Ileana D'Cruz enjoys beach day with baby bump, bad comments from fans - Sakshi
Sakshi News home page

ఎవరి కామెంట్స్‌తో పనిలేదు.. ఎంజాయ్‌ చేస్తున్న ఇలియానా

Jun 7 2023 12:13 PM | Updated on Jun 7 2023 12:54 PM

Ileana Baby Bump on Beach Bad Comments From Fans - Sakshi

గోవా బ్యూటీ  ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

(ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్‌ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్‌)

తన ఫ్యాన్స్‌తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న ఇల్లీ బేబీ.. రీసెంట్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన బేబీమూన్‌ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు బికినీలో బేబీ బంప్ చూపిస్తూ.. బీచ్‌లో సముద్ర తీరాన్ని  ఆస్వాదిస్తున్న పిక్స్ పంచుకుంది. ఈ బేబీమూన్ స్పాట్ ఎక్కడనేది ఇలియానా ప్రస్తావించలేదు. ‘ఇసుకలో పాదాలు, సంతోషకరమైన హృదయం’ అని  ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది.

(ఇదీ చదవండి: నన్ను చంపేందుకు ప్లాన్‌ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్‌ కామెంట్స్‌)

అలాగే సముద్రం, అలల తాకిడిని చూపిస్తూ చిన్న గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేసింది. చివరగా సెల్ఫీ పిక్ పోస్ట్ చేయగా.. ఇందులో ఎల్లో బికినీ, బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్ ధరించిన ఇలియానా తన బేబీ బంప్‌ను చూపించింది. అయితే ఇలా ఫొటోలు రిలీజ్ చేసిన వెంటనే  మరోసారి ఆమెపై విమర్శల వర్షం మొదలైంది. తండ్రి ఎవరో చెప్పకుండా ఈ ప్రెగ్నెన్సీ ఫొటోలు పెడితే బ్యాడ్ ఫీలింగ్ వస్తుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా మాత్రం ఈ కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదు. తన జీవితంలో స్పెషల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే, బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వర​కు ఇలియానా ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement