టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వైజాగ్‌లో షూటింగ్ కోసం వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడి నుండి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా ఆయన కుమారుడు చరణ్ తన తండ్రి చావుకు సోషల్ మీడియానే కారణమని ఫైర్ అయ్యాడు.
(ఇదీ చదవండి: కోడలితో కలిసి కొడుకు టార్చర్.. పోలీసులను ఆశ్రయించిన నటి)
'మా నాన్న ఇలా అవడానికి ప్రధాన కారణం సోషల్‌మీడియానే.. పలు యూట్యూబ్ ఛానల్ వారు లబ్ధిపొందేందుకు మా నాన్నను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయనను ఎంత నెగిటీవ్‌గా చూపించాలో అంతగా చూపించారు. ఇకనైనా అలాంటి వీడియోలు ఆపేయండి. ఆయనకు సంబంధించిన విషయాలతో పాటు మా కుటుంబ సభ్యుల విషయాలు కూడా యూట్యూబ్‌లలో ప్రసారం చేయకండి. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని అల్లరి పాలు చేసింది చాలు.
మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? మీ కష్టాలు ఏంటీ? మేము ఎలా ఏడుస్తున్నాం? అంటూ పదే పదే చూపిస్తూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి. మరోసారి ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను' అని రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)
Comments
Please login to add a commentAdd a comment