శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానానం రద్దుకావడంతో 250 మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానానం రద్దుకావడంతో 250 మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానం రాకపోవడంతో బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ అధికారులు విమానాన్ని రద్దుచేసినట్లు ప్రకటించారు.
దాంతో విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న 250 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఫలితంగా ఎయిర్‌పోర్ట్ అధికారులు వారికి నోవాటెల్ హోటల్‌లో తాత్కాలిక బస ఏర్పాటుచేశారు.