glass broken
-
రాహుల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసం
పాట్నా: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లో రెండోరోజు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహంతో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బుధవారం కథిహార్‌లో ఈ ఘటన జరిగింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇటీవలి అక్కడి రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా ఆయనకు బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రజలు. ఇక ఇవాళ ఉదయం డీఎస్ కాలేజీ వద్ద ఆయన ర్యాలీ నిర్వహించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయన కారు మీదకు ఎక్కి నినాదాలు చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో కారు విండ్‌షీల్డ్ పగిలిపోయింది. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది వారిని వారించి కిందకు దించగా.. పగిలిన కారు అద్ధాలతోనే ఆయన ర్యాలీని ముందుకు సాగించారు. ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్ కూటమి నుంచి నిష్క్రమించి తిరిగి బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. దీంతో రాహుల్ యాత్ర బీహార్‌లో ఎలా సాగుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే నిన్న రాహుల్ యాత్రకు అపూర్వ స్వాగతం దక్కిందని సీనియర్ నేత జైరామ్ రమేష్ సైతం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. -
Viral Video: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు..
Urfi Javed Wear Broken Glass Dress Weighing 20 Kgs Video Viral: హిందీ బిగ్‌బాస్ ద్వారా చాలా ఫేమస్ అయింది ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ తర్వాత బయటకొచ్చిన ఉర్ఫీ విభిన్నమైన, విచిత్రమైన డ్రెస్టింగ్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయింది. డ్రెస్సింగ్ స్టైల్స్‌లో కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తూ కొన్నిసార్లు ప్రశంసలు పొందితే, మరికొన్ని సార్లు తీవ్ర విమర్శల పాలైంది ఈ బ్యూటీ. ఇంతకుముందు మెర్మేయిడ్ స్పాట్డ్ వేర్లో కనిపించిన ఉర్ఫీ జావేద్ మరోసారి సరికొత్త డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో ఉర్ఫీ పగిలిన గాజు ముక్కలతో చేసిన డ్రెస్‌ను వేసుకుంది. ఈ పోస్ట్‌కు 'అవును, నేను పగిలిన గాజు ముక్కల డ్రెస్ వేసుకున్నాను. ఇది అద్భుతంగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. కానీ ప్రజలు ఇలాంటివి చూసి నాకు వెర్రి, పిచ్చి అనుకుంటారు. నిజానికి మనమందరం క్రేజీగా, పిచ్చిగా ఉన్నామని తెలుసుకోండి. కానీ నన్ను నేను చూసుకోడానికి నాకు తగినంత తెలివి, శక్తి ఉన్నాయి.' అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియోకు నటి రాఖీ సావంత్ ఫైర్ ఎమోజీని కామెంట్ పెట్టగా, పలువురు ప్రశంసిస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో చిన్న పార్టీ ఏర్పాటు చేసింది ఉర్ఫీ జావేద్. ఆ పగిలి గాజు ముక్కల డ్రెస్ వల్ల గాయాలు అవుతుండటంతో దాన్ని తీసేసింది. అంతేకాకుండా ఈ డ్రెస్ 20 కేజీల బరువు ఉంటుందని ఉర్ఫీ జావేద్ తెలిపింది. చదవండి: 👇 ప్యాంట్ వేసుకోలేదురా బాబూ.. ఉర్ఫీ పరుగోపరుగు సమంత చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పా? స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఉర్ఫీ View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
వకీల్‌సాబ్ : ట్రైలర్‌కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రీల్9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ట్రైలర్‌ను విడుదల చేశారు. వైజాగ్ థియేటర్లో ట్రైలర్ చూసేందుకు పవన్ అభిమానులు ఎగబడ్డారు. కిక్కిరిసిన జనంతో అద్దాలు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన పలువురు పవన్ అభిమానులు...'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం' అని అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను సినీ నిర్మాత బండ్ల గణేష్..తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను అభిమానులు రీట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న సినిమా ఇది. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్‌ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి : వకీల్‌సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ వకీల్ సాబ్ ట్రైలర్‌పై రామ్ చరణ్ కామెంట్ -
ఐఫోన్ ఎక్స్‌లో మరో ప్రాబ్లమ్, యూజర్లు గగ్గోలు
ఐఫోన్ ఎక్స్.. ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 10వ ఐఫోన్ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చిన ఫేస్ఐడీలో లోపం ఉన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేస్తే.. తాజాగా వెనుక వైపు గల డ్యూయల్ కెమెరాకు అమర్చిన గ్లాస్ ప్రొటెక్షన్ అనుకోకుండా పగిలిపోతుందట. ఈ విషయంపై యూజర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్రారంభమైంది. రెడ్డిట్, ఆపిల్ సపోర్టు ఫోరమ్స్ల్లో పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ఐఫోన్ యూజర్లు తమ కెమెరా గ్లాస్ పగిలిపోతుందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ గ్లాస్ పగిలిపోతుందో సరియైన కారణం మాత్రం తెలియడం లేదు. తమ ఫోన్లను కింద పడేయలేదని, దానికదే పగిలిపోతుందని యూజర్లు పేర్కొంటున్నారు. ‘నా ఐఫోన్ ఎక్స్ కెమెరా లెన్స్ పగిలిపోయినట్టు ఇప్పుడే చూశా. కానీ నేనసలు ఈ ఫోన్‌ను కిందనే పడేయలేదు’ అని ఒక యూజర్ రెడ్డిట్‌లో రిపోర్టు చేశాడు. చల్లని వాతావరణంతో మనిషి చేతులు, కాళ్లు పగిలినట్టు, ఫోన్ వెనుక వైపు కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా చల్లని వాతావరణానికి దెబ్బతింటుందని పలువురు యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో ఉన్నందుకు వెనుక వైపు కెమెరా గ్లాస్ పగులుతుందని రిపోర్టులు వస్తున్నాయని, తాను మలేషియాలో ఉంటానని, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని, అయితే ఇక్కడ ఏ కారణం చేత పగిలింది అని ఓ బాధిత యూజర్ ఆపిల్ సపోర్టు ఫోరమ్‌కు లేఖ రాశారు. తమ వద్ద 32-36 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఫోన్ ఎక్స్‌తో పాటు యూజర్లు తన పాకెట్లలో మరికొన్ని వస్తువులను పెట్టుకుని ఉంటుండటంతో, కెమెరా గ్లాస్ పగులుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 7 నుంచి ఆపిల్ తన ఐఫోన్ మోడల్స్‌కు సఫైర్ గ్లాస్ కవర్‌ను వాడుతోంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటోంది. కానీ ఎందుకు పగులుతుందో మాత్రం సరియైన క్లారిటీ తెలియడం లేదు. అయితే పగిలిపోయిన ఈ కెమెరా గ్లాస్‌కు వారెంటీ కిందకి వస్తుందో రాదో కూడా అనుమానమే. -
ఊడిపడిన బస్సు అద్దాలు..
రోడ్డుపై ప్రయాణికుల పడిగాపులు హొసూరు: నిర్వహణ లోపమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కానీ తమిళనాడు ఆర్టీసీ తీరుతో ప్రయాణికులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.సేలం డివిజన్లోని హొసూరు, డెంకణీకోట, క్రిష్ణగిరి డిపోలలో బస్సులు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపైనే గంటల తరబడి వేచి ఉండటం సాధారణ విషయం అయిపోయింది. తాజాగా ఆదివారం హొసూరు నుంచి క్రిష్ణగిరికి ప్రయాణికులతో వస్తున్న బస్సు ముందు అద్దం ఒక్కసారిగా ఊడి రోడ్డుపై పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపి వేయడంతో ప్రయాణికులు పేరండపల్లి వద్ద పడిగాపులు పడ్డారు. డొక్కు బస్సులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. కనీసం ఏ ఒక్క అధికారి కూడా ప్రయాణికుల గురించి ఆలోచించకపోవడం శోచనీయమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.