కలంశారి...
అచ్చుతప్పుకాదు
అచ్చమైన ‘చేనేత’లివి...
కళ అనే సిరాతో కలం గీసిన చీరలివి...
ఏభైఏళ్ల వస్త్రవైభవానికి చిరునామాలివి...
కలంకారి చీరలు కలలనారికి వరాలు...
‘కలం’ అంటే పెన్ను అని అర్థం. కలం చేత రంగులు అద్దేవాడు కళాకారుడు. వెదురు పుల్లను తీసుకొని, దానిని చివర సన్నగా చెక్కి, మధ్యలో ఉలెన్ దారాన్ని చుడతారు. దీని ద్వారా సహజమైన రంగులు తీసుకుంటూ, వస్త్రంపై చిత్రీకరిస్తారు. తమిళనాడులో పుట్టిన ఈ ప్రాచీన సంప్రదాయ కళ మన రాష్ట్రంలో శ్రీకాళహస్తి, మచిలీపట్నంలలో విలసిల్లుతోంది.
1- ఎరుపు-తెలుపు మేళవింపుతో లంగాఓణీని తీర్చిదిద్ది, అంచులకు కలంకారి డిజైన్‌ను జత చేర్చడంతో పదహారణాల తెలుగమ్మాయి రూపం మరింత కళగా కనిపిస్తోంది.
2- పూర్తి కలంకారి డిజైన్‌ను నింపుకున్న టస్సర్ చీర ఇది. పువ్వులు, లతలు, పక్షులు, లేళ్లు, నృత్యకారిణుల డిజైన్‌తో ఆకట్టుకుంటుంది ఈ చీర.
3- వంగపండు రంగు ఉప్పాడ పట్టు చీరకు కలంకారి డిజైన్ గల పెద్ద అంచు, చీర కొంగు ఆక ర్షణీయంగా మారాయి.
4- ఎరుపురంగు చందేరి చీరకు ఓణీ భాగం పూర్తిగా కలంకారి దుపట్టాతో జతచేయడంతో రూపం ఆధునికంగా మారింది.
5-పసుపు రంగు కోటా చీరపై రాధాకృష్ణుల కలంకారి డిజైన్‌తో చేసిన ప్యాచ్‌వర్క్ అందంగా రూపుకట్టింది.
మోడల్: అశ్విని
ఫొటోల: ఎస్.ఎస్.ఠాకూర్
- కిరణ్ కుమార్ మణి,
కలంకారి దుస్తుల డిజైనర్, హైదరాబాద్
www.facebook.com/jayanth.kalamkari
కలంశారి
Published Wed, Feb 5 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement