లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్‌ను క్రూ మాడ్యూ ల్తో విజయవంతంగా అను సంధానించింది. అనుసంధానం తర్వాత ఈ మాడ్యూల్‌ను మంగళవారం శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్‌సెంటర్‌కు తరలించినట్లు బెంగళూరులో ఇస్రో వారి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ బుధవారం ప్రకటించింది. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లో తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఇస్రో తొలిసారిగా గగన్‌యాన్ పేరిట ఒక మానవరహిత ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ మానవరహిత ప్రయోగం కోసమే తొలిసారిగా ఈ క్రూ మాడ్యూల్‌ను సిద్ధంచేస్తున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) లో రూపొందించిన క్రూ మాడ్యూల్ అప్‌రైటింగ్ సిస్టంను మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రపొల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)లో ప్రొపల్షన్ సిస్టంతో అను సంధానించారు. క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం అనేది ఒక రియాక్షన్ కంట్రోల్ సిస్టం(ఆర్సీఎస్). అంటే క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి స్వేచ్ఛగా వదిలేశాక భూమి దిశగా దిగొచ్చేటప్పుడు దాని వేగాన్ని నియంత్రించి పారాచూట్ల సాయంతో నెమ్మదిగా సముద్రం మీదకు దిగేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఇందులో ఇమ డ్చారు. కిందకు పడేటప్పుడు సూటిగా వచ్చేలా, అటు ఇటూ తిరక్కుండా, పల్టీలు కొట్టకుండా మూడురకాలుగా దాని భద్రతను చూడ టమే ఆర్సీఎస్ పని. వ్యోమనౌక నుంచి విడిపోయి అంతరిక్షంలోకి చేరుకునే టప్పు డు, తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు పారాచూట్లు విచ్చుకోకముందు ఆర్‌సీఎస్‌ను వాడతారు. -
చంద్రయాన్–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్‌కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. -
‘ఇస్రో’ రోబో హస్తం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేసిన రోబోటిక్ హస్తం అంతరిక్షంలో తన కార్యాచరణ ప్రారంభించింది. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక పరిణామమని నిపుణులు చెబుతున్నారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకొనే దిశగా స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్) మిషన్‌లో భాగంగా ఈ రిమోట్ రోబోటిక్ చెయ్యిని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోటలోని షార్ నుంచి గత నెల 30వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లింది. మన దేశానికి చెందిన మొట్టమొదటి రోబోటిక్ హస్తం రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిప్యులేటర్–టెక్నాలజీ డెమాన్ర్స్టేటర్(ఆర్ఆర్ఎం–టీడీ) కార్యాచరణ మొదలుపెట్టిందని, ఇది మనకు గర్వకారణమని ఇస్రో వెల్లడించింది. పూర్తి స్థాయిలో విజయవంతమైన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఎం–టీడీని నడిచే రోబోటిక్ హస్తంగా పరిగణిస్తారు. ఇండియాలో ఇలాంటిది అభివృద్ధి చేయడంలో ఇదే మొదటిసారి. ఇందులో ఏడు జాయింట్లు ఉన్నాయి. అవి అన్ని వైపులా కదులుతాయి. అంతరిక్షంలోని స్పేడెక్స్ మిషన్‌లో భాగమైన పీఎస్4–ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్(పోయెం–4) ఫ్లాట్‌పామ్‌పై చురుగ్గా నడవగలదు. నిర్దేశించిన చోటుకు వెళ్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మర చెయ్యిని రూపొందించారు. ఇందులో కంట్రోలర్లు, కెమెరాలు, అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. భారతీయ అంతరిక్ష స్టేషన్(బీఏఎస్) పేరిట సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి భారత్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఏఎస్ నిర్మాణం, నిర్వహణకు రోబోటిక్ టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీని స్వయంగా అభివృదిచేసుకొనే దిశగా రోబోటిక్ హస్తం కీలకమైన ముందడుగు అని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. -
క్రయోజనిక్ ఇంజిన్ 20 పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట: సీఈ20 క్రయోజనిక్ ఇంజన్లో సంక్లిష్టమైన ప్రక్రియను దాటడం ద్వారా మళ్లీ స్టార్ చేయడానికి వీలుండే వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేశామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. భవిష్యత్తు ప్రయోగాలకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది. నాజిల్ ఏరియా నిష్పత్తి 100 శాతం ఉండేలా సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్ట్‌లో సీఈ20 క్రయోజనిక్ ఇంజన్‌ను నవంబర్ 29న విజయవంతంగా పరీక్షించామని ఇస్రో గురువారం వెల్లడించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వారి ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఈ పరీక్షకు వేదికైంది. ఎల్వీఎం మార్క్–3 రకం రాకెట్లో పైభాగానికి తగు శక్తిని అందివ్వడంలో సీఈ20 ఇంజన్ సాయపడుతుంది. 19 టన్నుల థ్రస్ట్‌ను అందించే పరీక్షలో ఈ ఇంజన్ నెగ్గింది. ఇప్పటికే ఎల్వీఎం2 ఆరు ప్రయోగాల్లో ఈ ఇంజన్ అద్భుతంగా పనిచేసింది. ‘‘గగన్‌యాన్ మిషన్‌కు కావాల్సిన 20 టన్నుల థ్రస్ట్ స్థాయిని అందించేందకు ఈ ఇంజన్ అర్హత సాధించింది. భవిష్యత్తులో సీ32 స్టేజ్‌లో పేలోడ్ పరిమాణాన్ని పెంచేందుకు ఉపయోగపడే 22 టన్నుల థ్రస్ట్‌ను అందించే కార్యక్రమాల్లోనూ ఈ ఇంజన్‌ను ప్రయోగాత్మకంగా వాడొచ్చు’’అని ఇస్రో పేర్కొంది. మళ్లీ ఇంజన్‌ను రీస్టార్ చేసేందుకు అవసరమయ్యే బహుళధాతు ఇగ్నైటర్ సామర్థ్యాన్నీ విజయవంతంగా పరీక్షించారు. ‘‘సముద్రమట్టం స్థాయిలో సీ20 ఇంజన్‌కు సవాళ్లు ఎదురవుతాయి. నాజిల్ పెద్దదిగా ఉండటంతో 50 ఎంబార్ స్థాయిలో విపరీతమైన శక్తి బయటకు వెలువడుతుంది. దీంతో ఇంజన్ సమీపంలో అత్యంత ఉష్ణం జనించడంతోపాటు పెద్దస్థాయిలో కంపనాలు మొదలై ఆ నాజిల్ దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న ‘నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్’ను ఉపయోగించాం’’అని ఇస్రో పేర్కొంది. -
అంతరిక్షంలో మన జైత్రయాత్ర
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమమైంది. ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి, అక్కడ నమూనాలు సేకరించి, క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌కు ఆమోద ముద్రవేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,104.06 కోట్లు ఖర్చు చేయబోతోంది. చంద్రయాన్–4 స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్–4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవడంతోపాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్–4కు శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. ఎన్జీఎల్వీ సూర్య పాక్షిక పునరి్వనియోగ తదుపరి తరం లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ‘సూర్య’ అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్–3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్–3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది. ఎన్జీఎల్వీ ‘సూర్య’ అభివృద్ధికి ప్రభుత్వం రూ.8,240 కోట్లు కేటాయించింది. గగన్‌యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి మాడ్యూల్(బీఏఎస్–1) అభివృద్ధికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తిజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా రూ.11,170 కోట్లు కేటాయించింది. → బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్íÙప్ డెవలప్మెంట్(బయో–రైడ్) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.9,197 కోట్లు కేటాయించారు. → యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(ఎన్సీఓఈ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియాను కంటెంట్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. → 2024–25 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రూ.24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తంచేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. → ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(పీఎం–ఆశా)కు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతోపాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025–26లో రూ.35,000 కోట్లతో ఈ పథకం అమలు చేస్తారు. పీఎం–ఆశాతో రైతులతోపాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. → దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి రూ.79,156 కోట్లు కేటాయించారు.‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ శుక్ర గ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్ర గ్రహం కక్ష్యలోకి సైంటిఫిక్ స్పేస్‌క్రాఫ్ట్ పంపించాలని నిర్ణయించారు. ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’కు కేంద్ర కేబినెట్ రూ.1,236 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తారు. -
Reusable Launch Vehicle: పుష్పక్.. తగ్గేదేలే!
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ విషయంలో మరో మైలురాయిని అధిగమించింది. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ (రాకెట్లు)ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్‌ను ఇస్రో తయారు చేయడమే కాకుండా ముద్దుగా ‘పుష్పక్’ అని పేరు పెట్టుకుంది. ఈ పుష్పక్‌కు సంబంధించి తొలి ధపాలో గతేడాది నిర్వహించిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–01 మిషన్ పరీక్ష విజయవంతమైంది. తాజాగా రెండో దఫాలో పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సైతం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–02 మిషన్ పరీక్ష నిర్వహించారు. నింగిలోకి పంపిన రాకెట్‌కు స్వయంగా ల్యాండింగ్ సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించారు. పుష్పక్‌ను భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్ హెలీకాప్టర్ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు వదిలేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, స్వతహాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం రన్‌వే మీద పుష్పక్ సురక్షితంగా దిగింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్‌వీల్ సిస్టమ్ సాయంతో పుష్పక్ తనంతట తానే వచ్చి నిలిచిపోవడం గమనార్హం. పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అభినందించారు. -
జీఎస్ఎల్వీ–ఎఫ్14 సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 గంటల అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి. 2,275 కిలోల బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు(పెరిజీ), భూమికి దూరంగా 36,647 కిలోమీటర్ల(అపోజీ) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఇన్శాట్–3డీఎస్‌లో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి, మరో రెండు మూడు రోజుల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్(భూ స్థిరకక్ష్య)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఏమిటీ ఇన్శాట్–3డీఎస్? దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్శాట్–3, ఇన్శాట్–3ఆర్ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం పని చేస్తుంది. ఇప్పటిదాకా ఇన్శాట్ శ్రేణిలో 23 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్శాట్–3డీఎస్‌ని అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు చానెల్ ఇమేజర్స్, 19 చానెల్ సౌండర్స్తోపాటు మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చారు. వాతావరణ పరిశీలనతోపాటు భూమి, సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది. త్వరలో నిస్సార్ ప్రయోగం: సోమనాథ్ నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్(నిస్సార్) మిషన్ అనే జాయింట్ ఆపరేషన్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్‌లో జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. పీఎస్ఎల్వీ–సీ59, ఎస్ఎస్ఎల్వీ–డి3, జీఎస్ఎల్వీ–ఎఫ్15 ప్రయోగాలతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఆర్ఎల్వీ–టీడీ–2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఎస్.సోమనాథ్ తెలిపారు. -
నింగిలోకి ఎక్స్‌పోశాట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా ఆరంభించింది. సోమవారం చేపట్టిన పీఎస్‌ఎల్‌ఎవీ సీ58 60వ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వియ్శాట్నూ రోదసిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చివరిదైన నాలుగో దశలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు మొత్తం పది పరికరాలను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో ఎఫ్‌సీపీఎస్ ఎంతో కీలకం కానుంది. ప్రయోగం దిగి్వజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. 2024కు అద్భుత ఆరంభాన్నిచి్చనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు. నిప్పులు చిమ్ముతూ... సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం జరిగింది. ఆదివారం మొదలైన 25 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే సోమవారం ఉదయం 9.10 గంటలకు ముగిసింది. ఆ వెంటనే 44.4 మీటర్లు పొడవున్న పీఎస్ఎల్వీ రాకెట్ 260 టన్నుల బరువుతో మంచు తెరలను చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం కిలో బరువున్న వియ్‌శాట్‌ను కూడా కక్ష్యలోకి నిర్దేశిత సమయంలో ప్రవేశపెట్టారు. ఏడాది తొలి రోజే చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకున్నారు. ఇస్రో ప్రయోగాల పరంపరకు శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లోనూ ఇది 60వ ప్రయోగం కావడం విశేషం! మొత్తమ్మీద షార్ నుంచి ఇది 92వ ప్రయోగం. ఫ్యూయల్ సెల్ ప్రయోగం... ఎక్స్‌పోశాట్, వియ్శాట్లను నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ప్రయోగ చివరి దశలో పీఎస్ఎల్వీ వ్యోమ నౌకను రెండుసార్లు మండించి దాని ఎత్తును 650 కి.మీ. నుంచి 350 కి.మీకి తగ్గించారు. 10 కీలక పరికరాలను ఆ భూ దిగువ కక్ష్యలోకి విజయవతంగా చేర్చారు. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు బెలిఫ్శాట్, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ బెలాట్రిక్స్ వంటివి వీటిలో ఉన్నాయి. పీఎస్‌ఎలవీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్–3 (పోయెం) ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. 2023 ఏప్రిల్‌లో పీఎస్ఎల్వీ–సీ55 ప్రయోగం సందర్భంగా కూడా పోయెం–2 ద్వారా ఇలాంటి ప్రయోగాన్నే ఇస్రో చేపట్టింది. ► ఇస్రో నిర్మించనున్న భారత అంతరిక్ష కేంద్రానికి ఎఫ్‌సీపీఎస్ కీలకం కానుంది. ► రోదసిలో సుస్థిర శక్తి వనరును సమకూర్చుకోవడం దీని లక్ష్యం. ► ఇందులోని టెక్నాలజీ ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ సాయంతో రసాయన శక్తిని నేరుగా విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది. ► తద్వారా మన అంతరిక్ష కేంద్రానికి కావాల్సిన ఇంధనాన్ని ఇది సుదీర్ఘ కాలం పాటు అందించగలదు. ఎక్స్‌పోశాట్‌తో ఉపయోగాలివీ... ► ఉపగ్రహం బరువు 469 కిలోలు. ► ఇది ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది. ► గతంలో ప్రయోగించిన ఆస్ట్రోశాట్‌తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది. ► ఇవి రెండూ విశ్వంతారాల్లో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి. ► ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పేలోడ్ పోలిక్స్ (ఎక్స్–పోలారిమీటర్ పరికరం)ను 8.3 కిలోవాట్ల ఫోటాన్ల మధ్య వ్యవస్థ ఎక్స్‌రే శక్తి శ్రేణిలో ధ్రువణ పరామితులను, ప్రత్యేకంగా వాటి డిగ్రీ, ధ్రువణ కోణాలను కొలిచేందుకు రూపొందించారు. రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) బెంగళూరు ఇస్రో కేంద్రం దీన్ని రూపొందించింది. ► ఇందులోని మరో పేలోడ్ ఎక్స్పెక్ట్ (ఎక్స్ రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్) 0.8–15 కిలోవాట్స్ శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ రూపొందించింది. ► ఈ రెండు పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేసి విలువైన సమాచారం అందిస్తాయి. ► ఇక కేరళ వర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్ కేజీ బరువున్న సూక్ష్మ ఉపగ్రహం. ► కేరళలో మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం దీని ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 12 ప్రయోగాలు: సోమనాథ్ ఈ ఏడాది 12 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ‘‘2024ను గగన్‌యాన్ ఏడాదిగా నిర్దేశించుకున్నాం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది నాలుగు మానవరహిత ప్రయోగాలు చేయనున్నాం. అనంతరం 2025లో మానవసహిత ప్రయోగం ఉంటుంది. నాసాతో సంయుక్తంగా రూపొందించిన ఇన్శాట్–త్రీడీ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగిస్తాం. ఈ నెల 26న, లేదా ఫిబ్రవరి తొలి వారంలో నావిక్–02 ఉపగ్రహ ప్రయోగం ఉటుంది’’ అని ఆయన వివరించారు. -
2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఆరు పీఎస్ఎల్వీ మిషన్లు, మూడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఒక లాంచ్ వెహికల్ మార్క్–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
Aditya-L1 mission: పని మొదలెట్టిన ఆదిత్య–ఎల్ 1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్‌చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్’లో భాగమైన సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. -
ISRO: ‘గగన’ విజయం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): మానవసహిత అంతరిక్ష ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. విజయసోపానాల్లో తొలిమెట్టుగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు సన్నాహకాల్లో భాగంగా ఇస్రో చేపట్టిన మానవరహిత క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) పరీక్ష విజయవంతమైంది. సతీష్ దవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక ఇందుకు వేదికైంది. ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 10 గంటలకు గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) వాహకనౌకను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 16.9 కి.మీ.ల ఎత్తులో అందులోంచి క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు విడిపోయి వేర్వేరు పథాల్లో ప్రయాణించి బంగళాఖాతంలో సురక్షితంగా పడ్డాయి. క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను డ్రోగ్ పారాచూట్లు సురక్షితంగా సముద్రజలాలపై ల్యాండ్ అయ్యేలా చేశాయి. మానవసహిత ప్రయోగాలు చేపట్టినపుడు అందులోని వ్యోమగాములను క్రూ మాడ్యూల్ ఎలా సురక్షితంగా బయటపడేయగలదన్న అంశాన్ని పరీక్షించేందుకే ఈ ఎస్కేప్ మాడ్యూల్ పరీక్ష చేశారు. 17 కిలోమీటర్ల ఎత్తుకెళ్లి తిరిగి సముద్రంలోకి .. టెస్టు వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగాన్ని 10.10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇందులో భాగంగా సింగిల్ స్టేజీ ద్రవ ఇంధర రాకెట్(టీవీ–డీ1)పై క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్లను అమర్చారు. రాకెట్‌ను ప్రయోగించాక అత్యవసర స్థితి(అబార్ట్)ను సిములేట్ చేశారు. దీంతో రాకెట్ 11.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు వేరువడటం ప్రారంభమైంది. రాకెట్ 16.6 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకున్నాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు రాకెట్ నుంచి విడివడి వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో పడ్డాయి. అయితే క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను సేకరించే ఉద్దేశంతో అది సురక్షితంగా సముద్రంలో పడేలా తొలుత రెండు డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని నెమ్మదిగా కిందకు దిగేందుకు సాయపడ్డాయి. తర్వాత మరో పెద్ద పారాచూట్ విచ్చుకుని ల్యాండింగ్‌ను దిగి్వజయం చేసింది. సమీప సముద్ర జలాల్లో ప్రత్యేక లాంచీలో వేచి ఉన్న కోస్టల్ నేవీ బలగాలు ఆ మాడ్యూల్‌ను సురక్షితంగా శ్రీహరికోటకు చేర్చారు. అయితే మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగాలు భవిషత్తులో చేయడానికి ఇలాంటి ప్రయోగాలు మరో మూడు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాలుగోసారి క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను పోలిన బొమ్మలను అమర్చి క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను పరీక్షిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత 2024 చివర్లో లేదా 2025 ప్రథమార్ధంలో మానవ సహిత ప్రయోగాలు చేయనున్నారు. గగన్‌యాన్ టీవీ–డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆనందం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మిషన్ డైరెక్టర్ శివకుమార్, డైరెక్టర్ సునీల్, వీఎస్ఎస్సి డైరెక్టర్ ఉన్ని కృష్ణన్నాయక్, డైరెక్టర్ నారాయణ పాల్గొన్నారు. గగన్‌యాన్ సాకారం దిశగా మరింత చేరువకు: ప్రధాని మోదీ ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)’ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టు సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అంటూ వారిని అభినందిస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్లు చేశారు. మొదట తడబడినా.. మొదట శుక్రవారం రాత్రి ఏడింటికి మొదలైన 13 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8 గంటలకు ముగిశాక ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో శనివారం తెల్లవారుజామున వర్షం పడడంతో వాతావరణం అనుకూలించని కారణంగా కౌంట్‌డౌన్ సమయాన్ని మరో 30 నిమిషాలు పెంచారు. తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే అంటే 8.15 గంటలకు రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసి 8.45గంటలకు కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. హఠాత్తుగా ఇంజన్‌ను మండించే ప్రక్రియలో లోపం తలెత్తింది. దీంతో రాకెట్ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లకుండా ఆగిపోయింది. దీంతో ప్రయోగాన్ని ఆటో మేటిక్ లాంచ్ సీక్వెన్స్‌లోని ఆన్ బోర్డు కంప్యూటర్ ఆపేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే దీన్ని సవాల్‌గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తల టైగర్ సేఫ్టే బృందం వెంటనే లాంచ్ ప్యాడ్ వద్దకు వెళ్లి సాంకేతిక లోపాన్ని సరిచేసింది. దీంతో మళ్లీ 9.33 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఎట్టకేలకు 10.03 గంటలకు గగన్‌యాన్ టీవీ–డీ1 విజయవంతంగా ప్రయోగించారు. 10 నిమిషాల 10 సెకన్లలో మొత్తం ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. -
ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: టెస్ట్ వెహికల్ ఫ్లైట్ టీవీ-డీ1 సక్సెస్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ఎత్తైన కక్ష్యలోకి ఇస్రో దూసుకెళ్లోందంటూ సీఎం జగన్ కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1) ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్(సముద్రంలోకి) అయ్యింది. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: ఇస్రో ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ -
‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1)ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్(సముద్రంలోకి) అయ్యింది. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. #WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission ISRO says "Mission going as planned" pic.twitter.com/2mWyLYAVCS — ANI (@ANI) October 21, 2023 గగన్‌యాన్ టెస్ట్ లాంచ్ విజయవంతం అయ్యిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. టీవీ-డీ1 మిషన్‌ను విజయవంతంగా పరీక్షించాం. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగాం. తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించాం. దాని సరిచేసి మళ్లీ ప్రయోగించాం. పారాచ్యూట్లు సమయానికి తెరుచుకున్నాయి. క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది అని వెల్లడించారాయన. టీవీ-డీ1 ఎందుకంటే.. గగన్‌యాన్‌కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాలనుకుంది. అందులో టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమితస్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. ఇందులో క్రూ(వ్యోమగాముల) ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది. అంతరాయం తర్వాత.. తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించగా.. ఈ సన్నాహక పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. Reason for the launch hold is identified and corrected. The launch is planned at 10:00 Hrs. today. — ISRO (@isro) October 21, 2023 ఎందుకు కీలకం అంటే.. వ్యోమగాములతో వెళ్లే రాకెట్లో ఏదైనా లోపం ఎదురైతే వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) అంటారు. అంటే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షిస్తున్నారు. క్రూ మాడ్యూల్‌ను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థలో పది పారాచూట్లు ఉంటాయి. Best wishes Team #ISRO! Moving one step closer to India’s first Human Space Mission, the critical phase of preparation begins for #Gaganyaan with first Test Vehicle Flight TV-D1 scheduled for October 21, 2023, at 0800 Hrs IST from the SDSC-SHAR Launchpad, Sriharikota. pic.twitter.com/QCu2dawts1 — Dr Jitendra Singh (@DrJitendraSingh) October 20, 2023 ప్రస్తుతానికి మానవరహితంగానే.. భవిష్యత్‌లో ఇవాళ ప్రయోగించిన క్రూ మాడ్యూల్లో వ్యోమగాములు పయనిస్తారు. కానీ, ఇవాళ మాత్రం మానవరహితంగానే ప్రయోగం జరిపింది ఇస్రో. గన్‌యాన్ ఉద్దేశం.. గగన్‌యాన్‌లో ముగ్గురు వ్యోమగాముల్ని 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. నేటి పరీక్ష ఇలా జరిగింది.. రాకెట్ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని.. 531.8 సెకన్లలో(8.85 నిమిషాల్లో) పూర్తి చేశారు. -
దానివల్లే ఇస్రో ఉద్యోగాలను వద్దనుకుంటున్నారు.. చైర్మన్ కామెంట్స్ వైరల్
భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి చాటి చెబుతున్న 'ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్' (ISRO)లో పనిచేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆధునిక కాలంలో అలాంటి వారి సంఖ్య బాగా తగ్గిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ 'ఎస్ సోమనాథ్' (S Somanath) తాజాగా వెల్లడించారు. ఇంతకీ ఈయన అలా ఎందుకన్నారు? కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల నుంచి బయటకు వస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరటానికి సుముఖత చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం జీతభత్యాలే అంటూ సోమనాథ్ తెలిపారు. దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులు ఇంజినీర్లుగా, ఐఐటీయన్లుగా ఉండాలి. వారు తప్పకుండా దేశ ప్రతిష్టను పెంచే ఇస్రోలో చేరాలి. కానీ నేడు అలా జరగడం లేదు. రిక్రూట్మెంట్స్ ప్రకటించినప్పటికీ ఎక్కువ మంది దీని కోసం ప్రయత్నించడం లేదు. కొందరు పనిచేసే స్థలం ముఖ్యమని భావించి చేరుతున్నారు, అలాంటి వారు చాలా తక్కువ ఉన్నారని వెల్లడించారు. 60 శాతం మంది ఇస్రో చీఫ్ ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి ఇటీవల టీమ్ బయలుదేరింది. అయితే చాలామంది ఉద్యోగం కోసం వచ్చిన వారు శాలరీ స్ట్రక్చర్ చూసి ప్రెజెంటేషన్ నుంచి 60 శాతం మంది బయటకు వెళ్లిపోయారని సోమనాథ్ తెలిపారు. గతంలో కొందరు ఇస్రోలో జీతాలు భారీగా ఉంటాయని భావించే వారు, కానీ గత నెలలో హర్ష్ గోయెంకా ఒక ట్వీట్లో సోమనాథ్ జీతం రూ. 2.5 లక్షలని, వేర్వేరు పోస్టులకు వేరువేరు వేతనం ఉంటుందని, అయితే ఇక్కడ ఇంజనీర్ల ప్రారంభ వేతనం దాదాపు రూ. 56,100 మాత్రమే అని తెలిపాడు. ఇదీ చదవండి: నేపాల్‌లో ఇతడే రిచ్.. సంపద తెలిస్తే అవాక్కవుతారు! ప్రస్తుతం ఐఐటీ చేసిన చాలామంది ఎక్కువ ప్యాకేజి కోసం చూస్తున్నారు, ఈ కారణంగా ఇస్రోలో చేరటానికి ఎవరూ ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అయితే దేశంపై ఉన్న ప్రేమతో ఇక్కడ చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి 'సమృద్ జోషి' వెల్లడించాడు. కానీ టెక్నాలజీలో దూసుకెళుతున్న భారతదేశం ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్తమ ప్రతిభ ఉన్నవారు ముందుకు రావాలి. అందరూ శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తే రానున్న రోజులు ప్రశార్థకంగా మారుతాయి. -
గగన్‌యాన్‌లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్‌ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–1(టీవీ–డీ1)ను ప్రయోగించనుంది. మానవ రహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవసహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. డీవీ–డీ1ను ప్రయోగించడంలో పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సా యంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. -
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దృష్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులపై పడిందని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేíÙస్తోందని తెలిపారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ ఆపరేషన్‌తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్‌యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్) -
ఆదిత్య –ఎల్1 కక్ష్య దూరం మళ్లీ పెంపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), మారిషస్, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్ గ్రౌండ్‌స్టేషన్ల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. మూడో విడతలో 296గీ71,767 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో నాలుగో విడుతలో భూమికి దగ్గరగా ఉన్న 296 కిలోమీటర్ల దూరాన్ని 256 కిలోమీటర్లకు తగ్గిస్తూ భూమికి దూరంగా ఉన్న 71,767 దూరాన్ని 1,21,973 కిలోమీటర్లకు పెంచారు. ఈనెల 19న అయిదోసారి కక్ష్యదూరం పెంపుదలలో భాగంగా ఆదిత్య –ఎల్1 ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యనుంచి సూర్యుడికి దగ్గరగా లాంగ్రేజియన్ పాయింట్–1 వద్ద çహాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
జాబిల్లిపై మరోసారి ‘విక్రమ్’ ల్యాండింగ్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండర్ ‘విక్రమ్’ను మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. మొదట దిగిన ప్రాంతంలో కాకుండా మరో చోట విక్రమ్ క్షేమంగా దిగినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఎక్స్’లో వెల్లడించింది. తాము ఇచి్చన ఆదేశాలకు విక్రమ్ చురుగ్గా స్పందించినట్లు తెలియజేసింది. ల్యాండర్ తొలిసారిగా ఆగస్టు 23న చందమామ ఉపరితలంపై విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే. చంద్రయాన్–3 మిషన్ లక్ష్యంలో భాగంగా ల్యాండర్‌ను తాజాగా మరోచోట దించారు. కమాండ్ ఇచి్చన తర్వాత ల్యాండర్‌లోని ఇంజిన్లు ఫైర్ అయ్యాయని, తర్వాత ల్యాండర్ 40 సెంటీమీటర్ల మేర పైకి లేచిందని, 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ఉపరితలంపై దిగిందని ఇస్రో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మానవ సహిత ప్రయోగాలను నిర్వహించినపుడు వ్యోమగాములను క్షేమంగా తిరిగి భూమిపైకి తీసుకురావడానికి కిక్ స్టార్ట్ వంటిదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను ఇస్రో విడుదల చేసింది. నిద్రాణ స్థితిలోకి ‘విక్రమ్’ చందమామపై మరో రెండు మూడు రోజుల్లో లూనార్ నైట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ విక్రమ్‌ను నిద్రాణ స్థితి(స్లీప్ మోడ్)లోకి మార్చినట్లు ఇస్రో ప్రకటించింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలియజేసింది. ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచడంతో అందులోని పేలోడ్స్ డీయాక్టివ్ అయినట్లు వివరించింది. ల్యాండర్ రిసీవర్స్ మాత్రం చురుగ్గా పని చేస్తున్నట్లు తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై సౌరశక్తి తగ్గిపోయి, బ్యాటరీ అయిపోయిన తర్వాత ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ పూర్తిగా స్లీప్ మోడ్‌లో ఉంటాయని ఇస్రో స్పష్టం చేసింది. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి పగలు మొదలయ్యాక 22న ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్ మళ్లీ పనిచేస్తాయా అంటే చెప్పలేమని ఇస్రో సైంటిస్టులు అంటున్నారు. మళ్లీ పని చేస్తే చంద్రయాన్–3 ప్రయోగం కొనసాగుతుంది. లేనిపోతే కథ ముగిసినట్లే. -
Chandrayaan3: మరోసారి విక్రమ్ సేఫ్ ల్యాండ్
బెంగళూరు: చంద్రయాన్-3 నుంచి ఇస్రో మరో అప్డేట్ ఇచ్చింది. విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు తెలిపింది. నిర్ణీత ప్రాంతం నుంచి సుమారు 30-40 సెం.మీ. దూరంలో జంప్ చేసింది విక్రమ్. ల్యాండింగ్ సమయంలో దుమ్ము, ధూళి పైకి లేచాయి. అయితే ఇది ఏ సమయంలో చేశారన్నదానిపై ఇస్రో స్పష్టత ఇవ్వలేదు. Chandrayaan-3 Mission: 🇮🇳Vikram soft-landed on 🌖, again! Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment. On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI — ISRO (@isro) September 4, 2023 ఇప్పటికే స్లీపింగ్మోడల్లోకి వెళ్లింది ప్రగ్యాన్ (ప్రజ్ఞాన్ రోవర్). ఇక ఇప్పుడు ల్యాండర్ విక్రమ్‌ను సైతం స్లీప్‌మోడ్‌లోకి తీసుకెళ్లింది ఇస్రో. చంద్రుడిపై సూర్యోదయం దాకా ఇస్రో ఎదురు చూస్తుంది. ఈ రెండూ సెప్టెంబర్ 22వ తేదీన తిరిగి యాక్టివ్ మోడ్‌లోకి వస్తాయి. ఆ మరుసటి రోజు పంపే డేటాపై ఇస్రో ప్రకటన చేసే అవకాశం ఉంది. -
ఆదిత్య–ఎల్1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మొదటిసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూనియంత్రత కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. శనివారం ప్రయోగం చేసినపుడు భూమికి దగ్గరగా 235 కిలోమీటర్లు, దూరంగా 19,500 కిలోమీటర్లు ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొదటి విడత కక్ష్య దూరం పెంపుదలలో భూమికి దగ్గరగా 235 కిలోమీటర్ల నుంచి 245 కిలోమీటర్లకు పెంచారు. భూమికి దూరంగా ఉన్న 19,500 కిలోమీటర్ల దూరాన్ని 22,459 కిలోమీటర్లకు పెంచారు. అంటే ప్రస్తుతం 245‘‘22459 కిలోమీటర్లు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంది. రాబోయే 15 రోజుల్లో మరో నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచుతూ ఈనెల 18న భూ మధ్యంతర కక్ష్య నుంచి సూర్యుని వైపునకు మళ్లిస్తారు. అక్కడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు 1 వద్దకు చేర్చడానికి 125 రోజులు సమయం తీసుకుంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. -
చూసేదేమిటి? చేసేదేమిటి?.. మన ఆదిత్యుడి కథా కమామిషు..
సౌర కుటుంబం మొత్తానికి తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య–ఎల్1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. సుమారు 4 నెలల ప్రయాణం, 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమి, సూర్యుడు ఆకర్షణ శక్తి రెండూ లేని లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకోనుంది. ఆదిత్య–ఎల్1లో ఏ పరికరాలున్నాయి? వాటితో చేసే ప్రయోగాలేమిటి? పరిశీలనలేమిటి?ప్రయోజనాలేమిటి?స్థూలంగా.... ఆదిత్య–ఎల్1లో మొత్తం 7శాస్త్రీయ పరికరాలు ఉంటాయి. వీటిల్లో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగిస్తే.. మిగిలిన మూడు లగ్రాంజ్ పాయింట్ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేస్తాయి. ఒక్కో పరికరం.. దాని ప్రాశస్త్యం, చేసే పని గురించి తెలుసుకుందాం... ► విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (వీఈఎల్సీ): సూర్యుడు ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్ అణువులు ఒకదాంట్లో ఒకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతం. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్గా పిలుస్తారు. దీని దిగువన ఉన్న ఇంకో పొరను క్రోమోస్ఫియర్ అని.. దీని దిగువన ఉన్న మరో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్సీ అనేది ఈ కరోనా పొర ఛాయాచిత్రాలను తీస్తుంది. అలాగే వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్–రే) కరోనాను పరిశీలిస్తుంది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి తయారు చేసిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాం (కరోనల్ మాస్ ఎజెక్షన్)పై ఓ కన్నేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్లతో వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణంపై ప్రభావం చూపగలవని అంచనా. ► సోలార్ అ్రల్టావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ): వీఈఎల్సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్యూఐటీని ఫొటో స్పియర్, క్రోమోస్పియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అది కూడా అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధారి్మక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నిర్మించింది ఈ పరికరాన్ని. ► సోలార్ లో ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్): హై ఎనర్జీ ఎల్–1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్–రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. కాకపోతే సోలెక్స్ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్–రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి పెడుతుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ► ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (ఎస్పెక్స్): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతల వంటివి గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్నది తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ► ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పాపా): సూర్యుడి కరోనా పొర వెలువరించే ప్లాస్మా ధర్మాలను, సౌర గాలుల్లో ఏమేం ఉంటాయి? ఉష్ణోగ్రత, సాంద్రతలను గుర్తిస్తుంది. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ తయారు చేసింది. ► అడ్వాన్స్డ్ ట్రై ఆక్సియల్ హై రెజల్యూషన్ మాగ్నెటోమీటర్: ఆదిత్య ఎల్–1 సూర్యుడిని పరిశీలించే ప్రాంతంలో గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను లెక్కగట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్రాలకు సౌర గాలులు, కరోనా తాలూకూ ప్లాస్మాల మధ్య సంబంధాలను గమనిస్తుంది. బెంగళూరులోని లా»ొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ అభివృద్ధి చేసిందీ పరికరాన్ని. మన ఆదిత్యుడి కథ కమామిషు... ► సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఖగోళ వస్తువు, నక్షత్రం అయిన సూర్యుడి వయసు సుమారు 460 కోట్ల సంవత్సరాలు ► భూమి వ్యాసార్ధం కంటే దాదాపు 864,938 రెట్లు ఎక్కువ వ్యాసార్ధం సూర్యుడిది. కొంచెం అటు ఇటుగా 13.9 లక్షల కిలోమీటర్లు!! ► అతి భారీ వాయుగోళమైన సూర్యుడిలో 75 శాతం హైడ్రోజన్ కాగా.. మిగిలిన 25 శాతం హీలియం. లేశమాత్రంగా కొన్ని ఇతర అణువులు కూడా ఉంటాయి. ► కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా సూర్యుడిపై హైడ్రోజన్ కాస్తా హీలియంగా మారుతూంటుంది. ► సూర్యుడిపై ఉష్ణోగ్రత అన్నిచోట్ల ఒకేలా ఉండదు. కంటికి కనిపించే సూర్యుడి ఉపరితలం (ఫొటోస్పియర్) ఉష్ణోగ్రత సుమారు 5,500 డిగ్రీ సెల్సియస్. ఈ ఫొటోస్ఫియర్కు దిగువన క్రోమోస్పియర్ ఉంటే.. దాని దిగువన ఉండే కరోనా ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 నుంచి 30 లక్షల డిగ్రీల సెల్సియస్. కరోనా కంటే లోతైన ప్రాంతం లేదా సూర్యుడి మధ్యభాగంలో వేడి కోటీయాభై లక్షల డిగ్రీల సెల్సియస్ అని అంచనా. ► సముద్రానికి ఆటుపోట్ల మాదిరిగా సూర్యుడిపై జరిగే కార్యకలాపాల్లో కూడా ఒక క్రమపద్ధతి ఉంటుంది. పదకొండేళ్లకు ఒకసారి ఆ కార్యకలాపాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019 డిసెంబరులో సూర్యుడు 25వ సోలార్ సైకిల్‌లోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. -
Aditya-L1: మిషన్ సూర్య సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యడిపై పరిశోధనలు చేయాలనే కల నెరవేరింది. సూర్యయాన్–1 పేరుతో చేసిన ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ఇస్రో మంచి జోష్ మీదుంది. నిన్న చంద్రయాన్–3, నేడు సూర్యయాన్ ప్రయోగంతో వరుసగా రెండు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతం చేసి చరిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది. ఈ ప్రయోగంతోనే చంద్రయాన్–4, శుక్రుడిపై ప్రయోగానికి బీజం పడింది. ప్రపంచంలో నాసా ఇప్పటికే సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ప్రయోగాలను చేసింది. ఆ తరువాత మొదటిసారి సూర్యుడిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. సూర్యుడు అగి్నగోళం కదా! అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోదా! అనే సందేహం చాలామందిలో ఉంది. అందుకే భూమికి 15 లక్షల కిలోమీటర్లు దూరంలోని సూర్యునికి దగ్గరగా ఉన్న లాంగ్రేజియన్ బిందువు 1 వద్ద ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి అ«ధ్యయనం చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కాంతిమండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయనుంది. చంద్రుడు, అంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు కూడా మొదటి ప్రయత్నంలోనే చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమై ప్రయోగంలో మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్‌కు తిరుగులేదని మరోమారు నిరూపించారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి సూర్యయాన్–1 పేరుతో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,480 కిలోలు ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో చరిత్రలోచరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. మొన్న చంద్రయాన్–3 సక్సెస్ జోష్‌లో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేని దేశంగా మరోమారు నిలిపారు. సూర్యుడి మీద అధ్యయనం చేసే ప్రయోగం కావడం, కక్ష్య దూరం కొత్తగా ఉండడంతో మిషన్ కంట్రోల్‌రూంలో నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 23.40 గంటలపాటు కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడింది. కౌంట్‌డౌన్ సమయంలో జీరో పడడమే తరువాయి.. తూర్పువైపున నిప్పులు చెరుగుతున్న భగభగ మండే ఎండను, మబ్బులను చీల్చుకుంటూ ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లును ఆపరేట్ చేస్తూ కంటి మీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. నాలుగు దశలతో కూడిన ప్రయోగాన్ని 01.03.31 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. 1,480 కిలోల ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని గంటా మూడు నిమిషాల వ్యవధిలో భూమికి దగ్గరగా (పెరిజీ)235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్లు ఎత్తులో ఎసిన్‌ట్రిక్ ఎర్త్ బౌండ్ అర్బిట్(అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం 125 రోజులకు లాంగ్రేజియన్ బిందువు వద్ద ప్రవేశపెట్టి, 12 రోజుల తర్వాత సూర్యుడు సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద అధ్యయనం చేసి సూర్యునిపై రహస్యాలను భూమికి చేర్చుతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 90వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి మరో గ‘ఘన’విజయాన్ని నమోదు చేసుకున్నారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఆదిత్య ఎల్1 మిషన్ ఐదో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి, మూడో దశలు ఘన ఇంధనంతో.. రెండు, నాలుగు దశలు ద్రవ ఇంధనంతో నిర్వహించారు. ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైన 1.03.31 గంటల్లో (3,799.52 సెకన్లు) ప్రయోగాన్ని పూర్తి చేశారు. -
ఇస్రో ఆదిత్య-ఎల్ 1 మిషన్.. భగభగల గుట్టు విప్పేనా?
బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయోత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO).. సూర్యుడిపై తొలిసారిగా ప్రయోగానికి సిద్ధమైంది. భగభగలాడే సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహాన్ని శ్రీహరి కోట(ఏపీ) అంతరిక్ష కేంద్రం షార్ వేదిక నుంచి ప్రయోగించబోతోంది. కాసేపట్లో ఇస్రో రాకెట్ ‘పీఎస్ఎల్వీ సీ-57 ఆదిత్య ఎల్-1ను నింగిలోకి మోసకెళ్లనుంది. ఈ క్రమంలో ఈ మిషన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం.. సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యుడి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇస్రో ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనలకు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆ ప్రవేశపెట్టే ఎల్-1(లాగ్రేంజ్) పాయింట్.. భూమి నుంచి 9లక్షల మైళ్ల దూరం(15 లక్షల కి.మీల)లో ఉంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అదే భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే.. నాలుగు రెట్లు ఎక్కువ. మిషన్ ఇలా.. ‘ఆదిత్య-ఎల్ 1’ వ్యోమనౌకను తొలుత దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ పయనించిన అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించి ఎల్1 పాయింట్ వైపు మళ్లిస్తుంది ఇస్రో. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం (ఎస్ఓఐ) నుంచి బయటపడి, చివరికి ఎల్1 చుట్టూ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది. లాగ్రేంజ్ 1 ప్రాంతానికి చేరుకునేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ).. ఆదిత్య-ఎల్1లో కీలకం. ఇది సూర్యుడికి సంబంధించి ఇది ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలు ఇస్రోకు చేరవేస్తుంది. మొత్తంగా ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ)’తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్ ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. శక్తివంతమైన రాకెట్ ‘ఆదిత్య-ఎల్ 1’ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) రకం రాకెట్‌ను వినియోగిస్తున్నారు. పీఎస్ఎల్వీలో ఇది అత్యంత శక్తిమంతమైనది. 2008లో చంద్రయాన్-1 మిషన్‌లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)లో ఈ రకం రాకెట్లనే వినియోగించారు. సూర్యుడే టార్గెట్ ఎందుకంటే.. అంత దూరంలో ఉన్నప్పటికీ.. సూర్యుడే మనకు సమీప నక్షత్రం. భూమిపై సమస్త జీవరాశి మనుగడకు ఆధారం కూడా. అందువల్ల మిగతా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయడం మనకు అవసరం. పైగా ‘పాలపుంత’తో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడొచ్చు. మరోవైపు.. సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదలవుతుంటుంది. ఇది భూమి వైపు మళ్లినట్లయితే.. మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. ఇటువంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తద్వారా దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుంది అని ఇస్రో భావిస్తోంది. -
ISRO's Aditya-L1 Solar Mission: నేడే పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య–ఎల్1ను మోసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 12.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 23.40 గంటలు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని చేపడతారు. శుక్రవారం ఉదయం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ముందుగా శ్రీ చెంగాళమ్మ ఆలయం పూజలు చేసుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ముందుగా రాకెట్‌కు నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం ఆర్థరాత్రి దాటాక రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. పీఎస్–4 దశతో మరో సరికొత్త పరిశోధన: పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో మరో సరికొత్త పరిశోధనకు ఇస్రో శ్రీకారం చుట్టింది. నాలుగో దశతో వివిధ రకాల విన్యాసాలు చేసి 01.03.31 గంటలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఉపగ్రహాన్ని వదిలిపెట్టేందుకు ఇంత సమయం తీసుకున్న పరిస్థితి లేదు. ముందుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే కక్ష్య దూరం కూడా ఈసారి కొత్తగానే వుంది. అపోజి అంటే భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాంటిది కేవలం 19,500 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన తరువాత రెండు రకాల విన్యాసాలను చేసి కక్ష్య దూరాలను పరిశోధించే పనిని చేపడుతున్నారు. ఎంఓఎన్ పాసివేషన్ పేరుతో 4042.52 సెకన్లకు ఒకసారి, ఎంఎంహెచ్ పాసివేషన్ పేరుతో 4382.52 సెకన్లకు ఒకసారి రీస్టార్ట్ చేసి సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. రోజుకు 1,440 చిత్రాలు ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు. ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది. ► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు. ► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది. ► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది. ► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు. ► మళ్లీ నాలుగోదశ (పీఎస్–4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు. ► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు. -
సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? ► ఆదిత్య–ఎల్1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. ఆదిత్య–ఎల్1లో పేలోడ్స్ ఇవే.. సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) ఉంటాయి. -
Chandrayaan-3: రోవర్‌కు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు పంపిన రోవర్‌కు చంద్రుడిపై పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండర్ నుంచి విడుదలైన రోవర్ చంద్రుడిపై తిరుగుతూ పలు రకాల పరిశోధనలు చేస్తూ భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది. రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు నాలుగు మీటర్లు వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. అయితే, బిలాన్ని మూడుమీటర్ల దూరంలో ఉండగానే రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ప్రమాదవశాత్తూ ఆ బిలంలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొంది. ప్రత్యేక ఆదేశాలతో మరో దారిని రోవర్ ఎంచుకుందని వివరించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో ముందుకు సాగుతోందని ఇస్రో సోమవారం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. రోవర్ తప్పించుకున్న బిలం ఇదే.. దారిమళ్లిన రోవర్ గుర్తులు -
Aditya-L1: 2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం
బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్ ఘన విజయంతో భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమయింది. సౌర వాతావరణంపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా సెప్టెంబర్ రెండో తేదీన ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పూర్తి దేశీయంగా అభివృద్ధి పరిచిన ఈ శాటిలైట్‌ను రెండు వారాల క్రితమే శ్రీహరి కోటకు తరలించారు. సూర్యుడి వెలుపల పొరలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణ మండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై ఆదిత్య–ఎల్1 అధ్యయనం జరుపుతుంది. సౌర వాతావరణంతోపాటు అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణంపై దాని ప్రభావాన్ని ఇది అధ్యయనం చేస్తుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. నిరాటంకంగా పరిశోధనలు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజ్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజ్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజ్ పాయింట్ల వద్ద ఉపగ్రహాలు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగడంతోపాటు నిర్దేశిత లక్ష్యాలను అందుకునే అవకాశముంటుందని అంచనా. ఈ కక్ష్యలో ఉండే ఆదిత్య–ఎల్1కు గ్రహణాలు, ఇతర గ్రహాలు అడ్డురావు. పరిశోధనలను నిరాటంకంగా జరిపేందుకు వీలుగా ఉంటుందని ఇస్రో తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో.. సుమారు 1,500 కేజీల బరువైన ఈ శాటిలైట్‌లో ఏడు పేలోడ్లు ఉన్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్(ఐఐఏ) ఆధ్వర్యంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్‌ను తయారు చేసింది. పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ అస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ)ని తయారు చేశారు. సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే కాగా, కొరోనా వద్ద 10 లక్షల డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండటానికి కారణాలపై వీఈఎస్సీ వివరాలు సేకరించనుందని ఇస్రో వివరించింది. యూవీ పేలోడ్‌ను, ఎక్స్‌రే పేలోడ్స్‌ను వినియోగించుకుంటూ కొరోనాతోపాటు సోలార్ క్రోమోస్ఫియర్లపై ఆదిత్య–ఎల్1 పరిశీలనలు జరపనుంది. స్పెషల్ వాంటేజ్ పాయింట్ ఎల్1ను ఉపయోగించుకుని నాలుగు పేలోడ్లు సూర్యుడిపై ప్రత్యక్ష పరిశీలన జరుపుతాయి. మిగతా మూడు పేలోడ్లలో అమర్చిన పరికరాలు సూర్య కణాలపై పరిశోధనలు సాగిస్తాయి. కొరోనాలో ఉండే మితిమీరిన ఉష్ణోగ్రతలు, కొరోనల్ మాస్ ఇంజెక్షన్(సీఎంఈ), అంతరిక్ష వాతావరణం వంటి వాటిపైనా ఎస్‌యూఐటీ అత్యంత కీలకమైన సమాచారం పంపుతుందని ఆశిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. -
చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు
సూళ్లూరుపేట: చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన విక్రమ్ ల్యాండర్లో అమర్చిన చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశాం. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అక్కడున్నాయి. మేం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ’అని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు. ‘అదేవిధంగా, ఈ పేలోడ్‌లో అమర్చిన కంట్రోల్డ్ పెన్ట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి. ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు. ‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. ఈ పేలోడ్‌ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో స్పేస్ ఫిజిక్స్ లా»ొరేటరీ, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్టికేషన్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. రోవర్‌పై జాతీయ జెండా, ఇస్రో సింబల్ ల్యాండర్ నుంచి విడిపోయి రోవర్ చంద్రుడిపై నెమ్మదిగా అడుగులు వేస్తూ చంద్రుడిపై పరిశోధనలు ఇప్పటికే ప్రారంభించేసింది. చంద్రుడిపై రోవర్ దిగిన వెంటనే భారత ప్రభుత్వం మూడు సింహాలు గుర్తు, ఇస్రో సింబల్‌ను చంద్రుడిపై ముద్రించింది. జాతీయ జెండా, ఇస్రో సింబల్ రోవర్ మీదున్న ఛాయాచిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. ప్రస్తుతం ల్యాండర్లో అమర్చిన పేలోడ్స్, రోవర్లో అమర్చిన పేలోడ్స్ తమ పనిని చేసుకుంటూ ఇ్రస్టాక్ కేంద్రానికి సమాచారాన్ని అందిస్తున్నాయి. -
2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
బెంగళూరు: చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమయ్యేలా ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ‘‘ఆదిత్య–ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2న జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చాం’’ అని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయోగం విశేషాలివే.. ► భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు ► భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది ► లాంగ్రేజియన్1 పాయింట్లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు. ► ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు ► సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్1 అధ్యయనం చేస్తుంది. ► సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది. ► మొత్తం ఏడు పే లోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది రికార్డే ► ఇస్రో చరిత్రలో 2023 ఒక రికార్డుగా మిగిలిపోనుంది. సూర్య చంద్రుల లోతుల్ని తెలుసుకోవడానికి రెండు నెలల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేయడం చరిత్రే మరి. చంద్రయాన్–3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో ఇప్పుడు అన్ని దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆదిత్య–ఎల్1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందనే విశ్వాసం ఏర్పడింది. 2024 చివరికి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి భారతీయుల మరో స్వప్నాన్ని తీర్చాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఊహాచిత్రం -
Chandrayaan-3: ల్యాండర్ నుంచి చంద్రుడిపైకి ప్రజ్ఞాన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్ నుంచి ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తున్న వీడియోను, ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. వీటిని ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియో, ఫొటోలను విక్రమ్‌లోని ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీటిని చిత్రీకరించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి ఇప్పటిదాకా 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
Chandrayaan-3: జాబిల్లిపై భారత్ నడక
బెంగళూరు/న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచి్చ, తన కార్యాచరణ ప్రారంభించింది. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూ భూమిపైకి విలువైన సమాచారాన్ని చేరవేస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై నిరి్వఘ్నంగా అడుగుపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ‘చందమామపై భారత్ నడుస్తోంది’’ అని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. చంద్రుడి కోసం భారత్‌లో తయారు చేసిన ఈ రోవర్ ల్యాండర్ నుంచి బయటకు అడుగుపెట్టి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా నడక ప్రారంభించిందని వెల్లడించింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి గురించి మన పరిజ్ఞానం మరింత పెరగడానికి ప్రజ్ఞాన్ దోహదపడుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం పెరుగుతుందా? చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచి్చంది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి రోవర్ సౌరశక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్‌గా మార్చుకొని పరిశోధనలు కొనసాగించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ల్యాండర్, రోవర్ల మొత్తం బరువు 1,752 కిలోలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 14 రోజులపాటు పనిచేసేలా వీటిని రూపొందించారు. లూనార్ డే ముగిసిన తర్వాత కూడా వాటిలో జీవం నిండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. సూర్యకాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్ చక్కగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ విజయం పట్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. గురువారం గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3కు సంబంధించిన ప్రత్యేక యానిమేటెడ్ చిత్రం ప్రత్యక్షమయ్యింది. ఇందులో గూగుల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు అంతరిక్షంలో నక్షత్రల్లాగా తేలుతూ కనిపించాయి. రెండో అక్షరం చంద్రుడిలా దర్శనమిచి్చంది. 26న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో సైంటిస్టులను స్వయంగా కలిసి అభినందించడానికి ప్రధాని మోదీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సైంటిస్టులతో సమావేశమవుతారు. మనిషి మనుగడకు అవకాశం శివాజీనగర: చంద్రుని దక్షిణ ధ్రువం భవిష్యత్‌లో మానవాళి మనుగడకు వీలుగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. అందుకే చంద్రయాన్–3 ల్యాండర్ దిగటానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘మనం దాదాపు 70 డిగ్రీల దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్లాం, అక్కడ సూర్యరశ్మి తక్కువగా ఉండటానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. రోవర్ ద్వారా ఆ ప్రాంతం గురించి శాస్త్రీయంగా మరింత సమాచారం లభించే అవకాశముంది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మానవులు వెళ్లి అక్కడ నివాసాలను సృష్టించి ఆపై దాటి ప్రయాణించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెతుకుతున్నది ఉత్తమమైన ప్రదేశం. దక్షిణ ధ్రువం అలా ఉండేందుకు అవకాశముంది’అని ఆయన చెప్పారు. గురువారం ఆయన బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల నాలుగేళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించిందని అన్నారు. చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటకు వచి్చందని తెలిపారు. ‘నిర్దేశిత ప్రయోజనం కోసం దక్షిణ ధ్రువంపైన గుర్తించిన 4.5 కి.మీ. గీ 2.5 కి.మీ. ప్రాంతానికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోపు దూరంలోనే ల్యాండర్ దిగింది. రోవర్‌లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు నిర్దేశించిన విధంగా పనిచేస్తున్నాయి’అని పేర్కొన్నారు. రోవర్ బయట తిరుగాడుతూ పరిశోధనల ప్రారంభించిందని చెప్పారు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను పరిశీలిస్తాయని చెప్పారు. రోబోటిక్ పాత్ ప్లానింగ్ కూడా చేయిస్తాయని తెలిపారు. -
ఆచంద్ర తారార్కం ఈ మహిళల కీర్తి
‘ఇస్రో’లో పనిచేసిన తొలి తరం మహిళా శాస్త్రవేత్తల మాటల్లో తరచు వినిపించే మాట...‘ఆరోజుల్లో ఇస్రోలో చా...లా తక్కువ మంది మహిళలు ఉండేవారు’ చంద్రయాన్–3కి సంబంధించి నిన్నటి ప్రత్యక్ష ప్రసారాన్ని గమనిస్తే... ఆ ప్రాజెక్ట్‌లో భాగమైన ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు ఉత్సాహంగా కనిపిస్తారు. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అది సంఖ్యాబలమే కాదు సామర్థ్య బలం కూడా. ‘ఇస్రో’ సాధించిన ఎన్నో విజయాలలో మహిళా శాస్త్రవేత్తలు భాగం అయ్యారు. ముఖ్యంగా ‘చంద్రయాన్–3’ ప్రాజెక్ట్‌లో రీతూ కరిధాల్ నుంచి కల్పనా కాళహస్తి వరకు ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు మేధోశ్రమ చేశారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఇస్రో సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను’ అని కలలు కనే ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే అసాధారణ విజయ గాధలు ఇవి. రాకెట్ ఉమన్: రీతూ కరిధాల్ అన్ని దశలను పూర్తి చేసుకొని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన క్షణం ఒక చారిత్రక సందర్భం. ఎంత కృషి చేస్తే ఒక విజయం సొంతం అవుతుందో చెప్పిన సందర్భం. అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన ‘చంద్రయాన్–3’లో భాగమైన అనేకమంది మహిళలలో రీతు కరిధాల్ ఒకరు. గత నెలలో... మూడు దశలను పూర్తి చేసుకొని చంద్రయాన్–3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి దూసుకెళ్లిన తరువాత ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్నోలోని ఒక ఇంట్లో ఆనందం అంబరాన్ని తాకింది. వారు ఆనందంతో బాణాసంచా కాల్చారు. మిఠాయిలను చుట్టుపక్కల వారికి పంచారు. ఇక నిన్నటి రోజు ఆ ఆనందం స్థాయి ఎల్లలు దాటి ఉండవచ్చు. ఇది కోట్లాదిమంది భారతీయుల ఇంట్లో కనిపించే సాధారణ దృశ్యమే కావచ్చు. కాని ఆ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఇంట్లో పుట్టిన రీతూ కరిధాల్ ప్రసిద్ధ చంద్రయాన్–3 మిషన్ డైరెక్టర్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీతుకు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి. అదేపనిగా నింగిలోకి చూసేది. ఏవేవో ఊహించుకునేది. అప్పటికి అవి శాస్త్రీయతకు నిలవని ఊహలు కావచ్చు. అయితే రీతూ కరిధాల్ శాస్త్రీయ రంగంలో దిగ్గజంగా వెలగడానికి ఉపకరించిన ఊహలు. కట్ చేస్తే.... 1997... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లోకి అడుగు పెట్టింది రీతు. చంద్రుడిపై అడుగు పెట్టినంత ఆనందంగా అనిపించింది. ‘ఇస్రో’ గురించి వింటూ, చదువుతూ పెరిగిన రీతు అదే ‘ఇస్రో’లో ‘మిషన్ ఎనాలసిస్ డివిజన్’లో ఉద్యోగిగా చేరింది. అప్పట్లో ‘ఇస్రో’లో తక్కువ మంది మహిళలు పనిచేసేవారు. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్లేది. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. అయినా సరే, ఎప్పుడూ భయపడేది కాదు. అసలు సిసలు భయం మాత్రం తొలి టాస్క్ రూపంలో ఎదురైంది. ‘నేను చేయగలనా?’ అని మొదట ఆందోళన పడింది రీతు. చేతులెత్తేయడం తేలిక. ‘చేయగలను’ అనుకోవడం కష్టం. అయితే కష్టపడే వారే విజేతలవుతారు.‘యస్ నేను చేయగలను’ అంటూ తొలి టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసి ‘భేష్’ అనిపించుకుంది. ‘నాకు అప్పగించిన టాస్క్‌ను సీనియర్లు చేసే అవకాశం ఉన్నప్పటికీ నన్ను వెదుక్కుంటూ వచ్చింది. ఇది నన్ను పరీక్షించడానికి వచ్చిందా? అదృష్టవశాత్తు వచ్చిందా? అనేది తెలియదుగానీ నా విజయానికి కారణం... ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ చదువుకున్నాననే ధైర్యం కంటే నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసం’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది రీతు. ఆ ఆత్మవిశ్వాసం అప్పుడే కాదు ఇప్పటికీ రీతు వెన్నంటే ఉంది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రతిష్ఠాత్మకమైన ‘మంగళయాన్ మిషన్’లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా, చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్‌గా పనిచేయడానికి ఇంధనంగా మారింది. చంద్రయాన్–3తో రీతూ కరిధాల్ ఒక చారిత్రక విజయంలో భాగం అయింది. శాస్త్రవేత్తలు కావాలనుకునే కలలు కనే అమ్మాయిలకు రీతు కరిధాల్ స్ఫూర్తి ఇస్తుంది. ‘నా విజయ మంత్రం ఇది’ అని ఆమె ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్పలేదుగానీ పరోక్షంగా వినిపించే మాట...టైమ్ మేనేజ్మెంట్. కాలం విలువ తెలిసిన వారే ‘టైమ్ మేనేజ్మెంట్’ను ఇష్టంగా ఆచరిస్తారు. ఆ ఆచరణే ఎన్నో విజయాలను బహుమానంగా ఇస్తుంది. స్ఫూర్తిదాయక శక్తిమంతులు స్పేస్ మిషన్లలో భాగమైన మహిళా శాస్త్రవేత్తల గురించి మిన్నీ వేద్ ‘దోజ్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ స్టోరీస్’ అనే స్ఫూర్తియదాయకమైన పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకంలో ‘రాకెట్ ఉమెన్’గా పేరు గాంచిన రీతూ కరిధాల్ సక్సెస్ స్టోరీ కూడా ఉంది. ‘కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాను. వృత్తిపరమైన విజయాలకు కుటుంబమే పెద్ద బలం’ అంటుంది రీతు. ‘ఇస్రో’లో రీతులాగే ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు ఉన్నతస్థానాల్లో ఉన్నారు. అయితే ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదని వారి ప్రయాణాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ‘ఇస్రో’లో పనిచేయాలని అనుకోవడానికి కారణం నుంచి... ఎదుర్కొన్న ఒత్తిళ్ల వరకు వారి మాటల్లో కనిపిస్తాయి. ఇస్రో స్పేస్ సైన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేసిన సీతా సోమసుందరం ఇలా అంటోంది... ‘నేను ఇస్రోలో చేరిన కాలంలో ఇంజనీరింగ్, సైన్స్‌లలో మహిళలు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కొందరు సీనియర్లకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. అందులో ఒకటి... మహిళలు ఎక్కువగా కష్టపడలేరు. పరిమిత పనిగంటల్లోనే పనిచేయగలరు. ఇంటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంకితభావం ఉండదు. అయితే ఇది తప్పుడు భావన అని ఇస్రోలో ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు నిరూపించారు’. ‘ఏదో ఉద్యోగం చేస్తున్నాను అనే భావన కాకుండా విజయంలో భాగం కావాలనే సంకల్ప బలం మహిళా శాస్త్రవేత్తలలో కనిపిస్తుంది. ఎన్నో విజయాలలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించారు. డెడ్ లైన్లను సవాలుగా తీసుకోవడం నుంచి మిషన్, నేవిగేషన్, కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్, స్పేస్ క్రాఫ్ట్ డిజైన్, ట్రాకింగ్‌లాంటి మేజర్ ఏరియాలలో కీలక పాత్ర పోషించి తమ సత్తా చాటారు’ అంటుంది మంగళ్యాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేసిన ఎస్.అరుణ. స్పేస్ సైంటిస్ట్‌లు అనగానే ఏవో గంభీరమై ఊహలు తారసపడతాయి. అయితే ఈ ఉమెన్ స్పేస్ సైంటిస్ట్‌ల మాటలు విన్న తరువాత ‘అందరిలాగే సాధారణ జీవితం... కానీ అసాధారణ సంకల్ప బలం’ అనే సత్యం ఆవిష్కారం అవుతుంది. ‘ఇస్రోకు చైర్ ఉమన్ (చైర్ పర్సన్) ఎప్పుడూ?’ అనే ప్రశ్న వస్తుంటుంది. ‘ఇస్రో’ విజయాలలో భాగం అవుతున్న మహిళల అంకితభావాన్ని చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు’ అనిపిస్తుంది. ‘ఇస్రో’లో జెండర్–న్యూట్రల్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందనే మంచి మాటలు కూడా దీనికి కారణం. కొన్నిసార్లు లోతైన భావాలు పలకడానికి పదాలు, పుస్తకాలు తెల్లముఖం వేస్తాయి. కళ్లు మాత్రమే నిశ్శబ్దంగా చెబుతాయి. చంద్రయాన్–3 ల్యాండింగ్‌కు సంబంధించి నిన్నటి టీవీ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శాస్త్రవేత్తల కళ్లలో కనిపించిన ఉత్సాహాన్ని, అంకితభావాన్ని గమనిస్తే ఇంకా ఎన్నో విజయాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయని అనిపిస్తుంది. సంతోష క్షణాలు: కల్పనా కాళహస్తి కల్పనా కాళహస్తిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా. చెన్నైలో బి.టెక్ (ఈసీఈ) చదివారు. తండ్రి మద్రాసు హైకోర్టులో ఉద్యోగి. తల్లి గృహిణి. ఇస్రోలో పనిచేయాలని తన చిన్ననాటి నుంచి కలలు కనేది. అనుకున్నట్టుగానే 2000 సంవత్సరంలో ఇస్రోలో చేరారు. తొలుత శ్రీహరికోటలో ఐదేళ్లు పనిచేశాక బెంగళూరులోని శాటిౖలñ ట్ సెంటర్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. కరోనా పాండమిక్ సమయంలో అనేక అవాంతరాలు వచ్చినప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ ‘చంద్రయాన్–3’ మిషన్‌లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈమె గతంలో చంద్రయాన్–2, మంగళయాన్ ప్రాజెక్టుల్లోనూ కీలక బాధ్యతల్ని నెరవేర్చారు. ఆమె నైపుణ్యం, అంకితభావం, దూరదృష్టి వంటివి మిషన్ విజయవంతం కావడంతో గణనీయంగా తోడ్పడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇవి చాలా సంతోషభరితమైన క్షణాలుగా ఎప్పటికీ ఉండిపోతాయి. చంద్రయాన్ 2 కాలం నుంచి లభ్యమైన ఎన్నో అనుభవాలతో ఈ మిషన్‌ను లోప రహితంగా రూపొందించాం అని చెప్పారు. వినిపించే గొంతుక: పి.మాధురి శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ప్రజలకు బయటికి కనపడే అక్కడి సిబ్బంది/ సైంటిస్టుల్లో పిల్లల మాధురి ఒకరు. ఈమె షార్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ సమయంలో వినిపించే వ్యాఖ్యానాలు, ప్రజలకు వివరించే అంశాల గొంతుక ఆమెదే. వీళ్లే కాకుండా చంద్రయాన్–3 మిషన్‌లో మొత్తం 54 మంది మహిళా సైంటిస్టులు / ఉద్యోగులు / సిబ్బంది ఉన్నారు. వీళ్లలో చాలా మంది మహిళలు ఎంతో కీలకమైన బాధ్యతలు నెరవేర్చే డిప్యూటీ డైరెక్టర్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ స్థాయి నుంచి అనేక స్థాయుల్లో పనిచేస్తూ... కీలకమైన, భారత్‌కు గర్వకారణమైన ఈ ప్రాజెక్టును విజయవంతం చేశారు. -
చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను అధ్యయనం చేయడం కోసం ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్–3 ప్రయోగం చేపట్టారు. ఈ మిషన్‌లో 5 ఇస్రో పేలోడ్స్, నాసాకు చెందిన ఒక పేలోడ్‌ను పంపించారు. ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలంపై దించి పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో సూర్యరశ్మి సోకదని, చీకటిగా ఉంటుందని చెబుతున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్) నుంచి అటు భూమిని, ఇటు చంద్రుడిని అధ్యయనం చేయడానికి ‘ఆర్బిటార్ స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్’అనే ఒక సైంటిఫిక్ పరికరం అమర్చి పంపారు. ఈ సైంటిఫిక్ పేలోడ్‌తో ముఖ్యంగా చంద్రుడి ఉపరితలం నివాసయోగ్యంగా ఉందా? అనేది అధ్యయనం చేస్తారు. అలాగే చంద్రుడిపై జరుగుతున్న మార్పులను తెలుసుకోవచ్చు. జాబిల్లిని అధ్యయనం చేయడానికి ఇది ప్రయోగాత్మక పేలోడ్ కావడం విశేషం. ల్యాండర్లో పేలోడ్స్ ఇవీ... ► ల్యాండర్లో మూడు పేలోడ్స్ ఉన్నాయి. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ (రంభ–ఎల్పీ) అనే సైంటిఫిక్ పేలోడ్‌తో చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎల్రక్టాన్లు, చంద్రుడి అంతర్భాగం దాగి ఉన్న ఖనిజాలపై పరిశోధన చేస్తారు. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్»ౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ అనే పేలోడ్స్‌తో చంద్రుడిపై లాండింగ్ సైట్ చుట్టూ ప్రకంపనలను గుర్తిస్తారు. రోవర్‌లోని పేలోడ్స్ ► చంద్రుడి ఉపరితలం మూలక కూర్పును అధ్యయనం చేయడానికి రోవర్లో రెండు సైంటిఫిక్ పరికరాలను అమర్చి పంపారు. ఇందులో అల్ఫా పారి్టకల్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్‌తో చంద్రుడిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధిస్తారు. చంద్రుడిపై రసాయనాలుంటే వాటిని కూర్పు చేయడానికి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పేలోడ్‌తో చంద్రుడిపై రాళ్లను అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా చంద్రుడిపై నేల స్వభావం ఎలా ఉందో గుర్తిస్తారు. ► గ్యాస్, ప్లాస్మా పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి, చంద్రశ్రేణి అధ్యయనాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ శ్రేణి అనే ఒక సైంటిఫిక్ పరికరాన్ని కూడా రోవర్లో అమర్చారు. ఇది కూడా చంద్రుడిపై మరింత అధ్యయనం కోసమే. -
చంద్రయాన్ –3 తరువాత?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన రెండో ప్రయత్నంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేయడంలో విజయం సాధించింది. భవిష్యత్తు ఏమిటన్న విషయానికి క్లుప్తంగా ఇవ్వగలిగిన సమాధానం ఆకాశమే హద్దుగా అంతరిక్ష రంగంలో మనదైన ముద్రను వేయడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే రష్యా, ఇజ్రాయెల్‌లు రెండూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు విఫలయత్నం చేశాయి. భారత్ మాత్రమే విజయం సాధించగలిగింది. కచ్చితంగా ఇది భారత శాస్త్రవేత్తల సునిశిత ప్లానింగ్, ఆలోచన, నిబద్ధతలకు ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి చంద్రయాన్–3 తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో వైపు చూసే దేశాల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత అంతరిక్ష ప్రయోగ మార్కెట్ విలువ దాదాపు 800 కోట్ల డాలర్లని అంచనా. 2040 నాటికి ఇది ఐదు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే ఒక అంచనా ఉండగా.. చంద్రయాన్–3 విజయం ఈ లక్ష్యాన్ని మరింత ముందుగానే అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కొన్నేళ్లుగా భారత అంతరిక్ష రంగం ఇతర దేశాల కంటే రెట్టింపు వేగంతో ఎదుగుతున్న విషయం తెలిసిందే. కలిసొచ్చే జుగాడ్... చంద్రయాన్ –3 ఖర్చు రూ.600 కోట్లు ఉంటే.. ఇంతే స్థాయి అంతరిక్ష ప్రయోగానికి విదేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది ఇప్పటికే మనకు అనుభవమైన విషయం. అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలగడం ఇస్రో ప్రత్యేకతగా మారింది. కాబట్టి సొంతంగా ఉపగ్రహాలు పంపుకోలేని చాలా దేశాలిప్పుడు భారత్‌ను ఆశ్రయిస్తాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇస్రోకు నేరుగా ప్రయోజనం కలిగితే ఈ సంస్థకు విడిభాగాలు, సామాన్లు సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలు బోలెడన్ని లాభాలు చవిచూస్తాయి. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్శించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రయాన్–3 విజయం చాలా కీలకం కానుంది. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, లేదా సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు, ఇతర అవసరాలకు వేర్వేరు శక్తిసామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్ లాంఛ్ వెహికల్ కలిగి ఉండటం ఇస్రోకు లాభించే ఇంకో అంశం. భవిష్యత్తు అవసరాల కోసం? 1972 తరువాత భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై మనిషి కాలుపెట్టలేదు. అయితే అక్కడ నీరు ఉందన్న విషయం స్పష్టమైన తరువాత చాలా దేశాలు వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా తన ఆర్టిమిస్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఏడాదికల్లా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, అక్కడే ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. జాబిల్లిపై నీటితోపాటు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాలుష్యరహితమైన, అత్యంత సమర్థమైన హీలియం–3 ఆ వనరుల్లో ఒకటి. భవిష్యత్తులో జాబిల్లిపైని వనరులను వాడుకునే అవకాశం లభిస్తే (శుద్ధి, రవాణా వంటి వాటికి తగిన టెక్నాలజీలు అభివృద్ధి చేసుకోవాలి) అందులో భారత్‌కూ భాగస్వామ్యం లభించేందుకు చంద్రయాన్–3 విజయం సాయపడుతుంది. అలాగే జాబిల్లిని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను అన్వేషించాలని, అంగారకుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనిషి చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు. ఈ ప్రస్థానంలో జాబిల్లి దక్షిణ ధ్రువం మాదిరిగా ఇతర గ్రహాలపైని అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని వ్యోమనౌకలను ల్యాండ్ చేయడమెలా అన్నది తెలిసిన వారి అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇస్రో ఇప్పటికే అనేక దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. పరిశోధనల్లోనూ భాగస్వామిగా నిలిచింది. ఈ అనుభవమంతా భవిష్యత్తులో అంతరిక్షాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకునే సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత ప్రకటిత లక్ష్యానికి తగిన విధానాలను రూపొందించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రయాన్–3 ప్రయాణం సాగిందిలా ..
గత ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్–3 ఫస్ట్‌లుక్‌ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్‌ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్–19తో ఆలస్యమైంది. ఈ మిషన్ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పూర్తయింది. చంద్రయాన్–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్–3 మూడు భాగాలుగా ఉంది. 1. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం) 2. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) 3. రోవర్ ► చంద్రయాన్ ల్యాండర్ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్‌గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై ఈ ల్యాండర్ (విక్రమ్) దిగిన తర్వాత రోవర్ (ప్రజ్ఞాన్) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని చేస్తాయి. ల్యాండర్, రోవర్లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్ పే లోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ► ఇక ల్యాండర్ మాడ్యూల్‌ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి. ► చంద్రయాన్–3 మిషన్ లాంచ్‌వెహికల్ మార్క్–3 (ఎల్వీఎం–3) రాకెట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక ప్రయాణించి సూపర్ సక్సెస్ కొట్టింది. ► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్–3 మిషన్‌ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు. ► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164‘‘18074 ఎత్తుకు చేరుకుంది. ► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్–3 చంద్రుడికి మరింత చేరువైంది. ► ఆగస్టు 18న ల్యాండర్ మాడ్యూల్లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► చంద్రయాన్–3లో మరో కీలకఘట్టం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. ► ల్యాండర్ మాడ్యూల్ చిట్టచివరి డీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించింది ► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్ విక్రమ్ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ దిగడంతో భారత్ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది. ► రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది. -
మువ్వన్నెల చంద్రహాసం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంçస్థ(ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన నాలుగో దేశంగా మరో ఘనత సాధించింది. రష్యా ల్యాండర్ లూనా–25 విఫలమైన చోటే భారత్ విజయపతాక ఎగురవేసింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించింది. దేశ ప్రజలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా పండుగను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది. చందమామపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైంది. ఈ ప్రయోగంలో అంతర్భాగమైన ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను సున్నితంగా ముద్దాడింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా అడుగుపెట్టింది. దేశ ప్రజలంతా ఈ అద్భుతాన్ని ఉత్కంఠతో వీక్షించారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోను వివిధ దేశాల అధినేతలు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటల అనంతరం రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుంచి సురక్షితంగా బయటకు అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపైకి చేరుకొని తన కార్యాచరణ ప్రారంభించింది. రెండు వారాల పాటు ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేస్తుంది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. అత్యంత అరుదైన ఘనత ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకు 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనతను భారత్ తన ఖాతాలో వేసుకుంది. చంద్రయాన్–2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని, పొరపాట్లను సరిదిద్దుకొని చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్‌ను సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై భద్రంగా దించి ప్రపంచాన్ని అబ్బురపర్చింది. 140 కోట్ల మంది ఆశలను నెరవేర్చింది. టీవీలకు అతుక్కుపోయి ఏమవుతుందో అని ఆతృతగా ఎదురుచూసిన వారికి అంతులేని ఆనందాన్ని పంచింది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఈ విన్యాసాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకపోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం పూర్తయ్యింది. ల్యాండింగ్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. నిమిషాలు తీవ్ర ఉత్కంఠ చంద్రయాన్–3 మిషన్‌ను ఇస్రో గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలుత భూమికి, చంద్రుడికి మధ్యలోని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్ని మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని పెంచారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్నే మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని తగ్గించారు. దాంతో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి దగ్గరవుతూ వచి్చంది. ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ తన నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ తరువాత ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి మరింత సమీపానికి చేర్చారు. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 37 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. కొద్దిసేపటికే ల్యాండర్‌లోని ల్యాండర్ హొరిజాంటల్ వెలాసిటీ కెమెరా (ఎల్‌హెచ్‌వీసీ) చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమిపైకి పంపించింది. జాబిల్లిపై దిగిన కొద్దిసేపటి తర్వాత ల్యాండర్‌కు, బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడింది. ఇప్పటికే చంద్రయాన్–1 ప్రయోగంలో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నారు. స్ఫటికాల రూపంలో నీరు ఉన్నట్లు గుర్తించారు. చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి మూలాలను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే? చంద్రయాన్–3 ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం సాఫ్ట్ ల్యాండింగ్. అధిక పీడనంతో గ్యాస్‌ను విరజిమ్ముతూ ల్యాండర్ చంద్రుడిపై దిగిన సమయంలో దుమ్ము ధూళీ పైకి లేచి కెమెరాల అద్దాలను, సెన్సార్లను కమ్మేస్తుంది. దీంతో ఇతర సైంటిఫిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ల్యాండర్ క్రాష్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. అందుకే దుమ్ము పైకి లేవకుండా ల్యాండర్‌ను మృదువుగా దించే ప్రక్రియనే సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. దీన్ని నాలుగు దశల్లో చేపట్టి, ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి దించారు. బయటకు వచి్చన రోవర్ సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా దిగింది. ల్యాండర్లో నుంచి రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచి్చంది. ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. సుమారు 500 మీటర్ల దూరం దాకా ప్రయాణించి అక్కడున్న స్థితిగతుల గురించి భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ దిగిన సందర్భంగా అందరూ పండుగ చేసుకునేలోపే రోవర్ కూడా విజయవంతంగా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాబిల్లిపై గర్జించిన సింహాలు..! చంద్రుడిపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్–3... ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లను కూడా జాబిల్లి ఉపరితలంపై శాశ్వతంగా, సగర్వంగా ముద్రించింది. ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్ వెనక చక్రాలు మన జాతీయ చిహ్నమైన మూడు సింహాలతో కూడిన అశోక చక్రాన్ని, ఇస్రో అధికారిక లోగోను చందమామ దక్షిణ ధ్రువం మీద ముద్రించాయి. తద్వారా చందమామ చెక్కిలిపై చెరగని సంతకం చేశాయి. ఇందుకు సంబంధించి ఇస్రో బుధవారం మధ్యాహ్నమే ముందస్తుగా విడుదల చేసిన కర్టెన్ రైజర్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అన్నట్టూ లాండర్, రోవర్ పని చేసేది కేవలం ఒక్క చంద్ర దినం పాటు మాత్రమేనట! అంటే భూమిపై 14 రోజులన్నట్టు!! అన్నీ అనుకూలించి, కాస్త అదృష్టమూ కలిసొస్తే అవి రెండూ మరో చంద్ర దినంపాటు పని చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది. -
Chandrayaan-3 Updates: మరింత దగ్గరగా చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్‌లో రెండో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్య దూరాన్ని మరోసారి తగ్గించారు. అందులోని ఇంధనాన్ని ఆదివారం వేకువజామున 2 గంటలకు స్వల్పంగా మండించి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను రెండోసారి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి 25x134 కిలోమీటర్లు ఎత్తుకు అంటే చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. మొదటి విడతలో 113 కిలోమీటర్ల దూరాన్ని 25 కిలోమీటర్లకు, 157 కిలోమీటర్ల దూరాన్ని 134 కిలోమీటర్ల తగ్గించి చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా తీసుకొచ్చారు. ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంవోఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) కేంద్రాల్లో శాస్త్రవేత్తలు 23న సాయంత్రం 5.37 గంటలకు ల్యాండర్ మాడ్యూల్లో ఉన్న ఇంధనాన్ని స్వల్పంగా మండించి 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దాదాపు 37 నిమిషాల పాటు జరగనున్న ఈ ఆపరేషన్ అత్యంత కీలకం కానుంది. చంద్రుడిపై దిగడం విజయవంతమైతే చంద్రయాన్–3 మిషన్ ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం దగ్గర పడడంతో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఉంది. రష్యా ప్రయోగించిన లూనా–25 మిషన్ చంద్రయాన్–2 తరహాలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని ఆఖరి దశలో విఫలైమంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో కూడా ఒకింత ఆందోళన మొదలైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తి చూస్తున్న ఈవెంట్‌ను 23న సాయంత్రం 5.27 గంటలకు ప్రత్యక్షప్రసారాన్ని కల్పిస్తున్నారు. చంద్రయాన్–3లో ల్యాండర్ చంద్రుడిపై దిగే అంశంలో ఇస్రో వెబ్సైట్, యూట్యూబ్, పేస్బుక్, డీడీ నేషనల్ టీవీ చానెల్‌తో సహా బహుళఫ్లాట్ఫారమ్ల ద్వారా అందుబాటులో ఉంచారు. -
ఫ్లాష్ బ్యాక్: ఒక ఉపగ్రహం కూలిన వేళ
కొన్నేళ్ల క్రితం చంద్రయాన్–2ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేలకూలి్చన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఇస్రో నేలకూలి్చన శాటిలైట్లలో అదే మొదటిది కాదు. చంద్రయాన్ 1ను పదేళ్ల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. అది 2008. నవంబర్ 14. మధ్యాహ్న వేళ. ఉక్కపోత చుక్కలు చూపుతోంది. గుజరాత్‌లోని రాజ్ కోట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ శివాలెత్తుతున్నాడు. మహా మహా ఇంగ్లండ్ పేస్ బౌలర్లను వీర బాదుడు బాదుతున్నాడు. కేవలం 78 బంతుల్లో అతను చేసిన 138 పరుగుల సాయంతో భారత్ మరపురాని విజయం సాధించింది. దేశమంతా సంబరాల్లో మునిగి పోయింది. కానీ, అదే సమయంలో అక్కడికి 1,600 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో పరిస్థితి మరోలా ఉంది. మరో దారిలేని పరిస్థితుల్లో, ఒక మినీ విస్ఫోటనానికి ఇస్రో భారంగా సిద్ధమవుతోంది. ఎందుకా విస్ఫోటనం? ఏమా కథ? అసలేం జరిగింది? చూద్దాం రండి...! 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. భూ కక్ష్యకు ఆవలికి శాటిలైట్‌ను పంపడం భారత్‌కు అదే తొలిసారి. అప్పటిదాకా రష్యా, అమెరికా, జపాన్, యూరప్ స్పేస్ ఏజెన్సీల పేరిట ఉన్న ఘనత అది. చంద్రునిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా ప్రపంచానికి పట్టిచి్చన ప్రయోగంగా చంద్రయాన్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే అందరికీ తెలిసిన ఈ ఘనత వెనక బయటికి తెలియని మరో గాథ దాగుంది... ప్రోబ్... కూలేందుకే ఎగిరింది చంద్రయాన్ లో భాగంగా 32 కిలోల బరువున్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రునిపైకి పంపింది ఇస్రో. ► 2008 నవంబర్ 17వ తేదీ రాత్రి 8 గంటల వేళ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రుని ఉపరితలం మీద కావాలనే కుప్పకూల్చేందుకు సిద్ధమైంది. ► అందులో భాగంగా చంద్రునికి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రోబ్ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. ► చంద్రయాన్ కక్ష్య నుంచి క్రమంగా విడివడటం మొదలు పెట్టింది. ► దానిలోని స్పినప్ రాకెట్లు జీవం పోసుకుని గర్జించాయి. అయితే, ప్రోబ్ వేగాన్ని పెంచేందుకు కాదు, వీలైనంత తగ్గించేందుకు! చంద్రుని ఉపరితలం కేసి తిప్పి అనుకున్న విధంగా క్రాష్ చేసేందుకు!! ► ఎట్టకేలకు, చంద్రయాన్ మిషన్ నుంచి విడివడి అరగంటకు క్రాష్ ల్యాండ్ అయింది. ప్రోబ్ కథ అలా కంచికి చేరింది. ► తద్వారా, అంతదాకా అందరాని చందమామతో తొలిసారిగా కరచాలనం చేసి ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ మూడింటి ముచ్చట్లు ప్రోబ్ లో మూడు పరికరాలను ఇస్రో పంపింది. అవి ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపే వీడియో ఇమేజింగ్ సిస్టం, ప్రోబ్ చంద్రునిపైకి పడ్డ వేగాన్ని కొలిచేందుకు రాడార్ ఆల్టిమీటర్, చంద్రుని వాతావరణాన్ని విశ్లేíÙంచేందుకు మాస్ స్పెక్ట్రం మీటర్. భావికి బాటలు... కూల్చేయడమే అంతిమ లక్ష్యంగా ఇస్రో ప్రయోగించిన ’విఫల’ చంద్రయాన్ మిషన్ తర్వాతి రోజుల్లో చంద్రయాన్–2, చంద్రయాన్ –3 ప్రయోగాలకు బాటలు వేసింది. ఆగస్ట్ 23న చంద్రునిపై సగర్వంగా దిగి చంద్రయాన్–3 సాధించబోయే అంతిమ విజయం కోసం దేశమంతా ఇప్పుడు ఎదురు చూసేందుకు మూల కారణంగా నిలిచింది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రయాన్-3.. అడుగు దూరంలో విక్రమ్
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3లో కీలకఘట్టాలు దాదాపు పూర్తయ్యాయి. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటాక అధికారిక ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిచేరువ కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అంటే.. ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే ఇస్రో అనుకున్న తేదీనే చంద్రుడి దక్షిణధ్రువంపై ల్యాండ్ కానుంది. ‘‘ రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది’’ అని ఇస్రో ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. Chandrayaan-3 Mission: The second and final deboosting operation has successfully reduced the LM orbit to 25 km x 134 km. The module would undergo internal checks and await the sun-rise at the designated landing site. The powered descent is expected to commence on August… pic.twitter.com/7ygrlW8GQ5 — ISRO (@isro) August 19, 2023 ఇదీ చదవండి: జాబిల్లిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే.. -
జాబిల్లికి చేరువగా ల్యాండర్ మాడ్యూల్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ల్యాండర్ మాడ్యూల్ చందమామకు మరింత చేరువగా వచ్చింది. మాడ్యూల్‌లోని ఇంధనాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్వల్పంగా మండించి లూనార్ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి 113గీ157 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది. ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞాన్’తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ నెల 20న తెల్లవారుజామున 2 గంటలకు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నారు. ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్లనున్నారు. రెండో విడత కక్ష్య దూరం తగ్గింపు అనంతరం ఈ నెల 23న ల్యాండర్ మాడ్యూల్‌ను కక్ష్య దూరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియ నిర్వహిస్తారు. చంద్రుడి ఫొటోలు పంపించిన చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ చందమామకు 113 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా చిత్రీకరించిన ఛాయాచిత్రాలు, వీడియోలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. చంద్రయాన్–3 వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్పీడీసీ) ఆగస్టు 15న, ల్యాండర్ ఇమేజర్(ఎల్ఐ) కెమెరా–1 ఆగస్టు 17న ఈ చిత్రాలు, వీడియోలను చిత్రీకరించాయి. భూ నియంత్రిత కేంద్రానికి పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై మట్టి దిబ్బలు, అఖాతాలు ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
చంద్రయాన్-3 మిషన్‌లో మరో కీలక మైలురాయి
-
చంద్రయాన్–3కి నాలుగోసారి కక్ష్య తగ్గింపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 177 కిలోమీటర్లు, దూరంగా 150 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్–3 మిషన్‌కు నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కక్ష్య దూరాన్ని వంద కిలోమీటర్లకు తగ్గించే ప్రక్రియను ఈనెల 17న చేపట్టనున్నారు. అయితే రష్యా ప్రయోగించిన లూనా–25 అనే మిషన్ చంద్రుడిపైన దిగింది. చంద్రుని ఉపరితలంపై ఈ నెల 23న దక్షిణ ధృవంలో దిగబోయే మొట్టమొదటి మిషన్ చంద్రయాన్–3దే పై చేయి అవుతుంది. -
చంద్రయాన్–3 కక్ష్య తగ్గింపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ప్రస్తుతం లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 170 కిలోమీటర్లు, దూరంగా 4,313 కి.మీ. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా చంద్రుడ్ని అత్యంత దగ్గరగా వీడియో తీసి భూ నియంత్రిత కేంద్రానికి పంపింది. ఆదివారం రాత్రి చంద్రునిపై మొదటి అర్బిట్ రైజింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఆర్బిట్ రైజింగ్ చేసే క్రమంలో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ప్రొపల్షన్ మాడ్యూల్లో అమర్చిన కెమెరాలు చంద్రుడికి దగ్గరగా వెళ్లినపుడు 45 సెకండ్లపాటు తీసిన వీడియోను ఇస్రో సోమవారం విడుదల చేసింది. లూనార్ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గిస్తూ 23వ తేదీ నాటికి చంద్రుడికి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చంద్రుడి చెంతకు తీసుకొస్తారు. -
25న మళ్లీ చంద్రయాన్–3 కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ నుంచి ఈనెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్‌కు ఈనెల 25న అయిదోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రం శాస్త్రవేత్తలు 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు. భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్‌తో చంద్రయాన్–3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడ్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తుంది. ఆగస్ట్ 1 నాటికి చంద్రయాన్–3 లూనార్ ఆర్బిట్ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్క డ నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరి్రభమిస్తూ ఆగస్ట్ 23న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్‌ను విడిచి పెడుతుంది. అదే రోజు సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. -
గగన్‌యాన్ ఎస్‌ఎంపీఎస్ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రపొల్షన్ సిస్టం (ఎస్‌ఎంపీఎస్)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రోకు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్టుగా గురువారం ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలో 440 ఎన్ థ్రస్ట్‌తో ఐదు లిక్విడ్ అపోజి మోటార్ ఇంజిన్లు, 100 ఎన్ థ్రస్ట్‌తో 16 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్ట్ర్లను పరీక్షించారు. గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్‌కు 440 ఎన్ ఇంజిన్లు మిషన్ ఆరోహణ దశలో ప్రధాన చోదకశక్తిని అందిస్తాయి. సుమారు 250 సెకెండ్లపాటు నిర్వహించిన పరీక్షలో లిక్విడ్ అపోజి మోటార్ ఇంజిన్లు, రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లను పరీక్షించి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. -
14న చంద్రయాన్–3 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) గురువారం తెలిపింది. మొదటగా ఈ నెల 12న అని ప్రకటించింది. ఆ తర్వాత 13కు వాయిదా వేసింది. తాజాగా, 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం ఉంటుందని షార్ వర్గాలు ప్రకటించాయి. స్వల్ప సాంకేతిక లోపాలను సరిచేసుకోవడంతో పాటు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే ప్రయోగిస్తారనే వాదన కూడా ఉంది. 2019లో చంద్రయాన్–2ను కూడా జులై 15న ప్రయోగించారు. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం పూర్తి చేసి గురువారం ఉదయాన్నే వ్యాబ్ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ను 4 దశల్లో ప్రయోగిస్తే అదే జీఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రం 3 దశల్లోనే ప్రయోగిస్తారు. పీఎస్ఎల్వీ కంటే జీఎస్ఎల్వీ–మార్క్–2 రాకెట్ కొంచెం బరువు ఎక్కువ, 2 వేల కిలోలు బరువున్న ఉపగ్రహాలు తీసుకెళుతుంది. అదే ఎల్వీఎం మార్క్–3 అత్యంత శక్తివంతమై రాకెట్. ప్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రం రూపొందించి ఏరియన్–5 రాకెట్ తరహాలో వుంటుంది. మూడు వేలు కిలోల నుంచి 6 వేలు కిలోల బరువైన ఉపగ్రహాలను సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలుగుతుంది. ఈ రాకెట్‌కు అత్యంత శక్తివంతమైన రెండు స్ట్రాపాన్ బూస్టర్లు వుంటాయి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 200 టన్నుల ఘన ఇంధనం వుంటుంది. మొదటిదశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో వున్న 400 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు. 110 టన్నుల ద్రవ ఇం««ధనంతో (ఎల్–110)తో రెండోదశను, 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం (సీ–25)తో మూడోదశతో ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఈ రాకెట్‌ను రూపకల్పన చేశారు. ప్రయోగానికి ముందు తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని 11న నిర్వహించనున్నారు. అనంతరం ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఈనెల 14న ప్రయోగమని తెలిపారు. ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ప్రయోగసమయంలో 640 టన్నులు బరువు కలిగి వుంటుంది. 3,900 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–3 ఉçపగ్రహాన్ని నింగివైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్–3 ఉపగ్రహంలో 2,148 కిలోలు బరువు కలిగిన ప్రపోల్షన్ మా డ్యూల్, 1,752 కిలోలు బరువు కలిగిన ల్యాండర్, 26 కిలోలు బరువు కలిగిన రోవర్లను అమర్చి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి 60 శాతం పనుల వరకు దేశంలోని 120 ప్రయివేట్ పరిశ్రమల సహకారం తీసుకున్నారు. -
గగన్‌యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది చివరి నాటికి గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లో క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిçస్టం ఆపరేషన్‌ను శనివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు ఇస్రో శనివారం తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. క్రూమాడ్యూల్ సిస్టంను 602.94 సెకన్ల పాటు మండించి పరీక్షించారు. ఈ పరీక్ష సమయంలో క్రూమాడ్యూల్లోని పారామీటర్లు అన్నీ శాస్త్రవేత్తలు ఊహించిన విధంగా పనిచేశాయి. దీంతో గగన్‌యాన్ ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టైంది. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టంలో భాగంగా మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహించారు. వీటిని విజయవంతంగా పరీక్షించడంతో గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న గగన్‌యాన్ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. అయితే ముందుగా రెండు, మూడుసార్లు మానవ రహిత గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించాకే మానవ సహిత ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో పేర్కొంది. ఇందులో భాగంగా పలు రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
PSLV-C 55 రాకెట్ ప్రయోగం సక్సెస్
సాక్షి, తిరుపతి/నెల్లూరు: శ్రీహరికోట షార్(సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్) నుంచి పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ISRO ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం శనివారం మధ్యాహ్నం జరగ్గా.. రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది వాహననౌక. దీంతో షార్ కంట్రెల్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగిపోయారు. రాకెట్ ప్రయోగం కౌంట్‌డౌన్ ప్రక్రియ ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షించారు. 20.35 నిమిషాల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి ప్రవేశించాయి శాటిలైట్స్. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్-2, 16 కేజీల బరువు ఉన్న లూమిలైట్-4 ఉపగ్రహాంను సన్ సింక్రనస్ ఆర్బిట్(సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి ప్రవేశట్టింది రాకెట్. పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్.. బరువు 44.4 మీటర్ల పొడవు. 228 టన్నుల బరువు. సముద్ర భద్రతను పెంచడం కోసం లూమిలైట్‌ను ప్రవేశపెట్టింది సింగపూర్. ఉపగ్రహాలను నిర్ణీతీ కక్ష్యలోకి వదిలేసిన తర్వాత.. ఆరిస్-2, పైలెట్, ఆర్కా-200, స్టార్‌బెర్రీ, డీఎస్‌వోఎల్, డీఎస్‌వోడీ-3యూ, డీఎస్‌వోడీ-06.. అనే చిన్నపాటి పేలోడ్లను సైతం ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ తరహా ప్రయోగం ఇక్కడ జరగడం ఇదే తొలిసారని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇక.. ఇప్పటివరకు 424 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది ఇస్రో. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 57వ రాకెట్. #WATCH | Andhra Pradesh: Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C55 with two Singaporean satellites for Earth observation, from Sriharikota. (Source: ISRO) pic.twitter.com/oKByHiqXjD — ANI (@ANI) April 22, 2023 Poetic launch of #PSLVC55 ; congrats @isro ! 🚀#TeLEOS2 #POEM #ISRO https://t.co/UEx7WMGHcG — Unni Sankar (@UnniSankar) April 22, 2023 ఏపీ సీఎం జగన్ హర్షం తాడేపల్లి: PSLV-C55న రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఇస్రో బృందాన్ని అభినందించిన ఆయన.. రెండు సింగపూర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో చేర్చటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఇస్రో బృందం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారాయన. -
కాలం చెల్లిన శాటిలైట్‌ను ధ్వంసం చేసిన ఇస్రో
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కాలం చెల్లిన జీశాట్–12 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. 2011 జులై 15న పీఎస్ఎల్వీ సీ17 రాకెట్ ద్వారా జీశాట్–12 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. సుమారు 12 ఏళ్లపాటు సేవలందించింది. శుక్రవారంతో ఈ ఉపగ్రహానికి కాలం చెల్లింది. దీంతో, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోకుండా ధ్వంసం చేసినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను తొలగించే పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఇస్రో స్వయంగా ఆ ప్రక్రియను చేపడుతోంది. -
ఆర్ఎల్వీ పరీక్ష విజయవంతం
సూళ్ళూరుపేట/సాక్షి బెంగళూరు: గగన్‌యాన్ ప్రాజెక్టు పరిశోధనా పరీక్షల్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటనామస్ ల్యాండింగ్ మిషన్(ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్) రాకెట్ ప్రయోగ పరీక్షలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కుందాపురం సమీపంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్)లో ఈ పరీక్ష చేపట్టారు. భారత వైమానిక దళానికి సంబంధించిన చినోక్ అనే హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ రాకెట్‌ను ఉదయం 7.10 గంటలకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కమాండ్ ఆధారంగా రాకెట్ తిరిగి 7.40 గంటలకు భూమిపై నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండయ్యింది. ముందస్తుగా సిద్ధం చేసి రూపొందించిన నేవిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థల సహాయంతో ఈ మానవ రహిత లాంచింగ్ వాహనం ఎలాంటి ఆటంకం లేకుండా భూమిపైకి చేరింది. ఈ ప్రయోగంలో ఇస్రోతోపాటు డీఆర్డీవో, భారత వైమానిక దళం కూడా భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ లాంటి రాకెట్‌ను ఆకా«శంలో వదిలి, తిరిగి విజయవంతంగా భూమి మీదకు చేర్చిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆర్ఎల్వీ ప్రాజెక్టు నిర్వహణ బృందాన్ని ఆయన అభినందించారు. 2016 మే 23న ఆర్ఎల్వీ–టీడీ పేరుతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఆఖరుకు గగన్‌యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రయోగ రాకెట్ ల్యాండ్ అయిన దృశ్యం -
‘చంద్రయాన్–3’లో కీలక పరీక్ష విజయవంతం
బెంగళూరు: చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్/ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ కంపాటిబిలిటీ(ఈఎంఐ/ఈఎంసీ) పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ప్రకటించింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలియజేసింది. శాటిలైట్ ఉప వ్యవస్థలు అంతరిక్ష వాతావరణంలో సక్రమంగా పనిచేసేలా చూడడానికి ఈఎంఐ/ఈఎంసీ టెస్టు నిర్వహించారు. శాటిలైట్ ప్రయోగాల్లో ఇది ముఖ్యమైన పరీక్ష అని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపైన లూనార్ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది. 2019లో చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. -
ISRO@60: ఆకాశంతో పోటీ.. నాకెవ్వరు సాటి!
సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్షపరిశోధనా సంస్థ స్థాపించి 59 ఏళ్లు పూర్తయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. 1961లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. డీఏఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చిగా ఆవిర్భవించింది. ఆ తరువాత కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్)ని ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న ‘నైక్ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్ రాకెట్‌ను మొదటిగా ప్రయోగించారు. ఆ తరువాత 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. తూర్పు తీర ప్రాంతాన.. దేశానికి మంచి రాకెట్ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ విక్రమ్ సారాబాయ్, స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ 1969లో తూర్పువైపు తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ఆ సమయంలో పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చ.కి.మీ. దూరం విస్తరించిన శ్రీహరికోట దీవి కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. భవిష్యత్తు రాకెట్ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిశోధనకు సుమారు 1,161 సౌండింగ్ రాకెట్లు ప్రయోగించారు. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లతో 86 ప్రయోగాలు చేసి 116 ఉపగ్రహాలు, 13 స్టూడెంట్ ఉపగ్రహాలు, రెండు రీఎంట్రీ మిషన్లు, 381 విదేశీ ఉపగ్రహాలు, మూడు గ్రహాంతర ప్రయోగాలు, రెండు ప్రయివేట్ ప్రయోగాలు చేశారు. ఆర్యభట్ట ఉపగ్రహంతోనే మొదటి అడుగు 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసుకుని రష్యా నుంచి ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల వేటను ఆరంభించారు. ►శ్రీహరికోట రాకెట్ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ–3 ఇన్1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ►1980 జూలై 18న ఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ►ఆ తరువాత జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఐదు టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను, మానవసహిత ప్రయోగాలకు ఉపయోగపడేలా జీఎస్ఎల్వీ మార్క్ –3 రాకెట్‌ను రూపొందించారు. ►ఆరు రకాల రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు అస్ట్రోశాట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్థం (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు) గ్రహాంతర ప్రయోగాలు (చంద్రయాన్–1, మంగళ్యాన్–1, చంద్రయాన్–2) లాంటి ప్రయోగాలను కూడా విజయవంతంగా ప్రయోగించారు. వాణిజ్యపరమైన అభివృద్ధి వైపు పయనం ►1992 మే 5న వాణిజ్యపరంగా పీఎస్ఎల్వీ సీ–02 రాకెట్ ద్వారా జర్మనీ దేశానికి చెందిన టబ్‌శాట్ అనే శాటిలైట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ►35 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచదేశాల్లో భారత అంతరిక్ష పరిశోదన సంస్థకు గుర్తింపు తెచ్చారు. ►న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ అనే సంస్థలను ఏర్పాటు చేసి ప్రయివేట్‌గా ఉపగ్రహాలు, రాకెట్లను కూడా ప్రయోగించే స్థాయికి భారతీయ శాస్త్రవేత్తలు ఎదిగారు. ►న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ వారి సహాయంతో ఇటీవలే ఎల్వీఎం3–ఎం2 రాకెట్ ద్వారా వన్‌వెబ్ అనే కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ప్రయివేట్‌గా రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలతో పాటుగా గగన్‌యాన్–1, చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1 అనే చాలెంజింగ్ ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
సీఈ20 ఇంజన్ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్‌ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. సీఈ–20 ఇంజన్ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో శనివారం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్సీ) ఈ పరీక్షకు వేదికగా నిలిచింది. ఈ నెల 22న నిర్వహించిన ఎల్వీఎం3–ఎం2 రాకెట్ ప్రయోగం ద్వారా లండన్ శాటిలైట్ కమ్యూనికేషన్ల సంస్థ ‘వన్‌వెబ్’కు చెందిన 36 ఉపగ్రహాలను భూమికి 601 కిలోమీటర్లు ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వన్‌వెబ్‌కు చెందిన మరో 36 శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంది. ఈ ఉపగ్రహాలను వదిలిపెట్టాల్సిన కక్ష్య తక్కువ దూరంలో ఉండడంతో క్రయోజనిక్ దశలో నింపే 25 టన్నుల ఇంధనంలో 5 టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సీఈ–20 పేరిట నూతనంగా క్రయోజనిక్ ఇంజన్‌ను డిజైన్ చేశారు. సుమారు 25 సెకండ్లపాటు మండించి ఈ ఇంజన్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీన్ని ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగాల కోసమే రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ప్రయోగాలకు సీఈ–12.5, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాలకు సీఈ–25, వాణిజ్యపరంగా ఎల్వీఎం3 ప్రయోగాలకు సీఈ–20.. అనే మూడు రకాల క్రయోజనిక్ ఇంజన్లు అందుబాటులోకి రావడం విశేషం. -
21న జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం
సూళ్లూరుపేట: న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ మార్క్–3, ఎం–2) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డం(యూకే)కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్(వన్ వెబ్ కంపెనీ)తో ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే వన్ వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో అర్బిట్) రోదశీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఉపగ్రహం బరువు 137 కిలోలు ఉంటుందని, 36 ఉపగ్రహాలు కలిపితే 4,932 కిలోల బరువుగా ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహాలు, వాటితోపాటు ఫ్యూయల్‌ను కలిపితే 5.21 టన్నుల బరువుగా నిర్ధారించింది. జీఎస్ఎల్వీ మార్క్–3 ఎం–2 లాంటి భారీ రాకెట్‌ను వాణిజ్యపరంగా వాడుకునేందుకు వన్ వెబ్ కంపెనీ మూడుసార్లు 36 చొప్పున 108 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో రెండుసార్లు జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో ఇప్పటికే సిద్ధమైంది. వన్ వెబ్ కంపెనీ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెంది వాణిజ్యపరంగా ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ఇస్రోతో కలిసి ఈ ప్రయోగం చేపడుతోంది. -
అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49
సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్(ఈవోఎస్ 01) శాటిలైట్‌తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్ 01 అధ్యయనం చేయనుంది. షార్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయోగ ప్రక్రియను చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. Hearty congratulations to the team at @isro behind the successful launch of #PSLVC49, carrying #E0S01 and nine international customer satellites. My best wishes to the scientists for their future endeavours. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2020 WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx — ANI (@ANI) November 7, 2020 -
ఇస్రో ఎన్నటికీ ప్రైవేటుపరం కాదు: శివన్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రైవేటుపరం చేయనున్నారనే వార్తలను సంస్థ చైర్మన్ కె.శివన్ కొట్టిపారేశారు. ఇస్రో ప్రైవేటీకరణ ఎన్నటికీ జరగబోదని స్పష్టం చేశారు. అంతరిక్ష పరిశోధనా కార్యకలాపాల్లో అంకుర సంస్థలను (ప్రైవేటు సంస్థలు) భాగస్వామ్యం చేయడమే సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సెక్టార్‌లోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ జూన్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇస్రోను ప్రైవేటికరించనున్నారనే కోణంలో అనేక సందేహాలు తలెత్తాయి. (అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్) ఈ విషయం గురించి గురువారం ఓ వెబినార్‌లో మాట్లాడిన ఇస్రో చైర్మన్ శివన్.. కేంద్రం తీసుకురానున్న సంస్కరణలు భారత అంతరిక్ష రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్రో కార్యకలాపాలు, పరిశోధనలు మరింతగా పెరుగుతున్నాయన్న ఆయన.. గతంలో కంటే మెరుగ్గా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సంస్థ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనేవి కేవలం అపోహలు మాత్రమేనని.. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా విధివిధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. సంస్కరణల్లో భాగంగా.. ప్రైవేటు కంపెనీలు, భారత ప్రభుత్వ అంతరిక్ష సంబంధిత సాంకేతికత, ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను వాడుకునేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్(ఐఎన్–ఎస్ పీఏసీఈ) ఏర్పాటు జరుగనుందని తెలిపారు. -
టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు
బెంగళూరు: భారత్ 2022లో చేపట్టనున్న గగన్‌యాన్ అంతరిక్ష ప్రయోగానికి అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రేడియోధార్మికత ప్రభావాలను గుర్తించడం, నివారించడంతోపాటు అంతరిక్షంలో వ్యోమగాముల ఆహారం తదితర 18 అంశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వాడేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. రెండేళ్ల తరువాత జరిగే గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పటికే రష్యాలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయస్థాయి పరిశోధన, విద్యా సంస్థలు కొత్త టెక్నాలజీల తయారీకి దరఖాస్తు చేసుకోవచ్చునని బెంగళూరులోని ఇస్రో కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 15వ తేదీలోగా తమ దరఖాస్తులు పంపాలని కోరింది. అంతరిక్షంలో మనిషి మనగలిగేందుకు కీలకమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన కోసం ఇస్రో ఒక కమిటీ ఏర్పాటు చేస్తుందని, శాస్త్రీయ ప్రయోజనాలు, అవసరం, సాంకేతికత, సాధ్యాసాధ్యాల వంటి అంశాల ప్రాతిపదికన టెక్నాలజీల ఎంపిక ఉంటుందని తెలిపింది. -
ఇస్రో ‘జీశాట్-30’ శాటిలైట్ ప్రయోగం సక్సెస్..
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన జీశాట్-30 శాటిలైట్ ప్రయోగం విజయవంతమైంది. టెలివిజన్ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మరింత నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఫ్రెంచ్ భుభాగంలోని కౌరు నుంచి భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ప్రయోగం జరిగిందని ఇస్రో తెలిపింది. ఏరియన్ 5 వాహక నౌక జీశాట్-30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఇస్రో వెల్లడించింది. 3,357 కిలోల బరువున్న జీశాట్-30 ఉపగ్రహం.. చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్న ఇన్ శాట్-4ఏ ఉపగ్రహం స్థానాన్ని భర్తీ చేయనుంది. -
విచ్చుకున్న ‘రీశాట్–2బీఆర్1’ యాంటెన్నా
సూళ్లూరుపేట : దేశీయ అవసరాల నిమిత్తం బుధవా రం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపించిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్–2బీఆర్1) ఉపగ్రహానికి అమర్చిన రేడియల్ రిబ్ యాంటెన్నా గురువారం విజయవంతంగా విచ్చుకున్నట్లు ఇస్రో ప్రకటించింది. 628 కేజీల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 3.6 మీట ర్లు వ్యాసార్థం కలిగిన రేడియల్ రిబ్ యాంటెన్నాను ఇందులో వినియోగించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 9.12 నిమిషాల వ్యవధిలో యాంటెన్నా విజయవంతంగా విచ్చుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఉపగ్రహం సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు సమీపంలో హాసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. -
పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం : శ్రీవారిని దర్శించుకున్న శివన్
సాక్షి, శ్రీహరి కోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. బుధవారం చేపట్టనున్న పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్ 26 గంటలపాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-47ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలు రోదసిలోకి పంపించనున్నారు. ఇందులో 12 ఫ్లోక్-4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహం ఉండనుంది. ఇది షార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 74వ ప్రయోగం. పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
2020లో చంద్రయాన్–3?
సాక్షి, బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది నవంబర్‌లో చంద్ర యాన్–3 ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్–2 ప్రయోగం ద్వారా ల్యాండర్‌ను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం నిరాశకు గురైనా.. ఇస్రోలో పట్టుదలను పెంచింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తీరాలనే దృఢనిశ్చయానికి వచ్చిన ఇస్రో చంద్రయాన్–3 చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ సోమనాథ్ అధ్యక్షతన పనిచే స్తున్న ఈ కమిటీ అక్టోబర్ నుంచి 4 సార్లు సమావేశమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు, ప్రణాళికలతో కూడిన నివేదిక ను ఇది సమర్పించనుంది. ఈ నివేదిక అందాక ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం పట్టాలెక్కిస్తారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రయాన్–2లోని ఆర్బిటర్ విజయ వంతంగా పనిచేస్తున్నందున వచ్చే ఏడాది ల్యాండర్, రోవర్‌లనే చంద్రుడిపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. -
చంద్రయాన్-2పై పాక్ వ్యోమగామి ప్రశంసలు
కరాచీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2పై పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్ అభినందనలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం చరిత్రాత్మకమైందని అన్నారు. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న సైంటియా అనే సైన్స్ మ్యాగజైన్‌తో నమీరా మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2ను దక్షిణ ఆసియా సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. ఇది ప్రపంచ అంతరిక్ష రంగానికి గర్వకారణమని చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణ ఆసియాకు చెందిన ఏ దేశం విజయం సాధించినా.. అది ఆ ప్రాంతం మొత్తానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. కాగా, ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్జిన్ గెలాక్టిక్ పంపే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నమీరా ఎంపికయ్యారు. ఇదిలా ఉంచితే చంద్రయాన్-2 ప్రయోగంపై పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫవాద్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లతోపాటు పలువురు పాకిస్తానీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్ ల్యాండర్ సురక్షింతగానే ఉందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘విక్రమ్’ హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఇస్రో తెలిపింది. -
‘విక్రమ్’ ముక్కలు కాలేదు
బెంగళూరు : చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లికి దగ్గరగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరింత పురోగతి సాధించింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించామని ఇస్రో చైర్మన్ కె శివన్ ఆదివారం నాడు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విక్రమ్ ల్యాండర్ పరిస్థితి గురించి ఇస్రో నేడు కీలక ప్రకటన చేసింది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగానే ఉందని వెల్లడించింది. చంద్రుని ఉపరితలంపై ‘విక్రమ్’ హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు పేర్కొంది. ల్యాండర్ ముక్కలు కాకపోవడంతో.. చంద్రయాన్-2పై శాస్త్రవేత్తల ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఏర్పడే వరకు దాని లోపలి పరిస్థితి ఏ విధంగా ఉందనేది చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా, గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. చదవండి : ‘విక్రమ్’ను గుర్తించాం! -
వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ
సాక్షి, కోల్‌కతా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగిన విక్రమ్ ల్యాండర్ ప్రయాణంలో కుదుపులు చోటుచేసుకున్నప్పటికీ శాస్త్రవేత్తల శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్ 2 ప్రయోగంపై మోదీ ప్రభుత్వం అతి చేస్తోందని విమర్శించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. చంద్రయాన్ 2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చాలా కష్ట పడ్డారని ప్రశంసించారు. వారి కష్టం ఎప్పటికీ వృథా కాదన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్ చేశారు. ‘ఇస్రో శాస్త్రవేత్తల పనితీరు మాకు గర్వంగా ఉంది. చంద్రయాన్-2 కోసం చాలా కష్ట పడ్డారు. శాస్త్ర-సాంకేతిక రంగంలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిపిపేందుకు పునాది వేసిన ఇస్రో వ్యవస్థాపకులకు ఇవే నా నివాళులు’ అంటూ మమతా ట్విట్ చేశారు. (చదవండి : చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది) ఇస్రో శాస్త్రవేత్తల శ్రమ వృథాపోదని, ఈ ప్రయోగం ఎన్నో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనలకు పునాదిగా నిలుస్తుందని ప్రశసించారు. భారతీయులంతా ఇస్రో శాస్త్ర వేత్తలకు అండగా ఉన్నామని, ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసి దేశానికి గొప్ప పేరుతేవాలని అంటూ మరో ట్విట్ చేశారు. కాగా, శుక్రవారం బెంగాల్లో అసెంబ్లీలో మమతా మాట్లాడుతూ.. చంద్రయాన్ 2 ప్రయోగంపై నరేంద్ర మోదీ అతి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఇదే తొలి ప్రయోగం అయినట్టు, మోదీ అధికారంలోకి రాకముందు ఇలాంటివేవీ జరగనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారని మమతా బెనర్జీ ఆక్షేపించారు. దేశంలో ఆర్థిక విపత్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రధాని మోదీ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. We are proud of our scientists. The @isro team worked hard for #Chandrayaan2 . A befitting tribute to our founding fathers who envisioned India’s place in the league of scientifically advanced nations far ahead of their times. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) September 7, 2019 -
ఇది ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తి: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం తుది దశలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్ జాతి అండగా నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర్నుంచీ అంతా శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన వేళ చేదు ఫలితమే ఎదురైనప్పటికీ ఇదొక స్ఫూర్తివంతమైన ప్రయోగమని కొనియాడుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి చంద్రయాన్-2 ప్రయోగంపై స్పందిస్తూ.. ‘ ఇస్రో శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రయోగం భారత్ జాతికే గర్వకారణం. స్పేస్ సైన్స్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచానికే వన్నె తెచ్చారు. ఈ తరహా ప్రయోగాలు లక్షల మంది భారత చిన్నారులకు స్ఫూర్తి నింపుతుంది. జైహింద్’ అని ట్వీట్ చేశాడు. ఇస్రో ఎంతగానో శ్రమించింది: కోహ్లి చంద్రయాన్-2 ప్రయోగం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయినా ఇస్రో శాస్త్రవేత్తలపై మాత్రం సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ ప్రయోగాన్ని విజయంవంతం చేయాలని సంకల్పించుకున్న ఇస్రో కృషి నిజంగా అమోఘమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. మనం చేసిన ప్రయోగమే ఒక సక్సెస్ అని కోహ్లి పేర్కొన్నాడు. సైన్స్‌లో ఫెయిల్యూర్స్ అంటూ ఏమీ ఉండవని ఈ సందర్భంగా తెలిపాడు. రాత్రింబవళ్లు ఎంతగానో శ్రమించిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నాడు. చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన తరుణంలో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. దాంతో చంద్రయాన్-2 ప్రయోగం తృటిలో చేజారింది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. -
మామకు మన సామాను
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–2లో నగరం పాలుపంచుకుంది. ఈ ప్రయోగంలో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లకు కావాల్సిన వస్తువులను కూకట్‌పల్లిలోని నాగసాయి పరిశ్రమ సమకూర్చింది. జూలై 22న శ్రీహరికోట నుంచిజీఎస్‌ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్–2... 48 రోజుల అనంతరం ల్యాండర్ శనివారం తెల్లవారుజామున చందమామపై దిగనుంది. ఈ ప్రయోగ విజయంతో భారత్ అగ్రదేశాల సరసన చేరనుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రయోగంలో నగరం భాగస్వామ్యం కావడం మనకెంతో గర్వకారణం. చంద్రయాన్–1కి సైతం పరికరాలు దజేసిన నాగసాయి ప్రెసిషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత బి.నాగభూషణ్‌రెడ్డి... చంద్రయాన్–2కి అందజేసిన పరికరాల గురించి‘సాక్షి’కి వివరించారు. కూకట్పల్లి: నాగసాయి ప్రెసిషియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటి వరకు 38 ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించింది. 1998 నుంచి ఇస్రోకు విడిభాగాలు అందజేస్తున్న ఈ సంస్థను చంద్రయాన్–2కు సంబంధించిన వస్తువుల తయారీ కోసం రక్షణ శాఖ ఎంపిక చేయడం విశేషం. ఈ సంస్థ చంద్రయాన్ సంబంధించి మొత్తం నాలుగు పరికరాలు తయారు చేసింది. ముఖ్యంగా బ్యాటరీలు ఫిక్స్ చేసే అల్యూమినియం స్టాండ్లు, నాసిల్స్, మరో రెండు రకాల వస్తువులు అందజేసింది. గతంలో ఇస్రో నిర్వహించిన పలు ప్రయోగాలకు సైతం నాగసాయి కంపెనీ పరికరాలు అంజేసింది. వాటిపై సంతృప్తి వ్యక్తం చేసిన రక్షణ శాఖ అధికారులు పలు దశల్లో కంపెనీ క్వాలిటీ, స్టాండర్డ్స్‌డ్స్‌పై పరీక్షలు నిర్వహించారు. చంద్రయాన్–2కు కూడా ఈ కంపెనీనే సరైందని నిర్ధారించి అవకాశం కల్పించారు. విమాన విడిభాగాల్లోనూ... చంద్రయాన్–1 ప్రయోగానికి సైతం ఈ కంపెనీ పరికరాలు అందజేసింది. అయితే అప్పట్లో తక్కువ సమయం మూలంగా కొన్ని వస్తువులను మాత్రమే తయారు చేయగా... ఈసారి చంద్రయాన్–2లో మాత్రం కీలకంగా మారింది. ఇందులో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లకు సంబంధించి 4 వస్తువులు తయారు చేసిచ్చింది. అత్యంత నాణ్యమైన నాసిల్స్ తయారు చేసిచ్చింది. గతంలో ఈ పరికరాలను తయారు చేయడానికి ఇజ్రాయెల్ నుంచి అల్యూమినియం తీసుకొచ్చేవారు. ప్రస్తుతం బాలానగర్ నుంచే తెప్పించడం విశేషం. ఇవీ కాకుండా హెచ్ఏఎల్, బీఈఎల్‌తో పాటు అన్నేమ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ (యూఏఈ) వంటి సంస్థలకు విమాన విడిభాగాలు అందజేస్తోంది. ఈ విధంగా నాగసాయి కంపెనీ దేశ రక్షణ శాఖకు అవసరమైన కీలక పరికరాలు అందిస్తోంది. చంద్రయాన్–2లో పాలుపంచుకునే అవకాశం దక్కినందుకు బీఎన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీఎన్ రెడ్డి ప్రస్థానం... కూకట్‌పల్లిలో నివాసముండే బి.నాగభూషణ్‌రెడ్డి బీటెక్ పూర్తి చేసిన తర్వాత 1982లో చిన్నతరహా పరిశ్రమలో ఉద్యోగంలో చేరాడు. అనంతరం 1984లో బాలానగర్‌లోని సీఐటీడీలో ఎంటెక్ మెకానికల్ పూర్తిచేసి... హైదరాబాద్ అల్విన్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేరాడు. 1994లో కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతంలో నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ స్థాపించారు. అప్పటి నుంచి అనేక రకాల ప్రయోగాత్మక వస్తువులను తయారు చేసేవారు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక విమాన కంపెనీలకు విడిభాగాలు అందజేశారు. నాసా, ఇస్రోలకు కూడా తన పరికరాలు అందజేయాలనే సంకల్పంతో 1998లో ఇస్రో అధికారులను సంప్రదించారు. వారు దాదాపు 6నెలలు బీఎన్ రెడ్డి పనితీరు, ఆయన కార్యాచరణ, నైపుణ్యంపై పలు దశల్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడిభాగాలు తయారు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 38 ఉపగ్రహాలకు వస్తువులు అందజేశారు. ఇదో అద్భుతం చంద్రునిపై వాతావరణ పరిస్థితులు, అక్కడ స్థితిగతులు, మంచినీరు, నిక్షేపాలను గుర్తించేందుకు చంద్రయాన్–2 ఎంతగానో దోహదపడుతుంది. అతి తక్కువ బడ్జెట్‌తో ఇస్త్రో చంద్రుడిపైకి చంద్రయాన్–2ను ప్రయోగించడం నిజంగా అద్భుతం. దీని ద్వారా చంద్రునిపై మానవ మనుగడ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. చంద్రునిపై వనరులు, ఖనిజ నిక్షేపాలు... ఇలా ఎన్నో విషయాలను చంద్రయాన్–2 ద్వారా వెలుగులోకి రానున్నాయి. అలాంటి దానికి తాము పరికరాలను అందించడం ఎంతో గర్వంగా ఉంది.– బీఎన్‌రెడ్డి -
ఇస్రోకు యావత్ దేశం అండగా ఉంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం.. చివరిక్షణంలో కుదుపులకు లోనైన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంశంపై స్పందించారు. విక్రమ్ ల్యాండర్ దాదాపుగా చంద్రుడి ఉపరితలానికి చేరుకుందని, మన శాస్త్రవేత్తలను చూసి యావత్ భారత్ గర్విస్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. చివరి ఘట్టంలో తలెత్తిన ఈ చిన్న ఎదురుదెబ్బ కూడా భావి విజయాలకు మెట్టుగా మలుచుకొని ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం ఇస్రో బృందానికి అండగా ఉందని, ఇస్రో శాస్త్రవేత్తల అసాధారణ కృషిని కొనియాడుతోందని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైన సంగతి తెలిసిందే. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోదీకి శివన్ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు. -
మోదీ వద్ద కంటతడి పెట్టిన శివన్
-
శివన్ కంటతడి..ఓదార్చిన మోదీ
సాక్షి, బెంగళూరు: విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన వేళ ఎదురైన చేదు ఫలితం ప్రతీ ఒక్కరి మనసును కలచివేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ భారత పౌరుడు ఉద్వేగానికి లోనవుతున్నాడు. ఇప్పటిదాకా చంద్రయాన్-2 యాత్ర అప్రతిహితంగా కొనసాగడానికి ఎనలేని కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఇక చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ కూడా విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను కలిసిన శివన్ భావోద్వేగం తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. శివన్ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ ఆయనను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని, భవిష్యత్తులో విజయాలు సాధిస్తారంటూ ఆయనలో ధైర్యం నింపారు. చదవండి: చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది.. కాగా సోషల్ మీడియాలో కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, చైర్మన్ శివన్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విక్రమ్ ల్యాండర్‌తో సిగ్నల్స్ తెగిపోయిన వేళ తల దించుకుని ఉన్న శివన్ ఫొటోను షేర్ చేస్తూ...‘మీరు సాధించింది చిన్న విషయమేమీ కాదు. మీ అంకిత భావానికి, కఠిన శ్రమకు భారత పౌరులంతా సలామ్ చేస్తున్నారు. మీరు తలెత్తుకుని ఉండండి సార్’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. -
చంద్రయాన్-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం
సాక్షి, బెంగళూరు: దేశం కలలను సాకారం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారని.. వారందరికీ యావత్ దేశం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్-2 విజయం కోసం శాస్త్రవేత్తలు చూపిన తెగువకు దేశమంతా గర్విస్తోందని ప్రశంసించారు. భారతమాత తలెత్తుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారని ప్రధాని అభినందించారు. బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్)లో చంద్రయాన్-2 ప్రయోగంపై శనివారం ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తొలుత ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోవడంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఈ ప్రయోగం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. మీ కృషిని యావత్ దేశం అర్థం చేసుకోగలదు. మీ కష్టం దేశానికి తెలుసు. భారతమత తలెత్తుకునేలా ప్రయోగం కోసం జీవితాన్ని ధారపోశారు. దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఎంతో శ్రమించారు. శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వృథా కాదు. మీస్ఫూర్తి భారతీయులకు నిదర్శనం. శాస్త్రవేత్తల కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తున్నా. దీనిలో వారి త్యాగం ఎంతో ఉంది. మన అడంకులే మన మనోబలాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీరు చూపిన తెగువ మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికి నిర్ధేశం చేసింది. మీ కృషికి ప్రతిఫలంగా దేశమంతా మీకు అండగా నిలబడుతోంది. ప్రపంచ దేశాల్లో భారత్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంది. దానికోసం మరికొన్ని అంతరిక్ష ప్రయోగాలను మనం చేపట్టాలి. ఎన్నో ఆటంకాలను విజయవంతగా అధిరోహించిన చరిత్ర ఇస్రోకు ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తారనే నమ్మకం నాతోపాటు ఈ దేశ ప్రజలకూ ఉంది’ అంటూ శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని నింపే విధంగా మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేస్తూ.. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని తెలిపారు. దీనిపై ల్యాండర్ పంపిన సందేశాలను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. చదవండి: చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది.. -
చంద్రయాన్-2; ఆనంద్ మహీంద్ర భావోద్వేగ ట్వీట్
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగిన విక్రమ్ ల్యాండర్ ప్రయాణంలో కుదుపులు చోటుచేసుకున్నప్పటికీ శాస్త్రవేత్తల శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్ 2 యాత్ర ప్రారంభం నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై స్పందిస్తున్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర భావోద్వేగ ట్వీట్ చేశారు. మూన్‌లాండర్‌తో ఇస్రోకు సిగ్నల్స్ తెగిపోయిన తర్వాత..‘ సంబంధాలు తెగిపోలేదు. చంద్రయాన్ గుండెచప్పుడును ప్రతీ భారత పౌరుడు వినగలుగుతున్నాడు. తొలిసారి విజయం సాధించకపోతే... మళ్లీ మళ్లీ ప్రయత్నించండి అంటూ తాను చెప్పే గుసగుసలు వినగలుగుతున్నాడు’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది.. The communication isn’t lost. Every single person in India can feel the heartbeat of #chandrayaan2 We can hear it whisper to us that ‘If at first you don’t succeed, try, try again.’ https://t.co/YS3y1kQXI2 — anand mahindra (@anandmahindra) September 6, 2019 అదే విధంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని చేరే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన వేళ అనుకోని ఫలితం ఇస్రో బృందం శ్రమను నాశనం చేయలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘ చంద్రయాన్ 2 మిషన్ కోసం కష్టపడిన ఇస్రో టీంకు అభినందనలు. పని పట్ల మీ అంకితభావం ప్రతీ భారత పౌరుడికి స్పూర్తిదాయకం. మీ శ్రమ వృథాపోదు. ఈ ప్రయోగం ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనలకు పునాదిగా నిలిచింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. Congratulations to the team at #ISRO for their incredible work on the Chandrayaan 2 Moon Mission. Your passion & dedication is an inspiration to every Indian. Your work is not in vain. It has laid the foundation for many more path breaking & ambitious Indian space missions. 🇮🇳 — Rahul Gandhi (@RahulGandhi) September 6, 2019 -
చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది..
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోదీకి శివన్ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు మీరు సాధించింది తక్కువ ఏమీ కాదని శివన్ భుజం తట్టారు. మీరు ధైర్యంగా ముందుకెళ్లండి.. నేను మీకు అండగా ఉంటాను అని ప్రధాని వారిలో భరోసా కల్పించారు. పసిబిడ్డను పొత్తిళ్లలో వేసినట్లే... చంద్రయాన్ –2 ప్రయోగానికి సంబంధించి అన్నీ ముందుగా అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని అంతకుముందు ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ పేర్కొన్నారు. ‘‘చంద్రయాన్ –2 ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తలందరిలోనూ ఎంతో ఉత్కంఠత ఉంది. ఎందుకంటే ఈ ప్రయోగం చాలా సంక్లిష్టమైనది. పైగా ఇస్రో ఇలాంటి ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారి కదా!!’’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘సెన్సర్లు, కంప్యూటర్లు, కమాండ్ వ్యవస్థ అన్నీ పక్కాగా పనిచేశాయి. చేస్తాయి కూడా. భూమ్మీద చాలుసార్లు వీటిని విజయవంతంగా పరీక్షించిన ధైర్యంతో ఈ మాట చెబుతున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ చాలా సున్నితమైన ప్రక్రియ అని.. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఉయ్యాలలో ఎంత జాగ్రత్తగా వేస్తామో ఇది కూడా అంతేనని ఆ అధికారి అన్నారు. భారతీయ ప్రతిభకు తార్కాణం: మోదీ చంద్రయాన్ –2 ప్రయోగం భారతీయ ప్రతిభకు సజీవ తార్కాణమని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఒక ట్వీట్లో ప్రశంసించారు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేస్తూ... చంద్రయాన్ –2 విజయ వంతం కావడం కోట్లాది మంది భారతీ యులకు లాభం చేకూర్చనుందన్నారు. ‘‘130 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం ఇది. కొన్ని గంటల్లో చంద్రయాన్ –2 తుది ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్‌తోపాటు మిగిలిన ప్రపంచం కూడా మన అంతరిక్ష శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభను మరోసారి ప్రత్యక్షంగా వీక్షించనుంది’’ అని మోదీ ఇంకో ట్వీట్లో పేర్కొన్నారు. విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్‌ను ఆయన బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్) ప్రత్యక్షంగా వీక్షించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, పొరుగుదేశం భూటాన్‌కు చెందిన యువత కూడా తనతోపాటు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారని... వీరంతా ఇస్రో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో తమ ప్రతిభను కనపరచిన వారని మోదీ తెలిపారు. మై గవ్ వెబ్సైట్లో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో భారీ సంఖ్యలో యువత పాల్గొనడం అంతరిక్షం, సైన్స్ పట్ల దేశ యువతలో ఆసక్తి పెరుగుతోందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ అపురూప ఘట్టాన్ని దూరదర్శన్ శుక్రవారం అర్ధరాత్రి 1.10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టగా ఇస్రో తన వెబ్సైట్లోనూ కార్యక్రమ లైవ్ వీడియోను అందించింది. వీటితోపాటు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లోనూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ను అందించింది ఇస్రో. ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్ –2 సుమారు ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి జాబిలివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి చేరిన తరువాత దశలవారీగా తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబరు రెండవ తేదీ చంద్రయాన్ –2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడింది. ‘గగన్‌యాన్’ తొలిదశ ఎంపిక పూర్తి భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో మరో ముందడుగు పడింది. ఈ యాత్రలో పాల్గొనే వ్యోమగాముల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ తొలిదశ పూర్తయిందని భారత వాయుసేన(ఐఏఎఫ్) తెలిపింది. ఈ ప్రక్రియలో ఎంపికైన 25 మంది టెస్ట్ పైలెట్లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లో శరీరదారుఢ్యంతో పాటు పలువైద్య, మానసిక పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా 2021 డిసెంబర్ కల్లా రెండు మానవరహిత, ఓ మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని ఇస్రో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు(వ్యోమనాట్స్) రష్యాలోని యూరీగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో 15 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. చివరగా వీరిలో ముగ్గురు వ్యోమగాములు గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలో 7 రోజుల పాటు గడపనున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపిన నాలుగోదేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను కేటాయించింది. -
దేశం గర్వించే ఆ క్షణం
చందమామ రావే.. జాబిల్లి రావే.. అని అమ్మలు పిల్లల కోసం ఎంత పిలిచినా రాలేదు.. అందుకే మన శాస్త్రవేత్తలే చందమామ వద్దకు వెళ్లేందుకు మార్గం కనిపెట్టారు.. జాబిల్లి జాడలు వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. జూలై 22న శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరడంతో చం ద్రయాన్–2 యాత్ర ప్రారంభమైంది. 48 రోజులకు ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై శనివారం తెల్లవారుజామున 1.30– 2.30 గంటల మధ్యలో చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ యాత్ర ద్వారా చంద్రగ్రహంపై ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. మొదటి ప్రయత్నంలోనేజాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలిదేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. దటీజ్ ఇండియా! గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచి.. గగనాంతర రోదసిలో.. గంధర్వగోళ గతులు దాటేందుకు.. రంగం సిద్ధమవుతోంది! భారతీయులుగా మనమంతా గర్వించే రోజు రానే వచ్చింది.. కచ్చితంగా చెప్పాలంటే ఇంక కొన్ని గంటలే.. చంద్రయాన్–2 ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి దక్షిణ ధృవంపై వాలడమే ఆలస్యం.. అంతరిక్ష యవనికపై భారత త్రివర్ణ పతాకం గర్వంగా నిలవనుంది! 48 రోజుల నిరీక్షణకు తెరపడే శుభసమయం ఇంకో 24 గంటల్లోనే రానుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 1.30– 2.30 గంటల (శుక్రవారం అర్ధరాత్రి దాటాక) మధ్యలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ –2 ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగనుంది. బాలారిష్టాలను దాటుకుని జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్–2 ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. ఆ తర్వాత జాబిల్లి కక్ష్యలోకి చేరింది. మూడు లక్షలకుపైగా కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వారం రోజుల కింద జాబిల్లి సమీపానికి చేరిన ఈ అంతరిక్ష నౌక దశల వారీగా మన సహజ ఉపగ్రహానికి దగ్గరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి చివరి ఘట్టమైన సాఫ్ట్‌ల్యాండింగ్ శనివారం తెల్లవారుజామున జరగనుంది. ఎందుకింత ప్రాముఖ్యం? చంద్రయాన్ –2 విజయవంతమైతే ఇస్రో బోలెడు రికార్డులు సృష్టించనుంది. మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపిన నాలుగో దేశంగానూ రికార్డుల్లోకి ఎక్కుతుంది. కాగా, ఆర్బిటర్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై దిగడం ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం. ఇతర గ్రహాలపై సాఫ్ట్ల్యాండింగ్కు ప్రయత్నించడం ఇస్రోకు ఇదే తొలిసారి. అనేక క్లిష్ట పరిస్థితుల్లో విక్రమ్ దిగాల్సి ఉంటుంది. భూమితో పోలిస్తే జాబిల్లిపై గురుత్వ శక్తి మూడొంతులే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాబిల్లి గురుత్వశక్తి ప్రభావానికి గురైన వెంటనే వేగంగా జారిపడిపోవడం మొదలవుతుంది. గాలి కూడా ఉండదు కాబట్టి.. పతనాన్ని నిరోధించే అవకాశం ఉండదు. గాలి లేకుండా ప్యారాచూట్స్ పనిచేయవు. ఇన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ మోటార్ల సాయంతోనే వేగాన్ని నియంత్రించుకుంటూ గంటకు 3.6 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వేగంతో దిగాల్సి ఉంటుంది. రోవర్ వేరుపడటంతో ప్రయోగం పూర్తి.. జాబిల్లిపై విక్రమ్ సాఫ్ట్ల్యాండింగైన తర్వాత కొన్ని గంటలకు అందులోనే నిక్షిప్తమై ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది. జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ ఈ చిట్టి రోబో ప్రయోగాలు చేస్తుంది. ఈ రోవర్లో రెండు పరికరాలు ఉంటాయి. ల్యాండైన ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ.. అక్కడి మట్టిని పరిశీలిస్తుంది. ఏయే మూలకాలు ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తుంది. దక్షిణ ధృవం వద్ద సూర్యరశ్మి ఉండే 14 రోజుల పాటు ఈ రోవర్ పనిచేసేలా డిజైన్ చేశారు. దక్షిణ ధృవం ప్రత్యేకత? అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా ఇప్పటికే చందమామపై అనేక ప్రయోగాలు చేపట్టింది. అయితే చంద్రగ్రహ మధ్యరేఖకు కొంచెం అటు ఇటు మాత్రమే ప్రయోగాలు చేశాయి. సూర్యరశ్మి బాగా ఉంటుంది కాబట్టి పరికరాలకు అవసరమైన విద్యుత్తు తయారు చేసుకోవడం సులువు కాబట్టి.. అందరూ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ.. ఇస్రో ల్యాండర్ దిగనున్న దక్షిణ ధృవ ప్రాంతం మాత్రం వీటన్నింటికంటే భిన్నమైంది. 50 ఏళ్ల జాబిల్లి యాత్రలో ఇప్పటివరకు ఎవరూ కాలు పెట్టని, పరిశీలనలు జరపని ప్రాంతాల్లో ఇది ఒకటి. భూమి నుంచి విడిపోయేటప్పటి శిలాజాలు ఈ ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉండే అవకాశముంది. చంద్రయాన్ –1 ద్వారా జాబిల్లిపై నీరు ఉన్న విషయం స్పష్టమైంది. చంద్రయాన్–2 ద్వారా ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. ఆ చివరి గంట.. విక్రమ్ సాఫ్ట్ ల్యాండర్‌లోని కెమెరాలు ప్రతి సెకనుకు తాను దిగాల్సిన ప్రాంతం తాలూకు ఫొటోలు తీస్తూ మనకు పంపుతుంటాయి. వాటి నుంచి అనువైన ప్రాంతాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేస్తారు. ఆ ఎంపికకు అనుగుణంగా విక్రమ్‌లోని కంప్యూటర్లు ఎత్తు, వేగం, దూరం వంటి వాటిని లెక్కించుకుని దిగుతుంది. భూమ్మీది నుంచే విక్రమ్‌లోని ఐదు రాకెట్ ఇంజన్లను నియంత్రిస్తుండటం ఇంకో క్లిష్టమైన పరిస్థితి. ముందుగా దాని వేగం తగ్గించడం.. ఆ తర్వాత ఉపరితలానికి కొంచెం ఎత్తులో స్థిరంగా ఉండేలా చేయడం.. దిగాల్సిన ప్రాంతానికి చేరేలా దిశ మార్చడం వంటివన్నీ చాలా కీలకం. ఇలా రియల్ టైమ్‌లో అంతరిక్ష నౌక ల్యాండింగ్ ఏ దేశమూ ఇప్పటివరకూ చేపట్టలేదు. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. విక్రమ్‌లోని కెమెరాలు, దూరాన్ని కొలిచే లేజర్ పరికరాలు, కంప్యూటర్లు, భూమ్మీది శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆర్బిటర్ చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. ఇది సొంతంగా దాదాపున వెయ్యి వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతూ ఏడాది పాటు పనిచేస్తుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. విక్రమ్ చంద్రయాన్–2 ద్వారా జాబిల్లిపైకి దిగే ల్యాండర్ పేరు ‘విక్రమ్’. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ స్మారకార్థం ల్యాండర్‌కు ఈ పేరు పెట్టారు. ఇది దాదాపు 1,471 కిలోల బరువుంటుంది. ఇది 14 రోజుల పాటు పనిచేస్తుంది. రోవర్ సాఫ్ట్‌ల్యాండ్ అవ్వడంలో కీలక పాత్ర దీనిదే. ప్రజ్ఞాన్ ఆరు చక్రాలుండే రోవర్ పేరు ప్రజ్ఞాన్. 27 కిలోల బరువుంటుంది. చంద్రుడి ఉపరితలంపై అడుగిడిన దగ్గరి నుంచి సౌర శక్తి సాయంతో 500 మీటర్ల మేర ప్రయాణించగలదు. ఇది ఎక్స్‌రే కిరణాలను ప్రసారం చేస్తూ చంద్రుడి ఉపరితలంపై ఏయే మూలకాలు ఎక్కువగా ఉన్నాయో చెబుతుంటుంది. చంద్రయాన్ ప్రస్థానం ఇలా.. జూలై 22 : శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి జూలై 24 : భూమి చుట్టూ తిరిగే కక్ష్య దూరం పెంపు. అతిదగ్గరగా 230 బై 45,163 కిలోమీటర్లతో కక్ష్య జూలై 26 : మరోమారు కక్ష్య దూరం పెంపు. ఈ సారి అతిదగ్గరగా 251 బై 54,829 కిలోమీటర్లతో కక్ష్య జూలై 29 : మూడోసారి కక్ష్య దూరం పెంపు. చోదక వ్యవస్థలను సుమారు 989 సెకన్లు వాడుకుంటూ భూమికి అతిదగ్గరగా 276 బై 71,792 కిలోమీటర్లతో కక్ష్య. ఆగస్టు 2 : నాలుగో కక్ష్య పెంపు ప్రయోగం విజయవంతం. భూమికి 277 బై 89,472 కిలోమీటర్ల దూరంగా కొత్త కక్ష్య మార్గం. ఆగస్టు 6 : చివరి కక్ష్య పెంపు పూర్తి. చోదక వ్యవస్థలను ఉపయోగించుకుని భూమికి దగ్గరగా 276 బై 1,42,975 కి.మీ. కక్ష్య. ఆగస్టు 20 : జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్–2ను మళ్లించిన శాస్త్రవేత్తలు. జాబిల్లికి 114 కి.మీ. దగ్గరగా.. 18,072 కిలోమీటర్లు దూరంగా కక్ష్య మార్గం. ఆగస్టు 21 : జాబిల్లి చుట్టూ తిరుగుతున్న కక్ష్య దూరం తగ్గింపు. అతిదగ్గరి దూరం 118 బై 4412 కిలోమీటర్లకు తగ్గింపు. ఆగస్టు 28 : మూడో కక్ష్య కుదింపు ప్రక్రియ విజయవంతం. తాజా కక్ష్య మార్గం అతి దగ్గరగా 179 బై 1412 కి.మీలు. ఆగస్టు 30 : నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియ. చోదక వ్యవస్థలను 1155 సెకన్ల సేపు వాడుకుని కక్ష్య మార్గాన్ని 124 బై 164 కిలోమీటర్లకు కుదించారు. సెప్టెంబర్ 2 : ఆర్బిటర్ నుంచి విజయవంతంగా వేరుపడిన ల్యాండర్ విక్రమ్. జాబిల్లి చుట్టూ 119 బై 127 కిలోమీటర్ల కక్ష్యలో విక్రమ్ భ్రమణం సెప్టెంబర్ 3 : ఆర్బిటర్ కక్ష్య సవరణ ప్రక్రియ మొదలు. 4 సెకన్ల పాటు ఇంజిన్లను వాడుకోవడం ద్వారా విక్రమ్ కక్ష్యను 104 బై 128 కిలోమీటర్లుగా మార్పు. సెప్టెంబర్ 4 : విక్రమ్‌ను జాబిల్లికి మరింత చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నం సక్సెస్. తాజాగా విక్రమ్ కక్ష్య 35 బై 101 కిలోమీటర్లు. -
ఫొటోలు పంపిన చంద్రయాన్–2
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్–2 తొలిసారి అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలను పంపింది. ప్రస్తుతం చంద్రయాన్–2 భూమికి–చంద్రుడికి మధ్యలోని భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమిస్తోంది. శనివారం సాయంత్రం 5.28 గంటలకు భూమిని ఉత్తరం ధృవం వైపు నుంచి తీసిన ఐదు ఫొటోలను ఆదివారం ఇస్రో తన సొంత వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. చంద్రయాన్–2 కక్ష్య దూరాన్ని ప్రస్తుతం భూమికి దగ్గరగా 277 కిలోమీటర్లకు, దూరంగా 89,472 కిలోమీటర్ల ఎత్తుకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమికి 5,000 కిలోమీటర్ల దగ్గరగా వచ్చిన సమయంలో 10 నిమిషాల వ్యవధిలో ఐదు ఫొటోలను తీసి బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రిత కేంద్రానికి పంపింది. చంద్రయాన్–2లో ఉన్న ల్యాండర్ (విక్రమ్)లో ఎల్–14 కెమెరా ఈ చిత్రాలను తీసింది. చంద్రుడి ఉపరితలం మీద దిగే 15 నిమిషాలు విజయవంతమైతే చంద్రయాన్–2 యాత్ర సజావుగా సాగినట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫొటోలు ఎప్పుడెప్పుడంటే.. భూమికి ఉత్తర ధృవం నుంచి 5 వేల కిలోమీటర్ల ఎత్తులో ఒక ఛాయా చిత్రం, 5.29 గంటలకు 4,700 కిలోమీటర్ల్ల ఎత్తులోకి వచ్చాక మరో ఛాయాచిత్రాన్ని తీసింది. ఆ తరువాత 5.31 గంటలకు 4,100 కిలోమీటర్ల్ల ఎత్తు నుంచి, 17.34 గంటలకు 3,200 కిలో మీటర్ల ఎత్తు నుంచి, 17.37 గంటలకు 2,450 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరో మూడు ఛాయా చిత్రాలను తీసి పంపింది. -
నీలిరంగులో మెరిసిపోతున్న భూమి
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ -2 మిషన్ ప్రయోగించిన విషయం తెలిసిందే. శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు. తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఈ నెల14న చివరిగా చంద్రయాన్–2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది. నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. -
జూలై 15న చంద్రయాన్ -2 ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. 2019 జూలై 15న ప్రయోగం చేపడతామని ఇస్రో చైర్మన్ డా. కె.శివన్ ప్రకటించారు. ఈ ప్రయోగానికి రూ. 1000 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. జూలై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ల్యాండర్‌కు విక్రమ్ అని, రోవర్‌కు ప్రగ్యాన్ అని నామకరణం చేశారు. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3,447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1,179 కేజీలు ఉంటుందని చెప్పారు. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. 2019 సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం కోసం దశాబ్దాలుగా భారత శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. ఈ ప్రయోగం తర్వాత లభించే సమాచారం ఆధారంగా ఇస్రో తదుపరి తన వ్యూహాలను అమలు చేయనుంది. -
పీఎస్ఎల్వీ సీ-34కు నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం
బుధవారం ఉదయం 9.25 గంటలకు ప్రయోగం శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న ఉదయం 9.25 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ-34 ఉపగ్రహ వాహకనౌకకు కౌంట్‌డౌన్ సమయాన్ని కొంత మార్పు చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఎంఆర్ఆర్ సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభించి 39.30 గంటల అనంతరం ప్రయోగించాలని ముందుగా అనుకున్నారు. కొంత సమయాభావం వల్ల 48 గంటలకు కౌంట్‌డౌన్ సమయాన్ని పెంచారు. అంటే సోమవారం ఉదయం 9.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి బుధవారం ఉదయం 9.25 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు సమావేశాన్ని పూర్తి చేసి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. రాత్రికి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి సోమవారం ఉదయం 9.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రయోగంలో 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్లో ప్రత్యేకతలు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ- సీ-34)లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ సిరీస్‌లో 36వ ప్రయోగం కావడం విశేషం. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో చేయడం ఇది 14వ ప్రయోగం. గతంలో 10 ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ ఈసారి ఒకేసారి 20 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ రాకెట్‌లోని నాల్గో దశను ప్రయోగాత్మకంగా మరో ప్రయోగం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా బహుళ ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ ఉపగ్రహాలను పంపాలంటే వాటిని వివిధ రకాల కక్ష్యల ప్రవేశపెట్టేందుకు నాల్గో దశను (పీఎస్-4) మాత్రమే ఉపయోగించాలి. అందుకోసం ఇప్పుడు ప్రయోగాత్మకంగా పీఎస్-4 ప్రయోగించనున్నారు.