తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్ల బుకింగ్స్ | Lodha sells Rs 500cr worth flats in 9 days at Mumbai high rise | Sakshi
Sakshi News home page

తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్ల బుకింగ్స్

Published Tue, Dec 9 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్ల బుకింగ్స్

తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్ల బుకింగ్స్

ముంబై: ప్రముఖ రియాల్టీ సంస్థ లోదా గ్రూపు తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్లు విలువచేసే ఫ్లాట్లు అమ్మింది. దక్షిణ మధ్య ముంబైలో 'వరల్డ్ వన్ టవర్' పేరుతో 117 అంతస్థుల భవంతిని ఈ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నిర్మిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్లు అమ్మేందుకు మూడేళ్ల తర్వాత నవంబర్ 29 బుకింగ్స్ ప్రారంభించారు.

దీనికి అనూహ్యమైన స్పందన వచ్చిందని లోదా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా తెలిపారు. పోటీ వాతావరణంలోనూ రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. వరల్డ్ వన్ టవర్ నిర్మాణంలో 75 శాతం సివిల్ నిర్మాణం పూర్తైందన్నారు. 2010లో ప్రారంభమైన ఈ టవర్ నిర్మాణం 2016లో పూర్తవుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement