అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో | Focus on setting up space station: ISRO | Sakshi
Sakshi News home page

అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో

Published Fri, Oct 6 2023 6:08 AM | Last Updated on Fri, Oct 6 2023 6:08 AM

Focus on setting up space station: ISRO - Sakshi

న్యూఢిల్లీ: చంద్రయాన్‌–3 మిషన్‌ విజయవంతంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దృష్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులపై పడిందని సంస్థ చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. చైనా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌(సీజీటీఎన్‌)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేíÙస్తోందని తెలిపారు.

అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్‌ ఆపరేషన్‌తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్‌యాన్‌ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్‌ స్టేషన్‌ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ చేరుతుందన్నారు. చైనా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌(సీజీటీఎన్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement