భారతీయుల ఆవేదన.. 30 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే.. ఒకటే టాయిలెట్‌.. | Over 250 Indian Passengers On London-Mumbai Flight Waiting For Over 30 Hours In Turkey Airport, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

భారతీయుల ఆవేదన.. 30 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే.. ఒకటే టాయిలెట్‌..

Published Fri, Apr 4 2025 9:40 AM | Last Updated on Fri, Apr 4 2025 11:58 AM

Indian Passengers Waiting 30 hour In Turkey airport

అంకారా: తుర్కియే విమానాశ్రయంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 గంటలుగా 250 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. తమకు సరైన భోజనం లేదని, టాయిలెట్‌ కూడా ఒకటే ఉందని ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో అరకొరగా సౌకర్యాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. లండన్‌ నుండి ముంబై ప్రయాణిస్తున్న విమానం తుర్కియేలో అత్యవసరంగా ల్యాండ్‌ కావడంతో 250 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. వర్జిన్‌ అట్లాంటిక్‌ విమానం మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా తుర్కియేలోని మారుమూల దియార్‌బాకిర్‌ విమానాశ్రయం (డిఐవై)లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఒక ప్రయాణికుడు తీవ్ర భయాందోళనకు గురికావడంతో అతనికి వైద్య చికిత్స అనివార్యమైంది. అయితే ల్యాండింగ్‌ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అక్కడే నిలిచిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.

అయితే, విమానం ల్యాండ్‌ అయిన తర్వాత 30 గంటలుగా తాము ఎయిర్‌పోర్టులోనే ఉన్నామని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. విమానయాన సంస్థ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు తెలిపారు. తమకు వసతి సౌకర్యం కూడా కల్పించలేదని, మారుమూల ప్రాంతం కావడంతో చిమ్మచీకటిగా ఉందని, బేస్‌ క్యాంప్‌ (సైనిక స్థావరం) కావడంతో బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన భోజనం లేదని, టాయిలెట్‌ కూడా ఒకటే ఉందని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement