నిర్వహణ లోపమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కానీ తమిళనాడు ఆర్టీసీ తీరుతో ప్రయాణికులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.
రోడ్డుపై ప్రయాణికుల పడిగాపులు
హొసూరు: నిర్వహణ లోపమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కానీ తమిళనాడు ఆర్టీసీ తీరుతో ప్రయాణికులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.సేలం డివిజన్‌లోని హొసూరు, డెంకణీకోట, క్రిష్ణగిరి డిపోలలో బస్సులు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపైనే గంటల తరబడి వేచి ఉండటం సాధారణ విషయం అయిపోయింది.
తాజాగా ఆదివారం హొసూరు నుంచి క్రిష్ణగిరికి ప్రయాణికులతో వస్తున్న బస్సు ముందు అద్దం ఒక్కసారిగా ఊడి రోడ్డుపై పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపి వేయడంతో ప్రయాణికులు పేరండపల్లి వద్ద పడిగాపులు పడ్డారు. డొక్కు బస్సులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. కనీసం ఏ ఒక్క అధికారి కూడా ప్రయాణికుల గురించి ఆలోచించకపోవడం శోచనీయమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.