coments
-
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. తాజాగ నవీన్ పొలిశెట్టి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. షూటింగ్ ప్రారంభంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించడం అంత సులభం కాదని నవీన్ తెలిపాడు. దీంతో షూటింగ్ ప్రారంభంలో మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పాడు. ఆ తర్వాత నుంచి అనుష్క అందించిన ఎంకరేజ్‌మెంట్‌తో ఎలాంటి బెరుకు లేకుండా ఆమెతో కలిసిపోయానని చెప్పాడు. అలా షూటింగ్ మొత్తం సరదాగా సాగిపోయిందని గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమా వల్ల తామిద్దరం మంచి ఫ్రెడ్స్ అయ్యాం. సినిమాలో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని నవీన్ పేర్కొన్నాడు. అనుష్క లాంటి స్టార్ నటితో కలిసి నటించారు కదా ఆమె నుంచి ఏం నేర్చుకున్నారని యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనిపై వెంటనే స్పందించాడు నవీన్. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని ఇలా చెప్పేశాడు. 'సెట్స్ లో అడుగుపెట్టగానే టెక్నీషియన్స్‌కు అనుష్క ఓ వెచ్చటి హగ్ ఇస్తుంది. కానీ అది ఎంతో అభిమానపూర్వకంగా మాత్రమే ఇచ్చే కౌగిలింత. ఆవిడ నుంచి నేను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అది మనలో ఎంతో పాజిటివ్‌ను ఇస్తుంది. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్లో ఇదొకటి.' అని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: అనిరుద్ గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్) తాజాగ విడుదలైన ట్రైలర్లో అనుష్కను చాలా తక్కువగా చూపించారని, సినిమాలో ఆమె చేసిన రచ్చ ఓ రేంజ్లో ఉంటుందని నవీన్ తెలిపాడు. అంతేకాకుండా ఆమె ఏ నటుడితోనైనా ఫర్ఫెక్ట్గా సింక్ అవుతుందని చెప్పాడు. -
అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ అథర్వ కామెంట్
అథర్వ మురళీ తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడే అథర్వ అనే సంగతి తెలిసందే. 2010లో 'బాణకాతాడి' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2013లో కోలీవుడ్‌లో విడుదలైన 'పరదేశి'కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆపై 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు సినీరంగంలోకి అథర్వ ప్రవేశించాడు. తాజాగ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కొత్త వెబ్ సిరీస్ 'మధకం' స్ట్రీమింగ్ ప్రమోషన్‌కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అథర్వ మాట్లాడుతూ, తనతో నటించిన హీరోయిన్లలలో అమలా పాల్ చెత్త హీరోయిన్ అని ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) 'నా రెండో సినిమా 'ముహుదుముత్ ఉన్ కర్పనై'లో మేమిద్దరం కలిసి నటించాం. షూటింగ్ ప్రారంభం అయ్యాక మొదటి పది రోజుల్లో తనతో ఒక చిన్న వివాదం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇద్దరి మధ్య ఈ గొడవ మళ్లీ సెట్ అయింది. కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలా పాల్కే చెప్పాను' అని అథర్వ తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి. -
నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్‌గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. కానీ కొద్దిరోజులుగా ఈ జోడి మాత్రం స్క్రీన్‌పై ఒకటిగా కనిపించలేదు. సుధీర్ సినిమాలతో బిజీ అయితే.. రష్మీ మాత్రం పలు టీవీ షోలతో రానిస్తుంది. (ఇదీ చదవండి; నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా) తాజాగా వీరిద్దరూ ప్రముఖ టీవీ షోలో ఒకే స్క్రీన్‌పై మళ్లీ జంటగా కనిపించారు. దీంతో వారిద్దరీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోలో సుధీర్ వేసిన డైలాగ్‌లు మళ్లీ వైరల్ అవుతున్నాయి. మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారంటూ రష్మీని ఉద్దేశించి సుధీర్ కామెంట్ చేస్తాడు. అందుకు బదులుగా రష్మీ కూడా 'నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను' అంటూనే ఓర చూపులతో చిన్న స్మైల్ ఇస్తూ 'ఇన్నిరోజులు ఎక్కడున్నావ్..?' అని సుధీర్‌ను ఆమె ప్రశ్నింస్తుంది. ఇంతలో వెంటనే సుధీర్ తన స్టైల్లో 'నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లోనే ఉంటావ్' అంటూ డైలాగ్ పేలుస్తాడు. ఇంకేముంది ఫ్యాన్స్ కేకలతో రెచ్చిపోయారు. ఇలా సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జోడిగా ఆ షోలో కనిపించారు. పెళ్లిపై రూమర్స్ ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని ఆమె తెలిపింది. -
బేబి ఫేమ్ 'వైష్ణవి చైతన్య' తమ్ముడు చేసినపనికి భారీ ట్రోలింగ్
ఇండస్ట్రీలో చాలామంది నటుల్లానే విజయ్ దేవరకొండ కూడా సొంత టాలెంట్‌తోనే ఎదిగాడు. సినిమా అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఎలాంటి పాత్ర వచ్చినా నటించాడు. అలా ఒక్కోమెట్టు ఎదుగుతూ నేటి యువతకు బ్రాండ్‌గా మారాడు. అలాంటి 'లైగర్' పక్కన బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య తమ్ముడు దిగిన ఫోటో ఒకటి ట్రోలింగ్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. (ఇదీ చదవండి: అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్) బేబి సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్‌లోకి వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక విజయ్ దేవరకొండతో వారిద్దరు కలిసి ఫోటోలు దిగారు. అందులో వైష్ణవి తమ్ముడు కూడా ఉన్నాడు. ఆపై వాటిని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలో వైష్ణవి తమ్ముడే హైలెట్ అవుతూ స్టిల్ ఇవ్వడంతో వారికి నచ్చలేదు. అంతేకాకుండా విజయ్‌పైన చెయి వేయడంతో ఈ ట్రోలింగ్‌కు మరింత దారి తీసింది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) వైష్ణవి తమ్ముడి పైనా విజయ్ ఫ్యాన్స్ ఇలా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఏమైనా సాధారణ వ్యక్తిలా ఫీలయ్యావా ఏంటి అంటూ వారు విరుచుకుపడుతున్నారు. 'నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా..? అలా విజయ్ పైనా చెయి వేసి ఫోజు కొడుతున్నావ్.. నీతో ఫోటో దిగేందుకు విజయ్, ఆనంద్‌లు మీ ఇంటికి వచ్చారా..? కొంచెం ఇలాంటి ఆటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది.' అని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరైతే వీడేంటి అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడులా లుక్ ఇచ్చాడు అంటుంటే మరికొందరేమో వీడు చైల్డ్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటో వార్ ఇంతటితో ఆపేయండని పలువురు అంటుంటే.. పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో వైష్ణవి అయినా తమ్ముడికి చెప్పాలి కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. -
ఫోటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల.. బ్యాడ్ కామెంట్లతో నెటిజన్స్
టాలీవుడ్లో 2019 లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో అనన్య నాగళ్ల ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమెకు అన్ని చిన్న చిన్న పాత్రలే వచ్చాయే కానీ లీడ్ రోల్లో నటించే పాత్ర దక్కలేదనే చెప్పాలి. సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ మంచి పాత్రలో కనువిందు చేసింది. తనలో మంచి టాలెంట్ ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం చెప్పుకోతగిన విదంగా రాలేదనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..) ఈ మధ్యే విడుదలైన 'బేబీ' సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా టాలెంట్ ఉన్నప్పటికీ తనకు సరైన గుర్తింపు దక్కేందుకు 8 ఏళ్లు పట్టింది. అదే విదంగా ఈ తెలుగు బ్యూటీకి కూడా ఏదో ఒకరోజు మంచి అవకాశం రాకపోతుందా..? అని తన సినీ ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు. ఇందులో భాగంగానే సోషల్‌మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తన అందంతో ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలతో పాటు వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో అనన్య గెంతులు వేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు భారీగానే నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను పలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే అంత బరువును ఎలా మోస్తున్నారంటూ తన బాడీ గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తనుకు ఇలాంటి కామెంట్లు కొత్తేమీ కాదు. వీటిని తను పెద్దగా సీరియస్‌గా కూడా తీసుకోదని తెలుస్తోంది. ఎందుకంటే ఎవరెన్ని కామెంట్లు చేసినా తన పని తాను చేసుకుంటూ మళ్లీ రోజు సరికొత్త ఫోటోలతో తన అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
వాళ్ల కోసమే బూతు సినిమాలు చేశా.. పాత రోజుల్ని గుర్తుచేసుకున్న సన్నీ లియోన్
బాలీవుడ్లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. దీంతో 2012 నుంచి అలాంటి చిత్రాలు చేయడం మానేసి హిందీ చిత్రాలు, ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తూ మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్) వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ (2011-12) ఐదవ సీజన్లో పాల్గొన్నప్పుడు సన్నీ లియోన్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అప్పటికే ఆమె అశ్లీల చిత్రాల్లో నటిస్తూ ఉండటంతో ఆమెపై ఇండియాలో చాలా వ్యతిరేకత ఉండేది. దీంతో భారత్‌లో అడుగుపెడితే చంపేస్తామని ఆమెకు పలువురు మెయిల్స్ కూడా చేశారు. కానీ షో నిర్వాహుకులు ఆమెను బలవంతంగా ఒప్పించి. సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పడంతో ఇండియాలో అడుగుపెట్టింది. కానీ ఆమెపై బెదిరింపులు ఎక్కువడంతో తట్టుకోలేక బిగ్బాస్షోను ప్రజెంట్ చేసే సంస్థకు సంబంధించిన ప్రధాన వ్యక్తి ఒకరు అప్పట్లో జాబ్‌కు రిజైన్ చేసేశారు. కానీ సన్నీకి ఎలాంటి ఆపద జరగలేదు. షో అనంతరం ఆమె లండన్ వెళ్లిపోయింది. ఆ షో సన్నీలియోన్ కెరీర్‌ను మార్చేసింది. షోలో ఆమెను చూసిన భారత్ ప్రజలు ఎంతగానో ఆదరించారని సన్నీ చెప్పుకొచ్చింది. తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించడం ఆమె మానేసింది. 2012 ఎరోటిక్ థ్రిల్లర్ జిస్మ్ 2లో సన్నీలియోన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ,బెంగాలీ భాషల్లో పలు చిత్రాలలో భాగమైంది. (ఇదీ చదవండి: లైంగిక వేధింపులు.. ఎలా బయటపడతానోనని భయమేసింది: నటి) ఇటీవలి ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. తాను అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యుత్తమ కంపెనీలతో పనిచేశానని, ఉదాహారణగా వాటిని హిందీ చిత్ర పరిశ్రమలోని రెండు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలైన కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్‌తో పోల్చింది. ఈ రెండూ తనను బాలీవుడ్లో ఎంతగానో ఆదరించాయని సన్నీ తెలిపింది. 'ఒక శృంగార తారగా ఎంతో కష్టపడి పనిచేశాను. నన్ను నియమించుకున్న కంపెనీలు వారు కోరుకున్నవి నా నుంచి పొందారు. కానీ నాకు ఎలాంటి ప్రయోజనం పొందలేదు. నాకు అప్పట్లోనే కోట్లాదిమంది అభిమానులు ఉండేవారు. వారి కోసం అయినా శృంగార సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో ఆర్థికంగా కూడా చెప్పుకోతగిన స్థాయిలో లేను. కానీ ఇండియాలో బిగ్‌బాస్ సీజన్లో అడుగుపెట్టిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఇక్కడ నాకు అడల్ట్ సీన్లు చేస్తారా..? అని ఎవరూ అడగలేదు. అన్నీ మంచి అవకాశాలే వచ్చాయి. దాంతో వాటికి గుడ్‌బై చెప్పేశాను. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. పలు సినిమాల ద్వారా మంచి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. కానీ బాలీవుడ్లో స్టార్ హీరోలు నాతో నటించేందుకు ముందుకు రాలేదు. తొలిసారి షారుఖ్ సరసన ఐటెం సాంగ్‌లో అవకాశం దక్కింది.' అని చెప్పుకొచ్చింది. ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేసిన సన్నీ ఫ్రాన్స్‌లో జరిగిన 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సన్నీ లియోన్ మెరిసింది . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్‌కు ఇచ్చారు. ఇక కాన్స్ రెడ్ కార్పెట్‌పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ . ఈ ఏడాది చివర్లో ఇండియాలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. -
నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్
టాలీవుడ్లో మంచు లక్ష్మీ పేరు అంటే అందరికి తెలిసే ఉంటుంది.. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ను అందుకుంది. నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్మీ పలు సహాయక కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది. ఒకవైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు పలు బుల్లితెర షోలలో కూడా మెప్పిస్తుంది. తాజాగా ఆమె టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: టీజర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) తెలుగు పరిశ్రమకు రాక ముందు పలు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు చెప్పింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్ని.. ఇక్కడికి ఎందుకొచ్చానో అని కూడా అనిపిస్తుందని ఆమె తెలిపింది. ఆ దేవుడు దయ తలచితే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లేందుకు రెడీగా ఉన్నాని తెలిపింది. ఇక్కడి తెలుగు ఆడియన్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ వారి సొంత రాష్ట్రాలకు చెందిన వారిని మాత్రం ఆదరించరని మంచు లక్ష్మీ పేర్కొంది. ఇక్కడివారిని ఒక్కశాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారని తెలిపింది. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్) ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు.. మధుశాలినితో పాటు శివాత్మిక,శివాని ఎందుకు చేయడం లేదు.. .. అని ఆమె ప్రశ్నించింది. వీరందరూ దేనిలో తక్కవ అందంతో పాటు టాలెంట్ ఉన్న వారే కదా అంటూ ఫైర్ అయింది. ఇక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్‌కు కూడా ముంబయి,పంజాబీ,కేరళ, తమిళ, కన్నడ హీరోయిన్లే కావాలి.. కానీ తెలుగు వారు మాత్రం వద్దంటారని ఫైర్ అయింది. మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ నిజమే కదా అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
ఇండియన్ సినిమాలపై చీప్ కామెంట్ చేసిన ప్రియాంక
దక్షిణాది చిత్రంతో కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ గ్లోబల్ నటిగా ప్రియాంక చోప్రా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో పాటు పలు విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..) అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో 2016లో జరిగిన ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రియాంక హాజరయింది. అక్కడ ఒక అంతర్జాతీయ మీడియాకు చెందిన యాంకర్ భారతీయ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాలంటూ కోరింది. దీంతో తముడుకోకుండా వెంటనే భారతీయ సినిమాలన్ని ‘హిప్స్ అండ్ బి**బిస్’ గురించే ఉంటాయి. ఒక రకంగా వాటిని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తే చాలు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అయితే, అది పాత వీడియో అయినప్పటికీ ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్ సిరీస్ 'సిటడెల్' విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ప్రియాంక పేరు ట్రెండింగ్ అయింది. ప్రియాంక తీరుపై సోషల్ మీడియాలో ఒకరు ఇలా రియాక్ట్ అయ్యారు 'భారత చలనచిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ వేదికపై ఇలా చీప్‌గా మాట్లాడటం చాలా బాధించిందని తెలుపుతూ అమెను ఇండియన్ సినిమాల్లో బ్యాన్ చేయాలి.' అని కోరాడు. మరోక వ్యక్తి ఇలా అన్నాడు, 'నేను అమెరికన్‌ని.. ఆమెకు అమెరికన్ల నుంచి ప్రజాదరణ లేదు.. నిక్ జోనస్ భార్య అని చెప్పడం తప్ప ప్రియాంక గురించి ఎవరూ ఇక్కడ మాట్లాడటం నేను వినలేదు.' అని తెలిపాడు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) -
టాలీవుడ్ డైరెక్టర్లపై పాయల్ రాజ్‌పూత్ సెన్సేషనల్ కామెంట్స్
2018 జులై 12.. 'ఆర్ఎక్స్ 100' థియేటర్లో విడుదలైంది. సినిమా హిట్.. అందాల విందుతో పాటు అదిరిపోయే నటనను ప్రదర్శించిన పాయల్ రాజ్‌పూత్ గురించి అప్పట్లో అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ‘నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్డమ్ సాధించింది..’ అనుకున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ఉంటుందని అందరూ భావించారు కానీ అది నిజం కాలేదు. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఆమెకు ఫ్యాన్ బేస్ పెరిగింది కానీ. తరువాత తను చేసిన సినిమాల విషయంలో ఎంపిక సరిగా లేకపోవడంతో పాయల్ వెనకపడిపోయింది. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఇలా చెప్పింది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత టాలీవుడ్లో నన్ను కొంతమంది తప్పుదోవ పట్టించారు. ఆ సినిమా విజయం తర్వాత వెంటనే నేను మాత్రమే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. దాంతో ఇక్కడున్న కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో వారు నన్ను మిస్ గైడ్ చేశారు. పలాన సినిమా మాత్రమే చయండి.. వారితో ఇలా మెలగండి అంటూ సలహాలిచ్చేవారు. చివరకు కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించి, అప్పట్లో నాకున్న ఫేమ్‌ను వాడుకున్నారని' సంచలన కామెంట్స్ చేసింది పాయల్. ప్రస్థుతం అన్ని రకాలుగా అలోచించే సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నానని పాయల్ తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్లో తనకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది. ఎటువంటి సినిమాలు చెయ్యాలో బాగా అలోచించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని తెలిపింది. సినిమా రంగంలో ఎవరైనా టాప్ లోకి వెళతాం.. అలాగే కిందకి కూడా పడిపోతాం ఇదీ సహజం. కానీ వాటిని తట్టుకొని నిలబడాలని ఈ బ్యూటీ పేర్కొంది. నెగటివిటీని వదిలేసి.. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నాని తెలిపింది. 'ఆర్ఎక్స్ 100'తో లైఫ్ ఇచ్చిన అజయ్ భూపతినే తనకు మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబోలో 'మంగళవారం' సినిమాతో మళ్లీ రాబోతున్నారు. ప్రభాస్‌పై కామెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని పాయల్ తెలిపింది. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు ఒక అవకాశం రావాలని కోరుకుంటున్నానని తను తెలిపింది. ఆయన హైట్‌కు తగినట్లు మ్యాచ్ అవుతానని ఈ బ్యూటీ చెప్పింది. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో ఈ బ్యూటీ ప్రభాస్ అంటేనే చాలా ఇష్టమని చెప్పింది. ఐకాన్ స్టార్ బన్నీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) (ఇదీ చదవండి: Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని..) -
సింగర్ చిన్మయిపై ట్రోల్స్ మొదటిసారి స్పందించిన రాహుల్
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు. (ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి) 'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్లో తెలిపారు. రాహుల్ పోస్ట్‌పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) -
లస్ట్ గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ
2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'లస్ట్ స్టోరీస్' మంచి విజయం సాధించింది . దానికి కొనసాగింపుగా తాజాగా వచ్చిందే ‘లస్ట్ స్టోరీస్ 2’. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ వంటి అగ్ర కథానాయకలు నటించడం విశేషం. గురువారం (జూన్ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరిస్ ప్రధానంగా యూత్నే టార్గెట్ చేసిందనే చెప్పవచ్చు. ఇందులో వేద (మృణాల్ ఠాకూర్) అర్జున్ (అంగద్ బేడీ) ఇరువురు మెప్పిస్తారు. వేద బామ్మగా నీనా గుప్త క్యారెక్టర్ కూడా మెప్పిస్తుంది. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని సలహాను వేద బామ్మ ఇవ్వడంతో సీరిస్ ఆసక్తి పెంచుతుంది. (ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) శృంగారం, కామం గురించి పరిణతి చెందిన సంభాషణ చేయడంలో తప్పులేదంటూ తాజాగా ఈ సీరిస్ గురించి మృణాల్ ఠాకూర్ ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌గా సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు' అని మృనాల్ చెప్పింది. (ఇదీ చదవండి: Ram Charan-Upasana: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ గిఫ్ట్) ‘సీతారామం’తో అందరికీ ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండతో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు నానితో కూడా ఓ సినిమాతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వైజాగ్‌లో షూటింగ్ కోసం వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడి నుండి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా ఆయన కుమారుడు చరణ్ తన తండ్రి చావుకు సోషల్ మీడియానే కారణమని ఫైర్ అయ్యాడు. (ఇదీ చదవండి: కోడలితో కలిసి కొడుకు టార్చర్.. పోలీసులను ఆశ్రయించిన నటి) 'మా నాన్న ఇలా అవడానికి ప్రధాన కారణం సోషల్‌మీడియానే.. పలు యూట్యూబ్ ఛానల్ వారు లబ్ధిపొందేందుకు మా నాన్నను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయనను ఎంత నెగిటీవ్‌గా చూపించాలో అంతగా చూపించారు. ఇకనైనా అలాంటి వీడియోలు ఆపేయండి. ఆయనకు సంబంధించిన విషయాలతో పాటు మా కుటుంబ సభ్యుల విషయాలు కూడా యూట్యూబ్‌లలో ప్రసారం చేయకండి. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని అల్లరి పాలు చేసింది చాలు. మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? మీ కష్టాలు ఏంటీ? మేము ఎలా ఏడుస్తున్నాం? అంటూ పదే పదే చూపిస్తూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి. మరోసారి ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను' అని రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టి పెరిగిన ఆమె పని కోసం ముంబైకి వలస వచ్చింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. అంతే కాకుండా పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?) తను ముంబైలో పీజీ చదువుతున్నప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడిందట.. తనకు సినిమాలపై ఉన్న ఇష్టాన్ని ఆ మహిళ గుర్తించి ఆడిషన్స్‌కు వెళ్లాలనుకుంటున్నావా అని అడగడంతో తన ఆనందానకి రెక్కలు వచ్చినట్లు అయిందని తెలిపింది. కానీ ఆడిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు షార్ట్‌లు వేసుకుని వెళ్లాలని, అలా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతావని ఆ మహిళ సలహా ఇచ్చిందట. పై భాగంలో టాప్ కూడా అలాగే షార్ట్‌గా ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతావని చెప్పడంతో కొంచెం ఇబ్బంది పడినట్లు అర్చన తెలిపింది. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?) ఆమె చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించినా అదే నిజం అని తర్వాత తెలుసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో కొంతమంది మహిళలు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకున్నా, అలా రోజుకు మూడువేలతో తన ప్రయాణం మొదలైంది అని అర్చన గౌతమ్ చెప్పుకొచ్చింది. -
వాళ్లకు కావాల్సిన వారికే అవకాశాలు: తాప్సీ
సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఎప్పటికపుడు వైరల్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్లో ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఇక్కడ తను అనుకున్నంతగా సక్సస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చేసి తక్కువ సమయంలోనే క్లిక్ అయింది. అయితే తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో అవి తెగ వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌పై పలు ఆరోపణలు చేసింది. అవి నిజమే అంటూ తాప్సీ కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి; Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) బాలీవుడ్లో ఒక సినిమా కోసం ఎవరిని తీసుకోవాలనేది కొంతమంది ప్రముఖ నటీనటులు డిసైడ్ చేస్తారని తాప్సీ చెప్పుకొచ్చింది. వారికి నచ్చకపోతే టాలెంట్ ఉన్నా పక్కన పెట్టేస్తారు. ఒక్కోసారి క్యారెక్టర్‌కు సూట్ అయ్యేవాళ్లను కూడా తీసుకోరు. కానీ వారికి కావాల్సిన వ్యక్తులను మాత్రం తీసుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీ వాళ్లను కూడా రిఫర్ చేస్తారు. హిందీలో ఫేవరిటిజం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అవకాశాల కోసం తిరగడం అనవసరం అని తాప్సీ తెలిపింది. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) -
ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు
రామాయణం ఆధారంగా ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' లో ప్రభాస్ , కృతి సనన్ జంటగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల ముందు ఎంత క్రేజ్ వచ్చిందో, ఉదయం ఆట ముగియగానే ఆ క్రేజ్ పోయే విధంగా.. సినిమా బాగోలేదని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో నెటిజన్స్ దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. అతను రావణాసురిడి పాత్ర మలచిన తీరుతో పాటు రామాయణం చూపెట్టే విధానం ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. (ఇదీ చదవండి: ప్రభాస్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?) ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. కొందరు అయితే 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. 'అయోధ్య'లో సినిమా ప్రమోషన్ చేస్తున్న సమయంలో 'ఆదిపురుష్' వీడియో చూసి నెటిజన్స్ విమర్శించారు. విఎఫ్ఎక్స్తో పాటు రావణుడి పాత్ర కూడా బాగోలేదని కామెంట్ చేశారు. దీంతో ఈవెంట్ అయ్యాక ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్‌తో.. 'ఓం! కమ్ టు మై రూమ్' అన్నాడు. తాజాగా నెటిజన్లు అదే మాటను వైరల్ చేస్తున్నారు. సినిమా చూసి బయటకి వచ్చిన వారు తాజాగా దర్శకుడుని తప్పుబడుతూ..'ఓం! కమ్ టు మై రూమ్' అని అంటున్నారు. (ఇదీ చదవండి: ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా 'సితారా పాప'కు గుర్తింపు) -
'నువ్వేమీ పెద్ద హీరోయిన్ కాదు'.. అనుపమ రిప్లై అదిరిందిగా
తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్. సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. 'అఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. కానీ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టట్‌లో ఉంటుంది. (ఇదీ చదవండి : కారు ప్రమాదం... షాక్‌లోకి వెళ్లిపోయానన్న నటి) తాజాగా ఒక నెటిజన్ 'నువ్వు పెద్ద హీరోయిన్‌వి ఏమీ కాదు.. అందుకే భారీ సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు.. అసలు మీరు హీరోయిన్ మెటీరియలే కాదు' అని కామెంట్ చేశాడు. దీంతో అనుపమ ఎంతో వినయంగా సమాధానం ఇచ్చింది. 'మీరు చెప్తుంది కరెక్టే అన్నా.. నేను హీరోయిన్ టైప్ కాదు, నేను యాక్టర్ టైప్' అని చాచి చెంపపై కొట్టినట్లు బదులిస్తూనే స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనుపమకు మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీతో పాటు టాలెంట్ ఉన్న నటి అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉంటే అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న డిజే టిల్లూ స్క్వేర్తో పాటు.. రవితేజ రాబోయే భారీ యాక్షన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: అలాంటి వ్యక్తినే మనువాడతా: టాప్ హీరోయిన్) -
నాగార్జున సినిమాతో నా కెరియరే పోయింది: డైరెక్టర్
టాలీవుడ్ దర్శకుడు వీరభద్రం చౌదరి, ఆహనా పెళ్ళంట, పూలరంగడు సినిమాలతో పరిచయం అయ్యాడు. అవి రెండూ ప్రేక్షకులను మెప్పించి విజయాన్ని అందుకున్నాయి. అలా సక్సస్‌ఫుల్‌గా వీరభద్రం జర్నీ కొనసాగుతున్న సమయంలో అక్కినేని నాగార్జున 'భాయ్' సినిమాకు దర్శకత్వం వహించాడు. స్వయంగా నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పైనే నిర్మించాడు. తర్వాత హీరో ఆదితో 'చుట్టాలబ్బాయి' సినిమాకు ప్లాన్ చేసినా.. అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. (ఇదీ చదవండి: ప్రియుడితో నిర్మాత కూతురి పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరభద్రం తన కెరియర్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. 'నాగార్జునతో తీసిన 'భాయ్' సినిమా మొదట కామెడీ నేపథ్యంలో తీయాలని కథ రాసుకున్నాను. కానీ పెద్ద హీరో అనేసరికి స్క్రిప్ట్‌లో మార్పులు చెయాల్సి వచ్చింది. దీంతో ఎక్కడో మిస్ ఫైర్ అయింది. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో నాకు కోలుకోలేని దెబ్బ పడింది. విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని ఒక్కసారిగా కిందకు తోసేస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఒక రకంగా నేను ఇలాంటి స్థితికి వచ్చానంటే నాగార్జున సినిమానే కారణమని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను' అని వీరభద్రం చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో నిర్మాతగా ఉన్న నాగార్జునకు భారీగానే నష్టాలు వచ్చాయి. ఒక సినిమా ప్లాప్ అయినా.. హిట్ అయినా పూర్తి బాధ్యత దర్శకుడిదే అని వీరభద్రం తెలిపాడు. (ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!) -
ఆదిపురుష్.. ప్రభాస్ అసలు రాముడిలానే కనిపించడం లేదే!
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధమైంది. కానీ, సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రారంభమైన విమర్శలు.. ఇప్పటి వరకు కూడా చల్లారలేదు. ఇంతలో తిరుమలలో హీరోయిన్ కృతీ సనన్‌ను దర్శకుడు ఓం రౌత్ హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఈ వివాదంపై నటి కస్తూరి స్పందిస్తూ ‘ఆదిపురుష్’ పోస్టర్‌పై విమర్శల వర్షం కురిపించింది. ప్రభాస్ లుక్ చూస్తుంటే కర్ణుడు గుర్తుకువస్తున్నారని పేర్కొంది. (ఇదీ చదవండి: నయనతార గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్, పిల్లల్ని చూశారా?) శ్రీరాముడితో పాటు ఆయన సోదరుడు లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని దర్శకుడిని తప్పుబట్టింది. మరీ ముఖ్యంగా ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ.. 'టాలీవుడ్లో ఎంతోమంది నటులు శ్రీరాముడి పాత్రల్లో తెరపై అద్భుతంగా కనిపించారు. కానీ, ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కాకుండా కర్ణుడిగా కనిపిస్తున్నారు' అని ఆమె కామెంట్ చేసింది. కస్తూరి వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కస్తూరి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇదీ చదవండి: డబ్బులిచ్చి మరీ నన్ను తిట్టిస్తున్నారు.. విజయ్ దేవరకొండ మనిషే చెప్పాడు) -
బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. మళ్లీ బ్యాడ్ కామెంట్స్
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) తన ఫ్యాన్స్‌తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న ఇల్లీ బేబీ.. రీసెంట్గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన బేబీమూన్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు బికినీలో బేబీ బంప్ చూపిస్తూ.. బీచ్‌లో సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తున్న పిక్స్ పంచుకుంది. ఈ బేబీమూన్ స్పాట్ ఎక్కడనేది ఇలియానా ప్రస్తావించలేదు. ‘ఇసుకలో పాదాలు, సంతోషకరమైన హృదయం’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. (ఇదీ చదవండి: నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్) అలాగే సముద్రం, అలల తాకిడిని చూపిస్తూ చిన్న గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేసింది. చివరగా సెల్ఫీ పిక్ పోస్ట్ చేయగా.. ఇందులో ఎల్లో బికినీ, బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్ ధరించిన ఇలియానా తన బేబీ బంప్‌ను చూపించింది. అయితే ఇలా ఫొటోలు రిలీజ్ చేసిన వెంటనే మరోసారి ఆమెపై విమర్శల వర్షం మొదలైంది. తండ్రి ఎవరో చెప్పకుండా ఈ ప్రెగ్నెన్సీ ఫొటోలు పెడితే బ్యాడ్ ఫీలింగ్ వస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా మాత్రం ఈ కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదు. తన జీవితంలో స్పెషల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఇలియానా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. -
రైలు ప్రమాదంపై సీఎం మమతా సంచలన వ్యాఖ్యలు
-
టీడీపీపై ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబుపై తీరుపై మండిపడ్డ మంత్రి ధర్మాన
రైతులకు పూర్తి భరోసా అందించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల స్వాధీనంలో ఉన్న ఇనాం, అనాధీనం భూములుపై రైతులకు పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు. పేదలకు, రైతులకు మంచి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చట్టాలు చేస్తుంటే టీడీపీ వాటిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరాయి, ఇంకా చేరేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2,07,000 కోట్లు సంక్షేమ పథకాలకు అందిస్తుంటే చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వాపోయారు. చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి పేరుతో దోచుకుంటే జగన్ అవినీతి రహిత అభివృద్ధి అందిస్తున్నారు. -
ఆటగాళ్లపై నా నియంత్రణ లేదు: గోపీచంద్
ముంబై: భారత షట్లర్ల టోర్నీ ప్రణాళికలు, ప్రాక్టీస్ వంటి అంశాలు తన అదుపులో ఉండటం లేదని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దురదృష్టవశాత్తు మన దేశంలో ఓ క్రమ పద్ధతి అంటూ ఉండదు. ఇక్కడ చీఫ్ కోచ్ పాత్ర పూర్తిగా అలంకారప్రాయమైంది. కోచ్‌గా నాకు ఏ హక్కులు లేవు. అసలు జాతీయ కోచ్ అనేది అర్థం లేని పదవిగా మారింది. సెలక్షన్స్‌లో కానీ, ప్రణాళికల్లో కానీ భాగస్వామ్యమే ఉండదు. సహాయ కోచ్‌ల్ని ఎంపిక చేసుకోలేం, వారి పారితోషికాల్ని నిర్ణయించలేం. ఇవేవీ లేని జాతీయ కోచ్, అతని బృందం ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఎలా తయారు చేస్తుంది చెప్పంది? బ్యాడ్మింటన్ క్రీడ వ్యక్తిగత ఆటే... కానీ శిక్షణ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగానే తీసుకోవాలని లేదు. చైనా, జపాన్, కొరియా, ఇండోనేసియా, మలేసియా, డెన్మార్క్ దేశాల్లో ఈ శిక్షణ ప్రక్రియ జట్టుగా... కలసికట్టుగా సాగుతుంది. కానీ ఇక్కడలా లేదు. ఇక టోర్నీల విషయానికొస్తే ఒక ప్లేయర్ ఏడాదికి ఎన్ని టోర్నీల్లో ఆడాలనే నియంత్రణ ఉండదు. ప్రతిభాన్వేషణకు సరైన ప్రణాళికలే లేవు. ప్రతిభ ఉంటే ప్రపంచశ్రేణి ఆటగాడిగా తీర్చిదిద్దే కార్యక్రమాలే ఉండవు. ఆటగాళ్లంతా సొంతంగా ఎదగాల్సిందే. ఇది సరికాదు. ఒక స్పష్టమైన విధివిధానమంటూ ఉండాలి. దీనికి ఓ జవాబుదారితనం కావాలి. ఎవరు దేనికి బాధ్యులో అందరికీ తెలిసుండాలి’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని చెప్పారు. -
రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం ఈ నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్ స్పదించాలనీ, లేని పక్షంలో రాహుల్‌ను సంప్రదించకుండానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటా మంది. ప్రత్యేక వార్తాహరుడి ద్వారా రాహుల్‌కు ఈ నోటీసులను ఈసీ పంపింది.