సన్‌ ఆఫ్ సర్దార్‌ డైరెక్టర్‌ ఇంట్లో తీవ్ర విషాదం | Son of Sardar director Ashwini Dhir's son Jalaj Dhir dies in car crash | Sakshi
Sakshi News home page

Son of Sardar director: సన్‌ ఆఫ్ సర్దార్‌ డైరెక్టర్‌ కుమారుడు దుర్మరణం

Published Wed, Nov 27 2024 2:05 PM | Last Updated on Wed, Nov 27 2024 2:55 PM

Son of Sardar director Ashwini Dhir's son Jalaj Dhir dies in car crash

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్‌లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement