Ashwini
-
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
హైదరాబాద్ ఒక ఈవెంట్లో మెరిసిన, బిగ్ బాస్ అశ్విని శ్రీ ,సౌమ్య జాను (ఫొటోలు)
-
నార్సింగి : సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు సందడి (ఫొటోలు)
-
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
బిగ్‌బాస్ ఫేమ్ అశ్విని దుబాయ్ అందాల ట్రీట్ (ఫొటోలు)
-
బంగారు తల్లికి వీడ్కోలు
కారేపల్లి: ఆకేరు వాగు ఉధృతికి బలైన యువ శాస్త్ర వేత్త డాక్టర్ అశ్విని మృతదేహానికి మహబూబాబాద్ లో పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామమైన కారేపల్లి మండలం గంగారంతండాకు తీసుకొచ్చారు. ఇక సోమవారం మళ్లీ తనిఖీలు చేపట్టిన రెసూ్య్కటీం సభ్యులు ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని డోర్నకల్ మండలం చిలక్కొయలపాడు వద్ద గుర్తించారు. ఆపై పోస్టుమార్టం చేయించి స్వగ్రామానికి తీసుకురాగా అప్పటికే బంధువులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. గంటల తరబడి కన్నీళ్లతో ఎదురుచూసుకున్న వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా అందరూ కంటతడి పెట్టారు. కన్నీటి సంద్రమైన గంగారంతండాగంగారం తండాకు చెందిన మోతీలాల్ – నేజీకి అశ్విని, అశోక్‌కుమార్ సంతానం. పదో తరగతి కారేపల్లిలో చదివి 550 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన అశ్విని విజయవాడలో ఇంటర్, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసింది. బీఎస్సీలో మూడు రజత పతకాలు, యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఆపై ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది. ఆతర్వాత జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందింది. ఇక జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి(అగ్రికల్చర్ శాస్త్రవేత్తల రిక్రూట్మెంట్ బోర్డు) నిర్వహించిన పరీక్షలో వందల మంది పోటీ పడగా అశ్విని జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం సాధించి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అశ్విని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తోంది. గతనెల 29న సోదరుడు అశోక్ నిశ్చితార్థానికి హాజరైన ఆమె ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో విమానం ఎక్కాల్సి ఉంది. దీంతో తండ్రి మోతీలాల్ కారులో తీసుకెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరులో గల్లంతైన విషయం విదితమే. ఇందులో అశ్విని మృతదేహం ఆదివారం మధ్యాహ్నం, మోతీలాల్ మృతదేహం సోమవారం లభించగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే చేరుకున్న స్థానికులు ఉజ్వల భవిష్యత్ ఉన్న శాస్త్రవేత్త అశ్వినిని ఆకేరు వాగు మింగిందా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతదేహాలను ట్రాక్టర్‌పై ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈక్రమంలో అశ్విని తల్లి నేజీ, సోదరుడు అశోక్‌కుమార్ రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు.వైరా ఎమ్మెల్యేకు నిరసన సెగవాగులో గల్లంతై మృతదేహాలు లభించక తాము నరకయాతన పడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మోతీలాల్ కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌ను వారు నిలదీశారు. అయితే, ఆకేరులో కారు గల్లంతైనప్పటికీ అక్కడి కలెక్టర్ సహా అధికారులతో తాను మాట్లాడానని, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రాకపోవడంతో వారిని కాపాడలేకపోయామని సర్దిచెప్పారు. ఆ కుటుంబానికి తక్షణ సాయంగా కింద రూ.50వేలు అందజేశారు. -
వరదలో చిక్కుకున్నాం.. రక్షించండి
మరిపెడ రూరల్, కారేపల్లి: భారీ వరద ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువ సైంటిస్టును బలి తీసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించిన ఆమె వ్యవసాయ విద్యలోసత్తా చాటింది. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి పీహెచ్డీ సాధించి జాతీయ స్థాయిలో పరిశోధనా శాస్త్రవేత్తగా మొదటి స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది.అలాంటి అద్భుతమైన ఆమె భవిష్యత్‌ను వరద గల్లంతు చేసింది. ఆమెతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకు పోగా, ఈ ప్రమాదంలో కుమార్తె మృతదేహం లభ్యమైంది.. తండ్రి ఆచూకీ కోసం రెస్క్యూటీం గాలిస్తోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామ శివారు ఆకేరు నది వాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా.. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పరిధిలోని గంగారం తండాకు చెందిన నూనావత్ మోతీలాల్ (55), మేజ దంపతులకు కుమారుడు అశోక్ కుమార్, కుమార్తె అశ్విని (30) ఉన్నారు. కుమారుడు విద్యుత్‌శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. కుమార్తె అశ్విని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో 4వ స్థానం పొంది మంచి గుర్తింపు పొందింది. తన సోదరుడి నిశ్చితార్థం కావడంతో స్వగ్రామం గంగారంతండాకు వచ్చిన అశ్విని శుభకార్యం ముగిశాక శంషాబాద్ నుంచి రాయపూర్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ బుక్ చేయించుకుంది.ఈ క్రమంలో భారీ వర్షాలు పడుతుండడంతో తండ్రి మోతీలాల్ తానే స్వయంగా కారులో హైదరాబాద్‌లో దించేందుకు తెల్లవారు జామున బయలు దేరారు. వయా మరిపెడ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం గమనించని వారు నేరుగా వచ్చి ప్రవాహంలో చిక్కుకున్నారు. వెంటనే కారులోనుంచి బయటకు దిగిన తండ్రి మోతీలాల్ తన అన్నకు కాల్ చేసి తాము వరదలో చిక్కుకున్నామని, రక్షించాలని పరిస్థితి వివరించారు. సోదరుడు మరిపెడలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పి తిరిగి తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే వాగు పరీవాహక ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని జల్లెడ పట్టాయి. సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వంతెన సమీపంలో కారు చిక్కుకొని కనిపించింది. బాల్నిధర్మారం సమీపంలోని ఆయిల్‌పామ్‌తోటలో యువ సైంటిస్టు ఆశ్విని మృతదేహం లభ్యమైంది. మోతీలాల్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆదివారం సాయంత్రం దాటాక మోతీలాల్ మృతదేహం కారులో దొరికినట్లు ప్రచారం జరిగినా పోలీసులు నిర్ధారించడం లేదు. అశ్విని మృతదేహాన్ని పోలీసులు.. స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. కాగా, తెల్లవారుజామున చీకటిగా ఉండడం, రోడ్డు మార్గం సరిగా తెలియకపోవడం.. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులోనుంచి దిగినా ప్రయోజనం లేకుండాపోయిందని భావిస్తున్నారు. -
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ.. ఇంత హాట్‌గా ఉందేంటి? (ఫొటోలు)
-
టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు: కుప్పం ఎంపీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సోమవారం కుప్పం ఎంపీపీ అశ్విని, ఎంపీటీసీలు కలిశారు. తన తండ్రి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలం కన్వీనర్ మురుగేశ్, సోదరుడు శ్రీను రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీపీ అశ్విని మీడియాతో మాట్లాడారు. ‘‘ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. జనవరి నెలలో మల్లనూరు పంచాయితీ ట్రాక్టర్ పోయిందని మేము పిర్యాదు చేశాం, ఇప్పుడు మాపైనే కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే కుప్పం ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై తప్పుడు కేసులు బనాయించి సీఐ ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది.. అప్పుడు మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి’’ అని ఆమె అన్నారు. -
ఎంపీపీ పదవి కోసమే అక్రమ కేసులు
కుప్పంరూరల్: ‘మా తండ్రి, అన్నయ్యను అక్రమంగా అరెస్టు చేశారు’ అని కుప్పం ఎంపీపీ కుమారి అశ్విని ఆరోపించారు. కేవలం పదవీ కాంక్షతో అధికార పార్టీ నాయకులు, పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాము వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్నామని, మరో వైపు తనను ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని అధికార పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని వాపోయారు. 8 నెలల క్రితమే ట్రాక్టర్ దొంగతనం చేసినట్లు తన తండ్రి, సోదరుడిపై అభియోగాలు మోపారని, మరి పోలీసులు ఇంతకాలం ఏమి చేశారని ప్రశ్నించారు. ట్రాక్టర్లు, స్కూటర్లు దొంగతనం చేయాల్సిన దుస్థితిని ఆ దేవుడు తమకు కల్పించలేదన్నారు. పైగా అట్రాసిటీ కేసును కూడా 8 నెలల క్రితమే నమోదు చేస్తే అప్పుడే పోలీసులు విచారణ చేపట్టి తప్పుడు కేసుగా కొట్టేశారని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి, మండల కన్వీనర్ హెచ్ఎం మురుగేష్, తన అన్న, వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వనిత భర్త శీనుపై అట్రాసిటీ కేసులు పెట్టడం వెనుక టీడీపీ నేతల ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా భయపడమని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని, అక్కడే తేల్చుకుంటామన్నారు. ఓ మహిళ, పెళ్లి కాని యువతి ఎంపీపీగా ప్రజలకు సేవ చేస్తుంటే అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక, తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన పార్టీ మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా ? అని ప్రశ్నించారు. కుప్పం నుంచే తిరుగుబాటు మొదలవుతుందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘‘దేవుడు ఉన్నాడు.. ధర్మం గెలుస్తుంది.. ప్రాణం ఉన్నంత వరకు మా నాయకుడు జగనన్న చూపిన బాటలోనే నడుస్తా.. ప్రజాసేవలోనే ఉంటా’’ అని అశ్విని గద్గద స్వరంతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో పంచుకున్నారు. -
సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎక్స్పో 2024 ను ప్రారంభించిన అశ్విని శ్రీ (ఫొటోలు)
-
Ashwini Sree : ఎల్లమ్మ తల్లికి బోనమెత్తిన బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
రైల్ షేర్ల పరుగు– మార్కెట్ ఫ్లాట్
ముంబై: గత వారం సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 76,457 వద్ద నిలవగా.. 6 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 23,265 వద్ద స్థిరపడింది. అయితే ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగసి 76,861కు చేరగా.. నిఫ్టీ 130 పాయింట్లు బలపడి 23,389ను అధిగమించింది.ఒక దశలో సెన్సెక్స్ 76,297, నిఫ్టీ 23,207 పాయింట్ల దిగువన కనిష్టాలను తాకాయి. ఎన్ఎస్ఈలో మీడియా, ఆయిల్, రియల్టీ 2–1 శాతం మధ్య వృద్ధి చూపగా.. హెల్త్‌కేర్ 0.5 శాతం తగ్గింది. బ్లూచిప్స్‌లో ఓఎన్జీసీ 5.7 శాతం జంప్‌చేయగా.. టాటా మోటార్స్, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, మారుతీ, అల్ట్రాటెక్ 2–1 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క కొటక్ బ్యాంక్, దివీస్, ఐటీసీ, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 1.3–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. చిన్న షేర్లు అప్ అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రిగా కొనసాగనుండటంతో రైల్వే రంగ కౌంటర్లు స్పీడందుకున్నాయి. ఎన్ఎస్ఈలో రైల్‌టెల్ 9%, ఇర్కాన్ 8%, టెక్స్మాకో 7 శాతం, జూపిటర్ వేగన్స్ 6%, ఐఆర్సీటీసీ, ఆర్వీఎన్ఎల్ 4 శాతం, ఐఆర్ఎఫ్సీ 2 శాతం చొప్పున ఎగశాయి. అయితే కెర్నెక్స్ మైక్రో 4.2 శాతం పతనమైంది. కాగా. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం బలపడ్డాయి. కొత్త కనిష్టానికి రూపాయి @ 83.59దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో కొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 9 పైసలు నీరసించి 83.59 వద్ద ముగిసింది. 83.49 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.59కు జారింది. అక్కడే స్థిరపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటానికితోడు.. చమురు ధరలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్ ప్రభావం చూపింది. -
టిల్లులో రాధికలా...
‘బిగ్ బాస్’ ఫేమ్ అశ్విని శ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మిస్ జానకి’ప్రారంభోత్స వం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. సతీష్‌కుమార్ దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20నప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అశ్వినీ మాట్లాడుతూ– ‘‘మిస్ జానకి’ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘డీజే టిల్లు’ సినిమాలోని రాధిక పాత్రలా, ఈ సినిమాలో నేను చేసే జానకి పాత్ర కూడా గుర్తుండిపోతుందనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
ఉబెర్ కప్ టోర్నీకి సింధు దూరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ మహిళల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఈసారి భారత ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు చైనాలోని చెంగ్డూలో జరగనుంది. సింగిల్స్ విభాగం నుంచి స్టార్ ప్లేయర్ పీవీ సింధు తప్పుకోగా... డబుల్స్ విభాగం నుంచి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు కూడా వైదొలిగాయి. పారిస్ ఒలింపిక్స్కల్లా తన ఆటలో మరింత పదును పెరిగేందుకు, పూర్తి ఫిట్‌గా ఉండేందుకు సింధు ఉబెర్ కప్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు దక్కించుకోవాలనే లక్ష్యంతో గాయత్రి–ట్రెసా, అశ్విని–తనీషా జోడీలు ఇతర క్వాలిఫయింగ్ టోర్నీలపై దృష్టి పెట్టాయి. భారత మహిళల జట్టు ఉబెర్‌కప్‌లో మూడుసార్లు (1957, 2014, 2016) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. భారత మహిళల జట్టు: అన్మోల్, తన్వీ శర్మ, అష్మిత, ఇషారాణి బారువా (సింగిల్స్); శ్రుతి మిశ్రా, ప్రియా కొంజెంగ్‌బమ్, సిమ్రన్, రితిక (డబుల్స్). భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రియాన్షు, కిరణ్ జార్జి (సింగిల్స్); సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అర్జున్, ధ్రువ్ కపిల, సాయిప్రతీక్ (డబుల్స్). ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సాత్విక్ జోడీ భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
ML Ashwini: ఆరు భాషలు నిలబెట్టాయి
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య టీచరైన ఎం.ఎల్.అశ్విని తనకు వచ్చిన ఆరు భాషల వల్ల జన సామాన్యంలో చొచ్చుకుపోతూ బిజెపి అధినాయకత్వాన్ని మెప్పించింది. కేరళలో మహామహులు పోటీపడిన కాసర్గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెను నిలబెట్టింది. అశ్విని పరిచయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన కేరళ అభ్యర్థుల్లో కాసరగోడ్ అభ్యర్థి పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అభ్యర్థి పూర్వాశ్రమంలో ఒక మామూలు స్కూల్ టీచర్. ఆ తర్వాత ఆమె ఉంటున్న ఊరు మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో కేవలం మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే ఆమెకే పార్టీ అధిష్టానం సీటు ఇచ్చింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్. ఆమె పేరు ఎం.ఎల్.అశ్విని. భాషతో గెలిచింది కాసరగోడ మంగుళూరుకు దగ్గరగా ఉంటుంది. కన్నడిగులు కూడా ఇక్కడ ఉంటారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఎం.ఎల్.అశ్విని కాసరగోడకు కోడలుగా వచ్చింది. ‘బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ. అన్నిభాషల వారూ ఉంటారు. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. చిన్నప్పుడే ఇంగ్లిష్ మీద పట్టు వచ్చింది. కన్నడ నా మాతృభాష. నా చుట్టుపక్కల తుళు కుటుంబాలు ఉండేవి. వారి నుంచి తుళు నేర్చుకున్నాను. తమిళం కూడా బెంగళూరులోనే నేర్చుకున్నాను. కాసరగోడ వచ్చాక మలయాళం చాలా సులువుగా నేర్చుకున్నాను. హిందీ బాగా తెలుసు. ఇలా ఆరు భాషల్లో నేను అనర్గళంగా మాట్లాడగలను’ అంటుందామె. ఇంట్లో కూడా ఆమె తన భాషలను సాధన చేస్తానని చెప్పింది. ‘నేను నా భర్తతో తుళులో మాట్లాడతాను. నా భర్త, కొడుకు మలయాళంలో మాట్లాడుకుంటారు. మా అమ్మాయి నేను కన్నడంలో మాట్లాడుకుంటాం. ఇలా అన్ని భాషలు మా ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి’ అంటుందామె. ఇన్ని భాషలు రావడం ఆమెకు మేలు చేసింది. ఢిల్లీ వెళ్లాక జాతీయ పార్టీలో ఢిల్లీలో కేంద్ర స్థానంలో ఉంటాయి. స్కూలు టీచర్ ఉద్యోగం మానేసి బి.జె.పిలో చేరాక ఆమెకు మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పార్టీ స్థానం ఇచ్చింది. అంతే కాదు ఢిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాలలో మహిళా మోర్చా సభ్యులతో కార్యకలాపాలు బలపరచడానికి ఆమెకు బాధ్యత అప్పగించింది. ‘ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకులు హిందీలోకాని, ఇంగ్లిష్‌లో కాని మాట్లాడటం సౌకర్యంగా భావిస్తారు. కేరళ నుంచి వచ్చిన నాయకులు మలయాళం లేదా తమిళం వంటి భాషలు అనర్గళంగా మాట్లాడతారుకాని ఇంగ్లిష్, హిందీ పూర్తిగా రావు. నాకు రావడం లాభించింది’ అంటుంది అశ్విని. మహిళా మోర్చా తరఫున జమ్ము కశ్మీర్‌తో మొదలు ఉత్తరప్రదేశ్, అస్సాం వరకు ఆమె పని చేసినప్పుడు దిగువ శ్రేణి కార్యకర్తలతో వాళ్లకు తెలిసిన భాషల్లో మాట్లాడుతూ సులువుగా కలిసిపోవడం పార్టీ గమనించింది. కాసరగోడ్‌లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ భాషీయులతో ఆమె భాషలతో చొచ్చుకుపోవడం పార్టీ దృష్టికి వచ్చింది. అందుకే జిల్లా అధ్యక్షుడు రావిష్ తంత్రి, జాతీయ ప్రతినిధీ సీనియర్ నేత అయిన పి.కె.కృష్ణదాస్‌ను కాదని పార్టీ అశ్వినికి సీటు ఇచ్చింది. భాష గొప్ప సాధనం: ‘విజయానికి భాష గొప్ప సాధనం’ అంటుంది అశ్విని. ‘రాజకీయాలలో ప్రజలకు తెలిసిన భాషలో మంచి ఉపన్యాసం ఇవ్వగలిగిన వారికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. నేను ఏ భాషలో అయినా మంచి ఉపన్యాసం ఇవ్వగలను. అందుకే నాకు ఈ అవకాశం దక్కింది. భాషలు ఎన్ని తెలిస్తే అంత మంచిది’ అందామె. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాసరగోడ్‌లో బి.జె.పి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఏమవుతుందో చూద్దాం. -
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
సాక్షి, ఢిల్లీ: ఒడిశాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్లో నెర్గుడి - బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను 4962 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కిందపైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి. ప్రాజెక్ట్ సైట్లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు. హస్త కళల అభివృద్ధి కోసం ఏపీకి 3911 కోట్లు జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుంచి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సీహెచ్డీసీ పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్త కళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సీహెచ్డీసీ పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్త కళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సీహెచ్సీడీ పథకం ఉద్దేశమైతే, హస్త కళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్‌హెచ్‌డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీహెచ్డీఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర/ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. -
సొంత బావతో అక్రమ సంబంధం! భర్తను దారుణంగా..
నిజామాబాద్: మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో అసలు సూత్రధారి భార్యే అని ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఇంద్రపురం కాలనీకి చెందిన గురుధాకర్ సయాజీ(35)గా గుర్తించినట్లు తెలిపారు. విచారణలో సయాజీ భార్య అశ్విని సొంత బావ అయిన రామ్ జింజోర్‌తో అక్రమ సంబంధం ఉంది. సయాజీ మద్యానికి బానిస కావడంతో భార్యను తరచూ వేధించేవాడు. ఈ నెల 3న సయాజీ భార్యను కొట్టి ఇంటి నుంచి పంపించాడు. దీంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్న భార్య.. బావ రామ్ జింజోర్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఈ నెల 5న నిందితుడు సయాజీని మల్లారం అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. సాంకేతిక సహాయంతో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడి బైక్, రెండు సెల్ఫోన్లు, చాకును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకటనారాయణ, ఎస్సై మహేశ్ ఉన్నారు. ఇవి చదవండి: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్! -
అశ్విని –తనీషా జోడీకి మహిళల డబుల్స్ టైటిల్
గువాహటి: ఆద్యంతం నిలకడగా రాణించిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ –100 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం విజేతగా నిలిచింది. 40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అశ్విని –తనీషా జోడీ 21–13, 21–19తో సుంగ్ షువో యున్–యు చియెన్ హుయ్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన అశ్విని–తనీషా జోడీకి 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అశ్విని –తనీషా ద్వయం అబుదాబి మాస్టర్స్, నాంటెస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీల్లోనూ టైటిల్స్ గెలిచింది. -
అశ్విని –తనీషా జోడీ ర్యాంక్‌లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విని –తనీషా ద్వయం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 28వ ర్యాంక్‌కు చేరుకుంది. గతవారం లక్నోలో జరిగిన సయ్యద్ మోడి ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టో ర్నీలో అశ్విని –తనీషా జోడీ రన్నరప్‌గా నిలిచింది. -
రన్నరప్ అశ్విని–తనీషా జోడీ
లక్నో: సయ్యద్ మోడి వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈసారి భారత జట్టు క్రీడాకారులకు ఒక్క టైటిల్ కూడా లభించలేదు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అశ్విని–తనీషా ద్వయం 14–21, 21–17, 15–21తో రిన్ ఇవనాగ–కీ నకనిషి (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన అశ్విని–తనీషాలకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యు జెన్ చి (చైనీస్ తైపీ) 20–22, 21–12, 21–17తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) 21–19, 21–16తో లినె హొమార్క్ (డెన్మార్క్)ను ఓడించి విజేతగా నిలిచింది. -
హోస్లో పాము, ఊసరవెల్లి లాంటి వాళ్లు ఉన్నారు.. అశ్విని కామెంట్స్ వైరల్!
సెల్ఫ్ గోల్ వేసుకుని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అశ్విని. డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పినా.. తనకు తానే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దీంతో హోస్ నుంచి బయటకి వచ్చేసింది. తాజాగా బిగ్‌బాస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విని ఇంటి సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. హౌస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి.. నాకు ఎవరితోనూ సెట్ కాలేదు.. దీనికంటే హౌస్ నుంచి వెళ్లిపోవడమే మేలని అనిపించిందని అశ్విని చెప్పుకొచ్చింది. సరైన కారణాలు కనిపించక సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి అప్పటికే ఉన్నవాళ్లు మమ్మల్ని వాళ్లతో కలుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చావో తెలియదు. ఏం చేస్తున్నావో తెలియదు.. అశ్విని నీ వల్ల బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు ఏం ఉపయోగం అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని ఎమోషనల్ అయింది. నేను ఏం చేస్తే వాళ్లకేందుకుండి అంటూ బాధపడింది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శోభ, ప్రియాంక, అమర్ ఒక గ్రూప్ కాగా.. శివాజీ, ప్రశాంత్, యావర్ ఒక గ్రూప్‌గా తయ్యారని తెలిపింది. నాతో మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని.. ఆ సమయంలో మానసికంగా చాలా వేదన అనుభవించానని వెల్లడించింది. కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ప్రియాంకను ఊసరవెళ్లితో పోల్చింది అశ్విని. పైకి ఒకలా కనిపిస్తుంది.. కానీ లోపల ఆమె వేరేలా ఉంటుందని చెప్పింది. ప్రశాంత్‌కు భజన చేశారా? అని ప్రశ్నించగా.. భజనేంటండి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శివాజీ పాములాంటి వారని తెలిపింది. అందుకే హౌస్‌లో ఒక పెద్ద పాము ఉందని అనాల్సి వచ్చిందని పేర్కొంది. -
Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!
బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బోరింగ్‌గా సాగింది. చివర్లో ఓ ఐదు నిమిషాలు తప్పితే ఒక్కటంటే ఒక్క పాయింట్లోనూ ఆసక్తిగా అనిపించలేదు. శివాజీపై ఏదో వేయాలని హోస్ట్ నాగార్జున అక్కడక్కడ సెటైర్లు వేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ ఏం జరగలేదు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో హోస్ట్ నాగ్ కారణం చెప్పాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 77 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. రతిక కన్నింగ్ ప్రిన్స్ యావర్.. ఫౌల్ గేమ్ ఆడి, వీడియోలతో సహా దొరికిపోయినందుకు తన ఎవిక్షన్ పాస్ని తిరిగిచ్చేయడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. దాని గురించి డిస్కస్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రియాంక, శోభా.. యావర్‌ని మెచ్చుకోగా రతిక మాత్రం తన్న కన్నింగ్నెస్ బయటపెట్టింది. 'సేఫ్ గేమ్ ఆడావ్ నువ్వు, ఎక్కడ నాకు ఇవ్వాల్సి వస్తుందని తిరిగిచ్చేశావ్ కదా' అని యావర్‌తో తన అసహనాన్ని వ్యక్తం చేసింది. అనంతరం హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఇక సింపతీ కొట్టేద్దామని ఫిక్స్ అయిన శివాజీ.. బూతులు మాట్లాడినందుకు అందరికీ సారీ చెప్పేశాడు. (ఇదీ చదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్) సండే ఫన్డే కాదు ఇకపై సండే అంటే ఫన్డే కాదని చెప్పిన నాగార్జున.. యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్‌మేట్' టాస్క్ పెట్టాడు. ఇందులో ఒక్కొక్కరు.. ఇద్దరికీ ఈ రెండు ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. ఎవరు.. ఎవరెవరికి ఏ ట్యాగ్ ఇచ్చారు? కంటెస్టెంట్స్.. ఫ్రెండ్.. బ్లాక్ హౌస్‌మేట్ గౌతమ్ - ప్రశాంత్, శోభాశెట్టి అమర్దీప్ - ప్రశాంత్, రతిక రతిక - శోభాశెట్టి, అమర్ శోభాశెట్టి - రతిక, గౌతమ్ అశ్విని - శోభాశెట్టి, గౌతమ్ యావర్ - శోభాశెట్టి, గౌతమ్ ప్రశాంత్ - అమర్దీప్, రతిక అర్జున్ - శివాజీ, యావర్ శివాజీ - అర్జున్, రతిక ప్రియాంక - ప్రశాంత్, అశ్విని శివాజీ మళ్లీ అలానే ఆదివారం ఎపిసోడ్లో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ టీమ్ ప్రమోషన్లో భాగంగా వచ్చారు. అయితే అంతా మాట్లాడుతున్న సమయంలో.. శివాజీని పెద్దాయన అని శ్రీకాంత్ సరదాగా అన్నాడు. దీంతో.. తనని అందరూ పెద్దాయన-పెద్దాయన అని అనడంపై శివాజీ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తలుపులు తీస్తే ఎల్లిపోతా సర్, ఇది నరకంగా ఉంది అని బుర్ర బాదుకుని మరీ పాత శివాజీని గుర్తుచేశాడు. సరదాకి అన్నాసరే శివాజీ అంటున్నాడనేది అర్థం కాలేదు. ఇకపోతే సేవింగ్‌లో భాగంగా తొలి రౌండ్లో యావర్, ప్రియాంక.. రెండో రౌండ్లో అర్జున్, అమర్దీప్ సేవ్ అయ్యారు. మూడో రౌండ్లో శోభాశెట్టి, రతిక సేవ్ అయ్యారు. చివరగా గౌతమ్, అశ్వినిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకున్నారు. కానీ ఇద్దరు సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. తద్వారా ఈ వారం నో ఎలిమినేషన్ అని తేలింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్‌బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?) నో ఎలిమినేషన్‌కి కారణమదే అయితే ఈ వారం ఎవిక్షన్ పాస్ ఉపయోగించలేని పరిస్థితుల్లో అంటే ఈ రోజు ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే గతవారం కేవలం ఐదుగురికి మాత్రమే ఎవిక్షన్ పాస్ కోసం పోటీపడే ఛాన్స్ వచ్చిందని, ఈ వారం మాత్రం అందరూ దానికోసం పోటీపడే అవకాశమొస్తుందని నాగ్ చెప్పాడు. అయితే అది ఎప్పుడు ఎలా వస్తుందనేది బిగ్‌బాస్ డిసైడ్ చేస్తారని నాగ్ వివరణ ఇచ్చాడు. అలానే రాబోయే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగ్ షాక్ ఇచ్చాడు. అంటే ఈ వారం మిస్ అయినోడు, నెక్స్ట్ వారం కలిపి ఇద్దరిని ఒకేసారి ఇంటికి పంపేస్తారనమాట. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు రతిక.. తెగ భయపడిపోయింది. దీంతో నాగార్జున ఆమెని సముదాయించాడు. 'ఏంటి రతిక.. సేవ్ అయ్యావని నమ్మలేకపోతున్నావా?' అని నాగార్జున అడిగాడు. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సర్ అని తన ఆనందాన్ని, భయాన్ని మిక్స్ చేసిన ఫీలింగ్స్ రతిక బయటపెట్టింది. చివరవరకు వచ్చేసరికి అశ్విని కూడా అలానే భయపడిపోయింది. కానీ నో ఎలిమినేషన్ అనేసరికి రతిక, అశ్విని.. హమ్మయ్యా అనుకున్నారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ) -
అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?
ఉల్టా పుల్టాతో మొదలైన బిగ్ బాస్ రియాలిటీ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. 2.0 అంటూ సరికొత్త పంథాలో దూసుకెళ్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పటి వరకు హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, వాదనలు మాత్రమే చూశాం. నామినేషన్స్ ప్రక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూశాం. కానీ వారి మనసుల్లో ఉండే భావోద్వేగాలను హౌస్‌లో చూడలేకపోయాం. కానీ ఈ వారంలో కంటెస్టెంట్స్‌ను ఏడిపించేస్తున్నారు బిగ్ బాస్. వారికి సర్ప్రైజ్లు ఇస్తూ ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. ఇవాళ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించి మూడు ప్రోమోలు రిలీజయ్యాయి. మొదటి ప్రోమోలో శివాజీని సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. రెండో ప్రోమోలో అంబటి అర్జున్ను ఏడిపించేశాడు. తాజాగా రిలీజైన మూడో ప్రోమోలో అశ్విని తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో వచ్చి రాగానే తన కూతురును హత్తకుని ఏడ్చేసింది. ఆ తర్వాత తన కూతురికి హౌస్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. నా అన్న వాళ్లంతా.. నీవాళ్లు కాదంటూ అశ్వినికి ఆమె తల్లి సలహాలిచ్చింది. దీంతో హౌస్‌లోనే తల్లి ఒడిలో పడుకుని చిన్న పిల్లలా ఏడుస్తూ కంటతడి పెట్టుకుంది అశ్విని. 'నన్ను వదిలి వెళ్లకు మమ్మీ' అంటూ ఫుల్ ఎమోషనల్ అయింది. మొత్తానికి ఈ రోజు జరిగే ఎపిసోడ్లో కంటెస్టెంట్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా కంటతడి పెట్టేలా బిగ్ బాస్ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఈరోజు రిలీజైన మూడు ప్రోమోలు చూస్తే ఈ వారంలో హౌస్ ఫుల్ ఎమోషనల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
నీకు తెలుగు అర్థమవుతోందా?.. యావర్‌ను ఓ ఆటాడుకున్న అశ్విని!
తెలుగువారి రియాలిటీ షో ఈ ఏడాది ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. మొదటి నుంచే కొత్త పంథాల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎమిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో మరో వారం మొదలైపోయింది. ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంచితే తొమ్మిదో వారానికి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ విషయానికొస్తే ఒకరిని ఒకరు నామినేట్ చేసే సమయంలో జరిగే వాదనలు మామూలుగా ఉండవు. సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) ఈ ప్రోమోలో కెప్టెన్లో హోదాలో ఉన్న గౌతమ్.. రతికాను నామినేట్ చేశాడు. తర్వాత ప్రిన్స్ యావర్‌ను అశ్విని నామినేట్ చేసింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీకు తెలుగు అర్థమవుతోందా?.. అసలు ఎందుకు వచ్చావ్ బిగ్‌బాస్‌కి? అని అశ్విని ప్రశ్నించింది. దీనికి యావర్ బదులిస్తూ.. నువ్వు అలాంటి మాట అనడం కరెక్టేనా? అని అన్నాడు. అనంతరం ఒక ఆడపిల్లని చేసి నన్ను ఆడుకుంటున్నావ్? అది కూడా నాకు అర్థమవుతోంది అంటూ అశ్విని ఓ రేంజ్లో ఊగిపోయింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియనంతగా యావర్ ఫేస్ ఎక్స్‌ప్రేషన్స్ ఇచ్చాడు. నువ్వు నన్ను టార్గెట్ చేశావ్.. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా. లేకపోతే నువ్వసలు నా మైండ్‌లోనే లేవు అంటూ అశ్విని రెచ్చిపోయింది. ఆ తర్వాత అమర్‌ను కెప్టెన్ గౌతమ్ నామినేట్ చేయడంతో ప్రోమో ముగిసింది. అంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలో యవర్ లాజిక్ లేని నామినేషన్స్ చేశాడు. కారణాలు ఏం చెప్పాలో తెలీక శోభాశెట్టి, అశ్వినిని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక - శోభాశెట్టి మధ్య వాదన గట్టిగా నడిచినట్లు ప్రోమోలో చూపించారు. శోభాతో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి.. 'నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్' అని రతికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. 'దొరికిపోయావ్.. దారుణంగా జనాలకి దొరికిపోతున్నావ్' అని తేజ అన్నాడు. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో తెలియాలంటే ఇవాళ జరిగే ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆయనతో ప్రత్యేక పూజలు! ) -
గిరిజన మహిళా రైతుకు ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్’
సాక్షి, పాడేరు: బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ కాఫీ సదస్సు–2023లో నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతు కిల్లో అశ్విని అవార్డు పొందారు. అరాబిక్ పార్చ్మెంట్ కాఫీ గింజల విభాగంలోని అన్ని ఫార్మెట్లలో నాణ్యమైన కాఫీ గింజలుగా అశ్విని పండించిన కాఫీ గింజలను జ్యూరీలోని అధికారుల బృందం గుర్తించింది. దేశంలోని 10 రాష్ట్రాల పరి«ధిలో సాగైన కాఫీ గింజలను ప్రదర్శించారు. మన రాష్ట్రానికి సంబంధించి 124 మంది గిరిజన రైతులు పార్చ్మెంట్ కాఫీ గింజల శాంపిళ్లను ప్రదర్శించారు. వీటిలో పెదబయలు మండలం కప్పాడ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు అశ్విని పండించిన కాఫీ గింజలు నాణ్యతలో భారత్‌లోనే నంబర్ వన్‌గా నిలిచాయని కాఫీ ప్రాజెక్ట్ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు–2023’ అశ్వినిని వరించింది. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె భర్త గాసన్న ఈ అవార్డును అందుకున్నారు. కాఫీ గింజల ఉత్తమ నాణ్యత అవార్డు రావడంపై కలెక్టర్ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్, కేంద్ర కాఫీ బోర్డు డీడీ రమేష్, ఐటీడీఏ కాఫీ ఏడీ అశోక్ హర్షం వ్యక్తం చేశారు. -
తెలుగులో స్టార్ హీరోయిన్.. క్యాన్సర్ సోకి.. అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దుస్థితి!
సినిమాల్లో స్టార్డమ్ వస్తే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చనుకుంటారు. కానీ అది కొంతకాలమే! స్టార్డమ్ ఉన్నన్నాళ్లూ దాన్ని అనుభవిస్తారు. అది పోయిన తర్వాత ఏకాకిగా మారుతారు. వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న అందాల తార అశ్విని జీవితంలోనూ ఇదే జరిగింది. వెండితెరపై వెలుగు వెలిగిన ఈమె అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూసింది. ఆమె ప్రయాణం ఎలా మొదలైంది? తన జీవితం ఎలా ముగిసింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. తెలుగులో 40కు పైగా సినిమాలు నెల్లూరుకు చెందిన అశ్విని 1967 జూలై 14న జన్మించింది. భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. తొలి సినిమాకే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె కొంతకాలానికే హీరోయిన్గా మారింది. వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్ మాస్టర్, నాగార్జునతో అరణ్యకాండ చిత్రాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 110కి పైగా చిత్రాలు చేసింది. పెళ్లి చేసి చూడు, ఇంటి దొంగ, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు.. ఇలా ఒక్క తెలుగులోనే 40కి పైగా సినిమాలు చేసింది. సీక్రెట్‌గా పెళ్లి.. కెరీర్ పీక్స్‌లో ఉండగా ఈమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్ కూడా వచ్చాయి. ఒంటరిగా ఉన్న అశ్విని కార్తీక్ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకుని అశ్విని ఎంతగానో కుంగిపోయింది. అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ అటు కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోసాగింది. మొదట సీరియల్స్‌లో నటించడానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైనా మెరిసింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో సినిమాలోనే కాదు, ఏ సినీ ఫంక్షన్లోనూ కనిపించలేదు. ఇంటిని అమ్మేసి అద్దె ఇంట్లో బతుకుబండి.. వంద సినిమాలు చేసిందన్న మాటే కానీ తనకు చెన్నైలో ఒక ఇల్లు మాత్రమే ఉండేదట! చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం. 2012లో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఓ సీరియల్‌కు సంతకం కూడా చేసింది. కానీ ఆమె శరీరం సహకరించలేదు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. అశ్విని తుదిశ్వాస విడిచింది. ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేకపోవడంతో దర్శకుడు పార్తీబన్ ఆర్థిక సాయం చేశాడు. తన నటనతో అందరికీ వినోదాన్ని పంచిన ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది. పెళ్లిపత్రిక పంపింది అశ్విని గురించి డైరెక్టర్ పార్తీబన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'పొందట్టి తెవై సినిమాకు నేను వేరే హీరోయిన్ను అనుకున్నాను. కానీ ఆమె డేట్స్ ఇవ్వకపోవడంతో అశ్వినిని తీసుకున్నాం. తను బాగా సెట్టయింది. ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత నేను మళ్లీ ఆమెను కలవలేదు. అయితే మధ్యలో తన పెళ్లిపత్రిక పంపించింది. కవి, రచయిత పువియరుసు మనవడిని పెళ్లాడుతున్నట్లు తెలిపింది. నేను అవుట్డోర్ షూటింగ్లో ఉండటంతో పెళ్లికి వెళ్లలేకపోయాను. ఆ తర్వాత ఓసారి నా కుమారుడు రాధాకృష్ణన్ తన స్నేహితుడు కార్తీక్ తల్లి ఆస్పత్రిలో ఉందని, ఆమె చికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నామని చెప్పాడు. ఆమె మరెవరో కాదు, అశ్విని అని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చివరికి 2012 సెప్టెంబర్ 23వ తేదీన 45 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆమె కన్నుమూసింది. తన కొడుకును చదివించే బాధ్యత నేను భుజాన వేసుకున్నాను' అని చెప్పాడు. చదవండి: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న హీరోయిన్, పెళ్లికొడుకు ఎవరో తెలుసా? -
Ranee Ramaswamy: నటరాజు దీవించిన నాట్య సుధా నిధులు
భావం, రాగం, తాళం... ఈ మూడు నృత్య కళాంశాల సమ్మేళనం భరతనాట్యం. అరవై నాలుగు ముఖ, హస్త, పాద కదలికల అపురూప విన్యాసం భరతనాట్యం. మూడు దశాబ్దాల క్రిందట అమెరికాలో ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ మొదలు పెట్టి ఆ నాట్య వైభవాన్ని దశదిశలా తీసుకువెళుతోంది రాణీ రామస్వామి. తానే ఒక సైన్యంగా మొదలైన రాణీ రామస్వామికి ఇప్పుడు ఇద్దరు కూతుళ్ల రూపంలో శక్తిమంతమైన సైనికులు తోడయ్యారు.... ‘మేము గత జన్మలు, పునర్జన్మల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా పెద్ద అమ్మాయి అపర్ణకు మూడు సంవత్సరాల వయసు నుంచే నృత్యంపై అనురక్తి ఏర్పడింది. ఆమె పూర్వజన్మలో నృత్యకారిణి అని నా నమ్మకం’ అంటుంది రాణీ రామస్వామి. చెన్నైలో పుట్టిన రాణీ రామస్వామికి ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంతో చెలిమి ఏర్పడింది. డెబ్బై ఒకటో యేట ఆమెకు ఆ నాట్యం శ్వాసగా మారింది. ఈ వయసులోనూ చురుగ్గా ఉండడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ఆమె అమెరికాలోని మినియాపొలిస్‌లో ‘రాగమాల డ్యాన్స్ కంపెనీ’కి శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ ద్వారా అమెరికాలో నృత్యాభిమానులైన ఎంతో మందికి ఆత్మీయురాలిగా మారింది. భరతనాట్యాన్ని ముందుకు తీసుకువెళ్లే ఇంధనం అయింది. ‘రాగమాల’ ద్వారా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది రాణీ రామస్వామి. ‘రాగమాల ట్రైనింగ్ సెంటర్’ ద్వారా ఏడు సంవత్సరాల వయసు నుంచే భరత నాట్యంలో శిక్షణ పొందుతున్నారు ఎంతోమంది పిల్లలు. ‘అమ్మా, నేను, అక్క ఒక దగ్గర ఉంటే అపురూపమైన శక్తి ఏదో మా దరి చేరినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో కూర్చొని వేదికపై వారి నృత్యాన్ని చూసినప్పుడు, డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్న వారిని చూస్తున్నప్పుడు, మేము ముగ్గురం కలిసి నృత్యం చేస్తున్నప్పుడు....అది మాటలకందని మధురభావన’ అంటోంది అశ్వినీ రామస్వామి. పాశ్చాత్య ప్రేక్షకులకు భరతనాట్యంలోని సొగసు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చేయడంలో రాణీ రామస్వామి విజయం సాధించింది. ‘క్రియేటివ్ పర్సన్ లేదా ఆర్టిస్ ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది. ఆ ప్రయాణంలో వేరే వాళ్లు తోడైనప్పుడు ఎంతో శక్తి వస్తుంది. అమ్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాతో పాటు ఎంతోమంది ఆమె వెంట ప్రయాణం చేస్తున్నాం’ అంటుంది అపర్ణ రామస్వామి. భరతనాట్యానికి సంబంధించి ఈ ముగ్గురికి 3డీలు అంటే ఇష్టం. డీప్ లవ్, డెడికేషన్, డిసిప్లిన్. ‘ప్రశంసల సంగతి సరే, విమర్శల సంగతి ఏమిటి?’ అనే ప్రశ్నకు వీరు ఇచ్చే సమాధానం... ‘విమర్శ కోసం విమర్శ అని కాకుండా హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ అంటే ఇష్టం. దీని ద్వారా మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన ‘రిటెన్ ఇన్ వాటర్’ నృత్యరూపకం భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకే ప్రపంచంలోకి తీసుకు వచ్చింది. ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ ద్వారా మూడు దశాబ్దాల ప్రయాణం సులువైన విషయం ఏమీ కాదు. ప్రయాణంలో...కొందరు కొన్ని అడుగుల దూరంతో వెనుదిరుగుతారు. కొందరు కొన్ని కిలో మీటర్ల దూరంలో వెనుతిరుగుతారు. కొందరు మాత్రం వందలాది కిలోమీటర్లు అలుపెరగకుండా ప్రయాణిస్తూనే ఉంటారు. రాణీ రామస్వామి ఆమె కూతుళ్లు అపర్ణ, అశ్వినిలు అచ్చంగా ఈ కోవకు చెందిన కళాకారులు. నోట్స్ రెడీ ఇద్దరు కూతుళ్లు అపర్ణ, అశ్విని తల్లితో పాటు కూర్చుంటే కబుర్లకు కొరత ఉండదు. అయితే అవి కాలక్షేపం కబుర్లు కాదు. కళతో ముడిపడి ఉన్న కబుర్లు. అమ్మ రాణీ రామస్వామి తన సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన విలువైన అనుభవం ఒకటి ఆ సంభాషణలలో మెరిసి ఉండవచ్చు. ఈతరానికి నాట్యాన్ని ఎలా దగ్గర చేయాలి అనేదాని గురించి పిల్లలిద్దరూ తల్లితో చర్చించి ఉండవచ్చు. ఇలా ఎన్నెన్నో ఉండవచ్చు. ఈ కబుర్లు వృథాగా పోవడం ఎందుకని అర్చన, అశ్విన్‌లు నోట్స్‌తో రెడిగా ఉన్నారు. -
వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
పట్నా: ఇటీవల హత్యకు గురైన ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్న వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అశ్విని చౌబె. అలాంటి వాళ్లు కన్పించిన వెంటనే కాల్చి పడేయాలని వ్యాఖ్యానించారు. బిహార్‌లో కూడా యోగి మోడల్ ప్రభుత్వం అవసరం ఉందన్నారు. పట్నాలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు అతీక్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విని చౌబె వాళ్లపై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, తక్షణమే వాళ్లను కాల్చిపడేయాలన్నారు. మోదీ, యోగికి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేసిన తీరు బాధాకరమన్నారు. క్రిమినల్స్, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న యోగి మార్క్ పాలన బిహార్‌లోనూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్‌లో ప్రస్తుతం కుటంబ, కుల రాజకీయాలు చేసే వారే అధికారంలో ఉన్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అశ్రఫ్‌ను ముగ్గురు యువకులు పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు వెంటనే పోలీసులకు లొంగిపోయారు. ఫేమస్ అయ్యేందుకే తాము ఈ హత్యలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. చదవండి: 35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు! -
తల్లి కాబోతున్న యాంకర్ అశ్వినీ శర్మ, సీమంతం ఫొటోలు వైరల్
నటి, యాంకర్ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. పలు టీవీ షోలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులను ఇంటర్య్వూ చేసి యాంకర్‌గా గుర్తింపు పొందింది ఆమె. ఆ తర్వాత ఛత్రపతి, కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో వంటి చిత్రాల్లో సహనటి పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అశ్వినీ శర్మ నటనకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్‌బై చెప్పింది. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ప్రతీక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లాడి అమెరికాలో సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన అభిమానులతో గుడ్‌న్యూస్ పంచుకుంది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘త్వరలోనే శుభవార్త చెప్పేందుకు రెడీగా ఉన్నాం. మా ఫస్ట్ లిటిల్ బేబీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ బేబీ షవర్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అశ్వినీ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అశ్వినీకి పలువురు నటీనటులు, సినీ సెలబ్రిటీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య View this post on Instagram A post shared by ✨Ashwini sharma✨🧿 (@ashwinisharma_official) -
కన్నడ ప్రేక్షకులకు లేఖ రాసిన పునీత్ భార్య, ఏమన్నారంటే..
దివంగ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘గంధర గుడి’. వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి చిత్రంగా ఈ మూవీ రూపొందింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కర్ణాటక ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలను సైతం బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్ణాటక అడవులను, వాటిలోని ప్రాముఖ్యతను కన్నడిగులకు తెలియాలజేయాలనే ఉద్ధేశంతో పునీత్ రాజ్‌కుమార్ ఈ మూవీ చేశారట. చదవండి: విశ్వక్ సేన్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు? ఈ విషయాన్ని తాజాగా ఆయన భార్య అశ్విని రేవంత్ తెలిపారు. ఈ మేరకు ఆమె కర్ణాటక ప్రేక్షకులను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేశారు. ‘‘గంధద గుడి.. ఇది పునీత్ రాజ్‌కుమార్ కలల చిత్రం. కర్ణాటక అడవుల అందాలు అందరికీ చూపించాలని ఆయన ఈ సినిమా చేశారు. కన్నడ ప్రజలందరూ ఈ సినిమా చూడలన్నది ఆయన కోరిక. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రం చూడాలని అప్పు(పునీత్) ఎంతగానో కోరుకున్నారు. మన పిల్లల కోసం మన అడవులను కాపాడుకుందాం. వాళ్లకి కర్ణాటక అందాలను చూపిద్దాం’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ కాగా అమోఘవర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పునీత్ భార్య అశ్వినీ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 28న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కొద్ది రోజులకే పునీత్ గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయన మరణించిన కొన్ని రోజు రోజులకే ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా విశేష ఆదరణ అందుకుంది. ప్రధానీ నరేంద్ర మోదీ సైతం గంధర గుడి ట్రైలర్‌పై స్పందించారు. ‘పునీత్ కోట్లాది మంది హృదయాలలో జీవిస్తూనే ఉంటారు. ఆయన ఎంతో ప్రతిభ కలిగిన నటులు. గంధద గుడి సినిమా కర్ణాటక ప్రకృతి సౌందర్యాన్ని చూపుతోంది. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు’ అని మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ನಾಡಿನ ಜನತೆಯಲ್ಲಿ ನನ್ನ ಒಂದು ಮನವಿ... An appeal to all the people of the state.#GGKids #GGMovie #GandhadaGudi #DrPuneethRajkumar pic.twitter.com/tf01Kt2Alu — Ashwini Puneeth Rajkumar (@Ashwini_PRK) November 6, 2022 -
Ashwini KP: చరిత్ర సృష్టించిన అశ్విని.. మానవహక్కుల దూతగా..
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. తొలి దళిత యువతి ‘స్త్రీగా, దళిత స్త్రీగా నేను ఈ అవకాశం పొందడం చాలా ప్రాముఖ్యమైన సంగతి’ అంటోంది అశ్విని. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశాలలో కీలకమైన నిర్ణయం వెలువడింది. జాతి వివక్షను నివేదించేందుకు స్వతంత్య్ర నిపుణురాలిగా (ప్రత్యేక దూతగా) మొదటిసారి ఒక భారతీయురాలి ఎంపిక జరిగింది. బెంగళూరులో పొలిటికల్ సైన్స్ బోధించే అధ్యాపకురాలు, దళిత్ యాక్టివిస్టు అశ్విని కె.పి.ని కౌన్సిల్‌లోని 47 మంది సభ్యుల బాడీ ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. ఈ పదవిలోకి వచ్చిన తొలి ఆసియా మహిళగా, తొలి భారతీయురాలిగా, తొలి దళితురాలిగా ఆ మేరకు అశ్విని చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ పదవిలో జాంబియాకు చెందిన మహిళ ఇ.తెందాయి ఉంది. అమెరికాలో ఇటీవల భారతీయ సముదాయంలో ‘కుల వివక్ష’ ధోరణి ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నిర్వహించే కార్యకలాపాలను నమోదు చేయడం, ఆయా దేశాలలో నెలకొన్న అసహనం, జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల అకారణ ద్వేషం స్థూలంగా, దేశాన్ని బట్టి ఏ విధంగా ఉన్నాయో కౌన్సిల్‌కు నివేదించడం అశ్విని బాధ్యతలుగా ఉంటాయి. ఈ పదవిలో అశ్విని మూడేళ్లు ఉంటుంది. ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ.. ‘భారతదేశంలో అంబేద్కర్ కులవివక్షని, జాతి వివక్షని ఎలా ఎదుర్కొవాలో చెప్పారు. మన దేశంలో అంటరానితనం ఎంతటి ఘోరమైన కులవివక్షకు కారణమైందో తెలుసు. అది చూసే అంబేద్కర్ ప్రతిఘటన మార్గాలు చెప్పారు. అయితే అవి భారతదేశానికే కాదు... ప్రపంచం మొత్తానికి ఉపయోగపడతాయి. జాతి వివక్ష గురించి నాకున్న దృష్టికోణం ఆయన నుంచి పొందినదే. ఒక స్త్రీగా, దళితురాలిగా కూడా నాకు ఈ పదవి రావడం వల్ల మార్జినలైజ్డ్ సమూహాలు ఎదుర్కొనే వివక్షను మరింత బాగా అర్థం చేసుకునే వీలు ఉంది.’ ‘భారత్– నేపాల్‌లలో దళిత మానవ హక్కులు ఎలా ఉన్నాయో అన్న అంశం మీద జె.ఎన్.యూ.లో నేను పీహెచ్డీ చేశాను. ఆ సమయంలో ఎందరో దళిత యాక్టివిస్టులను కలిశాను. వారంతా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివిధ వేదికలలో పని చేస్తున్నారు. అలాగే నేను ఆమ్నెస్టీకి చెందిన సీనియర్ బృందాలతో కలిసి పని చేశాను. ఆ పనిలో భాగంగా ఛత్తిస్‌గఢ్, ఒడిశాలలోని ఆదివాసుల హక్కుల హరణం తెలుసుకున్నాను. ఆదివాసులు, దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ అవగాహనలన్నీ ఇప్పుడు వచ్చిన ఈ పదవిని మరింత అర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి’ ‘రకరకాల వివక్షల వల్ల కోట్లాది మంది బాధ పడుతున్నారు. ఈ వివక్షలను దాటి ముందుకు నడవడానికి ప్రతి ఒక్కరూ చేతనైన చైతన్యం కలిగించాలి. కల్పించుకోవాలి’. చదవండి: అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కొన్ని నియమాలు.. Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
'అవును.. అలా నటించాల్సి వచ్చింది.. అందులో తప్పేముంది'
హీరోలతో నటించే సమయంలో హద్దులు మీరరాదని అంటోంది అశ్విని చంద్రశేఖర్. బెంగళూరుకు చెందిన ఈ అమ్మడు మాతృభాషను దాటి తమిళం, తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది సినిమాను చుట్టేస్తుంది. ఆర్కిటిక్ పట్టభద్రురాలైన ఈమె నటనపై ఆసక్తితో సినిమా రంగానికి పరిచయం అయ్యింది. తమిళంలో జీవీ, కాల్ టాక్సీ, మరకతకాడు, కాదల్ పుదిదు టైటిల్, తదితర చిత్రాలలో నటించింది. ఈమె నటించిన మెర్లిన్ చిత్రం ఇటీవలే విడుదలైంది. మలయాళంలో నటుడు నవీన్ బాలికి జంటగా నటించిన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. వెట్రికి జంటగా నటించిన జీవీ–2 చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన చిత్రం ఇంతకు జీవీ చిత్రానికి పని చేసిన యూనిట్నే ఈ చిత్రానికి పని చేశారు. ఇందులో నటి అశ్విని చంద్రశేఖర్ ఒక పాటలో హీరోతో చాలా సన్నిహితంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: ('త్వరగా పూర్తి చేయండి ప్లీజ్'.. తమన్నా రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్) దీనిపై స్పందించిన ఆమె జీవీ చిత్రంలో నటించే అవకాశం ఆడిషన్ ద్వారా వచ్చిందని చెప్పింది. అందులో అంధురాలిగా ఛాలెంజింగ్ పాత్రను చేశానని తెలిపింది. దర్శకుడు సూచనలను, తాను బయట ప్రపంచంలో చూసిన విషయాలను క్రోడీకరించుకుని ఆ పాత్రకు న్యాయం చేశానని చెప్పింది. 2019లో విడుదలైన ఆ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని మలేషియా, సింగపూర్ వంటి ఇతర దేశాల నుంచి పలువురు అభిమానులు ఫోన్ చేసి ప్రసంశించారని చెప్పింది. తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందించిన జీవీ–2 చిత్రంలోని అదే యూనిట్ పనిచేయడంతో తనకు చాలా సౌకర్యంగా అనిపించిందని చెప్పింది. ఈ చిత్రంలో తన పాత్రను మరింత మెరుగుపరిచారని తెలిపింది. ఈ చిత్రం థియేటర్లో విడుదలైతే బాగుండని భావించానని, ఓటీటీలో విడుదలైనా, వీక్షకుల ఆదరణ చూస్తే సంతోషంగా ఉందని చెప్పింది. ఇందులో నీ నీ పోదుమే అనే పాటలో హీరోతో చాలా సన్నిహితంగా నటించినట్లు చెబుతున్నారని, ఆ సన్నివేశం డిమాండ్ మేరకు అలా నటించాల్సి వచ్చిందని, అందులో తప్పేమీ లేదని అయితే దేనికైనా హద్దులు ఉంటాయని నటి పేర్కొంది. -
‘కుప్పం ఎంపీపీ అశ్వినీకి భద్రత కల్పించాలి’
అమరావతి: చంద్రబాబు ప్రోద్భలంతో టీడీపీ గూండాల దాడికి గురైన కుప్పం ఎంపీపీ అశ్వనీకి పోలీస్ భద్రత కల్పించాలని రాష్ట్ర ఎంపీపీల సంక్షేమ సంఘం కన్వీనర్ మేకల హనుమంతరావు కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అధికారంలోకి రాలేమని గ్రహించిన చంద్రబాబు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కుప్పం ఎంపీపీ అశ్వనీకి ప్రాణహాని ఉందని ఆమెకు భద్రత కల్పించాలని డీజీపీని కోరనున్నట్లు చెప్పారు. చదవండి: (తాడేపల్లిలో U1 రిజర్వ్ జోన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వ నిర్ణయం) -
పునీత్‌కు బసవశ్రీ అవార్డు
సాక్షి, బళ్లారి, యశవంతపుర: దివంగత పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత) -
రుణాలు తీర్చాల్సిన బాధ్యత టెల్కోలదే: కేంద్ర మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ: వడ్డీ బాకీలకు ప్రతిగా ప్రభుత్వానికి వాటాలు ఇచ్చినప్పటికీ అసలు మొత్తాన్ని తీర్చాల్సిన బాధ్యత టెల్కోలపైనే ఉంటుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ‘ఆయా సంస్థల్లో ప్రభుత్వం ఇన్వెస్టరుగా మాత్రమే ఉంటుంది. రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోదు. తగిన సమయంలో ప్రభుత్వం నిష్క్రమిస్తుంది. కంపెనీలు ప్రొఫెషనల్స్ సారథ్యంలోనే నడుస్తాయి. బాకీలు తీర్చాల్సిన బాధ్యత వాటిపైనే ఉంటుంది‘ అని ఆయన తెలిపారు. రాబోయే వేలంలో సదరు కంపెనీలు స్పెక్ట్రం కొనుగోలు చేస్తే.. వాటిలో వాటాదారుగా, అవి జరపాల్సిన చెల్లింపుల భారాన్ని ప్రభుత్వం కూడా భరిస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. కంపెనీలపై భారం తగ్గించేందుకు, ఉద్యోగాల కల్పన అలాగే పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడంలో భాగంగానే టెలికం రంగానికి కేంద్రం సంస్కరణల ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. మరోవైపు, గత పాలకుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి జారిపోయిందని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. (చదవండి: పరిశ్రమలు పడక.. ధరలు పైపైకి!) -
PuneethRajkumar: పునీత్ పెళ్లికి 22 ఏళ్లు..
సాక్షి, బెంగళూరు: నెల కిందట ఆకస్మికంగా కన్నుమూసిన ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు వివాహమై 22 ఏళ్లు పూర్తయింది. 1999 డిసెంబరు 1వ తేదీన అశ్వినిని పునీత్ ప్రేమించి పెళ్లాడారు. ఎన్నో ఆశలతో ఇద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ విధి మరోలా తలచడంతో 22వ వివాహ వార్షికోత్సవానికి పునీత్ లేరు. అల్లు శిరీష్ పరామర్శ పునీత్ అకాల మరణం శాండల్‌వుడ్‌కు తీరని లోటు అని తెలుగు నటుడు అల్లు శిరీష్ అన్నారు. బుధవారం ఆయన బెంగళూరులో పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ పునీత్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది, బెంగళూరుకు ఎప్పుడు వచ్చినా పునీత్‌ను కలిసేవాడినని అన్నారు. చదవండి: (పునీత్ మరణం ఒక ప్రశ్న: సోదరుడు రాఘవేంద్ర) -
పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్.. అప్పుకు అంకితంగా
Puneeth Raj Kumar Wife Ashwini Emotional Post: కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు యాక్టివ్‌గా ఉండని ఆమె అకౌంట్ ఓపెన్ చేసి మరీ మొదటి పోస్టును పునీత్ రాజ్ కుమార్‌కు అంకితమిచ్చారు. ఆమె ఆ పోస్టులో 'శ్రీ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు, మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ను 'పవర్ స్టార్' చేసిన అభిమానులకు పునీత్ లేని లోటు ఊహించడం కష్టమే. ఈ బాధలో మీరు మనోనిబ్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. సినీ ప్రియులు మాత్రమే కాకుండా ఇండియాతో పాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. అప్పు (పునీత్ రాజ్ కుమార్)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్ జీవించే ఉంటారు. మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.' అంటూ అశ్విని కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Ashwini Puneeth Rajkumar (@ashwinipuneeth.official) కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల 29న గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అది తట్టుకోలేని 21 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఆయన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. 46 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. వేలాది మంది అభిమానులు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా కర్ణాటకలో ఇప్పటికీ ఆయన పేరే వినిపిస్తోంది. -
పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్విని
Puneeth Rajkumar Family Appeals Fans Not To End Lifes: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. గుండెపోటుతో చిన్న వయసులోనే పునీత్ హఠాన్మరణానికి గురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేరన్న వార్త తెలిసి ఇప్పటికే సుమారు 12మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వరుసగా అభిమానులు సూసైడ్‌కు పాల్పడుతుండటంపై పునీత్ భార్య అశ్విని స్పందించారు. 'పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదు. అప్పు లేడన్న విషయాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు' అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు అప్పు సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్రలు సైతం అభిమానులెవరూ అఘాయిత్యాలకు పాల్పడద్దని కోరారు. అంత్యక్రియల దృశ్యాలకు కూడా పదేపదే ప్రసారం చేయవద్దని మీడియాకు సైతం విజ్ఞప్తి చేశారు. చదవండి: పునీత్ మరణాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ ఆగ్రహం -
అశ్విని నేత్రాలయంతో మ్యాక్సివిజన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య సేవల సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన డాక్టర్ ఏఏవీ రామలింగా రెడ్డి సంస్థ అశ్విని నేత్రాలయంతో చేతులు కలిపింది. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇది మ్యాక్సివిజన్ డాక్టర్ రామలింగా రెడ్డి ఐ హాస్పిటల్స్ పేరిట కార్యకలాపాలు సాగించనున్నట్లు ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్కే వేలు వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి మాచర్ల, గుంటూరులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ నేత్ర వైద్యుడు శరత్ బాబు చిలుకూరితో కలిసి శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ పేరిట ఈ తరహాలో తెలంగాణ వ్యాప్తంగా జేవీ కింద ఐ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వేలు చెప్పారు. ప్రస్తుతం తమకు సుమారు 20 పైచిలుకు సెంటర్స్ ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని 50 దాకా పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, జేవీ విధానం కారణంగా నిర్వహణ, వ్యాపార విస్తరణను నిపుణులకు అప్పగించి, వైద్యులు ప్రధానంగా వైద్య సేవలపై మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుందని మ్యాక్సివిజన్ వ్యవస్థాపక మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా తమ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని రామలింగా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా మరో 6 జిల్లాల్లోకి విస్తరించనున్నట్లు శరత్ బాబు పేర్కొన్నారు. -
అనుకుంది.. సాధించింది
తమిళనాడు రాష్ట్రం, మామల్లపురం గ్రామంలో శుక్రవారం నాడు సామాజికహితమైన ఓ అద్భుతం ఆవిష్కారమైంది. ఆ ఊరి ఆలయంలో భోజన కార్యక్రమంలో ఆ రాష్ట్ర హెచ్ఆర్ అండ్ సీఈ (హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్) మంత్రి పీకే శేఖర్‌బాబు అత్యంత సామాన్యమైన మహిళ అశ్వినితో కలిసి భోజనం చేశారు. ఆమెతో కలిసి భోజనం చేయడానికి మంత్రి ఆ ఊరు వచ్చాడు. ఆ భోజన కార్యక్రమంలో అశ్విని ఒడిలో ఆమె కొడుకు కూడా ఉన్నాడు. ఈ అద్భుతమైన సంఘటనకు దారి తీసిన మరో విషాద సంఘటన కూడా ఇదే నెలలో ఓ రోజు జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంటే... ‘‘మధ్యాహ్నమైంది. ఆలయంలో అన్నదాన కార్యక్రమం మొదలైంది. మేము క్యూలో నిలబడి ఉన్నాం. టేబుల్ మీద అరిటాకులు పరిచారు. మా వంతు వచ్చే లోపు కుర్చీలు నిండిపోయాయి. ఒక పంక్తి పూర్తయిన తర్వాత రెండో విడత ఆకులు పరిచారు. ఆ పంక్తిలో మేము కూర్చున్నాం. అప్పుడు ఆలయానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని లేవమని చెప్పాడు. ‘అందరి భోజనాలు పూర్తయిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఆలయం వెలుపల ఇస్తాం, బయట నిలబడండి’ అని చెప్పాడు’’ అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది అశ్విని. మీ ఇంటి పెళ్లి కాదు! ‘‘ఇది కనుక మీ ఇంట్లో పెళ్లి అయితే... మీ అందరి భోజనాలు పూర్తయిన తర్వాత మిగిలినవి ఇస్తారు. అప్పటి వరకు మేము దూరంగా నిలబడి ఎదురు చూస్తుంటాం. కానీ ఇది ప్రభుత్వం పేదవాళ్ల కోసం రూపొందించిన పథకం. మాకు స్థానం కల్పించడానికి అయిష్టత చూపిస్తున్న మీరంతా చదువుకున్న వాళ్లు. మేము చదువుకోని వాళ్లం. ఈ రోజు మేము నిరక్షరాస్యులమే. నా కొడుకును బాగా చదివిస్తాను. ఈ దారుణం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూస్తాను’’ అన్నదామె ఆవేదనతో కూడిన ఆవేశంతో. ఆమె అలా మాట్లాడినప్పుడు ఆమె సామాజిక వర్గం మొత్తం ఆమె వెనుక ఉంది. ఆమె ధర్మాగ్రహానికి సమాజ ఆమోదం లభించింది. పలువురిని ఆలోచనలో పడేసింది. మరికొందరు ఆమెను బలపరిచారు. నిశ్శబ్దంగా తగిలింది! ఆ రోజు ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఓ సంచలనం అయింది. వేగంగా చేరాల్సిన చోటుకి చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖ మంత్రితోపాటు కాంచీపూరం హెచ్ఆర్ అండ్ సీసీ జాయింట్ కమిషనర్ రంగంలో దిగారు. అశ్విని గురించి వాకబు చేసి ఆమె వివరాలు సేకరించి ఆమెను సంప్రదించారు. ఆ తర్వాత ‘ఇది ముఖ్యమంత్రి ఆదేశం’ అంటూ ఈ నెల 29వ తేదీ, శుక్రవారం నాడు అదే ఆలయంలో నరి కురువ సామాజిక వర్గానికి చెందిన వాళ్లతో కలిసి మంత్రి శేఖర్‌బాబు, తిరుపోరూర్ ఎమ్ఎల్ఏ ఎస్ఎస్ బాలాజీ, ఉన్నతాధికారి భోజనం చేశారు. అశ్విని తెగువను ప్రశంసిస్తూ ఆమెను ప్రభుత్వం తరఫున చీర సారెతో సత్కరించారు. ఆ సహపంక్తిలో పాల్గొన్న నరి కురువ సామాజిక వర్గంలోని అందరికీ చీర, ధోవతి పంచారు. పేదవాళ్లకు ఆహార భద్రత కోసం తమిళనాడు ప్రభుత్వం 754 కోట్లతో అన్నదానం పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా రోజూ ఆలయ ప్రాంగణంలో అన్నం వండి పేదవారికి భోజనం పెడుతోంది. ఓ రోజు మామల్లపురంలోని స్థలశయన పెరుమాళ్ ఆలయంలో ఈ అవాంఛిత సంఘటన చోటుచేసుకుంది. నాటి సంఘటనకు ప్రతిస్పందన ఇది. -
మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవలు అందించేందుకు స్పేస్ టెక్నాలజీ, టెలికం సాంకేతికల మేళవింపు తోడ్పడగలదని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో సమ్మిళిత వృద్ధి సాధ్యపడగలదని పేర్కొన్నారు. అంతరిక్ష టెక్నాలజీలు, ఉపగ్రహ కంపెనీల సమాఖ్య ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాలు, ఎడారి గ్రామాలు మొదలైన ప్రాంతాలకు సంప్రదాయ విధానాల్లో డిజిటల్ సేవలను చేర్చడం కష్టం. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు స్పేస్ టెక్నాలజీలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నా‘ అని ఆయన వివరించారు. స్పెక్ట్రంపై తగు సూచనలివ్వండి.. స్పెక్ట్రం నిర్వహణ తదితర అంశాల విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించిన విధానాల రూపకల్పనకు తగు సిఫార్సులు చేయాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. స్పెక్ట్రం విషయంలో స్పేస్, టెలికం రంగాలు రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమైనవేనని ఆయన చెప్పారు. ఫైబర్, టెలికం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సంక్షోభాల నిర్వహణ, ప్లానింగ్, రైళ్ల రాకపోకల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి భారతీయ రైల్వేస్.. ఎక్కువగా స్పేస్ టెక్నాలజీలనే వినియోగిస్తోందని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేస్ విభాగం మరింత సమర్ధమంతంగా పనిచేసేందుకు ఉపయోగపడే సాధనాల గురించి రైల్వే, స్పేస్ విభాగాల అధికారులతో చర్చించి, అధ్యయనం చేయాలని, తగు పరిష్కార మార్గాలు సూచించాలని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌పీఏ ఆవిషఅకరణతో పరిశ్రమ, రీసెర్చ్ సంస్థలు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు, తయారీ సంస్థలు, రైల్వేస్ వంటి సర్వీస్ సంస్థలు మొదలైన వాటికి కొత్త అవకాశాలు లభించగలవని వైష్ణవ్ చెప్పారు. త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి.. స్పేస్ టెక్నాలజీ రంగంలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించాలని, నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు వేగవంతమయ్యేలా చూడాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సరి చేయాలని స్పేస్ సంస్థలు కోరాయి. తక్కువ వ్యయాల భారంతో రుణాలు లభించేలా తోడ్పాటు అందించాలని స్టార్టప్ సంస్థలు, చిన్న.. మధ్య తరహా కంపెనీలు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. ‘చాలా మటుకు అనుమతుల ప్రక్రియలు మందకొడిగా సాగుతున్నాయి. అనుమతులు లభించడానికి ఏడాదిన్నర పైగా పట్టేస్తోంది. మీరు వ్యక్తిగతంగా ఈ రంగాన్ని పర్యవేక్షించాలని కోరుతున్నాం. పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు మీరు పరిశీలిస్తుంటే, పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది‘ అని ప్రధానితో ఆన్లైన్లో పరిశ్రమ వర్గాలు నిర్వహించిన చర్చల సందర్భంగా భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తదితరులు కోరారు. దిగ్గజాలకు సభ్యత్వం.. ఐఎస్‌పీఏ తొలి చైర్మన్‌గా ఎల్అండ్టీ నెక్సŠట్ సీనియర్ ఈవీపీ జయంత్ పాటిల్ చైర్మన్‌గాను, భారతి ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వత్స్ వైస్ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ దిగ్గజాలు లార్సన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్టెల్, నెల్కో (టాటా గ్రూప్), మ్యాప్‌మైఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, వన్‌వెబ్, అనంత్ టెక్నాలజీ మొదలైనవి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రెజ్, బీఈఎల్ తదితర సంస్థలకు సభ్యత్వం ఉంది. -
చంద్రబాబు ఇలాకలో ఫ్యాన్ హవా
-
ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే
చంద్రవంక వంటి వంతెన మీద నడక ఒకే వేగంతో ఉండదు. వంతెనకు ఈ చివర ఇల్లు. ఆ చివర ఆఫీస్. ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికీ వంతెన ప్రయాణం. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మహిళ అడుగులు వేస్తున్నప్పుడు.. ఎంత అలవాటైన ప్రయాణం అయినా ఏదో ఒక పరిస్థితిలో ఆఫీస్ ఉన్న వైపు నడక వేగం తగ్గుతుంది. అడుగులు ఇంటివైపు లాగుతుంటాయి! కెరీర్ ‘స్లో డవున్’ అయ్యే దశ అది! ‘నువ్వీ రోజు ఆఫీస్‌కి వెళ్లొదు, ‘నువ్వా క్యాంప్‌ను క్యాన్సిల్ చేసుకో’, ‘కొన్నాళ్లు సెలవు పెట్టొచ్చు కదా’.. అని ఇల్లు డిమాండ్ చేస్తుంది. వినకుంటే ఆదేశిస్తుంది. అప్పటికీ కాదంటే.. ఆర్యోగంపై, మనసుపై ఒత్తిడి తెస్తుంది. అప్పుడేం చేయాలి?! ‘‘ఏమాత్రం ఒత్తిడి తీసుకోకుండా.. స్లో డవున్ అవడమే మంచిది. ఆ స్లో డవునే ఆ తర్వాత మీ కెరీర్‌ని ‘స్పీడ్ అప్’ చేస్తుంది’’ అని నమ్మకంగా చెబుతున్నారు అశ్విని నందిని. అశ్విని ఎంత పెద్ద ఉద్యోగినో, అంతకన్నా పెద్ద బాధ్యతలు గల గృహిణి. అశ్విని గురించి చెప్పుకుంటున్నాం కనుక అశ్విని అంటున్నాం కానీ.. ఎంత సాధారణ ఉద్యోగం చేసే మహిళ నుంచైనా ఇల్లు అసాధారణ స్థాయిలోనే తన నిర్వహణ కోసం పట్టుబడుతుంది! ‘నువ్వు దగ్గర లేకుండా నేనెలా నడుస్తాను’ అని ఇల్లు ఏ మాత్రం దయ, జాలి, సానుభూతి, మొహమాటం లేకుండా అనేస్తుంది. అశ్విని నోయిడాలోని ‘గ్లోబల్‌లాజిక్ ఇండియా’ లోని డెలివరీ అస్యూరెన్స్ విభాగానికి అధిపతి. ఆ సంస్థ హెడ్ ఆఫీస్ కాలిఫోర్నియాలో ఉంది. ఉద్యోగం చేసే ఏ మహిళకైనా ఆమె చెప్పేదొక్కటే.. ‘మీరు సూపర్ ఉమన్‌లా ఇంట్లో, ఆఫీస్‌లో పడీ పడీ చేయడానికి ప్రయత్నించకండి. భుజంపై కావడి లా రెండిటినీ మోసుకుని వంతెన పై ఒక రోబోలా ప్రయాణించకండి..’’ అని. మల్టీ టాస్కింగ్ పట్ల ఆమెకు గొప్ప అభిప్రాయమేమీ లేదు. ఇంట్లో ముఖ్యమైన పని ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆప్పుడు ఆఫీస్‌కు రెండో స్థానం. ఇక ఆఫీస్‌లో చేసి తీరవలసిన పని ఉంటే ఆఫీస్ పనికే ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు ఇంటికి రెండో స్థానం’’ అని చెబుతారు అశ్విని. అలా కుదురుతుందా? ‘ఎందుకు కుదరదు?’ అని ఆమె ప్రశ్న. ఈ ప్రశ్న వేయగలిగినంత సమన్వయ బలాన్ని ఆమె ఇల్లు, ఆఫీసే ఆమెకు ఇచ్చాయి. 1980 లలో ఢిల్లీ యూనివర్సిటీలో మేథ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటికి వచ్చారు అశ్విని. తర్వాత ఏమిటి? అప్పట్లో డిగ్రీ చేసిన వారెవరికైనా మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకుంటే హాటెస్ట్ కోర్సు.. ‘ఎంసీఎ’. మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఆ కోర్సులో చేరాకే మొదటిసారి కంప్యూటర్ని చూశారు అశ్విని. కంప్యూటర్ని వేళ్లతో తాకడం కూడా అప్పుడే. ఆ క్షణంలోనే కంప్యూటర్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడి పోయింది. మేథ్స్ ఉపయోగించి సమస్యల్ని పరిష్కరించడం ఆమెకో ఆటలా ఉండేది. ఆ ఆటకు కంప్యూటర్ సాధనం అయింది. కోడ్స్ రాయడం, అల్గోరిథమ్స్ వృద్ధి చేయడం ఆమెకు ఇష్టమైన కఠిన వ్యాయామాలు. గ్లోబల్‌లాజిక్ ఇండియా డెలివరీ అస్యూరెన్స్ హెడ్‌గా ఇప్పుడు ఆమె చేస్తున్న పని అదే. అదొక టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ. కంపెనీలకు అవసరమైన ప్రోగ్రామింగ్‌లను రాసి, తన టీమ్ చేత రాయించి డెలివరీ చేయిస్తుంటారు. ‘ఇంటెరల్ ఐటీ’, ‘టాటా యునిసిస్’ వంటి పెద్ద సంస్థల్లో పని చేసి వచ్చాక 2007లో ఆమె గ్లోబల్‌లాజిక్‌లో చేరారు. ఇక ఇప్పుడు ఆమె ఆఫీస్ బయట చేస్తూ వస్తున్న ఉద్యోగం కూడా ఒకటి ఉంది. లైఫ్ కోచ్. ఉద్యోగం అంటే ఎవరి దగ్గరో లైఫ్ కోచ్‌గా చేయడం కాదు. తనే సొంతంగా ‘వంతెన మీద నడిచే’ గృహిణి కమ్ ఉద్యోగినులకు బ్యాలెన్సింగ్‌లో తర్ఫీదు ఇస్తుంటారు. ‘‘ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దానివైపు మొగ్గ చూపండి. నష్టమేం లేదు’’ అన్నది ఆమె తరచు చెబుతుండే పాఠం. లైఫ్ కోచ్‌గా ఆమె దగ్గరకు వస్తుండే వాళ్లంతా మల్టీ నేషనల్ కంపెనీలలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలే. వాళ్లంతా ఇంటికి, ఆఫీస్‌కి మధ్య చిక్కుకున్నవారు. అశ్విని లైఫ్ కోచ్ అవడానికి స్వీయానుభవాలే ప్రేరేపించాయి. ‘‘సమాజాన్ని మెరుగు పరిచినా, సామాజిక జీవన స్థితిగతుల్ని క్షీణింపజేసినా ఇల్లూ, ఆఫీసేనని ఆమె అభిప్రాయం. అంత ప్రాముఖ్యం గల రెండు వ్యవస్థల్ని సవ్యసాచిలా నడుపుతున్న మహిళలు.. సమానత్వాన్ని, సాధికారతను సాధిస్తూనే ఉన్నా వంపు వంతెనపై నడవడం వారికి పెద్ద సవాలుగా ఉంటుంది. నన్నే చూడండి. నా కూతురు పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు తనని దగ్గరుండి చదివించడానికి, తనకి కావలసినవి వేళకు అమర్చడానికి నేను ఉద్దేశపూర్వకంగా ఇంటì వేగాన్ని పెంచి, ఆఫీస్ వేగాన్ని తగ్గించుకున్నాను. అందువల్ల నా కెరీర్ కూడా కొంత దెబ్బతినింది. పట్టించుకోలేదు. ఆ తర్వాత నా ఆఫీస్ వేగాన్ని పెంచుకున్నాను’’ అని చెప్తారు ఇద్దరు పిల్లల తల్లి అయిన అశ్విని. ఆమెకు మరొక అనుభవం కూడా ఉంది. కెరీర్ ఆరంభంలో ఆఫీస్ తరఫున అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోవాలి. అప్పటికి ఆమె మొదటి బిడ్డ తల్లి. క్షణం కూడా ఆలోచించకుండా అమెరికా ఆఫర్‌ని కాదనేశారు. ‘‘వెళ్లొచ్చా అని అడగడం కాదు. వెళ్లాలో వద్దో మనకే తెలిసిపోవాలి’’ అంటారు అశ్విని. ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దాని వైపు మొగ్గు చూపండి. నష్టమేం లేదు. -
హీరోయిన్ అశ్విని శ్రీ లేటెస్ట్ ఫొటోస్
-
ఈసారైనా సాధించేనా!
గతేడాది విశ్వ విజేతగా అవతరించి అందరిచేతా శభాష్ అనిపించుకోవడంతోపాటు విమర్శకుల నోళ్లు మూయించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో తొలి టైటిల్ కోసం వేట మొదలు పెట్టనుంది. బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా 24 ఏళ్ల సింధు బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో మలేసియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో ఆడిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ఈ రెండు టోర్నీల తర్వాత దాదాపు 50 రోజుల విరామం లభించడంతో సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు పకడ్బందీగా సిద్ధమైంది. కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో పలువురు సహచర క్రీడాకారులు ఈ టోర్నీ నుంచి వైదొలిగినా సింధు మాత్రం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు సమాయత్తమయింది. సింధుతోపాటు మాజీ రన్నరప్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ ఈ మెగా టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బర్మింగ్‌హామ్: పద్దెనిమిదేళ్లుగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించాలనే తపనతో మరోసారి మనోళ్లు సమాయత్తమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధుతోపాటు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, లక్ష్య సేన్ సింగిల్స్ బరిలో ఉన్నారు. ముందుగా ఎంట్రీలు పంపించినా... కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఏడుగురు భారత ఆటగాళ్లు (సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ; డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు) ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే చాంపియన్స్‌గా నిలిచారు. ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) ఈ ఘనత వహించారు. 2001 తర్వాత 2015లో సైనా నెహ్వాల్ మాత్రమే ఒకసారి ఫైనల్‌కు చేరుకొని తుది మెట్టుపై తడబడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లోనే... 110వ సారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈసారి భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ బీవెన్ జాంగ్‌తో... ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గెలుపోటముల ముఖాముఖి రికార్డులో సింధు 5–4తో ఆధిక్యంలో ఉండగా... సైనా మాత్రం 2–8తో వెనుకబడి ఉంది. ఒకవేళ సింధు, సైనా తొలి రౌండ్ అడ్డంకి దాటినా తర్వాత రౌండ్లలో వీరిద్దరికి క్లిష్టమైన ప్రత్యర్థులే ఎదురుకానున్నారు. సింధు తొలి రౌండ్లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుంగ్ జీ హున్ (కొరియా) లేదా నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) ఎదురుపడతారు. ఇందులోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారాతో సింధు ఆడే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా) లేదా ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) సింధుకు ఎదురుకావొచ్చు. మరోవైపు సైనా తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాక తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... సెమీఫైనల్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా ఏడో సీడ్ హి బింగ్జియావో (చైనా) ప్రత్యర్థులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారైనా సింధు, సైనా అద్భుతం చేస్తారో లేదో వేచి చూడాలి. శ్రీకాంత్ గాడిలో పడేనా! కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తడబడుతోన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) ఎదురుకానున్నాడు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు టోర్నీలు ఆడగా మూడింటిలో తొలి రౌండ్లోనే ఓడిపోయి, మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన భమి డిపాటి సాయిప్రణీత్ తొలి రౌండ్లో జావో జున్‌పెంగ్ (చైనా)తో... లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో లక్ష్య సేన్... రుస్తావిటో (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడనున్నారు. మొత్తం 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) అందజేస్తారు. పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; దండు పూజ–సంజన సంతోష్ జోడీలు... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట బరిలో ఉన్నాయి. అశ్విని, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా, లక్ష్య సేన్ ►1900 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభమైన ఏడాది. తొలి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో మినహా మిగతా సంవత్సరాలలో ఈ టోర్నీ కొనసాగింది. ►2 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన దేశాల సంఖ్య. చైనా, డెన్మార్క్ ఆటగాళ్లు 20 సార్లు చొప్పున ఈ టోర్నీలో విజేతగా నిలిచారు. ►1 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలిచిన ప్లేయర్ రూడీ హర్తానో. ఇండోనేసియాకు చెందిన రూడీ హర్తానో ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు విజేతగా నిలువగా... 1968 నుంచి 1974 వరకు వరుసగా ఏడేళ్లు టైటిల్ గెలిచాడు. ►7 ఇప్పటివరకు సింధు ఏడుసార్లు ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడింది. 2018లో సెమీఫైనల్ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. 2017లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు నాలుగుసార్లు (2012, 2014, 2016, 2019) తొలి రౌండ్లో, ఒకసారి రెండో రౌండ్లో (2013) ఓడిపోయింది. ►14 ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా ఆడనుండటం ఇది వరుసగా 14వ ఏడాది. 2007 నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న సైనా ఒకసారి ఫైనల్, రెండుlసార్లు సెమీస్, ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. -
ప్రజానాడి తెలిసిన సర్పంచ్.. ఈ డాక్టరమ్మ
ప్రజలకు సేవ చేయాలనే తపన.. పుట్టిన ఊరికి ఏదో చేయాలనే ఆశ తనను డాక్టర్ వైపు అడుగులు వేయించాయి. అనుకున్న లక్ష్యంతో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు.ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా ధైర్యంగా బరిలోకి దిగారు. అతి పిన్న వయసులోనేఅశ్విని(22) సర్పంచ్‌గా గెలిచిఅందరి దృష్టిని ఆకర్షించారు. తమిళనాడు ,తిరువళ్లూరు: రోగుల నాడి పట్టడానికి ఎంబీబీఎస్ చదివిన తెలుగమ్మాయి.. ప్రజల సంక్షేమం కోసం ప్రజానాడి పట్టి సర్పంచ్‌గా భారీ మోజారిటీతో విజయం సాధించింది. తిరువళ్లూరు జిల్లా కొత్తగుమ్మిడిపూండికి చెందిన వ్యాపారి సుకుమారన్, రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్విని(22) ప్రాథమిక విద్యాభ్యాసాన్ని వేళమ్మాల్ పాఠశాలలో పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే సామాజిక సేవపై ఆసక్తిని కనబరిచే అశ్విని విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లో సైతం చురుగ్గా ఉండేది. ఆమె ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో వైద్యవిద్యను ఎంచుకుని నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్‌లో చేరారు. తెలంగాణా రాష్ట్రం మహబూబాబాద్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో గత ఏడాది ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థిపై 2,550 ఓట్ల భారీ మోజారిటీతో గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. చిన్న వయసులోనే సర్పంచ్‌గా మారిన డాక్టర్‌గా అభినందనలు అందుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకుప్రాధాన్యత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగుమ్మిడిపూండి సర్పంచ్‌గా విజయం సాధించిన డాక్టర్ అశ్వినీని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా తన మనోగతాన్ని పంచుకున్నారు. “నా సొంత గ్రామమైన కొత్తగుమ్మిడిపూండికి ఏదో చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. పంచాయతీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలోకి దిగాను. ప్రచారంలోకి వెళ్లిన నాకు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలోని సమస్యలను వివరిస్తూనే నాపై ఆదరణ చూపి భారీ మోజారీటితో గెలిపించారు. కొత్తగుమ్మిడిపూండిలో రాజకీయ ఉద్దండులను ఓడించి ప్రజలు నాకు ఈ పదవి కట్టబెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తాను. ఆదర్శ అధ్యక్షుడిగా పేరుతెచ్చుకోవడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా. ముఖ్యంగా గ్రామంలో రోడ్డు మరమ్మతులు, తాగునీటి సమస్య, రేషన్‌దుకాణంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలూ డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూస్తాను. ప్రజలకు సేవచేస్తూనే పీజీ పూర్తి చేస్తాను. గ్రామస్తులందరికీ ఉచిత వైద్య సేవలు అందిచడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–అశ్విని జంట
హాంకాంగ్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని ద్వయం 16–21, 21–19, 21–17తో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ నిపిత్పోన్ ఫువాంగ్ఫుపెట్–సావిత్రి అమిత్రపాయ్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్‌లో చివరి దశలో వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 18–21తో మూడో సీడ్ దెచాపోల్–సప్సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారమే జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తొలుత సౌరభ్ వర్మ 21–15, 21–19తో తనోంగ్సక్ సేన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)పై... అనంతరం 21–19, 21–19తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. శ్రీకాంత్ ముందంజ... మరోవైపు భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్‌తో తలపడాల్సిన టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో తొలి రౌండ్లో శ్రీకాంత్‌కు వాకోవర్ లభించింది. ఈ ఏడాది 10 సింగిల్స్ టైటిల్స్ గెలిచి ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన షట్లర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన మొమోటా... డిసెంబర్ 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు తగిన విశ్రాంతి ఉండాలనే ఉద్దేశంతో హాంకాంగ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. -
విజేత సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఈ ఏడాది రెండో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మ 21–13, 14–21, 21–16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు. మేలో సౌరభ్ వర్మ స్లొవేనియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. ‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పలు హోరాహోరీ మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకున్నాను. ఫైనల్లో తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్న దశలో ఏకాగ్రత కోల్పోయాను. తొందరగా మ్యాచ్‌ను ముగించాలనే ఉద్దేశంతో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ వ్యూహం మార్చి ప్రత్యర్థిపై పైచేయి సాధించాను’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సౌరభ్ వర్మ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 17–21, 17–21తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన సిక్కి–అశ్విని జోడీకి 2,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 4,680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
కథే హీరో
‘‘చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే మాలాంటి కొత్త నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది’’ అని నిర్మాత తన్నీరు విశ్వనాథ్ అన్నారు. ధ్రువ, అశ్విని జంటగా జైరాం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. తన్నీరు విశ్వనాథ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘నటుడు అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో నటించాను. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ నిర్మించాను. కొంతకాలం దర్శకత్వ శాఖలో కూడా పని చేశాను. ఇప్పుడు ‘యమ్ 6’ చిత్రం నిర్మించా. ఈ చిత్రానికి కథే హీరో. విజయ్ బాలాజీ మంచి సంగీతం అందించారు. నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. త్వరలో వివరాలు చెబుతా’’ అన్నారు. -
ఈ క్షణం.. ఓ హైలైట్
ధ్రువ, అశ్విని జంటగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించి, చిత్రబృందాన్ని అభినందించారు. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందించాం. ‘యమ్ 6’ అనే డిఫరెంట్ టైటిల్‌ని ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా చిత్రానికే హైలైట్‌గా నిలిచే ‘ఈ క్షణం...’ అనే మెలోడి సాంగ్‌ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ధ్రువ సర సన మిస్ బెంగళూరు అశ్విని హీరోయిన్గా నటించింది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి, ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్, రియాజ్, సహ నిర్మాత: సురేశ్. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. చిత్రనిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సినిమాపై ప్యాషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో నటించడంతో పాటు నిర్మించాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. నా తమ్ముడు ధ్రువని హీరోగా పరిచయం చేస్తూ ‘యమ్6’ చిత్రాన్ని నిర్మించాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... జైరాం వర్మ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్లో సంవత్సరానికి ఒక సినిమా నిర్మిస్తాం. త్వరలోనే నా డైరెక్షన్లో ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేశ్, సమర్పణ: స్టార్ యాక్టింగ్ స్టూడియో. -
సాత్విక్–అశ్విని జంట సంచలనం
చాంగ్జౌ (చైనా): అంతర్జాతీయ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జోడీ మరో సంచలనం సృష్టించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం ప్రపంచ 12వ ర్యాంక్ జోడీ లారెన్ స్మిత్–మార్కస్ ఇలిస్ (ఇంగ్లండ్)ను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 25వ ర్యాంక్ జంట సాత్విక్–అశ్విని 21–13, 20–22, 21–17తో ఈ ఏడాది గోల్డ్కోస్ట్కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన లారెస్ స్మిత్–మార్కస్ ఇలిస్ జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గతంలో ఈ జంటతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన భారత జోడీ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూడటం విశేషం. అయితే పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 19–21, 20–22తో గో వీ షెమ్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్పప్ప ద్వయం 10–21, 18–21తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. ప్రణయ్ పరాజయం పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21–9, 21–19తో రాస్ముస్ జెమ్కే (డెన్మార్క్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 12–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బుసానన్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు; సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; జెంగ్ సివె–హువాంగ్ యాకియోంగ్ (చైనా)లతో సాత్విక్–అశ్విని; మథియాస్ క్రిస్టియాన్సన్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; చెన్ హంగ్ లింగ్–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి తలపడతారు. ►ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
టీ.నగర్: ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరువొత్తియూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై తిరువొత్తియూరు, గోపినగర్‌కు చెందిన నటరాజన్ లారీ ట్రాన్స్‌పోర్టు నడుపుతున్నారు. ఇతని కుమార్తె అశ్విని (20) లా విద్యార్థిని. ఈమె కొన్నేళ్లుగా వేదారణ్యం శెట్టిపురానికి చెందిన తెన్నవన్‌ను ప్రేమిస్తోంది. గత మే 3వ తేదీ నటరాజన్ కుటుంబీకులు బంధువుల ఇంటి శుభకార్యంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లారు. వారితో అశ్విని వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా గడిపింది. ఆ సమయంలో తెన్నవన్ ఓ రోజు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తెన్నవన్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీనిపై తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రియుడు మృతిచెందడంతో అశ్విని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో తిరువొత్తియూరు శివశక్తినగర్‌లోని పెదనాన్న ఇంట్లో మూడు నెలలుగా అశ్విని ఉంటోంది. శుక్రవారం రాత్రి అశ్విని పెదనాన్న, కుటుంబీకులు బయటికి వెళ్లిన సమయంలో అశ్విని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సాతాన్‌గాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ధ్రువ హీరోగా, శ్రావణి, అశ్విని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘యమ్6’. జైరామ్ దర్శకత్వంలో స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో విశ్వనాథ్ తన్నీరు, సురేశ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులోని ‘ఈ క్షణం..’ అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో సస్పెన్స్‌తో పాటు కామెడీ, యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. చక్కని ఫొటోగ్రఫీ, వీనుల విందైన సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు జైరామ్. ‘‘ఇది నా తొలి చిత్రం. ఓ మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటాను’’ అన్నారు ధ్రువ. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్ రియాజ్. -
‘దేశముదుర్స్’ మూవీ స్టిల్స్
-
ఇద్దరూ 420 గాళ్లే
పోసాని కృష్ణమురళి, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ, అర్జున్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దేశముదుర్స్’. ‘ఇద్దరూ 420 గాళ్లే’ అన్నది ఉపశీర్షిక. కన్మణి దర్శకత్వంలో కుమార్ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కన్మణి మాట్లాడుతూ –‘‘పోసాని, పృథ్వీగారు ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి వచ్చిన సినిమా ఇది. వాళ్లిద్దరూ తెరపై కాసేపు కనిపిస్తేనే నవ్వుకుంటాం. అలాంటిది సినిమా అంతా నవ్విస్తే ఇంకెన్ని నవ్వులు పువ్వులు పూస్తాయో చెప్పాల్సిన పనిలేదు. కథకు హారర్ టచ్ కూడా ఇచ్చాం. అర్జున్ మంచి పెర్ఫార్మర్’’ అన్నారు. ‘‘కన్మణి మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే రెండో వారంలో లేదా మూడోవారంలో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత కుమార్. సంగీత దర్శకుడు యాజమాన్య, మాటల రచయిత భవానీ ప్రసాద్, పాటల రచయిత రాంబాబు, ఛాయాగ్రాహకుడు అడుసుమిల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పులిగుండ్ల సతీష్ కుమార్, వద్దినేని మాల్యాద్రి. -
దారుణం.. కళాశాల ఎదుటే విద్యార్థిని హత్య
-
ఆగ్రహంతో ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం..
ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి కాస్తా పెద్దవయ్యాయి. భార్య పిల్లలను పుట్టింట్లో వదిలేసేటంతగా అవి పెరిగాయి. దీంతో భార్య మానసికంగా కుంగిపోయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది. వారితో సహా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో చిన్నారులిద్దరూ చనిపోగా.. తల్లిని మాత్రం స్థానికులు రక్షించారు. ఆవేశంలో.. ఆగ్రహంతో ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం.. ఆ చిన్నారులను బలితీసుకుంది. కోరుకొండలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన పలువురిని కలచివేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోరుకొండ (రాజానగరం): గ్రామానికి చెందిన అశ్వినికి రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిత్యశర్వాణి(3), జయదేవ్ విక్రమ్(ఆరు నెలల బాబు) ఉన్నారు. కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి. 20 రోజుల క్రితం నాగిరెడ్డి శ్రీనివాస్, అశ్విని, పిల్లలతో సహా యానాంలో బంధువుల ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ కోరుకొండకు అశ్వినితో పాటు ఇద్దరు పిల్లలను ఆమె పుట్టింటికి తీసుకువచ్చి, వదిలి వెళ్లిపోయాడు. దీంతో అశ్విని మానసికంగా బాధపడుతూ చనిపోవాలనుకుంది. తాను చనిపోతే ఇద్దరు పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉన్న బావిలో ఆదివారం అర్ధరాత్రి దూకింది. దీంతో ఇద్దరు చిన్నారులు చనిపోగా, అశ్వినిని మాత్రం చుట్టుపక్కల వారు రక్షించారు. అయితే చిన్నారులను కోరుకొండ శ్మశానంలో పూడ్చివేశారు. చివరకు కోరుకొండ వీఆర్ఓ యు.సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్త శ్రీనివాస్, అత్తగారు వేధించేవారని కుటుంబ సభ్యులు తెలిపారని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం కోరుకొండ తహసీల్దార్, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో పూడ్చివేసిన బాలిక, బాలుడి శవాలను వెలికితీస్తామని డీఎస్పీ తెలిపారు. భర్త, అత్త వేధింపుల వల్లే.. భర్త శ్రీనివాస్, ఆమె అత్త వేధింపుల వల్లే నాగిరెడ్డి ఆశ్విని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కోరుకొండ డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు, సీఐ ఎన్. మధుసుధనరావు, ఎస్ఐ రావూరి మురళీమోహన్ నాగిరెడ్డి ఆశ్విని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. శ్మశానం వద్దకు వెళ్లి పూడ్చివేసిన బాలుడు, బాలిక ప్రదేశాన్ని పరిశీలించారు. -
చోరీకి వచ్చి చంపేశారు..
-
చోరీకి వచ్చి చంపేశారు..
చౌటుప్పల్: ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగులు బాలికను హతమార్చారు. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలమాకులు మల్లయ్య, పద్మ దంపతులకు కుమార్తె అశ్విని (16), కుమారుడు కిరణ్ సంతానం. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా తమ్ముడు మిత్రులతో ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా, సూట్‌కేసును పగులగొట్టారు. ఇతర సామగ్రిని చిందర వందరగా పడేశారు. వారిని అశ్విని ప్రతిఘటించటంతో ఆమెను చంపాలనుకున్నారు. అక్కడే గుళికల మందు ప్యాకెట్‌ను గుర్తించారు. నీటిలో కలిపి బాలికకు తాగించి ఇంటి తలుపులు వేసి వెళ్లిపోయారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్–అశ్విని జంట
సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్–అశ్విని జంట 21–13, 21–14తో జూహీ దేవాంగన్–వెంకట్ గౌరవ్ ప్రసాద్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లోనే హైదరాబాద్‌కు చెందిన రంకీరెడ్డి సాత్విక్ సాయిరాజ్–మనీషా జంట మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్–మనీషా జోడీ 21–9, 21–12తో ఆండ్రూ యునాంతో–సుప్రియాది పుత్రి (ఇండోనేసియా) ద్వయంపై నెగ్గగా... రెండో రౌండ్లో 21–18, 14–21, 21–11తో నందగోపాల్–మహిమా (భారత్) జంటను ఓడించింది. మెయిన్ ‘డ్రా’కు సౌరభ్ వర్మ మరోవైపు జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సౌరభ్ వర్మ 21–13, 23–21తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై, రెండో రౌండ్లో 27–29, 21–18, 21–18తో పనావిత్ తోంగ్‌నువామ్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఒకుహారా (జపాన్)తో పీవీ సింధు; సు యా చింగ్ (చైనీస్ తైపీ)తో రితూపర్ణ దాస్... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎమిల్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్; హు యున్ (హాంకాంగ్)తో సమీర్; జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో సౌరభ్; షి యుచి (చైనా)తో జయరామ్; నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్ ఆడతారు. -
అమీర్‌పేట జీవితాలతో...
హైదరాబాద్‌లో అమీర్‌పేట అంటే తెలియనివారు ఉండరు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి. ఆ నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అమీర్‌పేటలో’. శ్రీ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై యామిని బ్రదర్స్ సమర్పణలో మహేశ్ మందలపు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ-‘‘అమీర్‌పేట అంటే మనకు ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. అక్కడి జీవితాలను చూపిస్తూనే, మంచి కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. వినోదంతో పాటు భావోద్వేగ అంశాలు ఉన్నాయి. కుటుంబం మొత్తం కలిసి చూసేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం శ్రీ ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఈ చిత్రం నిర్మాణంలో వంశీ, శ్రీకాంత్, ప్రవీణ్‌ల సహకారం మరచిపోలేను’’ అని నిర్మాత చెప్పారు. అశ్విని, సహ నిర్మాత యామిని వంశీకృష్ణ, సంగీత దర్శకుడు మురళి తదితరులు పాల్గొన్నారు. -
రన్నరప్ సిక్కి-అశ్విని జంట
కార్డిఫ్: వేల్స్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కి-అశ్విని జోడీ 16-21, 11-21తో టాప్ సీడ్ ఓల్గా మొరోజోవా-అనస్తాసియా చెర్వికోవా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
విడిపోయిన జ్వాల-అశ్విని జోడీ
పొన్నప్పకు జతగా సిక్కిరెడ్డి న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో విజయవంతమైన మహిళల జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప విడిపోయింది. ఇద్దరి మధ్య సమన్వయలోపం పెరగడం... ఆశించిన ఫలితాలు కూడా రాకపోవడం... తదితర కారణాలతో స్నేహపూరిత వాతావరణంలో, పరస్పర అంగీకారంతో ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 33 ఏళ్ల జ్వాల ఇక నుంచి కేవలం మిక్స్డ్ డబుల్స్‌కే పరిమితం కానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మనూ అత్రితో కలిసి జ్వాల మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనుంది. మరోవైపు అశ్విని పొన్నప్ప మాత్రం మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డితో... మిక్స్డ్ డబుల్స్‌లో నందగోపాల్‌తో కలిసి టోర్నీల్లో పాల్గొంటుంది. రియో ఒలింపిక్స్ కంటే ముందుగానే తామీ నిర్ణయం తీసుకున్నామని జ్వాల, అశ్విని వివరించారు. -
అమీర్‌పేటలో...
శ్రీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘అమీర్‌పేటలో’. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై మహేశ్ నిర్మించిన ఈ చిత్రం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ -‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన నేను అమీర్‌పేటలోని పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్టోరీ రాసుకున్నా. దాన్నే తెరమీద ఆవిష్కరించాం. టైటిల్, పోస్టర్, టీజర్, పాటల విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఈ చిత్రం ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు. ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళుతున్నాం’’ అని చెప్పారు. ‘‘మురళి స్వరపరచిన పాటలు ఓ హైలైట్‌గా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిన చిత్రమిది. మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రం చిన్న చిత్రాల్లో ఓ టార్గెట్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత చెప్పారు. -
హోలీపండుగలో నీటిని వృధా చేయొద్దు!
థానెః ముంబై మెట్రోపాలిటన్ డివిజన్ లోని థానే ప్రజలు నీరు అనవసరంగా వృధా చేయవద్దని స్థానిక కలెక్టర్ అశ్విని జోషి పిలుపునిచ్చారు. భారత సంప్రదాయ పండుగల్లో ఒకటైన హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలోఆమె ప్రజలకు నీటిని వృధా చేయవద్దని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా జనం వారంపాటు జరుపుకునే అనేక సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా రైన్ డ్యాన్స్ లు వంటివి చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందని, అటువంటి వాటితో నీరు భారీగా వృధా అయ్యే అవకాశం ఉందని థానె కలెక్టర్ అశ్విని జోషి అన్నారు. జిల్లాలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, నీటి వృధాని అరికట్టడంలో భాగంగా జలపూజలు చేపట్టి జలజాగృతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవగాహన పెంచుకొని వృధాని అరికట్టాలని కోరారు. ముఖ్యంగా స్థానిక హౌసింగ్ సొసైటీలు, గృహ సముదాయాలు వాటర్ హార్వెస్టింగ్, రైసైక్లింగ్ పథకాలను ఆచరణలో పెట్టి , నీటి నిల్వలు పెంచేందుకు తోడ్పడాలని, అటువంటి ప్రాజెక్టులను జిల్లా ప్లానింగ్ కమిటి ముందుంచాలని జోషి కోరారు. జిల్లా షాపూర్ తాలూకాలోని ఆనకట్టలు, నదులు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని జోషి పేర్కొన్నారు. జిల్లాలోని ఆరు నదుల్లోని నీటితో కలెక్టర్ జలపూజ కార్యక్రమాన్ని చేపట్టి, దీంతోపాటు జలరథ్ యాత్రను కూడ ప్రారంభించారు. యాత్రలో భాగంగా అన్ని తాలూకాల్లో ప్రజలకు నీటివృధా అరికట్టడంతోపాటు, వాడకంలో జాగ్రత్తలపై అవగాహన పెంచనున్నారు. -
‘టాప్’లో ఉండే అర్హత లేదా?
మమ్మల్ని ప్రోత్సహించేది ఎవరు? క్రీడా శాఖపై జ్వాల విమర్శ న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)... ఒలింపిక్స్‌లో పతకాలకు అవకాశమున్న క్రీడల నుంచి ఆయా క్రీడాకారులను ఎంపిక చేసి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఇది. అయితే బ్యాడ్మింటన్‌లో ఈ స్కీమ్ కింద ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాపై డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఎంపిక చేసిన జాబితాలో సైనా, కశ్యప్, శ్రీకాంత్, సింధు, ప్రణయ్, గురుసాయిదత్ ఉన్నట్లు సమాచారం. డబుల్స్‌లో తాను, అశ్విని అగ్రస్థానంలో ఉన్నా ‘టాప్’లో పేర్లు లేకపోవడం దారుణమని జ్వాల పేర్కొంది. ‘నాకు, అశ్వినికి ఇప్పటిదాకా భారత ప్రభుత్వం మద్దతు మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కూడా లేకపోతే ఎలా? ఆ జాబితాలో ఉన్న వారికి ఇప్పటికే కార్పొరేట్స్ మద్దతు ఉంది. మాకు గుర్తింపు రావాలంటే ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటు బ్యాడ్మింటన్ సంఘంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం కూడా నిరుత్సాహపరచడం భావ్యం కాదు. ప్రస్తుతం మేం ప్రపంచ స్థాయిలో 19వ ర్యాంకులో ఉన్నాం. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది’ అని జ్వాల వివరించింది. ‘టాప్’లో తమకు చోటు కల్పించి ప్రోత్సహించాల్సిందిగా జ్వాల, అశ్విని కేంద్రానికి లేఖ రాశారు. -
అశ్విని అక్క
షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు బెంగళూరులోని కోనన్‌కుంటె ప్రాంతంలో ఉన్న ఆ బడిలోకి అడుగుపెట్టగానే విరబూసిన పువ్వుల్లాంటి చిన్నారుల నవ్వులు మనల్ని పలకరిస్తాయి. ఇక వారంతా ఎంతో ప్రేమగా పిలుచుకునే ‘అశ్విని అక్క’ అక్కడికి వచ్చిందంటే ఒకరు చేసిన అల్లరి గురించి మరొకరు చెప్పే ఫిర్యాదులూ వినవచ్చు. అయితే వారిని కంటి పాపల్లా చూసుకుంటున్న ఆ అశ్విని అక్క (25) కూడా అంధురాలే కావడం విశేషం. అంతేకాదు, అంధులైన బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో శ్రమించినందుకు గాను ఐక్యరాజ్య సమితి నుండి ఆమె ‘యూత్ కరేజ్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్’ ను అందుకున్నారు. అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు. అంధులైన చిన్నారులకు అసరా అవ్వాలన్న పట్టుదలతో తన ఇంటినే ఓ పాఠశాలగా మార్చేశారు. ఆ పాఠశాలకు ‘బెళకు’(వెలుగు) అకాడమీగా నామకరణం చేసి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్, వేదవతిల ముగ్గురు పిల్లల్లో రెండవ సంతానం అశ్విని. అశ్వినికి చూపు లేదని తెలిసిన క్షణంలో ఆమె తల్లిదండ్రులు కుంగిపోయారు. ఆ తరువాత తేరుకొని ఆమెకు కూడా ఉన్నత చదువులను చేరువ చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. పదో తరగతి వరకు బెంగళూరులోని రమణ మహర్షి ఆశ్రమంలో చదివించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు మాత్రం ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చింది. బ్రెయిలీకి సంబంధించిన విద్యా విధానాలు కళాశాలల్లో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు అశ్విని. అయినా ఏ మాత్రం పట్టు వదలకుండా డిగ్రీ పూర్తి చేశారు అశ్విని. ఆ తరువాత కంప్యూటర్ కోర్సులు చేశారు. ఆమె ప్రతిభకు ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు అశ్విని. తన చదువు పూర్తయిన తరువాత తనలాంటి వారికోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతోనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. తర్వాత, ప్రత్యేక సామర్థ్యం గల వారి హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న ‘లియోనార్డ్ ఛెసైర్ డిసెబిలిటీ’(ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది) సంస్థలో 2011 జూలైలో ఒక సాధారణ వాలంటీర్‌గా చే రారు. కొద్ది కాలంలోనే వాలంటీర్ స్థాయి నుండి నేషనల్ ఫెసిలిటేటర్‌గా ఎదిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడున్న విభిన్న ప్రతిభావంతులను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేశారు. ఫలితమే 2013లో ‘యూత్ కరేజ్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్’. స్వయంగా తెలుసుకొని... లియోనార్డ్ ఛెసైర్ డిసెబిలిటీ సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తున్న సమయంలో కర్ణాటకలోని ఎన్నో మారుమూల గ్రామాలను అశ్విని సందర్శించారు. వైకల్యంతో పాటు ప్రతిభా (స్పెషల్లీ ఏబుల్డ్) ఉన్న చిన్నారులకు విద్యను చేరువ చేయడానికి ఉన్న ఇబ్బందులేమిటో ఇదే సందర్భంలో ఆమె తెలుసుకున్నారు. అలాంటి చిన్నారులకు ఆశ్రయం ఇచ్చేందుకు తానే ఓ ఫౌండేషన్‌ను స్థాపించాలని భావించారు. తన ఆలోచనలను ఆచరణలోకి మారుస్తూ బెంగుళూరులో ‘అశ్వని అంగడి ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘బెళకు’(వెలుగు) అకాడమీ పేరిట ఓ ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అకాడమీలో పది మంది అంధ చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఇల్లే అకాడమీ! విశేషమేమిటంటే అశ్విని సొంత ఇంటినే పాఠశాలగా మార్చేసి ‘బెళకు’ అకాడమీని ఏర్పాటు చేయడం. అశ్విని తల్లిదండ్రులు అద్దె ఇంటిలో నివసిస్తుండగా అశ్విని మాత్రం పాఠశాలలోని చిన్నారులతో అక్కడే ఉంటున్నారు. ఇలా ఎందుకని ప్రశ్నిస్తే...‘పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనైతే వచ్చింది కానీ, పాఠశాల ఏర్పాటు కోసం భవనాన్ని సమకూర్చుకోవడానికి చాలా ఖర్చవుతుంది కదా! అంత మొత్తం నా దగ్గర లేదు. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ‘ఆ పాఠశాలను మన ఇంట్లోనే ప్రారంభించు, మేమే వేరే ఇల్లు అద్దెకు తీసుకుంటాం’ అని ప్రోత్సహించారు. ఇక నా తల్లిదండ్రులతో కాకుండా ఈ చిన్నారులతోనే ఎందుకు ఉంటున్నానంటే... అభం, శుభం తెలియని ఈ చిన్నారులు నేనే వారికి అన్నీ అని భావించి తల్లిదండ్రులను వదిలి పెట్టి ఎక్కడి నుండో ఈ అకాడమీకి వచ్చారు. అలాంటి వారిని ఇక్కడ వదిలిపెట్టి ఏదో కొన్ని గంటలు మాత్రమే అకాడమీకి వచ్చి వెళ్లిపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అందుకే నేను వీరితోనే ఉండిపోయాను’ అని చెబుతారు అశ్విని. కేవలం అంధ బాలలకు మాత్రమే కాక విభిన్న ప్రతిభావంతులైన (స్పెషల్లీ ఏబుల్డ్) వారికి సైతం అకాడమీ ద్వారా శిక్షణ ఇప్పించాలని అశ్విని భావిస్తున్నారు. ఇందుకోసం దాతల సాయాన్ని కోరే అలోచనలో ఉన్నారు. అశ్విని తనకు వచ్చే పెన్షన్‌ను కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన చిన్నారులకు అందజేసేది. ఉద్యోగాన్ని వద్దనుకున్న సందర్భంలో... తన కోసం తాను బతకడం కన్నా తనలాంటి నలుగురికి ఆదరువుగా నిలవడంలోనే తృప్తి ఉందని అశ్విని మాకు నచ్చజెప్పింది. భవిష్యత్తులో అశ్విని తీసుకునే ఏ నిర్ణయానికైనా మా మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయి. - అశ్విని తల్లిదండ్రులు ‘అక్క’ దిద్దిస్తోంది మా అశ్విని అక్క నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఎన్నో పద్యాలు చెప్పింది. అంతేకాదు నాకు ఎంచక్కా అక్షరాలు దిద్దిస్తుంది. అంకెలు నేర్పిస్తోంది. అందుకే నాకు అక్కంటే చాలా ఇష్టం. నేను కూడా అక్కలాగే చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తా. - చిన్నారి తనుశ్రీ -
వినోదం... సందేశం!
విజయ్‌భరత్, అశ్విని, కాంచన ముఖ్య తారలుగా ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నా మనసుకేమైంది, వాడే కావాలి, వేచి ఉంటా చిత్రాల దర్శకుడు వై.ఎ.శ్రీరామ్మూర్తి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మిస్తున్నామని, కథానుసారం బ్యాంకాక్‌లో 30 రోజులు షూటింగ్ చేయనున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సహకారం: ప్రదీప్‌కుమార్ సింగ్. -
అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల అభినందనలు
హైదరాబాద్: హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సత్తారు అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల సంఘం అభినందనలు తెలిపింది. అభినందనలు తెలిపిన వారిలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి సాబిర్ ఆలీ, వనజ, డా.ఎ.శిరీష్‌లు ఉన్నారు. మూడున్నరేళ్లు పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేసిన శ్రీకర్‌రెడ్డి జెనీవాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రానికి బదిలీ అయిన విషయం విదితమే. -
ఇద్దరిని పొట్టనబెట్టుకున్న అనుమానం
వేర్వేరు ఘటనల్లో మహిళల దారుణహత్య రోకలిబండతో ఒకరు..గొడ్డెలితో నరికి మరొకరు..బొల్లారం, అండూర్ గ్రామాల్లో ఘటనలు జిన్నారం : జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు హ త్యకు గురయ్యారు. వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారన్న అనుమానంతో భర్తలు అంత్యంత పాశవికంగా భార్యల ను హత్య చేశారు. ఈ సంఘటనలు శుక్రవారం మండలంలో సంచలనం రేపా యి. వివరాలు ఇలా ఉన్నాయి. రేగోడు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెం దిన సంగమేశ్వర్‌కు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన అశ్విని (22)తో రెండేళ్ల క్రితం వివాహం జరి గింది. అయితే ఏడాది క్రితం ఎల్లారెడ్డి దంపతులు బతుకుదెరువు నిమిత్తం జిన్నారం మండలం బొల్లారం గ్రామానికి వలస వచ్చి ఇక్కడి కేబీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండ గా.. భార్య అశ్విని వివాహేతర సంబం ధం కలిగి ఉందని అనుమానంతో భర్త సంగమేశ్వర్ తరచూ వేధించేవాడు. ఇదే విషయమై శుక్రవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగిం ది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సంగమేశ్వర్ భార్య అశ్విని తలపై రోకలి బండతో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. బొల్లారం ఎస్ఐ ప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని సంగమేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నా రు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఆయన వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వివరించారు. అండూర్‌లో మరో వివాహిత వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన సంఘటన మండలంలోని అండూర్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. జిన్నారం ఎస్ఐ పాలవెల్లి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు మండలం చిన్నకంజర్ల గ్రామానికి చెందిన సాయిలు, సిరిమని శోభ (35) దంపతులు కొంత కాలంగా మండలంలోని అండూర్ గ్రామానికి వలస వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి తేజ, లిఖిత ఇద్దరు సంతానం ఉన్నారు. ఇదిలా ఉండగా.. భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోందని అనుమానిస్తూ తరచూ సాయిలు భార్య శోభను వేధించేవాడు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్త సాయిలు ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో అనుమానం పెనుభూతమైంది. దీంతో ఇంట్లోకి వచ్చిన సాయిలు భార్య శోభ తలపై గొడ్డలితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డాగ్, క్లూస్ టీంలు వివరాలను సేకరించారు. ఈ ఘటన అనంతరం సాయిలును అదుపులోకి తీసుకుని మృతురాలి అన్న వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వంశీ చిత్రంలా..!
కౌశిక్‌బాబు, హరీష్, అశ్విని, మిత్ర ముఖ్య తారలుగా వై.ఎల్. భాస్కరరాజు నిర్మిస్తున్న చిత్రం ‘తొలి సంధ్య వేళలో’. డి. మోహన్ దీక్షిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ - ‘‘వంశీ, మెహర్ రమేష్గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ వంశీగారి చిత్రాల తరహాలో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాకి కథే బలం. ఓ అందమైన కవితలాంటి సినిమా ఇది. తూర్చు గోదావరి జిల్లాలోని ఇప్పటివరకు ఎవరూ షూటింగ్ చేయని ప్రదేశాల్లో చేశాం. మరో ఆరు రోజులు జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. పాటలను, సినిమాను త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘కృష్ణంరాజుగారి ‘రంగూన్ రౌడీ’లోని ‘ఓ జాబిలి...’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాం’’ అని కౌశిక్ తెలిపారు. -
జ్వాల 'బ్రెయిన్'.. అశ్విని 'మెషిన్'
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్పప్పపై ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ టూ షట్లర్లు క్రిస్టినా పెడెర్సన్, కెమిల్లా రైటర్ ప్రశంసల వర్షం కురింపించారు. ఆటలో జ్వాల 'బ్రెయిన్' అయితే అశ్విని 'మెషిన్' అని అభివర్ణించారు. 'ఆటను అర్థం చేసుకోవడంలో జ్వాల మేటి. అశ్వినితో కలసి ఆమె కొన్ని ఉత్తమ ఫలితాలు సాధించింది. జ్వాల ఆటతీరును వెంటనే అర్థం చేసుకుంటుంది. అశ్విని ఓ యంత్రంలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అందువల్లే డబుల్స్‌లో వీరు ఉత్తమ జోడీ కాగలిగారు' కెమిల్లా చెప్పింది. హైదరాబాద్‌లో 2009లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కెమిల్లా థామస్ లేబోర్న్తో కలసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో కెమిల్లా, క్రిస్టినా నెంబర్ వన్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. జ్వాల, అశ్విని జోడీ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని, అయితే ఆటలో ఎత్తుపల్లాలు సాధారణమేనని కెమిల్లా చెప్పింది. -
పల్లెటూళ్లో ప్రణయం
‘‘పల్లెటూరి ప్రేమకథలు వచ్చి చాలా ఏళ్లయ్యింది. ఆ లోటుని తీర్చే సినిమా ఇది’’ అని దర్శకుడు డి.మోహన్ దీక్షిత్ చెప్పారు. కౌషిక్‌బాబు, హరీష్, అశ్విని హీరో హీరోయిన్లుగా శ్రీ జాగృతి ఫిలింస్ పతాకంపై వైఎల్ భాస్కరరాజు నిర్మిస్తున్న చిత్రం ‘తొలి సంధ్య వేళలో’. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 90 శాతం చిత్రీకరణ జరిపారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి కథే బలం. కౌషిక్‌బాబు లవర్‌బోయ్‌గా కనిపించబోతున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరుకి అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షి భుజింగ్, కెమెరా: పి.ఆర్.పి. రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డి. దిలీప్‌కుమార్. -
కలంశారి
కలంశారి... అచ్చుతప్పుకాదు అచ్చమైన ‘చేనేత’లివి... కళ అనే సిరాతో కలం గీసిన చీరలివి... ఏభైఏళ్ల వస్త్రవైభవానికి చిరునామాలివి... కలంకారి చీరలు కలలనారికి వరాలు... ‘కలం’ అంటే పెన్ను అని అర్థం. కలం చేత రంగులు అద్దేవాడు కళాకారుడు. వెదురు పుల్లను తీసుకొని, దానిని చివర సన్నగా చెక్కి, మధ్యలో ఉలెన్ దారాన్ని చుడతారు. దీని ద్వారా సహజమైన రంగులు తీసుకుంటూ, వస్త్రంపై చిత్రీకరిస్తారు. తమిళనాడులో పుట్టిన ఈ ప్రాచీన సంప్రదాయ కళ మన రాష్ట్రంలో శ్రీకాళహస్తి, మచిలీపట్నంలలో విలసిల్లుతోంది. 1- ఎరుపు-తెలుపు మేళవింపుతో లంగాఓణీని తీర్చిదిద్ది, అంచులకు కలంకారి డిజైన్‌ను జత చేర్చడంతో పదహారణాల తెలుగమ్మాయి రూపం మరింత కళగా కనిపిస్తోంది. 2- పూర్తి కలంకారి డిజైన్‌ను నింపుకున్న టస్సర్ చీర ఇది. పువ్వులు, లతలు, పక్షులు, లేళ్లు, నృత్యకారిణుల డిజైన్‌తో ఆకట్టుకుంటుంది ఈ చీర. 3- వంగపండు రంగు ఉప్పాడ పట్టు చీరకు కలంకారి డిజైన్ గల పెద్ద అంచు, చీర కొంగు ఆక ర్షణీయంగా మారాయి. 4- ఎరుపురంగు చందేరి చీరకు ఓణీ భాగం పూర్తిగా కలంకారి దుపట్టాతో జతచేయడంతో రూపం ఆధునికంగా మారింది. 5-పసుపు రంగు కోటా చీరపై రాధాకృష్ణుల కలంకారి డిజైన్‌తో చేసిన ప్యాచ్‌వర్క్ అందంగా రూపుకట్టింది. మోడల్: అశ్విని ఫొటోల: ఎస్.ఎస్.ఠాకూర్ - కిరణ్ కుమార్ మణి, కలంకారి దుస్తుల డిజైనర్, హైదరాబాద్ www.facebook.com/jayanth.kalamkari -
చలించని సంప్రదాయం
ఆధునికత... ఎన్ని మెలికలైనా తిరుగుతుంది. సంప్రదాయం... చిన్న ట్విస్టుకే సిగ్గుల మొగ్గవుతుంది. ఎలా మరి? ‘ఆహ్వానం’ అంటూ పెళ్లి పిలుపులు. ‘ఆగండి’ అంటూ చలి బెదిరింపులు! చీర - లంగాఓణీ - లెహంగా - సల్వార్ కమీజ్... ఇవన్నీ... ట్రెడిషనలే కానీ, చలిని తట్టుకోడానికి అడిషనల్ కాదు. ఎలా మరి? ఓ పని చేద్దాం. పైటని శాలువాతో డిజైన్ చేయిద్దాం. బ్లవుజ్‌కి స్వెటర్ స్లీవ్స్ జత చేద్దాం. కమీజ్‌కు రా సిల్క్ కోట్ తొడుగుదాం. లంగాఓణీకి ఆల్టర్ నెక్ అల్లేద్దాం. అప్పుడిక సంప్రదాయం సంప్రదాయమే. వణికించే చలిలోనైనా... వేడుకకు వెళ్లిరావడమే. 1- లేత, ముదురు ఆకుపచ్చల కాంబినేషన్‌తో రూపొందించిన లంగా ఓణీ. రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఆల్టర్నెక్ ఓవర్‌కోట్ వేయడంతో ఆధునికంగా కనిపిస్తోంది. ఓవర్‌కోట్ అంచును ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేశారు. 2- రెడ్ సల్వార్ కమీజ్‌కు రా సిల్క్ వెల్వెట్‌తో క్విల్ట్ చేసి ఓవర్ కోట్గా జతచేశారు. దీంతో చలిని తట్టుకునేలా ఛాతి భాగం వెచ్చగా ఉంటుంది. 3- ముదురు గులాబీ రంగు లెహంగాకు అదే రంగు శాలువాతో ఓణీని డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్ చేసిన మల్టీకలర్ బార్డర్‌ను జత చేశారు. బ్రొకేడ్ బ్లౌజ్‌కు స్వెటర్ స్లీవ్స్ జత చేశారు. లేదంటే శాలువా ఫ్యాబ్రిక్‌ను కట్ చేసి స్లీవ్స్‌గా వేసుకోవచ్చు. 4- లేత గులాబీ, నలుపు రంగుల కాంబినేషన్‌తో డిజైన్ చేసిన లంగాఓణి చీర ఇది. పైట భాగాన్ని శాలువాతో డిజైన్ చేసి, బార్డర్ని మల్టీకలర్ థ్రెడ్‌వర్క్‌తో రూపొందించారు. మోడల్స్: కావ్య, అశ్విని, సోనాలి మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com ఫొటోలు: శివ మల్లాల -
అత్తయ్య ఐతేనేం?కత్తుల రత్తయ్య ఐతేనేం?
రెక్కలు టపటపలాడించడానికి.. రివ్వున ఎగిరిపోడానికీ... కాలం కాదిది. చలి ఎలా ఉందో చూశారు కదా! కత్తుల రత్తయ్యలా తిరుగుతోంది. కొత్త కోడలి అత్తగారిలా వణికిస్తోంది. బయటికి బయల్దేరినవారెవరైనా... నిండా స్వెటర్ కప్పుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని భుజాలను దగ్గరకు బిగించుకుని ‘కృష్ణా, రామా...’ అనుకుంటూ వెళ్లిన దారినే వచ్చేయడం క్షేమకరం. కానీ మగువలు ఊరుకుంటారా! చలి గాలులకు జడిసి నిలబడిపోతారా?! చలి కోట్ల కింద అందమైన డ్రెస్‌లను దాచేసుకుని వేడుకలను వెలవెలబోనిస్తారా! నో... వే..! ఊలుతోనే సల్వార్ కమీజ్‌లు, ఊలుతోనే లెగ్గింగ్స్ డిజైన్ చేయించుకుని... వింటర్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు! మీరూ ఫాలో అవండి! అదే బెస్ట్. ఆల్ ది బెస్ట్. 1- లక్నో వర్క్ చేసిన జ్యూట్, కాటన్ మెటీరియల్‌తో తయారు చేసిన బ్లేజర్ చలిని ఆపుతుంది. దీనికి ఇన్నర్‌గా కాంట్రాస్ట్ స్పగెట్టి లేదా టీ షర్ట్ వేసుకొని, జీన్స్‌కి మ్యాచ్ అయ్యే బెల్ట్ వాడాలి. కార్పొరేట్ ఉద్యోగులు ఇలా రెడీ అయితే వింటర్లో సౌకర్యవంతంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. 2- లేత పచ్చపువ్వుల ప్రింట్ ఉన్న మందపు కాటన్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లేజర్, లోపల స్పగెట్టి లేదా టీ షర్ట్ ధరించి బెల్ట్ వాడాలి. జెగ్గింగ్ లేదా జీన్స్ ధరిస్తే స్టైల్‌గా ఉంటుంది. ఈ డ్రెస్ చలిని తట్టుకునేవిధంగా ఉంటుంది. సింపుల్‌గా సౌకర్యవంతంగా అనిపించే ఇలాంటి స్టైల్స్‌ని మీరూ ట్రై చేయవచ్చు. 3- ఆరెంజ్ రా సిల్క్ టాప్ పైన వెల్వెట్ ఓవర్ కోట్ వాడాలి. వెల్వెట్ క్లాత్ మందంగా ఉంటుంది. చలి తట్టుకునే విధంగానూ, ఫ్యాషన్‌గానూ ఉంటుంది. టాప్‌కి వాడిన ముదురురంగు లైన్స్‌ను బట్టి జెగ్గింగ్ ఎంచుకుంటే పర్ఫెక్ట్ వింటర్ డ్రెస్ అవుతుంది. 4- జెగ్గింగ్ ధరించి, పైన టీ షర్ట్ వేసి ఆపైన ఊలు ఓవర్ కోట్‌ను వాడటంతో స్టైల్‌గా కనువిందుచేస్తోంది ఈ డ్రెస్. కాలేజీకెళ్లే అమ్మాయిలకు ఈ స్టైల్ బాగుంటుంది. 5- ఊలుతో డిజైన్ చేసిన డ్రెస్సులు చలిని ఆపుతాయి. అందుకని స్వెటర్స్ అల్లేవారితో సల్వార్ కమీజ్, లెగ్గింగ్స్ మన శరీర కొలతల ప్రకారం తయారుచేయించుకోవచ్చు. వంగపండు రంగు ఊలుతో డిజైన్ చేసిన ఈ సల్వార్ కమీజ్, నలుపు రంగు ఊలుతో తయారుచేసిన ఈ లెగ్గింగ్ అలా డిజైన్ చేసినవే! నెక్కి గోటా బార్డర్, బ్లాక్ అండ్ వైట్ వీవింగ్ వల్ల ఈ సల్వార్ కమీజ్ హైలైట్‌గా నిలిచింది. ఊలుకు సాగే గుణం ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైన రెగ్యులర్ యాక్సెసరీస్ ఏవైనా వాడుకోవచ్చు. ట్రెడిషనల్‌గా ఉండాలంటే డ్రెస్‌లోని రంగులను బట్టి ఇయర్ రింగ్స్, చెప్పులు ధరించాలి. మోడల్స్: అశ్విని, సొనాలి ఫొటోలు: శివమల్లాల మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com -
వివాహిత బలవన్మరణం...
టెక్కలిరూరల్,న్యూస్‌లైన్: పెళ్లి అయిన రెండు నెలలకే వివాహిత శనివారం రాత్రి ఒంటికి నిప్పంటించుకుని మృతి చెందడం టెక్కలి పట్టణంలో సంచలనం కలిగించింది. ఆమె మృతికి భర్తే కారణమని మృతురాలి సోదరులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. టెక్కలి గొల్లవీధికి చెందిన బూరగాన అశ్విని (19) శనివారం రాత్రి తమకు ప్రత్యేకంగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి నిప్పటించుకుని తీవ్రంగా కాలిపోయింది. ఇంటి నుంచి పొగలు బయటకు రావడాన్ని గమనించిన అత్త చిన్నమ్మి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు. సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అశ్విని గుర్తు పట్టలేని విధంగా తయారై మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అశ్విని సోదరులు రాజేష్, గోవింద్ అక్కడకు చేరుకుని సోదరి మృతికి భర్త లక్ష్మణరావు కారణమని ఆరోపించారు. నందిగాం మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన చెల్లెలిని టెక్కలి గొల్లవీధికి చెందిన తాపీమేస్త్రీ లక్ష్మణరావుతో ఈ ఏడాది ఆగస్టు 21న వివాహం జరిపించామని, సుమారు రూ.2 లక్షల కట్నంతో పాటు 2 తులాల బంగారం ఇచ్చామని తెలిపారు. అయితే భర్త లక్ష్మణరావు తన చెల్లెలిపై హత్యాయత్నం చేశాడ ని ఆరోపిస్తూ అతడిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. సంఘటన స్థలం వద్ద ఉన్న పోలీసులు అత్త చిన్నమ్మితో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై హెచ్‌సీ వెంకటరమణతో పాటు సిబ్బంది వివరాలు సేకరించారు. ఇంకా కేసు నమోదు కాలేదు. కుటుంబంలో చిన్నపాటి తగాదాలే అశ్విని మృతికి కారణమై ఉండొచ్చని పలువురు స్థానికులు చెబుతుండగా, తన చె ల్లెలిని అనుమానిస్తూ బావే ఈ హత్యకు పాల్పడ్డాడని సోదరులు అంటున్నారు. -
భారతీయ యువతులకు ‘మలాలా డే’ అవార్డులు