
Urfi Javed Wear Broken Glass Dress Weighing 20 Kgs Video Viral: హిందీ బిగ్‌బాస్ ద్వారా చాలా ఫేమస్ అయింది ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ తర్వాత బయటకొచ్చిన ఉర్ఫీ విభిన్నమైన, విచిత్రమైన డ్రెస్టింగ్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయింది. డ్రెస్సింగ్ స్టైల్స్‌లో కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తూ కొన్నిసార్లు ప్రశంసలు పొందితే, మరికొన్ని సార్లు తీవ్ర విమర్శల పాలైంది ఈ బ్యూటీ. ఇంతకుముందు మెర్మేయిడ్ స్పాట్‌డ్ వేర్‌లో కనిపించిన ఉర్ఫీ జావేద్ మరోసారి సరికొత్త డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో ఉర్ఫీ పగిలిన గాజు ముక్కలతో చేసిన డ్రెస్‌ను వేసుకుంది.
ఈ పోస్ట్‌కు 'అవును, నేను పగిలిన గాజు ముక్కల డ్రెస్ వేసుకున్నాను. ఇది అద్భుతంగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. కానీ ప్రజలు ఇలాంటివి చూసి నాకు వెర్రి, పిచ్చి అనుకుంటారు. నిజానికి మనమందరం క్రేజీగా, పిచ్చిగా ఉన్నామని తెలుసుకోండి. కానీ నన్ను నేను చూసుకోడానికి నాకు తగినంత తెలివి, శక్తి ఉన్నాయి.' అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియోకు నటి రాఖీ సావంత్ ఫైర్ ఎమోజీని కామెంట్ పెట్టగా, పలువురు ప్రశంసిస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో చిన్న పార్టీ ఏర్పాటు చేసింది ఉర్ఫీ జావేద్. ఆ పగిలి గాజు ముక్కల డ్రెస్ వల్ల గాయాలు అవుతుండటంతో దాన్ని తీసేసింది. అంతేకాకుండా ఈ డ్రెస్ 20 కేజీల బరువు ఉంటుందని ఉర్ఫీ జావేద్ తెలిపింది.
చదవండి: 👇
ప్యాంట్ వేసుకోలేదురా బాబూ.. ఉర్ఫీ పరుగోపరుగు
సమంత చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పా? స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఉర్ఫీ
Comments
Please login to add a commentAdd a comment