dharman prasad rao
-
చంద్రబాబుపై తీరుపై మండిపడ్డ మంత్రి ధర్మాన
రైతులకు పూర్తి భరోసా అందించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల స్వాధీనంలో ఉన్న ఇనాం, అనాధీనం భూములుపై రైతులకు పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు. పేదలకు, రైతులకు మంచి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చట్టాలు చేస్తుంటే టీడీపీ వాటిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరాయి, ఇంకా చేరేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2,07,000 కోట్లు సంక్షేమ పథకాలకు అందిస్తుంటే చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వాపోయారు. చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి పేరుతో దోచుకుంటే జగన్ అవినీతి రహిత అభివృద్ధి అందిస్తున్నారు. -
మాజీ మంత్రి ధర్మానకు ఊరట
శ్రీకాకుళం: కన్నెధార కొండ ప్రాజెక్టు గ్రానైట్ లీజు వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఊరట లభించింది. నియమాల ప్రకారమే మైనింగ్ లీజు దరఖాస్తు చేశారు. అయితే దీనిపై ఈ ఏడాది మే 19న లోకాయుక్త తీర్పులో 10 హెక్టార్ల భూమిని ధర్మానకు అప్పగించాలని కలెక్టరుకు ఆదేశించింది. కన్నెధార కొండ లీజు విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. లోకాయుక్త కూడా గురువారం తనకు అనుకులంగా తీర్పు ఇచ్చినప్పటికీ గిరిజనల హక్కులు, మనోభావాలు గౌరవించి కాంట్రాక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. లీజు టీడీపీ ప్రభుత్వం గతంలో రద్దు చేసింది. అయితే లోకాయుక్త గురువారం ధర్మానకు అనుకూలంగా తీర్పు నిచ్చింది.