అల్టిమేట్ బీచ్ ప్రపోజల్‌ : తెగ ఫిదా అవుతున్న లవబర్డ్స్‌, ఫోటోలు వైరల్‌ | Actor Aadar Jain Alekha Advani engagement pics goes viral | Sakshi
Sakshi News home page

అల్టిమేట్ బీచ్ ప్రపోజల్‌ : తెగ ఫిదా అవుతున్న లవబర్డ్స్‌, ఫోటోలు వైరల్‌

Published Mon, Sep 2 2024 5:38 PM | Last Updated on Mon, Sep 2 2024 6:58 PM

Actor Aadar Jain Alekha Advani engagement pics goes viral

బాలీవుడ్‌ లవబర్డ్స్‌ తమ రిలేషన్‌ను పక్కా చేసుకున్నారు. మాల్దీవుల్లోని సుందరమైన ప్రదేశంలో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో   పోస్ట్‌ చేయడంతో ఈ అల్టిమేట్ బీచ్ వెడ్డింగ్‌ ప్రపోజల్‌ నెట్టింట తెగ సందడి చేస్తోంది.  ఈ ఫోటోలను చూసిన ఇతర లవబర్డ్స్‌ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా ప్రేమ పక్షులు అంటే..

 ప్రముఖ నటుడు అలేఖా అద్వానీ, మోడల్‌ ఆదార్ జైన్. గత  కొన్నాళ్లుగా చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్న ఈ వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో నటుడు  ‘‘నా ఫస్ట్‌ లవ్‌, నా బెస్ట్ ఫ్రెండ్ .. ఇక ఎప్పటకీ నా సొంతం’’ అనే క్యాప్షన్‌తో  సంతోషకర వార్తను పంచుకున్నాడు.  ప్రియురాలి ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయడం, దీంతో అతని లేడీ లవ్ పూర్తిగా పసుపు రంగు దుస్తులలో అద్భుతంగా కనిపించడమే కాదు ఆధార్‌ తన ప్రియుడు వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్‌ చేస్తోంటే అలేఖ కన్నీళ్ల పర్యంతమైంది. మరోవైపు ఈ జంటకు స్నేహితులందరూ విషెస్‌ అందించారు. ముఖ్యంగా " మెహెందీ లగా కే రఖ్నా...డోలీ సాజా కే రఖ్నా.." అంటూ కరీనా కపూర్‌ స్పందించింది. 

 

కాగా ఆధార్‌ జైన్‌ ఖైదీ బ్యాండ్,హలో చార్లీలో సినిమాలతో నటుడిగా బాలీవుడ్‌లో పేరు తెచ్చు కున్నాడు. ముంబైలోని వే వెల్ అనే వెల్‌నెస్ కమ్యూనిటీ  క్రియేటివ్    వ్యవస్థాపకురాలు అలేఖా అద్వానీ, వివిధ దుస్తులు,నగల బ్రాండ్‌లకు పనిచేసిన మోడల్ కూడా. గతంలో2023లో కరీనా కపూర్ ఖాన్ దీపావళి పార్టీలో మొదటిసారిగా కలిసి కనిపించి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ బాలీ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను, అలేఖా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా  మై లైఫ్‌ ఆఫ్‌ లైట్‌ అంటూ కొన్ని బ్యూటిఫుల్‌ ఫోటోలను ఇన్‌స్టాలో  పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement