flight cancel
-
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
24 గంటల్లో.. 11 విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా.. 7:45కి దుబాయ్‌కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్‌కు బయలుదేరింది.కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. -
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఎయిర్‌లైన్స్ చర్యలు చేపట్టాయి. ఈమేరకు పలు విమాన సర్వీసుల సమయంలో మార్పలు, మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎతిహాద్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఈమేరకు ప్రకటన విడుదల చేశాయి.మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితుల కారణంగా బుధవారం విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 2, 3 తేదీల్లో ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్, జోర్డాన్లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాక్, ఇరాన్‌లకు ప్రయాణించే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్‌లకు అక్టోబర్ 2, 3 తేదీలకు ప్రయాణాలు సాగించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ పేర్కొంది. కువైట్ ఎయిర్వేస్ విమాన సమయాల్లోనూ మార్పులు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది. -
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన చేశారు.అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. -
ఐదు గంటలపాటు విమానంలోనే..
ముంబై: సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఎయిర్ మారిషస్ విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు బందీలుగా మారారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 749 విమానం శనివారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. బయలుదేరాల్సిన సమయానికి విమానంలో సమస్య గుర్తించారు. నిపుణులొచ్చి లోపాన్ని సరిచేసినా, ఫలితం లేకపోయింది. చివరికి ఉదయం 10 గంటల సమయంలో సర్వీసును రద్దు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారని బాధిత ప్రయాణికులు చెప్పారు. ఐదు గంటలపాటు తమను కిందికి కూడా దిగనివ్వలేదన్నారు. ఏసీ సరిగ్గా పనిచేయక ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ స్పందించలేదు. -
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 22 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ(దృశ్యమానత) సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. #WATCH | Visibility affected in parts of the national capital as a blanket of dense fog covers Delhi. (Visuals from Rajaji Marg shot at 7.30 am) pic.twitter.com/Nfm5eAHTVi — ANI (@ANI) January 14, 2024 ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. #WATCH | Visibility affected due to dense fog in Uttar Pradesh's Lucknow as cold wave conditions prevail in the region (Visuals shot at 7.00am) pic.twitter.com/BH6DMRWw3W — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 దేశ రాజధానిలో 3.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడంతో ఈ సీజన్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 22 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 14th January. pic.twitter.com/vmY6LBOSvr — ANI (@ANI) January 14, 2024 ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
మాల్దీవులకు టికెట్ బుకింగ్స్ నిలిపేసిన ప్రముఖ సంస్థ
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈజ్‌మైట్రిప్ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY — Nishant Pitti (@nishantpitti) January 7, 2024 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మంతత్రి మరియం షియునా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం మాజిద్ మద్దతు పలికారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రులు విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై భారత నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు. -
విశాఖ: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. దారి మళ్లింపు
సాక్షి, విశాఖపట్నం: బెంగళూరు-విశాఖ రూట్లో ప్రయాణించే విమానం ఒకటి బుధవారం దారి మళ్లించబడింది. ఈదురుగాలుల ప్రభావంతో ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడగా.. 20 నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ప్రియురాలితో మొబైల్ చాటింగ్ ... దెబ్బకు ఆగిపోయిన విమానం
బెంగళూరు: ఒక వ్యక్తి మొబైల్‌కి సందేశం రావడంతో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానం ఆరుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఇండిగో విమానాన్ని ముంబై బయలుదేరడానికి అనుమతించే ముందు పోలీసులు ప్రయాణికులందర్నీ విమానం నుంచి దించి హఠాత్తుగా తనీఖీలు చేయడం మొదలు పెట్టారు. పోలీసులు ఇంత అకస్మాత్తుగా తనీఖీలు చేయడానికి కారణం అందులో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు. ఆమె తన సహా ప్రయాణికుడి మొబైల్‌కి అనుమానాస్పద సందేశం రావడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ని అప్రమత్తం చేయడంతో టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానం కాస్త ఆగిపోయింది. తిరిగి ఎయిర్ పోర్టు బేకు చేరుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి తన మొబైల్లో ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడు. అదే విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమానం ఎక్కేందుకు వచ్చిన తనప్రియురాలితో మొబైల్లో చాటింగ్ చేస్తున్నాడు. తన స్నేహితురాలు కర్ణాటక రాజధాని వెళ్లే విమానం మిస్సైందని చెప్పుకొచ్చాడు. ఐతే పోలీసులు అతన్ని చాలా సేపు విచారించిన తర్వాత గానీ ప్రయాణించేందుకు అనుమతించ లేదు. ఈ మేరకు ప్రయాణికులందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత దాదాపు 185 మంది ప్రయాణికులను ముంబై వెళ్లే విమానంలోకి తిరిగి అనుమతించారు. దీంతో విమానం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఐతే ఇది భద్రతల నడుమ ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహ పూర్వక సంభాషణే కావడంతో ఆ వ్యక్తి పై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ అన్నారు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
ఇంటర్వ్యూలకు ఉద్యోగులు..ఫ్లైట్లు నడపలేక చేతులెత్తేసిన విమానయాన సంస్థలు!
దేశ వ్యాప్తంగా విమానాల రాక పోకల్లో అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి ఎదురు చూస్తున్నా టికెట్లు బుక్ చేసుకున్న సమయానికి విమానాలు రాకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆయా విమానయాన సంస్థల్ని వివరణ కోరింది. అయితే పైలెట్లు, కేబిన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో సిక్ లీవ్‌లు పెట్టి..ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నట్లు తేలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో టాటాకు చెందిన ఎయిరిండియా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇతర ఏవియేషన్ సంస్థలకు చెందిన పైలెట్లు, కేబిన్ సిబ్బంది సిక్ లీవ్‌లు పెడుతున్నారు. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు. దీంతో విమాన రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా..ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. దీంతో షెడ్యూల్ టైంకు విమానాల రాకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయా ఏవియేషన్ సంస్థలపై కామెంట్ల రూపంలో మండిపడ్డారు. ఇడిగో ఆలస్యం ఇండిగో విమానాల రాకపోకల్లో ఆలస్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. షెడ్యూల్ టైంకు కేవలం 45శాతమే విమానాల్ని నడిపించాయి. 850 కంటే ఎక్కువ విమానాలు వారి షెడ్యూల్ సమయం తర్వాత 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి. విమానయాన సంస్థ శుక్రవారం దాదాపు 1600 విమానాలను నడపగా..దాదాపు 50 విమానాల్ని రద్దు చేసింది. మా ఉద్యోగుల్ని సెలక్ట్ చేసుకోవద్దు.. కానీ ఇండిగో యాజమాన్యం తమ సమస్యను ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకెళ్లింది. తమ నుండి 'నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్' లేదా రిలీవింగ్ లెటర్ లేకుండా సిబ్బందిని రిక్రూట్ చేయవద్దని ఎయిర్‌లైన్‌ని కోరినట్లు సమాచారం. కాగా, ఇదే అంశంపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందించలేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌ను సంప్రదిస్తే ఉద్యోగుల కొరతపై 'మేం పరిశీలిస్తున్నాం' అని చెప్పారు. -
ముందనుకున్న ప్లాన్ ఫ్లాప్.. అనుకోకుండా ఆకాశంలో పెళ్లి!
సాధారణంగా పెళ్లిళ్లు మన చేతుల్లో ఉండవు, అవి స్వర్గంలో నిర్ణయించబడాతాయని పెద్దలు అంటుంటారు. ఇదే తరహాలోనే.. వీళ్లకి మాత్రం తామ జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పటికీ వారి వివాహం మాత్రం వాళ్లు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదు. ఎందుకంటే భూమి మీద అనుకున్న వారి వివాహం ఆకాశంలో జరుపుకోవాల్సి వచ్చింది. ఆ జంట పేర్లే.. జెరెమీ సాల్డా, పామ్ ప్యాటర్సన్. వివరాల్లోకి వెళితే.. జెరెమీ సాల్డా, పామ్ ప్యాటర్సన్ గత రెండు సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ తమ ఇంట్లో పెద్దలని కూడా ఒప్పించారు. అంతా ఓకే అనుకున్నాక పెళ్లి మండపానికి వెళ్లడానికి విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆ విమానం ఆలస్యమైంది. చివరకు వాతావరణం అనుకూలంగా లేని కారణంగా క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఆ జంట చాలా నిరాశలోకి వెళ్లింది. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకి అర్థం కావడం లేదు. అప్పుడే క్రిస్ అనే మరో వ్యక్తి వారికి పరిచయమయ్యాడు. అతను కూడా ఆ క్యాన్సిల్ అయిన విమానం ఎక్కాల్సి ఉంది. విమానం క్యాన్సిల్ వార్త విని బాధలో ఉన్నా ఆ జంట దగ్గరకు వెళ్లి అసలు విషయం తెలుసుకున్నాడు. అనంతరం వాళ్ల సమస్య కావాలంటే సాయం చేస్తానని చెప్పాడు. అదృష్టం కలిసొచ్చి ముగ్గురికీ ఒకే విమానంలో సీట్లు దొరికాయి. అయితే ఆ విమానం సిటీకి మరో చివర ఉంది. దాంతో ఉబెర్ బుక్ చేసుకొని వేగంగా అక్కడకు చేరుకున్నారు. విమానం ఎక్కగానే అక్కడ కనిపించిన ఫ్లైట్ అటెండెంట్ జూలీ రేనాల్డ్స్కు తమ సమస్య చెప్పింది పామ్. తమ వద్ద పెళ్లి జరిపించడానికి చర్చిలో అనుమతి పొందిన క్రిస్ ఉన్నట్లు కూడా చెప్పారు. కొంచెం సహకరిస్తే విమానంలోనే పెళ్లి తంతు ముగిస్తామని వారి అడిగారు. ఇదే విషయాన్ని పైలట్‌కు చెప్పగానే అతను కూడా సరే అన్నాడు. అంతే విమానం గాల్లోకి లేచిన తర్వాత 37 వేల అడుగుల ఎత్తులో పామ్, జెరెమీ సాల్డా ఇద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చదవండి: తిడతావా? తిట్టు.. నేనేం పుతిన్‌లా కాదు: బైడెన్ వెటకారం -
ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా!
దేశంలో కోవిడ్ కారణాల వల్ల విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం దేశీయ విమానాయన సంస్థ ఇండిగో 'ప్లాన్ బి'ని అందుబాటులోకి తెచ్చింది. ఇండిగో ఎండ్ నుండి ఫ్లైట్ రద్దు చేసినా లేదా రీషెడ్యూల్ చేసినా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యార్ధం తమ వద్ద ప్లాన్ బి' ఉందని తెలిపింది. ఇంతకీ ఆ ప్లాన్ బి' ఏంటని అనుకుంటున్నారా? మీ ఫ్లైట్ సమయం/లేదా తేదీని మార్చుకోవచ్చు. ఇండిగో నిబంధనలకు లోబడి ఉంటే ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా లేకుండా రీఫండ్ పొందవచ్చని ఇండిగో తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. #6ETravelAdvisory: Do not wait in queue, for any cancelled/rescheduled flight for more than 2 hrs visit- https://t.co/evofgYvfrV, all the options available on Plan B are same that are offered at our contact center. For further assistance DM us on Twitter/Facebook pic.twitter.com/AuFYvUEumY — IndiGo (@IndiGo6E) January 5, 2022 ఇండిగో అధికారిక ట్విట్ ప్రకారం.. 2 గంటల కంటే ఎక్కువసేపు రద్దు చేయబడిన లేదా, రీషెడ్యూల్ చేయబడిన ఏదైనా విమానాల కోసం ప్రయాణికులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. “ప్రస్తుతం కోవిడ్‌తో ప్రయాణ పరిమితులు, వాతావరణంలో మార్పుల కారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడొచ్చు. అందుకే మార్పులు లేదా రద్దు చేయాల్సి వస్తే ప్రయాణీకులకు వారి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌కు సమాచారం అందిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్ ట్వీట్లో పేర్కొంది. చదవండి: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగంలో మరో సంచలనం! -
తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!
ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కఠినమైన కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంతో ప్రజల ఆరోగ్య దృష్ట్యా కఠినమైన నిబంధనలను అనుసరిస్తున్నాయి. ఈ ఆంక్షలు నేపథ్యంలోనే కరోన నియమాలనకు లోబడి ప్రవర్తించని ఒక ప్రయణికుడిని యూఎస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానం నుంచి నిర్థాక్షిణ్యంగా దింపేసింది. (చదవండి: ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!) అసలు విషయంలోకెళ్లితే...యూస్‌లోని లాడర్డేల్ విమానాశ్రయం నంచి విమానం బయలు దేరేమందు ప్రయాణికులందరూ మాస్క్‌లు ధరించారో లేదో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు 38 ఏళ్ల ఆడమ్ జెన్నె అనే వ్యక్తి మాస్క్ ధరించకుండా ఒక ఎర్రటి వస్త్రాని ధరించి వచ్చాడు. దీంతో విమానాశ్రయ అధికారులు జెన్ని మాస్క్ విషయమై ప్రశ్నించారు. అయితే జెన్నె ఆహారం తినేటప్పుడు సైతం మాస్క్ ధరించమంటూ విమాన సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని వివరణ ఇచ్చాడు. దీంతో అధికారులు అతని సమాధానికి ఒక్కసారిగా విస్తుపోతారు. ఆ తర్వాత ఏదిఏమైన కోవిడ్ -19 నిబంధనల దృష్ట్యా మాస్క్ ధరించాల్సిందే లేనట్లయితే దిగిపోవాల్సిందే అంటూ సదరు అధికారులు గట్టిగా ఆదేశించారు. ఈ మేరకు జెన్నెతోపాటు ప్రయాణిస్తున్న తోటిప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు యూఎస్ ఎయిర్‌లైన్స్ కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తమ సిబ్బంది, అధికారులపై ప్రశంసల వర్షం కురిపించింది. (చదవండి: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం) LEAVE IT TO THE #FLORIDAMAN! This guy from Cape Coral tried wearing a #thong as a #mask on a United flight in Fort Lauderdale today. He was kicked off the plane. TSA and sheriff were called but passengers remained peaceful. #airtravel #Florida #aviation #travel pic.twitter.com/kUnkXrgTY8 — Channing Frampton (@Channing_TV) December 16, 2021 -
ముంబైలో భారీ వర్షాలు.. సెలవులు రద్దు
ముంబై : మొన్నటి వరకు ఎండల వేడితో మండిపోయిన ముంబై ఇప్పడు భారీ వర్షాలతో విలవిల్లాడిపోతోంది. శనివారం ముంబై నగరాన్ని భీకరమైన వర్షాలు ముంచెత్తాయి. దాంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పండి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యుద్ధప్రతిపదికన సహయక చర్యలు చేపట్టింది. బీఎంసీ ఉన్నతాధికారుల సెలవులను వారం రోజుల పాటు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భార్షీ వర్షాల కారణంగా ముంబై నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీస్‌లను రద్దు చేస్తున్నట్టు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయ అధికారులు తెలిపారు. వారం రోజలు పాటు భారీ వర్ష సూచన ఉన్న కారణంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. -
విమానం రద్దు.. 250 మంది ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్వేస్ విమానానం రద్దుకావడంతో 250 మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానం రాకపోవడంతో బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ అధికారులు విమానాన్ని రద్దుచేసినట్లు ప్రకటించారు. దాంతో విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న 250 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఫలితంగా ఎయిర్పోర్ట్ అధికారులు వారికి నోవాటెల్ హోటల్లో తాత్కాలిక బస ఏర్పాటుచేశారు. -
కో పైలట్ నిర్వాకానికి విమానం రద్దు
వాషింగ్టన్: కో పైలట్ చేసిన నిర్వాకానికి విమాన సర్వీసును చివరి నిమిషంలో రద్దు చేయాల్సి వచ్చింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ కో పైలట్ మద్యంతాగి విధులకు హాజరుకావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం డెట్రాయిట్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. విధులకు హాజరయినపుడు విమానాశ్రయంలో కో పైలట్‌కు బ్రీత్ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, ఆయన మద్యం తాగినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు కో పైలట్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. దీనికారణంగా డెట్రాయిట్ నుంచి ఫిలడెల్ఫియాకు వెళ్లాల్సిన 736 ఫ్లయిట్‌ను అమెరికన్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. ఇతర విమాన సర్వీసుల్లో వెళ్లాల్సిందిగా ప్రయాణకులను కోరింది. ప్రయాణికుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని, అంతరాయం కలిగించినందుకు క్షమాపణలు చెప్పామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. కాగా కో పైలట్ పేరును వెల్లడించలేదు. ఆయనకు మత్తు దిగాక విడిచిపెట్టారు.