Gutta Jwala
-
ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు?.. జీతాలు పెంచుతాం!
భారత బ్యాడ్మింటన్ మాజీ నంబర్‌వన్, కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత అనూప్ శ్రీధర్ రిటైర్మెంట్ తర్వాత.. దాదాపు దశాబ్ద కాలంగా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్నేళ్లలో కోచ్‌గా అతడికి మంచి పేరు ఉంది. ఇటీవలి కాలంలో పీవీ సింధు, లక్ష్య సేన్లతో కూడా కలిసి అనూప్ పని చేశాడు. ఇప్పుడు అనూప్ సింగపూర్ జాతీయ జట్టు కోచింగ్ బృందంలో భాగం అవుతున్నాడు. సింగపూర్ టీమ్‌కు అదనపు సింగిల్స్ కోచ్‌గా అనూప్ శ్రీధర్ నియమితుడయ్యాడు. ఇక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ కూడా ఏడాది క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికి అమెరికాలోని ఒక క్లబ్‌కు కోచ్‌గా వెళ్లాడు. కోచ్‌గా వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌లకు మెంటార్‌గా ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీ విజయాల్లో భాగంగా ఉన్న మొహమ్మద్ సియాదతుల్లా కూడా ఇదే బాటలో నడిచారు.సంవత్సరం క్రితమే అమెరికాలోని ఒరెగాన్ అకాడమీలో కోచ్‌గా చేరాడు. శ్రీధర్, సియాదత్ భారత్‌కు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పని చేసిన వారే. అయితే ఆర్థికపరంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి వీరికి తగినంత మద్దతు లభించలేదు. కోచ్‌లకు ‘బాయ్’ ఇచ్చే తక్కువ ఫీజుతో పని చేస్తూ వచ్చిన వీరు తగిన అవకాశాల కోసం వలస వెళ్లారు. పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా కోచింగ్ వైపుఇప్పుడు పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా ఆడటాన్ని పక్కన పెట్టి కోచింగ్ వైపు వచ్చారు. ఇప్పటికే శ్రీకాంత్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్‌లకు ట్రైనర్లుగా వ్యవహరిస్తున్న వీరు... చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మార్గనిర్దేశనంలో యువ ఆటగాళ్లు తరుణ్ మన్నేపల్లి, అన్మోల్ ఖర్బ్, అనుపమ ఉపాధ్యాయ, రక్షితలకు శిక్షణ ఇస్తున్నారు.మరోవైపు మాజీ ఆటగాళ్లు మను అత్రి, సుమీత్ రెడ్డి కూడా కోచింగ్ వైపు వచ్చేయగా... సీనియర్ కోచ్ అరుణ్ విష్ణు భారత జట్టును వీడి నాగపూర్‌లోని సొంత అకాడమీకి వెళ్లిపోయాడు. ప్రస్తుత స్థితిలో శిక్షణకు భారత కోచ్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నా... ‘బాయ్’ ఇచ్చే స్వల్ప జీతాల కారణంగా వారు ముందుకు వచ్చి భారత జట్టులో కలిసి పని చేయలేకపోతున్నారు. మాజీ ఆటగాళ్లను చూస్తే అరవింద్ భట్, చేతన్ ఆనంద్, గుత్తా జ్వాల సొంత అకాడమీలు నిర్వహించుకుంటున్నారు. ‘భారత కోచ్‌లకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎవరూ ఎక్కువ కాలం సాగలేరు. దాదాపు 10 వేల డాలర్ల నెల జీతానికి విదేశీ కోచ్‌లను తీసుకోవడంలో తప్పు లేదు.బాగా సంపాదించుకోవచ్చుఅయితే వారిలో నాలుగో వంతు కూడా భారత కోచ్‌లకు ఇవ్వడం లేదు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ సమయంలోనే జీతాలు పెంచి రూ.50 వేలు చేశారు. ఇది చాలా తక్కువ మొత్తం. అందుకే భారత జట్టుతో కలిసి పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భారత కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమే. కానీ ఏ అమెరికాలాంటి దేశానికి వెళితే బాగా సంపాదించుకోవచ్చు. సొంత అకాడమీ పెట్టినా మంచి అవకాశాలుంటాయి’ అని అరుణ్ విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల భారత మహిళల సింగిల్స్ కోచ్‌గా ఇర్వాస్యా ఆది ప్రతమ (ఇండోనేసియా), డబుల్స్ కోచ్‌గా టాన్ కిమ్ హర్ (మలేసియా)లను ‘బాయ్’ నియమించింది. ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు?‘సాంకేతిక అంశాలు నేర్పించడం మాత్రమే కోచ్ పని కాదు. టోర్నీలకు సంబంధించి సరైన మార్గనిర్దేశనం, గాయాల విషయంలో జాగ్రత్తలు వంటి అన్ని అంశాలు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైనా మన భారత కోచ్‌లపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ ఆటగాళ్లకు సరైన గుర్తింపు, జీతాలు, అవకాశాలు ఇస్తే మనమూ అత్యుత్తమ ప్లేయర్లను తయారు చేయవచ్చు. ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు’ అని పారుపల్లి కశ్యప్ ప్రశ్నించాడు.జీతాలు పెంచుతాంతాజా పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా... దీనిని చక్కదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘నాలుగు నెలల క్రితం భారత జట్టు సహాయక సిబ్బంది జీతాలు పెంచాం. ట్రైనర్లు, ఫిజియోథెరపిస్ట్‌లు అప్పటి వరకు తీసుకుంటున్న మొత్తంతో పోలిస్తే 50–75 శాతం పెంచాం. ఇక తర్వాతి వంతు కోచ్‌లదే. జాతీయ క్యాంప్‌లో ఉన్న కోచ్‌ల జీతాలను త్వరలోనే సవరిస్తాం’ అని ఆయన చెప్పారు. చదవండి: విరాట్ కోహ్లి కీలక ప్రకటన -
భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?
పని గంటల గురించి ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్(SN Subramanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసేలా ఆయన మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కామెంట్లపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల(Jwala Gutta) ఘాటుగా స్పందించారు. ఉన్నత విద్యావంతులు కూడా మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చురకలు అంటించారు.కాగా.. ‘భార్యను భర్త.. భర్తను భార్య ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి.. ఆదివారాలు కూడా ఆఫీసుకు రావాలి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్లపై మెజారిటీ మంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పెట్టుబడిదారులు వేల కోట్లు ఆర్జిస్తూ.. తరతరాలకు సంపాదించిపెట్టడానికి సామాన్యుల శ్రమను దోచుకోవడం కోసం అభివృద్ధి అనే సాకును వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల సైతం సుబ్రమణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ‘‘అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏమిటంటే.. భర్త భార్య వైపు తదేకంగా చూస్తూ ఎందుకు ఉండిపోకూడదు? అది కూడా ఆదివారం మాత్రమే ఇలాంటివి ఉంటాయా!!బాగా చదువుకున్న వాళ్లు.. ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ల నుంచి కూడా ఇలాంటి మాటలు వినాల్సి రావడం విచారకరం. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కావు. మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా.నిరాశ, భయంఅంతేకాదు స్త్రీల పట్ల వారికున్న చిన్నచూపును ఇంత బహిరంగంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. నిరాశగానూ.. భయంగానూ ఉంది’’ అని గుత్తా జ్వాల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా.. ఆదివారాలు కూడా పనిచేయడం అందరికీ ఇష్టం ఉండదని.. మానసిక ప్రశాంతత ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని నొక్కివక్కాణించారు.ఏదేమైనా బహిరంగ వేదికపైన సుబ్రమణ్యన్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శించారు.డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్గాకాగా మహారాష్ట్రలో జన్మించిన గుత్తా జ్వాల హైదరాబాద్‌లో సెటిలయ్యారు. బాల్యం నుంచే బ్యాడ్మింటన్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. పద్నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. అశ్విని పొన్నప్పతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి జోడీగా జ్వాల- అశ్విని ద్వయం నిలిచింది.ఇక 2011లో లండన్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్స్‌లో కాంస్యం గెలిచిన గుత్తా జ్వాల.. 2010 కామన్వెల్త్ గేమ్స్ వుమెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2014 గేమ్స్‌లో రజతం గెలిచారు. అదే విధంగా.. 2014లో ప్రతిష్టాత్మక ధామస్- ఉబెర్ కప్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 2009 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్లో డిజు(లండన్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.కాగా భారత బ్యాడ్మింటన్ రంగంలో డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్‌గా గుత్తా జ్వాల పేరొందారు. తన సేవలకు గానూ అర్జున అవార్డు పొందారు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా.. విద్య, వైద్య, మహిళా సాధికారికత, లింగ సమానత్వంపై కూడా గుత్తా జ్వాల తన గొంతును బలంగా వినిపిస్తున్నారు.నటుడితో రెండో వివాహంసహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకున్నారు గుత్తా జ్వాల. అయితే, ఆరేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం తమిళనటుడు, డివోర్సీ విష్ణు విశాల్(Vishnu Vishal)తో ప్రేమలో పడ్డ జ్వాల.. 2021లో అతడితో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్.. అవన్నీ నిజం కాకపోవచ్చు! -
ఆ మాత్రం ఆలోచన ఎందుకు రాదు : గుత్తా జ్వాల ఫైర్, ఫోటో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పొల్గొనే భారతీయ క్రీడాకారుల యూనిఫాం డిజైన్‌పై అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా తరుణ్ తహిలియానిపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా మహిళల దుస్తులపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి రియో ఒలింపిక్స్నాటి ఫొటోతో.. దుస్తులను, తమకెదురైన అసౌకర్యం గురించి తన అనుభవాన్ని షేర్ చేశారు. ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. After not much of thinking..The garments which was made for the Indian contingent participating in Olympics this time has been a huge disappointment!! (Especially when the designer was announced I had huge expectations)First not all girls know how to wear a saree…why didn’t… pic.twitter.com/b5UjzpvUJQ— Gutta Jwala 💙 (@Guttajwala) July 28, 2024‘‘ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు నిరాశ పరుస్తూనే వస్తున్నాయి. టీమిండియా దుస్తులు డిజైనర్‌ను ప్రకటించాక నేనైతే భారీ అంచనాలే పెట్టుకున్నా. కానీ దాదాపు అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాదు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రెడీ టూ వేర్ చీరను డిజైన్ చేయాలన్ని కనీస ఆలోచన ఎందుకు చేయలేక పోయారో అర్థం కాలేదు. ఆ పిచ్చి బ్లౌజ్‌లు, బాడీకి ఫిట్ కాక చాలా ఇబ్బందులు పడ్డాం. అస్సలు సౌకర్యంగా లేవు. పైగానాసికరంగా, చూడటానికి దారుణంగా ఉన్నాయి. భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించేందుకు డిజైనర్లకు అవకాశం ఉన్నాఎందుకు ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా మైదానం లోపల, బైట క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యతపై క్రీడాకుటుంబం రాజీ లేని ధోరణి అవలంబిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.దీంతో చాలామంది నెటిజన్లు కూడా గుత్తాజ్వాలకు మద్దతు పలికారు. ఇంట్రెస్టింగ్ షేడ్ అండ్ డిజైన్ ఉంటే బాగుండేది. అలాగే చుడీదార్ కుర్తా లేదా రెడీమేడ్ చీర అయితే బావుండేది. తరుణ్ తహిలియానీ భారతదేశ సంస్కృతిని ప్రదర్శించే మంచి అవకాశాన్ని కోల్పోయారని ఒకరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి : పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం.. నెట్టింట చర్చ కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. మూడో ఒలింపిక్ మెడల్ సాధించే క్రమంలో ఆదివారం జరిగిన గ్రూప్–ఎమ్ తొలి మ్యాచ్‌లో సింధు 21–9, 21–6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవ్స్)పై విజయం సాధించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో సింధు.. క్రిస్టినా కుబా (ఈస్టోనియా)తో తలపడుతుంది. -
గుత్తా జ్వాలకు విడాకులు? క్లారిటీ ఇచ్చిన విష్ణు విశాల్
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విష్ణు చేసిన ట్వీటే అందుకు కారణం.. 'నేను ఎంతో ప్రయత్నించాను, కానీ విఫలమవుతూనే ఉన్నాను. మరేం పర్వాలేదు.. దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే! అది ఒక మోసపూరిత ద్రోహం..' అంటూ లైఫ్ లెస్సన్స్ హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకారు లేపారు. తాజాగా ఈ వ్యవహారంపై విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. 'కొద్దిరోజుల క్రితం నేను చేసిన ట్వీట్‌ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. కేవలం వృత్తిగత జీవితం గురించే ట్వీట్ చేశాను. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో నమ్మకం. ఒకరికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే నమ్మకం. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం మరీ అంత కఠినంగా ఉండకూడదని మాత్రమే దానర్థం' అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టాడు హీరో. ఇకపోతే విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. Hey all My tweeet few days back has been terribly misinterpreted.. It was on proffessional front n not personal at all.. The biggest gift that we give someone is TRUST And when we fail we always blame ourselves.. We shudn be hard on ourselves THATS ALL I MEANT ALL IS WELL — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) March 26, 2023 -
బీఎస్ఎన్ఎల్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు ఆరంభం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ నెట్వర్క్ ఒక్కటే కాదు.. క్రీడల్లోనూ రాణిస్తామని నిరూపించుకునేందుకు బ్యాడ్మింటన్ కోర్టులో దిగారు బీఎస్ఎన్ఎల్(BSNL) ఉద్యోగులు. ఏటా జరిగే ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈసారి సికింద్రాబాద్ రైల్వే నిలయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ పోటీలను అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా... ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, అలాగే శారీరకంగా ధృడంగా ఉంచుతాయన్నారు జ్వాల. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్(BSNL) సీజీఎం చాగంటి శ్రీనివాస్, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ మహేంద్ర భాస్కర్, పీజీఎంఎస్ కేవీకే ప్రసాద్ రావు, ఎన్ మురళి, శ్రీమతి సుజాత, డీజీఎం చంద్రశేఖర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: PC Vs PR: ఆదుకున్న బట్లర్.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్! టాప్-4లో సన్‌రైజర్స్ కూడా.. Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో -
భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ప్రమోషన్స్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ను వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతూ కొనసాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొజులిచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ ఫొటోషూట్‌ను నెటిజన్లు చీల్చి చెండాడారు. తాజాగా మరో హీరో ఇలాంటి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దానికి 'ఈ ట్రెండ్‌లో నేను కూడా జాయిన్ అయ్యా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విభిన్నమైన సినిమాలతో అలరించే తమిళ హీరో విష్ణు విశాల్. రానా నటించిన 'అరణ్య'లో ఓ పాత్రతోపాటు ఇటీవల 'ఎఫ్ఐఆర్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విష్ణు హీరోగానే కాకుండా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాల భర్తగా సుపరిచితమే. చదవండి: సమంత యాటిట్యూడ్‌కు స్టార్ హీరో ఫిదా.. సినిమాలో అవకాశం! దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. నడుము కింద వరకు కనిపించేలా, కేవలం దుప్పటి మాత్రమే అడ్డుపెట్టుకుని సెమీ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు విష్ణు విశాల్. 'నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారడంతో నేను కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింటి వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సెమీ న్యూడ్ ఫొటోలను ట్రెండ్‌గా తీసుకోని ఇంకెంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి. Well... joining the trend ! P.S Also when wife @Guttajwala turns photographer... pic.twitter.com/kcvxYC40RU — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) July 23, 2022 చదవండి: మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' రివ్యూ.. -
నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి: గుత్తా జ్వాల
హైదరాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. 'చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అంటూ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. Stop humiliating small girls at the gates of the school where they come to empower themselves…school is supposed to be their safe haven!! Head scarf or no head scarf Spare them from this ugly politics….stop scarring there small minds 🙏🏻🙏🏻 Just stop this!! 💔 — Gutta Jwala (@Guttajwala) February 15, 2022 చదవండి: (హిజబ్ వివాదం.. టీచర్ శశికళ రాజీనామా) -
తొలిసారి పెళ్లి వీడియో షేర్ చేసిన విష్ణు విశాల్
Gutta Jwala And Vishnu Vishal Marriage: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తమిళ హీరో విష్ణు విశాల్‌ను ఏప్రిల్ 22న పెళ్లాడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నేడు(సెప్టెంబర్ 7) గుత్తా జ్వాల బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త, హీరో విశాల్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. కాగా వీరి వివాహం జరిగి అయిదు నెలలు గడిచింది. పెళ్లై ఇంతకాలం అవుతున్న భార్య బర్త్‌డే సందర్భంగా వారి వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా తొలిసారి పంచుకున్నాడు. చదవండి: పెళ్లిపై స్పందించిన రాశి ఖన్నా, కాబోయేవాడు అచ్చం తనలాగే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. విశాల్ వదిలిన ఈ వీడియో హల్దీ వేడుకతో పాటు పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఇక రిసెప్షన్ పార్టీలో విశాల్, జ్వాల కుటుంబ సభ్యులు చేసిన హంగామా మాములుగా లేదు. ఒకరికి మంచి మరొకరు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. విజువల్స్ ఎఫెక్ట్‌తో క్రియేటివ్‌గా తీసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్అయినప్పటికి సెలబ్రెటీలు కావడంతో పెళ్లి చాలా గ్రాండ్ జరుపుకున్నట్లుగా కనిపిస్తోంది. కాగా జ్వాలా బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని 2005లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘ఐశ్యర్య రాయ్‌కి నటన రాదు, బ్యాడ్ యాక్టింగ్‌కు ఉదాహరణ ఆమె’ Sharing with you all our wedding video... Thank you all for the love and support so far in this journey of LIFE...@Guttajwala Thank you 'THE STORY BOX' for the lovely video... ▶️ https://t.co/AYq80CoHGD Happy Birthday wishes to #JwalaGutta 🎂 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) September 7, 2021 పలు కారణాలతో 2011లో ఈ జంట విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు. ఇక విష్ణు విశాల్ కూడా 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్ అనే బాబు కూడా జన్మించాడు. మనస్పర్థల వల్ల 2018లో ఈ జంట విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు విశాల్ సోదరి వివాహంలో వీరిద్దరకి తొలిసారిగా కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. -
భర్తతో కలిసి గుత్తా జ్వాల తొలి ఇన్‌స్టా రీల్స్.. వీడియో వైరల్
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇటీవల తన ప్రియుడు, తమిళ హీరో విష్ణు విశాల్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఏప్రిల్ 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్‌లోనే ఎంజాయ్ చేస్తుంది. కరోనా లాక్డౌన్ కారణంగా హనీమూన్‌కి వెళ్లలేకపోయిన ఈ ప్రేమ జంట.. పరిస్థితులు చక్కబడే వరకు హైదరాబాద్‌లోనే ఉండాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తొలిసారి ఇన్‌స్టా రీల్స్ వీడియో చేసింది గుత్తా జ్వాల. అందులో విష్ణు విశాల్ బెడ్‌పై నిద్రపోయి ఉండగా.. గుత్తా జ్వాలా అతన్ని హత్తుకొని ముఖంతో ఫన్నీ హవభావాలు పలికిస్తూ ఉంది. బ్యాగ్రౌండ్లో లిల్గ్రౌండ్ బీఫ్ & గార్ఫీల్డ్ ర్యాన్’నథింగ్ టు డూ సాంగ్ ప్లే అవుతుంది. ‘నా ఫస్ట్ రీల్ ఇది చేయాల్సి వచ్చింది ’అంటూ ఈ వీడియోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది జ్వాలా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Jwala Gutta (@jwalagutta1) గుత్తా జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోలు వైరల్
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. గురువారం(ఏప్రిల్ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్ ఈ వేడుకకు వేదికైంది. కరోనా కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ( గుత్తా జ్వాల, విష్ణు పెళ్లి ఫోటోలు.. ఇక్కడ క్లిక్ చేయండి ) ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవిడ్ కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లివరకు దారితీసింది. చదవండి: గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్ -
ఒక్కటైన గుత్తా జ్వాల- విష్ణు విశాల్ జంట
-
గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరొకాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. నేడు (ఏప్రిల్ 22)న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలకు ఇరువర్గాల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఇక మెహందీ వేడుకలకు గుత్తా జ్వాల పసుపు రంగు లెహంగాలో మెరిసిపోగా, బ్లాక్ కుర్తాలో విష్ణు విశాల్ సందడి చేశారు. ప్రస్తుతం జ్వాల-విశాల్‌ల మెహందీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోవిడ్ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరో విష్ణు విశాల్..కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి : కాబోయే భార్య బయోపిక్ తీస్తాను: హీరో గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్ -
గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్
శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు, స్నేహితుల ప్రేమ కావాలని ఆహ్వానాలు పంపుతున్నారు తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల. గత ఏడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఈ నెల 22న వివాహం చేసుకోనున్నారు. ఉగాది పర్వదినాన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ ప్రేమికులు వెల్లడించారు. కోవిడ్ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఓ పెళ్లిలో మొదలైన విష్ణు, జ్వాలల పరిచయం స్నేహంగా మారి, ప్రేమగా చిగురించి, ఇప్పుడు మూడు ముడుల బంధంగా మారనుంది. LIFE IS A JOURNEY.... EMBRACE IT... HAVE FAITH AND TAKE THE LEAP.... Need all your love and support as always...@Guttajwala#JWALAVISHED pic.twitter.com/eSFTvmPSE2 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) April 13, 2021 -
పెళ్లి డేట్ ప్రకటించిన యంగ్ హీరో
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఏప్రిల్ 22న పెళ్లి పీటలెక్కనున్నట్లు వెల్లడించారు. ఉగాది పండగ రోజు విష్ణు విశాల్ ఈ శుభవార్తను ట్విటర్లో తెలిపారు. ఈ మేరకు లగ్న పత్రికను సైతం షేర్ చేశాడు. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని హీరో స్పష్టం చేశాడు. కేవలం ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. LIFE IS A JOURNEY.... EMBRACE IT... HAVE FAITH AND TAKE THE LEAP.... Need all your love and support as always...@Guttajwala#JWALAVISHED pic.twitter.com/eSFTvmPSE2 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) April 13, 2021 విష్ణు విశాల్ 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ మనస్పర్థల కారణంగా 2018లో వారిద్దరూ విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాల కూడా భారత బ్యాడ్మింటర్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. ఆరేళ్లకే వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2011లో విడిపోయారు. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. ఇదిలా వుంటే విష్ణు విశాల్ ఈ మధ్యే మూడు భాషల్లో విడుదలైన 'అరణ్య'లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ఎఫ్ఐఆర్, మోహన్‌దాస్, ఇంద్రు నేత్రు నాలై 2 సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: త్వరలోనే తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నాను: హీరో -
కాబోయే భార్య బయోపిక్ తీస్తాను: హీరో
తమిళ సినిమా: ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని యువ నటుడు విష్ణు విశాల్ తెలిపారు. కోలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న ఈయన తాజాగా నటించిన చిత్రాల్లో కాడన్ చిత్రం ఒకటి. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఈ ఏడాది తాను నటించిన 4 చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అందులో తాను సొంతంగా నిర్మించి, కథానాయకుడిగా నటిస్తున్న ఎఫ్ఐఆర్, మోహన్ దాస్ చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలాను పెళ్లాడబోతున్నట్లు తెలిపారు. ఇది ప్రేమ వివాహం కాదన్నారు. ఇంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందన్నారు. అందు వల్ల తాను, జ్వాలా ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న పెళ్లి ఇది అని చెప్పారు. గుత్తా జ్వాలా ఒలింపిక్‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్న విషయం తెలిసిందేన్నారు. ఆమె తన గురించి పలు అనుభవాలను తనతో పంచుకున్నారని, ఆమె బయోపిక్‌ను చిత్రంగా నిర్మించాలని ఆలోచన తనకు ఉందని పేర్కొన్నారు. కాడన్ చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. చదవండి: తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్.. అడవిలోనే 25 ఏళ్లు.. -
త్వరలోనే తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నాను: హీరో
భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే తాను తెలుగింటి అల్లుడిని కాబోతున్నట్లు ప్రకటించాడు విష్ణ విశాల్. అరణ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘‘మూడు భాషల్లో నటిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జ్వాలా ఎంకరేజ్మెంట్, మద్దతుతో నేను ధైర్యం చేయగలిగాను. అతి త్వరలోనే మేం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం. తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా పెళ్లి తేదిని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ నెల 26న అరణ్య చిత్రం విడుదల కానుంది. దీనిలో విష్ణు విశాల్ మావటి(ఏనుగులను అదుపు చేసే వ్యక్తి) పాత్రలో నటించాడు. రానా హీరోగా నటిస్తున్న అరణ్య చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఒక వ్యక్తి కథ ఇది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించే సినిమా. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు విష్టు విశాల్. వీరిద్దరికి గతంలోనే వివాహం అయ్యింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరు తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. చదవండి: మాల్దీవుల్లో ప్రేమ పక్షులు.. రొమాంటిక్ ఫోటోస్ ఆనందపు క్షణాలు..తోడు ఉండాల్సిందే -
మాల్దీవుల్లో ప్రేమ పక్షులు.. రొమాంటిక్ ఫోటోస్
స్కూల్‌కు వెళ్లి స్టూడెంట్స్ అటెండెన్స్ వేసుకున్నట్లు అందేంటో ఇటీవల సెలబ్రిటీలంతా మాల్దీవుల్లో వాలిపోతున్నారు. కొన్ని రోజులు షూటింగ్‌లకు సైడ్ ఇచ్చి మరీ వెకేషన్ కోసం బీచ్ తీరంలో సేదతీరేందుకు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే తంతు కొనసాగుతోంది. కత్రినా కైఫ్, అలియా భట్, శిల్పాశెట్టి నుంచి నాగార్జున, సమంత, కాజల్, మంచు లక్ష్మీ, రకుల్ వరకు మాల్దీవుల్లో హాలీడే ట్రిప్‌లు ఎంజాయ్ చేసినవారే. తాజాగా ఈ జాబితాలోకి మరో లవ్ బర్డ్స్ చేరిపోయారు. బ్యాడ్మింటర్ స్టార్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ మాల్దీవుల్లో విహరిస్తున్నారు. లవర్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను విశాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీటిని చూసిన అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా బ్యాడ్మింటన్ బ్యూటీ, విష్ణు విశాల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు పెళ్లి బాజాలు మోగలేదు. దీంతో జ్వాల పెళ్లెప్పుడు అని ఆమె ఫ్యాన్స్.. స్పోర్ట్స్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కెరీర్ పరంగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించగా.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చదవండి: ప్రేయసికి నటుడి విషెస్; ‘ఇది బిగినింగ్ మాత్రమే’ -
అమ్మమ్మను కోల్పోయిన బాధలో ఉంటే.. జాతి వివక్ష వ్యాఖ్యలా..?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. ఈ విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ట్విటర్లో తన అమ్మమ్మ మరణ వార్తను తెలుయజేస్తూ.. "చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. అంతకుముందు అమ్మ ప్రతి నెలా చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు.. చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారు. దీనిపై బాధతో ఆమె స్పందిస్తూ.. ఓపక్క అమ్మమ్మను కోల్పోయిన బాధలో మేముంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. అసలు మనం బతుకుతున్నది సమాజంలోనేనా.. అలాగైతే సానుభూతి ఎక్కడ.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ ఆమె ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. Ammaama passed away in China on d eve of CNY!My mom use 2 visit her every month but for past year she couldn’t because of https://t.co/pvd6Pcfvsj dis covid has made us realise how important it is 2 be in present do whatever v can for our loved ones whenever v can! Happy new year pic.twitter.com/EUyEqNDopj — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 I am mourning the loss of my grand mom who passed away in China and to my surprise I get racist replies....and I am asked why I say covid and not Chinese virus.... What has happened to us as a society...where’s the empathy...where r we headed...and there r defenders?? Shameful! — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 -
జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్ షట్లర్ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పాల్గొన్నారు. సిద్ధమైన కోర్టులు -
జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అకాడమీ స్థాపించిన జ్వాల గుత్తాకి, ఆమె కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. చైనాలో లాగా భారత్‌లోనూ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తామని వివరించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనన్నారు. జ్వాల అకాడమీ నడిపేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. జ్వాల గుత్తా మాట్లాడుతూ.. అకాడమీ కల నెరవేరింది. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన జ్వాల.. తనలాంటి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అకాడమీ స్థాపించడం గర్వకారణమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత ప్రతిభని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు. Ministers @KTRTRS, @VSrinivasGoud and Badminton star @Guttajwala toured the Jwala Gutta Academy of Excellence and interacted with the sports persons training at the Academy. pic.twitter.com/h8Tl7NwXSh — KTR News (@KTR_News) November 2, 2020 -
ఆనందపు క్షణాలు..తోడు ఉండాల్సిందే
ఆనందపు క్షణాలను పూర్తిగా అనుభవించడానికి మనకు తోడుగా ఒకరు ఉండాల్సిందే అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్వీట్ చేశారు. ప్రియుడు తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. గత రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక హీరో విష్ణు విశాల్ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు.కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాల దేశంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్ ) View this post on Instagram To get full value of joy,you must have someone to divide it with!! “MARK TWAIN” A post shared by Jwala Gutta (@jwalagutta1) on Oct 24, 2020 at 4:02am PDT Happy birthday @Guttajwala New start to LIFE.. Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around.. Need all your love n blessings guys..#newbeginnings thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 -
విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్
భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తనకి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తమిళ హీరో విష్ణు విశాల్ సోమవారం ప్రకటించారు. గత రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు విష్టు విశాల్. (చదవండి: స్వీట్ షాక్) Happy birthday @Guttajwala New start to LIFE.. Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around.. Need all your love n blessings guys..#newbeginnings thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 వాస్తవానికి విష్ణు విశాల్‌కి 2010లోనే వివాహమయ్యింది. రజనీ నటరాజన్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. మనస్పర్థలు కారణంగా 2018లో వారిద్దరు విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాలకి కూడా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో 2005లో వివాహమైంది. కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాల దేశంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. ఇక కెరీర్ విషయానికి విష్ణు విశాల్ నటించిన థ్రిల్లర్ మూవీ విడుదలకి సిద్ధమవుతోంది. -
స్వీట్ షాక్
తమిళ హీరో విష్ణు విశాల్ పుట్టినరోజు సందర్భంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం (జూలై 17న) విష్ణు విశాల్ పుట్టినరోజు. తాను వస్తున్నట్లు ముందు చెప్పకుండా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి జ్వాల బాయ్‌ఫ్రెండ్‌కు స్వీట్ షాక్ ఇచ్చారు. ‘నా బర్త్‌డే సర్ప్రైజ్’ అని ఆమెతో దిగిన ఫొటోలను విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. మరోవైపు జ్వాల కూడా ‘హ్యాపీ బర్త్‌డే బేబీ’ అనే క్యాప్షన్ తో వారిద్దరూ దిగిన ఫొటోని ట్వీట్ చేశారు. కాగా విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాలను కలిశారట విశాల్. అప్పుడు కుదిరిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్. ‘మేమిద్దరం రిలేషన్ షిప్లో ఉన్నాం’ అంటూ జ్వాల ఆ మధ్య వెల్లడించారు కూడా. అయితే విష్ణు విశాల్‌కు ఇప్పటికే పెళ్లయింది. రజినీ నటరాజ్‌తో ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2018లో ఆమె నుంచి విష్ణు విశాల్ విడిపోయారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో జ్వాల పెళ్లాడారు. కారణాలేంటో తెలియదు కానీ 2011లో వీరిద్దరూ విడిపోయారు. మరి.. విష్ణు–జ్వాల ప్రేమ.. పెళ్లి వరకూ వెళుతుందా? -
మిస్ యు
లాక్ డౌన్ కారణంగా తనకి, విష్ణు విశాల్‌కి మధ్య ఏర్పడ్డ దూరాన్ని అయిష్టంగా భావిస్తున్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. ‘‘మిస్ యు’’ అంటూ బాయ్ ఫ్రెండ్ విష్ణు విశాల్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ఆ పోస్ట్‌కి స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం సామాజిక దూరం పాటించాలి’’ అని సరదాగా అన్నారు విష్ణు విశాల్. తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా చెప్పకపోయినా ఇలాంటి ట్వీట్లు చెబుతున్నాయి. ఈ ఇద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. -
లెట్స్ టాక్ టు జ్వాల
-
బ్యాడ్మింటన్ స్టార్స్ తళుకులు
-
బీజేపీలోకి సైనా.. జ్వాలకు చీవాట్లు
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింట్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరడంపై సహచర క్రీడాకారిణి గుత్తా జ్వాల తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అర్థం పర్థం లేని ఆటనే ఆడావనుకున్నా కానీ అర్థం పర్థం లేని పార్టీలో కూడా చేరావా అంటూ సైనాపై గుత్తా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు సైనా స్పందించనప్పటికీ.. నెటిజన్లు మాత్రం గుత్తా జ్వాలాకు చీవాట్లు పెడుతున్నారు. సైనా అర్థం పర్థం లేని రిలేషన్ షిప్‌లు, పెళ్లిళ్లు చేసుకోలేదని ఓ నెటిజన్ ఘాటుగా విమర్శించాడు. ‘సైనాను, బీజేపీని విమర్శించేముందు నీ స్థాయి ఏంటో ముందు చూసుకో, నీ సహచర క్రీడాకారిణపై అంత అక్కసు ఎందుకు? నువ్వు కూడా నీకు నచ్చిన పార్టీలో చేరొచ్చు కదా?’అంటూ నెటిజన్లు గుత్తా జ్వాలకు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం సైనా నెహ్వాల్‌కు సంబంధించి గుత్తా జ్వాలా చేసిన ట్వీట్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు సైతం అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజీపీలో చేరిన విషయం తెలిసిందే. ‘క్రీడారంగంలో అనేక టైటిల్స్ గెలిచాను. దేశం పేరు నిలబెట్టాను. దేశం కోసం మంచి చేసే బీజేపీలో నేడు చేరాను. కష్టపడి పనిచేసే వారంటే చాలా ఇష్టం. మోదీ రాత్రి పగలూ కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయనతో కలిసి దేశం కోసం పనిచేయడం నా అదృష్టం. మోదీ దేశంలో క్రీడారంగానికి చాలా మేలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉంది..’ అని బీజేపీలో చేరిన సందర్భంగా సైనా పేర్కొన్నారు. చదవండి: హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్ మాటలు రావడం లేదు: కోబీ భార్య భావోద్వేగం -
గోపీచంద్‌ను ఎందుకు ప్రశ్నించరు: జ్వాల
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గతంలో దిగ్గజ బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ ప్రకాశ్ పదుకొనే వద్దకు శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తి, ఇప్పుడు అతన్నే తప్పుబడుతున్నాడంటూ మండిపడ్డారు. గోపీచంద్‌పై ‘డ్రీమ్స్ ఆప్ ఎ బిలియన్, ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్’ అనే పుస్తకం వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైనా నెహ్వాల్‌తో గతంలో వచ్చిన మనస్పర్థలను వివరించాడు. తన అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం ఇష్టంలేదని చెప్పినప్పటికీ తన మాట వినిపించుకోలేదని తెలిపాడు. ఈ విషయంలో ఒలింపిక్స్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్, వీరేన్ రస్కినా సైనాను హైదరాబాద్ వీడేందుకు ప్రోత్సహించారని విమర్శించాడు. అంతేకాక ప్రకాశ్ పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పడానికి సానుకూల విషయమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించాడు. దీనిపై గుత్తా జ్వాల స్పందిస్తూ ‘ఇక్కడ ఏడుస్తున్న వ్యక్తి.. ప్రకాశ్ సర్ దగ్గర శిక్షణ తీసుకోడానికి హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు. మరి దీన్ని ఎందుకు ఎవరూ ప్రశ్నించట్లేదు’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదంపై ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ స్పందిస్తూ.. రియో ఒలింపిక్స్‌లో భాగంగా సైనాను హైదరాబాద్‌లోని పుల్లెల అకాడమీ నుంచి బెంగళూరుకు తరలించడంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించింది. కాగా 2014 ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత సైనా నెహ్వాల్ హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీని వీడి బెంగళూరులో ప్రకాశ్ పదుకొనే అకాడమీలో చేరింది. అక్కడే రెండేళ్లపాటు కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా.. ఆపై మళ్లీ తిరిగి గోపీచంద్ అకాడమీకి చేరింది. ఇక కోచ్ గోపీచంద్ కూడా ప్రకాశ్ పదుకొనే దగ్గర శిక్షణ తీసుకున్నవాడే కావడం గమనార్హం. చదవండి: వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది -
గుత్తా జ్వాల ప్రియుడితో ప్రియా రొమాన్స్
యువ నటుడు విష్ణువిశాల్ ఇంతకుముందు వరకూ తన చిత్రాలకు సంబంధించిన వార్తలో ఉండేవారు. ఇప్పుడు ప్రియురాలు, ప్రేమ అంటూ వార్తలో నానుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రేమలో మునిగితేలుగున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ ప్రచారం అవుతోంది. నటుడిగా మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం జగజ్జాల కిల్లాడి, ఎఫైఆర్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా విష్ణువిశాల్ ఇంతకుముందు సిలుక్కువార్‌పట్టి సింగం చిత్రంలో నటించడంతో పాటు దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. దీనికి సెల్లా ఆయ్యావు దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా విష్ణువిశాల్ ఈ దర్శకుడికి తాజాగా మరో అవకాశాన్నిచ్చారు. వీరి కాంబినేషన్లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) కాగా ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా నటి ప్రియాభవానీ శంకర్‌ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు, కథ నచ్చడంతో ప్రియాభవానీశంకర్ కూడా నటించడానికి సమ్మతించినట్లూ సమాచారం. ఈ చిత్రానికి ఇంకా కాల్షీట్స్ను కేటాయించలేదట. కారణం ఇప్పుడు ప్రియాభవానీశంకర్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం కురుది ఆట్టం, కళత్తిల్ సంథిస్పోమ్, కసడదపర, మాఫియా, బొమ్మై. ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల మధ్య ఖాళీ చూసుకుని విష్ణువిశాల్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయిస్తానని నటి ప్రియాభవానీశంకర్ మాట ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
నిజాలు చెపితే కాంట్రవర్సీనా..
-
ఆ ఫోటోల గురించి తర్వాత మాట్లాడదాం: గుత్తా జ్వాల
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీటర్లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. బుధవారం తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్లో షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే వార్తలు హల్‌చేస్తున్నాయి. అయితే వీటిపై మాట్లాడటానికి గుత్తా జ్వాల నిరాకరించారు. గురువారం బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించిన జ్వాల మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా ఆ ఫోటోలకు గురించి జ్వాలను ప్రశ్నించగా తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశారు.(ఇక్కడ చదవండి: హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) కాగా, ప్రస్తుతం తాను ప్రారంభించిన అకాడమీని సుమారు రూ. 14 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. ఇది కూడా అతి పెద్ద అకాడమీనేనని చెప్పిన జ్వాల.. కేవలం బ్యాడ్మింటన్‌కే కాకుండా మిగతా స్పోర్ట్స్‌కు కూడా ఈ అకాడమీ సేవలందిస్తుందన్నారు. తనకు ఇతర రాష్ట్రాల్లో కూడా అకాడమీలను నిర్మిస్తారా అన్న ప్రశ్నకు.. అవకాశం వస్తే అక్కడ కూడా నిర్మిస్తానని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైస్కూల్ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తోపాటు క్రికెట్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. -
దాని గురించి తర్వాత మాట్లాడదాం
-
హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఇప్పటివరకు షేర్ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉండేది.. కానీ తాజా ఫోటోల్లో ఆ చిన్న కాస్తంత గ్యాప్ కూడా కనిపిండం లేదు. అంతేకాకుండా గుత్తా జ్వాలకు ఏకంగా విశాల్ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విష్ణు విశాల్ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్ విమర్శించాడు. అయితే ఈ జంట ఎంతో క్యూట్ అండ్ హాట్‌గా ఉందంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. వేరువేరుగా విడిపోయి ఒకటి అవుతున్న జంట అంటూ మరో నెటిజన్ సరదాగా పేర్కొన్నాడు. ఇక హీరో విష్ణు విశాల్ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ కూడా ఒక కారణమంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా గతంలోనే కొట్టి పారేశారు. My baby ❤️❤️ happy new year ❤️❤️ @TheVishnuVishal pic.twitter.com/gxSRyVOHVb — Gutta Jwala (@Guttajwala) December 31, 2019 -
జ్వాల కొత్త క్రీడా అకాడమీ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆధ్వర్యంలో కొత్త క్రీడా అకాడమీ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైసూ్కల్ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తోపాటు క్రికెట్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. అకాడమీకి సంబంధించిన లోగోను మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత స్టార్ రెజ్లర్, బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన సుశీల్ కుమార్... భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూడీ పాల్గొన్నారు. ‘భారత్ ఎంతో పెద్ద దేశం. కానీ మనకు బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య పెరగాలి. జ్వాల అకాడమీ ద్వారా చాంపియన్లను తయారు చేయాలని అనుకుంటున్నాను. నా అకాడమీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును కలిశాను. ఆయన నుంచి సానుకూల స్పందన వచి్చంది. అకాడమీ నిర్మాణం కోసం ఎవరి సహాయం తీసుకోలేదు. సొంతంగా ఏర్పాటు చేశాను. నా అకాడమీలో కనీసం 10 మంది కోచ్‌లు ఉంటారు. అందులో ఇద్దరు విదేశీ కోచ్‌లు’ అని జ్వాల వివరించింది. వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ అకాడమీలో చేరాలనుకునే వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 8826984583, 9811325251 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. -
గుత్తా జ్వాలతో డేటింగ్‌పై యంగ్ హీరో క్లారిటీ!
హైదరాబాద్: గత కొంతకాలంగా ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలకి తమిళ హీరో విష్ణు విశాల్‌తో ఎఫైర్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి క్లోజ్‌గా తీసుకున్న ఫోటోను విష్ణు తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనన్న వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు విష్ణు కొంతకాలం క్రితం తన భార్యతో విడిపోవడంతో ఇప్పుడు గుత్తా జ్వాలని పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఈ యంగ్ హీరో క్లారిటీ ఇచ్చాడు. తనకు జ్వాల అంటే ఇష్టమని, ఆమెకి కూడా నేనంటే కూడా ఇష్టమని అని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసని, కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి కాలక్షేపం చేస్తుంటామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ మధ్య స్నేహం బంధం తప్ప మరే బంధము లేదని.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని తెలిపారు. కాగా, ఇటీవల 'రాక్షసన్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం 'జగజ్జాల కిలాడి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక గుత్తా జ్వాలా, చేతన్ ఆనంద్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లుగా వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో తమ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునేవారు. అయితే కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో ఈ జంట విడిపోయింది. ఇక నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు బిగ్‌బాస్ 3లో గుత్తా జ్వాల పార్టిసిపేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ వదంతులేనని ఆమె ట్విటర్ వేదికగా కొట్టిపారేశారు. -
వివేకం కోల్పోయావా వివేక్?
ముంబై: సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ షేర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే దేశం యావత్తు ఉలిక్కిపడేలా ప్రకంపనలు రేగుతాయి. ఇలాంటి ట్విట్టర్ దుమారమే మరోసారి చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, ఐశ్వర్యరాయ్‌ను కించపరిచేలా ఉన్న ఒక మీమ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో సల్మాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోకు ఒపీనియన్ పోల్, వివేక్–ఐశ్వర్య చిత్రానికి ఎగ్జిట్ పోల్, అభిషేక్, ఆరాధ్య, ఐశ్వర్య కలిసి ఉన్న చిత్రానికి రిజల్ట్ అని టైటిల్ ఇచ్చి, ఈ మూడు చిత్రాలతో కూడిన మీమ్‌ను రూపొందించారు. ‘హ..హ.. క్రియేటివ్, రాజకీయాల్లేవు, కేవలం జీవితం’ అని టైటిల్‌తో దీనిని వివేక్ ట్విట్టర్లో షేర్ చేశారు. కొద్ది వ్యవధిలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజన్లను మండిపాటుకు గురిచేసింది. అతని స్థాయిని సూచిస్తోంది ఈ ట్వీట్ అసహ్యంగా ఉందంటూ నటి సోనమ్ కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, పలువురు మహిళా జర్నలిస్టులు, ప్రముఖులు ట్విట్టర్లో స్పందించారు. వివేక్‌కు నోటీసులు పంపుతామన్నారు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్. అతని నీచ బుద్ధిని.. అతను జీవితంలోను, రాజకీయాల్లోను సమర్థుడు కాదని తేల్చడానికి ఇదే సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్. -
పొరపాటైంది.. క్షమించండి!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించనందున ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన లక్షల మందికి.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ క్షమాపణలు కోరారు. ఓటు కోల్పోయామన్న బాధను చాలా మంది తనకే స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారన్నారు. 2015లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమంలో పొరపాట్లు జరిగాయని, నిబంధనలు పాటించకుండానే ఓట్లను తొలగించడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని అంగీకరించారు. శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా పలుమార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామని, అయితే వీరెవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఓటేయలేకపోయారన్నారు. రెండు నెలల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చామని, జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని ప్రచారోద్యమం సైతం నిర్వహించామన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు తొలగింపుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశించామన్నారు. వ్యక్తిగతంగా గుత్తా జ్వాలకు క్షమాపణలు తెలియజేశారు. ఓటరు జాబితాలో పేర్లను కోల్పోయిన వారు మళ్లీ ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈసారి అత్యంత జాగ్రత్తగా ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. 2014లో అసెంబ్లీ, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 67 శాతం వరకు నమోదైందన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల్లో దాదాపు 2లక్షల మంది అధికారులు, సిబ్బంది, 50 వేల మంది పోలీసులు విధులు నిర్వహించారన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రీ–పోలింగ్ ఉండకపోవచ్చు ఎన్నిక సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రానందున.. రీ–పోలింగ్‌కు అవకాశం ఉండకపోవచ్చని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య గోదాములకు తరలిస్తున్నామన్నారు. గోదాముల్లో 24గంటల విద్యుత్ సరఫరాతో పాటు సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో నగదు (రూ.117.2కోట్లు, మద్యం (5.4లక్షల లీటర్లు), ఇతర కానుకలు (రూ.9.2కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు మాదక ద్రవ్యాలు) పట్టుబడ్డాయన్నారు. దీంతో మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.138 కోట్లకు చేరిందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 4292 ఫిర్యాదులు అందగా వాటన్నింటినీ.. పరిష్కరించామన్నారు. చాలా వరకు మానవ తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. పనిచేయని ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను సాధ్యమైనంత త్వరగా మార్చి కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్‌ను ప్రారంభించామని రజత్ కుమార్ తెలిపారు. -
నా ఓటు పోయింది : గుత్తా జ్వాల
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. ‘ నా ఓటు పోయింది. ఆన్లైన్ ఓటరు జాబితాలో నా ఓటు లేకపోవడంతో ఆశ్చర్యపోయాను’ అని ట్వీట్ చేశారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లతో నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదో, ఏ కారణంతో తన పేరును తొలగించారో తెలియదంటూ ఆవేదన చెందారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరిగినట్లని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది వారి పేర్లు కూడా గల్లంతయ్యాయని ట్వీట్ చేస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. Go out n VOTE 🗳 #TelangaElections2018 — Gutta Jwala (@Guttajwala) December 7, 2018 Surprised to see my name disappear from the voting list after checking online!! #whereismyvote — Gutta Jwala (@Guttajwala) December 7, 2018 How’s the election fair...when names r mysteriously disappearing from the list!! 😡🤬 — Gutta Jwala (@Guttajwala) December 7, 2018 రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.96 శాతం పోలింగ్ నమోదైంది. నగరంలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 40 వేల ఓట్లు గల్లంతవ్వగా.. జాంబాగ్ డివిజన్, జూబ్లీహిల్స్‌లో కూడా భారీగా ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకుందామని వచ్చినవారు.. జాబితాలో పేరు లేదని అధికారలు చెప్పడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికొందరు ఆందోళనకు దిగుతున్నారు. ఎన్నికల ముందే అధికారులు భారీ కసరత్తు మొదలు పెట్టినా జాబితాలోని తప్పులను గుర్తించలేకపోయారు. -
తెలంగాణ ప్రభుత్వంపై గుత్తా జ్వాల ఫైర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అసహనం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని, ఇంటిస్థలం ఇస్తామని ఇవ్వలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎంవోకు ట్వీట్ చేశారు. అథ్లెట్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్‌ని ప్రకటించిందని.. అందులో భాగంగానే తనకు హామీ ఇచ్చారని, తను అడగలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని గుత్తాజ్వాల ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది క్రీడల మంత్రి పద్మారావుని కలిసిన గుత్తాజ్వాల రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై ఆయనతో చర్చించారు. గత కొంతకాలంగా బ్యాడ్మింటన్‌లో రాజకీయాలపై బహిరంగంగానే పెదవి విరుస్తున్న గుత్తాజ్వాల.. ఇప్పుడు పూర్తిగా ఆటకి దూరమై అకాడమీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. @KTRTRS @TelanganaCMO I have been after the TELANGANA govt too for some support to establish an academy for past 4 years but in vain...was promised I would be given the support but...... Also was promised a plot for house but every athlete seems to have got it except me!! — Gutta Jwala (@Guttajwala) August 6, 2018 -
తెలంగాణ ప్రభుత్వంపై గుత్తా జ్వాలా మండిపాటు
-
ఇక చెప్పుకోం... చేసి చూపిస్తాం
‘మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి, ఎదగడానికి ఆకాశమే హద్దు’ అనే మాటలు వినడానికి ఎంత బాగున్నప్పటికీ వాస్తవంలో అలా ఏ మాత్రం లేదంటున్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. సాధికారత సాధనలో మహిళలకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని, కెరీర్లో నిలదొక్కుకోవడం కంటే మహిళ అయిన కారణంగా ఎదురయ్యే విమర్శలను, వివక్షను ఎదుర్కోవడానికే ఎక్కువ శక్తి అవసరమవుతోందన్నారామె. ‘‘ఫిఫ్టీ– ఫిఫ్టీ అనేది ఒక ముసుగు మాత్రమే. క్రీడాకారుల్లో పది మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు ముగ్గురో నలుగురో ఉంటారు. ఆ ముగ్గురు నలుగురిని చూపించి మహిళలకు ఎన్ని అవకాశాలో అని భూతద్దంలో చూపించుకుంటారు. క్రీడారంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిలకు కొదవలేదు. అయితే పరిస్థితులే అందుకు అనుకూలంగా లేవు. స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి స్టేడియాలున్నాయి. కానీ కోచ్‌లే తగినంతగా లేరు. ప్రభుత్వం కోచ్‌లను నియమించి ట్రైనింగ్ ఇప్పిస్తూ, వాటిలో దిగువ స్థాయి బాలికలకు అవకాశం ఇస్తే వారిలో నుంచి ఎంతోమంది క్రీడాకారిణులు వస్తారు. అలాంటి ప్రయత్నమే కనిపించడం లేదు. రాను రాను బ్యాడ్మింటన్ రిచ్మన్ గేమ్‌గా మారిపోతోంది. మా నాన్నలాంటి నాన్న ఉంటే! మనది పితృస్వామ్య సమాజం. కాబట్టి సమాజం మహిళలనే ప్రశ్నిస్తుంది. మహిళలు ప్రశ్నిస్తే సహించలేదు. అమ్మాయి ఇలాగే ఉండాలి... అన్నట్లు కండిషన్ అయిపోయింది సొసైటీ. ఆ మైండ్‌సెట్ నుంచి సొసైటీ బయటపడాలి. ఉదాహరణకు నన్ను మా నాన్న చాలా లిబరల్గా పెంచారు. అప్పట్లో మా నాన్నను అందరూ ‘ఏంటి అలా పెంచుతున్నావు, మగరాయుడిలా ఉంటోంది’ అనేవాళ్లు. మా నాన్న ధైర్యవంతుడు కాబట్టి ఈ రోజు నేను సమాజం ముందు తలెత్తుకుని నిలబడగలిగాను. అలాంటి నాన్నలు లేని అమ్మాయిలు చాలామంది అందరిలో ఒకరిలా జీవించేస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఎవరి ముందూ తలదించలేదు. ఆ తత్వాన్ని తలబిరుసుగా ముద్ర వేస్తుంటారు. నా జీవితంలో పాతికేళ్లు బ్యాడ్మింటన్ ప్రాక్టీసే ఉంది. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూనే ఈ స్థాయికి వచ్చాను. అయినప్పటికీ నా ముఖాన్నే ‘ఈమె ఆడలేదులే’ అన్నారు. నేను దేశం కోసం ఆడాను, దేశానికి విజయాలు తెచ్చాను. పరాయి దేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంలో ఎంత సంతోషపడ్డానో దేశానికి పతకాలు తెచ్చినప్పుడూ అంతే సంతోషపడ్డాను. అవేవీ కనిపించలేదు ఈ మేల్ డామినేషన్ సిస్టమ్‌కి. నా కళ్లెదురుగా జరిగే తప్పుల్ని ‘అలా ఎందుకు’ అని ప్రశ్నించడమే వాళ్లకు గుర్తొచ్చేది. దేశంలో నంబర్‌వన్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను అకారణంగా తప్పించారు. కారణం ఒక్కటే! నేను 2006లో కామన్వెల్త్ గేమ్స్‌లో మెడల్ సాధించిన తర్వాత నా గ్రాఫ్ పెరిగింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడకుండా తప్పించారు. మనసులో మరేవో కారణాలు పెట్టుకుని, ఫిట్నెస్ వంకతో తప్పించారు. మగ బ్యాడ్మింటన్ ప్లేయర్ 30 ఏళ్ల వయసులో కూడా ఆడుతూ మెడల్ సాధించినప్పుడు నేను 24 ఏళ్లకే ఫిట్నెస్ కోల్పోతానా? ఆ తర్వాత 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్లో గోల్డ్ సాధించాను, 2011 వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం వచ్చింది. నిజానికి ఫిట్నెస్ కోల్పోయి ఉంటే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఆ మాటలోనే ఉంది ఆధిపత్యం! ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సరే మనది మేల్ డామినేషన్ సొసైటీ. ‘మహిళలకు ఎన్నో అవకాశాలనిస్తున్నాం’ అనే మాటలోనే ఆధిపత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంటే ఇచ్చే స్థాయిలో వాళ్లు తీసుకోవాల్సిన స్థితిలో మహిళలు ఉన్నారనేగా ఈ మాటలు చెప్పే మగవాళ్ల ఉద్దేశం. మా ఆటలో కూడా మెన్స్ డబుల్స్ ఉన్నట్లు విమెన్స్ డబుల్స్ ఉండవు. ఆ బారికేడ్‌ను దాటడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. విమెన్స్ డబుల్స్ గురించి మాట్లాడితే ‘విమెన్ సింగిల్స్ ఉన్నాయి చాలు కదా’ అంటారు. ఇంకా గట్టిగా అడిగితే మిక్స్డ్ డబుల్స్ పెట్టేవారు. సాధికారత సాధించాలనే తపన ఉన్న మహిళలకు కొదవ లేదు. తమ చేతిలో ఉన్న అధికారాన్ని కాస్తంత వదులుకోవడానికి సిద్ధంగా లేని మగవాళ్లే ఎక్కువగా ఉన్నారు, అడ్డంకులను ఎదుర్కొని తమను తాము నిరూపించుకోవాలని ప్రయత్నించే వాళ్లంతా తీవ్రమైన వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదైనా అసమానతను ప్రశ్నిస్తే వారికి ఒక ముద్ర వేసేస్తారు. అందుకు ఉదాహరణ నేనే. సోషల్ మీడియా విస్తరించడం వల్ల సమాజం నిజస్వరూపం బయటపడుతోంది. ఎంత ఇరుకుగా ఆలోచిస్తారో తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ ఆలోచనలు ఇలా ఉంటే రాబోయే తరం మహిళ పరిస్థితి ఎలా ఉంటుంది? కమింగ్ జనరేషన్‌కి తండ్రులు ఈ యువతే కదా! సొసైటీ ఈ లేబిలింగ్ హ్యాబిట్ పోనంత వరకు మహిళకు సమానత్వం అనేది సాధ్యం కాదు. సమానత్వం కోసం, సాధికారత కోసం పోరాటమే ఉంటుంది. 21వ శతాబ్దంలో కూడా ఇంకా ఫెమినిజం, సమానవేతనం, వివక్ష, వేధింపులు, సాధికారత సాధన వంటి పదాలు వినిపిస్తున్నాయంటే... ఇందుకు తలదించుకోవాల్సింది మహిళలు కాదు మొత్తం సమాజం. ఈ పదాలు వినిపించని రోజు, వీటి అవసరం లేని రోజు మనం సంపూర్ణ సాధికారత సాధించినట్లు’’. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మహిళలు జనాభాలో సగభాగం ఉన్నారు, అయినా అవకాశాల్లో మైనారిటీలే. అందుకే మహిళలు సాధికారత సాధించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించాలి. మహిళలకు తమ మీద తమకు సందేహం ఉండకూడదు. తానిది చేయగలనా అని మనమే సందేహపడితే ఇక ప్రోత్సాహం ఎక్కడ నుంచి లభిస్తుంది? ఎవరైనా వేలెత్తి చూపించగానే బెంబేలు పడిపోవడం మానేయాలి. అమ్మాయిలు తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి ముందడుగు వేయాలి. పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. ∙సినిమాలలో హీరోయిన్ పాత్రతో పోల్చుకోవడం మానేయాలి. ఎందుకంటే మన సినిమాల్లో హీరోయిన్ పాత్ర చాలా బలహీనమైనది. ఆమెకు కష్టం వస్తే హీరో వచ్చి రక్షించే సీన్లకోసం, హీరో పాత్రను ఎలివేట్ చేయడం కోసం అలా చిత్రీకరిస్తుంటారు. అది కమర్షియల్ ఎలిమెంట్ కావచ్చు. అమ్మాయిలు ఆ మైండ్‌సెట్‌లో కూరుకుపోకూడదు. కళ్ల ముందు ఏమి జరుగుతున్నా తలదించుకుని వెళ్లిపోతుంటే మంచి అమ్మాయి అనే బిరుదు వస్తుంది. ఆ బిరుదు కోసం ఎవరూ తమ ఉనికిని పణంగా పెట్టకూడదు. ∙ఈ తరం పేరెంట్స్ ప్రోగ్రెసివ్‌గా ఆలోచిస్తే... రాబోయే తరం అమ్మాయిలు, అబ్బాయిలకు అవకాశాలలో సమానత్వం వస్తుంది. మహిళలకు సాధికారత అందుబాటులోకి వస్తుంది. పరిస్థితులను మనమే మార్చుకోవాలి ‘రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని సెక్టార్ వాళ్లతో కలసి పనిచేయాలి. వివక్ష ఎదురైనా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. సమస్యలు అన్ని చోట్లా ఉన్నట్లే రాజకీయాల్లోనూ’ అన్నారు కొత్తూరు గీతామూర్తి. ‘‘నేను 20 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీచేశాను. పార్టీలో ఉంటూ రకరకాల సమస్యల మీద సమాచారం ఇవ్వడం, పోలీస్ వ్యవస్థతో అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు 23 జిల్లాలకు డైరెక్టర్‌గా, పార్టీ కోర్ కమిటీ మెంబర్‌గా చేశాను. గ్రామ కో ఆర్డినేటర్‌గా చేశాను. ఏ ఉద్యోగానికైనా ఓ టైమ్ లిమిట్ ఉంటుంది. పాలిటిక్స్‌లో ఉదయం ఆరుగంటల నుంచే డ్యూటీ మొదలైతే అర్ధరాత్రి దాటాకా ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ ఆడ–మగ తేడా లేదు. ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనాలి. రాజకీయాల్లో మహిళల పట్ల వివక్ష ఉంది. అలాగని దూరంగా ఉంటే ఇంకా దూరం పెట్టేస్తారు. ఇప్పటికీ చాలా పార్టీలలో మగనాయకులు ఆడవారి సేవలను మంగళహారతులకు, పూల దండలు వేయడానికే సరిపెడుతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో నాకూ ఆత్మన్యూనత ఉండేది. అది పోవడానికి నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను. రాజకీయాల్లో ఉన్న మహిళ ప్రతి రోజు తనని తాను కొత్తగా మార్చుకోవాలి. నిరంతరం ప్రజల్లో ఉండాలి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి, వాటిని సాధ్యమైనంత పరిష్కరించాలి. యాక్టివ్‌గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. బేటీ బచావో ప్రోగ్రామ్‌లో అంగన్వాడీ స్థాయి నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. ఆడపిల్లలకు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ అండగా మేము నిలబడుతున్నాం. మా ఇంట్లో వాళ్లు నాకు మంచి సపోర్ట్. అలా ఉండేలా ఇంటి వాతావరణాన్ని మనమే మార్చుకోవాలి. అప్పుడే రాజకీయాల్లోనూ విజయం సాధించగలం.’’ – నిర్మలారెడ్డి రాస్తే పుస్తకమే అవుతుంది! ఏ స్పోర్ట్స్ పర్సన్ కూడా స్టార్డమ్ కోసం ఆట మొదలు పెట్టరు. ఆట మీద ప్యాషన్‌తో శ్రమిస్తాం. సక్సెస్ సాధించిన తర్వాత స్టార్డమ్, సెలబ్రిటీ హోదాను సమాజమే ఇస్తుంది. మేము కోరేది క్రీడాకారులుగా ఆదరించమనే. అయితే అందులోనూ మగవాళ్లకు ఆడవాళ్లకు తేడా చూపిస్తుంటే ఏంటిది అనిపిస్తుంది. నేను అనుభవించిన తేడాలను రాస్తే పుస్తకమే అవుతుంది. ఎదురీదాల్సిన పరిస్థితులు ఎన్ని వచ్చినా వెనుకడుగు వేయలేదు. నాకు తెలుసు నేనేమిటో? అందుకే ఎటువంటి వివక్షనీ ఖాతరు చేయలేదు. నేను నేనుగా నిలబడగలిగాను. నన్ను నేను నిరూపించుకోగలుగుతున్నాను. అక్కడా పోరాటమే! సమానమైన పనికి సమాన వేతనం అనే డిమాండ్‌ని ఇప్పుడు క్షేత్రస్థాయిలో వింటున్నాం. కానీ ఒకప్పుడు స్పోర్ట్స్‌లోనూ ఈ వివక్ష ఉండేది. బ్యాడ్మింటన్‌లో మగవాళ్లకు ఇచ్చినంత ప్రైజ్‌మనీ ఆడవాళ్లకు ఇచ్చే వారు కాదు గతంలో. మనదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే ఇంతటి వివక్ష ఉండేది. ఈ కండిషన్ నుంచి ఈక్వల్ రెమ్యూనరేషన్ కోసం ప్లేయర్లు పోరాడి సాధించుకోవాల్సి వచ్చింది. ఫండమెంటల్ రైట్స్... - మహిళలకు మగవాళ్లతో సమానమైన హక్కు - మహిళల పట్ల లింగవివక్ష నిషేధం - అవసరమైనప్పుడు రాజ్యం... మహిళల ప్రయోజనాల కోసం నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలనే సూచన - ఉద్యోగాల కల్పనలో ప్రతి పౌరునికీ సమాన అవకాశాలుండాలి... అని చెప్తున్నాయి. -
ద్వేషించినా సరే లెక్కచేయను : గుత్తా జ్వాల
ఇటీవలికాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో సినీ తారలు, క్రీడాకారిణిలు శ్రుతి మించుతున్నారంటూ నెటిజన్లలో ఓ వర్గం విరుచుకుపడుతోంది. అయితే తన ఒక్క ట్వీట్‌తో వీటన్నింటిని లెక్క చేయబోనని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పష్టం చేశారు. ద్వేషించేవాళ్లు ద్వేషించినా కానీ, ముందు నన్నో సెల్ఫీ దిగనివ్వండి అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ట్రోలర్స్(సోషల్ మీడియాలో కామెంట్లలో విరుచుకుపడేవారు) గురించి పట్టించుకోకండి. పాజిటివిటీ, ప్రేమని పంచండి అంటూ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు. -
నిరీక్షణ ముగించాలని!
♦ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకమే లక్ష్యంగా ఆడతా ♦ ఈ విజయాలను ఆస్వాదిస్తున్నాను ∙ ♦ భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ వ్యాఖ్యలు గత నాలుగు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లలో భారత క్రీడాకారిణులు పతకంతో తిరిగి వచ్చారు. 2011లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప ద్వయం కాంస్యం... 2013, 2014లలో పీవీ సింధు కాంస్యం... 2015లో సైనా నెహ్వాల్ రజత పతకం సాధించారు. అయితే పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. 1983లో ప్రకాశ్ పదుకొనె కాంస్య పతకం గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మరో పతకం రాలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే... 34 ఏళ్ల నిరీక్షణకు ఈసారి తెర పడే అవకాశాలున్నాయి. వరుసగా మూడు సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా వాటిలో రెండు టైటిల్స్ కూడా నెగ్గిన కిడాంబి శ్రీకాంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం... స్కాట్లాండ్లో ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచేందుకే ఆడతానని శ్రీకాంత్ కూడా స్పష్టం చేయడంతో మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ముగిసేలా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ మున్ముందూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తానని తెలిపాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచి నగరానికి చేరుకున్న శ్రీకాంత్‌తోపాటు అతని సహచరులు సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌లను జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఘనంగా సత్కరించారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐడీబీఐ ఫెడరల్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ రామన్ నగదు పురస్కారాలు అందజేశారు. రెండు టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్‌కు రూ. 6 లక్షలు... ఇండోనేసియా ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా), ప్రపంచ, రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)లను ఓడించి సెమీస్ చేరుకున్న ప్రణయ్‌కు రూ. 2 లక్షల నగదు పురస్కారం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై శ్రీకాంత్ వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... విజయం కోసమే... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్–10లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. అయితే టాప్–10లోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్లలో ఆడలేదు. ఈ టోర్నీలలో విజయం సాధించేందుకే బరిలోకి దిగాను. ఆగస్టులో స్కాట్లాండ్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ తప్పకుండా పతకం గెలిచేందుకే ఆడతాను. ప్రస్తుతం నా ఆలోచనంతా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గురించే. ర్యాం క్ల గురించి అంతగా పట్టించుకోను. తాజా విజయాలతో అభిమానులు నా నుంచి మరిన్ని గొప్ప ఫలి తాలు ఆశిస్తారు. అయితే ఒత్తిడికి తలొగ్గకుండా సహ జశైలిలో ఆడటమనేది నాపైనే ఆధారపడి ఉంటుంది. అందరికీ అద్భుతంగా గడిచింది... గత రెండు వారాలు భారత బ్యాడ్మింటన్‌కు అద్భుతంగా గడిచాయి. కేవలం నేనే కాదు సహచరులు ప్రణయ్, సాయిప్రణీత్ కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. ఇండోనేసియా ఓపెన్‌లో వరుస మ్యాచ్‌ల్లో లీ చోంగ్ వీ, చెన్ లాంగ్లాంటి దిగ్గజ ఆటగాళ్లను ప్రణయ్ ఓడించడం తొలిసారి జరిగింది. ప్రణయ్ విజయాలకు నేను అభినందిస్తున్నాను. అయితే అతను సెమీఫైనల్లో ఓడిపోవడం కాస్త నిరాశకు గురి చేసింది. గోపీచంద్ వల్లే... రియో ఒలింపిక్స్ తర్వాత గాయపడ్డాను. చీలమండ గాయం నుంచి తేరుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. గాయం తగ్గిన తర్వాత ప్రధానంగా శిక్షణపైనే దృష్టి పెట్టాను. ఫిట్నెస్ సాధించాకే టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ నేను విజయాల బాట పట్టడానికి కోచ్ గోపీచంద్ కృషి ఎంతో ఉంది. భారత బ్యాడ్మింటన్ ఈ స్థాయికి రావడానికి గోపీచందే కారణం. ఒకవేళ ఆయన ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారకపోయుంటే మన క్రీడాకారులకు ఈ విజయాలు దక్కేవి కావు. ఇంకా ఆస్వాదిస్తున్నాను... ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయాలు ఇంకా ఆస్వాదిస్తున్నాను. ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హోను రెండుసార్లు ఓడించడం.. రియో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్‌పై నెగ్గడంతో నా ఫామ్‌పై నేనే ఆశ్చర్యపోయాను. నా విజయాలపై ప్రధాని మోదీ స్పందించి అభినందించడం నా బాధ్యతను మరింత పెంచింది. ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), కేంద్ర క్రీడా శాఖలకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్‌లో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతుండటం ఎంతో సంతోషాన్నిస్తోంది. అందులో నేనూ భాగంగా ఉండటం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. రాబోయే రోజుల్లో మేము మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాను. అంతర్జాతీయస్థాయిలో ఇంకా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇది అంతం కాదు. రాబోయే రెండేళ్ల కాలంలో భారత్ నుంచి టాప్–10లో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లు ఉంటారని ఆశిస్తున్నాను.’ –హెచ్ఎస్ ప్రణయ్ భారత ఆటగాళ్లు సాధిస్తున్న విజయాలతో ఎంతో సంతృప్తిగా ఉన్నాను. భవిష్యత్‌లో వీరందరూ తమ ఆటతీరును మరింత మెరుగుపర్చుకొని ఇంకా గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. అయితే ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్ ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఇంకా సమయం ఉంది. ఆ దిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. –చీఫ్ కోచ్ గోపీచంద్ -
నూతన ‘సాయ్’ పాలక కమిటీ సభ్యులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) పాలక కమిటీ సభ్యులుగా ఇటీవల నియమితులైన వారిని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ శనివారం ఘనంగా సన్మానించింది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావులు పాల్గొన్నారు. ఇటీవలే వీరు ముగ్గురు రాష్ట్ర సాయ్ పాలక కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం, కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ బి. వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడతా... ఆడిస్తా...
-
ఆడతా... ఆడిస్తా...
♦ గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం ♦ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ సాక్షి, హైదరాబాద్ భారత బ్యాడ్మింటన్ అత్యుత్తమ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆటతో పాటు ఇప్పుడు ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు కూడా సిద్ధమైంది. ఆమె ఆధ్వర్యంలో ‘గ్లోబల్ బ్యాడ్మింటన్ అకాడమీ’ శనివారం ఇక్కడ ప్రారంభమైంది. నగరంలోని కూకట్‌పల్లిలో ఈ అకాడమీని నెలకొల్పారు. దీంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 25 కోర్టులను కూడా ఇక నుంచి గ్లోబల్ అకాడమీనే నిర్వహిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్)లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్ రెడ్డి ఈ అకాడమీ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనుండగా, ‘ద్రోణాచార్య’ ఎస్ఎం ఆరిఫ్ కూడా శిక్షణలో పాలుపంచుకుంటారు. ప్రస్తుతానికి మాత్రం జ్వాల కోచింగ్ ఇవ్వకుండా పర్యవేక్షణకే పరిమితం కానుంది. ‘దాదాపు ఏడాది కాలంగా నా మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది. చిన్నారులు, వర్ధమాన షట్లర్లకు అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ అందించడం అకాడమీ లక్ష్యం. ఇక సింగిల్స్, డబుల్స్‌కు ఇక్కడ సమాన ప్రాధాన్యత లభిస్తుంది. డబుల్స్ శిక్షణ విషయంలో వివక్ష ఉండదు’ అని జ్వాల పేర్కొంది. తమ అకాడమీ లక్ష్యం ఒలింపియన్లను తయారు చేయడమే అని ఈ దశలోనే చెప్పడం అతిశయోక్తిగా అనిపిస్తుందని, ప్రతిభ ఉండి తగిన అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే తమ ముందున్న కర్తవ్యమని జ్వాల వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుల్లెల గోపీచంద్ అకాడమీతో పాటు పలు ఇతర అకాడమీలు కూడా పని చేస్తున్నాయి. వాటితో తాను పోల్చుకోవడం లేదని జ్వాల వెల్లడించింది. ‘ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదే. కోచ్‌గా గోపీచంద్ ఘనతలను గౌరవిస్తాను. అయితే మరిన్ని అకాడమీలు ఉండటం వల్ల నష్టమేమీ లేదు. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తే మంచిదే కదా’ అని ఆమె అభిప్రాయపడింది. మరోవైపు తాను క్రీడాకారిణిగా ఇంకా రిటైర్ కాలేదని 33 ఏళ్ల జ్వాల స్పష్టం చేసింది. గత జనవరిలో మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో మనూ అత్రితో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పాల్గొన్న జ్వాల రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. ‘ప్లేయర్‌గా ఇంకా రాణించగల సత్తా నాలో ఉంది. ర్యాంకు తక్కువగా ఉండటం వల్ల నేను ఎక్కువ టోర్నీలు ఆడటం లేదు. ఇప్పుడు చిన్న టోర్నీలతో మొదలు పెట్టాల్సి ఉంది. అయితే సీనియర్ సర్క్యూట్లో 18 ఏళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను కాబట్టి ఈ మాత్రం విరామం అవసరమని భావించా’ అని జ్వాల చెప్పింది. ప్రస్తుతం మహిళల డబుల్స్‌లో జ్వాల 28వ ర్యాంక్‌లో, మిక్స్డ్ డబుల్స్‌లో 340వ ర్యాంక్‌లో ఉంది. రూ. 25 కోట్ల పెట్టుబడి... జ్వాలకు చెందిన గ్లోబల్ అకాడమీకి ఆర్థికపరంగా ఫ్రాంచైజ్ ఇండియా–నాకౌట్ వెల్నెస్ ల్యాబ్స్ సంస్థ అండగా నిలుస్తున్నాయి. అకాడమీ నిర్వహణ కోసం ప్రాథమికంగా ఈ సంస్థ రూ. 25 కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. ‘బ్యాడ్మింటన్ కోచింగ్‌కు కొత్త తరహాలో మార్గనిర్దేశనం చేయాలనే ఆలోచనతో ఇందులోకి అడుగుపెట్టాం. దశలవారీగా అకాడమీని విస్తరించి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో 50 వరకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. లాభనష్టాల గురించి అప్పుడే ఆలోచించడం లేదు’ అని నాకౌట్ వెల్నెస్ సహ యజమాని మోహిత్ వర్మ వెల్లడించారు. అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రాంచైజ్ ఇండియా–నాకౌట్ వెల్నెస్ ల్యాబ్స్ సంస్థ సహ యజమాని మోహిత్ వర్మ, జ్వాల -
నన్ను కావాలనే విస్మరించారు: గుత్తా జ్వాల
హైదరాబాద్: తనకు పద్మ పురస్కారం దక్కకపోవడం పట్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మూడుసార్లు దరఖాస్తు చేసినా తనను విస్మరించారని వాపోయింది. తనను కావాలనే విస్మరించారని ఆరోపించింది. మిక్స్ డ్ డబుల్స్, మహిళ డబుల్స్ లో టాప్- 10లో ఉన్న తనను ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేయకపోవడం బాధ కలిగించిందని తెలిపింది. ‘15 ఏళ్లుగా దేశం కోసం ఆడుతున్నాను. ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో సత్తా చాటాను. అన్ని అర్హతలు ఉన్నాయనే పద్మ అవార్డు కోసం దరఖాస్తు చేశాను. కానీ ఇది సరిపోలేదు. అవార్డు రావాలంటే రికమండేషన్ ఉండాలి. రికమండేషన్ ఉంటేనే అవార్డుకు ఎంపిక చేస్తామంటే దరఖాస్తులు ఆహ్వానించడం దేనికి? పద్మ పురస్కారాలకు నేను సాధించిన విజయాలు సరిపోవా? ఈ మొత్తం వ్యవహారం నాకు అంతుపట్టకుండా ఉంది. నేను సాధించిన ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, గ్లాస్కో లో వెండి పతకం.. ప్రపంచ చాంపియన్ షిప్స్ మెడల్స్ సరిపోవా? 15 సార్లు నేషనల్ చాంపియన్ షిప్ గెలిచాను. ఇలా ఎన్నో ఘనతలు సాధించాను. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో అందరికీ మార్గదర్శకంగా నిలిచాను. కానీ ఇవేమి సరిపోలేదు. ఎందుకంటే నేను ముక్కుసూటి మనిషిని. అందుకే నాకు అవార్డు నిరాకరించార’ ని జ్వాల తన ఫేస్ బుక్ పేజీలో రాసుకొచ్చింది. -
క్రీడల్లోనూ రాణించాలి: జ్వాల
హైదరాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. కష్టపడితే క్రీడలతోనూ భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో కేంద్రీయ విద్యాలయాల జాతీయ స్పోర్‌ట్సమీట్ ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను సైబ రాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీని వాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుత్తాజ్వాల మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహిస్తే వారి ప్రతిభను సానబెట్టే అవకాశాలుంటాయని సైబ రాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో హాకీ, బాస్కెట్‌బాల్, రోప్ స్కేటింగ్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్, స్కేటింగ్ తదితర 9 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో తెలంగాణ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలు , పులివేషాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. -
జ్వాల ఆనందం
ఆనందం, సంతోషం.. బాధ, దుఖం.. దేన్నీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు వ్యవహరించే స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మరోసారి అదేపని చేశారు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆనందంలో వీపుపై ఉన్న ఒలింపిక్ టాటూ కనిపించే ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు గుత్తా జ్వాల. అన్ని విధాల ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'మనం సాధించాం..' అంటూ తన జోడి అశ్విని పొన్నప్పకు అభినందనలు తెలిపారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతోపాటు మొత్తం ఏడుగురు షట్లర్ల ఒలింపిక్ బెర్త్ లు మంగళవారం ఖరారయ్యాయి. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, మను ఆత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ర్యాంకుల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ గా భావించిన ఏసియన్ బ్యాడ్మింటర్ చాపియన్ షిప్ పోటీలు ముగిసిన తర్వాత ర్యాంకులను బట్టి షట్లర్లను ఎంపిక చేశారు. ర్యాంకులు మే 5న అధికారికంగా ప్రకటిస్తారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో జ్వాలా, అశ్వినిలు భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తారు. సింగిల్స్ విభాగంలో ఈసారి ఇద్దరు క్రీడాకారిణులు(సైనా, సింధు) బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్ లోనూ ఈసారి ఇద్దరిని పంపే అవకాశం లభించింది. అయితే పారుపల్లి కాశ్యప్ అనూహ్యరీతిలో గాయపడటం, శస్త్రచికిత్స చేయుంచుకోవడంతో ఇండియా ఆ అవకాశాన్ని కోల్పోక తప్పలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) నిబంధనల మేరకు 16వ ర్యాంకులోపు ర్యాకుల్లో ఉన్న క్రీడాకారుల్లో ఇద్దరిని ఒలింపిక్స్ కు పంపొచ్చు. శ్రీకాంత్, కాశ్యప్ లు ఇద్దరూ ప్రస్తుతం 16 కంటే తక్కువ ర్యాంకులోనే కొనసాగుతున్నారు. ఆగస్ట్ 5 నుంచి 21 రియో డి జెనిరో ఒలింపిక్స్ జరుగుతాయి. టాటూ వెనుక కథ.. గుత్తా జ్వాల ఎన్నటికీ మర్చిపోలేని పోటీలు.. 2012 లండన్ ఒలింపిక్స్. ఆ వేదికపై బ్యాడ్మింటర్ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించింది జ్వాల. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ బెర్త్ పొందిన మొదటి షట్లర్ ఆమె. అందుకే 2012 ఒలింపిక్ గుర్తును వీపుపై పచ్చబొట్టు పొడిపించుకుంది. -
సింధుకు చుక్కెదురు
ప్రణయ్, జ్వాల జంట కూడా చైనా మాస్టర్స్ టోర్నీ జియాంగ్సు (చైనా): అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయిన భారత స్టార్ పీవీ సింధు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు 17-21, 19-21తో ప్రపంచ 18వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లోనూ ఇద్దరూ పోటాపోటీగా తలపడినా... కీలకదశలో పోర్న్‌టిప్ పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకుంది. పోర్న్‌టిప్ చేతిలో సింధుకిది నాలుగో పరాజయం. ఈ ఏడాది వరుసగా రెండో ఓటమి. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 10-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్పప్ప ద్వయం 11-21, 14-21తో టాప్ సీడ్ లూ యింగ్-లూ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
జ్వాల జంటకు షాక్
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం జ్వాల-అశ్విని 24-26, 17-21తో ప్రపంచ 35వ ర్యాంక్ జోడీ సమంతా బార్నింగ్-ఐరిస్ తాబెలింగ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లోనూ సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంటకు పరాజయం తప్పలేదు. సుమీత్-మనూ అత్రి జోడీ 21-16, 13-21, 15-21తో కియెన్ కీట్ కూ-బూన్ హెంగ్ తాన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్‌లకు నిరాశే మిగిలింది. తొలి రౌండ్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 20-22, 15-21తో జుయ్ సాంగ్ (చైనా) చేతిలో... అజయ్ జయరామ్ 18-21, 21-19, 19-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశారు. -
బర్త్ డే గాళ్ జ్వాల హంగామా
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల 33వ ఏట అడుగుపెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 7) జ్వాల పుట్టినరోజు. జ్వాల బర్త్ డే పార్టీలో సహచర క్రీడాకారులతో కలసి హంగామా చేశారు. జ్వాల బర్త్ డే పార్టీకి బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, జ్వాల డబుల్స్ పార్టనర్ అశ్వినీ పొన్నప్ప, కోన తరుణ్ హాజరయ్యారు. జ్వాల కేక్ కట్ చేసి సహచర క్రీడాకారులతో కలసి పార్టీ చేసుకున్నారు. జ్వాల ముఖానికి కేక్ పట్టించి వాళ్లంతా హంగామా చేశారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను జ్వాల ట్విట్టర్లో పోస్ట్ చేశారు. My sweeetieeeesssss -
క్వార్టర్స్ ఫైనల్స్‌లో జ్వాల-అశ్విని ఓటమి
జకర్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ క్వార్టర్స్ ఫైనల్స్‌లో గుత్తా జ్వాల జోడీ నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్ డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ... జపనీస్ క్రీడాకారిణిల చేతిలో 23-25, 14-21 తేడాతో ఓడారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. -
క్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని
జకర్తా: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత మహిళా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా, డబ్సుల్స్ లోనూ గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణులను 21-15 18-21, 21-19 తేడాతో జ్వాల-అశ్విని ఓడించారు. -
‘టాప్’లో చేర్చడంపై జ్వాల సంతోషం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశమున్న ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ‘టాప్’ స్కీమ్‌లో ఎట్టకేలకు బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు చోటు లభించనుంది. తదుపరి విడుదల చేసే అథ్లెట్ల జాబితాలో ఈ జోడి పేరును క్రీడా శాఖ చేర్చనుంది. దీంతో జ్వాల తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ కోసం తమ సన్నాహకాలు మరింత బాగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. ‘చివరికి టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో మా పేర్లను చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు మరింత ప్రేరణగా నిలవడమే కాకుండా రియో కోసం బాగా సన్నద్ధమయ్యేందుకు తోడ్పడుతుంది. అయితే టాప్‌లో చోటు కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరం. మేం ఆ స్కీమ్‌పైనే ఆధారపడక పోయినా అందులో ఉండే హక్కు ఉందని గట్టిగా భావించాం’ అని 31 ఏళ్ల జ్వాల తెలిపింది. -
'ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి'
హైదరాబాద్: ప్రభుత్వం ఇప్పటికైనా తమకు మద్దతుగా నిలిచి సాయపడాలని కెనడా బ్యాడ్మింటన్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేత, తెలుగుతేజం గుత్తా జ్వాల అన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలంటే తమను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. కెనడా ఓపెన్‌లో అశ్వినీ పొన్నప్పతో కలసి బరిలో దిగిన జ్వాల విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సింగిల్స్ క్రీడాకారులకు ఏవిధంగా సాయం చేస్తోందో, తమనూ అదేవిధంగా ప్రోత్సహించాలని జ్వాల అన్నారు. ఇప్పటికైనా డబుల్స్ క్రీడాకారులను గుర్తించడం సంతోషంగా ఉందని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ డబుల్స్‌లో తమ జోడీ ప్రధాన పోటీదారని, తమకు సాయం చేయాలని జ్వాల కోరారు. కెనడా ఓపెన్‌లో తమ విజయం తర్వాతైనా క్రీడల శాఖ, అభిమానులు గుర్తించి తమకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. -
ఫైనల్లో సుమీత్ జోడీ.. జ్వాల అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమీత్ రెడ్డి జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లగా, సాయి ప్రణీత్, గుత్తా జ్వాల పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో సుమీత్, మను అట్రి 21-17 21-17 స్కోరుతో జపాన్ జోడీ టకేషి కముర, కీగో సొనోడాపై విజయం సాధించారు. కాగా పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సాయి ప్రణీత్ 9-21 17-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప 17-21 11-21 కురిహర, నర షినోయ (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
సెమీస్‌లో గుత్తా జ్వాల జోడీ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు తేజాలు సాయి ప్రణీత్, డబుల్స్‌లో గుత్తా జ్వాల జోడీ, సుమీత్ రెడ్డి జోడీలు సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 21-8 21-14 స్కోరుతో క లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప 21-17 21-14 తో జర్మనీ జంట జొహన్నా గోలిస్జెస్కీ, కార్లా నెల్టెపై గెలుపొందారు. ఇక పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి, మను అట్రి 22-20 21-13తో ఇంగ్లండ్ ద్వయం మార్కస్ ఎలిస్, క్రిస్ లాంగ్రైడ్ను ఓడించారు. -
మ్యూజిక్ ఎక్స్పీరియన్స్
నగరవాసులకు సరికొత్త మ్యూజిక్ ఎక్స్పీరియన్స్. గ్రామీ అవార్డు విన్నర్ అఫ్రోజాక్, బాలీవుడ్‌కు చెందిన ఫర్హా అక్తర్ సంగీత సాగరాన్ని పరవళ్లు తొక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22నగచ్చిబౌలిలో జరిగే ‘సన్‌బర్న్ ఎరెనా’లో అఫ్రోజాక్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే వైండ్సాంగ్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఫర్హన్ అక్తర్ షో ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్లో ఆదివారం ఈ కార్యక్రమాల కర్టెన్‌రైజర్ జరిగింది. హీరో రానా, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ఈవెంట్ లోగోలు ఆవిష్కరించారు. సాక్షి, సిటీప్లస్ -
అప్పుడు మాత్రం చాలా భయమేసింది!
-
భారత్ బ్యాడ్మింటన్‌లో వెనుకబడింది అందుకే!
-
మూడు పతకాలు గెలుస్తాం
సింగిల్స్‌లో ఎదురులేదు డబుల్స్‌లోనే పోటీ క్లిష్టం ‘కామన్వెల్త్’ బ్యాడ్మింటన్‌పై జ్వాల వ్యాఖ్య కోల్‌కతా: ‘కామన్వెల్త్ గేమ్స్’ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ కనీసం మూడు పతకాలు గెలుస్తుందని డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ధీమా వ్యక్తం చేసింది. సింగిల్స్‌లో సైనా, సింధులకు ఎదురేలేదని... డబుల్స్‌లోనే పోటీ తీవ్రంగా ఉంటుందని డబుల్స్ డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆమె వ్యాఖ్యానించింది. ఉబెర్ కప్‌లో రాణించిన అనుభవంతో గ్లాస్గోలోనూ ముందంజ వేస్తామని చెప్పింది. ఈసారి మిక్స్డ్ విభాగంలో ఆడటం లేదని తెలిపింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్ కోసం భారత బ్యాడ్మింటన్ బృందం 19న అక్కడికి వెళ్లనుంది. 24 నుంచి పోటీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. సత్తాచాటుతాం గత ‘కామన్వెల్త్’లో నాలుగు పతకాలు గెలిచిన మేం... ఈసారి మూడు పతకాలు సాధిస్తాం. సింగిల్స్‌లో భారత క్రీడాకారిణిలకు ఎదురులేదు. సైనా, సింధులే ఫైనల్‌కు చేరుతారు. ఆటతీరు చూసినా ర్యాంకింగ్స్ పరంగా చూసినా వీరిద్దరిని ఓడించే సత్తా ఎవరికీ లేదు. కానీ డబుల్స్‌లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. మలేసియా, ఇంగ్లిష్, సింగపూర్ క్రీడాకారులతో క్లిష్టమైన పోరు ఉంటుంది. అశ్విని బెస్ట్ ప్లేయర్ మహిళల డబుల్స్‌లో అశ్విని మేటి క్రీడాకారిణి. ప్రపంచ బెస్ట్ ప్లేయర్లలో ఆమె ఒకరు. స్మాష్‌లలో దిట్ట. తనదైన శైలిలో రాణిస్తుంది. ఆమెతో కలిసి ఆడటం అదృష్టం. మేమిద్దం మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోరాడతాం. ఢిల్లీ అయినా, గ్లాస్గో అయినా పోటీలో మార్పేమీ ఉండదు. విదేశాల్లో గతంలోనూ గెలిచిన రికార్డు మాకుంది. సచిన్ తెలీదంటే వివాదమా రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తనకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలీదన్నంత మాత్రాన వివాదాస్పదం చేయడం తగదు. క్రికెట్ 12 దేశాలే ఆడతాయి. అదే టెన్నిస్ అయితే 200, బ్యాడ్మింటన్‌ను 150 దేశాలు ఆడతాయి. ఒక ఆట దిగ్గజం గురించి మరొకరి తెలియకపోతే ఏంటి? ఈ మాత్రానికే రాద్దాంతం చేయడం తగదు. -
త్వరలో ‘జ్వాల’ అకాడమీ!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల త్వరలో అకాడమీ ప్రారంభించనుంది. అకాడమీ నిర్వహణకు సంబంధించి ఆమె ఇచ్చిన ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్తగా భూమి కేటాయింపు తరహాలో కాకుండా, అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆమెకు సూచించినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కేటీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆమెకు సహకరించినట్లు తెలుస్తోంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియాన్ని లీజు ప్రాతిపదికన ప్రభుత్వం జ్వాలకు ఇస్తుంది. అక్కడే ఆమె చిన్నారులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నా...జ్వాల పేరుతోని అకాడమీ నిర్వహణ సాగుతుంది. ‘నాకు పేరు తెచ్చిన ఆటలో కొత్త తరాన్ని తీర్చిదిద్దాలనేది నా ఆలోచన. త్వరలోనే నా అకాడమీ ప్రారంభం కావచ్చు. అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడకపోయినా ప్రభుత్వ పెద్దలతో టచ్‌లోనే ఉన్నాను. వారి నుంచి నాకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ లభించినట్లే. నేను ఇంకా ఆటలోనే కొనసాగుతున్నాను కాబట్టి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వను. కానీ కోచ్‌ల సహకారంతో అకాడమీ నిర్వహిస్తాను’ అని జ్వాల ‘సాక్షి’తో చెప్పింది. -
హైదరాబాద్.. షాన్‌దార్ సిటీ
లవ్ ఆల్.. గుత్తా జ్వాల ఎంతో ఇష్టంగా తన చేతిపై వేసుకున్న టాటూ! అందరినీ ప్రేమించాలని చెప్పే ఆమెను వ్యతిరేకించేవాళ్లు కూడా చాలా మంది. అయితేనేం నేను.. నా ఇష్టం అని బిందాస్‌గా బతికేయడం జ్వాల నైజం. నడక నేర్చినప్పటి నుంచి స్టార్ క్రీడాకారిణిగా ఎదిగినప్పటి వరకు ఆమె ప్రతి మలుపునకూ హైదరాబాద్ సాక్షి. అందుకే నగరంతో జ్వాలకు ఓ ప్రత్యేక అనుబంధం. ప్రపంచంలో ఏ మూల తిరిగినా భాగ్యనగరిలో ఉండే ఆనందం ఎక్కడా దొరకదని అంటున్న జ్వాల మహానగరం గురించి ఏం చెప్పిందంటే... సిటీని చుట్టేసేదాన్ని... నాన్న మొదటి నుంచి ఆటలను ప్రోత్సహించారు. అందుకోసమే కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో చేర్పించారు. అయితే వేర్వేరు కారణాలతో బొల్లారం, పికెట్, గోల్కొండ కేవీలలోనూ చదివాను. అప్పట్లో నాన్నతో కలసి హైదరాబాద్ మొత్తం చుట్టేసేదాన్ని. ఇంటి నుంచి స్కూల్ దూరంగా ఉండటం వల్ల స్కూటర్‌పైనే ప్రయాణించేదాన్ని. బేగంపేట నుంచి గోల్కొండ, ఆర్టిలరీ సెంటర్ నుంచి ఆదర్శ్‌నగర్, ఆ తర్వాత బంజారాహిల్స్.. ఇలా నగరంలో చాలా ఇళ్లు మారాం. ‘భాగ్య’నగరమే.. స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడంలో హైదరాబాద్ పాత్ర ఎంతైనా ఉంది. ఇక్కడే రాకెట్ పట్టి టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్నా. హైదరాబాద్ ఎంతగా విస్తరించినా.. మన నగరానికి ఆత్మలాంటి సంస్కృతి మాత్రం మారలేదు. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకతలు మన సిటీకే ఉన్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మొదలుకొని సందర్శకులకు ఇచ్చే ఆతిథ్యం వరకు చక్కటి కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల ఉబెర్ కప్ సందర్భంగా ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డా. ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా అని ఆలోచించేదాన్ని. టోర్నీల కోసం పర్యటనలే తప్ప నిజానికి నాకు ప్రయాణాలంటే పరమ చిరాకు. మన సిటీలో ఉన్నప్పుడే ఎంతో హాయిగా అనిపిస్తుంది. హార్ట్ కప్ కాఫీ హైదరాబాద్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఫిట్నెస్ జాగ్రత్తలో భాగంగా ఎంత ఇష్టం ఉన్నా బిర్యానీని మాత్రం తక్కువగా తింటా. నగరంలో ఓవర్ ద మూన్, ఎన్ గ్రిల్ వంటి చోట్లకు బాగా వెళ్లేదాన్ని. ప్రస్తుతం నా ఫేవరేట్ స్పాట్ మాదాపూర్‌లోని ‘హార్ట్ కప్ కాఫీ’ సిటీ సిక్.. మహా నగరంలో ఇబ్బందులు కొన్ని తప్పవు. అయితే నా వైపు నుంచి ఒక్కటే ఫిర్యాదు.. ట్రాఫిక్ గురించే. గతంతో పోలిస్తే ఇదొక్కటే ఇబ్బంది పెట్టే మార్పు. వర్షాకాలంలో రోడ్లు సమస్యగా అనిపిస్తాయి. కానీ, ఇతర నగరాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగు. విదేశాల్లో మెరిసిపోయే సిటీస్ ఉన్నా ఎందుకో ఏ మాత్రం నచ్చవు. టోర్నీ కోసం విదేశాలకు వెళితే నేను ఎయిర్పోర్ట్, స్టేడియం.. హోటల్‌కే పరిమితం. గాజులంటే మోజు.. హైదరాబాద్‌లో నేను తిరగని ప్రదేశం లేదు. చిన్నప్పుడే పాతబస్తీ అంతా చుట్టేశా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల కోసం ఇక్కడే షాపింగ్ చేస్తా. నాకు గాజులంటే చాలా చాలా ఇష్టం. నా దగ్గర ప్రపంచంలోని అన్ని రంగుల, లెక్కపెట్టలేనన్ని రకాల గాజుల సెట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున చీరల కలెక్షన్కూడా ఉంది. ఫ్రెండ్స్‌తో కలసి ప్రేమికుడు సినిమా.. నాకైతే హైదరాబాద్‌లో సినిమాలే పెద్ద వినోదం. రామకృష్ణ, మహేశ్వరి-పరమేశ్వరి, ఆనంద్, సుదర్శన్, శాంతి.. ఇలా అన్ని థియేటర్లలోనూ సినిమాలు చూశాను. అమీర్‌పేట సత్యంలో ఫ్రెండ్సతో కలసి ప్రేమికుడు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం మరపురాని జ్ఞాపకం. అన్నట్లు సికింద్రాబాద్ కేవీ స్కూల్‌కు దగ్గర్లోనే లాంబా థియేటర్ ఉన్నా ఆ ఛాయలకు పోలేదు లెండి (నవ్వుతూ). హైదరాబాద్ బ్రాండ్ తగ్గదు కొత్త రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఉండాలనేదే నా కోరిక. బ్రాండ్ హైదరాబాద్ విలువ ఎప్పటికీ తగ్గదు. సిటీ చరిష్మాను ఎవరూ తగ్గించలేరు. టు బి ఫ్రాంక్.. ది బెస్ట్ సిటీలో నేనుంటున్నానని ఆనందంగా, గర్వంగా చెప్పగలను. -
ఈ మహిళలు సూపర్...
-
పోరాడి ఓడిన పీవీ సింధు
ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్‌లో భారత పోరు ముగిసింది. సింగిల్స్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ గుత్తా జ్వాల - అశ్వినీ పొన్నప్ప కూడా చైనా క్రీడాకారిణులతో జరిగిన సెమీస్‌లో ఓడిపోయారు. దీంతో 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ ఉన్న ఈ టోర్నమెంటులో్ కాంస్యపతకాలతోనే వారు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటా 18 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన మారథాన్ మ్యాచ్‌లో వరల్డ్ నెం.2 క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో పీవీ సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్‌ను సింధు 21-15 స్కోరుతో గెలుచుకుని ఆశలు రేకెత్తించింది. అయితే, రెండో గేమ్‌ను షిసియాన్ 22-20తో గెలుచుకుంది. మూడో గేమ్‌లో షిసియాన్ పూర్తి ఆధిక్యం కనబరిచింది. 21-12 తేడాతో సింధును ఓడించింది. వీళ్లిద్దరు ఇప్పటికి ఐదుసార్లు ముఖాముఖి తలపడగా సింధు మూడుసార్లు, షిసియాన్ రెండు సార్లు గెలిచారు. ఇక డబుల్స్ మ్యాచ్ మాత్రం కేవలం 33 నిమిషాల్లోనే ముగిసిపోయింది. లూ యింగ్, లూ యు జోడీ చేతిలో జ్వాల - అశ్విని జోడీ 21-12, 21-7 తేడాతో ఓడిపోయారు. -
జ్వాల 'బ్రెయిన్'.. అశ్విని 'మెషిన్'
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్పప్పపై ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ టూ షట్లర్లు క్రిస్టినా పెడెర్సన్, కెమిల్లా రైటర్ ప్రశంసల వర్షం కురింపించారు. ఆటలో జ్వాల 'బ్రెయిన్' అయితే అశ్విని 'మెషిన్' అని అభివర్ణించారు. 'ఆటను అర్థం చేసుకోవడంలో జ్వాల మేటి. అశ్వినితో కలసి ఆమె కొన్ని ఉత్తమ ఫలితాలు సాధించింది. జ్వాల ఆటతీరును వెంటనే అర్థం చేసుకుంటుంది. అశ్విని ఓ యంత్రంలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అందువల్లే డబుల్స్‌లో వీరు ఉత్తమ జోడీ కాగలిగారు' కెమిల్లా చెప్పింది. హైదరాబాద్‌లో 2009లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కెమిల్లా థామస్ లేబోర్న్తో కలసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో కెమిల్లా, క్రిస్టినా నెంబర్ వన్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. జ్వాల, అశ్విని జోడీ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని, అయితే ఆటలో ఎత్తుపల్లాలు సాధారణమేనని కెమిల్లా చెప్పింది. -
పొట్టి స్కర్ట్లే ఇష్టం: గుత్తా జ్వాలా
-
గుత్తా జ్వాలకు మద్దతిస్తాం: మంత్రి జితేంద్ర
న్యూఢిల్లీ: జీవితకాల ప్రతిపాదన ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు అవసరమైన మద్దతు అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసును పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ ఉదంతం గురించి పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రాసిన లేఖకు ఆయన పై స్పందించారు. జ్వాల అంశాన్నిపూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టాలని తన శాఖను ఆదేశించినట్లు జితేంద్ర తెలిపారు. ఆమెకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కాగా, ఆమెకు బాయ్ తో తలెత్తిన వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లిందని, కోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. -
నచ్చినట్లు ఆడతా... నమ్మింది మాట్లాడతా! : గుత్తా జ్వాల.
విశ్లేషణం చేతిలో రాకెట్ పట్టిన ఆరడుగుల అందాలరాశి... నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధీరోదాత్త... తన ఆట బాగున్నంతకాలం ఎవరి మెప్పుకోసం ప్రయత్నించాల్సిన అవసరంలేదని నమ్మే క్రీడాకారిణి... సినిమాలంటే అమితాసక్తి ఉన్న తెలుగమ్మాయి... గుత్తా జ్వాల. సాధారణంగా క్రీడాకారులు, క్రీడాకారిణులు కైనస్థటిక్ పర్సనాలిటీకి చెందినవారై ఉంటారు. అంటే వారికి తమ శరీరంపైన కంట్రోల్ ఉంటుంది. ప్రతి దానినీ ఫీల్ అవుతారు. ఎమోషనల్‌గా ఉంటారు. తాము విశ్వసించినదానికోసం ఎంతకైనా నిలబడతారు. జ్వాలలో ఈ లక్షణాలు స్పష్టంగా కనబడతాయి. సూటిగా, స్పష్టంగా మాట్లాడటం జ్వాలలో కనిపించే ప్రత్యేక లక్షణం. ఆమె బ్యాట్నుంచి షటిల్ ఎంత వేగంగా వస్తుందో... అంతకంటే వేగంగా నోటినుంచి మాట వచ్చేస్తుంది. ఎవరిమీదనైనా, దేనిమీదనైనా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేయడం తప్పుకాదని నమ్ముతుంది. అందుకే తన అభిప్రాయాన్ని తడుముకోకుండా చెప్పేస్తుంది. ఇతరులను విమర్శిస్తూ మాట్లాడే సమయంలో కూడా తన భావాలను స్పష్టంగా వ్యక్తంచేయాలనే ప్రయత్నమే తప్ప కోపం, ఆవేశం, ద్వేషంలాంటి భావోద్వేగాలు అస్సలు కనిపించవు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గురించి మాట్లాడే సమయంలో కూడా అతని ఆటను గౌరవిస్తూనే, అతని ఆశ్రీత పక్షపాతాన్ని మాత్రమే తప్పుపట్టడం ఆమెలో ఉండే స్పష్టతకు నిదర్శనం. తాజాగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో లోపాలను ఎత్తి చూపుతూ మాట్లాడటం, వారి ఆధిపత్యంపై న్యాయస్థానానికి వెళ్లిమరీ పోరాడటం ఆమెలో ఉండే ధృఢచిత్తానికి అద్దం పడుతుంది. జ్వాల ఇంటర్వ్యూలను గమనిస్తే... ఆమెలో కదలికలు చాలా తక్కువగా కనిపిస్తాయి. స్థిరంగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటుంది. బాడీలాంగ్వేజ్ ప్రకారం అలా కూర్చోవడమంటే రిజర్వ్డ్గా ఉంటారని అర్థం. కానీ జ్వాల విషయంలో మాత్రం ఈ సూత్రం అబద్ధమవుతుంది. తానెవరితో మాట్లాడుతున్నా, ఏ విషయం మీద మాట్లాడుతున్నా కంఫర్ట్‌గా ఉంటుందనే విషయాన్ని ఈ పొజిషన్ చెబుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు జ్వాల తరచూ నవ్వడం మనకు కనిపిస్తుంది. జీవితాన్ని, అందులో ఎదురయ్యే ప్రశ్నలను, సంఘటనలను తానెంత స్పోర్టివ్‌గా తీసుకుంటుందో ఆ నవ్వు మనకు చెబుతుంది. అంతేకాదు తాను ఎవరితోనైనా సూటిగా కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంది. పక్కకి చూడటం చాలా తక్కువ. జ్వాల కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. ఆరడుగుల అందగత్తె కూడా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నితిన్‌తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది కూడా. సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు... సినిమాలపై తనకు ప్రత్యేకమైన ఆసక్తి లేదని, మంచి అవకాశం వస్తే పరిశీలిస్తానని జ్వాల అనేక ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ ఆ మాటలు అబద్ధమని ఆమె బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. అలా చెప్పే సమయంలో తాను కంటిని రుద్దుకోవడమో లేదా నోటికి అడ్డుగా చేయి పెట్టుకోవడమో కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె చెప్పేది అబద్ధమని, తనకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలిసిపోతుంది. జ్వాల బలం తాను నమ్మిన విలువల్లో ఉంది. ఆమెలో బలమైన, దృఢమైన విలువలు కనిపిస్తాయి. ‘‘ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్’’, ‘‘నేను నా పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు మాత్రమే సమాధానం చెప్పాలి, వేరెవ్వరికీ చెప్పాల్సిన అవసరంలేదు’’, ‘‘నేనేంటో నా ఆట చెప్తుంది, ఎవరినో ప్లీజ్ చేయాల్సిన అవసరంలేదు’’, ‘‘ఓటమంటే భయంలేదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్’’ అనే జ్వాల మాటలు తన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. జ్వాలలో సెన్సెటివ్నెస్ ఎక్కువ. అందుకేనేమో అందరికీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా ఫీలవుతుంటుంది. తన గురించి, తన ఆట గురించి మాత్రమే కాకుండా అందరి సమస్యల గురించి మాట్లాడుతుంది. కోరి సమస్యలను కొనితెచ్చుకుంటుంది. ఆ బలహీనతను అధిగమించి, మాటలకన్నా ఆటపై మాత్రమే శ్రద్ధ చూపిస్తే జ్వాల మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తుందని చెప్పవచ్చు. విష్ హర్ ఆల్ ది బెస్ట్! -విశేష్, సైకాలజిస్ట్ -
విమర్శిస్తే జీవితకాల నిషేధమా?:జ్వాల
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తన మాటల్ని, సూచనల్ని తప్పుగా అర్థం చేసుకుంటోందని డబుల్స్ స్టార్ గుత్తాజ్వాల వాపోయింది. కేవలం విమర్శించినంత మాత్రానా జీవితకాల నిషేధం విధిస్తారా అని ఆమె ప్రశ్నించింది. ‘ముక్కుసూటిగా మాట్లాడటం నా నైజం. నా మాటల్లో తప్పేముంది. ఇంతదానికే నిషేధమంటే హాస్యాస్పదంగా లేదు! నేనేమీ కల్పించుకొని చెప్పలేదు... కల్పితాలు చెప్పలేదు’ అని పేర్కొంది. ‘బాయ్’ తనను ఎందుకు శత్రువుగా చూస్తుందో అర్థం కావడం లేదని ఆమె చెప్పింది. ‘బ్యాడ్మింటనే నా లోకం. ఇందులో ఉన్నతస్థాయికి ఎదగాలనేదే నా ఆశయం. దీని కోసం నేను రోజుకు 8 గంటలు కష్టపడతా. నాకు తెలిసిందల్లా బ్యాడ్మింటన్ ఆడటమే. రాజకీయాలు చేయడం రాదు. నేను ఎవరికైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నానని వారనుకుంటే ఇంతకుమించిన మూర్ఖత్వం మరోటి లేదు’ అని ఆమె చెప్పింది. సద్విమర్శల్ని అర్థం చేసుకునేవారు క్రీడా సమాఖ్యలో లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని జ్వాల పేర్కొంది. -
జ్వాలను ఆడించాల్సిందే.. తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న డబుల్ స్టార్ గుత్తా జ్వాలకు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. జ్వాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక వెలువరించేదాకా ఆమెను రాబోయే టోర్నీల్లో ఆడేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. జ్వాల పిటిషన్‌ను స్వీకరించి జస్టిస్ వీకే జైన్ ఈమేరకు తీర్పునిచ్చారు. ఐబీఎల్‌లో ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను ప్రత్యర్థి జట్టుతో ఆడనీయకుండా అడ్డుకుందని జ్వాలపై ఆరోపణలున్నాయి. గతంలోనే బాయ్ ఈ అంశంపై ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసి క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ జ్వాలపై జీవిత కాల నిషేధాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి... ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించింది. ఈ సమయంలో నెల రోజులపాటు ఆమె ఎలాంటి టోర్నీలు ఆడకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంపై జ్వాల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మరోవైపు అంతిమంగా విచారణ కమిటీలో తేలే విషయాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి చెప్పారు. ఈనెల 15 నుంచి 20 వరకు డెన్మార్క్ ఓపెన్, 22 నుంచి 27 వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వాల, అశ్వని పొన్నప్పతో కలిసి డబుల్స్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే బుధవారం డెన్మార్క్ ఓపెన్ నుంచి ఈ జోడి పేరును బాయ్ ఉపసంహరించింది. కోర్టు తీర్పును గౌరవిస్తాం: బాయ్ గుత్తా జ్వాల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని, పూర్తి సమాచారం వచ్చాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తెలిపింది. ‘కోర్టు నిర్ణయంపై మాకు గౌరవం ఉంది. మేమిప్పటికే డెన్మార్క్ టోర్నీలో జ్వాల ఎంట్రీపై పునరాలోచించాలని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్)ను కోరాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వారే. మేం జ్వాలపై కోర్టు తీర్పుననుసరించి ముందుకెళతాం’ అని బాయ్ ప్రధాన కార్యదర్శి విజయ్ సిన్హా అన్నారు. -
జ్వాలపై ప్రేక్షకుల అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఆదివారం బంగా బీట్స్‌తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అక్కడి అభిమానులు జ్వాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ హైదరాబాదీ క్రీడాకారిణి తీవ్ర మనస్తాపం చెందింది. మ్యాచ్ ముగిశాక ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఐబీఎల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది. ఎవరికి వారు సభ్యత నేర్చుకోవాలని సూచించింది. ఈ వ్యవస్థలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ‘ప్రేక్షకులు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. మేమంతా క్రీడాకారులం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితి క్రికెటర్లకు వస్తే మైదానంలో వారు ఎలా ప్రవర్తిస్తారో మనం చూశాం. కానీ నేను కోర్టులో ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. మ్యాచ్ తర్వాతే నా ఆవేదన తెలిపాను. ఈరోజుల్లో ఎవరికి వారు చాలా బిజీగా మారిపోతున్నాం. అందుకే మనం పిల్లలకు కనీస విలువలు, మానవత్వం గురించి చెప్పడం మర్చిపోతున్నాం. మహిళల పట్ల భారత సమాజం ఎంత సున్నితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో భారత్ ఎలా దూసుకెళుతుందో మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇలాంటి పనులు మీలో సంకుచిత మనస్తత్వాన్ని తెలుపుతాయి. డాక్టర్‌గానో ఇంజినీర్ గానో కావడం ముఖ్యం కాదు. ఎవరి పిల్లలకు వారు మంచి సంస్కృతిని నేర్పితే చాలు’ అని జ్వాల పేర్కొంది.