new projects
-
3–4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు: మోదీ
ముంబై: రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుద్యోగితపై బూటకపు ప్రచారాలు చేస్తున్న వారి నోళ్లను ఆర్బీఐ నివేదిక మూయించిందన్నారు. ముంబై శివారులోని గోరేగావ్‌లో మోదీ శనివారం రూ, 29 వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారన్నారు. ఎన్డీయే సర్కారు మాత్రమే సుస్థిరతను అందించగలదని ప్రజలకు తెలుసన్నారు. ‘ఉపాధిపై ఆర్బీఐ ఇటీవలే సవివర నివేదికను ప్రచురించింది. గడిచిన మూడు– నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగాలపై అబద్ధాలను ప్రచారం చేసే వారి నోళ్లను ఆర్బీఐ గణాంకాలు మూయించాయి’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ఇలా చురకలు అంటించారు. -
కొబ్బరికి మహర్దశ
సాక్షి అమలాపురం: ఒకవైపు పరిశ్రమల లోటు తీర్చడం.. మరోవైపు స్థానికంగా పండే పంటలను ఉప ఉత్పత్తులుగా తయారు చేస్తే రైతుకు లాభసాటి ధర వస్తుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరిజిల్లాల్లో వరి తరువాత అతి పెద్ద సాగు కొబ్బరి. దశాబ్దాల కాలం నుంచి సాగవుతున్నా.. వీటి విలువ ఆధారిత పరిశ్రమలు స్థానికంగా లేకపోవడంతో కొబ్బరి మార్కెట్ తరచు ఒడుదొడుకులకు లోనవుతోంది. రాష్ట్రంలో సుమారు మూడులక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.78 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. దీన్లో ఒక్క డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి జిల్లాలోనే ఏడాదికి 124.72 కోట్ల కాయల దిగుబడి వస్తున్నట్లు అంచనా. ఇంత పెద్ద దిగుబడి వస్తున్నా తరచు కొబ్బరి సంక్షోభంలో కూరుకుపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్)కు కొబ్బరిని ఎంపిక చేసింది. ఈ పథకం కింద జిల్లాలో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేదానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్ ఇండియా బృందం గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిలా్లలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. హరిప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం సభ్యులు ముమ్మిడివరం వద్ద ఉన్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూనిట్‌ను, పేరూరులో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ఆధ్వర్యంలోని కొబ్బరి తాడు పరిశ్రమను, మామిడికుదురు మండలం పాశర్లపూడిలో క్వాయర్ బొమ్మల దుకాణం, క్వాయర్ మాట్ యూనిట్, చీపుర్ల యూనిట్, కోప్రా యూనిట్, చార్కోల్ యూనిట్లను సందర్శించనున్నారు. ఉద్యానశాఖతోపాటు జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్డీఏ, కేవీఐబీ, హ్యాండ్లూమ్ అధికారులు వారికి జిల్లాలో కొబ్బరి పరిశ్రమల అవసరాన్ని, అవకాశాలను వివరించనున్నారు. వందకుపైగా ఉప ఉత్పత్తులు కొబ్బరి నుంచి వందకుపైగా ఉప ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చెప్పుకొనే స్థాయిలో పెద్ద పరిశ్రమలు లేవు. ఒకటి రెండు ఉన్నా అవి కేవలం క్వాయర్ పరిశ్రమలు మాత్రమే. ఇక్కడ పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని ప్రణాళిక సిద్ధం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా యువతతోపాటు మహిళా స్వయంశక్తి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధికంగా మేలు జరుగుతుంది. కొబ్బరికి స్థానికంగా డిమాండ్ పెరిగి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. -
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దృష్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులపై పడిందని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేíÙస్తోందని తెలిపారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ ఆపరేషన్‌తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్‌యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్) -
జీఎంఆర్ పవర్‌కు భారీ ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ పవర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ స్మార్ట్ ఎలెక్ట్రిసిటీ డి్రస్టిబ్యూషన్ (జీఎస్ఈడీపీఎల్)కు పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి రూ. 5,123 కోట్ల విలువ చేసే ఆర్డర్లు లభించాయి. వీటి కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ (వారణాసి, ఆజమ్గఢ్ జోన్, ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ జోన్)లో 50.17 లక్షల స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్, నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రయాగ్‌రాజ్–మీర్జాపూర్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,387 కోట్లుగాను, వారణాసి–ఆజమ్గఢ్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,736.65 కోట్లుగాను ఉంటుందని సంస్థ తెలిపింది. త్వరలోనే దక్షిణాంచల్ (ఆగ్రా, అలీగఢ్ జోన్)లో 25.52 లక్షల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి కూడా కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని పేర్కొంది. -
రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ ఎస్టేట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ. 2,000 కోట్ల విలువ చేసే బుకింగ్స్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఇది సుమారు రూ. 1,200 కోట్లుగా ఉంది. అలాగే వేర్‌హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించడంపై సంస్థ దృష్టి పెడుతోంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రామ్కీ ఎస్టేట్స్ ఎండీ ఎం నంద కిషోర్ ఈ విషయాలు తెలిపారు. సంస్థ ఇప్పటివరకు రూ. 3,500 కోట్ల పైచిలుకు విలువ చేసే 27 ప్రాజెక్టులను పూర్తి చేయగా, 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంతో దాదాపు రూ. 10,000 కోట్ల విలువ చేసే 15 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు వివరించారు. (మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు) కొత్తగా మరో రూ. 3,600 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ‘కమ్యూనిటీ లివింగ్’ కాన్సెప్ట్‌కు పెద్దపీట వేస్తూ ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, వచ్చే 3-4 ఏళ్లలో వేర్‌హౌసింగ్ విభాగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు నంద కిషోర్ చెప్పారు. తొలుత 15 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయ న్నారు. వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావంతో సంబంధం లేకుండా నివాస గృహాలకు డిమాండ్ ఎప్పు డూ ఉంటుందని తెలిపారు. సంస్థ దగ్గర దాదాపు రూ.6,500 కోట్ల విలువ చేసే 1,000 ఎకరాల స్థలం ఉన్నట్లు డైరెక్టర్ తారక రాజేశ్ దాసరి చెప్పారు. (కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్‌తో ఎంట్రీ ఇచ్చేసింది!) రామ్‌కీవర్స్ ఆవిష్కరణ..: ప్రాపర్టీ కొనుగోళ్లకు సంబంధించి కస్టమర్లు ఎంపిక చేసుకునే ప్రక్రియ ను సులభతరం చేసేలా రామ్కీ ఎస్టేట్స్ అత్యాధునిక టెక్నాలజీని తీసుకొచ్చింది. ‘రామ్‌కీవర్స్’ను ఆవిష్కరించింది. దీనితో ప్రాజెక్టును చూసేందుకు, వివరాలు తెలుసుకునేందుకు కస్టమర్లు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేకుండా, సౌకర్యంగా ఇంటి దగ్గర్నుంచే వర్చువల్ టూర్ చేయొచ్చని .. సేల్స్ సిబ్బందితో కూడా మాట్లాడవచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు తెలిపారు. -
గ్రీన్ హైడ్రోజన్‌పై థెర్మాక్స్ దృష్టి
న్యూఢిల్లీ: గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఇంధనం, పర్యావరణ సొల్యూషన్ల కంపెనీ థెర్మాక్స్ ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా ఆస్ట్రేలియన్ కంపెనీ ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్(ఎఫ్ఎఫ్ఐ)తో చేతులు కలిపింది. భాగస్వామ్య ప్రాతిపదికన రెండు సంస్థలూ వాణిజ్య, పారిశ్రామిక కస్టమర్ల కోసం సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకు ఎఫ్ఎఫ్ఐతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు థెర్మాక్స్ పేర్కొంది. తద్వారా దేశీయంగా తయారీ యూనిట్ల ఏర్పాటుసహా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధి అవకాశాలను సంయుక్తంగా అన్వేషించనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా దేశీయంగా రిఫైనరీలు, ఫెర్టిలైజర్లు, స్టీల్ తదితర ప్రధాన రంగాలలో కర్బనాలను తగ్గించేందుకు అవకాశముంటుందని వివరించింది. -
రూ.10,300 కోట్లతో 16 లోధా కొత్త ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: లోధా బ్రాండ్ పేరుతో రియల్టీ రంగంలో ఉన్న మాక్రోటెక్ డెవలపర్స్ మార్చి నాటికి కొత్తగా 16 ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. వీటి విలువ రూ.10,300 కోట్లు. విస్తీర్ణం 73 లక్షల చదరపు అడుగులు. ప్రాజెక్టుల్లో కొన్ని కంపెనీ సొంతం కాగా, మరికొన్ని స్థల యజమానులతో కలిసి అభివృద్ధి చేయనుంది. ఈ ఏడాది కంపెనీ ఏప్రిల్-సెప్టెంబర్‌లో 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటి అమ్మకం ద్వారా రూ.8,480 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ బలంగా ఉందని మాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో కంపెనీ రూ.6,004 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,960 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,500 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తోంది. -
మహారాష్ట్రకు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: మోదీ
ముంబై: మహారాష్ట్రలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సుమారు 75 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు గురువారం ముంబైలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు. మహారాష్ట్రకు రావాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్నికలు జరిగే గుజరాత్‌కు తరలిపోతున్నాయంటూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రమైన సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. -
ఓఎన్జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ సుమారు రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. దీంతో 7.5 మిలియన్ టన్నుల చమురు, 1 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జత కలవనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముంబై హై క్షేత్రాల జీవితకాలాన్ని హెచ్చించడం ద్వారా ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ముంబై హై సౌత్ పునరాభివృద్ధి నాలుగో దశలో భాగంగా రూ. 3,740 కోట్లను వెచ్చించగా, ముంబై హైవద్ద క్లస్టర్–8 మార్జినల్ ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టుపై రూ. 2,292 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులను చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జాతికి అంకితం చేసినట్లు పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ జోరు కొనసాగించింది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే కొత్త ప్రాజెక్టుల్లో యూనిట్ల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా నమోదయ్యాయి. 2021లో హైదరాబాద్ మార్కెట్లో 25,410 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కాగా, అందులో 55 శాతం యూనిట్లు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లోనివే కావడం గమనార్హం. 2019లో 16,560 యూనిట్ల ఇళ్ల అమ్మకాలతో పోలిస్తే స్వీకరణ రేటు (మొత్తం విక్రయాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి) పెరిగింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ అనరాక్ ఈ మేరకు ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. దేశంలోని ఏడు నగరాల్లో 2021లో కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 35 శాతం ఫ్లాట్స్ వెంటనే అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. బ్రాండెడ్ డెవలపర్ల నుంచి కొత్త ప్రాజెక్టులు రావడం, అదే సమయంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులకు డిమాండ్ ఏర్పడడం సానుకూలించినట్టు పేర్కొంది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు సంబంధించిన గణాంకాలకు ఇందులో చోటు కల్పించింది. నివేదికలోని వివరాలు.. ► ఏడు నగరాల్లో 2021లో 2.37 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇందులో 34 శాతం కొత్త ప్రాజెక్టుల్లోనివి ఉన్నాయి. మిగిలిన 66 శాతం యూనిట్లు అంతక్రితం సంవత్సరాల్లో ఆరంభించిన ప్రాజెక్టుల్లోనివి. ► అంతక్రితం 2020లో 7 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 1.38 లక్షలుగా ఉంటే, అందులో కొత్త ప్రాజెక్టులకు సంబంధించినవి 28 శాతం. ► 2019లో అమ్ముడైన 2.61 లక్షల యూనిట్లలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన యూనిట్లు 26 శాతంగా ఉన్నాయి. ► చాలా కాలం తర్వాత కొత్తగా మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది. రెడీ టు మూవ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణంగా అనరాక్ పేర్కొంది. ► అయితే ఇప్పటికీ త్వరలో నిర్మాణం పూర్తయ్యే వాటికి, వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న వాటిల్లోనే ఎక్కువ కొనుగోళ్లు నమోదవుతున్నాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాల పరంగా తక్కువ రేటును చూపించింది. 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోతే, అందులో కొత్త ప్రాజెక్టుల్లోనివి 26 శాతంగానే ఉన్నాయి. ► బెంగళూరులో 2021లో 33,080 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కొత్త ప్రాజెక్టుల్లోని యూనిట్ల అమ్మకాలు 35 శాతం. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో కొత్త ప్రాజెక్టుల్లోని విక్రయాలు మొత్తం విక్రయాల్లో 30 శాతంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో 25 % డౌన్ : నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 25 శాతం తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 5,146 యూనిట్లు అమ్ముడుపోయాయని వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ గణాంకాలను తన నివేదికలో విడుదల చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండో పర్యాయం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వల్ల ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్టు విశ్లేషించింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం రూ.25 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లపై ఎక్కువ ప్రభావం చూపించినట్టు తెలిపింది. ఈ విభాగంలో కేవలం 844 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నివేదికలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఇదే విభాగంలో 2,888 యూనిట్లకు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తు చేసింది. 2022 ఫిబ్రవరిలో నాలుగు జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లను పరిశీలించగా.. హైదరాబాద్ జిల్లా పరిధిలో క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూస్తే 64 శాతం క్షీణించాయని తెలిపింది. కానీ, సగటు రిజిస్ట్రేషన్ విలువలో మాత్రం 21 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘గడిచిన కొన్నేళ్లలో విక్రయ ధరల వృద్ధి పరంగా హైదరాబాద్ దేశంలోనే బలమైన ఇళ్ల మార్కెట్‌గా ఉంది. 2022 మొదటి రెండు నెలల్లో రిజిస్ట్రేషన్లు తగ్గముఖం పట్టాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వ్యయాలు పెగడం, వైరస్ కారణంగా ఏర్పడిన నిర్వహణ సమస్యలే ఇందుకు కారణం’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. -
పెరుగుతున్న హైరైజ్ ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లలో ఎక్కువగా కనిపించే హైరైజ్ నిర్మాణాలు క్రమంగా హైదరాబాద్‌లోనూ జోరందుకుంటున్నాయి. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలను లేకపోవటం, స్థలాల కొరత వంటివి నగరంలో ఆకాశహర్మ్యాల పెరుగుదలకు కారణం. గతేడాది హైదరాబాద్‌లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్‌లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే భాగ్యనగరం ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. దేశంలో అత్యధికంగా ముంబైలో 263 , పుణేలో 170 హైరైజ్ ప్రాజెక్ట్‌లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఏటా సగటున 1,400 అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తుల పైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలుంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్‌లుంటాయి. 2019లో 236 ఐదు ఫ్లోర్లపైన నివాసాల బహుళ నిర్మాణ ప్రాజెక్ట్‌లు వస్తే.. 2020లో కోవిడ్ లాక్‌డౌన్‌తో 115కి తగ్గాయి. 2021లో మళ్లీ పుంజుకుంది. 2020తో పోలిస్తే గతేడాది హైరైజ్ భవనాల లాంచింగ్స్‌లో 41 శాతం వృద్ధి రేటు నమోదయింది. గతేడాది గ్రేటర్ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి లభించగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. పశ్చిమ హైదరాబాద్‌లోనే.. షేక్‌పేట, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలే కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో గతేడాది మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. సహజంగానే ఇక్కడ కొలువు ఉండే ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉండటంతో ఎకరాల విస్తీర్ణంలో ఆకాశాన్నంటే ఎత్తయిన గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. జీవనశైలికి అనుగుణంగా.. ముంబై వంటి ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. హైదరాబాద్‌కు ఆ సమస్య లేదు. ఔటర్ చుట్టుప్రక్కల కొన్ని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ మంది కోరుకోవటమే అంటున్నారు నిపుణులు. అందుకే బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఉప్పల్, బేగంపేట, సంతోష్‌నగర్, అత్తాపూర్, అప్పా జంక్షన్, బాచుపల్లి, మియాపూర్, సికింద్రాబాద్, బొల్లారం వంటి ప్రాంతాలలో భారీ భవంతులు వస్తున్నాయి. పాత వాటి స్థానంలో ఎత్తయిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటేటా ఈ తరహా ఎత్తయిన గృహ సముదాయాలు పెరుగుతున్నాయి. -
కొత్త ప్రాజెక్టులపై సర్వే.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ ఆదేశాల మేరకు కొత్త ప్రాజెక్టుల సర్వేకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు నీళ్లు అందకుండా పోయే ప్రమాదముందని కేబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తాగునీటికీ ఇక్కట్లు తప్పవని సమావేశంలో పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు చేరకముందే మళ్లించేలా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. కొత్త ప్రాజెక్టుల సర్వేకు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఆదేశించిన పనులు ఇవే.. ►శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్‌లో జోగుళాంబ బ్యారేజీ నిర్మించి 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేస్తారు. ►భీమా నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి గ్రామం నుంచి వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు పరిధిలోని గోపాలదిన్నె రిజర్వాయర్ వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపుతారు. ►ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల గ్యాప్ ఆయకట్టుకు నీళ్లివ్వడానికి సుంకేశుల బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో కొత్త ఎత్తిపోతల పథకం చేపడతారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు దీని ద్వారా నీళ్లిస్తారు. ►కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తారు. ►పులిచింతల డ్యాం ఫోర్‌షోర్‌లో ఎత్తిపోతల పథకం చేపట్టి నల్లగొండ జిల్లాలోని అప్ల్యాండ్ ప్రాంతాల్లో గల 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తారు. ►నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి కాల్వ చివరి, ఎగువ ప్రాంతాల్లోని లక్ష ఎకరాలకు నీళ్లిస్తారు. -
Telangana: కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణానదిపై జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో జోగులాంబ బ్యారేజీని నిర్మించి 60-70 టీఎంసీల నీటిని తరలించాలని తీర్మానించింది. ఈ నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి.. పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు అందించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటి విషయంగా అన్యాయం జరుగుతోందని, ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటాను వినియోగించుకునేలా మరిన్ని కొత్త పథకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రాజెక్టులపై ప్రధాని నుంచి ప్రజాక్షేత్రం వరకు.. భేటీ సందర్భంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించిన కేబినెట్.. రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రం, ఎన్జీటీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేయడం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో ప్రధానమంత్రిని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, ఏపీ ప్రాజెక్టులను ఆపివేయించేలా చూడాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎత్తిచూపాలని.. రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లోనూ వివరించాలని మంత్రివర్గం ఆలోచనకు వచ్చింది. ఏపీ ప్రాజెక్టుల పర్యవసానంగా రాష్ట్రంలో కృష్ణా బేసిన్ ప్రాంతాలకు జరిగే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. కేంద్రం తీరుపై ఆవేదన నదీ జలాల విషయంలో కేంద్రం తీరును మంత్రివర్గం తప్పుపట్టింది. తెలంగాణకు న్యాయమైన వాటాకోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం– 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన అంశంపై చర్చించింది. సుప్రీంకోర్టులో కేసుల వల్ల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను వెనక్కి తీసుకుంటే త్వరగా నిర్ణయం తీసుకుంటామని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని మంత్రివర్గం గుర్తు చేసింది. కేంద్రం సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకున్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం వైఖరి కారణంగా తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. రాష్ట్ర రైతుల ప్రయోజనాల రక్షణ కోసం ఎంత దూరమైనా పోవాలని అభిప్రాయపడింది. ప్రాజెక్టులపై కేబినెట్ నిర్ణయాలివీ.. పులిచింతల ఎడమ కాల్వ నిర్మించి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతంలో మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలి. కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణలో ప్రవేశించే కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలి. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు నీరివ్వాలి. సాగునీటి శాఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే సర్వేలు నిర్వహించి, డీపీఆర్‌ల తయారీ కోసం చర్యలు తీసుకోవాలి. వానాకాలం ప్రారంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఈ సమయంలోనే తెలంగాణకు హక్కుగా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల్లో వీలైనంత మేరకు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోసుకోవడంతోపాటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు. కృష్ణా, గోదావరి నదులపై 2,375 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో పూర్తి సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసి.. కాళేశ్వరం, దేవాదుల, ఏఎమ్మార్పీ తదితర పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. -
24 వేల కోట్లతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ పై హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్హెచ్ఆర్ఎస్సీఎల్) గురువారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 24 వేలకోట్లతో ప్రారంభించే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. మెదటగా ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ఆరు రైళ్లను నడపనున్నారు. గుజరాత్లో ఎన్హెచ్ఆర్ఎస్సీఎల్ 325 కి.మీ. సంబంధించిన భూమి, ప్రాజెక్ట్ వివరాలను ఎల్ అండ్ టీ కి అప్పజెప్పింది. అయితే గుజరాత్ వైపు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మహారాష్ష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు భూమిని సమకూర్చాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం జపాన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా..అన్ని ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుందని జపాన్ అంబాసిటర్ సంతోష్ సుజుకీ అభిప్రాయపడ్డారు. రైల్వే బోర్డు సీఈఓ, చైర్మన్ వి.కే యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మరో ఏడు మార్గాలలో ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల వల్ల టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నారు. ఇంజనీర్స్, టెక్నీషియనన్స్, డిజైనర్ లాంటి స్కిల్ కలిగిన వారికి మాత్రమే కాక, నిర్మాణ కార్మికులకు, సెమీ స్కిల్ వర్కరర్స్కు పని దొరుకుతుందని పేర్కొన్నారు. -
కొత్త ప్రాజెక్టులను అపెక్స్ ఆపమంది..!
సాక్షి, వరంగల్: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్లో ఉమ్మడి వరంగల్ ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్, గోదావరి బేసిన్లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కొత్తగా చేపడుతున్న తొమ్మిది ప్రాజెక్టుల పనులను తక్షణమే ఆపాలని కేంద్రమంత్రి ఆగస్టు 11న ఆదేశాలు జారీ చేశారు. అయితే, తొమ్మిది ప్రాజెక్టుల జాబితాలో ఏడు తెలంగాణకు సంబంధించినవి కాగా, ఇందులో నాలుగు ఉమ్మడి వరంగల్‌లోనివే ఉన్నాయి. తాజాగా మంగళవారం ఇదే అంశంపై కేంద్రమంత్రి షెకావత్ రెండు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మరోమారు జిల్లా ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఆపాలన్న ప్రాజెక్టులు ఇవే... కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణకు సంబంధించినవి ఏడు ఉన్నాయి. తెలంగాణ సాగునీటి సరఫరా పథకం, సీతారామ ఎత్తిపోతలు, లోయర్ పెనుగంగ నదిపై బ్యారేజీలు, కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతలు, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలపై అభ్యంతరాలు చెప్పింది. ఇందులో రామప్ప, పాకాల సరస్సు మళ్లింపు, కాళేశ్వరం మూడో టీఎంసీ, తుపాకులగూడెం(సమ్మక్క సాగర్), గోదావరి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి వరంగల్‌లోని కీలక ప్రాజెక్టులు. తెలంగాణకే తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం కూడా తుది దశకు చేరింది. తుపాకులగూడెం పనులు శరవేగంగా సాగుతుండగా, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపుపై కూడా జల్‌శక్తి శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియా సమావేశంలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌దేనని గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేయడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. డీపీఆర్‌ల తయారీపై కసరత్తు అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలను వారంలోగా సిద్ధం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. మంగళవారం సమావేశం ముగిసిన వెంటనే నీటిపారుదలశాఖ కార్యదర్శి ఉమ్మడి వరంగల్‌లో ప్రాజెక్టుల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం మూడో టీఎంసీతో సహా అభ్యంతరాలు వ్యక్తమైన నాలుగు ప్రాజెక్టులపైనా నివేదికలు సిద్ధం చేయడంపై దృష్టి సారించారు. ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలకు సంబంధించి పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంజినీర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. అపెక్స్ కౌన్సిల్‌కు ముందే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. కౌన్సిల్ తర్వాత కూడా స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిధిని మార్చి రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలు మళ్లించేలా సామర్థ్యాన్ని పెంచింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలనకు ఇవ్వకుండానే పనులు చేపట్టారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు పరిధి లేదా వ్యయంలో మార్పు జరిగితే మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుందని కౌన్సిల్ సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సు వరకు మళ్లింపు పథకంపై కొత్త డీపీఆర్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
సరికొత్త బిహార్‌లో నితీశ్ కీలకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువెళ్లడంలో బిహార్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సుపరిపాలనపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. సరికొత్త భారత్, సరికొత్త బిహార్ లక్ష్యంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సుపరిపాలన మరో అయిదేళ్ల పాటు కొనసాగాలన్నారు. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకి ప్రభుత్వ పథకాలతో ఎంత లబ్ధి చేకూరుతుందో గత 15 ఏళ్లుగా బిహార్‌వాసులకి తెలుస్తోందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రూ.900 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజ్టెల్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పారాదీప్–హల్దియా–దుర్గాపూర్ పైప్‌లైన్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు, బంకా, చంపరాన్‌లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) బాటిలింగ్ ప్లాంట్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఆ రాష్ట్ర ఎన్డీయే కూటమిలో చీలికలు వస్తున్నాయన్న ఊహాగా నాలకు తన ప్రసంగం ద్వారా చెక్ పెట్టారు. -
ఢిల్లీ తరహాలో కాన్స్టిట్యూషన్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. చట్ట సభలకు సరికొత్త భవన సముదాయం.. ఇప్పటికే భూమి పూజ జరుపుకొని నిర్మాణాలకు సిద్ధమైన రెండు కొత్త ప్రాజెక్టులు. ఈ జాబితాలో మరోటి కూడా చేరబోతోంది. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్లబ్. ఢిల్లీలో ఉన్న కాన్స్టిట్యూషన్ క్లబ్ తరహాలో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రజాప్రతినిధులకు ఇలాంటి వసతి అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా భావిస్తున్నారు. ఇప్పుడు కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ముందడుగు వేసిన నేపథ్యంలో.. దీన్ని కూడా సాకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు ఏడాదిగా ఆయన రోడ్లు భవనాల శాఖ అధికారులతో తరచూ ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. హైదర్‌గూడలో ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్ల భవన సముదాయ ప్రారంభోత్సవం రోజునే ఆయన దీనిపై కొంత స్పష్టతనిచ్చారు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు కూడా దానిపై కొంత సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంలో చర్చ సందర్భంగా అసెంబ్లీ బీఏసీ సమావేశంలో దీని ప్రస్తావన తెచ్చారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించినట్టు తెలిసింది. ఆధునిక వసతులతో.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఉన్నట్టుగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యుల కోసం ఓ క్లబ్ అవసరమని సీఎం భావిస్తున్నారు. ఢిల్లీలోని ఎంపీల కాన్స్టిట్యూషన్ క్లబ్ తరహాలోనే ఇక్కడి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడిపేందుకు.. ఫంక్షన్లు, గెట్ టు గెదర్లు, సమావేశాలు, సదస్సులు, ఇష్టాగోష్టుల నిర్వహణ... తదితరాల కోసం ఈ ప్రత్యేక క్లబ్ ఉపయోగపడనుంది. ఇందులో అత్యాధునిక సమావేశ మందిరాలు, సౌకర్యవంతమైన గదులు, ఆధునిక వసతులతో ఫంక్షన్ హాలు, రెస్టారెంట్, డైనింగ్ హాళ్లను, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడా కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన స్థలం అవసరం కావటంతో ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్ల స్థలాన్ని దీనికి ఎంపిక చేశారు. ప్రస్తుతం అందులోని క్వార్టర్లలో ఇతరులు ఉంటున్నారు. వాటి నిర్వహణ కూడా సరిగా లేదు. కొత్త క్వార్టర్లతో కూడిన సముదాయం అందుబాటులోకి వచ్చినందున దీని అవసరమే లేదు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాంతం దీనికి యోగ్యంగా ఉంటుందని గతంలోనే నిర్ణయించారు. తాజాగా బీఏసీలో దీని ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మాజీ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, మాజీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి, ఇతర సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులకు ఇందులో సభ్యత్వాలు ఉంటాయని సమాచారం. కానీ దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. రెండేళ్ల తర్వాత అందుబాటులోకి.. ఆర్థిక మాంద్యం, ఇతర సమస్యల కారణంగా కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణం జాప్యమయ్యే అవకాశం ఉంది. అన్ని అవాంతరాలు అధిగమించి వాటిని పూర్తి చేసిన తర్వాతనే ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం ఉంటుందని అధికారులంటున్నారు. రెండుమూడేళ్ల తర్వాత గాని అది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు. -
2025 నాటికి కోటి టన్నుల ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్ సిమెంట్స్ భారీగా విస్తరిస్తోంది. 2025 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్ టన్నులకు (కోటి టన్నులకు) చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రతి 10 ఏళ్లకు సామర్థ్యాన్ని రెండింతలు చేయాలన్నది సంస్థ ధ్యేయం. ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్లతో కలిపి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 5.75 మిలియన్ టన్నులు. తాజా విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్, ఒడిశాలో ఏర్పాటు చేయనున్న రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను దక్కించుకుంది. ఈ నెలలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాల కాలుష్య నియంత్రణ మండలి నుంచి క్లియరెన్సులు రానున్నట్లు సాగర్ సిమెంట్స్ జేఎండీ సమ్మిడి శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇవి పూర్తి అయితే తయారీ సామర్థ్యం 8.25 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ఒక్కొక్కటి రూ.725 ధరలో 31,00,000 కన్వర్టబుల్ వారంట్లను జారీ చేస్తామని తెలిపారు. 2021 మార్చికల్లా పూర్తి.. కంపెనీ ఒక మిలియన్ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద ఏర్పాటు చేస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 5.5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును సైతం నిర్మిస్తోంది. వీటి కోసం రూ.425 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో ఈక్విటీ రూ.150 కోట్లు ఉంటుంది. ఇక ఒడిశాలోని జాజ్‌పూర్ వద్ద ఉన్న జాజ్‌పూర్ సిమెంట్స్‌ను(జేసీపీఎల్) ఇటీవలే రూ.108 కోట్లు వెచ్చించి సాగర్ సిమెంట్స్ దక్కించుకుంది. 100 శాతం అనుబంధ సంస్థగా ఉండే జాజ్‌పూర్ సిమెంట్స్ ద్వారా రూ.308 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. ప్రతిపాదిత కొత్త ప్రాజెక్టుల కోసం యంత్రాలకై ఆర్డర్లు ఇచ్చామని, డెన్మార్క్, జర్మనీకి చెందిన దిగ్గజ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయని చెప్పారాయన. 2021 మార్చికల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కొత్త మార్కెట్లకు.. సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం దక్షిణాది మార్కెట్లతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలో విస్తరించింది. ఇండోర్ ప్లాంటు పూర్తయితే పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్తాన్, తూర్పు గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఇండోర్, వడోదర, బోపాల్, అహ్మదాబాద్ నగరాలు 110 నుంచి 330 కిలోమీటర్ల పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఒడిశా ప్లాంటు రాకతో ఉత్తర, మధ్య ఒడిషా, తూర్పు ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బెంగాల్లో సిమెంటు మార్కెట్ చేసేందుకు వీలవుతుంది. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, కోల్‌కతా, రాంచి, జంషెడ్పూర్ పట్టణాలను కవర్ చేయవచ్చునని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లుగా ధర పెంచలేదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు కావాల్సిన సిమెంటును రెండేళ్లుగా కంపెనీలు తక్కువ ధరలో సరఫరా చేస్తున్నాయి. డీజిల్ ధర ఈ రెండేళ్లలో 25 శాతం పెరిగిందని, వ్యయ భారం ఉన్నా హామీ ఇచ్చిన ధరలోనే కంపెనీలు సిమెంటును సప్లయ్ చేశాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లో గతేడాది సిమెంటు అమ్మకాల్లో 40 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది వృద్ధి స్థిరంగా ఉండొచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
వడివడిగా ప్రాజెక్టులు
ఈ ఏడాది సాగులోకి మరో 12 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచీ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఐదేళ్ల కాలంలో 10 ప్రాజెక్టులను పూర్తి చేయగా మరో 13 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణగా మారుస్తామన్న ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని 1.25 కోట్ల ఎకరాల మాగాణంగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు, పథకాల కింద 70.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 2004లో మొదలైన జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలతో ప్రభుత్వం ఇప్పటివరకు 16.65 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చింది. ఇందులో రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం విశేషం. ప్రధానంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, దేవాదుల, సింగూరు వంటి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కిందే 10.94 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 54.05 లక్షల ఎకరాలను వృధ్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది ఖరీఫ్ నాటికి కనిష్టంగా దాదాపు 12 లక్షల ఎకరాలకైనా కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్లలో రూ. 81 వేల కోట్లు... రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 80వేల కోట్ల మేర సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 23 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ. 30,588 కోట్లు ఖర్చు చేసింది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. 18 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయగా వాటి ద్వారా మరో రూ. 5 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. మొత్తంగా కార్పొరేషన్ రుణాల ద్వారా ఇంతవరకు రూ. 33,664 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్ కిందే మొత్తంగా రూ. 28,661 కోట్ల మేర ఖర్చు జరిగింది. మొదలుకానున్న కాళేశ్వర శకం... రాష్ట్ర సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల శకం మొదలు కానుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటిని పంట పొలాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది జూలై చివరి నుంచి కాళేశ్వరం ద్వారా కనీసం 150 టీఎంసీల నుంచి గరిష్టంగా 200 టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు పూర్తవగా పంప్‌హౌస్‌లలో ఈ నెల మొదటి లేదా రెండో వారం నుంచి డ్రై రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో ఇప్పటికే 4 మోటార్ల డ్రై రన్ పూర్తయింది. ప్యాకేజీ–7లో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–8లో మోటార్లన్నీ సిద్ధమయ్యాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు జరగకున్నా ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే పనులు చివరికొచ్చాయి. మొత్తంగా ఈ ఖరీఫ్‌లోనే 10 లక్షల ఎకరాల స్థిరీకరణ, మరో 90 వేల ఎకరాల మేర కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు చేస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ సక్సెస్.. ఇక చెక్‌డ్యామ్‌లపై దృష్టి తెలంగాణ తొలి ప్రభుత్వం చిన్న నీటివనరుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. నాలుగు విడతల్లో 26,926 చెరువులను పునరుద్ధరించింది. ఇందుకోసం రూ. 3,979.53 కోట్లు ఖర్చు చేసింది. ఈ పనులతో 8.53 టీఎంసీల నీటి నిల్వ పెరగడంతోపాటు 13.57 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇక ఇప్పుడు ఎక్కడి నీటిని అక్కడే కట్టడి చేసేలా గొలుసుకట్టు చెరువుల వద్ద చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సర్కారు సిద్ధమైంది. మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు, 3 వేల తూముల నిర్మాణం చేయాలని భావిస్తోంది. తూముల నిర్మాణం ద్వారా 8,350 చెరువులను నింపేలా పనులు మొదలుపెట్టింది. ఇందుకోసం రూ. 4,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే తూముల టెండర్ల పనులు మొదలవగా చెక్‌డ్యామ్‌లకు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నిర్జీవంగా మారిన భూములన్నీ ఇప్పుడు నిండు సత్తువను సంతరించుకుంటున్నాయి. నీటి జాడ లేక వట్టిపోయిన చెరువులన్నీ నేడు నీటితో కళకళలాడుతున్నాయి. పడావు భూములు కాస్తా పచ్చని పంట పొలాలుగా మారుతున్నాయి. అరవై ఏళ్లుగా సాగునీటి కోసం పడ్డ అరిగోస.. ఐదేళ్ల కాలంలోనే కోటి ఎకరాల మాగాణం దిశగా వడివడిగా పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంలో ఇప్పటికే 71 లక్షల ఎకరాల మార్కును దాటింది. తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్న ఐదేళ్ల కాలంలోనే ఏకంగా కొత్తగా 12.77 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా మరో 14.78 లక్షల ఎకరాల స్థిరీకరణ పూర్తయింది. ప్రాజెక్టులపై మొత్తంగా 2004 నుంచి ఇప్పటివరకు రూ. 1.11 లక్షల కోట్ల మేర ఖర్చవగా గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ. 81 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. నాలుగేళ్లలో మరో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కోటి ఎకరాల మాగాణ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. – సాక్షి, హైదరాబాద్ -
5 నగరాల్లో క్రెడాయ్ హరిత భవనాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్ట్‌లను నిర్మించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) లకి‡్ష్యంచింది. ఇందులో భాగంగా 5 నగరాల్లో హరిత భవనాలను నిర్మించనుంది. ఈ మేరకు క్రెడాయ్ యూత్వింగ్, క్రెడాయ్ ఉమెన్స్ వింగ్ వ్యవస్థాపక వేడుకలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఎంవోయూ కుదుర్చుకుంది. తొలుత హైదరాబాద్, ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, ముంబై నగరాల్లో గ్రీన్ బిల్డింగ్స్‌లను నిర్మిస్తామని.. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని క్రెడాయ్ అధ్యక్షుడు సతీష్ మగర్ తెలిపారు. ‘‘రెండు దశాబ్దాలుగా మన దేశం గ్రీన్ బిల్డింగ్ మూమెంట్లో లీడర్‌గా ఉందని, క్యాంపస్, టౌన్‌షిప్స్, సిటీల వంటివి అన్నీ కలిపి 6.8 బిలియన్ చ.అ.లకు పైగా హరిత భవనాలున్నాయని’’ ఐజీబీసీ చైర్మన్ వీ సురేశ్ తెలిపారు. 2012 నుంచి ఐజీబీసీ, క్రెడాయ్ మధ్య ఎంవోయూ కుదుర్చుకోవటం ఇది మూడో సారి. -
నిధుల్లేకుండానే చంద్రబాబు శిలాఫలకాలు,శంకుస్థాపనలు
-
‘కోస్టల్ బెర్త్’లో రూ. 2,302 కోట్ల ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సాగరమాల కింద ‘కోస్టల్ బెర్త్ పథకం’లో రూ. 2,302 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నామని కేంద్రం ప్రకటించింది. మొత్తం 47 ప్రాజెక్టులకు గాను మహారాష్ట్రకు 12, ఏపీ, గోవాలకు పదేసి చొప్పున, కర్ణాటక 6, కేరళ, తమిళనాడుకు మూడేసి, గుజరాత్ 2, పశ్చిమ బెంగాల్‌కు ఒక ప్రాజెక్టు కేటాయించామని కేంద్ర నౌకాయాన శాఖ తెలిపింది. ఈ పథకంలో ప్రముఖ ఓడరేవులు, రాష్ట్రాల మారీటైం బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకూ రూ. 620 కోట్లు మంజూరు చేశామని, మిగతా 24 ప్రాజెక్టులకు అనుమతుల కేటాయింపులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది. -
నేడు కృష్ణా బోర్డు భేటీ
కొత్త ప్రాజెక్టులు, వర్కింగ్ మాన్యువల్‌పై చర్చ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగనుంది. ఈ భేటీలో బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతోపాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు, అంతర్రాష్ట్ర జల వివాదాల విభాగం అధికారులు పాల్గొననున్నారు. మొత్తం 8 అంశాలపై బోర్డులో చర్చించనుండగా ప్రధాన చర్చ కొత్తప్రాజెక్టులు, ఈ ఏడాదికి వర్కింగ్ మాన్యువల్, నీటి పంపిణీ, చిన్న నీటి వనరుల కింద నీటి వినియోగంపైనే ఉండనుంది. ముఖ్యంగా ఏపీ చేపట్టిన ఆయా ప్రాజెక్టుల నీటి వినియోగంపై తెలంగాణ ప్రశ్నించనుంది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటాలపైనా నిలదీయనుంది. రాష్ట్రానికి చెందిన పాలమూరు, డిండి, భక్తరామదాస ప్రాజెక్టులు కొత్తగా చేపట్టినవి కావని స్పష్టం చేయనుంది. -
అధికారిక ఆమోద ముద్ర
► హెచ్ఎండీఏఎ పరిధి మరింత విస్తృతం ► పలు ప్రాజెక్టులకు మంత్రి కేటీఆర్ ఆమోదం ► రెండేళ్లలో బాటసింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్స్ పార్క్‌లు ► బాపూఘాట్, ఉప్పల్ భగత్ లేఅవుట్ల వద్ద మూసీ పరిసరాల సుందరీకరణ ► హెచ్ఎండీఏ ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యచరణపై మంత్రి సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు మోక్షం కలుగనుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనుల నిర్వహణకు మంత్రి పచ్చజెండా ఊపారు. మరో వారంలో రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారికంగా అనుమతులు రానున్నాయి. హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతి, నూతన ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి కె. తారక రామారావు సమీక్షించారు. మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ హైవే ఉన్న బాటసింగారం, నాగార్జునసాగర్ రహదారిలో మంగళపల్లి వద్ద రెండు లాజిస్టిక్స్ పార్క్‌ల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. బాట సింగారం వద్ద రూ. 35 కోట్లతో 40 ఎకరాల్లో, మంగళపల్లి వద్ద రూ. 20 కోట్ల వ్యయంతో 20 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్‌లను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగియడంతో.. రెండేళ్లలో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. సరుకు, ప్రయాణికుల రవాణా వాహనాలు పార్క్ చేసేందుకు వీలుగా మియాపూర్‌లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. రూ. 100 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ టెర్మినల్‌ను మెట్రో రైలు మార్గంతో అనుసంధానించాలన్నారు. భువనగిరి, తిమ్మాపూర్, ఈదుల నాగులపల్లి, మనోహరాబాద్, రావులపల్లిలోనూ సరుకు రవాణా టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ గతంలో చేసిన ప్రతిపాదన ను మంత్రి ప్రస్తావిస్తూ.. ఈ విషయమై లాజిస్టిక్ స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పీపీపీ పద్ధతిలో అమీర్‌పేటలో 1600 గజాల్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. 65 ఎకరాల్లో ఎకో పార్క్.. శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో ఎకో పార్క్ ఏర్పాటుకు మంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. 65 ఎకరాల్లో అక్వాటిక్ బర్డ్, బటర్ ఫ్లై పార్క్, పల్లె వాతావరణం ప్రతిబింబించేలా హట్స్, పబ్లిక్ పార్క్, ఓపెన్ ఎయిర్ థియేటర్, అగ్రో పార్క్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. వచ్చే పదేళ్లలో హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. రెండు నెలల్లో ఈ అంశంపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. హెచ్ఎండీఏలో ప్రతి ప్రాజెక్టు కీలకమని, సమష్టి కృషితో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నగర జనాభా పెరుగుతున్న దృష్ట్యా హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని,నిధుల సేకరణలో వినూత్న పద్ధతులు అవలంభించాలని సూచించారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)పై చర్చించిన మంత్రి... 283 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ ఉంటుందని సూత్రప్రాయంగా వెల్లడించారు. ఈ మార్గంలో నాలుగు, ఆరు లేన్ల రోడ్ల నిర్మాణానికి విడివిడిగా అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. రెండు కొత్త ప్రాజెక్టులు.. బాపూఘాట్, ఉప్పల్ భగత్ లేఅవుట్ వద్ద మూసీ పరిసర ప్రాంతాలను సుందరీకరించనున్నట్లు తెలిపారు. బాపూఘాట్ వద్ద ఈసా, మూసీ నదులు కలిసే చోట 60 ఎకరాల్లో సుందరీకరణ పనులు చేపడతామని తెలిపారు. అయితే ఇక్కడి భూమి పర్యాటకశాఖ అధీనంలో ఉండడంతో త్వరలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్ భగత్ వద్ద మూడు ఎకరాల్లో సుందరీకరణ చేస్తామన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉత్పత్తికి ఊతం
ఈ ఏడాదిలో తొమ్మిది కొత్త ప్రాజెక్టులు లక్ష్యం 64.5 లక్షల టన్నుల ఉత్పత్తి కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నూతన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి నూతన గనుల ద్వారా సుమారు 64.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ విస్తరించి ఉన్న 11 ఏరియాల్లో 16 ఓపెన్‌కాస్టులు, 30 భూగర్భగనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. నూతన గనుల ఏర్పాటుతో 2016-17 వార్షిక ఉత్పత్తి లక్ష్యం 66 మిలియన్ టన్నులు చేరుకోవడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. బెల్లంపల్లి ఓసీ-2 గని గ్రౌండింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యూరుు. ఈనెలలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ గని ద్వారా ప్రతి ఏడాది 10 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయడమే లక్ష్యం. కాసిపేట-2 ఇన్‌క్లైన్ గని గ్రౌండింగ్ పను లు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశాలున్నాయి. ఏడాదికి 4.70 లక్షల టన్నుల ఉత్పత్తి తీయూలని అంచనా.కేఓసీ పిట్-1 గని గ్రౌండింగ్ పనులు ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమై ఆగస్టు నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలు కానుంది. ఈ గని నుంచి ఏటా 30 లక్షల టన్నులు లక్ష్యం. ఈ ఏడాది మాత్రం 25 లక్షల టన్నులు తీయనున్నారు. శాంతిఖనిలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ఈ ఏడాది జూన్ నెలలో ప్రవేశపెట్టి ఏటా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. జేవీఆర్ ఓసీ-2 గనిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రౌండింగ్ ప్రారంభించి అక్టోబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఏడాదికి 40 లక్షల టన్ను లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది 15 లక్షల టన్నుల ఉత్పత్తి నిర్దేశించారు.మణుగూరు ఓపెన్‌కాస్టును నవంబర్‌లో ప్రారంభించి ఈ ఏడాది 5 లక్షల టన్ను లు బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఏటా 15 లక్షల టన్నులు లక్ష్యం. కేటీకే ఓసీ-2 గని గ్రౌండింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఏటా 12.50 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం. ఈ ఏడాది 2 లక్షల టన్నులు వెలికితీయనున్నారు. పీవీకే కంటిన్యూయస్ మైనర్ యంత్రా న్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి 2లక్షల టన్నులు ఉత్పత్తి చేయనున్నారు.కేకేకే ఓసీ ప్రాజెక్టును వచ్చే మార్చిలో ప్రారంభించి 3.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఈ కొత్త గనుల అసలు లక్ష్యం 138.2 లక్షల టన్నులు. నిర్దేశించిన సమయాల్లో ప్రారంభమైతే ఈ ఏడాది 64.5 లక్షల టన్నుల బొగ్గు అదనంగా కంపెనీకి సమకూరుతుంది. వచ్చే ఏడాది నుంచి 138.2 లక్షల టన్నులు వస్తుంది.