Beech
-
అల్టిమేట్ బీచ్ ప్రపోజల్ : తెగ ఫిదా అవుతున్న లవబర్డ్స్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ లవబర్డ్స్ తమ రిలేషన్‌ను పక్కా చేసుకున్నారు. మాల్దీవుల్లోని సుందరమైన ప్రదేశంలో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అల్టిమేట్ బీచ్ వెడ్డింగ్ ప్రపోజల్ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ ఫోటోలను చూసిన ఇతర లవబర్డ్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా ప్రేమ పక్షులు అంటే.. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) ప్రముఖ నటుడు అలేఖా అద్వానీ, మోడల్ ఆదార్ జైన్. గత కొన్నాళ్లుగా చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్న ఈ వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నటుడు ‘‘నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ .. ఇక ఎప్పటకీ నా సొంతం’’ అనే క్యాప్షన్‌తో సంతోషకర వార్తను పంచుకున్నాడు. ప్రియురాలి ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయడం, దీంతో అతని లేడీ లవ్ పూర్తిగా పసుపు రంగు దుస్తులలో అద్భుతంగా కనిపించడమే కాదు ఆధార్ తన ప్రియుడు వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేస్తోంటే అలేఖ కన్నీళ్ల పర్యంతమైంది. మరోవైపు ఈ జంటకు స్నేహితులందరూ విషెస్ అందించారు. ముఖ్యంగా " మెహెందీ లగా కే రఖ్నా...డోలీ సాజా కే రఖ్నా.." అంటూ కరీనా కపూర్ స్పందించింది. కాగా ఆధార్ జైన్ ఖైదీ బ్యాండ్,హలో చార్లీలో సినిమాలతో నటుడిగా బాలీవుడ్లో పేరు తెచ్చు కున్నాడు. ముంబైలోని వే వెల్ అనే వెల్నెస్ కమ్యూనిటీ క్రియేటివ్ వ్యవస్థాపకురాలు అలేఖా అద్వానీ, వివిధ దుస్తులు,నగల బ్రాండ్లకు పనిచేసిన మోడల్ కూడా. గతంలో2023లో కరీనా కపూర్ ఖాన్ దీపావళి పార్టీలో మొదటిసారిగా కలిసి కనిపించి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ బాలీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, అలేఖా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మై లైఫ్ ఆఫ్ లైట్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కొయ్య కొరత తీర్చేలా... బొమ్మల తయారీకి ఊతమిచ్చేలా
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ అనగానే మొదట గుర్తొచ్చేది కొయ్యబొమ్మలే..వీటి తయారీ పరిశ్రమ కొలువుదీరింది ఇక్కడే. పొనికి చెట్టు నుంచి తీసే కలప ముడిసరుకుతో ఈ బొమ్మలను కళాకారులు తయారు చేస్తారు. ఈ కర్ర మృదువుగా, తేలికగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అడవుల్లో పొనికి చెట్లు కనుమరుగవడంతో జిల్లాలో గత ఐదారేళ్లుగా బొమ్మల తయారీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దాదాపు 150 కళాకారుల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొనికి మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను అధికారులు గుర్తించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పొనికి కర్ర ప్రత్యేకం.. నిర్మల్ కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు నుంచి తీసిన కలప చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ పొనికి కర్ర తేలికగా సరళంగా ఉండి, బొమ్మను చెక్కే క్రమంలో మృదువుగా ఉంటుంది. బొమ్మల తయారీలో కళాఖండంగా తీర్చుదిద్దవచ్చు. అందుకే పొనికి కర్రను వినియోగిస్తామని కళాకారులు అంటున్నారు. పొనికి మొక్కల పెంపునకు అనువైన ప్రాంతాలు.. పొనికి మొక్కల పెంపకం కోసం ప్రయోగాత్మకంగా పలు గ్రామ పంచాయతీలను డీఆర్డీఏ, ఇతర అధికారులు ఎంపిక చేశారు. మట్టి నమూనా పరీక్ష ల ఆధారంగా మామడ మండలం కొరిటికల్, గా యిద్పెల్లి, మొండిగుట్ట, తాండ్ర, వాస్తాపూర్, లింగాపూర్, తోటిగూడ, రాయదారి, సారంగాపూర్ మండలం గోపాల్పేట్ సమీపంలోని అటవీప్రాంతం అనువైనవిగా గుర్తించారు. ఇప్పటికే మట్టికి భూసార పరీక్ష అనంతరం ఇక్కడ మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. రాయదారి సమీపంలో 500 మొక్కలు నాటారు. మొదటగా లింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో హరితహారం కింద వెయ్యి పొనికి మొక్కలు నాటారు. వాస్తాపూర్, గాయిద్పెల్లి తదితర గ్రామాల్లో దశలవారీగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. సారంగాపూర్ మండలం గోపాల్పేట సమీపంలో మహబూబ్ ఘాట్స్ ప్రాంతంలో 2,200 మొక్కలు నాటారు. నీటి వసతి కోసం ప్రత్యేకంగా డీఆర్డీఏ అధికారులు బోర్వెల్ వేయించారు. మొక్కలు నాటించాం పొనికి కర్రకు తీవ్రమైన కొరత ఏర్పడిన విషయాన్ని గుర్తించాం. జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో హరితహారంలో మొక్కల ప్లాంటేషన్‌ను పకడ్బందీగా చేపడుతున్నాం. కొన్ని ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటించాం. సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – కె.విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి హర్షణీయం పొనికి కలపతో తయారీ చే సిన కొయ్య బొమ్మలు ఎక్కువకాలం మన్నిక ఉంటాయి. వీటి తయారీపై ఆధారపడిన కళాకారుల కుటుంబాలు క ర్ర కొరతతో ఇబ్బంది పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం, డీ ఆర్డీఏ అధికారులు జిల్లాలో పొనికి వనాల పెంప కం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. – నాంపల్లి రాజశేఖర్‌వర్మ, కళాకారుడు, నిర్మల్ -
బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. మళ్లీ బ్యాడ్ కామెంట్స్
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) తన ఫ్యాన్స్‌తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న ఇల్లీ బేబీ.. రీసెంట్గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన బేబీమూన్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు బికినీలో బేబీ బంప్ చూపిస్తూ.. బీచ్‌లో సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తున్న పిక్స్ పంచుకుంది. ఈ బేబీమూన్ స్పాట్ ఎక్కడనేది ఇలియానా ప్రస్తావించలేదు. ‘ఇసుకలో పాదాలు, సంతోషకరమైన హృదయం’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. (ఇదీ చదవండి: నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్) అలాగే సముద్రం, అలల తాకిడిని చూపిస్తూ చిన్న గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేసింది. చివరగా సెల్ఫీ పిక్ పోస్ట్ చేయగా.. ఇందులో ఎల్లో బికినీ, బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్ ధరించిన ఇలియానా తన బేబీ బంప్‌ను చూపించింది. అయితే ఇలా ఫొటోలు రిలీజ్ చేసిన వెంటనే మరోసారి ఆమెపై విమర్శల వర్షం మొదలైంది. తండ్రి ఎవరో చెప్పకుండా ఈ ప్రెగ్నెన్సీ ఫొటోలు పెడితే బ్యాడ్ ఫీలింగ్ వస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా మాత్రం ఈ కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదు. తన జీవితంలో స్పెషల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఇలియానా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. -
పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!
ఇటివల కాలంలో పారాసెయిలింగ్ చేయడానికి యువత తహతహాలాడుతున్నారు. పైగా ఆకాశంలో పక్షుల మాదిరి విహరిస్తుంటే ఆ అనుభవమే వేరు. అంతేకాదు యువత అడ్వెంచర్స్ చేయడానికే మొగ్గు చూపుతుంది. అందుకోసం ఎంత రిస్క్ అయిన చేస్తున్నారు. అయితే ఎందుకనో ఇటీవల కాలంలో అవి ఫెయిల్ అవుతున్నాయనే చెప్పాలి. ఈ మధ్య ఒక జంట పారాసెయిలింగ్ చేస్తుండగా తాడు తెగి కింద పడిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. అచ్చం అలానే ముంబైలోని ఇద్దరు మహిళలు సముద్రంపై పారాసెయిలింగ్ చేయాలని సన్నద్ధమయ్యారు. కానీ వారికి కూడా చేదు అనుభవం ఎదురైంది. (చదవండి: ఢిల్లీలో 125కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. న్యూయర్, క్రిస్మస్ వేడుకలు బ్యాన్) అసలు విషయంలో కెళ్లితే..ముంబైలోని సాకినాకాకు చెందిన ఇద్దరు మహిళలకు సముద్రం వద్ద పారా సెయిలింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే వారు పడవ మీద నుంచి పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మోస్తారు ఎత్తుకు చేరుకున్నాక తాడు తెగిపోతుంది. దీంతో వాళ్లు ఒక్కసారిగా సముద్రంలో పడిపోతారు. అయితే అదృష్టవశాత్తు లైఫ్ జాకెట్లు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఆ మహిళలు తాము తాడు కొంత భాగంలో నలిగి తెగిపోయే విధంగా ఉండటం గమినించాం అన్నారు. పైగా రైడ్ నిర్వహిస్తున్న వ్యక్తులు తాడు దెబ్బతిన్న భాగం గాలిలోకి వెళ్లదని హామీ కూడా ఇచ్చారని అన్నారు. దీంతో పలువురు భారతదేశంలో సాహస క్రీడల భద్రతా ప్రమాణాల గురించి మరోసారి తీవ్రస్థాయితో విమర్శలు లెవనెత్తారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
పుట్టినరోజే మృత్యు ఒడికి..
మచిలీపట్నం(కోనేరుసెంటర్) : ఆ ఐదుగురూ స్నేహితులు. తమలో ఒకరి పుట్టిన రోజు నేపథ్యంలో విహార యాత్ర కోసం మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్‌కు వచ్చారు. సముద్ర తీరానికి చేరుకున్న వారు అలల ఉధృతిని చూసి కేరింతలు కొట్టారు. ముగ్గురు ఒడ్డున నిలబడగా, ఇద్దరు ఉత్సాహంగా అలలకు ఎదురెళ్లారు. ఇంతలో రాకాసి అల వారిపై విరుచుకుపడింది. క్షణకాలంలో జరిగిన ఘోరాన్ని చూసిన తోటి పర్యాటకులు సముద్రంలోకి పరుగులు పెట్టి అతికష్టం మీద ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ ఇద్దరూ వృుత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాద ఘటన ఆదివారం జరిగింది. బందరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి పాత బి.కాలనీకి చెందిన టేకుపల్లి అక్షిత (19), అమర్లపూడి ప్రవీణ్‌జై (20), పొన్నం ఆదర్ష్, నల్లమోతు వినయ్ప్రమోద్, యడ్ల స్వాతి స్నేహితులు. అక్షిత విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతోంది. ప్రవీణ్‌జై గన్నవరం పాలిటెక్నిక్ కళాశాలలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు వేర్వేరు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆదివారం అక్షిత పుట్టినరోజు కావటంతో ఐదుగురు కలిసి గుడ్లవల్లేరు మండలంలోని కొండాలమ్మతల్లి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంగినపూడి బీచ్‌కు చేరుకున్నారు. అక్షిత, ప్రవీణ్‌జై ముందుగా సముద్రంలోకి వెళ్లి అలలతో సందడిచేస్తుండగా, మిగిలిన ముగ్గురు సముద్రం ఒడ్డున భోజనానికి ఉపక్రమించారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద అల విరుచుకుపడింది. ఆ అల తాకిడికి ప్రవీణ్‌జై నీటిలో మునిగిపోగా అతడిని రక్షించేందుకు అక్షిత ముందుకెళ్లింది. అయితే అలతాకిడి ఉధృతంగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన స్థానిక ఫొటోగ్రాఫర్లు హుటాహుటిన సముద్రంలోనికి పరుగు పెట్టి అతికష్టంపై ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. ప్రవీణ్‌ను బైక్‌పై, అక్షితను ఆటోలో బందరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా కొన ఊపిరితో ఉన్న ఇద్దరూ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. తల్లడిల్లిన స్నేహితులు విహారయాత్రకు వచ్చిన స్నేహితులు కళ్లముందే ప్రాణాలు విడవడంతో ఆదర్ష్, వినయ్, స్వాతి తల్లడిల్లారు. ఆస్పత్రి ఆవరణలో విగతజీవులుగా పడివున్న అక్షిత, ప్రవీణ్‌జై మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. జరిగిన ఘొరాన్ని మృతుల బంధువులు, స్నేహితులకు ఫోన్లో చెబుతూ తల్లడిల్లిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాధి కుటుంబాల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదుచేసి పోలీసులు తెలిపారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర 52
కొత్త ఒరవడి మేలిరకం పనిముట్ల ఆధరువు దొరికిందే తడవుగా చేతివృత్తుల నైపుణ్యం గణనీయంగా పెరిగింది. అది ఏ స్థాయికి పెరిగిందో సూచించే ఉదంతమొకటి మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋభువులు అనే ముగ్గురు సోదరులు మానవులు. త్వష్ట దేవతలకు దారుశిల్పి. త్వష్ట ‘చమసము’ అనబడే పాత్రనొకదానిని తయారుచేశాడు. ఆ పాత్రను ఋభువులు నాలుగు పాత్రలుగా చేశారు. త్వష్ట సిగ్గుతో తలదించుకున్నాడు. తమ వృత్తి నైపుణ్యంతో ఋభువులు దేవతలైనారు. ‘చమసము’ అన్నది చెక్కతో నిర్మించిందో లేక లోహంతో నిర్మించిందో చెప్పలేదు గానీ, ‘దారుశిల్పి’ అంటే వడ్రంగి కావడంతో, ఆ విన్యాసానికి ముడిసరుకు కొయ్యదే అయ్యుండాలి. వడ్రంగంలో సాధించిన ప్రగతి వల్ల ఎంతోకాలంగా మానవుడు కంటున్న కలల్లో మరొకటి ఫలించింది. ఎప్పుడో ఇరవై వేల సంవత్సరాలకు ముందే నిప్పు భయం అతనికి తీరిపోయినా, నీటి బెదురు మాత్రం ఇంకా తగ్గలేదు. నాగరిక జీవితం ముడిపడింది ఎడతెగకుండా పారే నదితో. అందువల్ల, నదిని సాధించితీరాలనేది మానవుని ఆశయమేగాదు, అవసరం కూడా. తీగెలతో దట్టంగా అల్లిన పొడవాటి బుట్టలకు తారు దట్టించి తేలడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని; వెదురు బొంగులకు జంతు చర్మాన్ని సాగదీసిన దొన్నెలతో చేసిన ప్రయత్నాలు కొన్ని; తేలికైన దుంగలను చాపమోస్తరుగా పరిచికట్టిన తెప్పలతో తృప్తిపడిన రోజులు కొన్ని. ఇవన్నీ ప్రవాహానికి అనుకూలంగా పనికొచ్చే సాధనాలేగానీ ఎదురెక్కేందుకు వీలు కలిగించేవిగావు. పనిముట్లు మెరుగుపడటంతో ఇప్పుడు ప్రవాహానికి ఎదురెక్కే తెడ్లపడవ ఉనికిలోకి వచ్చింది. తెడ్లతోపాటు తెరచాపను కూడా వినియోగించుకుంటూ అది మరికొంచెం పెరిగి, కాలగమనంలో మరింత పెద్దదై, నదీముఖాల్లో తేలికపాటి అలలను తట్టుకునేంత పటిష్టమైన, ఒక దశలో సముద్రాన్ని సైతం ఈదగలిగే ‘ఓడ’గా ఎదిగింది. ఈ ఒరిపిడుల మధ్యన, ఆయా రంగాల్లో నైపుణ్యంవారీగా వృత్తుల్లో పని విభజన మొదలయింది. లోహంతో పనిచేసేవాడు కమ్మరి, బంకమట్టితో పనిచేసేవాడు కుమ్మరి, కలపతో పనిచేసేవాడు వడ్రంగి, రాయితో పనిచేసేవాడు వాస్తుశిల్పి - ఇలా, నేతతో సహా, దేనికదిగా విడిపోయి, స్వతంత్ర జీవనోపాధులుగా అవి నాగరికతకు అతుక్కుపోయాయి. మెరుగైన పనిముట్ల వల్ల వృత్తిపనుల్లో ఉత్పత్తి పెరిగింది. నాగరికత పెరగడం వల్ల, తయారైన వస్తువులకు గిరాకీ ఏర్పడింది. వాటిని గింజలతోనో, గొర్రెలతోనో, బర్రెలతోనో వస్తుమార్పిడి చేసుకునే సంతల్లో సందడి పెరిగింది. సంతలకు పేరుబోయిన ప్రదేశాలు క్రమంగా పట్టణాలుగానూ, నగరాలుగానూ విస్తరించాయి. క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి నగరాలుగా చెప్పుకోదగిన ప్రదేశాలు ఇరవైదాకా మెసొపొటేమియాలో ఉండినట్టు అంచనా. వాటిని చుట్టుకొనివున్న జనావాసాల్లో కొన్ని పట్టణాలుకాగా, తక్కినవి గ్రామాలు. ప్రపంచంలో అన్నిటికంటే ముందు నగరాలుగా ఎదిగినట్టు నిరూపించుకున్న ప్రదేశాలు ‘ఎరెచ్’, ‘నిప్పర్’లు రెండున్నూ మెసొపొటేమియాకు చెందినవే. పర్షియన్‌గల్ఫ్ తీరానికి సుమారు రెండు వందల కిలోమీటర్ల ఎగువన, యూఫ్రటీస్ నదీతీరంలో వెలిసిన నగరం ‘ఎరెచ్’. దీనికి ఉత్తరంగా, మరో వంద కిలోమీటర్ల దూరంలో, జంట నదులకు నడిమిగా ఏర్పాటైన నగరం ‘నిప్పర్’. మెసొపొటేమియన్లు ఆరాధించిన దేవతల్లో ప్రముఖుడైన ‘ఎన్లిల్’కు (ఋగ్వేదంలోని మరుత్తులతో పోల్చదగిన శక్తికి) ఈ నగరంలో ఒక దేవాలయం నిర్మించారు. చరిత్రకు తెలిసిన ఈ మొట్టమొదటి దేవాలయానికి ఆకాశాన్ని తాకేంత ఎత్తై గోపురాన్ని ఇటుకలతో నిర్మించారని ప్రతీతి. బైబిల్లో ప్రస్తావించిన ‘టవర్ ఆఫ్ బేబెల్’ ఇదేనని చరిత్రకారుల అభిప్రాయం. పురాతన నాగరికతల్లో అన్నిటికంటే విశాలంగా విస్తరించిన సింధూ నాగరికతలో నగరాల సంఖ్య తక్కువ, గ్రామాల సంఖ్య ఎక్కువ. నగరాలుగా ఎదిగినవి మామూలు నగరాలు కాదు, మహానగరాలు (మెట్రోపొలీస్). ఇకపోతే, ఈజిప్టు, చైనా నాగరికతల్లో వంశపారంపర్య పరిపాలన మొదలయిందాకా పట్టణాలూ, నగరాలు ఏర్పడిన దాఖలాలు కనిపించవు. రచన: ఎం.వి.రమణారెడ్డి