passingers
-
ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..
అసలే చలికాలం (శీతాకాలం).. దట్టమైన మంచు వల్ల ట్రైన్ల రాకపోకలు ఆలస్యమవుతాయి. ఇది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మంచు కారణంగా దృశ్యమానత తగ్గుతుంది. కాబట్టి ట్రైన్లు ఆలస్యంగా స్టేషన్లకు చేరుకుంటాయి. అలాంటి సమయంలో ప్రయాణికులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీనికి కొంత ఉపశమనం కల్పిస్తూ భారతీయ రైల్వే ఓ స్పెషల్ సర్వీ అందించనున్నట్లు ప్రకటించింది.ట్రైన్ కోసం వేచి చూసే ప్రయాణికులు.. తాము వెళ్ళవలసిన ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే.. వారికి ఐఆర్సీటీసీ ఉచితంగా ఫుడ్ అందించనుంది. ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఫ్రీ మీల్స్ ఎంపికలు➤టీ/కాఫీ సర్వీస్: ప్రయాణీకులకు బిస్కెట్లు, టీ/కాఫీ కిట్‌తో.. టీ లేదా కాఫీ అందిస్తారు. ఇందులో షుగర్ లేదా షుగర్ లెస్ సాచెట్లు, మిల్క్ క్రీమర్లు ఉంటాయి.➤అల్పాహారం లేదా సాయంత్రం టీ: నాలుగు ముక్కలతో కూడిన బ్రెడ్ (తెలుపు లేదా గోధుమరంగు), వెన్న, ఫ్రూట్ డ్రింక్ (200మి.లీ), టీ లేదా కాఫీ.➤లంచ్ లేదా డిన్నర్: రైస్, పప్పు, రాజ్మా లేదా చోలేతో పాటు ఊరగాయ సాచెట్లు ఉంటాయి. ఇది వద్దనుకుంటే.. ప్రయాణీకులు మిక్డ్స్ వెజిటేబుల్స్, ఊరగాయ సాచెట్లు, ఉప్పు & మిరియాలు సాచెట్లతోపాటు ఏడు పూరీ ఎంచుకోవచ్చు.ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్యాసింజర్.. తన టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. టికెట్ డబ్బు రీఫండ్ అవుతుంది. రైల్వే కౌంటర్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు నగదు రూపంలో డబ్బును మళ్ళీ పొందటానికి వ్యక్తిగతంగానే వాటిని రద్దు చేయాలి.ఫ్రీ ఫుడ్, రీఫండ్ వంటివి కాకుండా.. ఆలస్యం సమయంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి భారతీయ రైల్వే ఇతర సౌకర్యాలను అందిస్తుంది. వెయిటింగ్ రూమ్‌లలో ఉండటానికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదనపు సిబ్బందిని కూడా మోహరిస్తుంది. -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
లేటెస్ట్ రికార్డ్ - హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులు ఎన్ని లక్షలంటే?
హైదరాబాద్, 4 జూలై, 2023: హైదరాబాద్ మెట్రో రైలు (HMR) 3 జూలై 2023, సోమవారం నాడు 5.10 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యతో ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ రికార్డు సంఖ్య పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన, హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన, అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసం, ఆమోదాన్ని సూచిస్తుంది. ఈ మైలురాయిని సాధించినందుకు హెచ్ఎమ్ఆర్ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపిన.. L&TMRHL, MD & CEO, శ్రీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, ఇది నిజంగా ఒక ముఖ్యమైన సందర్భం, మా విలువైన ప్రయాణికులకు మేము ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) కొవిడ్-19 సమయంలో ప్రయాణికుల సంఖ్య కొంత మందగించినా.. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి నిరంతర సహకారం, మద్దతు వల్ల నగర ప్రజలకు అత్యంత అనుకూలమైన, వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడం మాకు సాధ్యపడిందని అన్నారు. -
టైటాన్ మినీ సబ్‌మెరైన్...పైలట్ సహా ఐదుగురు పర్యాటకులు జలసమాధి
-
విమాన ప్రయాణికులు @ 12.73 కోట్లు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య డిసెంబర్లో 12.73 కోట్లుగా నమోదైంది. అంతక్రితం డిసెంబర్‌తో పోలిస్తే దాదాపు 14 శాతం వృద్ధి చెందింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన నెలవారీ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2021 డిసెంబర్లో 11.20 కోట్ల మందిని దేశీ ఎయిర్‌లైన్స్ గమ్యస్థానాలకు చేర్చాయి. తాజాగా గత నెలలో ఇండిగో ద్వారా 69.97 లక్షల మంది ప్రయాణించారు. ఎయిరిండియా 11.71 లక్షల ప్యాసింజర్లను, విస్తారా 11.70 లక్షలు, ఎయిర్ఏషియా 9.71 లక్షలు, స్పైస్‌జెట్ 9.64 లక్షలు, గో ఫస్ట్ 9.51 లక్షలు, ఆకాశ ఎయిర్ 2.92 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. మార్కెట్ వాటా పరంగా చూస్తే ఇండిగోకు 55.7 శాతం, ఎయిరిండియాకు 9.1 శాతం, విస్తారాకు 9.2 శాతం, ఎయిర్‌ఏషియాకు 7.6 శాతం, ఆకాశ ఎయిర్‌కు 2.3 శాతం ఉంది. నాలుగు కీలకమైన మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సమయ పాలనలో ఇండిగో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. -
మాస్క్ సరిగా లేకుంటే దింపేయండి
ముంబై: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? మాస్కు ధరించారా? అది ముక్కు కిందికో, గడ్డానికో ధరిస్తే సరిపోదు. ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలి. అలా లేకపోతే నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేస్తారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దేశంలో అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విమానాల్లో కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో పౌర విమానయాన సంస్థలకు డీజీసీఏ శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏను, విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాల్లో తరచుగా తనిఖీలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు డీజీసీఏ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ఏముందంటే... ► మాస్కులు లేనివారిని ఎయిర్‌పోర్టుల్లోకి అనుమతించరాదు. ► విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సరిగ్గా ధరించేలా, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ► విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రయాణం ముగిశాక విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేదాకా మాస్కు ఉండాల్సిందే. ► కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా అమలు చేయాలి. ► విమానం బయలుదేరే ముందు పదేపదే సూచించినా మాస్కు సరిగ్గా ధరించకపోతే సదరు ప్రయాణికుడిని వెంటనే దింపేయాలి. ► విమానం ప్రయాణిస్తుండగా మాస్కులు సరిగ్గా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారిని నిబంధనలు అతిక్రమించిన ప్రయాణికులుగా పరిగణించాలి. ► కొన్ని అత్యవసర సందర్భాల్లో మినహా మిగిలిన సమయంలో మాస్కును ముక్కు నుంచి కిందకు జార్చరాదు. ► కోవిడ్–19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డీజీసీఏ గైడ్‌లైన్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. -
రన్‌వేపై ప్రయాణికుల ఆందోళన
దొడ్డబళ్లాపురం: విమానం ఆలస్యమైందంటూ ఆగ్రహించిన ప్రయాణికులు రన్‌వేపైకి వచ్చి విమానాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. బెంగళూరు నుంచి థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నగరానికి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరాల్సిన గో ఎయిర్‌బస్ విమానం సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ కాలేదు. దీంతో విమానంలోని 120 మంది ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పైలట్‌తోపాటు ఎయిర్‌హోస్టెస్‌లు తమ డ్యూటీ సమయం దాటిపోయిందంటూ వెళ్లిపోయారు. మరో మార్గం చూపుతామని అధికారులు చెప్పారు. అయితే ఉదయం 8 గంటలయినా మరో విమానం ఏర్పాటు చేయలేదు. అయిదారు గంటలపాటు విమానంలోనే కూర్చున్న ప్రయాణికులు చివరకు ఓపిక నశించి, రైన్వే పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇతర విమానాలకు ఎదురెళ్లి ఆటంకం కలిగించడానికి యత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. పుకెట్‌కు మరో విమానం ఏర్పాటు చేయాలని భావించినా బీసీఏఎస్ నుంచి అనుమతి లభించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. -
విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు
వాంకోవర్ నుంచి సిడ్నీకి 296 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఒక్కసారిగా కొద్దిసెకన్లు కిందకు దూసుకెళ్లింది. దీంతో పెద్ద కుదుపులొచ్చాయి. సీటు బెల్టులు పెట్టుకోని ప్రయాణికులు పైకెగిరారు. వారి తలలు సీలింగ్‌కు కొట్టుకున్నాయి. మరికొందరు గాల్లో గింగిరాలు తిరిగారు. రెప్పపాటులో అంతా సద్దుమణిగింది. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి హొనలూలూకు తీసుకొచ్చారు. విమానం కుదుపులకు 35 మంది గాయపడ్డారు. ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ33(బోయింగ్ 777–200) విమాన ప్రయాణికులకు గురువారం ఎదురయిందీ భయానక అనుభవం. ‘సీట్లలో కూర్చున్న వాళ్లం పైకెగిరి విమానం టాప్కు కొట్టుకున్నాం’ అని అనుభవాన్ని వివరించాడు జెస్ స్మిత్ అనే ప్రయాణీకుడు. విమానం 10,973 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇది జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ ప్రతినిధి తెలిపారు. -
మత్తులో నుంచి తేరుకోని ‘సంపర్క్ క్రాంతి’ బాధితులు
కాజీపేట రూరల్ : సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఘటనపై రైల్వే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యశ్వంత్‌పూర్ నుంచి హజరత్‌నిజాముద్దీన్ వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఆరుగురి ప్రయాణికులకు దుండగులు మత్తు మందు కలిపిన తినుబండారాలు ఇచ్చి నిలువు దోపిడి చేయడం జరిగింది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెంగళూర్ నుంచి సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఇక్కడికి వ చ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆరుగురు ప్రయాణికు ల పూర్తి వివరాలు, వారి చికిత్స విధా నం, వారి వివరాలను స్థా నిక రైల్వే పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స ంపర్క్క్రాంతి ఘటనపై దుండగులను పట్టుకునేందుకు అన్ని రై ల్వే జోన్లలో రైల్వే పోలీస్‌లను అప్రమత్తం చేసినట్లు వివరి ంచారు. ఈ ఘటనపై కాజీపేట జీ ఆర్పి పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసుకుని.. కేసును బెంగళూర్ రైల్వేపోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇంకా తేరుకోని ఆ ఆరుగురు.. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ఇంకా మత్తులో నుంచి తేరుకోలేదని రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. ఒకరు మత్తులో నుంచి తేరుకొని కొన్ని మాటలు మా ట్లాడినట్లు తెలిపారు. అతడి వద్ద ఉన్న రూ.4 వేలు దోచుకున్నారని.. మాత్రమే తెలిపినట్లు వెల్లడించారు. వారు మత్తులో నుంచి తేరుకుంటేనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
గో ఎయిర్‌లైన్స్ విమానం 5 గంటలు ఆలస్యం
హైదరాబాద్ : కొచ్చిన్ వెళ్లాల్సిన గో ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం 11.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన విమానం సాయంత్రం 4.56 గంటలకు బయలుదేరింది. ఇందులో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐదు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. -
ఒక బస్సు.. ఇద్దరే ప్రయాణికులు!
ఖాళీగా పరుగులెడుతున్న ఏసీ ‘వజ్ర’ ఉప్పల్ కూడలి.. రాత్రి ఏడు దాటింది.. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర ఏసీ బస్సొచ్చి ఆగింది. వరంగల్ వెళ్లాల్సిన ఆ బస్సులో ఇద్దరే ఉన్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడ్డారు. కానీ.. డ్రైవర్ అనుమతించలేదు. ఇద్దరు ప్రయాణికులతోనే బస్సు ముందుకు కదిలింది. ఇది ఈ ఒక్క బస్సు కథ కాదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నిజామాబాద్ మార్గంలో ఆర్టీసీ ప్రారంభించిన వజ్ర బస్సులన్నింటిదీ ఇదే వ్యథ. ఏమిటీ వజ్ర? బస్సు ఎక్కేందుకు బస్టాండుకు వెళ్లే పాత పద్ధతికి స్వస్తి పలికి, బస్సులే కాలనీలకు వచ్చే విధంగా ఏసీ మినీ బస్సులు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశంతో ఆర్టీసీ ఇటీవల ‘వజ్ర’ బస్సులు ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ప్రధాన పట్టణాలకు మినీ ఏసీ బస్సులు ప్రారంభించాలని గతేడాది జూన్‌లో జరిగిన ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఈ నెల ఆరంభంలో తొలివిడతగా 48 మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది. వీటిలో 30 బస్సులను హైదరాబాద్–వరంగల్ మధ్య, 18 బస్సులను హైదరాబాద్–నిజామాబాద్ మధ్య నడుపుతున్నారు. ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్లకు కాకుండా నిర్ధారించిన కాలనీల మీదుగా ఈ బస్సులు ప్రయాణిస్తాయి. మరేంటి సమస్య? టికెట్ కొని బస్సు ఎక్కే విధానం లేకపోవటమే ప్రధాన సమస్యగా మారింది. బస్సులో టికెట్ ఇచ్చే వీలు లేదు. ఆర్టీసీ కౌంటర్లలో ఇవ్వరు. కేవలం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారానే సీటు బుక్ చేసుకోవాలి. అలాగే వరంగల్ మార్గంలో ఉప్పల్ కూడలి, నిజామాబాద్ మార్గంలో సుచిత్ర కూడలిలోని ప్రైవేట్ ఆన్లైన్ రిజర్వేషన్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రయాణికులకు అవగాహన లేక బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. రూట్ మ్యాపేంటి? మెహిదీపట్నం, మియాపూర్, కుషాయిగూడ, హైదరాబాద్–2ల నుంచి ఈ బస్సులు ఉదయం 4 గంటల నుంచే బయలుదేరుతున్నాయి. ఆయా డిపోల నుంచి ప్రధాన కాలనీల మీదుగా ముందుకు సాగుతాయి. ఉదాహరణకు మెహిదీపట్నం డిపో బస్సు వరంగల్ వెళ్లాలంటే.. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, లిబర్టీ, గగన్‌మహల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, నల్లకుంట, డీడీ కాలనీ, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్ మీదుగా వెళ్తుంది. వరంగల్‌కు రూ.300, నిజామాబాద్‌కు రూ.350 టికెట్ ధరగా నిర్ణయించారు. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఆ వివరాలు డ్రైవర్ వద్ద ఉండే ట్యాబ్‌లో కనిపిస్తాయి. ఏ కాలనీలో ఎవరు బుక్ చేసుకున్నారో, ఏ సమయంలో ఎక్కుతారో తెలుస్తుంది. డ్రైవర్ ఫోన్ నెంబరు ఇతర వివరాలు ప్రయాణికుడి మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందుతాయి. ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 15 నుంచి 18 శాతం ఉంది. 21 సీట్లుండే ఈ బస్సులో నలుగురైదుగురు, ఒక్కోసారి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. బుకింగ్స్‌పై అవగాహనలేని ప్రయాణికులు ఖాళీగా ఉన్న బస్సులను చూసి మార్గ మధ్యలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయాణికులను డ్రైవర్ అనుమతించకపోవడంతో.. బస్సు ఖాళీగా ఉన్నా ఎందుకు ఎక్కనీయరంటూ డ్రైవర్లతో వాదనకు దిగుతున్నారు. వెరసి అటు వరంగల్, ఇటు నిజామాబాద్ మార్గంలో బస్సులు ఖాళీగా పరుగుపెడుతున్నాయి. వరంగల్, నిజామాబాద్‌లలోనూ ఇవే సమస్యలు ఉండటంతో ఖాళీగా హైదరాబాద్ వస్తున్నాయి. ఇలా చేస్తే బెటరేమో.. ► ఆర్టీసీ కౌంటర్లలో టికెట్లు జారీ చేసేలా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు టికెట్ తీసుకోడానికి ఉపయోగం. ► ఇమ్లీబన్, జూబ్లీబస్టాండ్ల మీదుగా బస్సులను నడపొద్దని నిర్ణయించినందున వరంగల్ మార్గంలో తార్నాక, రామంతాపూర్, ఉప్పల్, ఘట్కేసర్ లాంటి చోట్ల, నిజామాబాద్ మార్గంలో ప్యారడైజ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి లాంటి చోట్ల టికెట్లు జారీ చేసే ఏర్పాట్లు చేయాలి. లేదంటే డ్రైవర్ వద్దనే టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) ఉంచి టికెట్లు జారీ చేసే ఏర్పాటు చేయాలి. ► బస్సులు తిరిగే కాలనీల్లో వజ్ర బస్సులపై ప్రచారం చేపట్టాలి. – సాక్షి, హైదరాబాద్ -
ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
ఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎయిర్‌హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఐదుగురు విదేశీయులు ఎయిర్ హోస్టెస్‌ను వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు మేరకు వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదైంది. విమానయాన చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఐదుగురు నిందితులపై చర్యలుంటాయని అధికారులు వెల్లడించారు. -
పుష్కలంగా పుష్కర ఆదాయం..
రైల్వేకు రూ.47 కోట్లు..ఆర్టీసీకి రూ.7 కోట్లు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు ఆర్టీసీ, రైల్వేలకు కాసులు కురిపించాయి. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పుష్కరాలకు తరలి వెళ్లారు. పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 12 నుంచి 23 వరకు మొత్తం 691 స్పెషల్ సర్వీసులు నడపగా.. రద్దీ దృష్ట్యా 4,871 అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. సుమారు 41 లక్షల మంది రైళ్లలో రాకపోకలు సాగించారు. దీంతో రూ.47 కోట్ల వరకు ఆదాయం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఇక హైదరాబాద్ నుంచి వివిధ పుష్కరఘాట్లకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ 1,500కుపైగా అదనపు బస్సులు నడిపింది. సుమారు 8 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించినట్లు అధికారుల అంచనా. అదనపు బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రూ.7 కోట్లకుపైగా ఆదాయం లభించినట్లు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వేణు తెలిపారు. -
ఊడిపడిన బస్సు అద్దాలు..
రోడ్డుపై ప్రయాణికుల పడిగాపులు హొసూరు: నిర్వహణ లోపమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కానీ తమిళనాడు ఆర్టీసీ తీరుతో ప్రయాణికులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.సేలం డివిజన్లోని హొసూరు, డెంకణీకోట, క్రిష్ణగిరి డిపోలలో బస్సులు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపైనే గంటల తరబడి వేచి ఉండటం సాధారణ విషయం అయిపోయింది. తాజాగా ఆదివారం హొసూరు నుంచి క్రిష్ణగిరికి ప్రయాణికులతో వస్తున్న బస్సు ముందు అద్దం ఒక్కసారిగా ఊడి రోడ్డుపై పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపి వేయడంతో ప్రయాణికులు పేరండపల్లి వద్ద పడిగాపులు పడ్డారు. డొక్కు బస్సులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. కనీసం ఏ ఒక్క అధికారి కూడా ప్రయాణికుల గురించి ఆలోచించకపోవడం శోచనీయమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విమానం రద్దు.. 250 మంది ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్వేస్ విమానానం రద్దుకావడంతో 250 మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానం రాకపోవడంతో బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ అధికారులు విమానాన్ని రద్దుచేసినట్లు ప్రకటించారు. దాంతో విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న 250 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఫలితంగా ఎయిర్పోర్ట్ అధికారులు వారికి నోవాటెల్ హోటల్లో తాత్కాలిక బస ఏర్పాటుచేశారు. -
నీటి వసతి లేదని రైలు నిలిపివేత
ఖమ్మం: నీటి వసతి లేక ఇబ్బందులు పడిన ప్రయాణికులు చివరికి రైలును నిలిపివేశారు. ఖమ్మంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. త్రివేండ్రం నుంచి గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న ముఫ్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో నీటి వసతి లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చివరికి ఖమ్మం రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. రైల్వే అధికారులతో వాదులాటకు దిగారు. వసతి కల్పించేదాకా రైలును కదలనీయబోమంటూ భీష్మించారు. రెండు గంటలుగా రైలు ఆగిపోవటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
చివరి సీట్లలో ప్రయాణిస్తే 20 శాతం రాయితీ
విజయవాడ: బస్సులో చివరి సీట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, అమరావతి దూరప్రాంత సర్వీసుల్లోని చివరి రెండు వరసల్లో ఉండే తొమ్మిది సీట్లకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం బస్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అడ్వాన్స్ రిజర్వేషన్‌తోపాటు కరెంట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడూ ఇది వర్తిస్తుందన్నారు. చివరి సీట్లలో ప్రయాణించేందుకు ఎవరూ ఇష్టపడకపోవడం వల్ల కొన్ని బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నామని, వెంటనే ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. 250 కిలోమీటర్లకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినవారికి ఆ తర్వాత రెండుగంటలపాటు సమీప ప్రాంతాలకు సిటీబస్సులు, జిల్లా సర్వీసుల్లో (తెలుగు వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు) ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 40 రూట్లలోని 453 బస్సుల్లో అడ్వాన్స్ బస్ ఎరైవల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని దీని ద్వారా ఆయా స్టేషన్లకు ఎదురు చూస్తున్న బస్సు ఎంతసేపట్లో వస్తుందో తెలుస్తుందని సాంబశివరావు అన్నారు. తమ సెల్ఫోన్లో మిస్డ్ కాల్ ఇస్తే బస్సులో అమర్చిన యంత్రం ద్వారా ప్రయాణికుడు ఉన్న స్టేషన్లో ఎనౌన్స్మెంట్ వస్తుందని తెలిపారు. రూ.13.18 కోట్లతో రాష్ట్రంలోని 18 బస్స్టేషన్లను ఆధునీకరించామని రెండోదశలో అంతే మొత్తంతో రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని 64 బస్స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. నాన్-ట్రాఫిక్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ బస్స్టేషన్లలో వంద చొప్పున మెడికల్ షాపులు, వైద్య పరీక్షలు చేసే డయాగ్నోసిస్ షాపులు, మినీ థియేటర్లు, రిటైల్ షాపులు, డెంటల్, ఐ క్లినిక్ సెంటర్లకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.108 కోట్లు వస్తున్న నాన్-ట్రాఫిక్ ఆదాయాన్ని రూ.200 నుంచి రూ.250 కోట్లకు పెంచేందుకు వీటిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, వ్యాపారవేత్తలు ఎవరైనా బస్స్టేషన్లకు తమ పేరుగానీ, తాము సూచించిన వారి పేర్లుగానీ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని ఇందుకోసం నిర్దిష్ట సొమ్మును ఐదు సంవత్సరాలు చెల్లించాల్సివుంటుందని సాంబశివరావు చెప్పారు. ఉదాహరణకు ఉయ్యూరు స్టేషన్‌కు ఎ.రాధాకృష్ణ తరఫున ఎవరైనా రూ.5లక్షలు చెల్లిస్తే ఆ స్టేషన్ పేరు ఎ.రాధాకృష్ణ ఏపీఎస్ఆర్టీసీ బస్‌స్టేషన్‌గా మారుస్తామన్నారు. దీనివల్ల ప్రకటనల ఆదాయం పెరుగుతుందన్నారు. బస్సుల సమాచారం తెలుసుకునేందుకు బస్టాండ్లలో పాసింజర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లు, పాసింజర్ మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు లైవ్ ట్రాక్ (వెహికల్ ట్రాకింగ్)ను సైతం ప్రవేశపెడతామని తెలిపారు. ఆర్టీసీకి ఈ సంవత్సరం రూ.4,101 కోట్ల ఆదాయం రాగా గత సంవత్సరం రూ.3,970 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సంస్థకు ఆపరేషనల్ నష్టం లేదని, గతంలో చేసిన అప్పుల వల్లే నష్టాలు వస్తున్నాయన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ రూ.411కోట్ల నష్టం రాగా, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి అది రూ.500 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. 30 రోజుల్లో 795 బస్సులను అద్దెకు తీసుకుంటున్నామని ఈసారి వాటిలో కొన్ని ఏసీ బస్సులు కూడా ఉన్నాయన్నారు. త్వరలో విజయవాడలో సెంట్రల్ ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, సంస్థ కార్పొరేట్ కార్యాలయం విజయవాడకు తీసుకొస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు ఎ.వెంకటేశ్వర్లు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వాగులో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు
చిత్తూరు: వాగులో బస్సు కొట్టుకుపోయిన సంఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వెదురు కుప్పం మండలం తెల్లగుండ్లపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు మంగళవారం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.