జ్వాల 'బ్రెయిన్'.. అశ్విని 'మెషిన్' | 'Jwala the brain, Ashwini the working machine' | Sakshi
Sakshi News home page

జ్వాల 'బ్రెయిన్'.. అశ్విని 'మెషిన్'

Published Fri, Apr 4 2014 5:09 PM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

జ్వాల 'బ్రెయిన్'.. అశ్విని 'మెషిన్'

జ్వాల 'బ్రెయిన్'.. అశ్విని 'మెషిన్'

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్పప్పపై ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ టూ  షట్లర్లు క్రిస్టినా పెడెర్సన్, కెమిల్లా రైటర్ ప్రశంసల వర్షం కురింపించారు. ఆటలో జ్వాల 'బ్రెయిన్' అయితే అశ్విని 'మెషిన్' అని అభివర్ణించారు. 'ఆటను అర్థం చేసుకోవడంలో జ్వాల మేటి. అశ్వినితో కలసి ఆమె కొన్ని ఉత్తమ ఫలితాలు సాధించింది. జ్వాల ఆటతీరును వెంటనే అర్థం చేసుకుంటుంది. అశ్విని ఓ యంత్రంలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అందువల్లే డబుల్స్లో వీరు ఉత్తమ జోడీ కాగలిగారు' కెమిల్లా చెప్పింది.
 
హైదరాబాద్లో 2009లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో కెమిల్లా థామస్ లేబోర్న్తో కలసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్లో కెమిల్లా, క్రిస్టినా నెంబర్ వన్ సీడ్గా బరిలోకి దిగుతున్నారు. జ్వాల, అశ్విని జోడీ  ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని, అయితే ఆటలో ఎత్తుపల్లాలు సాధారణమేనని కెమిల్లా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement