Gutta Jwala Takes Her Husband Vishnu Vishal Semi Nude Photos, Goes Viral - Sakshi
Sakshi News home page

Vishnu Vishal Viral Photos: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్‌

Published Sat, Jul 23 2022 9:32 PM | Last Updated on Sun, Jul 24 2022 12:18 PM

Vishnu Vishal Semi Nude Photos By His Wife Gutta Jwala - Sakshi

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్‌ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. విజయ్‌ దేవరకొండ 'లైగర్‌' మూవీ ప్రమోషన్స్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ను వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతూ కొనసాగిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్‌ దుమ్మెత్తిపోశారు. ఇటీవల బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ ఓ మ్యాగజైన్‌ కోసం నగ్నంగా ఫొజులిచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. 

ఇక ఈ ఫొటోషూట్‌ను నెటిజన్లు చీల్చి చెండాడారు. తాజాగా మరో హీరో ఇలాంటి న్యూడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేశాడు. దానికి 'ఈ ట్రెండ్‌లో నేను కూడా జాయిన్‌ అయ్యా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విభిన్నమైన సినిమాలతో అలరించే తమిళ హీరో విష్ణు విశాల్‌. రానా నటించిన 'అరణ్య'లో ఓ పాత్రతోపాటు ఇటీవల 'ఎఫ్‌ఐఆర్‌' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విష్ణు హీరోగానే కాకుండా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాల భర్తగా సుపరిచితమే. 

చదవండి: సమంత యాటిట్యూడ్‌కు స్టార్‌ హీరో ఫిదా.. సినిమాలో అవకాశం!
దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్‌..

నడుము కింద వరకు కనిపించేలా, కేవలం దుప్పటి మాత్రమే ‍అడ్డుపెట్టుకుని సెమీ న్యూడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు విష్ణు విశాల్‌. 'నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారడంతో నేను కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింటి వైరల్‌ అవుతోంది. ఇకపోతే ఈ సెమీ న్యూడ్ ఫొటోలను ట్రెండ్‌గా తీసుకోని ఇంకెంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి. 
 


చదవండి:  మిస్‌ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే..
ధనుష్‌ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్‌' రివ్యూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement