న్యూఢిల్లీ: లోధా బ్రాండ్ పేరుతో రియల్టీ రంగంలో ఉన్న మాక్రోటెక్ డెవలపర్స్ మార్చి నాటికి కొత్తగా 16 ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. వీటి విలువ రూ.10,300 కోట్లు. విస్తీర్ణం 73 లక్షల చదరపు అడుగులు. ప్రాజెక్టుల్లో కొన్ని కంపెనీ సొంతం కాగా, మరికొన్ని స్థల యజమానులతో కలిసి అభివృద్ధి చేయనుంది.
ఈ ఏడాది కంపెనీ ఏప్రిల్-సెప్టెంబర్‌లో 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటి అమ్మకం ద్వారా రూ.8,480 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ బలంగా ఉందని మాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో కంపెనీ రూ.6,004 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,960 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,500 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment