Lodha Group
-
దేశంలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ అమ్మకం.. కొన్నది ఎవరంటే?
గగనమే హద్దుగా రియల్ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే ముంబై మహానగరంలో లగ్జరీ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ఖరీదైన సౌత్ ముంబై మలబార్ హిల్స్ రెసిడెన్షియల్ టవర్స్‌లోని ఫ్లాట్లను ఫ్యామీకేర్ అధినేత జేపీ తపారియా రూ.369 కోట్లకు కొనుగోలు చేశారు. మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సూపర్ లగర్జీ ట్రిపుల్ ఎక్స్ అపార్ట్మెంట్లోని 26, 27, 28 ఈ మూడు ఫ్లోర్లను తపారియా సొంతం చేసుకున్నారు. 1.08 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు అరేబియా సముద్రం, హాంగింగ్ గార్డెన్స్ రెండింటినీ తాకుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రిపుల్ ఎక్స్ ఏరియా 27,160స్కైర్ ఫీట్లతో ఉండగా.. ఒక్కో స్కైర్ ఫీట్‌ను రూ1.36 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక స్టాంప్ డ్యూటీ కింద తపారియా కుటుంబం రూ.19.07 కోట్లు చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నీరజ్ బజాజ్ సైతం బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్, మలబార్ హిల్ ప్రాంతంలో మూడంతస్తుల (ట్రిప్లెక్స్) అపార్ట్‌మెంట్‌ని రూ.252.5 కోట్లతో కొనుగోలు చేశారు. సముద్రపు దిక్కుగా 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సొంతం చేసుకున్నారు. 31 అంతస్తులుగా నిర్మిస్తున్న లోధా మలబార్ ప్యాలెసెస్‌లో 29, 30, 31 అంతస్తుల్లో నీరజ్ బజాజ్ బుక్ చేసుకున్న ఈ ట్రిప్లెక్స్‌కు 8 కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. ఈ ఇంటికి స్టాంప్ డ్యూటీగానే రూ.15.15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్ కొనుగోలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో చైర్మన్ నీరజ్ బజాజ్ ముంబైలో అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో, సముద్ర తీరంలోని ఓ పెంట్ హౌస్ (ట్రిప్లెక్స్)ను రూ.252.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. గృహాల సెర్చింగ్ పోర్టల్ ఇండెక్స్‌ట్యాప్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ రియల్టీ డెవలపర్ లోధా గ్రూపు నుంచి నీరజ్ బజాజ్ ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగింది. రూ.15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు సమాచారం. మలబార్ ప్యాలసెస్ ప్రాజెక్ట్‌లోని 29, 30, 31 అంతస్తులను నీరజ్ బజాజ్ ఇంత భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణం (కార్పెట్ ఏరియా 12,624 చదరపు అడుగులు) పరిధిలో మూడు అంతస్తులుగా ఉంటుంది. ఎనిమిది కారు పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. గత నెలలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబైలోని వర్లిలో అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం తెలిసిందే. అలాగే డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సైతం పలు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. -
రూ.10,300 కోట్లతో 16 లోధా కొత్త ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: లోధా బ్రాండ్ పేరుతో రియల్టీ రంగంలో ఉన్న మాక్రోటెక్ డెవలపర్స్ మార్చి నాటికి కొత్తగా 16 ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. వీటి విలువ రూ.10,300 కోట్లు. విస్తీర్ణం 73 లక్షల చదరపు అడుగులు. ప్రాజెక్టుల్లో కొన్ని కంపెనీ సొంతం కాగా, మరికొన్ని స్థల యజమానులతో కలిసి అభివృద్ధి చేయనుంది. ఈ ఏడాది కంపెనీ ఏప్రిల్-సెప్టెంబర్‌లో 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటి అమ్మకం ద్వారా రూ.8,480 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ బలంగా ఉందని మాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో కంపెనీ రూ.6,004 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,960 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,500 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తోంది. -
మాక్రోటెక్ డెవలపర్స్‌కు రూ.933 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా బ్రాండ్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.933 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. తన బ్రిటిష్ అనుబంధ కంపెనీకి ఇచ్చిన రుణానికి సంబంధించి రూ.1,177 కోట్లు కేటాయింపులు చేయాల్సి రావడమే ఈ నష్టాలకు దారితీసినట్టు సంస్థ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.223 కోట్లుగా ఉండడం గమనించాలి. రుణానికి కేటాయింపులు, ఫారెక్స్ ప్రభావాలను పక్కన పెట్టి చూస్తే నికర లాభం 28 శాతం పెరిగి రూ.367 కోట్లుగా ఉంటుందని మాక్రోటెక్ డెవలపర్స్ వివరించింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,137 కోట్ల నుంచి రూ.1,761 కోట్లకు పరిమితమైంది. బ్రిటన్‌లో ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గాను లోధా డెవలపర్స్ యూకేకు గ్రూపు రుణాలు ఇవ్వాల్సి వచ్చినట్టు సంస్థ పేర్కొంది. ప్రస్తుతమున్న భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం తదితర పరిస్థితులు తమ రుణాలపై ప్రభావం చూపించినట్టు వివరించింది. ఎన్సీడీల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
లండన్‌లో మ్యాక్రోటెక్ విక్రయాలు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో లండన్‌లో రూ. 1,900 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించినట్లు వెల్లడించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రెండు ప్రాజెక్టుల నుంచి తాజా అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. దేశీయంగా లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను అభివృద్ధి చేసే కంపెనీ యూకే ప్రాజెక్టుల ద్వారా ఒక త్రైమాసికంలో తొలిసారి 19.1 కోట్ల పౌండ్ల(రూ. 1,900) అమ్మకాలు అందుకున్నట్లు వెల్లడించింది. 2013లో కెనడా ప్రభుత్వం నుంచి 30 కోట్ల పౌండ్ల(రూ. 3,100 కోట్లు)కు మ్యాక్‌డొనాల్డ్ హౌస్‌ను కొనుగోలు చేయడం ద్వారా మ్యాక్రోటెక్.. లండన్ ప్రాపర్టీ మార్కెట్లో ప్రవేశించింది. లోధా డెవలపర్స్ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ తదుపరి 2014లో 9 కోట్ల పౌండ్లకు న్యూ కోర్టు స్థలాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ గత రెండు త్రైమాసికాల్లో సాధించిన పటిష్ట బుకింగ్స్‌తో రానున్న నాలుగు నెలల్లోగా 22.5 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటి గడువు 2023 మార్చికాగా.. అంతకంటే ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. బీఎస్ఈలో మ్యాక్రోటెక్ డెవలపర్స్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,238 వద్ద ముగిసింది. -
రియల్టీ కింగ్ ఎంపీ లోధా
ముంబై: కరోనాతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో విక్రయాలు గణనీయంగా పడిపోయిన 2020లోనూ కొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్లు సంపద గడించారు. హరూన్ ఇండియా టాప్ 100 సంపన్న రియల్టర్ల జాబితా 2020లోకి కొత్తగా ఎనిమిది మంది వచ్చి చేరారు. ముఖ్యంగా దేశంలో అత్యంత సంపన్న రియల్టర్‌గా లోధా డెవలపర్స్ అధినేత (మాక్రోటెక్), బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోధా(ఎంపీ లోధా) నిలిచారు. ఈ జాబితాలో వరుసగా నాలుగో ఏడాది మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. హరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ సంపన్నుల జాబితా 2020 మంగళవారం విడుదలైంది. దేశంలోని టాప్ 100 రియల్టర్ల సంపద 2019తో పోలిస్తే గతేడాది (2020) 26 శాతం పెరిగి రూ.3,48,660 కోట్లకు చేరుకుంది. సగటున చూస్తే ఒక్కొక్కరి తలసరి సంపద రూ.3,487 కోట్లు. 6,000 కంపెనీలను ఈ జాబితాలోకి హరూన్ పరిగణనలోకి తీసుకుంది. ఆదాయం, నికర విలువ ఆధారంగా టాప్-100 మంది సంపన్న రియల్టర్ల జాబితాను రూపొందించింది. దేశంలోని 15 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు. విడిగా చూస్తే.. 65 ఏళ్ల ఎంపీ లోధా, ఆయన కుటుంబ ఆస్తి ఏడాది కాలంలో 39 శాతం పెరిగి రూ.44,270 కోట్లకు విస్తరించింది. 2014 నుంచి 2020 మధ్య విక్రయాల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా లోధా డెవలపర్స్ నిలిచింది. స్థల విస్తీర్ణం పరంగా చూస్తే రెండో స్థానంలో ఉంది. డీఎల్ఎఫ్ (61) అధినేత రాజీవ్‌షా రూ.36,430 కోట్లతో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. డీఎల్ఎఫ్ షేరు ర్యాలీ చేయడంతో ఆయన సంపద 45 శాతం వృద్ధి సాధించింది. చంద్రు రహేజా (80), కే రహేజా కుటుంబ సంపద 70 శాతం పెరిగి రూ.26,260 కోట్లకు చేరుకుంది. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచారు. ఎంబïసీ ఆఫీస్ పార్క్స్‌కు చెందిన జితేంద్ర వీర్వాణి రూ.23,220 కోట్ల సంపదతతో నాలుగో స్థానంలో ఉన్నారు. నిరంజన్ హిరనందాని రూ.20,600 కోట్లు (హిరనందాని కమ్యూనిటీస్), ఒబెరాయ్ రియాల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్ (రూ.15,770 కోట్లు), రాజా బగ్మానే రూ.15,590 కోట్లు, రున్వాల్ డెవలపర్స్ సుభాష్ రున్వాల్ (రూ.11,450 కోట్లు), పిరమల్ రియల్టీ అధినేత అజయ్ పిరమల్ (రూ.5,560 కోట్లు), ఫోనిక్స్ మిల్స్ అధినేత అతుల్ రుయా రూ.6,340 కోట్లతో వరుసగా 10 స్థానాల్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఐదుగురు హరూన్ సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ల జాబితా 2020లో హైదరాబాద్ నుంచి ఐదుగురు కూడా ఉన్నారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అధినేతలు సీ వెంకటేశ్వర రెడ్డి రూ.5,230 కోట్లు, ఎస్ సుబ్రమణ్యం రెడ్డి రూ.5,180 కోట్ల సంపదతో అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో టాప్ డెవలపర్లుగా జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మైహోమ్ కన్స్ట్రక్షన్స్కు చెందిన జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుటుంబ సంపద రూ.4,957 కోట్లుగా ఉంది. జాబితాలో జూపల్లి రామేశ్వరరావు 11వ స్థానంలో నిలిచారు. మధ్య స్థాయి ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లను నిర్మించే సంస్థల్లో మైహోమ్ కన్స్ట్రక్షన్స్ నంబర్1గా నిలిచింది. 12, 13వ స్థానాల్లో వరుసగా వెంకటేశ్వరరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి ఉన్నారు. ఎస్ఏఎస్ ఇన్ఫ్రాకు చెందిన జీవీరావు, ఆయన కుటుంబం రూ.1,010 కోట్ల నికర విలువతో 49వ స్థానంలో ఉండగా.. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం రూ.460 కోట్లతో 72వ ర్యాంకును దక్కించుకున్నారు. చదవండి: ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు -
లోధా డెవలపర్స్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ లోధా డెవలపర్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ముంబై కేంద్రంగా రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ గతంలో రెండుసార్లు పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు చేసింది. దీంతో తాజాగా మాక్రోటెక్ డెవలపర్స్ పేరుతో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించేందుకు అనుమతి కోరింది. కంపెనీ తొలిసారి 2009 సెప్టెంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,800 కోట్లను సమీకరించాలని భావించింది. 2010 జనవరికల్లా సెబీ అనుమతించినప్పటికీ ప్రపంచస్థాయిలో చెలరేగిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఐపీవో ప్రణాళికలకు మంగళం పాడింది. తదుపరి 2018 ఏప్రిల్‌లో మళ్లీ ఐపీవోను చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఈసారి రూ. 5,500 కోట్ల సమీకరణకు అనుమతి కోరింది. 2018 జులైకల్లా సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను సాధించింది. అయితే స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలను ఉపసంహరించుకుంది. 1995లో... ప్రయివేట్ రంగ సంస్థ లోధా గ్రూప్‌ను 1995లో మంగళ్ ప్రభాత్ లోధా ఏర్పాటు చేశారు. దేశీయంగా రియల్టీ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించింది. ముంబై, పుణేలతోపాటు లండన్‌లోనూ కార్యకలాపాలు విస్తరించింది. సేల్స్ బుకింగ్స్‌రీత్యా రెసిడెన్షియల్ విభాగంలో దేశీయంగా అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 10 శాతం వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఐపీవో నిధులలో రూ. 1,500 కోట్లను రుణ చెల్లింపులకు, రూ. 375 కోట్లను ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. ప్రీఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 500 కోట్లు సమీకరించే వీలున్నట్లు పేర్కొంది. చదవండి: అమెజాన్ ఇండియా భారీ మోసం గృహ రుణ సంస్థలకు ఆర్బీఐ కొత్త ఆదేశాలు -
త్వరలో మళ్లీ ట్రంప్ టవర్ అమ్మకాలు
ముంబయి: ముంబయిలోని ట్రంప్ టవర్ అమ్మకాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. 2019నాటికి టవర్ మొత్తాన్ని విక్రయించాలని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ లోధా గ్రూప్ ప్రకటించింది. సౌకర్యవంతమైన విల్లాల విక్రయ మార్కెట్లో లోధా గ్రూప్ ముందుంటుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో టవర్ అమ్మకాలను ఆపివేశారు. మొత్తం 75 అంతస్థుల ఈ భవనంలో 60శాతం ఇప్పటికే విక్రయించామని, మిగితా మొత్తాన్ని 2019నాటికి పూర్తి స్థాయిలో విక్రచయించాలనుకుంటున్నట్లు లోధా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా చెప్పారు. ‘ట్రంప్ విజయం సాధించిన వెంటనే ట్రంప్ టవర్ మొత్తాన్ని విక్రయించకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజకీయ పరమైన మార్పుల దృష్ట్యా ఇది ఎలాంటి సంకేతాన్నైనా ఇవ్వొచ్చు అని ఆపేశాం’ అని ఆయన చెప్పారు. జూన్ లేదా జూలై నెలలో విక్రయాలు జరపాలని అనుకుంటున్నామని, అప్పుడే తగిన సమయం అని తాము భావిస్తున్నామని తెలిపారు. -
లోధా గ్రూప్ రియల్టీ ఫండ్
రియల్టీ స్టార్టప్‌ల కోసం రూ.50 కోట్లతో ఏర్పాటు న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, లోధా గ్రూప్..రియల్టీ స్టార్టప్‌ల కోసం ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ప్రారంభించింది. రూ.50 కోట్ల మూలధనంతో ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశామని లోధా గ్రూప్ తెలిపింది. స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ అందించే స్టార్టప్‌లకు, రియల్టీ రంగంలోని స్టార్టప్‌లకు తగిన నిధులను అందించడమే కాకుండా, వ్యాపార అవకాశాలను, పరిశ్రమతో అనుసంధానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తామని లోధా గ్రూప్ ఎండీ అభిషేక్ లోధా చెప్పారు. తమ కంపెనీల విలువలకు, తత్వానికి దగ్గరగా ఉన్న స్టార్టప్‌లకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని వివరించారు. రియల్టీ రంగంలో ప్రస్తుతమున్న లోటుపాట్లను టెక్నాలజీ, స్మార్ట్ సొల్యూషన్లతో తొలగించేలా తమ ఫండ్ ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇప్పటికే 2–3 బిజినెస్ ఐడియాలను పరిశీలించామని, తొలి దశ పెట్టుబడులు ఈ ఏడాది మార్చికల్లా పూర్తవుతాయని పేర్కొన్నారు. -
తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్ల బుకింగ్స్
ముంబై: ప్రముఖ రియాల్టీ సంస్థ లోదా గ్రూపు తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్లు విలువచేసే ఫ్లాట్లు అమ్మింది. దక్షిణ మధ్య ముంబైలో 'వరల్డ్ వన్ టవర్' పేరుతో 117 అంతస్థుల భవంతిని ఈ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నిర్మిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్లు అమ్మేందుకు మూడేళ్ల తర్వాత నవంబర్ 29 బుకింగ్స్ ప్రారంభించారు. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చిందని లోదా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా తెలిపారు. పోటీ వాతావరణంలోనూ రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. వరల్డ్ వన్ టవర్ నిర్మాణంలో 75 శాతం సివిల్ నిర్మాణం పూర్తైందన్నారు. 2010లో ప్రారంభమైన ఈ టవర్ నిర్మాణం 2016లో పూర్తవుతుందని భావిస్తున్నారు. -
అత్యంత ధనవంతుడైన అభ్యర్థి లోఢా
సాక్షి, ముంబై: కేవలం ముంబై, ఠాణే నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ లోఢా గ్రూపు అధినేత మంగల్‌ప్రభాత్ వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రె ండున్నర రేట్లు పెరిగిపోయాయి. మల్బార్ హిల్ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న లోఢా ఆస్తులు 2009లో రూ.68 కోట్లు ఉండగా, ప్రస్తుతం అవి 200 కోట్లకుపైగా చేరుకున్నాయి. ఆయన ముంబైలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా గుర్తింపు పొందారు. బీజేపీ తరుఫున బరిలో దిగిన లోఢా నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో రూ.34 కోట్లు ఆస్తులు, రూ.34 కోట్ల చిరాస్తులు, రూ. 7 కోట్లు అప్పు ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తు తం నామినేషన్ పత్రాలు సమర్పించిన సమయం లో ఆయన అఫిడెవిట్ (ప్రతిజ్ఞ పత్రం)లో రూ. 61.50 కోట్లు ఆస్తులు ఉండగా ఇందులో తన భార్య వాటా రూ.31.75 కోట్లు ఉన్నాయి. రూ.6 కోట్ల విలువ చేసే మెర్సడిజ్ కారు, రూ. 7 కోట్లు విలువ చేసే నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. లోఢా వద్ద ప్రస్తు తం రూ.137 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నా యి. ఇందులో మలబార్ హిల్‌లో రూ.97 కోట్లు విలువ చేసే స్థలం ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.90 కోట్లు ఆప్పు లు ఉన్నాయి. ముఖ్యంగా కోటీశ్వరుడైన లోఢా వేయి రూపాయల విద్యుత్ బిల్లు, రూ.3,000 టెలిఫోన్ బిల్లు బకాయిలు ఉన్నట్లు తేలింది. గత ఐదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ పెద్దమొత్తంలో ఆస్తులు సంపాదించారు. -
లండన్‌లో భారతీయుల ‘విలాసం’
లండన్: విలాసవంతమైన నివాసాల కొనుగోలుకు భారతీయులు కోట్లాది పౌండ్లు కుమ్మరిస్తున్నారు. గత 18 నెలల్లో లండన్ నగరం నడిబొడ్డులో ఇళ్లు కొనడానికి ఏకంగా 100 కోట్ల పౌండ్లు ఖర్చు చేశారు. వీటిని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి వచ్చే ఐదేళ్లలో మరో 50 కోట్లు వెచ్చించనున్నారు. అక్కడ స్థిరాస్తుల కొనుగోలులో బ్రిటిష్ వారి తర్వాతి స్థానం మనవాళ్లదే. యూకే లగ్జరీ ప్రాపర్టీ ఏజెన్సీ వెదరెల్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. వీటిలో ముఖ్యాంశాలివీ... భారత్‌లో రియల్టీ మార్కెట్ మందగించడంతో ఇక్కడి కుబేరులు లండన్‌లో సూపర్ ఫ్లాట్లు, ఎస్టేట్లు, హోటళ్లను కొంటున్నారు. 2013లో వీరు సెంట్రల్ లండన్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో 45 కోట్ల పౌండ్లతో 221 నివాసాలు కొన్నారు. అక్కడి అత్యంత ఖరీదైన సెయింట్ జాన్స్ ఉడ్, బెల్గ్రేవియా, మేఫెయిర్ ప్రాంతాల్లోనూ కొనుగోళ్లు జరిపారు. మేఫెయిర్‌లోని స్థిరాస్తుల్లో 30 శాతాన్ని స్థానికులు (బ్రిటిషర్లు) కొనుగోలు చేయగా, 25 శాతాన్ని భారతీయులు చేజిక్కించుకున్నారు. అత్యధిక నెట్‌వర్త్ కలిగిన మూడు వేల మందికిపైగా భారతీయులు వేసవికాలంలో చల్లదనం కోసం లండన్ వస్తున్నారు. ఇందుకోసం వారు లండన్‌లో భవనాలు కొంటున్నారు. ఇలాంటి పెట్టుబడులు సురక్షితమని వారు భావిస్తున్నారు. బెల్గ్రేవియా, నైట్స్బ్రిడ్జి వంటి ప్రాంతాలతో పోలిస్తే మేఫెయిర్‌లో రియల్టీ ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో భారతీయ కుబేరులు ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. భారత్‌లోని అతిపెద్ద రియల్టీ సంస్థ లోధా గ్రూప్ ఇటీవలే మేఫెయిర్‌లోని గ్రాస్వెనార్లో ఉన్న కెనడియన్ హైకమిషన్ భవంతిని 30.60 కోట్ల పౌండ్లతో కొనుగోలు చేసింది. ఏడు అంతస్తులతో 1.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భవనాన్ని 18-20 లగ్జరీ హోమ్‌లుగా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది.