రైతులకు పూర్తి భరోసా అందించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల స్వాధీనంలో ఉన్న ఇనాం, అనాధీనం భూములుపై రైతులకు పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు. పేదలకు, రైతులకు మంచి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చట్టాలు చేస్తుంటే టీడీపీ వాటిని అడ్డుకుంటుందని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరాయి, ఇంకా చేరేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2,07,000 కోట్లు సంక్షేమ పథకాలకు అందిస్తుంటే చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వాపోయారు. చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి పేరుతో దోచుకుంటే జగన్ అవినీతి రహిత అభివృద్ధి అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment