
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తండేల్ చిత్రం సక్సెస్ కావడంతో నాగచైతన్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు చందు మొండేటితో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే విజయవాడ వెళ్లిన నాగచైతన్య ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
కాగా.. తండేల్ చిత్రాన్ని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌గా పాత్రలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment