Dress Designer
-
Pratima Raparthi: ధోతీ కట్టు.. మూడు రంగుల్లో ముగ్గు!
హస్త కళలపై ఇష్టంతో చిత్రలేఖనం, బ్లాక్ప్రింటింగ్ నేర్చుకుంది. చదివింది ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్. చేనేతకారులకు అండగా ఉండాలని చర్ఖా సంస్థను ప్రారంభిం చింది. మువ్వన్నెల జెండా రంగులు... మధ్యన మన సంస్కృతికి చిహ్నమైన ముగ్గును చిత్రించి, చేనేత వస్త్రంతో కండువాను డిజైన్ చేసింది. పేటెంట్ హక్కునూ పొందింది. తన హ్యాండ్లూమ్ చీరలను ధోతీ కట్టులా డిజైన్ చేసి, వాటినే తన రోజువారీ డ్రెస్‌గా మార్చుకుంది. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉంటున్న ప్రతిమ రాపర్తి తన వార్డ్రోబ్ను సరికొత్తగా మార్చుకుంది.‘ప్రపంచానికి కాటన్ దుస్తులను మన దేశమే పరిచయం చేసింది. మనదైన సంస్కృతిని మనమే పరిచయం చేసుకోవాలి. అలాగే మనల్ని అందరూ గుర్తించాలి. ఈ ఆలోచనే చేనేతలకు దగ్గరగా ఉండేలా చేసింది. 2018లో ‘చర్ఖా’ పేరుతో చేనేతలకు మద్దతుగా నిలవాలని సంస్థను ప్రారంభించాను.ట్రై కలర్స్‌లో ముగ్గు..స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ట్రై కలర్స్ డ్రెస్ ధరించి వెళ్లడానికి చాలా కష్టపడేదాన్ని. ఆరెంజ్, బ్లూ, గ్రీన్ కలర్స్ ఉండేలా డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. అలా కాకుండా ఆ రోజుకి ఏదైనా ప్రత్యేకమైన యునిఫామ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. చేనేత క్లాత్‌ను ఎంపిక చేసుకొని, అంచుగా వాటికి నేచురల్ కలర్స్‌ని జత చేశాను. మూడు రంగుల మధ్యలో ఉండే ధర్మచక్ర మన అడ్మినిస్ట్రేషన్‌కి, విజ్డమ్కి ప్రతీక. ధర్మచక్రను మన డ్రెస్సుల్లో వాడకూడదని, దాని బదులుగా ముగ్గు డిజైన్ చేశాను. ముగ్గు అనేది మన సంస్కృతికి, స్త్రీల కళా హృదయానికి ప్రతీక.25 చుక్కలు..మధ్య చుక్క ఈ డ్రెస్ ఎవరు ధరిస్తారో వారికి ప్రతీక. మిగతా 24 చుక్కలు మన పూర్వీకులు, కాలానికి ప్రతీకగా అనుకోవచ్చు. అలాగే, ఆ చుక్కలన్నీ కలుపుతూ వెళితే మన సమాజ వృద్ధికి, రాబోయే తరానికి సూచికగానూ ఉంటాయి. ఈ డిజైన్ని కండువా, శారీ, ధోతీ, ఘాఘ్రా చోళీకి తీసుకున్నాను. దీనికి పేటెంట్ రైట్ కూడా తీసుకున్నాను. ఈ డిజైన్ కండువాను ఎవరైనా ధరించవచ్చు.చేనేత చీరలతో ధోతీ కట్టు..నా దగ్గర ఎక్కువగా ఉన్న హ్యాండ్లూమ్ చీరలని ప్రత్యేక కట్టుగా మార్చుకోవాలనుకున్నాను. సౌకర్యంగా ఉండేలా చీరలను ధోతీగా కన్వర్ట్ చేసుకున్నాను. సెల్, మనీ, కార్డ్స్ పెట్టుకోవడానికి ఈ ధోతీకి పాకెట్స్ కూడా ఉంటాయి. పూర్వం రోజుల్లో గోచీకట్టు చీరలను వాడేవారు. ఆ డిజైన్ ప్రతిఫలించేలా నాకు నేను కొత్తగా డిజైన్ చేసుకున్న డ్రెస్సులివి. టూర్లకు, బయటకు ఎక్కడకు వెళ్లినా ఇలాంటి డ్రెస్‌తోనే వెళతాను. నాకు నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. వీవర్స్, టైలర్స్, బ్లాక్‌ప్రింట్, హ్యాండ్‌క్రాఫ్ట్స్ వారితో కలిసి వర్క్ చేస్తాను. ఇకో ఫ్రెండ్లీ హ్యాండీ క్రాఫ్ట్, టైలరింగ్, పెయింటింగ్... వంటివి గృహిణులకు నేర్పిస్తుంటాను’’ అని వివరించారు ప్రతిమ. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Pocket Dress: ఆమె ధరించే దుస్తులకు.. ప్రయోగాల పాకెట్!
‘మీరు బయటకు వెళ్లే సమయం లో వెంట ఓ ఫోన్, కొంత డబ్బు, కార్డుల్లాంటివి తీసుకెళ్లడం తప్పనిసరి. మీ డ్రెస్‌కి జేబులు ఉంటే చేతులను ఫ్రీగా వదిలేసి, సౌకర్యంగా ప్రయాణించే వీలుంటుంద’నే లక్ష్యంతో దుస్తులను రూపొందించి, దానినే వ్యాపారంగా మార్చుకుంది కేరళవాసి జయలక్ష్మి. ‘మహిళల దుస్తులను నేటి కాలానికి తగిన విధంగా రూపొందించాలి. ఆమె ధరించే దుస్తులకు పాకెట్స్ ఉండటం వల్ల ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి’ అంటారు త్రిసూరులో ఉంటున్న జయలక్ష్మీ రంజిత్. పాకెట్స్.13 పేరుతో ప్రస్తుత స్థితిని మార్చడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానంటోంది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! లాక్డౌన్ టైమ్‌లో రూపకల్పన పాకెట్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినిదే అయినా 20 వ శతాబ్దం వరకు మహిళ లు ఉపయోగించే దుస్తులకు జేబులు ఉండటం అరుదైన విషయమే. ‘అవి కూడా చాలా సన్నగా ఉన్న మహిళలు ధరించే ప్యాంట్స్‌కు అంతే నాజూకుగా, శృంగారపు మూలాలకు సూచికగా ఉండేవి’ అంటారు జయలక్ష్మి. అగ్రికల్చర్ ఇంజినీర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అయిన జయలక్ష్మి కరోనా సమయంలో పరిస్థితుల కారణంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఖాళీగా ఉన్న ఆ సమయం తన ఆలోచన రూపుకట్టడానికి బాగా ఉపయోగపడిందనే జయలక్ష్మి, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పాకెట్ డ్రెస్ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. చిన్నప్పుడే అనుకున్నాను మహిళల కోసం రూపొందించిన జీన్స్, ప్యాంట్లను జయలక్ష్మి తరచి తరచి చూస్తుంటుంది. ‘ఎందుకంటే, నేను పురుషులకు రూపొందించిన నా సైజు జీన్స్ కొన్నాను. వాటిని ధరించి, నా ఫోన్ వెనుక జేబులో ఉంచినప్పుడు, అది జారి కిందపడిపోయింది. పైగా నాకు అలా వెనుక వైపు పాకెట్‌ను ఉపయోగించే అలవాటు లేదు. చిన్న చిన్న పాకెట్స్ కేవలం కొన్ని నాణేలు ఉంచడానికి సరిపోతాయి. అందుకే, పురుషులందరికీ ఒకే విధంగా ఉండేలాంటి ఫంక్షనల్ పాకెట్స్ మహిళల దుస్తుల్లో ఉండకూడదనుకున్నాను’ అని తన పాకెట్ రూపకల్పన గురించి వివరిస్తుంది. ‘నాకు ఆరేడేళ్ల్ల వయసున్నప్పుడు డ్రెస్‌కు పాకెట్స్ పెట్టించమని మా అమ్మను అడిగేదాన్ని. దానికి మా అమ్మ పెద్ద శిక్షగా భావించేది. నేనే టైలర్ ఆంటీతో పరిచయం పెంచుకొని, నచ్చిన పాకెట్స్‌తో డ్రెస్ కుట్టించుకునేదాన్ని’ అని తన చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. జేబును బట్టి డ్రెస్ చదువు, ఉద్యోగం కోసం నగరానికి వెళ్లినప్పుడు కూడా ‘పాకెట్స్’అనే విషయం జయలక్ష్మి నుంచి దూరం కాలేదు. తన డ్రెస్సులను తనే సొంతంగా డిజైన్ చేసుకునేది. స్నేహితులు, సహోద్యోగులు ఆమె పాకెట్ దుస్తులను చూసి, తమకు కూడా డిజైన్ చేసిమ్మని అడిగేవారు. ‘అప్పుడు సమయం కుదరలేదు. మహమ్మారి మొదట్లో తగినంత సమయం ఉండేది. దీంతో కొన్ని డిజైన్లు పాకెట్ ఆధారంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించాను. చిన్న, మధ్యస్థ, లార్జ్ డ్రెస్సుల్లోనూ వాటికి తగిన విధంగా పాకెట్స్ రూపొందించాను. కొన్ని డిజైన్లు అందంగా ఉన్నాయని, కొన్ని డిజైన్లు అంతగా నప్పలేదని నా స్నేహితులే చెప్పారు. చాలా బాధపడ్డాను కూడా. దీంతో కొంతమంది టైలర్లను కలిసి, వారితో నా డిజైన్ల గురించి చర్చించాను. కొన్ని డిజైన్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘ఆర్డర్ చేసుకున్నవారు మీ శరీర కొలతలను పంపిస్తే, దానిని బట్టి రెండు వారాల్లో పాకెట్ డ్రెస్ డిజైన్ చేసి, పంపిస్తాను’ అని చెప్పాను. అలా ఒక రోజులో రూ.70 వేలు సంపాదించాను’ అంటారు జయలక్ష్మి. మార్కెట్లో పాకెట్ డ్రెస్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాకెట్స్.13ను వివిధ వాణిజ్య బ్రాండ్లకు దీటుగా రంగంలోకి దింపుతోంది జయలక్ష్మి. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
ఆయన భార్యకు డ్రస్సులా.. నేను డిజైన్ చేయను!
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లందరూ ఎక్కువ అంచనాలున్న హిల్లరీ క్లింటన్కే డ్రస్సులు డిజైన్ చేశారు. చాలాకాలంగా ఆ దేశ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా కూడా సుప్రసిద్ధ డిజైనర్లతో డ్రస్సులు డిజైన్ చేయించుకున్నారు. కానీ, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్న ప్రముఖ ఫ్రెంచి డ్రస్ డిజైనర్ సోఫీ తీలెట్ మాత్రం.. ఇప్పుడు దేశ ప్రథమ మహిళ కాబోతున్న మెలానియా ట్రంప్‌కు తాను దుస్తులు సిద్ధం చేసేది లేదని స్పష్టం చేశారు. ఆమె భర్త ట్రంప్ రాజకీయ అభిప్రాయాల కారణంగా తాను ఆమెకు డిజైన్ చేయబోనని చెప్పారు. అంతేకాదు.. ఇతర డిజైనర్లు కూడా తనలాగే ఉండాలని, మెలానియా ట్రంప్‌కు దుస్తులు డిజైన్ చేయొద్దని అంటున్నారు. ఈ విషయాన్ని ఎవరికో రహస్యంగా చెప్పడం కాకుండా.. ఓ బహిరంగ లేఖ రూపంలో విడుదల చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డోనాల్డ్ ట్రంప్ జాతివిద్వేషపూరితంగా, సెక్సిస్టు వ్యాఖ్యలు చేస్తూ.. వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగించారని, అది తనకు నచ్చలేదని ఆమె అన్నారు. అయితే తనకు మాత్రం రాజకీయాల్లో తలదూర్చే ఉద్దేశం లేదన్నారు. తమది కుటుంబ సంస్థ అని, కేవలం డబ్బుల కోసమే మాత్రం పనిచేయబోమని చెప్పారు. ఆమె లేఖకు సోషల్ మీడియాలో విపరీతంగా స్పందనలు వచ్చాయి. అయితే చాలామంది ఆమె ఆలోచనా తీరును తిట్టిపోశారు. దాదాపు గత 15 ఏళ్లుగా తీలెట్ (52) అమెరికాలో ఉంటూ పనిచేస్తున్నారు. 2009 నుంచి మిషెల్ ఒబామాకు డ్రస్సులు డిజైన్ చేస్తున్నారు. -
కలంశారి
కలంశారి... అచ్చుతప్పుకాదు అచ్చమైన ‘చేనేత’లివి... కళ అనే సిరాతో కలం గీసిన చీరలివి... ఏభైఏళ్ల వస్త్రవైభవానికి చిరునామాలివి... కలంకారి చీరలు కలలనారికి వరాలు... ‘కలం’ అంటే పెన్ను అని అర్థం. కలం చేత రంగులు అద్దేవాడు కళాకారుడు. వెదురు పుల్లను తీసుకొని, దానిని చివర సన్నగా చెక్కి, మధ్యలో ఉలెన్ దారాన్ని చుడతారు. దీని ద్వారా సహజమైన రంగులు తీసుకుంటూ, వస్త్రంపై చిత్రీకరిస్తారు. తమిళనాడులో పుట్టిన ఈ ప్రాచీన సంప్రదాయ కళ మన రాష్ట్రంలో శ్రీకాళహస్తి, మచిలీపట్నంలలో విలసిల్లుతోంది. 1- ఎరుపు-తెలుపు మేళవింపుతో లంగాఓణీని తీర్చిదిద్ది, అంచులకు కలంకారి డిజైన్‌ను జత చేర్చడంతో పదహారణాల తెలుగమ్మాయి రూపం మరింత కళగా కనిపిస్తోంది. 2- పూర్తి కలంకారి డిజైన్‌ను నింపుకున్న టస్సర్ చీర ఇది. పువ్వులు, లతలు, పక్షులు, లేళ్లు, నృత్యకారిణుల డిజైన్‌తో ఆకట్టుకుంటుంది ఈ చీర. 3- వంగపండు రంగు ఉప్పాడ పట్టు చీరకు కలంకారి డిజైన్ గల పెద్ద అంచు, చీర కొంగు ఆక ర్షణీయంగా మారాయి. 4- ఎరుపురంగు చందేరి చీరకు ఓణీ భాగం పూర్తిగా కలంకారి దుపట్టాతో జతచేయడంతో రూపం ఆధునికంగా మారింది. 5-పసుపు రంగు కోటా చీరపై రాధాకృష్ణుల కలంకారి డిజైన్‌తో చేసిన ప్యాచ్‌వర్క్ అందంగా రూపుకట్టింది. మోడల్: అశ్విని ఫొటోల: ఎస్.ఎస్.ఠాకూర్ - కిరణ్ కుమార్ మణి, కలంకారి దుస్తుల డిజైనర్, హైదరాబాద్ www.facebook.com/jayanth.kalamkari