Illiana
-
బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. మళ్లీ బ్యాడ్ కామెంట్స్
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) తన ఫ్యాన్స్‌తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న ఇల్లీ బేబీ.. రీసెంట్గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన బేబీమూన్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు బికినీలో బేబీ బంప్ చూపిస్తూ.. బీచ్‌లో సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తున్న పిక్స్ పంచుకుంది. ఈ బేబీమూన్ స్పాట్ ఎక్కడనేది ఇలియానా ప్రస్తావించలేదు. ‘ఇసుకలో పాదాలు, సంతోషకరమైన హృదయం’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. (ఇదీ చదవండి: నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్) అలాగే సముద్రం, అలల తాకిడిని చూపిస్తూ చిన్న గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేసింది. చివరగా సెల్ఫీ పిక్ పోస్ట్ చేయగా.. ఇందులో ఎల్లో బికినీ, బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్ ధరించిన ఇలియానా తన బేబీ బంప్‌ను చూపించింది. అయితే ఇలా ఫొటోలు రిలీజ్ చేసిన వెంటనే మరోసారి ఆమెపై విమర్శల వర్షం మొదలైంది. తండ్రి ఎవరో చెప్పకుండా ఈ ప్రెగ్నెన్సీ ఫొటోలు పెడితే బ్యాడ్ ఫీలింగ్ వస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా మాత్రం ఈ కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదు. తన జీవితంలో స్పెషల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఇలియానా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. -
ది బిగ్ బుల్: ఇలియానా ఫస్ట్ లుక్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, నటి ఇలియానా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది బిగ్ బుల్’. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రం బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో అభిషేక్ బచ్చన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇది ‘ది బిగ్ బుల్’ సినిమాలోని ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్. భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న క్రైం డ్రామా చిత్రం. త్వరలో ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది’ అని క్యాప్షన్ జత చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఇలియానా ముఖంలో తీవ్రమైన ఎక్స్ప్రెషన్ కలిగి, నల్లని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. (చదవండి: నటి సెల్ఫీ: అస్సలు బాగోలేదంటున్న నెటిజన్లు) Here is the first look of Ileana D'Cruz from The Big Bull! #TheBigBull a crime drama that shook the financial fabric of India will unveil soon with #DisneyPlusHotstarMultiplex on @DisneyplusHSVIP!@ajaydevgn @Ileana_Official @s0humshah @nikifyinglife @kookievgulati pic.twitter.com/7RXKmfs7GF — Abhishek Bachchan (@juniorbachchan) August 18, 2020 ఇలియానా కూడా ‘ది బిగ్ బుల్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషపడుతున్నాను’ అని క్యాప్షన్ జత చేశారు. ది బిగ్ బుల్ సినిమా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్‌కు సంబంధించిన కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నికితా దత్తా, సోహుమ్ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ దేవ్గన్, ఆనంద్ పండిట్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల డిస్నీ, హాట్‌స్టార్ నిర్వహించిన వర్చువల్ విలేకరుల సమావేశంలో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ‘ది బిగ్ బుల్’ సినిమా 80, 90ల్లో ముంబైలో జరిగిన కథ అని అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. View this post on Instagram Excited to be a part of the world of The Big Bull: The Man who sold dreams to India. #TheBigBull a crime drama that shook the financial fabric of the country will unveil soon with #DisneyPlusHotstarMultiplex on @DisneyPlusHotstarVIP @ajaydevgn @bachchan @shah_sohum @nikifying @kookievgulati #ADFfilms @anandpandit @anandpanditmotionpictures @kumarmangatpathak @vickssharma @meenaiyerofficial A post shared by Ileana D'Cruz (@ileana_official) on Aug 17, 2020 at 9:32pm PDT -
విన్యాసాలతో ముద్దూ ముచ్చట
ఫ్లోరిడా: పరస్పర ప్రేమను వ్యక్తీకరించుకోవడంలోనూ పెళ్లి చేసుకోవడంలోనూ వినూత్న పద్ధతులను ఆశ్రయించడం అమెరికా యువతీ యువకులకు పరిపాటే. అలాగే ఫ్లోరిడాలోని ఒకోయిలో ఉంటున్న జో, ఇలియానాలు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశమార్గాన విహరిస్తూ, సముద్ర గర్భంలో జలకాలుడుతూ, పర్వతారోహన చేస్తూ నిశ్చితార్థం జరుపుకోవాలా? ఆహా...ఇవిన్నీ పాతపడిన విద్యలే. జీవితాంతం కలిసున్నా, లేకున్నా జీవితాంతం గుర్తుండేలా ఇంకా కొత్తగా, వినూత్నంగా నిశ్చితార్థం జరుపుకోవాలని ఆలోచించారు. వారి మధ్య ప్రేమ అంకురించి, వికసించిందీ జిమ్‌లోనే. కనుక జిమ్‌లోనే నిశ్చితార్థం జరుపుకోవాలని నిర్ణయానికొచ్చారు. అయితే ఎలా అన్నది మరో ప్రశ్న... మళ్లీ ఆలోచించారు. జిమ్నాస్టిక్స్లోనూ వెయిట్ లిఫ్టింగ్లోను ఇద్దరు నిపుణులే అవడం వల్ల కసరత్తు చేస్తూనే కళ్యాణ గడియలకు నిశ్చితార్థం జరుపుకోవాలని అనుకున్నారు. వెంటనే ఫొటోగ్రాఫర్‌ను పిలిపించారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ నిశ్చితార్థం పేరిట ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. వారిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసిన సదరు ఫొటోగ్రాఫర్ నిజంగా ఇది కొత్తగాను, గమ్మత్తుగాను ఉందంటూ భావి దంపతులను ఆశీర్వదించారు. బ్యూనా విస్టా సరస్సు సమీపంలోని ప్యారడైజ్ పందిట్లో ఏప్రిల్ 30వ తేదీన వారు పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్థానికే సిగ్గేలనే... ఎగ్గేలనే ...అనుకుంటూ చెమటోడ్చి ముద్దులు పెట్టుకున్న వారు పెళ్లికి మరెలాంటి విన్యాసాలు చేస్తూ ఆహూతులను ఆకట్టుకుంటారో మరి!