పొన్నప్పకు జతగా సిక్కిరెడ్డి
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో విజయవంతమైన మహిళల జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప విడిపోయింది. ఇద్దరి మధ్య సమన్వయలోపం పెరగడం... ఆశించిన ఫలితాలు కూడా రాకపోవడం... తదితర కారణాలతో స్నేహపూరిత వాతావరణంలో, పరస్పర అంగీకారంతో ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 33 ఏళ్ల జ్వాల ఇక నుంచి కేవలం మిక్స్‌డ్ డబుల్స్‌కే పరిమితం కానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మనూ అత్రితో కలిసి జ్వాల మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడనుంది.
మరోవైపు అశ్విని పొన్నప్ప మాత్రం మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డితో... మిక్స్‌డ్ డబుల్స్‌లో నందగోపాల్‌తో కలిసి టోర్నీల్లో పాల్గొంటుంది. రియో ఒలింపిక్స్ కంటే ముందుగానే తామీ నిర్ణయం తీసుకున్నామని జ్వాల, అశ్విని వివరించారు.
విడిపోయిన జ్వాల-అశ్విని జోడీ
Published Thu, Nov 10 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
Advertisement
Advertisement