ఉల్టా పుల్టాతో మొదలైన బిగ్ బాస్ రియాలిటీ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. 2.0 అంటూ సరికొత్త పంథాలో దూసుకెళ్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇప్పటి వరకు హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, వాదనలు మాత్రమే చూశాం. నామినేషన్స్ ప్రక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూశాం. కానీ వారి మనసుల్లో ఉండే భావోద్వేగాలను హౌస్‌లో చూడలేకపోయాం. కానీ ఈ వారంలో కంటెస్టెంట్స్‌ను ఏడిపించేస్తున్నారు బిగ్ బాస్. వారికి సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. ఇవాళ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.
ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించి మూడు ప్రోమోలు రిలీజయ్యాయి. మొదటి ప్రోమోలో శివాజీని సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. రెండో ప్రోమోలో అంబటి అర్జున్‌ను ఏడిపించేశాడు. తాజాగా రిలీజైన మూడో ప్రోమోలో అశ్విని తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో వచ్చి రాగానే తన కూతురును హత్తకుని ఏడ్చేసింది. ఆ తర్వాత తన కూతురికి హౌస్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.
నా అన్న వాళ్లంతా.. నీవాళ్లు కాదంటూ అశ్వినికి ఆమె తల్లి సలహాలిచ్చింది. దీంతో హౌస్‌లోనే తల్లి ఒడిలో పడుకుని చిన్న పిల్లలా ఏడుస్తూ కంటతడి పెట్టుకుంది అశ్విని. 'నన్ను వదిలి వెళ్లకు మమ్మీ' అంటూ ఫుల్ ఎమోషనల్ అయింది. మొత్తానికి ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా కంటతడి పెట్టేలా బిగ్ బాస్ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఈరోజు రిలీజైన మూడు ప్రోమోలు చూస్తే ఈ వారంలో హౌస్ ఫుల్ ఎమోషనల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment